Showing posts with label Sumanth. Show all posts
Showing posts with label Sumanth. Show all posts

బోణి (2009)

చిత్రం: బోణి (2009)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రావణభార్గవి, హేమచంద్ర

కాదంటానా సరసం చేదంటానా
లేదంటానా అడిగిన దేదైనా
దారం లాగుతుంది మమకారం ఆపినా
దూరం తెంచమంది చెలి దేహం ఎదేమైనా

మేనక వయ్యారి మేనక చిలిపి కోరిక తీరక ఏంటా తికమక
వేడుక వలపు వేదిక కబురు పంపిన విందుకు రావే చక చక

హే నింగి నేల నీరు గాలి నిప్పయ్యే తమాషా
ఆగే వీలే లేదంటుంది నాలో పదనిస

హే అందర్లోని తొందర్లన్నీ అంతో ఇంతో ఆరా తీసా
అడగని బదులుగా తీర్చనా నీ నిషా

నా పరువం నీ కొరకే
హాయి పండించుకో
పెదాల తోటలో ఫలాలు పంచుకో
మరింత మోజులో నన్నేలుకో

ధగ ధగ చమక్కేదో లాగిందే గుచ్చి గుచ్చి చూసిందే
ధిమెక్కేలా నన్నేదో చేసిందే
ఘుమ ఘుమ గమ్మత్తేదో లాగిందే రెచ్చి రెచ్చి ఊగిందే
నచ్చి మెచ్చి నన్నే గిచ్చి రచ్చ రచ్చ చేసేసిందే

ఏదో దాహం తహతహ లాడే దాహం
నీపై మోహం తరగని వ్యామోహం
నీలా గుచ్చుకుంది విరి బాణం నన్నిలా
చాలా నొచ్చుకుంది చెలి ప్రాణం జాలే లేదా

హే పిల్లా ఏ పిల్లా ఏ పిల్లా నీ కంటి చూపుల లోపల ఏంటా సలసల
అంతలా అందాల వింతలా నీ ఒంటి సొంపుల కెంపుల కేంటా విల విల

హే పిల్లా నాలా ఘల్లంటుంది సింగారాల విణ
ఒళ్ళో వాలే బంగారంలా నీలో ఒదగనా
ఉయ్యాలూగే ఉల్లాసాన్ని నావైపిలా పిలవనా
పగడపు పెదవికి మధువులు పొదగనా


********   ********  *********


చిత్రం: బోణీ (2009)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యన్.సి.కారుణ్య , ప్రణవి

మొదటి చూపే నాలోన మల్లెలే చల్లెనా
చూపుతోనే రేగేనే ప్రేమనే భావన
చినుకులా కలిసేనా చిగురు తోడిగేనా
వరదలా ముంచేనా ఈ కలల ఆలాపన

మొదటి చూపే నాలోన మల్లెలే చల్లెనా
నీ చూపుతోనే రేగేనే ప్రేమనే భావన

వద్దు గురువా ప్రేమ గొడవా.. జిందగీ సిందరవందర
కళ్ళు మూసి బ్లైండ్ గా సుందరి మోజు లో దెబ్బైపోకుర
రోమియో లా జూలియట్ తో డ్యూయట్టు కి ఏందిర తొందర?
సిన్సియర్ గా నువ్విలా పోయిజన్ గ్లాస్ కు ఫ్లాట్ అయిపోకురో

వెన్నెల మెరుపంటి సన్నజాజి సోయగమంతా
నీ కందిస్తా నిధిగా
తియ్యని ఎరుపౌతా నీ పెదాలనంటే ఉంటా
పోలేనంటా విడిగా

ఎదలయ మురిసే పిలుపుల వలలో ముడిపడిపోతా చనువుగా
కుదురును చెరిపే కులుకుల జతలో వసంతాలు చూస్తా
అందీ ఆనందం చెరి కొంత

వద్దు గురువా ప్రేమ గొడవ జిందగీ కత్తెర కత్తెర
ఆచి తూచి బురదలో అడుగెయ్యొద్దురా అల్లరి గాకురో
మజ్ను లాగా ఫీల్ అయిపోయి లైలా తో లింకయిపోకురో
ప్రేమ ముదిరి పిచ్చిగా రోడ్డున పడితే పరువే పోద్దురో

లవ్ వద్దు బిడ్వ పిల్ల గోలా వద్దు
దణ్ణం పెడతా బిడ్వ పిల్లా గాలీ అస్లే వద్దు
లవ్ వద్దు బిడ్వ పిల్ల గోలా వద్దు
వద్దు వద్దు వద్దు వద్దు వద్దుర బాబు వద్దు

నాలో లోలోన నిన్ను బందీ చేసేస్తున్నా
మన్నిస్తావా మదనా
తెలుసా నా కన్నా ఎక్కువే నిను ప్రేమిస్తున్నా
తీరేదేనా తపన

ఒకరికి ఒకరై ఒదిగిన కధలో ఎవరెవరంటే తెలియదే
వెనుకటి రుణమే వదలని వరమై ఇలా చేరుకుందే
జన్మాలెన్నైనా చెలి నీదే

వద్దు గురువా ప్రేమ గొడవ జిందగీ గజిబిజి గత్తర
ఒళ్ళు మరిచే రేంజ్ లో సుడిలో పడవై మునిగే పోకురా
దేవదాసై మందు బాసై పార్వతికి పడిపోవద్దురా
జరగబొయే సంగతి హిస్టరీ మనకు ముందే తెలిపెరా


********   ********  *********


చిత్రం: బోణీ (2009)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సునీత, దీపు

నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన
అందువల్లే ఇలా చెలరేగెనా చిలిపి తపన
హే నువ్వే నువ్వే నా ఎద లయ పలికిన వలపు తననన
హే నువ్వే నువ్వే చొటడిగితే మనసున కాదనగలనా

నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన
అందువల్లే ఇలా చెలరేగెనా చిలిపి తపన

అద్దం ముందు కన్ను చూడమంటే నన్ను
ఇద్దరున్నాం అంటుందెలా
పువ్వులాంటి నన్ను చాకులాంటి నిన్ను
ఒక్క చోట చేర్చిందిలా
తళతళ మెరుపులా చేరుకుందే ప్రేమ వెలుగిలా
అల్లుకుందే కొంటె వలా
నేనంతా నువ్వైపోయేలా

ఇన్నినాళ్ళు నీలోఎక్కడొ ఏ మూలో
ఇంత ప్రేమ దాచావెలా
పెంచుకున్నదంతా నాతో పంచుకుంటే
చిట్టి గుండె మోసేదెలా
ప్రేమంటేనే వింత కదా
భారమైనా తెలికైపోదా
సత్యభామా పద పద
నీ తోడై నేనున్నా కదా

నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన
అందువల్లే ఇలా చెలరేగెనా చిలిపి తపన


********   ********  *********


చిత్రం: బోణీ (2009)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రీరాంచంద్ర , సుధా జీవన్

ఇట్స్ ఓకే లే
ఇది మాములే అనుకోవాలే
ఎదిరించాలే
చిరునవ్వుతో చీకటినోడించాలే
భరువెంతైనా అణువంతేలే
ఎదురీదాలే పద లే లే లే

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో
నీతో బంధం కలిపే సంతోషం ఎదో
సొంతం కాదా నేడే రేపో
ఆశ వెలుగు అదే ముందడుగు
నిశి నీడకు తలొంచకు

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

everything's gonna be alright
everything's gonna be alright

ఎండ వానలు జంట కానిదే..... ఏడు రంగులు రావులే
ఎద గాయం గేయమైతే ....వెదురైనా వేణువే
మదిలో తీపి కొలువుంటే
దరికే కలత రాదంతే
కన్నీరైనా పన్నీరైనా కనుపాపను నవ్విస్తే

ఆశ వెలుగు అదే ముందడుగు
నిశి నీడకు తలొంచకు

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

మోడువారిన కొమ్మ రెమ్మలు ....కొత్త చిగురే చేరదా
నిండు కడలే ఆవిరైనా .....నింగి చినుకై జారదా
కసిరే ఏకాంతమంటే ముసిరే స్నేహ పరిమళమే
నీలో ఎదిగే శూన్యంలో పిలుపేదో ఉందిలే

ఆశ వెలుగు అదే ముందడుగు
నిశి నీడకు తలొంచకు

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

యువకుడు (2000)



చిత్రం: యువకుడు (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బి.చరణ్


మైకం కాదిది నిన్నటి లోకం కాదిదీ
ఇవాళే చూస్తున్నట్టు ఉన్నది
ఊపిరినే ఇది ఊయలలూగిస్తున్నది
ఇదేదో మహా కొత్త సంగతి
గుండెలో గుట్టుగా ఉండనంటున్న వేడుక
అందరూ చూడగా ఉప్పెనవుతుండగా
అంతటా నవ్వులే పలకరిస్తున్న పండగ
అందరూ పూవులై స్వాగతిస్తుండగా

తేలుతున్నాను నీలి మేఘాలలో
మునుగుతున్నాను తొలిప్రేమ భావంలో
మేలుకున్నాను కలలోన ఉన్నానో

పాటలా ఉంది గాలి ఈలేసినా
ఆటలా ఉంది ఎవరేమి చేస్తున్నా
తోటలా ఉంది ఎటు వైపు చూస్తున్నా


**********  ********   *********


చిత్రం: యువకుడు (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: పార్థసారథి

నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా
చెరిగిన శాంతి చెదిరిన కాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా

కమ్మని జోలలతో చిననాటి ఆ కల
కమ్మిన జ్వాలలతో నిలిచింది కన్నులా
తీరని ఊహలా తీరని ఆశలా
అలనాటి జ్ఞాపకాల కోవెల
కోయిల పాటలా కోరిన కోటలా
పిలిచింది నన్ను కోటి గొంతులా
చెరిగిన శాంతి చెదిరినకాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా

నీ కొనవేలితో మొదలైంది ఈ కదం
నీ చనుబాలతో పదునైంది పౌరుషం
నీ ఎదలో లయ వినపడనీయక
నను ఆపకమ్మ కాలు తూలగా
నీ కనుపాపలో కాంతిని ఈయక
కరిగించకమ్మ కంటి నీరుగా
చెరిగిన శాంతి చెదిరిన కాంతి
కనపడు దారి వెతుకుతు సాగుతున్న వేళ
నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా

క్లాస్ మేట్స్ (2007)




చిత్రం: క్లాస్ మేట్స్  (2007)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున, అంజనా సౌమ్య


గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ - నిన్ను కలుసుకోనీ
నిన్ను కలుసుకోనీ విన్నవించుకోనీ ఇన్నాళ్ళ ఊసులన్నీ

నీలిమబ్బులో నిలచిపోకలా నింగి రాగమాల
మేలిముసుగులో మెరుపుతీగలా దాగి ఉండనేల
కొమ్మ కొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు వాలగ
ఇలకు రమ్మని చినుకుచెమ్మని చెలిమి కోరుకోనీ - నిన్ను కలుసుకోనీ

రేయిదాటని రాణివాసమా అందరాని తార
నన్నుచేరగ దారిచూపనా రెండు చేతులార
చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవిపైన చిందాడగ
తరలిరమ్మని తళుకులిమ్మని తలపు తెలుపుకోనీ - నిన్ను కలుసుకోనీ


********   *********   ********


చిత్రం: క్లాస్ మేట్స్  (2007)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చైత్ర , హేమచంద్ర

మౌనమెందుకు మాటాడవెందుకు
దూరమెందుకు దరిచేరవెందుకు
ఎదమారుమూల దాగివున్నమాట దాచి ఉంచకు
ఎదురైన వేళ అదుపుదాటి చేరవెందుకు

అంత బిగువా మెట్టుదిగవా ఎంత ఇష్టం ఉన్నా పైకి చెప్పవా
ఇంత తెగువా మాటవినవా కొంత కష్టమైనా కాస్త ఆగవా
మది నాకు చెప్పకుండ నీ వెంట పడ్డది
మన చేతిలోన ఉంద ఈ ప్రేమ పద్ధతి
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు

నందకిషోరా నవనీతచోరా నవమన్మదాధారా రారా నన్నేలుకోవేరా
చెయ్యందుకోరా శృంగారశూరా చేరంగరావేరా కృష్ణా చెట్టెక్కిదిగవేరా

రెచ్చగొట్టినా నవ్వుతున్నదే మత్తు కమ్మేసిందా కన్నెమనసుని
ఎంత కుట్టినా కెవ్వుమనదే పువ్వు పొమ్మంటుందా తేనెటీగని
నిను చూడకుంటె ప్రాణం ఇక నిలువనన్నది
పదునైన పూలబాణం నను తాకుతున్నది
దారేమి ఉన్నది నిను తప్పుకొందుకు
తప్పేమి ఉన్నది నిజమొప్పుకొందుకు


********   *********   ********


చిత్రం: క్లాస్ మేట్స్  (2007)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర

భూగోళంతో బంతాట ఆడాలంది మన పాదం
పూబాణంలా అందాలే వేటాడాలంది ప్రాయం
పడిలేస్తూ మనవెనకాలే తడబడిపోతుంటే కాలం
ఆనందోబ్రహ్మ అంది మన వేగం

కథలోకింక అద్భుతం ఎదురయేదాక వెతుకుదాం
పదమందీ నవయవ్వనంలో పసితనం
దొరుకుతుందా అది అడగదే మన నమ్మకం
కలనైనా తరిమేగుణం మన లక్షణం
నిజమైనా కలలాంటిదే మనకీక్షణం

అదుపులోలేని పరుగులం రసతరంగాన ఉరుములం
మనకింకా తెలియదు కద భయమన్నది
పిల్లగాలై ఎదురేగుదాం గగనానికి
ఎగరేద్దాం చిరునవ్వుని నలువైపులా
స్వాగతిస్తాం స్వర్గాలనే మనవైపిలా

మధుమాసం (2007)



చిత్రం: మధుమాసం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: రంజిత్ , రీటా


పల్లవి:
వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా
ఈ కాంత కోకిలా వలచినా పిలిచినా ప్రియతమా
వసంతం వాయిదా పడైనా రాదుగా

చరణం: 1
విరజాజి పూలే విరహాన రాలే
మలిసందే వేళే తెలవారి పోయే
పొడి ఇసుక దారులలో
మన అడుగు జాడలలో
గతము తలచి కలిసి నడిచి
వలపు కలయిక కలా
నిదుట నిలచి ఎదను తెరచి
క్షణము దొరకవు కదా

వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా

చరణం: 2
బస్తీల నిండా బృందావనాలే
ముస్తాబు మీద హస్తాక్షరాలే
ఎదురసలు చూడనిది
మనము అనుకోనిదిది
మనసు అలుపు మమత అలుకు
జతను కలిపెను కదా
ఎవరికెవరు ఒకరికొకరు
ఇపుడె తెలిసెను కదా

వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా
ఈ కాంత కోకిలా వలచినా పిలిచినా ప్రియతమా
వసంతం వాయిదా పడైనా రాదుగా

సత్యం (2003)

చిత్రం: సత్యం (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి, రవివర్మ, రమేష్, పల్లవి
నటీనటులు: సుమంత్, జెనీలియా,  తనురాయ్
దర్శకత్వం: సూర్య కిరణ్
నిర్మాత: అక్కినేని నాగార్జున
విడుదల తేది: 19.12.2003

పిలిచిన పలకదు ప్రేమా
వలచిన దొరకదు ప్రేమా
అందని వరమే ప్రేమా
మనసుకు తొలికలవరమా
ప్రేమే మధురం ప్రేమే పదిలం
ఏమీకాదో క్షణికం
అన్నీ తానే ప్రణయం

ఐ లవ్ యూ లవ్ యూ రా (4)

పిలిచిన పలకదు ప్రేమా
వలచిన దొరకదు ప్రేమా

చరణం: 1
వలపును చినుకుగ భావించా
అది నా తప్పుకదా
వరదని తెలిసిన ఈ తరుణం
యాతన తప్పదుగా
ఎన్నేళ్లో ఎదురీత ఎన్నాళ్లీ ఎదకోత
ప్రేమే ఆట కాదు గెలుపు ఓటమి లేదు
లాభం నష్టం చూడకు ప్రేమవదు
తప్పుంటే అది ప్రేమది కాదే
తప్పంతా ప్రేమించిన నాదే
ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ

పిలిచిన పలకదు ప్రేమా
వలచిన దొరకదు ప్రేమా

చరణం: 2
మనసును తరిమిన చీకటులే చెలిమిగ మారేనా
ఇదివరకెరుగని ఈ బాధే కొలిమైపోయేనా
ఆపాలి ఏదోలా చెబుతావా ప్రియురాలా
నీడై నీతో పాటు సాగాలనుకున్నానే
నేడే తెలిసెను నాకు ఓ చెలియా
నింగీ నేల కలవవనీ నీడే మనిషిని తాకదనీ
ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ

ఆపిన ఆగదు ప్రేమా
దాచిన దాగదు ప్రేమా
మనసును కలుపును ప్రేమా
మహిమలు చూపును ప్రేమా
ప్రేమే గగనం ప్రేమే సహనం
ప్రేమే కాదా ఉదయం
ప్రేమించాలి హృదయం

ఐ లవ్ యూ లవ్ యూ రా (12)




*********  *********  ********



చిత్రం: సత్యం (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: వేణు

ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్
ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే
ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్
ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు
కనులలో దాచిన కావ్యమే నువ్వు

కోటి కలలను గుండెలోతులో దాచి ఉంచిన నేస్తమా
వేయి అలలుగ నిన్ను చేరగ కదులుతున్నా ప్రాణమా
వెన్నెల్లో గోదారి నువ్వేనా వయ్యారి నే నీటి చుక్కై పోవాలి
నవ్వేటి సింగారి వెళ్ళొద్దు చేజారి నిను చేరి మురిసిపోవాలి
చిగురాకు నువ్వై చిరుజల్లు నేనై
నిను నేను చేరుకుంటే హాయి నిను నేను చేరుకుంటే హాయి

నీవు ఎదురుగ నిలచి ఉండగ మాట దాటదు పెదవిని
నన్ను మృదువుగ నువ్వు తాకగ మధువు శోకెను మనసుని
నీ చెంత చేరాలి స్వర్గాన్నే చూడాలి నే నీలో నిండిపోవాలి
నీ కంటి చూపుల్లో నీ ప్రేమ వానల్లో నిలువెల్ల నేనే తడవాలి
నాలోని ప్రేమ ఏనాటికైన నీకే అంకితమవ్వని నీకే అంకితమవ్వని

ఐ యామ్ ఇన్ లవ్ ఐ యామ్ ఇన్ లవ్  ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిను చేరడం కొరకే



*********  *********  ********



చిత్రం: సత్యం (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: వేణు

మధురమె మధురమె మధురమె
ఈ కనులకి కలలూ మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వే...
నీ నవ్వే తేనెల వానై...
నా కోసం వస్తే మధురమే
ఆ... నన్నే తడిపేస్తే మధురమే

మధురమె మధురమె మధురమె
ఈ కనులకి కలలూ మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వే...
నీ నవ్వే తేనెల వానై...
నా కోసం వస్తే మధురమే
ఆ... నన్నే తడిపేస్తే మధురమే

చరణం: 1
నీ కోసం నే రాసే చిరు పాటైనా మధురమే
నా కోసం నువు పలికే అరమాటైనా మధురమే
నీ కోసం నే రాసే చిరు పాటైనా మధురమే
నా కోసం నువు పలికే అరమాటైనా మధురమే
లిపిలేని సడిలేని ఆ కన్నుల భాష మధురమే
హృదయాన్ని మురిపించె
ఆ సాగర ఘోష మధురమే
మధుమాసం మధురమే
నీ దరహాసం మధురమే
ఉంటే నువ్వుంటే ఆ శూన్యం అయినా మధురమె...
మధురమే

మధురమె మధురమె మధురమె
ఈ కనులకి కలలూ మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వే...
నీ నవ్వే తేనెల వానై...
నా కోసం వస్తే మధురమే
ఆ... నన్నే తడిపేస్తే మధురమే

చరణం: 2
సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే
సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే
ఉదయాన ఉదయించే
ఆ సూర్యుడి ఎరుపు మధురమే
రేయంత వికసించే
ఆ వెన్నెల తెలుపు మధురమే
చెక్కిలి మెరుపు మధురమే
చెలి కాటుక నలుపు మధురమే
రాల్చే కను రాల్చే ఆ కన్నీరైనా మధురమె.
మధురమే

మధురమె మధురమె మధురమె
ఈ కనులకి కలలూ మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వే...
నీ నవ్వే తేనెల వానై...
నా కోసం వస్తే మధురమే
ఆ... నన్నే తడిపేస్తే మధురమే




*********  *********  ********




చిత్రం: సత్యం (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరబట్ల రవికుమార్
గానం: చక్రి

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
కాళిదాసు లాగ మారి కవితే రాశేసా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా
ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా
ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా
పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైనేశా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
కాళిదాసు లాగ మారి కవితే రాశేసా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా

ట్రిపులెక్స్ రమ్ లోన కిక్ లేదు హెల్లొ మైనా
నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా
సన్ లైట్ వేల నుండి మూన్ లైట్ వెళ్ళేదాకా
ఫుల్ టైము నా గుండెల్లో హార్ట్ లన్ని నీవేగా
ఓ లలనా ఇది నీ జాలమా
నీ వలన మనసే గాయమా
కుదురేమో లేదాయే నువు నమ్మవు గాని కలవరమయే

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
కాళిదాసు లాగ మారి కవితే రాశేసా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా

కో అంటే కోటిమంది అందగట్టెలున్నా గాని
నీ జంటే కోరుతుంటే దాచుతావా కాలాన్ని
క్రేజీ గా ఉంటే చాలు ప్రేమ లోన పడతారండి
ట్రూ లవ్ చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓ మగువా నీకే న్యాయమా ఎదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయే నీ మాటలు లేక మోడై పోయే

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
కాళిదాసు లాగ మారి కవితే రాశేసా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా
దేవదాసు లాగ మారి గడ్డం పెంచేశా






*********  *********  ********




చిత్రం: సత్యం (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: వాసు, సూర్యకిరణ్

నాటు కొట్టుడు నీటు కొట్టడు కలిపి కొట్టాలి
గగనం అదిరిపడే సూరీడే తోంగిచుడాలి
బీర్ రమ్ము విస్కీ కొట్టి నిజం చెప్పాలి
అరెరే గుపెడంత గుండె విప్పి ప్రేమ పంచాలి
ఓరి దేవుడా లోకం మారేర
ఓరి దేవుడా లోకం మారేర
ఓరి దేవుడా లోకం మారేర
ఓరి దేవుడా లోకం మారేర

ఓరి దేవుడా లోకం మారేర
ఓరి దేవుడా లోకం మారేర
లాలా లల్లలా లల లల లల్ల లా
లాలా లల్లలా లల లల లల్ల లా

స్లీవ్ లెస్సు మిడ్డి స్కట్ సిటీ పాపలు
అబ్బబ్బ పబ్బులలో మందు కొట్టి కల్చరంటారు
ఇంగ్లీష్ కల్చరంటారు
కనపడితే పార్టీ అని కౌగిలిస్తారు
పార్టీ ముగిసినాక దొంగ ముఖం చాటేస్తారు
అరెరె చాటేస్తారు
ఓరి దేవుడా లోకం మారేర
ఓరి దేవుడా లోకం మారేర
ఓరి దేవుడా లోకం మారేర

బెంజ్ కారు రోడ్డు నడుమ వెళ్తుంటుంది
రోడ్డు వేసినోడు రోడ్డు సైడ్ జీవిస్తాడు
గుడిసెలో జీవిస్తాడు
చిన్న గుడిసెలోనే పెద్ద మనసుంటుంది
పెద్ద ప్యాలస్ లో డబ్బు తప్ప ఏముంటుంది
ప్రేమే కరువవుతుంది
ఓరి దేవుడా లోకం మారేర
ఓరి దేవుడా లోకం మారేర
ఓరి దేవుడా లోకం మారేర
ఓరి దేవుడా లోకం మారేరా

ఎండ ఉన్నంత వరకే నీడకు విలువ
మరీ ఊపిరున్నంత వరకే మనిషికి విలువ
రేపు మాపు పోయేటి ఊపిరి కోసం
మరీ ఎందుకు గొడవ స్నేహం చెయ్యర గురువ
ఓరి సోదర ఏంజాయ్ చెయ్యార
ఓరి సోదర ఏంజాయ్ చెయ్యార
ఓరి సోదర ఏంజాయ్ చెయ్యార
ఓరి సోదర ఏంజాయ్ చెయ్ రా చెయ్ రా

అలా కొట్టు ఇలా కొట్టు కోకచాటు అమ్మాయ్ తోటి ప్యూచర్ లాంటి
అలా ఇలా అలా ఇలా ఆ
పర్స్ ఫుల్ ఉంటేనే లవ్వంటారు
నువ్వే ప్రాణమంటారు హార్ట్ బీటు అంటారు
అబ్బబ్బా చంపేస్తారు
ఫుడ్ బెడ్ కిడ్డు అన్ని కలరిస్తారు
పర్స్ కాళి అయితే చాలింకా కనుమరుగవుతారు
చ్చి చ్చి పో అంటారు
ఓరి దేవుడా లోకం చూడార
ఓరి దేవుడా లోకం చూడార
ఓరి దేవుడా లోకం చూడార
బైక్ మీద షికారంటే నో అంటారు
ఏసి కారుంటే లేడీసే సైంటారు
అబ్బా రా అంటారు
మెంటెనెన్స్ తగ్గిపోతే బ్రదరంటారు
చేతిలో కార్డ్ పెట్టి తన పెళ్లికి రమ్మంటాంరు
అన్నయ్య రా అంటారు
ఓరి దేవుడా లోకం మారేర
ఓరి దేవుడా లోకం మారేర
ఓరి దేవుడా లోకం మారేర
దేవుడా ఓ ఓ దేవుడా దే దే దేవుడా
అయ్యయో దేవుడా ఏ ఏ దేవుడా
ఓరీ దేవుడా ఓరీ ఓరీ ఓరీ దేవుడా
దే దే దేవుడా దే దే దేవుడా
దేవుడా దేవుడా అ అ ఆ
ఎస్క్యూజ్ మి నన్ను ఎవరైనా పిలిచారా





*********  *********  ********




చిత్రం: సత్యం (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరబట్ల రవికుమార్
గానం: సూర్యకిరణ్, వెంకట రమణ, రాజేష్

రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా
మావాడి వేడి నాటు దెబ్బ చూతువా
రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా తిందువా
మావాడి వేడి నాటు దెబ్బ చూతువా చూతువా
దమ్ములున్న మొగాడదిగొ వచ్చెరా వచ్చెరా
దుమ్ము దులిపేయడమే నెక్స్ట్ రా నెక్స్ట్ రా

రాతిరి పది గంటలకు సత్యమన్న దెబ్బలకు
లైటేెస్కో హొయ్ లైటాప్కో హొయ్
లైటేెస్కో హొయ్ లైటాప్కో
లైటేెస్కో  లైటాప్కో లైటేెస్కో  లైటాప్కో
ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్...

రెండు మెక్క  అ
రెండు మెక్క  అహా
రెండు మెక్క  ఓహో
ఆ ముందుకెళ్లహ్

రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా తిందువా
మావాడి వేడి నాటు దెబ్బ చూతువా చూతువా
దమ్ములున్న మొగాడదిగొ వచ్చెరా వచ్చెరా
దుమ్ము దులిపేయడమే నెక్స్ట్ రా నెక్స్ట్ రా

బీరేసేయ్ బాదేసేయ్ జిన్నేసేయ్ దున్నేసేయ్
రూమ్మేసేయ్ రక్కేసేయ్ హే విస్కెసెయ్ పిస్కెసెయ్
బాదేసేయ్ రూమ్మేసేయ్ దున్నేసేయ్ చిందేసేయ్
ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్ ఎసెయ్

రెండు మెక్క  అహా
రెండు మెక్క  ఓహో
రెండు మెక్క  అద్దీ...
రెండు మెక్క  యహ...

రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా తిందువా
మావాడి వేడి నాటు దెబ్బ చూతువా చూతువా

ఆ ఒకటి పీకు ఆ రెండు పీకు ఆ మూడు పీకు
ఒకటి పీకు రెండు పీకు హాఫ్ పీకు ఫుల్ పీకు
వీక్ గా ఉన్నావు రెండు పెగ్గులు పీకుతావా
హె హె నో థాంక్స్ అన్నా

రెండు మెక్క  అహా
రెండు మెక్క  అహ్...
రెండు మెక్క  ఓహో

రెండు మెక్క జొన్న పొత్తులున్నాయ్ తిందువా తిందువా
మావాడి వేడి నాటు దెబ్బ చూతువా చూతువా

అబ్బా అబ్బా అబ్బా అబ్బా ఏందబ్బా
ఎందుకబ్బా ఎప్పుడబ్బా ఎలా అబ్బా
ఏ ఏందబ్బా ఎందుకబ్బా ఎప్పుడబ్బా
ఎలా అబ్బా ఎక్కడబ్బా ఇక్కడబ్బా
హే... ఎంత ముద్దుగా చెప్పావో నీ యబ్బా



*********  *********  ********


చిత్రం: సత్యం (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: విశ్వా
గానం: విశ్వా, కౌశల్య

కుచ్ కుచ్ పానా హైతో ఫిక్సిట్
చక చక చక జస్ట్ డు ఇట్
గో గో జస్ట్ గో వెన్ గెట్ ఇట్
దునియా మనదేరా డేమిట్
ఫిక్స్ ఇట్ డు ఇట్ కేర్ ఇట్ జానీ
యు మేక్ యువర్ రూల్స్ హనీ
గోన్న మేక్ థింగ్స్ హేపెన్ ట్రూలీ
నో వన్ కెన్ స్టాప్ యూ రియల్లీ

మాటలొద్దురా ఓ సారి చేసి చూపరా
కొత్త దారిలో ఓ మారు దూసుకెళ్లరా
నీ చేతుల్లోన తెగువే ఉంటే
విజయం నీ సొంతం
నీ చెమటే చిందగ వచ్చిన
ఫలితం ఇచ్చును ఆనందం

కుచ్ కుచ్ పానా హైతో ఫిక్సిట్
చక చక చక జస్ట్ డు ఇట్
గో గో జస్ట్ గో వెన్ గెట్ ఇట్
దునియా మనదేరా డేమిట్
ఫిక్స్ ఇట్ డు ఇట్ కేర్ ఇట్ జానీ
యు మేక్ యువర్ రూల్స్ హనీ
గోన్న మేక్ థింగ్స్ హేపెన్ ట్రూలీ
నో వన్ కెన్ స్టాప్ యూ రియల్లీ

నడి సంద్రపు లోతుల్లో
కడదాకా మునిగేవో
ముత్యాలను వెలికి తెచ్చి
వెలగాలంటా నీవు
కొట్టిన తిట్టిన గెలవలే రో
గెలిస్తే అందరు ఎదగలరో
ఇల తాకిన బంతైనా
రెండింతలు పైకెగసి
ఆకాశపు అంచే తాకి
తేలేనంట చూడు

యు కెన్ మేక్ ఇట్ ట్రూ
స్ట్రగుల్ ఈజ్ విత్ ఇన్ యు
సోల్ ఈజ్ లివింగ్ ఫర్ యూ
గోన్న మేక్ ఏ మూవ్ నౌ
ఐ విల్ టేక్ ఏ ఛాన్స్ నౌ
డూ మేక్ ఏ డ్రీమ్స్ కం ట్రూ
నీ చేతుల్లోన తెగువే ఉంటే
విజయం నీ సొంతం
నీ చెమటే చిందగ వచ్చిన
ఫలితం ఇచ్చును ఆనందం


కుచ్ కుచ్ పానా హైతో ఫిక్సిట్
చక చక చక జస్ట్ డు ఇట్
గో గో జస్ట్ గో వెన్ గెట్ ఇట్
దునియా మనదేరా డేమిట్

పసి మనసే ఎలిమెంట్రీ
బ్రతుకాటలో న్యూ ఎంట్రీ
ఉదయించే కిరణం కోసం
చూసేనే పైకేసి
ప్రేమ దోమ ఆశపడ్డ గామా
అత్త మామా పక్కింటి భామ
వయసంతా గడిపేసి
జీవితమే నడిపేసి
వెనకొకటే చూస్తారంటా
ముసలోళ్లంతా నవ్వేసి
యంగ్ జనరేషన్ తగ్గానే రీజన్
నడిచేరు ముందుకు చూస్తూనే
విల్ మూవ్ ద నేషన్
క్రీయేట్ సెన్సేషన్
ఎదురేది లేదని అంటూనే

నీ చేతుల్లోన తెగువే ఉంటే
విజయం నీ సొంతం
నీ చెమటే చిందగ వచ్చిన
ఫలితం ఇచ్చును ఆనందం

కుచ్ కుచ్ పానా హైతో ఫిక్సిట్
చక చక చక జస్ట్ డు ఇట్
గో గో జస్ట్ గో వెన్ గెట్ ఇట్
దునియా మనదేరా డేమిట్
ఫిక్స్ ఇట్ డు ఇట్ కేర్ ఇట్ జానీ
యు మేక్ యువర్ రూల్స్ హనీ
గోన్న మేక్ థింగ్స్ హేపెన్ ట్రూలీ
నో వన్ కెన్ స్టాప్ యూ రియల్లీ

మాటలొద్దురా ఓ సారి చేసి చూపరా
కొత్త దారిలో ఓ మారు దూసుకెళ్లరా
ఫిక్స్ ఇట్ డు ఇట్ కేర్ ఇట్ జానీ
యు మేక్ యువర్ రూల్స్ హనీ
గోన్న మేక్ థింగ్స్ హేపెన్ ట్రూలీ
నో వన్ కెన్ స్టాప్ యూ రియల్లీ