Showing posts with label Raghu Kunche. Show all posts
Showing posts with label Raghu Kunche. Show all posts

పలాస1978(2020)




నీ పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
నీ పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
హేయ్..! పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
నీ పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
నీ పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
మీ బావ గారు వచ్చేటి వేళ… ఆ
నీకు బంతి పూలు తెచ్చేటి వేళ…ఆ ఆ
మీ బావ గారు వచ్చేటివేళ… ఆ
నీకు బంతి పూలు తెచ్చేటివేళా…
మీ మరిదిగారు వచ్చేటి వేళ… ఓసి
నీకు మందారం తెచ్చేటి వేళ… ఆ ఆ
మీ మరిదిగారు వచ్చేటి వేళ… నీకు మందారం తెచ్చేటి వేళ… ఆ ఆ
మీ మావగారు…ఆ… మావగారు
మీ మావగారు వచ్చేటి వేళ…
నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ… ఆ ఆ
మీ మావగారు వచ్చేటి వేళ… నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళా…
నాది… నాది
నాది నక్కిలీసు గొలుసు…
నీ పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
నీ పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
నీకు కడియాలు తెచ్చేటి వేళా… నీకు పొనకమ్మలు తెచ్చేటి వేళా
నీకు కడియాలు తెచ్చేటి వేళా… నీకు పొనకమ్మలు తెచ్చేటి వేళా
నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటి వేళా… హూ… అది పెట్టుకుని వచ్చేటి వేళా… ఛీ
నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటి వేళా… అది పెట్టుకుని వచ్చేటి వేళా
నీకు పట్టుచీర… అబొబ్బొ పట్టుచీర
పిల్లా పట్టుచీర తెచ్చేటి వేళ… అది కట్టుకుని వచ్చేటి వేళా
నీకు పట్టుచీర తెచ్చేటివేళా… అది కట్టుకుని వచ్చేటివేళా
నాది… నాది
నాది నక్కిలీసు గొలుసు…
నీ పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
హెయ్… పక్కన పడ్డాది లేదు సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
నీ పక్కన పడ్డాది లేదో సూడవె పిల్లా
నాది నక్కిలీసు గొలుసు…
నాది… నాది… నాది… నాది… నాది


సినిమా: పలాస1978(2020)
సంగీతం : రఘు కుంచె
గానం : రఘు కుంచె
సాహిత్యం : ఉత్తరాంధ్ర జానపదం.

దేవుడు చేసిన మనుషులు (2012)

చిత్రం: దేవుడు చేసిన మనుషులు (2012)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: శ్రేయ గోషల్


నువ్వేలే నువ్వేలే నేనంటే నువ్వేలే
నువ్వేలే నువ్వేలే నాకన్నీ నువ్వేలే
నిన్ను ఏనాడో కలిసుంటే బాగుండేది
ఇంత భారంగా ఇన్నాళ్లు లేకుండేది
నువ్వేమో నాకనీ నేనేమో నీకనీ
రాశాడా రాతనీ చేతుల్లో ఈ గీతనీ

చరణం: 1
నువ్వే రాకుండా ఇంత దూరం నడిచాన అంటే ఏంటో చిత్రంగా ఉంది నాలో నాకే
నువ్వే లేకుండా ఇంత కాలం బతికాన అంటే  ఏమో కలనైన నమ్మే వీలే లేదే
ఎన్నడు ఎరుగని నవ్వులని కన్నుల చేరని వెన్నెలనీ
అందించావని ఆనందిస్తా నీ తోడులో
చీకటి దాచిన వేకువని మనసుకి తెలియని వేడుకని
నువ్వొచ్చాకనే చూస్తున్నా కద నీ ప్రేమలో

చరణం: 2
ఏదో తింటున్నానంతే ఏదో ఉంటున్నానంతే
నువ్వే ఎదురవ్వక పొతే రోజు ఇంతే
నాకే నే బరువై పోయా నాలో నే కరువై పోయా
నిన్నే కలిసుండకపొతే చావాలంతే
గాల్లో రాతలు రాసుకొని నాలో నే మాట్లాడుకొని
గడిపేశానని గుర్తే రాదిక నీ నీడలా
నాకేతోడు దొరకదని  ఒంటరితనమే నేస్తమని
అనుకుంటే అది నా తప్పే కదా ఈ హాయిలో
నిన్ను ఏనాడో కలిసుంటే బాగుండేది
ఇంత భారంగా ఇన్నాళ్లు లేకుండేది
నువ్వేమో నాకనీ నేనేమో నీకనీ
రాశాడా రాతనీ చేతుల్లో ఈ గీతనీ

పలాస 1978 (2019)





చిత్రం : పలాస 1978 (2019)
సంగీతం : రఘు కుంచే
సాహిత్యం : ఉత్తరాంధ్ర జానపదం
గానం : రఘు కుంచే

నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
హేయ్ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు

నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు

నీ బావ గారు వచ్చేటివేళ
నీకు బంతి పూలు తెచ్చేటివేళా
నీ బావ గారు వచ్చేటివేళ
నీకు బంతి పూలు తెచ్చేటివేళా

నీ మరిదిగారు వచ్చేటివేళ
నీకు మందారం తెచ్చేటివేళా
నీ మరిదిగారు వచ్చేటివేళ
నీకు మందారం తెచ్చేటివేళా

నీ మామగారు
పిల్లా మావగారు
అరెరె మామగారు వచ్చేటివేళా
నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా
మీ మామగారు వచ్చేటివేళా
నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా
నాదీ.. నాదీ..
నాది నక్కిలీసు గొలుసు...

నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు

నీకు కడియాలు తెచ్చేటివేళా
నీకు కొనకమ్మలు తెచ్చేటివేళా
నీకు కడియాలు తెచ్చేటివేళా
నీకు కొనకమ్మలు తెచ్చేటివేళా

నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటివేళా
అది పెట్టుకొని వచ్చేటివేళా
నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటివేళా
అది పెట్టుకొని వచ్చేటివేళా
నీకు పట్టుచీర..
అబ్బబ్బో పట్టుచీర
పిల్లా పట్టుచీర తెచ్చేటివేళా
అది కట్టుకొని వచ్చేటివేళా
నీకు పట్టుచీర తెచ్చేటివేళా
అది కట్టుకుని వచ్చేటివేళా
నాది.. నాది..
నాది నక్కిలీసు గొలుసు...


నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
హోయ్.. నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
నాది.. నాది.. నాది.. నాది
నాది నాది నాది నాది నాది
నాది నాది నాది నాది నాదే..ఏయ్..

******* ************* ***********


చిత్రం : పలాస 1978 (2019)
సంగీతం : రఘు కుంచె  
సాహిత్యం : లక్ష్మి భూపాల 
గానం : బాలు, బేబి పసల

ఓ సొగసరి ప్రియలాహిరి
తొలకరి వలపుల సిరీ
ఓ గడసరి తెలిసెనుమరి
పరువపు శరముల గురీ
నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు
కానీ కవ్విస్తావు అదేంమరి
వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు
నన్నేఇమ్మంటావు పోవోయ్ మరీ

అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో

చలివేళలో చెలి ఏలనే
సొగసుకు బిడియపు ముసుగూ
ఈ వేళలో ఆగావని
అతిగా ప్రణయం విసుగు
విరహమంటాను నేను
కసురుకుంటావు నువ్వు
సరసమేలేదు సయ్యాటలో
నేను వింటూనేఉంటే
ఏదో అంటావునువ్వు
నీతో తంటాలు సిగ్గాటలో

అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో

చెలి కురులలో జలపాతమే
తనువొకధనువై మెరుపూ
ప్రణయాలలో ఈమాటలే
మనసుకు ముచ్చటగొలుపు
వెండి వెన్నెల్లొనువ్వు
నిండు జాబిల్లినవ్వు
కన్నెచెక్కిళ్ళు నాకోసమే
ఎంతసేపంటు నన్ను
పొగుడుతుంటావు నువ్వు
ఆపు చాలింక నచ్చావులే..

అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో

ఓ సొగసరి ప్రియలాహిరి
తొలకరి వలపుల సిరీ
ఓ గడసరి తెలిసెనుమరి
పరువపు శరముల గురీ
నువ్వే రమ్మంటావు వస్తే పొమ్మంటావు
కానీ కవ్విస్తావు అదేంమరి
వస్తే ముద్దంటావు హద్దే దాటేస్తావు
నన్నేఇమ్మంటావు పోవోయ్ మరీ

అహ్హహ హహ్హ ఆహాహా
ఒహ్హోహ్హో హోహో ఓహోహో
అహ్హహ హహ్హ ఆహాహా

ఒహ్హోహ్హో హోహో ఓహోహో

బంపర్ ఆఫర్ (2009)



చిత్రం: బంపర్ ఆఫర్ (2009)
సంగీతం: రఘు కుంచె
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రఘు కుంచె , సవితా రెడ్డి


పల్లవి:
బుజ్జి కొండ చూడకుండా
ఉండలేనే ఐ లవ్ యూ
ఐ డోంట్ ట్రస్ట్ యూ...
నువ్వంటే నాకిష్టం కాబట్టే నీకోసం
నా గుండె పాడే పాట
ఐ లవ్ యూ... నో నో నో...
బుజ్జి కొండ చెప్పకుండా
ఉండలేనే ఐ లవ్ యూ
నువ్వెంతో ముద్దొచ్చి పట్టిందే ఈ పిచ్చి
నా గుండె పాడే పాట ఐ లవ్ యూ
హో... యా...

చరణం: 1
నువ్వు తప్ప వేరే దిక్కు లేదే... అబ్బఛా
నువ్వు పక్కనుంటే కిక్కే వేరే
నాకు ఇంతకూడ సిగ్గు లేదే
ఐ విల్ కిక్ యూ...
ఎంత తిట్టుకున్నా ఫరవాలేదే
నెత్తిమీద పెట్టి నిన్ను చూసుకుంటా
రోకలెత్తి నన్ను దంచమాకే... కొండ.....
ఐ హేట్ యూ...

చరణం: 2
దిల్ కవ్వమెట్టి తిప్పినావే... నేనా
గోళ్లు పెట్టి గుండె రక్కేశావే... నో వే
ఇంత దూరం వచ్చి
కాదంటావే... యస్ యస్
నన్ను చేసుకుంటే బాగుంటావే
రెండు కాళ్లు మొక్కి కళ్లకద్దుకుంటా
ఏట్లో ఎల్లకిల్ల తొయ్యమాకే... కొండ.....
పోరా బోండా...
కొండ....