Showing posts with label బావమరదళ్ళు (1960). Show all posts
Showing posts with label బావమరదళ్ళు (1960). Show all posts

బావమరదళ్ళు (1960)

హృదయమా ఓ బేల హృదయమా

చిత్రం :  బావమరదళ్ళు (1960)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:

హృదయమా... ఓ బేల హృదయమా..
ఒకేసారిగ నీకింత సంతోషమా... హృదయమా.. ఆ.. ఆ..

చరణం 1:

తీయని ఊహాలు హాయిగ నీలో మరల చిగిర్చె సుమా ...
మరల చిగిర్చె సుమా ..
పూచిన పూవులు నోచిన నోములు కాచి ఫలించు సుమా..
అవి కాచి ఫలించు సుమా

హృదయమా... ఓ బేల హృదయమా...
మనసు తెలుపుగా నీకింత మొమోటమా
హృదయమా...

చరణం 2:

తీగెలు సడలిన సితార తాను తిరిగి మ్రోగె సుమా...
తిరిగి మ్రోగె సుమా ..
మ్రోగిన పాటే మోహానమై అనురాగము నించె సుమా...
అనురాగము నించె సుమా ...

హృదయమా... ఓ బేల హృదయమా..
ఒకేసారిగ నీకింత సంతోషమా..
హృదయమా...

చరణం 3:

అందారాని ఆ చందమామ నీ చెతికి అందె సుమా..
చెతికి అందె సుమా..
చందమామ నీ చేతులలోనే బంధీ  అగును సుమా...
ఇక బంధీ  అగును సుమా...

హృదయమా... ఓ బేల హృదయమా...
మనసు తెలుపుగా నీకింత మొమోటమా
హృదయమా... ఆ.. ఆ

***** ******* ******* ***********


ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చిత్రం :  బావమరదళ్ళు (1960)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు

ఎక్కడున్నాగాని దిక్కువారేకదా
చిక్కులను విడదీసి దరిజేర్చలేరా
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు...

చరణం 1:

ఆలి ఎడబాటెపుడు అనుభవించెడువాడు
అలమేలుమంగపతి అవనిలో ఒకడే....
ఏడుకొండలవాడు ఎల్లవేల్లలయందు
దోగాడు బాలునికి తోడునీడౌతాడు

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు...

నెల్లూరి సీమలో చల్లంగ శయనించు
శ్రీరంగనాయకా ఆనందదాయకా
తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు
దయచేయుమా నీవు క్షణము ఎడబాయకా

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు....

చరణం 2:

ఎల్లలోకాలకు తల్లివై నీవుండ
పిల్లవానికి ఇంక తల్లి ప్రేమా కొరత
బరువాయె బ్రతుకు చెరువాయె కన్నీరు
కరుణించి కాపాడు మా కనకదుర్గా

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు...

గోపన్నవలె వగచు ఆపన్నులను గాచి
బాధలను తీర్చేటి భద్రాద్రివాసా
ఆ....
బాధలను తీర్చేటి భద్రాద్రివాసా
నిన్ను నమ్మిన కోర్కె నెరవేరునయ్యా
చిన్నారి బాలునకు శ్రీ రామ రక్ష

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు...

చరణం 3:

బాల ప్రహ్లాదుని లాలించి బ్రోచిన
నారసింహుని కన్నా వేరు దైవము లేడు
అంతు తెలియగారాని ఆవేదనలు గలిగి
చింతలను తొలగించు సింహాచలేశ

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు....


***** ******* ******* ***********


పయనించే మన వలపుల
చిత్రం :  బావమరదళ్ళు (1960)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:

పయనించే మన వలపుల బంగరు నావ
శయనించవె హాయిగా జీవనతార...నా జీవనతార..ఆ..ఆ
పయనించే...

చరణం 1:

ఊ...ఊ...ఊ..ఊ..ఊ..
నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో....
నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో
చెలరేగే అలల మీద ఊయలలూగి...

పయనించే మన వలపుల బంగరు నావ
శయనించవె హాయిగా జీవనతార...నా జీవనతార..ఆ..ఆ
పయనించే...

చరణం 2:

వికసించె విరజాజులు వెదజల్లగ పరిమళాలు...
వికసించె విరజాజులు వెదజల్లగ పరిమళాలు
రవళించె వేణుగీతి...రవళించె వేణుగీతి... రమ్మని పిలువ....

పయనించే మన వలపుల బంగరు నావ
శయనించవె హాయిగా జీవనతార...నా జీవనతార..ఆ..ఆ
పయనించే...ఉహు ఉహు..ఊ..ఉహు..ఉహు..ఊ...


***** ******* ******* ***********


నీలిమేఘాలలో (male)
చిత్రం :  బావమరదళ్ళు (1960)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:

నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...

చరణం 1:

ఏ పూర్వపుణ్యమో.. నీ పొందుగా మారీ
ఏ పూర్వపుణ్యమో.. నీ పొందుగా మారీ
అపురూపమై నిలిచే.. నా అంతరంగానా

నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...

చరణం 2:

నీ చెలిమిలోనున్న.. నెత్తావి మాధురులు
నీ చెలిమిలోనున్న.. నెత్తావి మాధురులు
నా హృదయ భారమునే మరపింప చేయు

నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...

చరణం 3:

అందుకో జాలనీ... ఆనందమే నీవు
అందుకో జాలనీ... ఆనందమే నీవు
ఎందుకో చేరువై.. దూరమౌతావు

నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...


***** ******* ******* ***********

నీలిమేఘాలలో గాలి కెరటాలలో
చిత్రం :  బావమరదళ్ళు (1960)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  జానకి


పల్లవి:

నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...

చరణం 1:

ఏ పూర్వపుణ్యమో.. నీ పొందుగా మారీ
ఏ పూర్వపుణ్యమో.. నీ పొందుగా మారీ
అపురూపమై నిలిచే.. నా అంతరంగానా

నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...

చరణం 2:

నీ చెలిమిలోనున్న.. నెత్తావి మాధురులు
నీ చెలిమిలోనున్న.. నెత్తావి మాధురులు
నా హృదయ భారమునే మరపింప చేయు

నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...

చరణం 3:

అందుకో జాలనీ... ఆనందమే నీవు
అందుకో జాలనీ... ఆనందమే నీవు
ఎందుకో చేరువై.. దూరమౌతావు

నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...