భలె భలె భలె భలె
ఏం పిల్లడో...ఏం పిల్లో...
ఏం పిల్లడో ఎల్దుమొస్తవా ఏం పిల్లో ఎల్దుమొస్తవా
ఏం పిల్లడో ఎల్దుమొస్తవా ఏం పిల్లో ఎల్దుమొస్తవా
సికాకులంలో సీమకొండకి <ఏం పిల్లడో...>
అరె చిలకలు... అరె చిలకలు... ఏయ్ చిలకలు కత్తులు దులపరిస్తయట <ఏం పిల్లడో....>
అరె సాలూరవతల సవర్లకొండకి <ఏం పిల్లడో....>
చెవల పిల్లులు భల్ చెవల పిల్లులు... శంఖమూదెనట <ఏం పిల్లడో....>
అరెరెరెరె నల్లగొండ... అరె నల్లగొండ... భలె నల్లగొండ... భల్ నల్లగొండ... నల్లగొండ నట్టడివిలోనికి <ఏం పిల్లడో....>
పాముని... అరె పాముని... భలె పాముని పొడిచిన చీమలున్నవట <ఏం పిల్లడో....>
తెలంగాణ... భలె తెలంగాణ... భలె తెలంగాణ...భలె......
తెలంగాణ...భలె తెలంగాణ... తెలంగాణ...
అరె తెలంగాణ కొమరయ్య కొండకి <ఏం పిల్లడో....>
అరె గెద్దని...అరె గెద్దని...అరె గెద్దని తన్నిన గేద్దూలున్నవట <ఏం పిల్లడో....>
ఆకులు మేసిన మేకలకొండకు <ఏం పిల్లడో....>
రాయలసీమ...రాయలసీమ...రాయలసీమ రాలుగొండకి <ఏం పిల్లడో....>
రక్తం...అరె రక్తం...అరె రక్తం రాజ్యం ఏలుతున్నదట <ఏం పిల్లడో....>
తూరుపు దిక్కున తూరకొండకి <ఏం పిల్లడో....>
అరె తుపాకి...భలె తుపాకి... అరె తుపాకి...
తుపాకి పేల్చిన తూనీగలున్నవట <ఏం పిల్లడో....>
అరె తుపాకి...భలె తుపాకి... అరె తుపాకి... తుపాకి పేల్చిన తూనీగలున్నవట <ఏం పిల్లడో....>
కలకత్తా కొస కారుకొండకి <ఏం పిల్లడో....>
ఎలుకలు... అరె ఎలుకలు...అరె ఎలుకలు పిల్లిని ఏటా తగెలెనట <ఏం పిల్లడో....>
ఏం పిల్లడో...ఏం పిల్లో...
ఏం పిల్లడో...ఏం పిల్లో...
భలె భలె భలె భలె
ఏం పిల్లడో...ఏం పిల్లో...
ఏం పిల్లడో...ఏం పిల్లో...
చిత్రం : అర్ధరాత్రి స్వతంత్రం (1986)
గీతరచయిత :వంగ పండు
నేపధ్య గానం : వందేమాతరం శ్రీనివాస్



