Showing posts with label అడవి (2009). Show all posts
Showing posts with label అడవి (2009). Show all posts

అడవి (2009)

చిత్రం: అడవి (2009)
సంగీతం: ఇమ్రాన్ బాపి తూతుల్
సాహిత్యం:
గానం: నిక్కీ బి.జోషి , శ్వేతా పండిత్

కంటిపాప నమ్మలేనంతగా
కళ్ళముందు స్వర్గమొచ్చి వాలగా
ఎన్నడైన  లేని ఇంత వేడుక
ఎదలయన అంతులేని సంబరాలు చేయనా
మై మరచిపోతున్నా అందాన్ని చూస్తూనే
కల్లోన ఉన్న నేమో అన్నట్టే  అనిపించేలా
లోకాన్ని చూస్తూ నేనే
కేరింత కొడుతున్నాలే పసి పాప లాగ

కంటిపాప నమ్మలేనంతగా
కళ్ళముందు స్వర్గమొచ్చి వాలగా
ఎన్నడైన  లేని ఇంత వేడుక
ఎదలయన అంతులేని సంబరాలు చేయగా

మెల్లంగ  మెల్లంగ నీ ముగ్గులోదించి
మైకాన ముంచేసినావే ఇలా
వళ్ళంత తుళ్ళింత వచ్చిందె నీ వల్ల
ఈ కొత్త భావాన్ని పేరేంటట
నా లవ్ నీ రాకతో ఏదో అవుతుంది
మాయ చేస్తుంది నువ్వే కాదా నువ్వే కాదా
లోకమెంత అందమైందనే నిజం
అన్ని తెలిసీ ఇంతకాలమేమైంది అద్భుతం
ఇంత చిన్నదెందుకైంది జీవితం
నువ్వుంటే నాతో ఎన్ని జన్మలైన చాలవే నిజం

నా కళ్లతో నువ్వు లోకాన్ని చూస్తావ
ఈ అందమే సొంత మయ్యేందుకు
సొంత మయ్యేందుకు
నా మనసులో నువ్వు చేరాక ఇకపైన
నువు నేను అని అన్న పదమెందుకు
అవును అసలెందుకు
నువ్వుంటె నా వెంట చూపిస్తా జగమంత
ఉంటావ నాతోని నువ్విలాగ తోడునీడై తోడునీడై

కంటిపాప నమ్మలేనంతగా
అరెరె కళ్ళముందు స్వర్గమొచ్చి వాలగా