Showing posts with label ఏప్రిల్ 1 విడుదల (1991). Show all posts
Showing posts with label ఏప్రిల్ 1 విడుదల (1991). Show all posts

ఏప్రిల్ 1 విడుదల (1991)


చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, చిత్ర



పల్లవి :


మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా

రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా...


నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా

మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట


గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా

ఎవరంటే నాకేమంటా తప్పులుంటె ఒప్పనంట


నీ వెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంటా

నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా


జణక్కు జుమ్మ...

మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంతా అంటా

మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట



చరణం 1:



నువ్వే మా మొదటి గెస్టని.. మా ఆవిడ వంట బెస్టని

ఈ ఫీస్టుకి పిలుచుకొస్తినీ... టేస్టు చెప్పి పోరా


ఇదే మా విందుభోజనం మీరే మా బంధువీదినం

రుచుల్లో మంచి చెడ్డలూ ఎంచి తెలుపుతారా..



అపార్ధం చేసుకోరుగా... అనర్ధం చెయ్యబోరుగా

యదార్ధం చేదుగుంటది... పదార్ధం చెత్తగున్నదీ

ఇది విందా నా బొందా... తిన్నోళ్ళూ గోవిందా

జంకేది లేదింక నీ టెంక పీకెయ్యగా.. పదర కుంకా..



నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా

మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంటా


గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా

ఎవరంటే నాకేమంటా తప్పులుంటె ఒప్పనంట


నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా

రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా



చరణం 2 :


భళారే నీలి చిత్రమా భలేగా... ఉంది మిత్రమా

ఇలా రసయాత్ర సాగదా.. పక్కనుంటె భామా


కోరావూ అసలు ట్రూతును... చూపాను సిసలు బూతును

చిక్కారూ తప్పుచేసి ఇక మక్కెలిరగదన్నూ



తమాషా చూడబోతిరా... తడాఖా చూపమందురా

మగాళ్ళని ఎగిరిపడితిరా... మదించీ మొదలు చెడితిరా

సిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా ...

లాకప్పు పైకప్పు మీకిప్పుడే చూపుతా.. బెండు తీస్తా...



మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా

రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా


నీ వెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంటా

నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా


జణక్కు జుమ్మా....

మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా

మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంటా


********** ********* *********



చిత్రం: ఏప్రిల్ 1 విడుదల (1991)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: మనో, చిత్ర


పల్లవి:


చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా

చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా


చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా

చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా

నిన్నే మెప్పిస్తాను.. నన్నే అర్పిస్తాను.. వస్తానమ్మా ఎట్టాగైనా


చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా

చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా


చరణం 1:


షోలే ఉందా ?

ఇదిగో ఇందా ....

చాల్లే ఇది జ్వాల కాదా..

తెలుగులో తీశారే బాలా..


ఖైదీ ఉందా?

ఇదిగో ఇందా..

ఖైదీ కన్నయ్య కాదే..

వీడికి అన్నయ్య వాడే..


జగదేకవీరుడి కథా.. ఇది పాత పిక్చర్ కదా

అతిలోక సుందరి తల.. అతికించి ఇస్తా పదా

ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి...


చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా

చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా


చరణం 2:


ఒకటా రెండా.. పదులా వందా

బాకీ ఎగవేయకుండా.. బదులే తీర్చేది ఉందా

మెదడే ఉందా.. మతి పోయిందా

చాల్లే మీ కాకి గోలా.. వేళా పాళంటూ లేదా


ఏవైంది భాగ్యం కథా? కదిలిందా లేదా కథా?

వ్రతమేదో చేస్తోందటా.. అందాక ఆగాలటా

లౌక్యంగా బ్రతకాలీ.. సౌఖ్యాలే పొందాలి...


చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా

చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా

నిన్నే మెప్పిస్తాను.. నన్నే అర్పిస్తాను.. వస్తానమ్మా ఎట్టాగైనా


చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా

చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా


********** ************ **********


చిత్రం: ఏప్రిల్ 1 విడుదల (1991)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, చిత్ర


పల్లవి:


ఒక్కటే ఆశా.. అందుకో శ్వాసా

అచ్చగా అంకితం చేశా.. పుచ్చుకో ప్రాణేశా

అచ్చగా అంకితం చేశా.. పుచ్చుకో ప్రాణేశా


చుక్కనే చూశా.. లెక్కలే వేశా

నింగిపై అంగలే వేశా.. కిందికే దించేశా

నింగిపై అంగలే వేశా.. కిందికే దించేశా


ఒక్కటే ఆశా.. అందుకో శ్వాసా


చరణం 1:


మెత్తగా ఒళ్ళో.. పెట్టుకో కాళ్ళూ ఉందిగా అంక పీఠం.. ఆడపుట్టుకే అందుకోసం

గట్టిగా పట్టుకో.. భక్తిగా అద్దుకో..పుచ్చుకో పాద తీర్ధం..పాద పూజలే ఆది పాఠం

చాకిరీ చెయ్యనా బానిసై.. నీ సేవలే చెయ్యనా పాదుషా

దీవెనే తీసుకో బాలికా.. నీ జీవితం సార్ధకం పొమ్మికా

మొక్కులే తీరీ.. అక్కునే చేరీ .. దక్కెనే సౌభాగ్యం


చుక్కనే చూశా.. లెక్కలే వేశా

నింగిపై అంగలే వేశా.. కిందికే దించేశా

అచ్చగా అంకితం చేశా.. పుచ్చుకో ప్రాణేశా

ఒక్కటే ఆశా.. అందుకో శ్వాసా


చరణం 2:


నచ్చెనే నారీ.. వచ్చెనే కోరీ..తెచ్చెనే ప్రేమ సౌఖ్యం.. సాటి లేనిదీ ఇంటి సఖ్యం

మెచ్చెనే చేరీ.. ముచ్చటే తీరీ..ఇచ్చెనే ప్రేమ రాజ్యం.. అంతులేనిదే సంతోషం

స్వప్నమే సత్యమై వచ్చెనేమో.. వెచ్చగా సర్వమూ పంచగా

స్వర్గమే సొంతమై దక్కెనేమో.. అచ్చటా ముచ్చటా తీర్చగా

మక్కువే మీరీ.. ముద్దులే కోరీ.. అందెనా ఇంద్రభోగం


ఒక్కటే ఆశా.. అందుకో శ్వాసా

అచ్చగా అంకితం చేశా.. పుచ్చుకో ప్రాణేశా

నింగిపై అంగలే వేశా.. కిందికే దించేశా

ఒక్కటే ఆశా.. అందుకో శ్వాసా


********** *********** ********


చిత్రం: ఏప్రిల్ 1 విడుదల (1991) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, చిత్ర 


పల్లవి: 


ఒంపుల వైఖరీ ... సొంపుల వాకిలీ ... ఇంపుగ చూపవే వయ్యారీ 

వెల్లువ మాదిరీ ... అల్లరి ఆకలీ ... ఎందుకు పోకిరీ చాలు మరీ 

మోవినీ ... మగతావినీ ... ముడి వేయనీయవా 

కాదనీ ... అనలేననీ ... ఘడియైన ఆగవా 

అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలీ ..హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలీ 


ఒంపుల వైఖరీ... సొంపుల వాకిలీ... ఇంపుగ చూపవే వయ్యారీ 

వెల్లువ మాదిరీ... అల్లరి ఆకలీ... ఎందుకు పోకిరీ చాలు మరీ ... హో 


చరణం 1: 


"మాంగల్యం తంతునానేన... మమజీవన హేతునా 

కంఠే భద్రామి శుభకే...త్వం జీవ శరదస్యకం 

త్వం జీవ శరదస్యకం... త్వం జీవ శరదస్యకం " 

కాంక్షలో కైపు నిప్పూ... ఎంతగా కాల్చినా 

దీక్షగా ఓర్చుకున్నా... మోక్షమే ఉండదా 

శ్వాసలో మోహదాహం... గ్రీష్మమై వీచగా 

వాంఛతో వేగు దేహం... మరయాగ వాటికా 


కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా 

మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా 

హో హో... 


ఒంపుల వైఖరీ... సొంపుల వాకిలీ... ఇంపుగ చూపవే వయ్యారీ 

వెల్లువ మాదిరీ... అల్లరి ఆకలీ... ఎందుకు పోకిరీ చాలు మరీ... హో 




చరణం 2: 


నిష్ఠగా నిన్ను కోరీ... నీమమే దాటినా 

కష్ఠమే సేద తీరే... నేస్తమే నోచనా 

నిద్రహం నీరు గారే... జ్వాలలో నింపినా 

నేర్పుగా ఈది చేరే... నిశ్చయం మెత్తనా 


సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా 

మధనమే అంతమయ్యే అమృతం అందుకో 

హో హో... 


ఒంపుల వైఖరీ... సొంపుల వాకిలీ... ఇంపుగ చూపవే వయ్యారీ 

వెల్లువ మాదిరీ... అల్లరి ఆకలీ... ఎందుకు పోకిరీ చాలు మరీ ... హో...