చిత్రం: చెంచులక్ష్మి (1958)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల
పల్లవి:
నీలగగనఘనశ్యామా ...ఘనశ్యామా దేవ నీలగగనఘనశ్యామా
నీలగగనఘనశ్యామా ...దేవ నీలగగనఘనశ్యామా
హాని కలిగితే అవతారాలను....
హాని కలిగితే అవతారాలను... పూని బ్రోచునది నీవే కావా
నీలగగనఘనశ్యామా...
నీలగగనఘనశ్యామా... ఘనశ్యామా దేవ నీలగగనఘనశ్యామా
చరణం 1:
చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమరూపా..
చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమరూపా
వేద నిధులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవే కావా...
నీలగగనఘనశ్యామా....
నీలగగనఘనశ్యామా... ఘనశ్యామా దేవ నీలగగనఘనశ్యామా
చరణం 2:
కడలి మధించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి...
కడలి మధించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి..
అతివ రూపమున అమృతము గాచిన ఆదిదేవుడవు నీవే కావా...
నీలగగనఘనశ్యామా....
నీలగగనఘనశ్యామా... ఘనశ్యామా దేవ నీలగగనఘనశ్యామా
చరణం 3:
సుజనుల కోసము ఎపుడే వేషము ధరియించెదవో తెలియగనేరము...
సుజనుల కోసము ఎపుడే వేషము ధరియించెదవో తెలియగనేరము..
పెండ్లికొడుకువై వెడలి నాడవు ఎందుల కొరకో... హే! జగదీశా...
నీలగగనఘనశ్యామా...
నీలగగనఘనశ్యామా... ఘనశ్యామా దేవ... నీలగగనఘనశ్యామా
********* ********** *********** *
చిత్రం: చెంచులక్ష్మి (1958)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, జిక్కి
పల్లవి:
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా?
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా?
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా?
ఓ నరహరి! చిగురు కోయగలవా?
చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే!
చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే!
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే!
ఓ చెంచిత! చిగురు కోయగలనే!
చరణం 1:
ఉరకలేయగలవా? ఓ నరహరి! పరుగులెత్తగలవా?
ఉరకలేయగలవా? ఓ నరహరి! పరుగులెత్తగలవా?
ఊడ పట్టుకొని జారుడు బండకు ఊగి చేరగలవా?
ఓ నరహరి! ఊగి చేరగలవా?
ఉరకలేయగలనే! ఓ చెంచిత! పరుగులెత్తగలనే ఉరకలేయగలనే!
ఓ చెంచిత! పరుగులెత్తగలనే ఊడ పట్టుకొని జారుడు బండకు ఊగి చేరగలనే!
ఓ చెంచిత! ఊగి చేరగలనే!
చరణం 2:
ఓహో హోయ్... గురిని చూసుకుని
కనులు మూసుకుని బాణమేయగలవా?
ఓ నరహరి! బాణమేయగలవా?
గురిని చూసి వెనుతిరిగి
నాణెముగ బాణమేయగలనే!
ఓ చెంచిత బాణమేయగలనే!
ఓ చెంచిత నిన్ను మించగలనే..!
చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే!
చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే!
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే!
ఓ చెంచిత! చిగురు కోయగలనే!
చరణం 3:
ఓహో హోయ్... తగవులేల ఎగతాళికాదు నను తాళిగట్టనీవా!
ఓ చెంచిత తాళిగట్టనీవా!
మనసు తెలుసుకొని మొరులు చూపితే మనువునాడనిస్తా!
ఓ నరహరి! మనువునాడనిస్తా!
ఓ నరహరి! మాలతెచ్చివేస్తా!
********* ********** *********** *
చిత్రం: చెంచులక్ష్మి (1958)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, జిక్కి
పల్లవి:
కానగరావా ఓ శ్రీహరి రావా
కానగరావా ఓ శ్రీహరి రావా
ప్రాణసఖా నను చేరగరావా
జాలిగొని బేలనని ఏలగరావా నన్నేలగరావా
కానగరావా ఓ శ్రీహరి రావా
చరణం 1:
బాస చేసి మరిచావా ఓ చెంచితా...
బాస చేసి మరిచావా ఓ చెంచితా...
వేచి వేచి కనులేమో కాయలుకాచె...
వేచి వేచి కనులేమో కాయలుకాచె...
నీవులేక క్షణమైనా నిలువ జాలనే ఏ.. ఏ.. ఏ
నీవులేక క్షణమైనా నిలువ జాలనే
జాలమాయె తాళలేను ఏలగరావే... నన్నేలగరావే
కానగరావా ఓ చెంచిత రావా...
చరణం 2:
కంటినీరు చెరువాయే కథలే మారే
కంటినీరు చెరువాయే కథలే మారే
శాంతమొంది నరసింహా.. చెంతకు రావా
శాంతమొంది నరసింహా.. చెంతకు రావా
జీవితాన అంతులేని చీకటులాయె..
జీవితాన అంతులేని చీకటులాయె...
దేవదేవ ఈ వియోగ మెన్ని దినాలో ...ఇంకెన్ని దినాలో...
కానగరావా ఓ శ్రీహరి రావా
ప్రాణసఖా నను చేరగరావా
జాలిగొని బేలనని ఏలగరావా నన్నేలగరావా
కానగరావా ఓ శ్రీహరి రావా
********* ********** *********** *
చిత్రం: చెంచులక్ష్మి (1958)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, జిక్కి
పల్లవి:
ఆ....
ఆనందమాయే అలి నీలవేణి
ఆనందమాయే అలి నీలవేణి
అరుదెంచినావా అందాల దేవీ..
ఆనందమాయే అలి నీలవేణి...
ఆ....
అనువైన వేళా అనురాగ శోభా..
అది ప్రేమపూజ నా భాగ్యమాయే...
అలనాటి నోము కల నేడు పండే..
అరుదైన హాయి నాలోన నిండే..
ఆనందమాయే అసమాన తేజా...
అపురూపమైనా అందాల దేవా...
ఆనందమాయే అసమాన తేజా..
చరణం 1:
ఆ...సొగసైన రూపే సోలింత చూపే... సగమైన కనులా సంతోషమిటులే..
నగుమోముపైన నడయాడు కళలే.. అగుపించగానే మధులూరు నాలో..
ఆనందమాయే అలి నీలవేణి..
అరుదెంచినావా అందాల దేవీ..
ఆనందమాయే అలి నీలవేణి..
చరణం 2:
ఎనలేని స్వామీ నిను చేరబోతే.. నునులేత ప్రేమా నను సాగనీదే..
ఆ.....ఆ.....ఆ.....ఆ....
తనువేమొ నీకై తపియించి నిలచే.. మనసేమొ నీలో మునుపే కలిసే..

No comments:
Post a Comment