ఒరేయ్ రిక్షా

ఆ... ఆ ఆ ఆ...
మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా

పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు
                                             ॥పెద్దమనిషి॥
అలువంటి నే అన్ననుగాను చెల్లెమ్మా
నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా
అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా
ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా
                                             ॥మల్లెతీగకు॥

చరణం: 2
సిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా
ఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయి
                                            ॥సిన్నబోయి॥
నువు ఒక్క గడియ మాటాడకుంటే చెల్లెమ్మా
నే దిక్కులేని పక్షిైనె తానమ్మా చెల్లెమ్మా
బువ్వ తినక నువు అలిగినవంటే చెల్లెమ్మా
నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా
                                            ॥మల్లెతీగకు॥

చదివినంత నిన్ను చదివిస్తనమ్మా
ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా
నీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పత్తో కూడబెట్టుతా
                                           ॥చదివినంత॥
నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మా
నా క న్నీళ్ళతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మా
రిక్షా బండినే మేనా గడతా చెల్లెమ్మా
మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా
                                            ॥మల్లెతీగకు॥


చిత్రం : ఒరేయ్ రిక్షా
సాహిత్యం : గద్దర్
సంగీతం : వందేమాత్రం శ్రీనివాస్
గానం :వందేమాతరం శ్రీనివాస్  

No comments:

Post a Comment