Showing posts with label Nivetha Thomas. Show all posts
Showing posts with label Nivetha Thomas. Show all posts

జై లవ కుశ (2017)

చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: జూ. యన్.టి.ఆర్,  రాశిఖన్నా, నివేద థామస్, తమన్నా
కథ,  మాటలు ( డైలాగ్స్ ): కె.యస్.రవీంద్ర (బాబీ ) , కోన వెంకట్, కె.చక్రవర్తి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.యస్.రవీంద్ర (బాబీ )
సినిమాటోగ్రఫీ: చోటా కె. నాయుడు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: యన్.టి.ఆర్.ఆర్ట్స్
నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్
విడుదల తేది: 21.09.2017


చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: జస్ప్రీత్ జస్జ్ , రనైనా రెడ్డి

ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్

ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్

హే స్వప్న సుందరి స్వర్ణం మంజరి
చూపుగుచ్చి చేసినావే ఇన్జ్యూరీ
స్వప్న సుందరి స్వర్ణం మంజరి
ముద్దులిచ్చి చేసుకోవె చెంచురీ
నరాల్లో మోగుతోంది క్లారినైట్
ఫిరంగి గుచ్చినట్టు
రొమాన్స్ గుప్పు మంది పార్టు పార్టు
ఫిరంగి పేలినట్టు
హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పరెయ్యకే

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోన
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్
లెట్ సింగ్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్

హే స్వప్న సుందరి స్వర్ణం మంజరి
చూపుగుచ్చి చేసినావే ఇన్జ్యూరీ
స్వప్న సుందరి స్వర్ణం మంజరి
ముద్దులిచ్చి చేసుకోవె చెంచురీ ఓ..

ఇష్క్ శాండిలైట్ లా చుట్టుముట్టి తిరగనా
ఇష్క్ మూన్ లైట్ లాంటి నిన్ను చూసి
గాగ్ర చోళీ కట్టులా అందనంత ఎగరనా
ఆవురావురన్న నిన్ను మాయచేసి
జపాన్ ఎర్త్క్వెక్ మొదలైయిందే
జవాని పొంగులోన
పెదాల్లో ఫ్రెంచ్ వైన్ పొంగుతుందే
ఒకింత పంచుకోన
థెర్మోమీటరే దాటుతోంది మేటరే

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోన
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్
లెట్ సింగ్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్

కవర్ పేజ్ చిరిగిన బ్యూటీ మ్యాగజీన్ లా
డళ్లయ్యేదే భూమి నువ్వు పుట్టకుంటే
హే గ్లాసు లోకి ఒరిగిన ముచ్చి ఐస్ క్యూబ్ లా
చుమ్మాయిందె ఫోజు నువ్వు ముట్టుకుంటే
రెబాన శాకాహారి హద్దు మీరి
గుద్దావే పూల లారీ
లిరిక్స్ లేని ధన్ దనా నా ఫెడారీ
కమాన్ బ్రహ్మచారి
బ్రేక్ లేని దూకుడే ఆపుతుంది ఊపుడే

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోన
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్
లెట్ సింగ్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్


********  ********  ********


చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర

పల్లవి:
కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా
నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా
నీ మోము నింగినుండి ఓ ప్రేమ వాన రాగా
ఆ వానజల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా...
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా
ఓ ప్రేమవానలోన మునిగి పైకి పైకి తేలిపోయా

చరణం: 1
నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా
నా జంట నువ్వు చేరిక ఓ దారమల్లె రాగా
నీ నీలికురులనుండి ఓ పూలగాలి రాగా
నా ప్రేమ అన్న గాలిపటం చంద్రమండలాన్ని చేరగా...
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా
అసలు చందమామ నువ్వె అంటు నేలమీద వాలిపోయా

అసుర అసుర అసుర అసుర రావణాసురా
అసుర అసుర అసుర అసుర రావణాసురా

చరణం: 2
హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా
హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా

నీ పెదవిలోని ఎరుపు నా పెదవికి గాయం చేస్తే
అసుర అసుర అసుర అసుర రావణాసురా
మెడవంపులోని నునుపు గాయానికి కారం పూస్తే
అసుర అసుర అసుర అసుర రావణాసురా
దారులంత ఒక్కటై ఒత్తుతంగ ఒక్కరై
అందమైన ఔషదాన్ని తాగనా

హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా
హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా


********  ********  ********


చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దివ్య కుమార్

అసుర    రావణాసురా
అసుర అసుర   రావణాసురా

విశ్వ విశ్వ నాయక రాజ్య రాజ్య పాలక
వేళా వేళా కోట్ల అగ్ని పర్వతాల కలయిక

శక్తి శక్తి సూచిక  యుక్తి యుక్తి పాచిక
సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైనా కదలికా

ఓ..ఓ…ఏక వీర..సూరా.. క్రూరా..కుమారా…
నిరంకుశంగ దూకుతున్న  దానవేశ్వరా

ఓ...ఓ..రక్త ధారా.. చోర..ఘోరా..అఘోరా
కర్కశంగ రేగుతున్న  కాలకింకరా

రావాణా..జై జై జై… శత్రు శాసన..జై జై జై…
రావాణా..జై జై జై… సింహాసనా..జై జై జై…

అసుర..అసుర....అసురా..అసుర..రావణాసురా
అసుర..అసుర.అసురా..అసుర..రావణాసురా

చిత్ర చిత్ర హింసక  మృత్యు మృత్యు ఘంటిక
ముజ్జగాల ఏకకాల పలు రకాల ధ్వంసకా

ఖడ్గ భూమి ధార్మిక కదనరంగ కర్షకా
రామనగర పట్టణాల సకల జన ఘర్షక

ఓఓఓఓ…అంధకరా.. తార..ధీర..సుధీరా..
అందమైన రూపమున్న అతి బయంకరా

ఓ..ఓ..దుర్వితారా.. భైరా..స్వైరా..విహార
పాప లాగ నవ్వుతున్న ప్రళయ భీకరా

రావాణా..జై జై  జై… శత్రు శాసన..జై జై జై
రావాణా..జై జై  జై … సింహాసనా..జై జై  జై

నవరసాల పోషక నామరూప నాశకా
వికృతాల విద్యలెన్నో చదివినా వినాశక

చరమగీత నాయకా నరక లోక నర్తక
అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచకా

ఓఓఓ…అహంకారా.. హారా..బారా..కిషోరా..
నరాలు నాగు పాములైన నిర్భయేశ్వరా…

ఓ..ఓ..తిరస్కార… తీరా..ఎరా..కుబేరా…
కణము కణము రణములైనా కపాలేశ్వర…

రావాణా..జై జై  జై … శత్రు శాసన..జై జై  జై …
రావాణా..జై జై  జై … సింహాసనా..జై  జై  జై …

నిన్ను కోరి (2017)

చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: శ్రీజో
గానం: సిద్ శ్రీరామ్


ఊహుఁ...  ఊహుఁ...
ఊహుఁ...  ఊహుఁ...

ఊహుఁ హు  ...  ఊహుఁ...
ఊహుఁ...  ఊహుఁ...

అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదనీ
నన్నె మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదనీ

నువ్వే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే
నీలోనె ఉన్నా నిను కోరి ఉన్న
నిజమై నడిచా జతగా...

ఊహుఁ...  ఊహుఁ...
ఊహుఁ...  ఊహుఁ...

ఊహుఁ...  ఊహుఁ...
ఊహుఁ...  ఊహుఁ...

గుండెలోతుల్లో ఉంది నువ్వేగా
నా సగమే నా జగమే నువ్వేగా
నీ స్నేహమే నను నడిపే స్వరం
నిను చేరగ ఆగిపోనీ పయణం
అలుపే లేని గమనం

అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదని
నన్నె మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదని

నువ్వే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే
నీలోనె ఉన్న నిను కోరి ఉన్నా
నిజమై నడిచా జతగా....

ఊహుఁ...  ఊహుఁ...
ఊహుఁ...  ఊహుఁ...

ఊహుఁ...  ఊహుఁ...
ఊహుఁ...  ఊహుఁ...


*******   *******   ********


చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హరిచరన్

హే బదులు చెప్పవె
రుజువు చూపవె సమయమా
నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా
ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా
అది ఆ తొలి క్షణాలలో
తెలుసుకోవడం సాధ్యమా...

నిన్నేనే అడిగేది...  ఎన్నాల్లే నలిగేది...

హే బదులు చెప్పవె
రుజువు చూపవె సమయమా
నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా

వేలి తోటి వేలు కలిపేయగానె చాలు
వేల యేల్లు వాళ్ళు కలిసుందురందురే
ప్రానమైన వారు జంట లాగ చేరితే
ఎన్నడైన వీడరన్న మాట నమ్మరే

నిన్నేనే అడిగేదీ... ఎన్నాల్లే నలిగేదీ...

దారులేమొ రెండె అవి ముళ్ళతోటి నిండె
ఎంచుకోమనంటు వదిలేసి వెళ్లకే
నిన్న లోని లోపమేదొ నిండి ఉందని
రేపు దాన్ని లోటులా మిగల్చలేం కదా

హే బదులు చెప్పవె
రుజువు చూపవె సమయమా
నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా
ఏ పరిచయానికేం ఫలితమున్నదో తెలుపుమా
అది ఆ తొలి క్షణాలలో
తెలుసుకోవడం సాధ్యమా...

నిన్నేనే అడిగేది...  ఎన్నాల్లే నలిగేది...
నిన్నేనే అడిగేది...  ఎన్నాల్లే నలిగేది...


*********   *********   **********



చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అరుణ్ గోపాన్

వన్స్ అప్ ఆన్ ఎ టైములో
వైజాగ్ బీచ్ రోడ్డులో
ఏవండోయ్ మాస్టారంటు
విష్ చేసింది నన్నూ...

వన్స్ అప్ ఆన్ ఎ టైములో
వైజాగ్ బీచ్ రోడ్డులో
ఏవండోయ్ మాస్టారంటు
విష్ చేసింది నన్నూ...

అల్లి బిల్లి నడుముని తిప్పి
ఐ లవ్ యు చెవిలోన చెప్పి హో
తప్పుకుంది కల్లు రెండు కప్పి
అందుకేగ  గుండెకింత నొప్పి

బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... (2)

బైకెనక.. తను ఎక్కేసి కూర్చుంది చేతుల్ని వేసింది
లైఫంత.. నన్ను వదలనంటు ఒట్టేసి చెప్పింది
సోల్ మేటె దొరికిందనుకుంటె అంతలో...
సోలోగ వదిలేసెలిపోయెను సంతలో
తోక చుక్కల్లె నా వెంట వచ్చి
తేనె చుక్కల్లె తీయగ నచ్చి
బుగ్గ చుక్కని పెట్టుకు వస్తానని
చుక్కలు చూపిందె
మందు చుక్కె మిగిలిందే...

బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... (2)

నీ సుఖమె.. కోరుకున్నాను అన్నది వన్నెల చిన్నది
కాబట్టె.. నీ కంటికి దూరంగ ఉన్నాను అన్నది
తను లేక మనుసుకి సుఖమెట్టా ఉంటది
నా బాధ పిల్లకి ఎపుడర్దం అవుతది
ఈ లేడీసు ఇంతె తమ్మి
వాల్లు చెప్పినవన్ని నమ్మి
మనసిచ్చామంటె తిరిగి ఇవ్వరు
పట్టుకు పోతారె..
వేరె వాన్ని కట్టుకు పోతారె..

బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి.. ఉమా గాడి లైఫె పాకప్పు... (3)

పాకప్...


*******   *******   *******


చిత్రం: నిన్ను కోరి (2017)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్, చిన్మయి శ్రీపద

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె
ఎవ్వరంట ఎదురైనదీ..
సంతోషాలె నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది
నేనా నేనా... ఇలా నీతో ఉన్నా
ఔనా ఔనా... అంటూ ఆహా అన్నా

హెయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపొయె
ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపోయె
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయె
ఓయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలె నిండి బంధం అల్లుకుంది
ఎప్పుడంట ముడిపడినది

ఏ దారం ఇలా లాగిందో మరి
నీ తోడై చెలీ పొంగిందె మది
అడిగి పొందినది కాదులె
తనుగ దొరికినది కానుక
ఇకపై సెకనుకొక వేడుక
కోరె కలా నీలా నా చెంత చేరుకుందిగ

హెయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపొయె
ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపోయె
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయె
ఓయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె

ఆనందం సగం అచ్చర్యం  సగం
ఏమైనా నిజం బాగుంది నిజం
కాలం కదలికల సాక్షిగ
ప్రేమై కదిలినది జీవితం
ఇకపై పదిలమె నా పధం
నీతో అటో ఇటో ఏవైపు దారి చూసిన

ఉన్నటుండి గుండె వంద కొట్టుకుందె
ఎవ్వరంట ఎదురైనది
సంతోషాలె నిండే బంధం అల్లుకుందే
ఎప్పుడంట ముడిపడినది
నేనా నేనా... ఇలా నీతో ఉన్నా
ఔనా ఔనా... అంటూ ఆహా అన్నా

హెయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు
ముచ్చటగా నను హత్తుకుపొయె
ఓయె.. ఒయె.. యె యె యె యె హత్తుకుపోయె
చుక్కలు చూడని లోకం లోకి
చప్పున నన్ను తీసుకుపోయె
ఓయె.. ఒయె.. యె యె యె యె తీసుకుపోయె