Showing posts with label సింధూరం (1997). Show all posts
Showing posts with label సింధూరం (1997). Show all posts

సింధూరం (1997)

 అర్ధ శతాబ్దపు అఙ్ఞానాన్ని స్వతంత్రమందామా

అర్ధ శతాబ్దపు అఙ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా దానికి
సలాము చేద్దామా
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ
రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ
పవిత్ర భారతమా
అర్ధ శతాబ్దపు అఙ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేఛ్చను చూద్దామా
దాన్నే స్వరాజ్యమందామా
కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు
పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే జనాలు
తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో
ముడుచుకు పోతూ మొత్తం
దేశం తగలడుతోందనినిజం తెలుసుకోరే, తెలిసి భుజం
కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి
ఏమిటి సాధించాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ
చిచ్చుల సింధూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ
అనాధ భారతమా!
అర్ధ శతాబ్దపు అఙ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా దానికి
సలాము చేద్దామా
అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని
దహించే ధైర్యం
కారడవుల్లో క్రూరమృగంలా దాక్కుని ఉండాలా వెలుగుని
తప్పుకు తిరగాలా
శతృవుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే
కర్త్యవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా అన్నల
చేతిలొ చావాలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి
ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురుమిన నెత్తుటి మందారం ఈ
సంధ్యా సింధూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా గతి తోచని
భారతమా!
అర్ధ శతాబ్దపు అఙ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
యద్ధ నినాదపు అరాజకాన్ని స్వరాజ్యమందామా దానికి
సలాము చేద్దామా
తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ
ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే
మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం
చితిమంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద
భారతమా!
అర్ధ శతాబ్దపు అఙ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా దానికి
సలాము చేద్దామా
శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ
రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ
పవిత్ర భారతమా
అర్ధ శతాబ్దపు అఙ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేఛ్చను చూద్దామా
దాన్నే స్వరాజ్యమందామా


చిత్రం : సింధూరం (1997)
సంగీతం: శ్రీనివాస చక్రవర్తి (శ్రీ)
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం


 హాయ్ రే హాయ్ జాంపండురోయ్


హాయ్ రే హాయ్ జాంపండురోయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
కళ్ళ ముందు కదులుతొంది రొయ్
ముద్దుగా
ఏం రూపు రా ఏం రంగు రా ఏం రూపు
రా ఏం రంగు రా
సొంతమైతే అంత కన్ననా అయ్య బబొయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
చూడగానే నోరూరెరా తియ్యగా
ఏం రూపు రా ఏం రంగు రా ఏం రూపు
రా ఏం రంగు రా
సొంతమైతే అంత కన్ననా అయ్య బబొయ్


చరణం : 1
అందమైన కొన సీమ కొబ్బరాకు లా
తెల్లవారి వెలుగు లోన తులసి మొక్క లా
పెరటిలోన పెంచుకున్న ముద్దబంతి లా
పెరుగులోన నంజుకున్న ఆవకాయ లా
బుట్ట బొమ్మ లా పాల పిట్ట లా గట్టు దాటు
గోదారి లా
యెయ్యెయ్యె యెయె యెయె యెయ్యెయ్యె
హొయ్ తేనె చుక్క లా వాన చినుకులా
మామ్మ గారి ముక్కు పుడక లా వుంది పిల్ల
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్

చరణం : 2
పాత తెలుగు సినీమాలో సావిత్రి లా
ఆలయాన వెలుగుతున్న చిన్ని దివ్వె లా
తామరాకు వొంటి పైన నీటి బొట్టు లా
వాకిలంత నిండి వున్న రంగు ముగ్గులా
చేప పిల్ల లా చందమామ లా ముద్దు ముద్దు
మల్లె మొగ్గ లా
యెయ్యెయ్యె యె యెయ్యెయ్యెయ్య్య్
యెయెయె యె
ఒయి చెరుకు పంట లా భోగి మంట లా
పసుపు రంగు ఇంటి గడపలా వుంది పిల్ల
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్
కళ్ళ ముందు కదులుతొంది రొయ్
ముద్దుగా
ఏం రూపు రా ఏం రంగు రా ఏం రూపు
రా ఏం రంగు రా
సొంతమైతే అంత కన్ననా అయ్య బబొయ్
హాయ్ రే హాయ్ జాంపండురోయ్.... హాయ్ రే
హాయ్ జాంపండురోయ్
యెయ్యెయ్యె యె యెయ్యెయ్యెయ్య్య్
యెయెయె యె
యెయ్యెయ్యె యె యెయ్యెయ్యెయ్య్య్
యెయెయె యె

చిత్రం : సింధూరం (1997)
సంగీతం: శ్రీనివాస చక్రవర్తి (శ్రీ)
రచన : చంద్రబోస్
గానం : శ్రీనివాస చక్రవర్తి (శ్రీ)