Showing posts with label Bhanumathi. Show all posts
Showing posts with label Bhanumathi. Show all posts

ముద్దుల మనవరాలు (1985)




పల్లవి :
ఉమ్మ్.. ఉమ్మ్మ్... ఉమ్మ్మ్
ఆ... ఆ.. ఆ... ఉమ్మ్... ఉమ్మ్మ్ 

కుంచెకు అందనిది కంచిపట్టు కోకమ్మ 
కులుకులు నేర్చినది కన్నె పడుచు ఓయమ్మా
మెరుపే నేను సుమా... ఉరిమి చూడకోయమ్మా

కుంచెకు అందనిది కంచిపట్టు కోకమ్మ 

చరణం 1 :

నగవే వెన్నెలలో కలహంసా
పెదవే తుమ్మెదలా మధుహింసా 
నగవే వెన్నెలలో కలహంసా
పెదవే తుమ్మెదలా మధుహింసా 


ఎదలో పొంగెను వర్ణార్ణవమే నీ కోసం
నినిప నినిప మపగమపప పపమగ సనిసరినిస  పనిపమగ 


ఎదలో పొంగెను వర్ణార్ణవమే నీ కోసం
విరిసెను చైత్రాలే నాలో ఈవేళా

కుంచెకు అందనిది కంచిపట్టు కోకమ్మ 
మెరుపే నేను సుమా... ఉరిమి చూడకోయమ్మా
కుంచెకు అందనిది కంచిపట్టు కోకమ్మ 


చరణం 2 :
ఆ.. ఆ.. ఆ.. లలలలలలాల్ల
కులికే కుప్పెలతో జడవీణా... 
పలికే మువ్వలతో నెరజాణా
కులికే కుప్పెలతో జడవీణా... 
పలికే మువ్వలతో నెరజాణా

దివిలో పూసిన సుర కల్హారం నీ అందం
ఆ.. ఆ.. ఆ.. హ.. హ..
దివిలో పూసిన సుర కల్హారం నీ అందం
చిలికెను మోహాలే నాలో ఈ వేళా



కులుకులు నేర్చినది కన్నె పడుచు ఓయమ్మా
మెరుపే నేను సుమా... ఉరిమి చూడకోయమ్మా
కుంచెకు అందనిది కంచిపట్టు కోకమ్మ 


చిత్రం :  ముద్దుల మనవరాలు (1985)
సంగీతం :  బాలు
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు

బొబ్బిలి యుద్ధం (1964)

చిత్రం :  బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
నేపధ్య గానం :  పి. భానుమతి


పల్లవి:

శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా.. ఆ..ఆ..ఆ
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా..
సిరులు యశము శోభిల దీవించు మమ్ములా.. ఆ..ఆ
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా


చరణం 1:

కాకతీయ వైభవం హంపీ వేంగీ ప్రాభవం
కాకతీయ వైభవం హంపీ వేంగీ ప్రాభవం
కన్న తండ్రి కలలు నిండి..
మా కన్న తండ్రీ కలలు నిండి కలకాలం వర్ధిల్లగా..ఆ..ఆ..ఆ..ఆ

శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
సిరులు యశము శోభిల దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా


చరణం 2:

పెరిగి మా బాబు వీరుడై... ధరణీ సుఖాల ఏలగా
పెరిగి మా బాబు వీరుడై... ధరణీ సుఖాల ఏలగా
తెలుగు కీర్తి తేజరిల్లి...
తెలుగు కీర్తి తేజరిల్లి..  దిశలా విరాజిల్లగా..ఆ..ఆ..ఆ..

శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా..
సిరులు యశము శోభిల దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా..

************ **************** *************

చిత్రం :  బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:

సొగసు కేల్జడదాన .. సోగకన్నులదాన
వజ్రాలవంటి పల్వరుసదాన...
బంగారు జిగిదాన.. సింగారములదాన
నయమైన వయ్యారి నడలదాన...
తోరంపు కటిదాన ... తొణకు సిగ్గులదాన
పిడికిటనడగు నెన్నడుముదాన...

ఆ....ఆ.....ఆ.....ఆ....ఆ....ఆ...
మురిపించే అందాలే... అవి నన్నే చెందాలే..
మురిపించే అందాలే... అవి నన్నే చెందాలే..
నా దానవు నీవేలే... నీ వాడను నేనేలే...
ఆ....ఆ....ఆ...ఆ...
దరి చేర రావే... సఖి నా సఖీ...
ప్రేయసి సిగ్గేల...

మరపించే మురిపాలే... కరిగించే కెరటాలై..ఈ..
మరపించే మురిపాలే... కరిగించే కెరటాలై..ఈ..
నిదురించే భావాల... కదిలించే ఈ వేళ...
ఆ....ఆ....ఆ...ఆ...
అదే హాయి కాదా.. సఖా నా సఖా..
మురిపించే అందాలే... అవి నన్నే చెందాలే..

చరణం 1:

చెలి తొలి చూపే మంత్రించెనే... ప్రియసఖు రూపే మదిలేలెనే...
చెలి తొలి చూపే మంత్రించెనే... ప్రియసఖు రూపే మదిలేలెనే...
ఇది ఎడబాటు కనలేని ప్రేమా... ఇల మనకింక సురలోక సీమ...
ఇది ఎడబాటు కనలేని ప్రేమా... ఇల మనకింక సురలోక సీమ...

ఇదేహాయి కాదా... సఖా.. నా సఖా ...ఆ...ఆ...
మురిపించె అందాలే... అవి నన్నే చెందాలే


చరణం 2:

అనురాగాల రాగాలలో... నయగారాల గారాలలో
అనురాగాల రాగాలలో... నయగారాల గారాలలో
మధుమాధుర్యమే నిండిపొయే... హృదయానందమే పొంగిపొయే
మధుమాధుర్యమే నిండిపొయే... హృదయానందమే పొంగిపొయే
దరి చేర రావే ... సఖి..  నా సఖీ...

మురిపించే అందాలే... అవి నన్నే చెందాలే...


************ **************** *************

చిత్రం :  బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  సుశీల

పల్లవి:

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా...
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ....

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా...
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ

చరణం 1:

తళ తళ తళ తళ మెరిసే సొగసు... ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ
తళ తళ తళ తళ మెరిసే సొగసు... ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ

పరువము వేసిన పందిరిలో... బుజబుజ రేకులు పూయవలె....
పరువము వేసిన పందిరిలో... బుజబుజ రేకులు పూయవలె....

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా...
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ


చరణం 2:

ఒప్పులకుప్ప.. వయ్యారి భామా
సన్నబియ్యం..  ఛాయపప్పు
చిన్నమువ్వ..  సన్నగాజు
కొబ్బరికోరు..  బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్.. నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు.. నీ మొగుడెవడు

ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె
ఆ..ఆ..ఆ..ఆ... ఓ..ఓ..ఓ..ఓ...

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా...
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా...
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ...


************ **************** *************

చిత్రం :  బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  సుశీల

పల్లవి:

నిను చేర మనసాయెరా...  నా స్వామి
చనువార దయసేయరా...
ఆ..ఆ..ఆ..
నిను చేర మనసాయెరా... నా స్వామి
చనువార దయసేయరా...
ఆ..ఆ..ఆ..
నిను చేర మనసాయెరా..

చరణం 1:

విడిదికి రమ్మని చాల వేడితిరా
విడిదికి రమ్మని చాల వేడితిరా
బిడియము నీకేలరా... దొరా
బిడియము నీకేలరా... దొరా.. ఆ..ఆ..ఆ..
నిను చేర మనసాయెరా... నా స్వామి

చరణం 2:

గా గరిగ సాగరిగ
సనిదమప నిదమపా
నిదమపదనిస మపమపదప
మనిద మపదనిని నిస

సరసుడవని నిన్నే పదిమంది పొగడా
సరసుడవని నిన్నే పదిమంది పొగడా
మరిమరి కోర్కెలు విరిసెను ప్రియుడా
మరిమరి కోర్కెలు విరిసెను ప్రియుడా

వయసు నీకొరకె పలవరించెరా
తనువు నిందలచి పులకరించెరా
మగువ కోర మొగమాట మేలరా
బిగువు మాని జవరాలి నేలరా
సొగసు చూచి ఎదురు కాచి నిలిచి
పగలు రేలు దిగులు చెందు చెలికి..
నిను చేర మనసాయెరా...  నా స్వామి
చనువార దయసేయరా...
ఆ..ఆ..ఆ..
నిను చేర మనసాయెరా... ఆ..ఆ..ఆ..


************ **************** *************

చిత్రం :  బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  పి. భానుమతి

పల్లవి:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన .. ఊయలలూగినదోయీ...

చరణం 1:


వెన్నెల పూవులు విరిసే వేళా
సన్నని గాలులు సాగే వేళా
వలపులు ఏవో పలికెను నాలో ... ఆ...
తెలుపగ రానిది ఈ హాయి...

ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయీ...

చరణం 2:

కమ్మని రాతిరి రమ్మని పిలిచే
మల్లెల పానుపు మనకై నిలిచే
ప్రాయము నీవై.. పరువము నేనై ….
ప్రాయము నీవై పరువము నేనై
పరిమళించగా రావోయి…

ఊయలలూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయలలూగినదోయీ...

************ **************** *************


చిత్రం :  బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:

అందాల రాణివే.. నీవెంత జాణవే
కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా..ఆ..

వీరాధి వీరులే.. రణరంగ ధీరులే
ఇదేమి వింత యేల ఇంత తొందరా..ఆ..ఆ..
వీరాధి వీరులే..

చరణం 1:

పరీక్ష చాలులే.. ఉపేక్ష యేలనే
సుఖాల తీరము.. ఇంకెంత దూరము..
ఓ..ఓ..ఓ..
పరీక్ష చాలులే.. ఉపేక్ష యేలనే
సుఖాల తీరము.. ఇంకెంత దూరము..

ఉపేక్ష కాదిది.. అపేక్ష ఉన్నది
నీరిక్ష చాల మంచిదీ..ఈ..

వీరాధి వీరులే.. రణరంగ ధీరులే..
ఇదేమి వింత యేల ఇంత తొందరా..ఆ..ఆ..
వీరాధి వీరులే..

చరణం 2:

క్రీగంటితో నను దోచి.. నా గుండె దొంగిలి దాచి
చాటుగా మాటుగా.. ఆడుతే చాలులే.. ఆడుతే చాలులే..
చాలులే.. చాలులే..

శ్రీవారి హృదయము.. నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము.. కాపాడు కవచము
అహహా..ఆ..ఆ..
శ్రీవారి హృదయము.. నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము.. కాపాడు కవచము

ప్రియురాలి రూపము.. రేగించే మోహము
నేనింక తాళజాలనే..ఏ..ఏ..హే..ఏ..

అందాల రాణివే.. నీవెంత జాణవే
కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా..ఆ..
అందాల రాణివే..

చరణం 3:

నీ వంటివారికి మేలా.. మేలెంచు పెద్దలు లేరా
వారిదే భారము.. యేల ఈ ఆగము
ఆగుము.. ఆగుము..
ఆగను.. ఆగను...

ఏకాంత సమయము.. ఆనంద నిలయము
నీవెన్ని అనినను.. నీ చేయి విడువను
ఓ..ఓ..ఓ..ఓ..
ఏకాంత సమయము.. ఆనంద నిలయము
నీవెన్ని అనినను.. నీ చేయి విడువను

జగానికందము వివాహాబంధము.. ఆనాడే తీరు వేడుకా..ఆ..

అందాల రాణివే.. నీవెంత జాణవే
ఇదేమి వింత యేల ఇంత తొందరా..ఆ..ఆ..

అందాల రాణివే.. నీవెంత జాణవే
ఇదేమి వింత యేల ఇంత తొందరా..ఆ..ఆ..

అందాల రాణివే..

గృహలక్ష్మి (1967)


చిత్రం: గృహలక్ష్మి (1967)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల, భానుమతి

పల్లవి:

కన్నులే నీకోసం కాచుకున్నవి వెన్నెలలే అందుకని వేచియున్నవి

కన్నులే నాకోసం కాచుకున్నవా...వెన్నెలలే అందుకని వేచియున్నవా

చరణం 1:

ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
కొంటెతనం ఈ రేయి కూడదన్నవి...కూడదన్నవి

కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా

చరణం 2:

అందమైన ఆవేశం ఆగనన్నది
హద్దులోన ఉంటేనే అందమున్నది
అందమైన ఆవేశం ఆగనన్నది
హద్దులోన ఉంటేనే అందమున్నది

తుళ్ళిపడే నా మనసే చల్లపడాలి
చందురుడే నిన్నుగని జాలిపడాలి...జాలిపడాలి

కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి

చరణం 3:

విరహంలో నా తనువే వేగుతున్నది
తీయని ఆ విరహంలో హాయివున్నది
విరహంలో నా తనువే వేగుతున్నది
తీయని ఆ విరహంలో హాయివున్నది

ఎందుకిలా నన్ను సతాయింతువు నేడు
మాటలింక చాలునులే మామవున్నాడు...చందమామవున్నాడు

కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా
కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి

బాటసారి ( 1961)

చిత్రం : బాటసారి ( 1961)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  భానుమతి 

పల్లవి :

ఉపకార చింతే నేరమా... కరుణే నిషేదమా
నిలాపనిందలే ఈ లోక నైజమా... న్యాయమే కానగ జాలరా

కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై..  అనేరా ఈ తీరునా ఈ లోకులు
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై..  అనేరా ఈ తీరునా ఈ లోకులు


చరణం 1 :


పాముల కన్నులతో కనేరా పరుల
పాలను పోసిన చేతినే కరచేరా
నీడనొసంగిన వారికే కీడు చేసేరా
న్యాయమే కానగజాలరా
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై అనేరా ఈ తీరునా ఈ లోకులు


చరణం 2 :


నా మనసు.. నడత ఎరిగినవారే అపవాదు వేసినా
నమ్మేరా పెదవారు నా మాట
న్యాయమే కానగజాలరా

కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై...  అనేరా ఈ తీరునా ఈ లోకులు
కనేరా కామాంధులై మనేరా ఉన్మాదులై...  అనేరా ఈ తీరునా ఈ లోకులు



******** ********** ********** ***********
చిత్రం : బాటసారి ( 1961)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  లీల

పల్లవి :


శరణమునీవే దేవి...  కరుణా నాపై చూపవే
శరణమునీవే దేవి...  కరుణా నాపై చూపవే
శరణమునీవే దేవి



చరణం 1 :


నిన్నె నమ్ముకొని బ్రతికెదనమ్మ
పతిని దూరము చేయకుమమ్మ
నిన్నె నమ్ముకొని బ్రతికెదనమ్మ
పతిని దూరము చేయకుమమ్మ
పసుపుకుంకుమ నిలుపగదమ్మ రాజరాజేశ్వరి

శరణమునీవే దేవి కరుణా...  నాపై చూపవే
శరణమునీవే దేవి


చరణం 2 :


మాపై జాలిని పూనగలేవా... ఆపద తీరుపజాలవా
మాపై జాలిని పూనగలేవా... ఆపద తీరుపజాలవా
విధికి జీవులు బానిసలేనా... కథ వ్యధగా ముగిసేనా

మాపై జాలిని పూనవా... ఆపద తీరుపజాలవా
విధికి జీవులు బానిసలా... కథ వ్యధగా ముగిసేనా


******** ********** ********** ***********
చిత్రం : బాటసారి ( 1961)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  భానుమతి

పల్లవి :


లోకమెరుగని బాలా
లోకమెరుగని బాలా...  ఆ...  ఆ
లోకమెరుగని బాలా
దీని పోకడ చిత్రము చాలా... ఆ... ఆ

లోకమెరుగని బాలా
కనులను మూసిని మనసుని తెరచి కనుమా నిజము బేలా
ఆ ఆ లోకమెరుగని బాలా... ఆ...  ఆ
ఆ ఆ లోకమెరుగని బాలా... ఆ...  ఆ


చరణం 1 :


ఎందును కానని అందము కనిన... డెందము చిందెనుగానవా
సుందర కవితా శిల్పము వెలసి
సుందర కవితా శిల్పము వెలసి
విందులు చేయునుగా... ఆ...  ఆ

ఇదియే స్థిరమని మురిసే మనుపే
ఇదియే స్థిరమని మురిసే మనుపే
కలయే మారు సుమా... ఆ...  ఆ...
 లోకమెరుగని బాలా


చరణం 2 :

దిగులు వగలు తెలిసే వయసున కలుగును ఊహలెవో
అవి చెలిగి మదిలో ఆశలు రేగ
చెలిగి మదిలో ఆశలు రేగ
ఆపద మూగునుగా... ఆ.. ఆ..  ఆ

ఏల కలుగును ఎరిగే మునుపే
ఏల కలుగును ఎరిగే మునుపే
కాలము తీరునుగా ఆ ఆ

లోకమెరుగని బాలా...  ఆ...  ఆ
లోకమెరుగని బాలా 

******** ********** ********** ***********
చిత్రం : బాటసారి ( 1961)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: భానుమతి, జిక్కి


పల్లవి:

కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని

భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
తలపులున్నవి కొన్ని

చరణం 1:

సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే

కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే
పెను చీకటినేల సృజించే

చరణం 2:

వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం … సలుపకు పరిహాసం

బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం...


******** ********** ********** ***********

చిత్రం : బాటసారి ( 1961)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  భానుమతి

పల్లవి:

ఓ బాటసారి.. నను మరువకోయి
మజిలీ ఎటైనా.. ఆ ఆ.. మనుమాసుఖాన

ఓ బాటసారి.. నను మరువకోయి
మజిలీ ఎటైనా.. ఆ ఆ... మనుమాసుఖాన

చరణం 1:

సమాజానికీ.. దైవానికి.. బలియైతి నేను వెలియైతినే..
వగేగాని నీపై.. పగలేని దానా.. కడమాట కైనా నేనోచుకోనా

ఓ బాటసారి.. నను మరువకోయి
మజిలీ ఎటైనా.. ఆ ఆ... మనుమాసుఖాన

చరణం 2:

శృతి చేసినావు.. ఈ మూగవీణ.. ఆ.. ఆ...
సుధామాధురి.. ఈ ఈ ఈ.. చవే చూపినావు.. ఊ...
సదా మాసిపోని.. స్మృతే నాకు వీడి..
మనోవీణ నీవు కొనిపోయెనోయి

ఓ బాటసారి.. నను మరువకోయి
మజిలీ ఎటైనా.. ఆ ఆ... మనుమాసుఖాన

చక్రపాణి (1954)

చిత్రం: చక్రపాణి (1954) 
సంగీతం: పి.భానుమతి 
నేపధ్య గానం: భానుమతి 

పల్లవి: 

ఉయ్యాల జంపాల లూగరావయా 
ఉయ్యాల జంపాల లూగరావయా 
తులలేని భోగాల తూగి..ఈ..ఈ.. 
ఉయ్యాల జంపాల లూగరావయా 
తులలేని భోగాల తూగి..ఈ..ఈ.. 

ఉయ్యాల జంపాల లూగరావయా 

చరణం 1: 

తాతయ్య సిరులెల్ల వెగర పెంపా 
జాబులో పుట్టిన బాబు నీవయ్య 
జాబులో పుట్టిన బాబు నీవయ్య 

ఉయ్యాల జంపాల లూగరావయా ... 

చరణం 2: 

మా మనొరమక్కాయి మదిలోన మెరసి 
ఎదురింటి ఇల్లాలి వొడిలోన వెలసి... 
ఎత్తుకుని ముత్తాత ఎంతెంతొ మురిసి 
ఎత్తుకుని ముత్తాత ఎంతెంతొ మురిసి.. 
నా వారసుడావనుచు నవ్వు రా కలసి .. 
నా వారసుడావనుచు నవ్వు రా కలసి... 

ఉయ్యాల జంపాల లూగరావయా 
తులలేని భోగాల తూగి..ఈ..ఈ.. 

ఉయ్యాల జంపాల లూగరావయా 

చరణం 3: 

మా మదిలో కోర్కెలను మన్నింప దయతొ 
అవతిరించినావయ్య అందాల రాశి.. 
చిన్ని నా తండ్రికి శ్రీరామరక్షా... 
చిన్ని నా తండ్రికి శ్రీరామరక్షా 
తప్పక ఇత్తురా తాతయ్య లక్ష 
తప్పక ఇత్తురా తాతయ్య లక్ష... 

ఉయ్యాల జంపాల లూగరావయా 
తులలేని భోగాల తూగి..ఈ..ఈ.. 

ఉయ్యాల జంపాల లూగరావయా..ఊగరావయా..ఊగరావయా

చండీరాణి (1953)





చిత్రం: చండీరాణి (1953)
సంగీతం: విశ్వనాథన్, రామ్మూర్తి
గీతరచయిత: సముద్రాల
నేపధ్య గానం: ఘంటసాల, భానుమతి


పల్లవి:

ఓ తారకా.. ఓ..
ఓ జాబిలీ ..ఓ..

ఓ తారకా.. నవ్వులేల.. ననూగనీ

ఓ తారకా నవ్వులేల ననూగనీ
ఓ తారకా నవ్వులేల ననూగనీ
అందాలు చిందెడి చందమామ నీవని
అందాలు చిందెడి చందమామ నీవని
ఓ జాబిలీ ..ఓ.. ఆ తారక నవ్వునోయి నినూగనీ

చరణం 1:

వినువీథిలోని తారాకుమారీ
దరిజేరనౌనా ఈ చందమామా
చేరువే తారా రేరాజుకు.. ఊ..

ఆ తారకా నవ్వునోయి నినూగనీ
అందాలు చిందెడి చందమామ నీవని

ఓ జాబిలీ.. ఓ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ

చరణం 2:

మనోగాథ నీతో నివేదించలేను
నివేదించకున్నా.. జీవించలేను ఊ...

నెరజాణవేలే ఓ జాబిలీ ఓ..
ఆ తారకా నవ్వునోయి నినూగనీ
అందాలు చిందెడి చందమామ నీవని

ఓ జాబిలీ.. ఓ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ

చరణం 3:

తొలిచూపులోని సంకేతమేమో
చెలినవ్వులోని ఆ శిల్పమేమో...

నీ నవ్వు వెన్నెలే ఓ జాబిలీ..ఓ
ఆ తారకా నవ్వునోయి నినూగనీ
అందాలు చిందెడి చందమామ నీవని

ఓ జాబిలీ.. ఓ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ