Showing posts with label Manchu Vishnu. Show all posts
Showing posts with label Manchu Vishnu. Show all posts

పాండవులు పాండవులు తుమ్మెద (2014)

చిత్రం: పాండవులు పాండవులు తుమ్మెద (2014)
సంగీతం: అచ్చు రాజమని, బప్పా. బి.లహరి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్


అచ్చ తెలుగంటి  పెదవుల్ని వెలుగంటి బుగ్గలని
దగ్గరగా చూశాను నేనే
పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని
పిచ్చెక్కి చూశాను నేనే
చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

చరణం: 1
ఓ నా కళ్ళలో మెరుపొచ్చేలా నీ కళ్ళు చూశాను నేనే
నా వెన్నులో ఉడుకొచ్చేలా నీ వెన్ను చూశాను నేనే
నీ ఒంపులో ఆపేశావే కాలాన్నే
నీలో సంద్రాల లోతుల్ని శిఖరాల ఎత్తుల్ని
నిఖరంగా చూశాను నేనే
పిల్లా నీ పీఠభూముల్ని  నునులేత కనులన్నీ
నిశ్చంగా  చూశాను నేనే

చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

చరణం: 2
ఆ ఊబిలో  దిగిపోయేలా నీ నాభి చూశాను నేనే
ఆ మడతలో మునకేసేలా  నీ నడుమే చూశాను నేనే
నీ రూపుతో పిండేసావే ప్రాణాన్నే
అబ్బో  ఆ సూర్య చంద్రుల్ని చూల్లేని  చోటుల్ని
అడ్డంగా  చూశాను నేనే
అమ్మో నువ్వైన నీలోన చూల్లేని  సోకుల్ని
అద్దంలా చూశాను నేనే

చూశా నేనే  చూశా నేనే   అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

అచ్చ తెలుగంటి  పెదవుల్ని వెలుగంటి బుగ్గలని దగ్గరగా చూశాను నేనే
పచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని  పిచ్చెక్కి చూశాను నేనే

చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే
చూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానే
రాశా నేనే రాశా నేనే హృదయం నీకే రాసిచ్చానే

సలీం (2009)

చిత్రం: సలీం (2009)
సంగీతం: సందీప్ చౌత
సాహిత్యం: చంద్రబోస్ (All Songs)
గానం: నిఖితా నిగమ్


ఈవేళలో హాయిలోమాయలో మాటరాని మత్తులో
i wanna talk to you
i wanna talk to you
హొయ్ ఒయ్ ఒయ్ హొయ్ ఒయ్ ఒయ్
నేనిన్నాళ్ళు నన్నే దాచి ఉన్నాను నాఊహలో
హొయ్ ఒయ్ ఒయ్ హొయ్ ఒయ్ ఒయ్
నేనీనాడు నన్నేదాటి ఉ౦డాలి నీ గు౦డెలో
i wanna talk to you
i wanna talk to you

పెదాలలో ప్రక౦పనే తొలి సాక్ష్య౦
పదాలలో ప్రవాహమే మలి సాక్ష్య౦
చెక్కిళ్ళలో సి౦ధూరమే చిరు సాక్ష్య౦
నా కళ్ళలో సముద్రమే తుది సాక్ష్య౦
అణువణువు నేడు అనేక గొ౦తులై
కణకణముకూ స్వరాల త౦త్రులై
ఒకే మాటనీ సదా స్మరి౦చుతున్నా
అదేమాటనీ చెప్పేస్తూ ఉన్నా..
i love you! i love you!
ఏ౦చేయనూ ఏమని చెప్పనూ
what do i do without you !
i wanna talk to you
i wanna talk to you

వెన్నెల్లలో అ౦ది౦చనా ఆహ్వాన౦
కన్నీళ్ళతో చేయి౦చనా అభిషేక౦
కౌగిళ్ళలొ దాచేయనా నీస్నేహ౦
ప్రాణాలలో ని౦పేయనా నీరూప౦
నీ శ్వాసలోన సుమాలగాలినై
నీ కాళ్ళ లోన సుగ౦ధ ధూలినై
ఎన్నో మాటలూ వినిపి౦చు వీలులేక
ఒకే మాటతో వివరి౦చేస్తున్నా
i love you i love you!
ఏ౦చేయనూ ఏమనీ చెప్పనూ
what do i do without you
i wanna talk to you
i wanna talk to you

ఢీ (2007)



చిత్రం: ఢీ (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి, సుధ


మది తెలుపుతున్నది మనమొక్కటేనని
ఈ దూరమన్నది అసలడ్డుకాదని

కనుపాపకు ఇది తెలుసా
నీ శ్వాసకు ఇది తెలుసా
కనుగొందా ఈ వరసా
గుర్తించిందా మనసా
నిను చూస్తున్నా ఏం చేస్తున్నా
నీడై గమనిస్తున్నా
నీ వెనకే వస్తున్నా
తనువులు విడిగా ఉన్నా
హృదయం ఒకటే కాదా
నిన్ను నన్ను ఏకం చేసే వంతెన వలపేగా

నిన్నా మొన్నా ఎపుడైనా ఈ అనందమే చూశానా
నిన్ను నన్ను కలిపింది ఆ దైవమే అనుకోనా

కనుపాపకి ఇది తెలుసా
కనుగొందా ఈ వరసా

పెదవిప్పలేని మాటైనా
కనురెప్పతోటె తెలిపైనా
ఎవరొప్పుకోను అంటున్నా
ఎద చప్పుడసలు ఆగేనా
ఎదుటే కదలాడుతున్నది ప్రాణం విడిగా
ఒకటై నడవాలి చివరికి నీడై ఓ జతగా
ఇంతమందిలో ఒకడై ఉన్నా
నిను వింతగా కనిపెడుతున్నా
ఎంతమందిలో నే కలిసున్నా
నీ చెంతకే చేరగ కలగన్నా

నిన్నా మొన్నా ఎపుడైనా ఈ ఆనందమే చూశానా
అంతా మాత్రం తెలిసున్నా  మా ముందేమిటో ఇది తగునా

కనుపాపకి ఇది తెలుసా
నీ శ్వాసకి ఇది తెలుసా

చిరు పంజరాన నేనున్నా
చిరునవ్వుతోనే చూస్తున్నా
తొలిపొద్దు జాడ తెలిసున్నా
సరిహద్దు దాటలేకున్నా

కలలే మరి భారమైనవి నిజమై తెలుసా
భారం ఎన్నాళ్ళో ఉండదు నను నమ్మే మనసా
నమ్మి నిన్నే నీలొ సగమైన కద
గుండెలోన నిన్ను దాచుకున్న ఇలా
గుండె చాటు గుట్టు తెలిసున్నా
అది విప్పి చెప్పలేరుగా ఎవరైనా

నిన్నా మొన్నా ఎపుడైనా ఈ అనందమే చూశానా
ఎన్నో ఎన్నో కథలున్నా ఈ కథే వింత ఎపుడైనా

కనుపాపకి ఇది తెలుసా
నీ శ్వాసకి ఇది తెలుసా
నిను చూస్తున్నా ఏం చేస్తున్నా
నీడై గమనిస్తున్నా
నీ వెనకే వస్తున్నా