Showing posts with label Sai Pallavi. Show all posts
Showing posts with label Sai Pallavi. Show all posts

అమరన్ (2024)






హే రంగులే (రంగులే)
హే రంగులే (రంగులే)
నీ రాకతో లోకమే
రంగులై పొంగేనే

వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకాశం అందేనే

స్నేహమే మెల్లగా గీతలే దాటేనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం

సమయానికి తెలిపేదెలా
మనవైపు రారాదని దూరమై పొమ్మని
చిరుగాలిని నిలిపేదెలా
మన మధ్యలో చేరుకోవద్దని

పరిచయం అయినది
మరో సుందర ప్రపంచం నువ్వుగా
మధువనం అయినది
మనస్సే చెలి చైత్రం జతగా

కలగనే వెన్నెల సమీపించేను నీ పేరుగా
హరివిల్లే నా మెడనల్లెను నీ ప్రేమగా

హే రంగులే (రంగులే)
హే రంగులే (రంగులే)
నీ రాకతో లోకమే
రంగులై పొంగేనే

హే వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకాశం అందేనే

స్నేహమే మెల్లగా గీతలే దాటేనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం



చిత్రం: అమరన్ (Amaran) (2024)
సంగీతం: జి వి ప్రకాష్ కుమార్
సాహిత్యం: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి 
గానం: అనురాగ్ కులకర్ణి , రమ్య బెహరా

పడి పడి లేచే మనసు (2018)




చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: అర్మాన్ మాలిక్ , శ్రీనిధి



పద పద పద పదమని
పెదవులిలా పరిగెడితే
పరి పరి పరి విధముల
మది వలదని వారిస్తే
పెరుగుతుందే మదికాయాసం
పెదవడుగుతుందే చెలి సావాసం
పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవ్వగ
ప్రాణం పోయినట్టే పోయి వస్తే

పడి పడి లేచే
పడి పడి లేచే
పడి పడి లేచే  మనసు

ప్రళయంలోను ప్రణయంతోనే
పరిచయమడిగే మనసు
అది నువ్వని నీకే తెలుసూ..

చిత్రంగా ఉందే చెలీ
చలి చంపే నీ కౌగిలి
నా బందీగా ఉంటే సరి
చలి కాదా మరి వేసవి
తపస్సు చేసి చినుకే
నీ తనువు తాకెనే
నీ అడుగు వెంటే నడిచి
వసంతమొచ్చేనె
విసిరావలా మాటే వలలా కదిలానిలా...

పడి పడి లేచే
పడి పడి లేచే
పడి పడి లేచే  మనసు

ప్రళయంలోను ప్రణయంతోనే
పరిచయమడిగే మనసు
అది నువ్వని నీకే తెలుసూ..


*****  *****  *****


చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: అనురాగ్ కులకర్ణి


కల్లోలమెంటేసుకొచ్చే పిల్ల గాలే
నను చూస్తూనే కమ్మెసెనే
కల్లోని గాంధర్వ కన్యే ఎక్కే రైలే
విహరించెనా భూలోకమే

గాలే తగిలింది అడిగే
నేలే పాదాలు కడిగే
వానే పట్టింది గొడుగే
అతిధిగా నువ్వొచ్చావనే

కలిసేందుకు తొందర లేదులే
కల తీరక ముందుకు పోనులే


కదిలేది అది
కరిగేది అది
మరి కాలమే కంటికి కనపడదే

ప్రపంచమే అమాంతమే మారే
దీవి భువీ మనస్సులో చేరే
ఓంకారమై మోగేను లే ఓ పేరే…

ప్రపంచమే అమాంతమే మారే
దీవి భువీ మనస్సులో చేరే
ఓంకారమై మోగేను లే ఓ పేరే…

రాశా రహస్య లేఖలే
ఆ ఆ లు లేవులే సైగలు చాలే
చూశా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే

రాశా రహస్య లేఖలే
ఆ ఆ లు లేవులే సైగలు చాలే
చూశా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే

కళ్ళకేది ముందుగా ఆనలేదే ఇంతలా
రెప్పలే పడనంత పండగ
గుండెకే ఇబ్బందీలా టక్కునా ఆగెంతలా
ముంచినా అందాల ఉప్పెనా…

గొడుగన్చున ఆగిన తూఫానే
ఎద పంచన లావా నీవేనే
కనపడని నది అది పొంగినది
నిను కలవగా కడలై పోయినదే

ప్రపంచమే అమాంతమే మారే
దీవి భువీ మనస్సులో చేరే
ఓంకారమై మోగేను లే ఓ పేరే…

ప్రపంచమే అమాంతమే మారే
దీవి భువీ మనస్సులో చేరే
ఓంకారమై మోగేను లే ఓ పేరే…

రాశా రహస్య లేఖలే
ఆ ఆ లు లేవులే సైగలు చాలే
చూశా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే

రాశా రహస్య లేఖలే
ఆ ఆ లు లేవులే సైగలు చాలే
చూశా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే


*****  *****  *****


చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: యాజిన్ నజీర్


నువు నడిచే ఈ నేల పైనే నడిచానా ఇన్నాళ్లుగా నే
ఈ క్షణమే ఆపాలనున్నధి ఈ భూభ్రమణమే !
నీ చెలిమి వద్దంటూ గతమే బంధీగా చేసిందీ నన్నే
తక్షణమే చేయాలనున్నధి తనతో యుద్ధమే
ఇవ్వాలే తెగించా ఇదేనేమో స్వేఛ్చ
తెలికే తెంచావే నా ఇన్నాళ్ళ సంకెళ్లనే

హృదయం జరిపే తొలి తిరుగుబాటిది
నిను దాయడమే తన జన్మ హక్కని
ఒంటరి తనపు ఖైదిన్క వద్దనీ నన్నొదిలెనే..
ఇదివరకేపుడు నా ఉనికినెరగని దుర్భేధ్యాల నీ మనసు కూతని
ముట్టడి చేసి గెలిచేందుకొచ్చెనే నా హృదయమే..


ఏకాంతమంత అంతం అయేంత
ఓ చూపు చూడే చాలికా
మరు జన్మ సైతం రాసేసి ఇస్తా
నా రాజ్యమంతా ఏలికా.
నీ మౌనంలో దాగున్న ఆ గరళమే
దాచేసి అవుతున్నా నేనచ్చంగా ముక్కంటినే..

హృదయం జరిపే తొలి తిరుగుబాటిది
నిను దాయడమే తన జన్మ హక్కని
ఒంటరి తనపు ఖైదిన్క వద్దనీ నన్నొదిలెనే..
ఇధివరకేపుడు నా ఉనికీనెరగని

దుర్భేధ్యాల నీ మనసు కూతని
ముట్టడి చేసి గెలిచేందుకొచ్చెనే నా హృదయమే..


*****  *****  *****


చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిందూరి విశాల్


నంద గోపాలా ఏమిటి ఈ లీల
కంటపడవేమి రా

ఎంత విన్నారా వేచి ఉన్నారా
మాయా విడవేమిరా

రాక్షశుల విరిచి దాగి నను గెలిచి
ఆటలాడేవు రా
ఆ..ఆఆ…
కానరావేమి రా

ఓ మై లవ్లీ లలన.. ఇలానే రమ్మంటే
ఓ మై లవ్లీ లలన.. ఇంతే నే వింటే
ఓ మై లవ్లీ లలన.. నీలో బాధ కంటే
ఓ మై లవ్లీ లలన.. ఎలా ధానివంటే
ఓ మై లవ్లీ లలన.. కొంటె గాలి నిన్నంటే
ఓ మై లవ్…

ఆ..ఆ…ఆ…

యధో భూషణా… సూరా పూతనా… వధే చేసేనా.
కాళింది లోతునా… కాలేవు ననచినా..

మహా శౌనకీ… ముక్తే పంచినా…
దివ్యా రూపమే గనే కాంక్ష రా..
నిన్నే కాంచగా కన్నారా కన్నారా
ప్రియ గొంతిలా ముకుందా కృష్ణా
ఓ మై లవ్లీ లలన

ఇలానే రమ్మంటే
ఓ మై లవ్లీ లలన
కొంటె గాలే నిన్నంటే

ఓ మై లవ్లీ లలన
ఓ మై లవ్లీ లలన
ఓ మై లవ్లీ లలన...


*****  *****  *****

చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్


ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే..
ఏమైపోతానే.. నీవంటూ లేకుంటే..

నీతో ప్రతి పేజీ నింపేశానే.. తెరవక ముందే పుస్తకమే విసిరేశావే..
నాలో ప్రవహించే ఊపిరివే.. ఆవిరి చేసి ఆయువునే తీసేశావే..

నిను వీడి పోనందీ నా ప్రాణమే..
నా ఊపిరిని నిలిపేది నా ధ్యానమే..
సగమేనే మిగిలున్నా.. శాసనమిది చెబుతున్నా..
పోనే.. లేనే.. నిన్నుదిలే...

ఏమైపోయావే.. నీవెంటే నేనుంటే..
ఏమైపోతానే.. నీ వంటూ లేకుంటే..

ఎటు చూడు నువ్వే.. ఎటు వెళ్లెనే..
నేలేని చోటే నీ హృదయమే..
నువ్ లేని కల కూడా రానే రాదే..
కలలాగ నువ్ మారకే..
మరణాన్ని ఆపేటీ వరమే నీవే..
విరాహాల విషమీయకే..

ఏమైపోయావే.. నీ వెంటే నే నుంటే..
ఏమైపోతానే.. నీ వంటూ లేకుంటే..


*****  *****  *****


చిత్రం: పడి పడి లేచే మనసు (2018)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: రాహుల్ శిల్పిగంజ్, యమ్ యమ్ మానసి



ఉరికే చెలి చిలకా…
గొడవే ఇక పడకా…
నల్లా జోడు కళ్ళాకెట్టి
చూపే మరిచావా…
ఎత్తు జోడు కాళ్ళకేసి
నేలే విడిచావా…

ఎంత దూరమైనా పోవే
ఎంటపడి నే రానే
ఎండె పోతే ఎనక్కి నువు రావా..
కొంటె నీ గుండె పరిచావా…

సురుక్కుమన్నా పైకే
నీ మనసే వెన్నెలేవే
కొరుక్కు తిననా నేనే
హీష్మమ్మై కరిగేపోవే

సురుక్కుమన్నా పైకే
నీ మనసే వెన్నెలేవే
కొరుక్కు తిననా నేనే
హీష్మమ్మై కరిగేపోవే

బొంగరంలా మూతే తిప్పేసి పరుగే తీయ్ కే
గింగిరాలే కొట్టి వస్తున్నా పరుగే తీయ్ కే
ఉంగరాన్ని తొడుగే వేలీయే…
బంగారంలా ఏలూకుంటానే…

ఎర్రని కోకే చూసి వెంట నువు రాకో
ఎవరని అనుకున్నావేమో  ఏంటసలూ
ఏటిలో సేపను కాను వలకు  దొరికేనూ
పొగరుకే అత్తరు పూస్తే అది నేను

వేషమేసారు  ఏంది సారు
ఏలుడంత కొయబంగారు పుట్టిస్తా కంగారు
అంత వీజీ కాదు నన్ను నచ్చుకోవడం
హాయ్..కల్లుకొచ్చి ఎందుకంట ముంత దాచడం
పొగడామాకు అసలు పడిపోనూ…

పచ్చి కలరని కుచ్చి కుచ్చి నవ్వుతో
చిచ్చు గుండెలోన చిచ్చు పెట్టకే
ఆచిడానితో రెచ్చిపోయి వచ్చినా
పిచ్చి లేపి రచ్చ చేసి చంపేయకే
పచ్చి కలరని కుచ్చి కుచ్చి నవ్వుతో
చిచ్చు గుండెలోన చిచ్చు పెట్టకే
ఆచిడానితో రెచ్చిపోయి వచ్చినా
పిచ్చి లేపి రచ్చ చేసి చంపేయకే

MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) (2017)





చిత్రం: MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: నకాష్ అజిజ్
నటీనటులు: నాని, సాయి పల్లవి
దర్శకత్వం: శ్రీరామ్ వేణు
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 2017

వీధి చివర ఉంటాదో టీ కొట్టు
ఆడ మేముతాగే టీ ఏమో వన్ బై టు
ఒంటి మీద ఉండేదొక్క జీన్స్ పెంటూ
పైనా అపుడపుడు మారుస్తాం టీ షర్టు
మా ఫేవరేట్ హీరో సినిమా హిట్టు
అయితే మేము కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్టు
మా కాలనీ కావేరి  తోటి సైలెంటు
కానీ కళ్లలోని కాజల్ తో టూ హిట్టు
ఆశాడం సేల్స్ లో హాఫ్ రేటుకిచ్చిన
మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంటూ

మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA
మేమే మిడిల్...  అ మిడిల్...
అ మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA

హో పిక్చర్ నాది పాప్కార్న్ నీది
మందే నాది మంచింగ్ నీది
బైకే నాది పెట్రోల్ నీది
అరే సిగరెట్ నాది మామా కిల్లి  నీది
అని వాటా వేసి కార్చేపెడతాం
అరే పైసా పైసా పోగేచేస్తాం
చివరికి తిట్టి కట్టి చీటింగ్ పోతాం
మళ్ళీ లక్కే వస్తుందని లాటరీ ట్రయ్ చేస్తాం

మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA
మేమే మిడిల్...  అ మిడిల్...
అ మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA

హో పాస్ బుక్కుల్లో  పైసల్ కన్నా
ఫేస్బుక్కులో  ఫ్రెండ్సేక్కువా
వండుకున్నా కూరలు కన్నా
పక్కింటోలిచ్చే పచ్చల్లెక్కువా
అరే పేపర్లోనా వార్తలు కన్నా
పిట్టగోడ కాడ న్యూసెక్కువా
బీర్ బోటిల్లే తాగేకన్నా
వాటిని అమ్మేటప్పుడు కిక్కే ఎక్కువా

మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA
మేమే మిడిల్...  అ మిడిల్...
అ మిడిల్ క్లాస్ అబ్బాయిలం


*******   *******  *******


చిత్రం: MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: సాగర్, ప్రియ హిమేష్

కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా
క్షనముకొక్క నిమిషమల్లె గడుపుదాం పదా
ఓ వింతగా వింతగా మంత్రమేసినట్టుగా
నిమిషమొక్క గంటలాగ గడుపుదాం పదా

ఓ వేగమే కాస్త పెంచనా
గంటకిన్ని పూటలంటు మూటగట్టనా
ఆ పూట కిన్ని రోజులంటు పంచి పెట్టనా
రోజుకొక్క వారమంటు నడక మార్చనా
ప్రేమ పంచడంలో నిన్ను మించనా

ఎండైనా...ఎండైనా
వానైనా...వానైనా
మన తీరే ఆగేనా

నిన్నైనా...నిన్నైనా
రేపైనా...రేపైనా
అరక్షనమే ఇకపైనా

కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా
క్షనముకొక్క నిమిషమల్లె గడుపుదాం పదా
వింతగా వింతగా మంత్రమేసినట్టుగా
నిమిషమొక్క గంటలాగ గడుపుదాం పదా

ఓ ఎక్కడుందో నాకు నచ్చబోయె పిల్ల అంటూ
ఎప్పుడొచ్చి నన్ను కోరి చేరుతుందో అంటు
ఊహించుకున్న నిమిషమెక్కడున్న
నిన్ను తీసుకెల్లి చూపనా
నిన్ను చూడగానె నా మొదటి భావమేంటో
నిన్ను చేరలేక నేను పడ్డ వేదనేంటొ
చెప్పలేనిదంటు నిన్నె చూడమంటూ
ఆ గడియలోకి లాగనా
కలుసుకోని వేలలన్ని లెక్కగట్టనా
మనం కలుసుకున్న వేల వేలి కంటగట్టనా
అలసిపోవడాన్ని తీసి పక్కనెట్టనా
నిన్ను తెలుసుకోవడంలొ తేలనా

ఎండైనా...ఎండైనా
వానైనా...వానైనా
మన తీరే ఆగేనా

నిన్నైనా...నిన్నైనా
రేపైనా...రేపైనా
అరక్షనమే ఇకపైనా

సన్ షైన్ చూడాలి నీ పక్కనుంటు
మూన్ లైట్తాకాలి నీ ఊసులింటు
సన్ మూన్ తెచ్చి పక్కపక్కనెట్టే
టైం వేస్టే చేయకా
నీ రూపు చూడాలి రెప్ప విప్పగానే
నువ్వు జోల పాడాలి రాతిరవ్వగానే
రేయి పగలు తెచ్చి ఒక్క చోట కట్టై
యెడబాటే లేదికా
పక్కనోల్ల టైం కూడ దొంగిలించనా
పేర పెట్టుకున్న కలలు వరసబెట్టి తీర్చనా
లేకపోతె కాలమంత కలల మాపనా
ఇన్ని నాల్ల ప్రేమ వెలితి నింపనా

ఎండైనా...ఎండైనా
వానైనా...వానైనా
మన తీరే ఆగేనా

నిన్నైనా...నిన్నైనా
రేపైనా...రేపైనా
అరక్షనమే ఇకపైనా


*******   *******  *******


చిత్రం: MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం:

it's a family party
హేయ్ లైటు సెట్టు అక్కర్లే
మైకు సెట్టూతో పనిలే
మనింటినె చేసెద్దం డిస్కొ తెక్కులే
హేయ్ నైటు నైనం అక్కర్లే
బటికే ఎల్లకర్లే
ఇలా మనం క్లుబ్ ఐతే పబ్బ్ అవ్దా ఇల్లే

హేయ్ happy గా గడిపేలా ఏ ఫొరిన్ కో వెల్లలా
మనముండె చోటె ఊటి సింలా గడిపేద్దం టక్కర్లా
ఈ వంకె చాలె పిల్లా మనం మంకీ అయిపొయేలా
మననాపేదెవరు అడిగేదెవరు చలొ చలో చేసెద్దం గోలా

it's a family party
it's a family party
it's a family party
it's a family party

ఫాస్ట్ బీటె వేస్తావో...రుమాన్సు పాటె పెడతావో
సిగ్గెందుకు డాన్సె చేయ్ చుట్టు మనవాల్లే
కిందపడి దొర్లేస్తావొ..గాలిలో దొర్లేస్తవో
పైత్యమంత చూపించెయ్యి అంతా మన ఇల్లే
అరె జీన్స్ పాంట్ ఏస్కున్నా అరె రింగ రింగ వేస్కో
అరె పట్టూ చీరె కట్టూకున్న కెవ్వు కేక అంటు నువ్వు కుమ్మెస్కో

it's a family party
it's a family party
it's a family party
it's a family party

లిక్కరుంది సిద్దం గా...కిక్కు నీకె పంచంగా
నిక్కరేసుకొచ్చెయ్యి ఇల్లె బాడరులే
అరె ఉప్పు కొంచం ప్లస్ ఐనా కారమే మైనస్ ఐనా
ఇంటి వంట సాటేనా ఫివ్ స్టార్ హోటల్ లే
ఏ బౌండరీలే లేని ఈ బాండు నే లవ్ చేస్కో
అరె గుండెనిందై ప్రేమ పంచె సొంత వాల్లనే కంటి రెప్పలా చూస్కో

it's a family party
it's a family party
it's a family party
it's a family party


*******   *******  *******


చిత్రం: MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం:

యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ
నీ పేరె పాటయ్యింది పెదవులకూ
యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ
నా పైనె కురిసె ప్రతి వర్షం చిన్సుకూ
ఈ మాయలో నిన్నిలా ముంచినదుకు
నా పరిచయం వరమని పొగిడి చంపకు

యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ
నీ పేరె పాటయ్యింది పెదవులకూ
యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ
నా పైనె కురిసె ప్రతి వర్షం చిన్సుకూ

ఏ పువ్వుని చూస్తు ఉన్నా నీ నవ్వే కనిపిసుందే
ఎవరైన కోస్తుంటె మరి గొడవై పోతుందే
ఏ దారిలొ వెలుతు ఉన్నా నువ్వు యెదురొస్తున్నట్టుందె
ఎవరైన అడ్డొస్తే తెగ తగువైపోతుందే
విడి విడి గా మనమెక్కడ ఉన్న తప్పదు ఈ తంటా
ఒక్కటిగా కలిసున్నమంటె ఏ గొడవా రాదంటా

యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ
నీ పేరె పాటయ్యింది పెదవులకూ
యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ
నా పైనె కురిసె ప్రతి వర్షం చిన్సుకూ

నీకేమైందొ తెలిసెను నాకు యేమైందొ తెలిసెను నాకు
కాస్తైన చెప్పను ఆ వివరం నీకూ

కనుపాపలు రెండున్నయీ చిరు పెదవులు రెండున్నయీ
నా పక్కన ఉంటావా నా రెండొ మనసల్లే
ఆ తారలు ఎన్నున్నయీ నా ఊహలు అన్నున్నాయి
నా వెంటె వస్తావా నిజమయ్యె కలలల్లే
ఇప్పటి వరకు పాదం వేసిన అడుగులనే చూసాను
నడకే తెలియక ముందర నుంచి నీ వైపే వస్తున్నను

యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ
నీ పేరె పాటయ్యింది పెదవులకూ
యేమైందో తెలియదు నాకు ఏమైందొ తెలియదు నాకూ
నా పైనె కురిసె ప్రతి వర్షం చిన్సుకూ
నీకేమైందొ తెలిసెను నాకు యేమైందొ తెలిసెను నాకు
నిన్నిట్ట చూస్తు ఉంటె బావుంది నాకు




*******   *******  *******


చిత్రం: MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: బాలాజీ
గానం:

ఏ ఉంగరాల జుట్టితోనె ఊపిరంతా ఆపినావే
చిన్నీ my dear చిన్నీ
రంగురాల్ల కల్లతోటె బొంగరంలా తిప్పినావే
నాని my dear నాని
రెండు జల్ల రిబ్బనుతో కల్ల గంతే కట్టినావే
రెండు మూడు ఫొసులెట్టి తెల్లర్లు కల్లోకి వస్తుంటావే
అట్టగ నువ్వుంటె ఇట్టగ నా ఒల్లు గిటారులా మోగిందే
ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు
అరె ఏవండోయ్ నాని గారు..అబ్బ చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ once more-u

ఏయ్ పాల బూతు దగ్గరున్నా
వాలి బాలు ఆడుతున్నా
వచ్చె పోయె దారి లోనా నిన్నే చూస్తున్నా
మేడ మీద బట్టలంటూ వీదిలోన కూరలంటూ
ఎదొ సాకు చెప్పి ఇంట్లో నిన్నే వెతుకుతున్నా
బాత్ రూం లో నేను లవ్ సాంగు పాడెసి
నిన్నిట్ట పడగొట్టి తైలేసెసా
నీ పేరు పక్కింటి పిల్లడికె పెట్టెసి
బుగ్గల్ని గట్టీగ ముద్దెట్టెసా

ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు
అరె ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు

ఏయ్ ముద్ద బంతి పువ్వు లాగ ముద్దుగున్నవె బాగ
ముద్దుపెట్టుకొవాలే చూపించు జాగ
నువ్వు మందు బుడ్డి లాగ నేను నిప్పు పెట్టి లాగ
అంటుకుంటె ఇవ్వాలే crakarce పండగా
నా గుండె పట్టలూ యెక్కాయి పట్టీలు
నీ కొంగు జండాను ఎగరేసుకో
నీ ఇంటి తాలాలు నా బొడ్డులో దోపి
teasure లు లేకుండ బొమ్మెసుకో

ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు..అబ్బ చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ once more-u