Showing posts with label ప్రియమైన నీకు (2001). Show all posts
Showing posts with label ప్రియమైన నీకు (2001). Show all posts

ప్రియమైన నీకు (2001)

నేలనడిగా పువ్వులనడిగా 
నీలి నింగి చుక్కలనడిగా ప్రేమించిన చెలి ఏదనీ
గాలినడిగా మబ్బులనడిగా
రామచిలక రెక్కలనడిగా క్షే మంగా ఉందా అని

ఐనా ఇంతవరకు ఆచూకి లేక 

తెగిన గాలిపటమై తిరిగా ఎటో దారితోచక ఆగలేక 
నా మనసు దోచిన ఆ ప్రేమా
ఏనాటికి చూపునో చిరునామా ॥


చరణం : 1
ఇపుడే ఇటు వెళ్లిందంటూ చిరుగాలి చెప్పింది
నిజమే ఇంకా గాలుందో చెలి పరిమళం ఉంది
ఇందాక చూశానంటూ సిరిమల్లె చెప్పింది
ఇదిగో అంటూ తనలో చెలి చిరునవ్వే చూపింది 
ఈ గుడిగంటల్లో తన గాజుల సడి వింటుంటే
తను ఈ కోవెల్లో ఇప్పటివరకు ఉన్నట్టే 
ఎటుచూసినా తన జాడలే ఎటువెళ్లిందో ఈ లోపునే ॥

చరణం : 2
నడయాడే దీపంలాంటి ఆ రూపం చూస్తుంటే
కనుపాపల్లో కలకాలం కొలువుండిపోతుంది 
నడకైన నాట్యంలాగే అనిపించే తన వెంటే
దివిలో ఉండే మెరుపే దిగి వచ్చిందనిపిస్తుంది
ఎందరో చూశారో కలగన్నామనుకున్నారో
అందుకనే ఏమో తను నిజం కాదనుకున్నారో 
బతిమాలినా బదులివ్వదే
తను ఉందంటూ నను నమ్మరే ॥ 



చిత్రం : ప్రియమైన నీకు (2001)
రచన : సిరివెన్నెల
సంగీతం : శివశంకర్
గానం : ఎస్.పి.బాలు

*******************************************



మనసున ఉన్నదీ చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి
బైటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో
తెలపక పోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా

ల ల ల లా.... ల ల ల ల ల ల లా.....
ల ల ల లా.... ల ల ల ల ల ల లా.....

చింత నిప్పైన చల్లగ ఉందని
ఎంత నొప్పైన తెలియలేదని
తననే తలుచుకునే వేడిలో
ప్రేమ అంటేనె తియ్యని బాధని
లేత గుండెల్లొ కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతోందా నా ప్రియమైన నీకు
నా ఎద కోత అని అడగాలనీ
అనుకుంటు తన చుట్టూ మరి తిరిగిందనీ
తెలపక పోతే ఎలా

మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా

నీలి కన్నుల్లొ అతని బొమ్మని
చూసి నాకింక చోటెక్కడుందని
నిదరే కసురుకునే రేయిలో
మేలుకున్నా ఇదేం వింత కైపని
వేల ఊహల్లొ ఊరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైన నీకు
ఆశల రాగం అని అడగాలనీ
పగలేదో రేయేదో గురుతే లేదనీ
తెలపక పోతే ఎలా

మనసున ఉన్నదీ చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నదీ ఓ మంచి సంగతి
బైటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా
ఒకసారి దరిచేరి ఎద గొడవేమిటో
తెలపక పోతే ఎలా... ఆ.....
ల ల లా.. ల ల ల ల
ల ల ల ల లా లా...
ల ల లా.. ల ల ల ల
ల ల ల ల లా లా...

చిత్రం : ప్రియమైన నీకు(2000)
సంగీతం : శివశంకర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చిత్ర