Showing posts with label KantaRao. Show all posts
Showing posts with label KantaRao. Show all posts

బంగారు తిమ్మరాజు (1964)

చిత్రం :  బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : జమునారాణి

పల్లవి:

నాగమల్లి కోనలోన... నక్కింది లేడికూన
నాగమల్లి కోనలోన... నక్కింది లేడికూన

ఎరవేసి..హ...గురి చూసి...హ... పట్టాలి మామా....
ఎరవేసి... గురి చూసి... పట్టాలి మామా... పట్టాలి మామా...

చరణం 1:

చూపుల్లో కైపుంది.. మావా... సొగసైన రూపుంది.. మావా
చూపుల్లో కైపుంది ... సొగసైన రూపుంది

వయ్యారం ఒలికిస్తుంది... వన్నెలు చిన్నెలు నేర్చింది
ఓ ఉడుకుమీద ఉరికావంటే జడుసుకుంటది
దాన్ని ఒడుపుచూసి మచ్చిక చేస్తే వదలనంటది... మావోయ్...

నాగమల్లి కోనలోన... నక్కింది లేడికూన
ఎరవేసి..హ...గురి చూసి...హ... పట్టాలి మామా....

చరణం 2:

నడకల్లో హొయలుంది... మావా... నాట్యంలో నేర్పుంది... మావా
నడకల్లో హొయలుంది ... నాట్యంలో నేర్పుంది ....

మలిసందె చీకట్లోన.. నీటికి ఏటికి వస్తుంది
ఓ జాడ చూసి కాశావంటే దారికొస్తది
దాని జాలి చూపు నమ్మావంటే.. దగా చేస్తది... మావోయ్

నాగమల్లి కోనలోన... నక్కింది లేడికూన
ఎరవేసి..హ...గురి చూసి...హ... పట్టాలి మామా....
ఎరవేసి... గురి చూసి... పట్టాలి మామా... పట్టాలి మామా...

**************** ************** ***************

చిత్రం : బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఏసుదాస్

పల్లవి:

ఓ నిండు చందమామా … నిగనిగల భామా
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామా

చరణం 1:

నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే
మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు
మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు
ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకు రానా
ఓఓఓఓఓ… ఓ నిండు చందమామా … నిగనిగల భామా
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామా

చరణం 2:

దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నేటినుంచి మేనులు రెండూ నెరజాణా ఒకటాయే..
ఓఓఓఓఓ… ఓ నిండు చందమామా … నిగనిగల భామా
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామా

నవగ్రహ పూజా మహిమ (1964)

చిత్రం: నవగ్రహ పూజా మహిమ (1964)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: జి. కృష్ణమూర్తి
నేపధ్య గానం: ఘంటసాల, జానకి

పల్లవి:

ఏనాడు ఎడబాసి లేమే...
ఈనాడు విడిపొయినామే...
మేనే ఇటనుండే నా మనసు నీ చెంత నుండే ..

ఎవ్వరో ఎందుకీ రీతీ సాధింతురు ..
ఎవ్వరో ఏల పగబూని బాధింతురు...
కాదు తలవ్రాతయు..దేవతల కోపము కాదు...
ఇది మానవుని మోసము
ఎవ్వరో ఎందుకీ రీతీ సాధింతురు...

ఎవ్వారహో... ఆలపించిరీ...ఎద వీణ సవరించిరీ..
మైమరచి నిదురించినా ...నా కనులు తెరిపించిరి..

చరణం 1:

కళ్ళలో గాలి తోలుతాడ మాటాడును...
ముళ్ళలో త్రోసి కసి తోడ వేటాడును
మంచినీ చేయును ...వంచనా చేయును..
నమ్మగా గోంతులే కోయును...

ఎక్కడుంటివో ఓయి గాయకా..నా మేను పులకించక
గానమందునా లీన మైతిని...నేనే నీ దాననైతిని

ఎవ్వరో ఎందుకీ సాధింతురు ..ఎవారో ఏల పగ బూని బాధింతురు 
కాదు తలవ్రాతాయు దేవతల కోపము కాదు..ఇది మానవుని మోసము

ఆనంద నిలయం (1971)



చిత్రం: ఆనంద నిలయం (1971)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల



పల్లవి:

పదిమందిలో పాటపాడినా..
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే......

పదిమందిలో పాటపాడినా...


చరణం 1:

గోపాలునికెంతమంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్నా రాధ ఒక్కటే..
పదిమందిలో పాటపాడినా

ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కటే....

చరణం 2:

ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ
వేడుక చేసే.... వసంతమొక్కటే
పదిమందిలో పాటపాడినా...

నా కన్నులందు ఎన్నివేల కాంతులున్ననూ
ఆ కలిమి కారణం నీప్రేమ ఒక్కటే......

పదిమందిలో పాటపాడినా...
అది అంకితమెవరో ఒకరికే
పదిమందిలో పాటపాడినా...

ఇద్దరు మొనగాళ్ళు (1967)



చిత్రం: ఇద్దరు మొనగాళ్ళు (1967)
సంగీతం: యస్.పి.కోదండపాణి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:
చిరు చిరు చిరు చిరు నవ్వులు
చిరు చిరు చిరు చిరు నవ్వులు
నా చేతికి అందిన పువ్వులు
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హు హూ
తొలి తొలి తొలి తొలి చూపులు
నను కలవర పరిచే చూపులు... విరి చూపులు

చిరు చిరు చిరు చిరు నవ్వులు
నా చేతికి అందిన పువ్వులు
తొలి తొలి తొలి తొలి చూపులు
నను కలవర పరిచే చూపులు... విరి చూపులు

చరణం: 1
మల్లె తీగ నడిచిందంటే...
నడిచిందంటే..నడిచిందంటే.. నడిచిందంటే
మల్లె తీగ నడిచిందంటే..
కల్ల మాట అనుకున్నాను
నీవు నడిచి పోతూ ఉంటే
నిజమే అనుకున్నాను

చిలిపి మదనుడున్నాడంటే...
ఉన్నాడంటే...ఉన్నాడంటే... ఉన్నాడంటే
చిలిపి మదనుడున్నాడంటే
కలయేమో అనుకున్నాను
నిన్నెదురుగా చూస్తూ ఉంటే
నిజమే అంటున్నాను
ఓ...ఓ..ఓ...ఓ..ఓ...

చిరు చిరు చిరు చిరు నవ్వులు
నా చేతికి అందిన పువ్వులు
ఓహొ ఓహొ ఒహో
తొలి తొలి తొలి తొలి చూపులు
నను కలవర పరిచే చూపులు... విరి చూపులు

చరణం: 2
మేడలోన నీవున్నావు..
నీవున్నావు...నీవున్నావు... నీవున్నావు
మేడలోన నీవున్నావు.. నీడలోన నేనున్నాను
నిండు వలపు నిచ్చెనవేససీ...
నిన్నే కనుకొన్నాను

పలకరించు జాబిలి నీవు
జాబిలి నీవు...జాబిలి నీవు... జాబిలి నీవు
పలకరించు జాబిలి నీవు...పరవశించు కలువను నేననూ
నిన్నే కనుకొన్నాను
ఓ...ఓ...ఓ...ఓ..

చిరు చిరు చిరు చిరు నవ్వులు
నా చేతికి అందిన పువ్వులు
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హు హూ
తొలి తొలి తొలి చూపులు
నను కలవరపచే చూపులు..విరి చూపులు

చిరు చిరు చిరు చిరు నవ్వులూ....