చిత్రం : శివరంజని (1978)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
నవమి నాటి వెన్నెల నేను... దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతి రేయి... కార్తీక పున్నమి రేయి...
నవమి నాటి వెన్నెల నేను... దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతి రేయి ... కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను... దశమి నాటి జాబిలీ నీవు
చరణం 1 :
నీ... వయసే వసంత ఋతువై..
నీ మనసే జీవన మధువై
నీ... వయసే వసంత ఋతువై
నీ... మనసే జీవన మధువై...
నీ పెదవే నా పల్లవిగా..
నీ నగవే సిగ మల్లికగా..
చెరిసగమై యే సగమేదో మరచిన మన తొలి కలయికలో...ఓ..
నవమి నాటి వెన్నెల నేను... దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతి రేయి ... కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను... దశమి నాటి జాబిలీ నీవు
చరణం 2 :
నీ... ఒడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
నీ... ఒడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై...
అందాలే నీ హారతిగా... అందించే నా పార్వతిగా
మనమొకటై రస జగమేలే సరసమధుర సంగమ గీతికలో…. ఓ..
నవమి నాటి వెన్నెల నేను... దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతి రేయి ... కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను... దశమి నాటి జాబిలీ నీవు
****************** ************** *************
చిత్రం : శివరంజని (1978)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : దాసం గోపాల కృష్ణ
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
జోరుమీదున్నావు తుమ్మెదా... నీ జోరెవరికోసమే తుమ్మెదా
జోరుమీదున్నావు తుమ్మెదా... నీ జోరెవరికోసమే తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా... నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా... నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా
జోరుమీదున్నావు తుమ్మెదా... నీ జోరెవరికోసమే తుమ్మెదా
చరణం 1 :
ముస్తాబు అయ్యావు తుమ్మెదా... కస్తూరి రాసావు తుమ్మెదా
మసక ఎన్నెల్లోన తుమ్మెదా... మల్లెపందిరి కాడ తుమ్మెదా
మాల కడుతున్నావు తుమ్మెదా... ఆ మాలెవరికోసమే తుమ్మెదా
జోరుమీదున్నావు తుమ్మెదా... నీ జోరెవరికోసమే తుమ్మెదా
చరణం 2 :
మెత్తన్ని పరుపూలు తుమ్మెదా... గుత్తంగ కుట్టావు తుమ్మెదా
ఒత్తైన పరుపుపై తుమ్మెదా... అత్తర్లు చల్లావు తుమ్మెదా ...
ఆ ... ఆ... ఆ... ఆ... ఆ
పక్కవేసుంచావు తుమ్మెదా... ఆ పక్కెవరికోసమే తుమ్మెదా
జోరుమీదున్నావు తుమ్మెదా... నీ జోరెవరికోసమే తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా... నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా
జోరుమీదున్నావు తుమ్మెదా... నీ జోరెవరికోసమే తుమ్మెదా
****************** ************** *************
చిత్రం : శివరంజని (1978)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
చందమామా వచ్చాడమ్మా...
తొంగితొంగి నిను చూశాడమ్మా
తలుపు తెరచుకో.. పిలుపు అందుకో..
ముత్యాల ముంగిటలో.. కలువభామా..ఆ..ఆ..
విడిదొసగి విందు చేయి.. కలువభామా...
చందమామా వచ్చాడమ్మా..
తొంగితొంగి నిను చూశాడమ్మా..ఆ.. నిను చూశాడమ్మా
చరణం 1 :
ఎన్నెల మిఠాయి తెచ్చాడమ్మా..ఆ..ఆ.. తెచ్చాడమ్మా..
సైయ్యాటకు పిలిచాడమ్మా..ఆ..ఆ.. పిలిచాడమ్మా..
పన్నీరు చల్లవే.. పాన్పు వేయవే..
ముత్యాల ముంగిటలో కలువభామా..ఆ..ఆ..
విడిదొసగి విందు చేయి కలువభామా...
చందమామా వచ్చాడమ్మా..
తొంగితొంగి నిను చూశాడమ్మా..ఆ.. నిను చూశాడమ్మా
చరణం 2 :
పడకగదికి వెళ్ళాలమ్మా..ఆ..ఆ.. వెళ్ళాలమ్మా
తాంబూలం ఇవ్వాలమ్మా..ఆ..ఆ.. ఇవ్వాలమ్మా
తంతు నడుపుకో.. చెంత చేరుకో...
ముత్యాల ముంగిటలో.. కలువభామా..ఆ..ఆ..
విడిదొసగి విందు చేయి.. కలువభామా..
చందమామా వచ్చాడమ్మా..
తొంగితొంగి నిను చూశాడమ్మా..
తలుపు తెరచుకో.. పిలుపు అందుకో..
ముత్యాల ముంగిటలో.. కలువభామా..ఆ..ఆ..
విడిదొసగి విందు చేయి.. కలువభామా..ఆ..
చందమామా వచ్చాడమ్మా...
తొంగితొంగి నిను చూశాడమ్మా..ఆ.. నిను చూశాడమ్మా
****************** ************** *************
చిత్రం : శివరంజని (1978)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు
పల్లవి :
అభినవ తారవో .. నా అభిమాన తారవో..
అభినవ తారవో..
అభినయన రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కాంతిధారవో
మంజుల మధుకర శింజాన సుమశర శింజిని శివరంజనీ ... శివరంజనీ
చరణం 1 :
అది దరహాసమా .. మరి మధుమాసమా
అది దరహాసమా .. మరి మధుమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చరణమ్ములా ? శశి కిరణమ్ములా ?
అవి చరణమ్ములా ? శశి కిరణమ్ములా ?
నా తరుణ భావనా హరిణమ్ములా
అభినవ తారవో .. నా అభిమాన తారవో..
అభినవ తారవో.. శివరంజనీ ... శివరంజనీ
చరణం 2 :
ఆ నయనాలు విరిసిన చాలు.. అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలు విరిసిన చాలు.. అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నెన్నడుము ఆడిన చాలు ...
ఆ నెన్నడుము ఆడిన చాలు.. రవళించును పదకవితా ప్రబంధాలు
అభినవ తారవో .. నా అభిమాన తారవో..
అభినవ తారవో.. శివరంజనీ ... శివరంజనీ
చరణం 3 :
నీ శృంగార లలిత భంగిమలో.. పొంగిపోదురే ఋషులైనా
నీ కరుణరసావిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైనా
వీరమా ... నీ కుపిత నేత్ర సంచారమే..
హాస్యమా .... నీకది చిటికలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ
నటనాంకిత జీవనివనీ
నిన్ను కొలిచి వున్నవాడ.. మిన్నులందుకున్నవాడ
ఆ....ఆ... ఆ.... ఆ...
నీ ఆరాధకుడను.. ఆస్వాదకుడను.. అనురక్తుడనూ..
నీ ప్రియభక్తుడనూ..
అభినవ తారవో .. నా అభిమాన తారవో..
అభినవ తారవో.. శివరంజనీ ... శివరంజనీ