Showing posts with label Jonnavittula. Show all posts
Showing posts with label Jonnavittula. Show all posts

విజయ్ (1989)

 


చిత్రం: విజయ్ (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు , చిత్ర


వాన రాతిరి ఆరు బయట నను
కవ్వించి రమ్మంది కౌగిల్లు ఇమ్మంది కల కాదు గా
వాన రాతిరి పైట లాగి నను
ఇబ్బంది పెట్టొద్దు ఇంకేమొ చెయ్యొద్దు చలి గా

మోజె తీరాలి నీతో జోడి కుదరాలీ
దాహం తీర్చలి ఈ వేల నీ కౌగిలీ
ఐతె రానా వద్దన్ననా
అమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో

తొలకరి చినుకుకు మెరుపులు మెరిసెను నీ మేనులో
సొగసరి మునకలు పిలవక పిలిచెను ఈ వేలలో
తడిపిన సొగసుకు తపనలు రగిలెను నీ చూపుతో
తడి తడి పెదవులు తడబడి అడిగెను ఏమేమిటో
మెత్తనొ కోరిక రెపరెపలాడెను నాలో
వెచ్చని వయసే అల్లరి చేసె నాలో
జల్లుల్లోనా జతగా రార
అమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో

వాన రాతిరి ఆరు బయట నను
కవ్వించి రమ్మంది కౌగిల్లు ఇమ్మంది కల కాదు గా
వాన రాతిరి పైట లాగి నను
ఇబ్బంది పెట్టొద్దు ఇంకేమొ చెయ్యొద్దు చలి గా

మోజె తీరాలి నీతో జోడి కుదరాలీ
సాహం తీర్చలి ఈ వేల నీ కౌగిలీ
ఐతె రానా వద్దన్ననా
అమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో

తొలి తొలి కోరిక తొనదర చేసెను ఈ జల్లులో
చలి చలి వేలకు తహతహరేగెను నా గుండెలో
విరిసిన మొగ్గకి మెరిసిన బుగ్గకి నా ముద్దుకీ
అలసటి రేగెను అలసట తీరెను ఈ పూటకీ
చిరు చిరు ముద్దులు హద్దులు దాటిన వేలా
చిత్తడి జల్లులు తెచ్చెను మల్లెల గోలా
తియ్యని బాద వస్తే పోదా
అమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో

వాన రాతిరి ఆరు బయట నను
కవ్వించి రమ్మంది కౌగిల్లు ఇమ్మంది కల కాదు గా
వాన రాతిరి పైట లాగి నను
ఇబ్బంది పెట్టొద్దు ఇంకేమొ చెయ్యొద్దు చలి గా

మోజె తీరాలి నీతో జోడి కుదరాలీ
దాహం తీర్చలి ఈ వేల నీ కౌగిలీ
ఐతె రానా వద్దన్ననా
అమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో

భారతంలో అర్జునుడు (1987)



 నీ మగసిరి మషాల హా హా నాకే కావాలా
పరువం గరువం నీ వల్ల దివాల అవ్వాల ఇవాళ హ హ
నీ సొగసుల ఉయ్యాల హ హ నేనే ఊగాలా
నీ బింకం పొంకం నావల్ల దివ్వాల అవ్వాల ఇవ్వాళ

నీ మగసిరి మషాల హా హా నాకే కావాలా

నీ సుతారమంత సుఖాల శృతిలో సితార వాయించనా
ఈ వయ్యారి సొగసులు కాజేసి ముద్దులు
విరాలమే ఇవ్వనా
నీ బిగింపు తెగింపు నా ఒంపు సొంపుకి ముగింపు కావాలిరా
నా గులాబి రేకుల జిలేబి కైపుల  గులాము లవ్వాలిరా
నువ్వడిగితే తీసివ్వనా నీ ఒంటికె సెంటవ్వనా

నీ మగసిరి మషాల హా హా నాకే కావాలా
నీ సొగసుల ఉయ్యాల హ హ నేనే ఊగాలా

నీ మిఠాయి మాటల గిటారు పాటలు మిటారితో పాడుకో
నా పరాచికాలకు సరైన గురైన జవాబులే చెప్పుకో
నీ హుషారు ఊపుల మిషారి లోపల రసాలు అందించవే
నీ సూదంటు నడుముని నా కంటి చూపుల
దారాలలో దాచవే
నువ్వడిగితే నేనివ్వనా చెయ్ తగిలితే పువ్వవ్వనా

నీ సొగసుల ఉయ్యాల హ హ నేనే ఊగాలా
నీ బింకం పొంకం నావల్ల దివాల అవ్వాల ఇవ్వాళ
నీ మగసిరి మషాల హా హా నాకే కావాలా
పరువం గరువం నీ వల్ల దివాల అవ్వాల ఇవాళ హ హ


చిత్రం: భారతంలో అర్జునుడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం:  జొన్నవిత్తుల
గానం: యస్.పి.బాలు , జానకి

కొబ్బరి బొండాం (1991)



చిత్రం: కొబ్బరి బొండాం (1991)
సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర

అందాల మేఘమాల
పరుగులు తీసే పరువంతో పోటీ పడతావా
వెచ్చని ఊహల ఊయలలూగి
నీలాల నింగి అంచులు చూసొద్దాం
కొండలు దాటి కోనలు దాటి
ఏవేవో భావాలే మదిలో మోహన రాగాలై
కోయిల పాడే గీతాలై ఎద మరిపిస్తేనే
సాగే కాలంతో చివురించే ఆశల్లో
ఉందేదో ఆహా ఓ హాయి

అందాల మేఘమాల
పరుగులు తీసే పరువంతో పోటీ పడతావా
వెచ్చని ఊహల ఊయలలూగి
నీలాల నింగి అంచులు చూసొద్దాం
కొండలు దాటి కోనలు దాటి
విన్నాలే ఓ పిలుపు వయసులు పిలిచే తొలిపిలుపు
మనసున పొంగే తొలివలపు రారమ్మంటేనే
తీశావో తలుపు నీదే ఈ గెలుపు
రావేల ఆహా ఆహాహా

అందాల మేఘమాల
పరుగులు తీసే పరువంతో పోటీ పడతావా
వెచ్చని ఊహల ఊయలలూగి
నీలాల నింగి అంచులు చూసొద్దాం
కొండలు దాటి కోనలు దాటి
ఏవేవో పులకింత తపనలు రేగే తరుణంలో
తనువుని తడిమే నీళ్ళల్లో ఓ గిలిగింత
సంధ్యాసమయంలో ఈ జలకాలాటల్లో
ఉందేదో ఆహా ఓ హాయి
అందాల మేఘమాల


******   *******   *******


చిత్రం: కొబ్బరి బోండాం (1991)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో
సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...
ఊ అనమంది ఉల్లాసం
చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో
సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...
ఊ అనమంది ఉల్లాసం
ఉసిగోల్పింది సల్లాపం...

చరణం: 1
ఆహ ఆహ ఈ హాయి...నూరేళ్ళు నీదోయి
ఎద ఎద కలిసే ఏకాంతంలో...కౌగిలి రాగంలో
అందాల అమ్మాయ్యి..అందియ్యి నీ చేయి
పెదవులు కలిసి జతగా వేసే...ముద్దుల తాళంలో
కొబ్బరి బోండాం ...లబ్జు లకోరీ..
మోహవేశంలో ...ప్రేమానందంలో
ఏదేదో ...ఏమేమో...చక్కిలి గింతల
చలి చలి గిలి గిలి..లల.ల.లా...

చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో
సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...
ఊ అనమంది ఉల్లాసం
ఉసిగోల్పింది సల్లాపం...

చరణం: 2
ఓహొ హో వయ్యారి...ముద్దొచ్చే సింగారి
సృష్టి రహస్యం భేదించాలి...శోభన రాత్రుల్లో
మౌనాలా తీరానా...గారాలా మారాలా
మన్మధబాణం సంధించాలి...యవ్వన వీధుల్లో
మధువుల మధనం...మదనుడి శరణం
సాగే శృంగారం...ఊగే సింగారం
ఉయ్యాల... జంపాల...గంధపుతూతల
సుందరి సొగసుకు...తపన వరసల
తకధిమి... ధిమితక

చల్ల చల్లని గాలుల్లో...సాయం సమయంలో
సరసాలాడే మల్లెల జల్లుల్లో...ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే
ఒల్లంతా తడిసి ముద్దైపోతుంటే...
ఊ అనమంది ఉల్లాసం
ఉసిగోల్పింది సల్లాపం...

దేవుళ్ళు (2000)

చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: సుజాత, స్వర్ణలత


పల్లవి:

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ
పారాయణతో సకల జనులకి.. భారాలను తొలగించే గాధ
పారాయణతో సకల జనులకి.. భారాలను తొలగించే గాధ

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ

చరణం 1:

షిరిడీ గ్రామంలో.. ఒక బాలుని రూపంలో..
వేపచెట్టు క్రింద.. వేదాంతిగ కనిపించాడు
తన వెలుగును ప్రసరించాడు

పగలు రేయి ధ్యానం.. పరమాత్మునిలో లీనం
పగలు రేయి ధ్యానం.. పరమాత్మునిలో లీనం
ఆనందమే ఆహారం.. చేదు చెట్టునీడయే.. గురుపీఠం

ఎండకు వానకు కృంగకు.. ఈ చెట్టు క్రిందనే ఉండకు
సాయీ..ఈ.. సాయి రా.. మశీదుకు..
అని మహల్సాపతి పిలుపుకు
మసీదుకు మారెను సాయి
అదే అయినది ద్వారకమాయి
అక్కడ అందరు భాయీ భాయీ
బాబా బోధల నిలయమదోయి

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ

చరణం 2:

ఖురాను.. బైబిలు.. గీత.. ఒకటని
కులమత భేదము.. వద్దనే
గాలి వాననొక క్షణమున ఆపే
ఉడికే అన్నము చేతితో కలిపే

రాతి గుండెలను గుడులను చేసే
నీటి దీపములను వెలిగించే
పచ్చికుండలో నీటిని తెచ్చి.. పూలమొక్కలకు పోసి
దిండీ వనమును పెంచి.. మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే
కప్పకు పాముకు స్నేహం కలిపే.. తల్లి భాషకు అర్ధం తెలిపే

ఆర్తుల రోగాలను హరియించే
భక్తుల బాధలు తాను భరించే
ప్రేమ సహనం రెండు వైపుల ఉన్న నాణమును దక్షిణ అడిగే
మరణం జీవికి మార్పును తెలిపే
మరణించి తను మరలా బ్రతికే
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

చరణం 3:

నీదని నాదని అనుకోవద్దని
ధునిలో ఊది విభూదిగనిచ్చే
భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు...
చావడి ఉత్సవమై సాగగా

కక్కడ హారతులందుకొని.. కలిపాపాలను కడుగగా
సకల దేవతా స్వరూపుడై.. వేదశాస్త్రములకతీతుడై
సద్గురువై.. జగద్గురువై
సత్యం చాటే దత్తాత్రేయుడై.. భక్తుని ప్రాణం రక్షించుటకై
జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలోన పగులగా
పరిపూర్ణుడై.. గురుపూర్ణిమై
భక్తుల మనసులో చిరంజీవియై.. శరీర సేవాలంగన చేసి
దేహము విడిచెను.. సాయి
సమాధి అయ్యెను.. సాయి

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
అఖిలాండకోటి బ్రహ్మండ నాయక....
శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ మహరాజ్‌
చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: చిత్ర, స్వర్ణలత

పల్లవి:

మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం

గోరు ముద్దలెరుగని బాల కృష్ణులం
బాధ పైకి చెప్పలేని బాల ఏసులం
ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా..
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా

మీ ప్రేమ కోరే చిన్నారులం..
మీ ఒడిని ఆడే చందమామలం..

చరణం 1:

కమ్మగా.. మా అమ్మ చేతితో..
ఏ పూట తింటామో ఏడాదిలో..
చక్కగా.. మా నాన్న పక్కగా..
సరదాగ తిరిగేది ఏ నాటికో

పొద్దున్నే పరుగున వెళతారూ...
రాతిరికి ఎపుడో వస్తారూ
మరి మరి అడిగినా.. కథలు చెప్పరూ
మేమేం చెప్పినా.. మనసు పెట్టరూ
అమ్మ నాన్న తీరు మాకు అర్ధమవ్వదూ
ఏం చెయ్యాలో మాకు దిక్కు తోచదూ..
ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా..
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా

మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం

చరణం 2:

పిల్లలం.. మీ చేతి ప్రమిదలం
మీ ప్రేమ చమురుతో.. వెలుగు దివ్వెలం
పువ్వులం.. మీ ఇంటి నవ్వులం
మీ గుండెపై ఆడు.. చిన్ని గువ్వలం

కని పెంచే మీరే దేవుళ్లూ
కనిపించే శివుడూ పార్వతులూ
లోకం బూచికి మా గుండే వణికితే
మాకు ధైర్యం ఇచ్చేది మీ లాలింపే
అమ్మ.. నాన్నలిద్దరూ వేరు వేరయీ
అనాధలను చెయ్యకండి పసి పిల్లలని
ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా

మీ ప్రేమ కోరే చిన్నారులం..
మీ ఒడిని ఆడే చందమామలం
చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: జానకి

పల్లవి:

మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి

మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

చరణం 1:

ఓంకార రావాల అలల కృష్ణాతీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృతయుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను
పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను

విజయుడైన అర్జునుని పేరిట.. విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియు జేజేలు పలుకగ.. కనకదుర్గకైనది స్ధిరనివాసము
మేలిమి బంగరు ముద్దపసుపు.. కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం.. కురిపించే దుర్గరూపం
ముక్కోటి దేవతలందరికి.. ఇదియే పుట్టిదీపం

మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా
పరాశక్తి లలితా.. శివానంద చరిత

చరణం 2:

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి

భవబందాలను బాపే.. బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే.. అన్నపూర్ణాదేవి
లోకశాంతినే సంరక్షించే సుమంత్రమూర్తి.. గాయత్రీ
అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణీ.. మహాలక్ష్మి
విద్యా కవన గాన మొసగు వేదమయి.. సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే.. మహాదుర్గ
శత్రు వినాసిని సత్యస్వరూపిని.. మహిషాసురమర్ధిని
విజయకారిణి అభయ రూపిణి.. శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా.. నీ దర్శనం
దుర్గమ్మా.. నీ దర్శనం

మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా
పరాశక్తి లలితా.. శివానంద చరిత
మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా
పరాశక్తి లలితా.. శివానంద చరిత
చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: బాలు

పల్లవి:

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురమేదేవ సర్వ కార్యేషు సర్వదా
ఆ...ఆ...ఆ....ఆ...ఆ.....ఆ....ఆ...

జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
ఆ...ఆ...ఆ...ఆ....ఆ...ఆ...ఆ..

చరణం 1:

భాహుగానది తీరములోన బావిలోన వెలసిన దేవ...
మహిలో జనులకు మహిమలు చాటి... ఇహ పరములనిడు మహానుభావా...
ఇష్టమైనదీ వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి...
కరుణను కురియుచు వరములనోసగుచు నిరతము పెరిగే మహాకృతి...

సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రమాణం... ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం... విఘ్న నాశనం... కాణిపాకమున నీ దర్శనం

జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక

చరణం 2:
పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైనావు
మాత పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగ మారావు

భక్తుల మొరలాలించి బ్రోచుటకు ...గజముఖ గణపతి వైనావు
బ్రహ్మండమునే బొజ్జలో దాచి... లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తి కూర్పూగా... లక్ష్మి గణపతి వైనావు

వేద పురాణము లఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం...

జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
ఆ.ఆ......ఆ....ఆ....ఆ...
చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: బాలు

పల్లవి:

అయ్యప్ప దేవాయ నమః.. అభయ స్వరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః.. అభయ స్వరూపాయ నమః
హరిహర పుత్రాయ నమః.. కరుణా సముద్రాయ నమః
నిజ భీర గంభీర శభరీ గిరీశిఖర ఘన యోగ ముద్రాయనమః
పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండరూపాయనమః
అయ్యప్ప దేవాయ నమః... అభయ స్వరూపాయ నమః

చరణం 1:

పద్దేనిమిది పదిమట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి
ఇరుముడులు స్పృశియించి శుభమనుచు దీవించి జనకృందములచేరే జనమేలు స్వామి
తన భక్తులొనరించు తప్పులకు తడబడి ఒకపక్క ఒరిగెనా ఓంకార మూర్తి
స్వామియే... శరణం అయ్యప్ప

స్వాములందరు తనకు సాయంబు కాగా ధీమంతుడైలేచి ఆ కన్నేస్వామి
పట్టబంధము వీడి భక్తతటికై పరుగు పరుగునవచ్చె భువిపైకి నరుడై
అయ్యప్ప దేవాయ నమః... అభయ స్వరూపాయ నమః

చరణం 2:

ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణుఘోషలు విని బ్రోచు శబరీష
పాపాలు దోషాలు ప్రక్షాలనము చేయు పంపానదీ తీర ఎరుమేలి వాసా
నియమాల మాలతో సుగుణాల మట్లపై నడిపించి కనిపించు అయ్యప్పస్వామి
మకర సంక్రాంతి సజ్యోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠస్వామి
కర్మ బంధము బాపు ధర్మశాస్త్ర.. కలి భీతి తొలిగించు భూతాధినేత
అయ్యప్ప దేవాయ నమః... అభయ స్వరూపాయ నమః

చరణం 3:

ఆద్యంత రహితమౌ.. నీ విశ్వరూపము
అజ్ఞాన తిమిరమ్ము అణుచు.. శుభదీపం
ఈ నాల్గు దిక్కులు.. పదునాల్గు భువనాలు
పదిమెట్లుగా మారె... ఇదో అపురూపం
అరరులెల్లరు చెయు... అమృతాభిషేకం
నెరవేర్చుకో స్వామి... నీదు సంకల్పం
పదములకు మ్రొక్కగా ఒక్కొక్క లోకం
అందుకో నక్షత్ర పుస్పాభిషేకం...
చిత్రం: దేవుళ్ళు (2000) 
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 
గీతరచయిత: జొన్నవొత్తుల 
నేపధ్య గానం: బాలు 



పల్లవి: 

రామా... ఆ.. ఆ.. 
అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య 
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య 
అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య 
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య 
చెయుతనిచ్చె వాడయ్య.. మా సీతా రామయ్య 
చెయుతనిచ్చె వాడయ్య.. మా సీతా రామయ్య 
కొర్కెలు తీర్చే వాడయ్య.. కొదండ రామయ్య 



అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య 
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య 
రామా... ఆ... రామా... ఆ... ఆ... 

చరణం 1: 

తెల్లవారితే చక్రవర్తై రాజ్యమునేలె రామయ్య 
తండ్రిమాటకై పదవిని వదలి అడవులుకేగెనయా 
మహిలో జనులను కావగవచ్చిన మహవిష్ణు అవతరమయ 
ఆలిని రక్కసుడు అపహరించితె ఆక్రోశించెనయ 
అసురను ద్రుంచి అమ్మను తెచ్చి అగ్నిపరిక్ష విధించెనయ 
చాకలి నిందకు సత్యము చాటగ కులసతినేవిడనాడనయ 
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా 
ఆ... ఆ... 

నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా 
సత్యం ధర్మం త్యాగంలో అతనుకి సరిలేరయ్య 
కరుణ హృదయుడు.. శరణనువాడికి అభయమొసుగునయ్యా 

అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య 
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య 



చరణం 2: 

భద్రాచలము పుణ్యక్షేత్రము.. అంతా రామ మయం 
భక్తుడు భద్రుని కొండగ మార్చి.. కొలువై వున్న స్థలం 
పరమ భక్తితో రామదసు ఈ అలయమును కట్టించెనయ 
సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ 
పంచవటిని ఆ జనకిరాముల పర్ణశాల అదిగో 
సీతారాములు జలకములాడిన శేషతీర్ధమదిగో 
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్య 
ఆ... ఆ... ఆ... 
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్య 
శ్రీరామ పాదము నిత్యం కడిగే గోదారయ్య 
ఈ క్షేత్రం తీర్దం దర్శించిన... 
జన్మధన్యమయ్య... 

అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య 
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య 
చెయుతనిచ్చె వాడయ్య.. మా సీతా రామయ్య 
కొర్కెలు తీర్చే వాడయ్య.. కొదండ రామయ్య 


అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య 
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య

DJ (దువ్వాడ జగన్నాథమ్) (2017)




చిత్రం: DJ (దువ్వాడ జగన్నాథమ్) (2017)
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: విజయ్ ప్రకాష్



రక్షాపధాన శిక్షాధికార - ధీక్షా నిరీక్శుడెవరూ
ఉగ్రప్రతాప వ్యఘ్రప్రకోప - ఖడ్గప్రహారి ఎవడూ

శూలాయుధాత కాలాంతకాంత - జ్వాలా త్రినేత్రుడెవడూ
విధ్వంసకార పృధ్వీతలాన - అభయకరుడు అతడెవడూ

డీజే ...డీజే డీజే డీజే
డీజే ...డీజే డీజే డీజే
డీజే ... శరణం భజే భజే
డీజే ... శరణం భజే భజే

ఓ...ఒ ఒ ఒ
ఓ ఒ ఒ ఒ ఒ

చరణం: 1
లక్ష పిడుగులొక ముష్టి ఘాతమై - లక్ష్యభేదనం చేయ్.రా
భద్రమూర్తివై విద్రోహులపై - రుద్రతాండవం చెయ్.రా
ఉగ్రతురంతం ధగ్దం చేసే - అగ్ని క్షిపణివై రారా
ఎచటెచటెచటే కీచకుడున్నా - అచటచటచటే పొడిచెయ్.రా

డీజే ...డీజే డీజే డీజే
డీజే ...డీజే డీజే డీజే
డీజే ... శరణం భజే భజే
డీజే ... శరణం భజే భజే

జై జై శక్తిలిడు సిద్దిగణపతీ జై హో
సై సై నట్టువాంగముల నాట్యగణపతీ సాహో

విఘ్ణరాజ నీ విభ్రమనర్తల వీధి వీధిలో ధిల్లానా
కుమ్మరించవా భక్తులపైన వరాల జల్లుల వా..నా

చరణం: 2
నిత్యం నృసిమ్హతత్వం వహించి - ప్రత్యర్ధి పైకి రారా
సత్యం గ్రహించి ధర్మం ధరించి - న్యాయం జయించనీరా
చెడిన పుడమిపై యువక యముడివై - చెడుగుడాటుటకు రారా
లోకకంఠకుల గుండెలు అదిరే - మ్రుత్యుఘంట నువేరా

డీజే ...డీజే డీజే డీజే
డీజే ...డీజే డీజే డీజే
డీజే ... శరణం భజే భజే
డీజే ... శరణం భజే భజే

ఓ...ఒ ఒ ఒ
ఓ ఒ ఒ ఒ ఒ

డీజే ...డీజే




*********   *********   *********


చిత్రం: DJ (దువ్వాడ జగన్నాథమ్) (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: MLR. కార్తికేయన్, చిత్ర


అస్మైక యోగ కస్మైక భోగ
రస్మైక రాగ హిందోలం
అంగాంగ తేజ స్రుంగార భావ
సుకుమార సుందరం....

ఆ చంద్ర తార సంధ్యా సమీర
నీ హార హార భూపాలం...
ఆనంద తీర బ్రుందా విహార
మందార సాగరం....

మడిలొ వడిలొ బడిలొ గుడిలొ
నీ తలపే శశి వదనా
గదిలొ మదిలొ ఎదలొ సొదలొ
నీవె కదా గజగమనా

ఆశగా నీకు పూజలే చేయ
ఆలకించింది ఆ నమకం
ప్రవరలొ ప్రణయ మంత్రమే చూసి
పులకరించింది ఆ చమకం
అగ్రహారాల తమలపాకల్లె
తాకుతోంది తమకం...

మడిలొ వడిలొ బడిలొ గుడిలొ
నీ తలపే శశి వదనా
గదిలొ మదిలొ ఎదలొ సొదలొ
నీవె కదా గజగమనా

అస్మైక యోగ కస్మైక భోగ
రస్మైక రాగ హిందోలం
అంగాంగ తేజ స్రుంగార భావ
సుకుమార సుందరం....

ఆ చంద్ర తార సంధ్యా సమీర
నీ హార హార భూపాలం...
ఆనంద తీర బ్రుందా విహార
మందార సాగరం....

నవలలనా నీ వలన
కలిగె వింత చలి నా లోనా...
మిస మిసల నిశి లోనా
కసి ముద్దులిచుకోనా...

ప్రియ జతనా సుభ లఘనా...
తల్లకిందులవ్తు తొలి జగడానా
ఎడతెగని ముడిపడని
రస కౌగిలింతలోనా

కనులనే యేవి కలలుగా చేసి
కలిసిపోదాము కలకాలం
వానలా వచ్చి వరదా మారి
వలపు నీలి మేగం

మడిలొ వడిలొ బడిలొ గుడిలొ
నీ తలపే శశి వదనా
గదిలొ మదిలొ ఎదలొ సొదలొ
నీవె కదా గజగమనా

ఆ ఆ ఆ....

ప్రియ రమన శత మదనా
కన్నె కాలు జారె ఇక నీతోనా
ఇరు ఎదల సరిగమనా
సిగ పూలు నలిగి పోనా...

హిమలయనా సుమసయనా
చిన్న వేలు పట్టి శుభతరునా
మనసతొన కొరికితినా
పరదాలు తొలగనీనా...

పడక గదినుంచి విదుదలే లేని
విదివి వేచింది మన కోసం
వయసు తొక్కిల్ల పడుచు ఎక్కిల్ల
తెచె మాగ మాసం

మడిలొ వడిలొ బడిలొ గుడిలొ
నీ తలపే శశి వదనా
గదిలొ మదిలొ ఎదలొ సొదలొ
నీవె కదా గజగమనా

అస్మైక యోగ కస్మైక భోగ
రస్మైక రాగ హిందోలం
అంగాంగ తేజ స్రుంగార భావ
సుకుమార సుందరం....

ఆ చంద్ర తార సంధ్యా సమీర
నీ హార హార భూపాలం...
ఆనంద తీర బ్రుందా విహార
మందార సాగరం....




*********   *********   *********


చిత్రం: DJ (దువ్వాడ జగన్నాథమ్) (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరబట్ల
గానం: సాగర్, గీతామాధురి


హై పచ్చ బొట్టు లాగ గుచ్చి గుండెలోన
రచ్చొ రచ్చ నువ్వు చేస్తుంటె
బాక్స్ బద్దలై పోయె
గుండె బాక్స్ బద్దలై పోయె

హై నచ్చి నచ్చగానె పచ్చి ఒంటి మీద
కర్చీఫ్ వేసుకుని పోతుంటె
బాక్స్ బద్దలై పోయె
మైండ్ బాక్స్ బద్దలై పోయె

హై రాయె రాయె నా మల్లెపూల బుట్ట
నే ఆందం తోనె అంటించుకుంట చుట్ట
హై రారొ రారొ రొమ్యాన్స్ లోని ధిట్ట
కన్నె కొట్టిందె నా రంగుల దుపట్టా

బాక్స్ బద్దలై పోయె
లిప్పు కున్న లాక్స్ బదలై పోయె
బాక్స్ బద్దలై పోయె
నీకు నాకు తాక్స్ బదలై పోయె పోయె

అర్రె నింగి లోని చుక్కలన్ని తెంపి
నీ చేతిలోకి వెన్నెలంత వొంపి
నీ మీద నాకు ఇస్టమెంతొ
డప్పు కొట్టి చెప్పుకుంట
అడ్డమొస్తె నన్ను నేనె చంపి

నా మనసునేమొ కాగితం ల చింపి
నే మనసు లోకి కైటు లాగ పంపి
నీ లోపలొచ్చి ఉండిపోత కిర్రు కిర్రు తిరుగుతుంట
కొత్త కొత్త ఊహలెన్నొ నింపి

ఒల్లమ్మొ నువ్వె న బజ్జి బుజ్జి పప్పి
నన్నేదొ చెసావె ఆ పాల కల్లు తిప్పి

ఒర్రయ్యొ అయ్యూ మా ఇంటిలోన చెప్పి
జల్ది జల్ది మోగించు ఇంక పిప్పి

బాక్స్ బద్దలై పోయె
పిచ్చి లోన పీక్స్ బద్దలై పోయె
బాక్స్ బద్దలై పోయె..
సిగ్గు రైలు త్ర్యాక్స్ బద్దలై పోయె పోయె

ఏడు వింతలన్ని ఒక్క చోట పెట్టి
ఏడు రంగులున్న కొత్త ద్రెస్సు కుట్టి
ఐత్ వండర్ అల్లె బ్రమ్హ
దేవుడు ఇంతలాగ చెక్కినాక
థాంక్సు చెప్పకుంటె ఎట్ట చిట్టి

న జిందగీ ని ఉండ లాగ చుట్టి
నన్ను కట్టినావు ప్రేమ దారమెట్టి
నువ్వు అస్తమానం గుర్తుకొచ్చి
నిద్దరంత పాడైంది
పిచ్చి పిచ్చి పాడు కలలు పుట్టి

హై రాయె రాయె నీ రైట్ లెగ్ పెట్టి
నీకె ఎయ్యిస్త బంగారు కాలు పట్టి

అ వస్త అ వస్త నె గుండె తలుపు తట్టి
ముద్దె ఇస్త అరె పూట పూటకొక్కటి

బాక్స్ బద్దలై పోయె
వేడి పుట్టి రాక్స్ బద్దలై పోయె
బాక్స్ బద్దలై పోయె
పట్టుకున్న బ్లాక్స్ బద్దలై పోయె పోయె




*********   *********   *********


చిత్రం: DJ (దువ్వాడ జగన్నాథమ్) (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: నకాష్ అజీజ్


టక్కా టక్కా గుండె తట్టి
చకా చకా చెయ్యి పట్టి
ముఖాముఖి ముద్దు పెట్టి
మెచ్చుకొ మెచ్చుకొ పిల్లొ

సర్రా సర్ర కన్నుకొట్టీ
గిరా గిరా నన్ను చుట్టి
ఎర్రా ఎరా ముద్దుపెట్టి
మెచ్చుకొ మెచ్చుకొ పిల్లొ

హె వయ్యారమెమో వండరనీ
కిస్సారమేమో థండరనీ
నిస్సారమైతే బ్లండరనీ
మెచ్చుకొ మెచ్చుకొ పిల్లొ

హే కిర్రెక్కిపోయే మ్యాటరనీ
ఎర్రెక్కిపోయే మీటరనీ

కుర్రాడ్నిండా గాలాడకుండా లెక్కలేనన్ని కిక్కులేననీ

మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో
నువ్వు బుగ్గల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగ మెచ్చుకొ పిల్లో

మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో
నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకొ పిల్లో

చరణం 1:

కత్తి తీసి కసా కసా కోసి కారమెడ్తుంటే
కటౌట్ అదిరిపోయెనని మెచ్చుకోవే

నే నిప్పుమీద ఉప్పులాగ చిటాపటామంటుంటె
తుప్పురేగిపోయెనంటు మెచ్చుకోవే

హేయ్ గరం మసాలా లాగా నరం లాగేసావే
జరం తెప్పించేలా లాగా గుర్రం ఎక్కించావే

చిల్లుగారెల ఉండేవాన్ని చిరంజీవి స్టెప్పులేయించావే

మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో
నువ్వు బుగ్గల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగ మెచ్చుకొ పిల్లో

మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో
నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకొ పిల్లో

చరణం 2:

నీ కుర్రముద్దు బుగ్గమీద స్టిక్కరల్లె పడుతుంటె
చిట్టిగుండె కుక్కరల్లే ఈలేసిందే

నువు అగ్గిలాగ భగ్గుమంటు సిగ్గుమంట పెడుతుంటె
మగ్గుతున్న ఈడు చిన్న పెగ్గేసిందే

సరాసరి నువ్విట్టా దూకుతుంటె ఎట్టా
సలాసలా మరిగే నా ఉడుకురక్తమిట్టా

ఆగేదెట్టా
అంటుకున్న కుంపటారెదెట్టా

మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో
నువ్వు బుగ్గల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగ మెచ్చుకొ పిల్లో

మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో
నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకొ పిల్లో




*********   *********   *********


చిత్రం: DJ (దువ్వాడ జగన్నాథమ్) (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: బాలాజీ
గానం: జాస్ప్రీత్  జాస్జ్, రీటా

మెరిసే మెరుప
సొగసే అరుప

దె దె దె దె దె దె దె దె దె...
కత్తులున్న నీ కన్నుల్ దె దె
దె దె దె దె దె దె దె దె దె...
మత్తుగున్న నీ ముద్దుల్ దె దె
దె దె దె దె దె దె దె దె దె...
గ్యపే ఇవ్వొదె

సీటి మార్ సీటి మార్ సీటి మార్
సీటి మార్ సీటి మార్

ఎన్ టీ ఆర్, ఏ ఎన్ ఆర్, మెగాస్టార్
నిన్నె చూస్తె విసిలేస్తార్

సీటి మార్ సీటి మార్ సీటి మార్
సీటి మార్ సీటి మార్

ఎన్ టీ ఆర్, ఏ ఎన్ ఆర్, మెగాస్టార్
నిన్నె చూస్తె విసిలేస్తార్

హై మైఖెల్ జాక్సన్ మైక్ ల నా మైండ్ ఎ అరిపించావె
టైసన్ వీసిరె పంచు ల నా మనసే పేల్చవ్వె

స్పైడర్ అల్లె నెట్టు ల నా వయసు ని గుద్దేసావులె
హుండ్రెడ్ వోల్టెడ్ డాను ల నువ్వు నన్ను దోచేసావులె

దె దె దె దె దె దె దె దె దె...
డింపుల్ ఉన్న ని చెంపల్ దె దె
దె దె దె దె దె దె దె దె దె...
సొంపుల్లున్న ఆ ఒంపుల్ దె దె
దె దె దె దె దె దె దె దె దె...
మోస్తు తిరగొద్దె

సీటి మార్ సీటి మార్ సీటి మార్
సీటి మార్ సీటి మార్
ఎన్ టీ ఆర్, ఏ ఎన్ ఆర్, మెగాస్టార్
నిన్నె చూస్తె విసిలేస్తార్

ట్విట్టెర్ లోని ట్వీట్ ల నా టెంపర్ టచ్ చెసావులె
టీసర్ లోని ట్విస్ట్ ల ఎగ్సైట్మెంట్ పెంచావె
మాస్టర్ బ్లాస్టర్ బ్యాటు ల దిల్ సిక్సర్ కొట్టాసావు లె
మెత్రిక్స్ లొ హై స్పీడు ల మ్యాగిక్ యె చెసావె

దె దె దె దె దె దె దె దె దె...
కలల గ్యాలెరి కల్లకు దె దె
దె దె దె దె దె దె దె దె దె...
చలర్ఫుల్లు గ సెల్ఫీ దె దె
దె దె దె దె దె దె దె దె దె...
ఏ టూ జెడ్ దె దె

సీటి మార్ సీటి మార్ సీటి మార్
సీటి మార్ సీటి మార్
ఎన్ టీ ఆర్, ఏ ఎన్ ఆర్, మెగాస్టార్
నిన్నె చూస్తె విసిలేస్తార్

సీటి మార్ సీటి మార్ సీటి మార్
సీటి మార్ సీటి మార్
ఎన్ టీ ఆర్, ఏ ఎన్ ఆర్, మెగాస్టార్
నిన్నె చూస్తె విసిలేస్తార్...