Showing posts with label అమరన్ (2024). Show all posts
Showing posts with label అమరన్ (2024). Show all posts

అమరన్ (2024)






హే రంగులే (రంగులే)
హే రంగులే (రంగులే)
నీ రాకతో లోకమే
రంగులై పొంగేనే

వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకాశం అందేనే

స్నేహమే మెల్లగా గీతలే దాటేనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం

సమయానికి తెలిపేదెలా
మనవైపు రారాదని దూరమై పొమ్మని
చిరుగాలిని నిలిపేదెలా
మన మధ్యలో చేరుకోవద్దని

పరిచయం అయినది
మరో సుందర ప్రపంచం నువ్వుగా
మధువనం అయినది
మనస్సే చెలి చైత్రం జతగా

కలగనే వెన్నెల సమీపించేను నీ పేరుగా
హరివిల్లే నా మెడనల్లెను నీ ప్రేమగా

హే రంగులే (రంగులే)
హే రంగులే (రంగులే)
నీ రాకతో లోకమే
రంగులై పొంగేనే

హే వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకాశం అందేనే

స్నేహమే మెల్లగా గీతలే దాటేనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం



చిత్రం: అమరన్ (Amaran) (2024)
సంగీతం: జి వి ప్రకాష్ కుమార్
సాహిత్యం: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి 
గానం: అనురాగ్ కులకర్ణి , రమ్య బెహరా