Showing posts with label Pooja Hegde. Show all posts
Showing posts with label Pooja Hegde. Show all posts

ఆచార్య(2022)

ఈరోజు ఆచార్య చిత్రం నుండి ఒక చక్కటి పాట మీ కోసం ,వీడియో సాంగ్ ని చూడాలంటే ఇక్కడ  చూడవచ్చు 






కల్లోలం కల్లోలం ఊరు వాడా కల్లోలం నే
నొస్తే అల్ల కల్లోలం క
ల్లోలం కల్లోలం కింద మీద కల్లోలం

నా అందం అల్ల కల్లోలం
నా జడగంటలు ఊగే కొద్ది
ఓ అరగంటలో పెరిగే రద్దీ

ధగ ధగలా వయ్యారాన్ని
దాచిపెట్టేది ఎట్టాగ
సానా కష్టం సానా కష్టం

సాన కష్టం వచ్చిందే మందాకినీ
చూసేవాళ్లు కళ్ళు కాకులెత్తుకుపోనీ
సాన కష్టం వచ్చిందే మందాకినీ

నీ నడుం మడతలోన జనం నలిగేపోని
నా కోలాతె చూడాలని
ప్రతోడు టైలర్లా అయిపోతాడు

ఓ నిజంగా బలే బాగున్నదే
నీ మూలంగా ఒక పని దొరికింది
యాడాడో నిమరోచ్చని కుర్రాళ్లే

ఆర్ఎంపీ లు అవుతున్నారు
ఏ ఇదేదో కొంచెం తేడాగుందే
నీ అబద్దం కూడా అంధంగుందే

ఇల్లు దాటితే ఇబ్బందే
ఒంపు సొంపుల్తో
సానా కష్టం సానా కష్టం

సాన కష్టం వచ్చిందే మందాకినీ
అంటించాకే అందాల అగరొత్తిని
సాన కష్టం వచ్చిందే మందాకినీ

రాధమ్మతో తీయించే నర దిష్టిని
నా పైట పిన్నీసుని అదేంటో
విలన్లా చూస్తుంటారే

ఎం లెవెల్లో పొసే ఏడుతున్నావే
మా చెవుల్లో పూలెడుతున్నవే
డాబానే ఎక్కేస్తానే పెరట్లో

మా అమ్మే నన్ను తిడుతుంటే
నీ కహానీ మాకు ఎందుకు చెప్పు
మెం వింటున్నాం అని కొట్టకే డప్పు

గంప గుత్తుగా సాకుతో ఎట్టా వేగాలా
సాన కష్టం సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకినీ

పంచాయితీ లెట్టొద్ధే వొద్దొద్దని
సానా కష్టం వచ్చిందే మందాకినీ
అచ్చు బొమ్మ దాటించు యావత్తుని

చిత్రం : ఆచార్య
సంగీతం : మణిశర్మ 
సాహిత్యం : భాస్కర భట్ల 
గానం    : రేవంత్,గీతా మాధురి.

ఒక లైలా కోసం (2014)

చిత్రం: ఒక లైలా కోసం (2014)
సంగీతం: అనూప్ రుబెన్స్
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బి.చరణ్, దివ్య


ఒక లైలా లైలా లైలా ఒక లైలా కోసం
తిరిగాను దేశం...
ఒక లైలా కోసం తిరిగాను దేశం
ప్రతి రోజూ ప్రతి రాత్రీ ప్రతి పాటా ఆమెకోసం
లైలా లైలా లైలా...
ఒక లైలా కోసం తిరిగాను దేశం
లైలా లైలా లైలా. లైలా లైలా లైలా...లైలా
ఆకాసానికి నిచ్చెనవేసి చుక్కల పట్టుకు నడిగానూ
లైలా ఏదనీ నా లైలా ఏదనీ
స్వర్గానికి నే దారులు వెతికీ ఇంద్రుని పట్టుకుని అడిగానూ
లైలా ఏదనీ నా లైలా ఏదనీ
అక్కడ ఇక్కడ ఎక్కడనీ దిక్కులు వెతుకుతు ఉన్నావూ
లైలా కోసం మజునూలా ఎందుకు తికమక పడతావూ
ప్రతీ చూపూ ప్రతి పిలుపూ ప్రతి చోటా నీకోసం
ఒక లైలా కోసం తిరిగాను దేశం
పగలూ రేయీ పందంవేసి సృస్టిని పట్టుకు బ్రతిమాలాయి
మజునూ ఏడనీ నా మజునూ ఏడనీ
రంభా ఊర్వసి ధైర్యం చేసి స్వర్గం విడీచీ వచ్చారూ
లైలా నేననీ అ....హా ఆ లైలా నేననీ
ఇల్లూ వాకిలి వదిలొస్తే రంభా ఊర్వసి అంటావూ
నీకోసం నే పుట్టొస్తే ఎవ్వరి వెనకో పడతవూ
ప్రతి రోజూ ప్రతి రాత్రీ ప్రతి పాటా ఆమెకోసం
ఒక లైలా కోసం తిరిగాను దేశం
ప్రతి రోజూ ప్రతి రాత్రీ ప్రతి పాటా ఆమెకోసం
లైలా లైలా లైలా...
ఒక లైలా లైలా లైలా...
ఒక లైలా లైలా లైలా...



*******   *******   ********



చిత్రం: ఒక లైలా కోసం (2014)
సంగీతం: అనూప్ రుబెన్స్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: అంకిత్ తివార్

నేనే నువ్వని తెలుసుకున్నా....
నువ్వు నాతో లేవని తెలిసినా ...
తెలుసే నువ్వు రావని
తెలుసే జత కావని
తెలిసిన నిను మరవటం తెలియదే
గుండెల్లోన ఆశ ఆవిరై
జ్ఞాపకాలే నాకు ఉపిరై
ఇప్పుడిలా కదిలనిలా ఈ దారిలో
నేనే నువ్వని తెలుసుకున్నా....
నువ్వు నాతో లేవని తెలిసినా ...

కర కరణిన తార తీరంలగా
ఊహిస్తా నీ ద్యాసలో
నిందల సంద్రం నన్ను ముంచుతున్న
తేలనే నీ ప్రేమలో
ప్రనాన్నే కానుకిమ్మాన్న మారు మాటడనే
నీ వైపే నువ్వు చూస్తుంటే
నీనేం చెయ్యనే ఇక ఎదే ఏమైన
నీ సంతోషం న సంతోషమే
తెలుసే నువ్వు రావని
తెలుసే జత కావని
తెలిసిన నిను మరవటం తెలియదే

నిద్రిస్తున్నా గానీ నిను వీడలేనే
నీదే గా ప్రతి కల
ఎందరిలో ఉన్న ఏమి చూడాలనే మరవే కనుపాపల
నా నుండి దూరమవ్వాలని నువ్వు కోరావని
దూరాన్నే నీను ప్రేమించా
ఎదేమవ్వని ఇంకా న అంతాన్ని రాసిచ్చాను
నీ ఇష్టానికే
తెలుసే నువ్వు రావని
తెలుసే జత కావని
తెలిసిన నిను మరవటం తెలియదే

ముకుంద (2014)

చిత్రం: ముకుంద (2014)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, కోరస్


గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా

విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా
తలపును లేపాలిగా బాలా
పరదాలే తీయకా పరుపే దిగనీయకా
పవళింపా ఇంతగా మేలా
కడవల్లో కవ్వాలు సడిచేస్తున్నా వినకా
గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలక
కలికీ ఈ కునుకేల తెల్లవార వచ్చెనమ్మ

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా

నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవనీ
నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి
నీకోసమనీ గగనమే భువిపైకి దిగివచ్చెననీ
ఆ రూపాన్నీ చూపుతో అల్లుకుపో సౌదామినీ
జంకేలా జాగేలా సంకోచాలా జవ్వనీ
బింకాలూ బిడియాలూ ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడనీ
అంటూ ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరాన

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా

ఏడే అల్లరి వనమాలీ నను వీడే మనసున దయమానీ
నందకుమారుడు మురళీలోలుడు నా గోపాలుడు ఏడే ఏడే

లీలాకృష్ణా కొలనిలో కమలములా కన్నెమది
తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నదీ
అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్న ఇదీ
అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నదీ
విన్నావా చిన్నారీ ఏమందో ప్రతిగోపికా
చూస్తూనే చేజారే ఈ మంచి వేళ మించనీక
త్వరపడవమ్మా సుకుమారి ఏమాత్రం ఏమారకా
వదిలావో వయ్యారీ బృందావిహారి దొరకడమ్మ

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా


********  *******   ********


చిత్రం: ముకుంద (2014)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మిక్కీ జె. మేయర్ , సాయి శివాణి

దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్
యుగాలెన్ని రానీ పోనీ
ముగింపంటు లేనేలేనీ
కథే మనం కాదా అననీ...
సమీపాన వున్నాగానీ
కదల్లేని ఈ దూరాన్నీ
మరో అడుగు ముందుకు రానీ..

నిను నను జత కలిపితె గాని
తన పని పూర్తవదనుకోని
మన వెనుకనె తరుముతు రానీ
ఈ క్షణాన్నీ...

గడిచిన ప్రతి జన్మ రుణాన్ని
మరిచిన మది నిదరని కరిగించే..
నిజం ఇదే..నని
మరి ఒకసారి ముడిపడుతున్న
అనుబంధాన్ని చూడని
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్

ప్రతి మలుపు దారి చూపద
గంగా సాగర సంగమానికి
ప్రతి చినుకు వంతెనేయద
నింగీ నేలని కలపడానికి
ఏ కాలం.. ఆపిందీ..
ఆ కలయికనీ...
ప్రణయమెపుడు అడిగిందీ
ఎటు ఉంది తొలకరి రమ్మనీ
ఎపుడెదురవుతుంది తానని
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్

ఏ స్వప్నం తనకి సొంతమో
చూపించాలా కంటి పాపకి
ఏ స్నేహం తనకి చైత్రమో
వివరించాలా పూల తోటకీ
వేరెవరో... చెప్పాలా...
తన మనసిదనీ..
కాని ఎవరినడగాలి
తానేవ్వరి గుండెల గూటిలో
ఊపిరిగా కొలువుండాలని
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్

దరె దమ్ దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ ద దమ్ ద దరె దమ్ దమ్
దరె దమ్ దరె దమ్ దమ్


********  *******   ********


చిత్రం: ముకుంద (2014)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్వేతా పండిట్

నందలాల ఎందుకివేళా ఇంత కళ
తందనాల తండవలీలా చాంగుభళ
పున్నమిలో సంద్రముల ఉల్లము ఝల్లున పొంగినదే
ఊపిరిలో మౌనమిల పిల్లనగ్రోవిల మోగినదే
ఊహల్లో సంబరం ఊరేగే ఉత్సవం
ఎదో పిలుపు విందా ఎటో తెలుసుకుందా
అటే నడపమందా పదా ఒముకుందా
నందలాల ఎందుకివేళా ఇంత కళ
తందనాల తండవలీలా చాంగుభళ

ఊయలే ఊగుతూ ఎందుకో ఉత్సాహం హ హ హ
అటు ఇటు తూగుతూ ఎమిటో సందేహం
కలే నిజమయిందా నువై రుజువైందా
కదే నవ్వమందా మదే ఒ ముకుందా

నీవు నా స్వేచ్చవై వీడనీ చెరసాల హ హ హ
నేను నీ గెలుపునై వేయనీ వరమాల
మరీ వయసు అంతా మహా బరువయిందా
సగం పంచమందా సరే ఒ ముకుందా
నందలాల ఎందుకివేళా ఇంత కళ
తందనాల తాండవలీలా చాంగుభళ


********  *******   ********


చిత్రం: ముకుంద (2014)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిచరన్

పగటి కలో పడుచు వలో
తననిలాగే తలపుల లో (2x)
చాల బాగుంది అనుకుంది మదిలోలో
తానెం చూసింది అనుకోని మలుపుల్లో
పర్వశామో తగని శ్రమో అసలిది ఏమో
తొలి సరదా
పరుగులెడు తున్నది ఇంతల
ఎటు పోతుందో అడగితే చెబుతుంద
నాపైనే తిరగబడు తున్నది ఇంకెలా
ఆశల వేగాన్ని ఆపే వీలుంద
తెగబడి తడబడి వడి వడి
ఇదేమి అలజడో..
తగు జాతే కనబడి వెంటాడే
ఊహలలో ఓహో ..
చాల బాగుంది అనుకుంది మదిలోలో
తానెం చూసింది అనుకోని మలుపుల్లో
అపుడేపుడో
తగిలినది మనసుకి ఈ తడి
అని ఇపుడిపుడే గుర్తుకు వస్తోంది
తొలకరిలో
చినుకు చెమి చేసిన సందడి
నెలకు తెలిసేలా చిగురులు వేసింది
చెలిమికి చిగురులు తోడగగా
సరైన సమయము
ఇది కదా అనుకోని ఎదురేగలో ఏమో హో
చాల బాగుంది అనుకుంది మదిలోలో
తానెం చూసింది అనుకోని మలుపుల్లో
పర్వశామో తగని శ్రమో అసలిది ఏమో

అల వైకంఠ పురంలో (2020)





చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సిద్ శ్రీరామ్

పల్లవి:
నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

నీ కళ్లకు కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు

సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)

నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు

చరణం: 1
మల్లెల మాసమా.. మంజుల హాసమా..
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా...

విరిసిన పించెమా.. విరుల ప్రపంచమా..
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా..

అరె, నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా..
ఉలకవా.. పలకవా.. భామా..
ఎంతో బ్రతిమాలినా.. ఇంతేనా అంగనా..
మదిని మీటు మధురమైన మనవిని వినుమా...

సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)

నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావలి కాస్తాయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు


******  ******  ******


చిత్రం: అల వైకంఠ పురంలో (2020)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లి సత్యవతి


హేయ్ బ్రదర్ ఆపమ్మా
ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా
అబ్బా.. కడుపు నిండిపోయింది బంగారం...

బంటు గానికి ట్వెంటీ టు
బస్తీ మస్తు కట్-ఔటూ
బచ్చాగాన్ల బ్యాచుండేది
వచ్చినమంటే సుట్టు
కిక్కే జాలక ఓ నైటూ
ఎక్కి డొక్కు బుల్లెట్టు
సందు సందుల మందు కోసం
ఎతుకుతాంటే రూటు
సిల్కు చీర కట్టుకొని
చిల్డ్ బీరు మెరిసినట్లు
పొట్లంగట్టిన బిర్యానీ
బొట్టు బిల్ల వెట్టినట్లు
బంగ్లా మీద నిల్పోనుందిరో సందామావ
సుక్క తాగక సక్కరొచ్చరో ఎం అందం మావ
జింక లెక్క దుంకుతుంటెరో ఆ సందామావ
జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావ

పల్లవి:
రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (2)

రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (2)

చరణం: 1
హెయ్! తమలపాకే ఎస్తుంటే
కమ్మగ వాసన ఒస్తా వే
ఎర్రగ పండిన ఋధలు రెండు
యాది కొస్తాయే.
అరె ఫువ్వుల అంగీ ఎస్తుంటే
గుండీ నువ్వై పూస్తావే
పండూకున్న గుండెలో దూరి
లొల్లే చేస్తావే

అరెయ్ ఇంటి ముందు లైటు
మినుకు మినుకుమంటాంటే
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
ఎహె.. నువ్వు లాగినట్టు ఒళ్ళు
జల్లుమంటాందే

చరణం: 2
నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు
ఎంటపడి వస్తున్న నీ
పట్టగొలుసు సప్పుడింటు
పట్టనట్లే తిరుగుతున్నవే ఓ సందామాన
పక్కకు పోయి తొంగిజూస్తవే
ఎం టెక్కురా మావ,

రాములో రాములా
నన్ను ఆగం చేసిందిరో
రాములో రాములా
నా పానం తీసిందిరో (5)



*********** *************** ***************



సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..

పట్టు పట్టినాడా ఒగ్గనే ఒగ్గడు..
పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు
ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు..

బుగతోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే
బుగతోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే …
కొమ్ములుడదీసి మరి.. పీపలుదినాడురో

జడలిప్పి మర్రి చెట్టు దయ్యల కొమ్పంటే
జడలిప్పి మర్రి చెట్టు దయ్యల కొమ్పంటే..
దయ్యముతొ కయ్యానికి తొడగొట్టి దిగాడు…

అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు
అమ్మోరి జాతరలో ఒంటి తలా రావణుడు…
గుంటలెంట పడితేనూ గుద్ది గుండ చేసినాడు
గుంతలెంట పడితేనూ గుద్ది గుండ చేసినాడు…

పున్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే
పున్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే…
రోమ్ముమీదోక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు
రోమ్ముమీదోక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు…

పది మంది నాగలేని పది మూరల సోరసేప
పది మంది నాగలేని పది మూరల సోరసేప
ఒడుపుగా ఒంటి సేత్తోఒడ్డుకోట్టుకోచినాడు
ఒడుపుగా ఒంటి సేత్తోఒడ్డుకోట్టుకోచినాడు

సాముసేసే కండతోటి దేనికైనా గట్టిపోటీ
సాముసేసే కండతోటి దేనికైనా గట్టిపోటీ…
అడుగడుగు ఎసినాడ అదిరెను అవతలోడు

సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు
గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు

సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
ఉత్తరాల ఊరి సివర సిత్తరాల సిరపడు
గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు

సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్ల ఐరగదంతె
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరొల్ల ఐరగదంతె
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే
సక్కనమ్మ కల్లల్లో యేల యేల సుక్కలచ్చే

మహర్షి (2019)


చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే (2)

ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే
ఈ చెలిమికే కాలమే చాలదే

ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు (2)

చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
ఓ మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే
హో యే

ఆటలాగ పాటలాగ నేర్చుకుంటే రానిదంట
స్నేహమంటే ఏమిటంటే
పుస్తకాలు చెప్పలేని పాఠం అంట
కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్లదంట
నేస్తమంటే ఏమిటంటే
కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంటా
ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం
నీలో ప్రతి వంటరి తరుణం చెరిపేస్తూ...

ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు

చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
చోటి చోటి బాతే బాతే
మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే
మీటి మీటి యాదే యాదే

గుర్తులేవి లేనినాడు బ్రతికినట్టు గుర్తురాదే
తియ్యనైన జ్ఞాపకాల్లా
గుండెలోన అచ్చ ఏమి సావాసాలే
బాధలేవి లేనినాడు నవ్వుకైనా విలువుండదే
కళ్ళలోన కన్నీళ్ళున్నా
పెదవుల్లో నవ్వు చెరగదు స్నేహం వల్లే
నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగ కంటూ
నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ

ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు

చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే
చోటి చోటి బాతే బాతే
మీటి మీటి మీటి మీటి మీటి మీటి యాదే
మీటి మీటి యాదే యాదే




చిత్రం: మహర్షి (2019)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: శ్రీమణి

గానం: దేవి శ్రీ ప్రసాద్




                                     ************~~~~~~~~~~~~*****************








నువ్వే సమస్తం

నువ్వే సిద్ధాంతం

నువ్వే నీ పంతం

నువ్వేలే అనంతం

ప్రతి నిశి మసై

నీలో కసే దిశై

అడుగేసెయ్

Missile'u లా...

ప్రతి శకం శతం

ప్రతి యుగం యుగం

నీ పేరే వినేంతలా

గెలుపు నీవెంటే పడేలా

నువ్వే సమస్తం

నువ్వే సిద్ధాంతం

Oh' నువ్వే నీ పంతం

నువ్వేలే అనంతం

నీదొక మార్గం

అనితరసాధ్యం

నీదొక పర్వం

శిఖరపు గర్వం

నుదుటన రాసే రాతను తెలిపే లిపినే చదివుంటావు

నీ తలరాతను సొంతగ నువ్వే రాసుకుపోతున్నావు

ఓటమి భయమే ఉన్నోడెవడూ ఓడని రుజువే నువ్వు

గెలుపుకే సొంతం అయ్యావు

నువ్వే సమస్తం

నువ్వే సిద్ధాంతం

Ho' నువ్వే నీ పంతం

నువ్వేలే అనంతం

భవితకు ముందే

గతమే ఉందే

గతమొకనాడు

చూడని భవితే...

నిన్నటి నీకు రేపటి నీకు తేడా వెతికేస్తావు

మార్పును కూడా మారాలంటూ తీర్పే ఇస్తుంటావు

ఏవీ లేని క్షణమే అన్నీ నేర్పిన గురువంటావు

గెలుపుకే కధలా మారావు

నువ్వే సమస్తం

నువ్వే సిద్ధాంతం

నువ్వే నీ పంతం

నువ్వేలే అనంతం...




** **************** ********** **************

మహర్షి (2019) 

రచన: శ్రీమణి                                
సంగీతం: దేవి శ్రీప్రసాద్ 
గానం: శంకర్ మహదేవన్ 



భళ్ళుమంటూ నింగివొళ్ళు విరిగెను గడ్డి పరకతోన 
ఎడారి కళ్ళు తెరచుకున్నవేళన చినుకు పూలవాన!
సముద్రమెంత దాహమేస్తే వెతికేను ఊటబావినే 
శిరస్సువంచి శిఖరమంచు ముద్దిడే మట్టినేలనే...


పదరా.. పదరా.. పదరా !
నీ అడుగికి పదును పెట్టి పదరా! 
ఈ అడవిని చదును చెయ్యి మరి 
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా !

పదరా.. పదరా.. పదరా !
ఈ పుడమిని అడిగిచూడు పదరా !
ఈ గెలుపను మలుపు ఎక్కడను ? 
ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా !


నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, 
ఈ పథమున మొదటడుగైరా,   
నీతరమిదిరా, అనితరమిదిరా అని చాటేయ్ రా! 



|| పదరా.. పదరా.. పదరా నీ అడుగికి ||
|| పదరా.. పదరా.. పదరా  ఈ పుడమిని ||


|| భల్లుమంటూ ||



కదిలే ఈకాలం, తన రగిలే వేదనికి, 
బదులల్లె విసిరిన ఆశల బాణం నువ్వేరా 
పగిలే ఇల హృదయం, తన యెదలో రోదనికి, 
వరమల్లె దొరికిన ఆఖరిసాయం నువ్వేరా!

కనురెప్పలలో తడి ఎందుకని, తననడిగే వాడే లేక, 
విలపించేటి ఈభూమివొడి చిగురించేలా..! 


పదరా.. పదరా.. పదరా !
ఈ హలమును భుజముకేత్తి పదరా,  
ఈ నేలను ఎదకు హత్తుకుని 
మొలకలెత్తమని, పిలుపునిచ్చి పదరా 

పదరా.. పదరా.. పదరా ! 
ఈ వెలుగును పలుగుదించి పదరా 
పగుళ్లతో పనికిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా..!

నీలో ఈ చలనం, మరి కాదా సంచలనం, 
చినుకల్లె మొదలై,  ఉప్పెన కాదా ఈ కధనం, 
నీలో ఈజడికి, చెలరేగే అలజడికి, 
గెలుపల్లె మొదలై, చరితగా మారే నీ పయనం,
నీ ఆశయమే తమ ఆశ అని, తమ కోసమని తెలిసాక,
నువ్వు లక్ష్యమని, తమ రక్షవని నినదించేలా!  

పదరా.. పదరా.. పదరా !
నీగతముకు కొత్త జనన మిదిరా, 
నీ ఎత్తుకు తగిన లోతు ఇది 
తొలి పునాది గది తలుపు  తెరిచి పదరా! 

పదరా.. పదరా.. పదరా !
ప్రతోక్కరి కథవు నువ్వు కదరా 
నీ ఒరవడి భవిత కలల వొడి 
బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా..! 

తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం, 
తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం 


ఉషస్సు ఎంత ఊపిరిచ్చిపెంచిన కాంతిచుక్కవో 
తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో....!



********** ************* ************ ************* **************



చిత్రం : మహర్షి (2019)
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : శ్రీమణి  
గానం : రాహుల్ సిప్లిగంజ్, మానసి 

ఏవో గుస గుసలే
నాలో వలసే విడిసీ
వలపే  విరిసే  ఎదలో

పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల బుట్టలో మెరుపు
నీ కట్టు పట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే
పిల్లా నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి
రంగుముగ్గే పెట్టేసినావే

కొండవలంచులో మెరుపు
నీ చురుకు చూపులో చేరిందే
గడపకద్దినా పసుపు
నీ చిలిపి ముద్దులా తాకిందే
మలుపు తిరిగి
నా మానసిట్టా
నీవైపుకి మళ్ళిందే
పిల్లోడ గుండెలోన
ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఎల్లా గొట్టేసినావే

విల్లు లాంటి నీ ఒళ్ళు
విసురుతుంటే బాణాలు
గడ్డి పరకపై అగ్గి పుల్లలా
భగ్గుమన్నవే నా కళ్ళు
నీ మాటలోని రోజాలు
గుచ్చుతుంటే మరి ముళ్ళు
నిప్పు పెట్టిన తేనె పట్టులా
నిద్ర పట్టదే రాత్రుళ్ళు
నీ నడుము చూస్తే మల్లె తీగ
మనసు దానినల్లే తూనీగ
మెల్ల మెల్లగా చల్లినావుగా
కొత్త కలలు బాగా

పిల్లా నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి
రంగుముగ్గే పెట్టేసినావే

పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల పుట్టలో మెరుపు
నీ కట్టు బొట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే

పిల్లోడా గుండెలోన
ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఎల్లా గొట్టేసినావే


  

******** ************ ************ ***************** ************


 నువ్వని, ఇది నీదని, ఇది నిజమని అనుకున్నావా
కాదుగా నువ్వనుకుంది
ఇది కాదుగా నువ్వెతికింది
ఏదని బదులేదని, ఒక ప్రశ్నలా నిలుచున్నావా
కాలమే వెనుతిరగనిది
ఇవ్వదు నువ్వడిగినది

ఏ వేలో పట్టుకుని
నేర్చేదే నడకంటే
ఒంటరిగా నేర్చాడా ఎవడైనా
ఓ సాయం అందుకొని
సాగేదే బ్రతుకంటే
ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా
పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా
నిను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకే దాగేనా...

నువ్వని, ఇది నీదని, ఇది నిజమని అనుకున్నావా
కాదుగా నువ్వనుకుంది
ఇది కాదుగా నువ్వెతికింది
ఏదని బదులేదని, ఒక ప్రశ్నలా నిలుచున్నావా
కాలమే వెనుతిరగనిది
ఇవ్వదు నువ్వడిగినది

ఓ' ఊపిరి మొత్తం ఉప్పెనలా పొంగిదా
నీ పయనం మళ్ళీ కొత్తగ మొదలయ్యిందా
ఇన్నాళ్ళూ ఆకాశం ఆపేసిందా
ఆ ఎత్తే కరిగి నేలే కనిపించిందా
గెలుపై ఓ గేలుపై నీ పరుగే పూర్తైనా
గమ్యం మిగిలే ఉందా...

రమ్మని నిను రమ్మని ఓ స్నేహమే పిలిచిందిగా
ఎన్నడూ నిను మరువనిది
ఎప్పుడూ నిను విడువనిది
ఓ' ప్రేమని తన ప్రేమని నీ కోసమే దాచిందిగా
గుండెలో గురుతయ్యినది
గాయమై మరి వేచినది

లోకాలే తలవంచి
నిన్నే కీర్తిస్తున్నా
నువ్ కోరే విజయం వేరే ఉందా
నీ గుండె చప్పుడుకే
చిరునామా ఏదంటే
నువ్ మొదలయ్యిన చోటుని చూపిస్తోందా
నువ్వొదిలేసిన నిన్నలలోకి అడుగే సాగేనా
నువ్ సాధించిన సంతోషానికి అర్ధం తెలిసేనా...


  ******** ******************* ****************** *************



 ఇదే కదా ఇదే కదా నీ కధ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కధ
ముగింపు లేనిదై సదా సాగదా
నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా
ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద
ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ళ ఆయువుందిగా
ఇంకెన్ని ముందు వేచెనో అవన్ని వెతుకుతూ పదా...
మనుష్యులందు నీ కధ... మహర్షిలాగ సాగదా...
మనుష్యులందు నీ కధ... మహర్షిలాగ సాగదా...

ఇదే కదా ఇదే కదా నీ కధ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదే కదా ఇదే కదా నీ కధ
ముగింపు లేనిదై సదా సాగదా
నిస్వార్థమెంత గొప్పదో ఈ పథము ఋజువు కట్టదా
సిరాను లక్ష్యమొంపదా చిరాక్షరాలు రాయదా
నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా
నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలాదా...
మనుష్యులందు నీ కధ... మహర్షిలాగ సాగదా...
మనుష్యులందు నీ కధ... మహర్షిలాగ సాగదా...