Showing posts with label Hari Charan. Show all posts
Showing posts with label Hari Charan. Show all posts

RRR (2022)




చిత్రం: RRR (2022)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర, యం.యం.కీరవాణి

పులికి విలుకాడికి తలకి ఉరితాడుకి 
కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి
రవికి మేఘానికి…. దోస్తీ…. (దోస్తీ)…

ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో….

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన 
కౌగిలి ఈ దోస్తీ

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

సుమ్మరి యారే యారే యరి యారే
సొరియారి యారి యరి యరి యరె యరె

అనుకోని గాలి దుమారం 
చెరిపింది ఇరువురి దూరం
ఉంటారా ఇకపై ఇలాగ వైరమే భూరివై
నడిచేది ఒకటే దారై వెతికేది మాత్రం వేరై
తెగిపోదా ఎదో క్షణాన స్నేహమే ద్రోహమై

ఓ… తొందర పడి పడి ఉరుకలెత్తే 
ఉప్పెన పరుగుల హో
ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులేవో హో

ఊహించని చిత్రవిచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన 
కౌగిలి ఈ దోస్తీ

ఒక చెయ్యి రక్షణ కోసం
ఒక చెయ్యి మృత్యు విలాసం
బిగిశాయి ఒకటై ఇలాగ తూరుపు పడమర
ఒకరేమొ దారుణ శస్త్రం
ఒకరేమొ మారణ శాస్త్రం
తెరతొలగిపోతే ప్రచండ యుద్దమే జరగదా
తప్పని సరియని తరునమొస్తే జరిగే జగడంలో
వాటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చే వారెవరో

ఊహించని చిత్రవిచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో

దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దరదం దరదం దరదం దం
దం దరదం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తీ
విధిరాతకి ఎదురీదని దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన 
కౌగిలి ఈ దోస్తీ
************* *************** ************

చిత్రం: RRR (2022)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ

పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతురాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు

నా పాట సూడూ నా పాట సూడూ నా పాట సూడూ
నాటు నాటు నాటు నాటు నాటు నాటు  వీర నాటు 
నాటు నాటు నాటు నాటు నాటు నాటు  ఊర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు విచ్చు కత్తి లాగ వెర్రి నాటు

గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలా కీసు పిట్ట కూసినట్టు
ఏలు సిటికెలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమారం రేగినట్టు
ఒల్లు సెమటపట్టేలా వీరంగం సేసినట్టు

నా పాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు..
నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు గడ్డపార లాగ చెడ్డ నాటు
నాటు నాటు నాటు నాటు నాటు ఉక్కపోత లాగ తిక్క నాటు

భూమి దద్దరిల్లేలా వంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా
ఏసేయరో యకాయకి నాటు నాటు నాటో
దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా
దుముకు దుముకులాడేలా దూకేయరో సరాసరి
నాటు నాటు నాటో

************* *************** ************
చిత్రం: RRR (2022)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: యం.యం.కీరవాణి
గానం: యం.యం.కీరవాణి & కోరస్

జననీ ప్రియ భారత జనని
జననీ 
మరి మీరు..?
సరోజిని, నేనంటే నా పోరాటం, అందులోను సగం.

నీ పాదధూళి తిలకంతో
భారం ప్రకాశమవని
నీ నిష్కళంక చరితం
నా సుప్రభాతమవని

జననీ, ఈ ఈ
ఆ నీలి నీలి గగనం
శత విస్ఫులింగ మయమై
ఆ హవన గంగ ధ్వనులే
హరినాశ గర్జనములై
ఆ నిస్వనాలు నా సేద తీర్చు
నీ లాలి జోలలవని
జననీ, ఈ ఈ

************* *************** ************
చిత్రం: RRR (2022)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కాలభైరవ

భీమా నిను గన్న నేలతల్లి 
ఊపిరిపోసిన చెట్టుసేమా 
పెరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా వినబడుతోందా

కొమరం భీముడో కొమరం భీముడో
కొర్రాసునెగుడోలే మండాలి కొడుకో
మండాలి కొడకో
కొమరం భీముడో కొమరం భీముడో
రగరార సూరీడై రగలాలి కొడుకో
రగలాలి కొడుకో

కాల్ మొక్కుతా బాంచన్ నని వంగీ తూగాల
కారడవి తల్లీకి పుట్టానట్టేరో
పుట్టానట్టేరో
జులుము గద్దెకు తలను వంచి తోగాల
జుడుము తల్లీ పేగుకు పెరగానట్టేరో
పెరగానట్టేరో

కొమరం భీముడో కొమరం భీముడో
కొర్రాసునెగుడోలే మండాలి కొడుకో
మండాలి కొడకో

చర్మామొలిసే దెబ్బకు అప్పంటోగాలా
చినికే రక్తం చూసి చెదిరి తోగాలా
గుబులేసి కన్నీరు వలికి తోగాలా
భూతల్లి చనుబాలు తాగనట్టేరో
తాగనట్టేరో

కొమరం భీముడో కొమరం భీముడో
కొర్రాసునెగుడోలే మండాలి కొడుకో
మండాలి కొడకో

కాలువై పారే నీ గుండె నెత్తూరు
కాలువై పారే నీ గుండె నెత్తూరు
నేలమ్మా నుదిటి బొట్టైతుంది చూడు
అమ్మా కాళ్ళ పారాణౌతుంది చూడు
తల్లీ పెదవుల నవ్వై మెరిసింది చూడు
పుడమితల్లికి జనమ మరణమిస్తివిరో కొమరం భీముడో
**************** ********** ***********

చిత్రం: RRR (2022)
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: విజయప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్

రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం

ఘాండీవ ముక్త పుంఖానుపుంఖ
శరపరంపరాహ ధవళీశతం

రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం

హస్తినాపుర సమస్తదితస్తి
కుంభస్థలది చరణ్ నటరాజం
నటరాజం

హస్తినాపుర సమస్తదితస్తి
కుంభస్థలది చరణ్ నటరాజం

రామం రాఘవం
రణధీరం రాజసం
రామం రాఘవం
రణధీరం రాజసం

************* *************** ************
చిత్రం: RRR (2022)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: విశాల్ మిశ్రా, పృద్వి చంద్ర , యం.యం.కీరవాణి, సాహితి  చాగంటి, హారికా నారాయణ్ 

పరాయి పాలనపై కాలు దువ్వి 
కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ...

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి
గిత్త కోత కొమ్ము కోడే
వంచలేని కోడె ఒంగోలు కోడే
సిరిగల కోడే సిరిసిల్ల కోడే

హ, ఎల ఎల కోడే… ఉజ్జయిని కోడే
రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే, హాయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

రయా రయ్యా రగతము లేలెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే
ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా
మోత కూత కోత కోట
తూట వేట తురుము కోడే

కసిగల కోడే కలకత్తా కోడే
ఉజగల కోడే గుజరాతి కోడే
కత్తిలాంటి కోడే నిట్టూరు కోడే
తిరుగేలేనిది తిరునల్వేలి కోడే, హాయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టు చుట్టు చుట్టు చుట్టు

చుట్టర చుట్టు తలపాగ చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టరా
మన ఒక్కో గొంతు కోట్లాది పెట్టురా

చూడరా మల్లేశా చుట్టమైనది భరోసా
కుమ్మర గణేశా కూడగట్టర కులాసా
అస్స బుస్స గుట్ట గిట్ట
గింజ గుంజ కంచు కోడే

(భల్లె భల్లె భల్లె భల్లె భల్లే)

పంతమున్న కోడే పంజాబి కోడే
దద్దెనన కోడే దంతూరి కోడే
పౌరుషాల కోడే బల్లాసి కోడే
విజయ విహారమే వీర మరాఠ కోడే, హొయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఉరుము ఉరుము ఉరుము ఉరుము
ఉరుమురు మురుమురుమురుమురు
మురుమురుమురు మురుమురు
ఉరుమురుమురుమురు

ప్రేమిస్తే (2005)



చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి
గానం: హరిచరన్, హరిణి సుధాకర్

ఏ దూర తీరాలు నా పయనమయినా
నే సేద తీరేది నీ ఓడిలోనే
మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా
నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం
ప్రాణం ప్రాణం ప్రాణం ప్రాణం

మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి
శిల్పంలాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టుతేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే

మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్ల గొట్టి
పట్టు తేనె కోరిందెవరో

మాటలు నేర్పే అమ్మను కూడా మరిచే క్షణము
మనసే దోచే వెన్నెల గువ్వ నీకై పరుగు
నిన్ను చూడ వచ్చే కంటి పాప చేసే ఎంతో పుణ్యం
ఒంటి మీద వాలే వాన చుక్క నీవై తడిపే వైనం
హ్రుదయము నిండే ప్రియమైన మాటే
చెరగని గురుతైపోదా
ఎద చేరి ఏలే చిత్రమైన ప్రేమ నిన్ను నన్ను కలిపేను కాదా

ఏ దూర తీరాలు నా పయనమయినా
నే సేద తీరేది నీ ఓడిలోనే
మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా
నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం

మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టు తేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే

మనసులు రెండు ఒకటైపొయే పలికే రాగం
ఎదనే మీటే చెరగని పేరు నిలిపే ప్రాణం
నన్ను తాకి వెళ్ళే చల్లగాలి లోన నీదే తలపు
నాలోఆశ దాచా పైట చాటు చేసా ఎదకే సుఖమై
స్వరముల జల్లై వలపు వెన్నెల్లై
అల్లుకుంటే ప్రేమే కదా
ఆది అంతం లేని మనల వీడిపోని దైవం ప్రేమే కాదా

మట్టిలాంటి నిన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నిన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టు తేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే
మట్టిలాంటి నిన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నిన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టు తేనె కోరిందెవరో




*********  *********  ********




చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: హరిచరణ్

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే
ప్రియతమా ప్రణయమా కుమలకే ప్రాణమా
అడుగు నీతోనే
జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే

కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును
వలచిన హృదయము తెలపదులే
గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వులే ఎన్నడు
దేవత పూజకు నోచవులే
మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందాగూడు
మన ప్రేమకు ఓటమి రానే రాదు
ప్రతి నదికి మలుపులు తధ్యం
బ్రతుకుల్లో బాధలు నిత్యం
ఎద గాయం మాన్పును కాలం
సిరివెన్నెల మాత్రం నమ్మి
చిగురాకులు బ్రతుకవు కాదా
మిణిగురులే ఓడి కిరణం


తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన చిలుకకు
గూడుగ నే ఉన్నా
గుండెపై నీవుగ వాలిన ప్రేమలో
ఎదురుగా పిడుగులే పడినను విడువనులే
స్నానానికి వేణ్ణిలవుతా అవి కాచే మంటనవుతా
హ్రుదయంలో నిన్నే నిలిపాలే
నిదురించే కంట్లో నేనే పాపల్లే మేలుకుంటా
కలలోనే గస్తీ కాస్తాలే
నేనంటే నేనే కాదు నువు లేక నేనే్లేను
నీ కంటి రెప్పల్లే ఉంటా

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే
ప్రియతమా ప్రణయమా కుమలకే ప్రాణమా
అడుగు నీతోనే.. అడుగు నీతోనే ..
అడుగు నీతోనే.. అడుగు నీతోనే

సర్వం తాళమయం (2019)



చిత్రం : సర్వం తాళమయం (2019)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : రాకేందు మౌళి
గానం : హరిచరణ్


మొదలయ్యే హృదయం సవ్వడి
గర్భాన తొలిగా
గర్వాల ఆటే ఆడి
ఆగేనే తుదిగా
గగనాలే ఘర్జించేనూ
తలబడితే మేఘాలే
సంద్రాలే హోరెత్తేనూ
కలబడితే అలలే

దేహం ప్రాణం ఆడే క్షణం
ఈ విశ్వం తాళ మయం
సర్వం సర్వం తాళ మయం
ఈ విశ్వం తాళ మయం
తాళం లేక ఏది జగం

మొలిచేటీ రెక్కల్లో
పిలిచేనీ తాళం
జలజలజల జారే కొండల
ధ్వనిలోని చలనం
గలగలగల పారే నదుల
ధ్వనిలోని గమనం
కుహుకుహు కూసే కోయిల
ధ్వనిలోని మధురం
కిలకిలకిల ఊగే కొమ్మల
ధ్వనిలోని తన్మయం

దేహం ప్రాణం ఆడే క్షణం
ఈ విశ్వం తాళ మయం
సర్వం సర్వం తాళ మయం
ఈ విశ్వం తాళ మయం
తాళం లేక ఏది జగం

పిపీలికం సరాల నడకే
వింటే స్వరతాళం కదా
మొగ్గే తుంచి తేనే జుర్రేసే
భ్రమరాల సడి తాళం వేయ్ రా
నేల మేళాన మోగించే వాన
నాట్యం చేసే చిటపట చినుకె
నీలో నిప్పు చప్పుళ్ళే అవి
నువ్వు నేనూ కాలాన్ని తాళం
జన్మించాం కలసిన లయలో
జీవించాం కల్లల లయలో
థై థై థై దిథై లయలో
తై తై తై.. తి త త

ఈ విశ్వం తాళ మయం
సర్వం సర్వం తాళ మయం
ఈ విశ్వం తాళ మయం
తాళం లేక ఏది జగం

మొదలయ్యే హృదయం సవ్వడి
గర్భాన తొలిగా
గర్వాల ఆటే ఆడి
ఆగేనే తుదిగా
గగనాలే ఘర్జించేనూ
తలబడితే మేఘాలే
సంద్రాలే హోరెత్తేనూ
కలబడితే అలలే

దేహం ప్రాణం ఆడే క్షణం
ఈ విశ్వం తాళ మయం
సర్వం సర్వం తాళ మయం
ఈ విశ్వం తాళ మయం
తాళం లేక ఏది జగం

మొలిచేటీ రెక్కల్లో
పిలిచేనీ తాళం

ఈ విశ్వం తాళ మయం
సర్వం సర్వం తాళ మయం
ఈ విశ్వం తాళ మయం
తాళం లేక ఏది జగం

రామ్ (2006)

చిత్రం: రామ్ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరన్, శ్వేతా మోహన్


నువ్వేనా ఎదలొ నువ్వేనా నువ్వేనా ఎదురుగ నువ్వేనా

అడుగడుగున నన్నే నడిపే రహదారిని నువ్వేనా
అణువనువున నన్నే తడిపే రస గోదారివి నువ్వేనా

నువ్వేన నువ్వేనా…..


నువ్వేనా ఎదలొ నువ్వేనా నువ్వేనా ఎదురుగా నువ్వేనా



నీలినింగి నువ్వేనా నేలరాజు నవ్వు నువ్వేనా

గాలి ఈల నువ్వేనా ఆ నువ్వు నేను కానా..
పూల మాల నువ్వేనా ఆ మేఘమాల నువ్వేనా
రాగామాల నువ్వేనా నీలోనా నేను లెనా
ప్రపంచము సమస్తమూ సామాప్తమవుతున్న
చారో సాఘం మరో జగం అనేది మనమేనా

నువ్వేనా నువ్వేనా……

నువ్వేనా ఎడాలో నువ్వేనా నువు నువ్వేనా ఎదురుగా నువ్వేనా

చెంప నురుపు నువ్వేనా నా పెదవి బెరుపు నువ్వేనా

ముద్దు ముడుపు నువ్వేనా అనలేను ఎందుకన్నా..
సొగసు నదులు నువ్వేనా చరసాల నిధులు నువ్వేనా
మధన తిధులు నువ్వేనా ఇకపాయినా ఆపుతున్న…
వసంతమో ఏ మంత్రమో షరత్తు ఏదయినా
యుగాంతము సుఖాంతమయి చరిత్ర మనదే…..

నువ్వేనా ఎడాలో నువ్వేనా నువ్వేనా ఎదురుగా నువ్వేనా…

స్పైడర్ (2017)



చిత్రం: స్పైడర్ (2017)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నిఖితా గాంధీ



భూమ్ భూమ్ భం భం
భూమ్ భూమ్ భం భం
భూకంపాల శబ్దమే
కుట్ర గట్రా పుట్టేలోపే ఇట్టే కాదా అంతమే
గాల్లో కన్నై గస్తీ కాసే గూడాచారి వీడులే
అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్నీ చేదిస్తాడులే

S P Y వచ్చాడోయ్ రయ్యారై తయ్యారై
S P Y వచ్చాడోయ్ రయ్యారై రై రై రై

డోరి డోరి డోంట్ యూ వర్రీ
హెర్ ఈజ్ ప్రిన్స్ ఆఫ్ రాతిరి
వీడే ఉంటే భయమే లేదు నవ్వేస్తుంది ఊపిరి
చట్టం షర్ట్ నలిగిపోతే చేసేస్తాడు ఇస్త్రీ
పంతంపట్టి ఎదురొచ్చాడో ఎవడే అయినా హిస్టరీ

S P Y వచ్చాడోయ్ రయ్యారై తయ్యారై
S P Y వచ్చాడోయ్ రయ్యారై రై రై రై

మార్వెల్ కామిక్స్ వీడ్ని చూసినాక రాశారేమో
హార్వర్డ్స్ లో ఈ మొనగాడు పట్టాగాని పొందాడేమో
మార్వెల్ కామిక్స్ వీడ్ని చూసినాక రాశారేమో
హార్వర్డ్స్ లో ఈ మొనగాడు పట్టాగాని పొందాడేమో
థీమ్ మ్యూజిక్ అక్కర్లేని మాస్సి హీరోనే వీడు
పంచేది వెయ్యకుండా క్లాప్స్ కొట్టిస్తాడు
భయమును బాంబ్ గా చేస్తాడు
హృదయము లోపల పెడతాడు
తెలివితో ఆడే పనివాడు
గెలుపుకు వీడే తనవాడు
వీడికి వినపడకుండానే చీమలు చిటెకలు వెయ్యవులే
వీడిని అనుమతి అడగనదే
క్రిములిక వ్యాపించవు అసలే

భూమ్ భూమ్ భం భం
భూమ్ భూమ్ భం భం

భూకంపాల శబ్దమే కుట్ర గట్రా పుట్టేలోపే
ఇట్టే కాదా అంతమే
గాల్లో కన్నై గస్తీ కాసే గూడాచారి వీడులే
అయ్యే తప్పు వచ్చే ముప్పు అన్నీ చేదిస్తాడులే

హూజ్ దట్ గయ్ మై మై మై
హి ఈజ్ ద స్పై ఫ్లై ఫ్లై ఫ్లై (4)



*******  *******  ******


చిత్రం: స్పైడర్ (2017)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: డి.సత్యప్రకాష్ , క్రిస్టోఫర్ స్టాన్లీ , ప్రవీణ్ సైవి


అచ్చం తెలుగందం
కనులకు దొరికెను తొలిసారీ
బ్లైంద్ డెట్ ఊరిస్తూ
ఎదురుగ నిలిచెను సుకుమారీ

ఫొన్ లో బుబ్బ్లీ గా
మనసుని కదిపిన పిల్లేనా
చూస్తె వెరలా ఎందుకుంది
ఆసలు ఇది తానేనా

షి ఇస్ మిస్ మిస్.టీరీయాస్
కాని బ్లాడి గార్.జియాస్
అబ్బబ్బ అబ్.కురియాస్
నెనొ కన్.ఫూషియాస్

షి ఇస్ మిస్ మిస్.టీరీయాస్
కాని బ్లాడి గార్.జియాస్
అబ్బబ్బ అబ్.కురియాస్
నెనొ కన్.ఫూషియాస్

ఉష్నం ఎంతుందో
ధర్మమీటర్ ధర్మమీటర్ చెప్తుంది
శిఖరం హైట్ ఎంతో
ఆల్టిమీటర్ ఆల్టిమీటర్ చెబుతుంది
సంధ్రం లోతెంతో
ఫతొమీటర్ ఫతొమీటెర్ చెబుతుంది
ఆమ్మై గుండెల్లో మ్యటర్ చెప్పె
మీటర్ కనిపెట్టలేదె

షి ఇస్ మిస్ మిస్.టీరీయాస్
కాని బ్లాడి గార్.జియాస్
అబ్బబ్బ అబ్.కురియాస్
నెనొ కన్.ఫూషియాస్

షి ఇస్ మిస్ మిస్.టీరీయాస్
కాని బ్లాడి గార్.జియాస్
అబ్బబ్బ అబ్.కురియాస్
నెనొ కన్.ఫూషియాస్

నీలి కలలు కనే
తొలి తొలి అలజడి ఈమేనా
మల్లి ఉదయంలో పడి పడి
పూజలు చెసేనా
పొంగె పరువంతో బరువుగ
అటు ఇటు తూగేనా
అయినా చదువుల్లో మెదడుకు
పదునుగ సాగెనా

ఒక రూపం రెండుగా
మిగిలిందో ప్రశ్నగా
గమనిస్తు వింతగా
తను నేనయ్యానుగా

షి ఇస్ మిస్ మిస్.టీరీయాస్
కాని బ్లాడి గార్.జియాస్
అబ్బబ్బ అబ్.కురియాస్
నెనొ కన్.ఫూషియాస్


*******  *******  ******


చిత్రం: స్పైడర్ (2017)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శక్తిశ్రీ , హరిచరన్

సిసిలియా సిసిలియా
చిరు చిరు గాలికి సెగ పెడదామా
సిసిలియా సిసిలియా
చెకుముకి ముద్దులు మొదలెడదామ

సిసిలియా సిసిలియా
చిరు చిరు గాలికి సెగ పెడదామా
సిసిలియా సిసిలియా
చెకుముకి ముద్దులు మొదలెడదామా

అలసల అలసల ఐలేమా
హెయ్ అలసల ఐలేమా
ఆలసల అలసల ఐలేమ ఐలెలేమా

అలసల అలసల ఐలేమా
హెయ్ అలసల ఐలేమా
ఆలసల అలసల ఐలేమ ఐలెలేమా

హెయ్ పిల్ల అచ్చచా
నా చెయ్యి తకించా
తాపాల గోరు వెచ్చ వేడి పెంచా
ఇంకెందుకే చర్చా 1 2 3 లెక్కించా
పరువాల ఆకు పచ్చ ఆక్రమించా

తిరిగే ఈ జగమును చూస్తే
నిజమే ని సొగసున కాస్తే
ఇదిగో ఇది పగిలే వార్తే
పగిలా నువు నవ్వీసిరేస్తే

సిసిలియా సిసిలియా
చిరు చిరు గాలికి సెగ పెడదామా
సిసిలియా సిసిలియా
చెకుముకి ముద్దులు మొదలెడదామా

సిసిలియా సిసిలియా
చిరు చిరు గాలికి సెగ పెడదామా
సిసిలియా సిసిలియా
చెకుముకి ముద్దులు మొదలెడదామా

ఫొన్ సిగ్నల్ లేని చొటై
రెడ్ సిగ్నల్ లేని బాటై
నీతో ఎన్సక్కా యెగిరిపొవాలీ

ఓ బ్రేక్ఫస్ట్ ఐ నీ పాదాలె
లంచ్ అల్లె హ్రుదయం చాల్లే
నా డిన్నర్ అంటె నీ నీలాల కళ్ళే

నా దేహ దేశం నీ స్పర్ష కోసం
నీ చిలిపి మోసం ఇట్స్ ఒకె అవ్.సం

సిసిలియా సిసిలియా
చిరు చిరు గాలికి సెగ పెడదామా
సిసిలియా సిసిలియా
చెకుముకి ముద్దులు మొదలెడదామా

సిసిలియా సిసిలియా
చిరు చిరు గాలికి సెగ పెడదామా
సిసిలియా సిసిలియా
చెకుముకి ముద్దులు మొదలెడదామా

హెయ్ అలసల అలసల ఐలే
యె అలసల అలస ఐలె
హెయ్ అలసల అలసల ఐలే
త న న నన

హెయ్ అలసల అలసల ఐలే
యె అలసల అలస ఐలె
హెయ్ అలసల అలసల ఐలే
త న న నన

నీ గుందె విండో తెరిచీ
పేండోర పువ్వులు తెచ్చి
ఐ లవ్ యు అంటే
పులకించి పొతా

నా కోసం నచ్చి మెచ్చి
ల ల ల మెలొడీ నేర్చి
నువ్ పాడుతుంటే పూదోటై పొతా

ఓ గమ్మత్తుగుందీ పెదవంచు సమరం
పొలీటి లాగ మన ప్రేమ అమరం

సిసిలియా సిసిలియా
చిరు చిరు గాలికి సెగ పెడదామా
సిసిలియా సిసిలియా
చెకుముకి ముద్దులు మొదలెడదామా

సిసిలియా సిసిలియా
చిరు చిరు గాలికి సెగ పెడదామా
సిసిలియా సిసిలియా
సిసిలి హూ

హెయ్ పిల్ల అచ్చచ్చా
న చెయ్యి థకించ
తాపల గోరు వెచ్చ వెడి పెంచా

హెయ్య్ నీకొసం అచ్చచ్చా
దొరాలే తగ్గించా
లిప్స్టిక్ లా పూల తేనే రాసుకొచ్చా

తిరిగే ఈ జగమును చూస్తే
నిజమే ని సొగసున కాస్తే
ఇదిగో ఇది పగిలే వార్తే
పగిలా నువు నవ్వీసిరేస్తే


*******  *******  ******


చిత్రం: స్పైడర్ (2017)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: బ్రీజేశ్ త్రిపాఠి శాండిల్య , హరిణి, సునీత ఉపద్రష్ట


ఏహ్ పుచ్చకాయ పుచ్చకాయ
పెదవితీపి
నాకు ఇచ్చుకోవె ఇచ్చుకోవె

నే మెచ్చుకున్న మెచ్చుకున్న
సోకులిచ్చి
నా గుండెకొచ్చి గుచ్చుకోవె

కన్నె చున్నికి మల్లె
నన్ను ఉతికి పిండి
రంగు దండనికేసి ఎండకారేసి
తీసి వంక నడుముకు నడుముకు చుట్టుకోవె చుట్టుకోవె
సొట్ట బుగ్గ చిట్టి జబిల్లి

హాలి హాలి ఎయ్ హాలి హాలి హాలిబి
హాలి హాలి ఎయ్ హాలి హాలి హాలిబి
ఏయ్ హాలి ఎయ్ హాలి హాలి హాలీబీ
హాలి హాలి ఎయ్ హాలి హాలి హాలిబీ

ఏహ్ పుచ్చకాయ పుచ్చకాయ
పెదవితీపి
నీకు ఇచ్చుకోన ఇచ్చుకోన

నువ్వు మెచ్చుకున్న మెచ్చుకున్న
సోకులిచ్చి
నీ గుండెకొచ్చి గుచ్చుకోన

కన్నె చున్నికి మల్లె
నిన్ను ఉతికి పిండి
రంగు దండనికెసి ఏండకారెసి
తీసి వంక నడుముకు నడుముకు చుట్టుకోద చుట్టుకోద
సొట్ట బుగ్గ చిట్టి జాబిల్లి

ఛమక్కుల టెంటుబొమ్మ లెక్క నీది
వెడెక్కిన ఫ్రంటు బెంచి కిక్కు నాది
ఓ పక్కన వుండమంటె వుండనందీ
ముదిరె పిచ్చ్చి

చల్ల చల్ల పుల్ల ఐసు వయసిది
తెల్ల తెల్ల బెల్లమంటి సొగసిది
నసాలమె అదరగ ఇచ్చుకోరా
అడిగే మిర్చి

రంగు పీచు మిటై లాంటి
బుగ్గే రమ్మందే
ఎర్రకారాల నీ పెదవె నొరూరించిందే
ఆకలేమొ ఆకాశం తాకి
నీపై దూకిందే

ఏహ్ పుచ్చకాయ పుచ్చకాయ
పెదవితీపి
నీకు ఇచ్చుకోన ఇచ్చుకోన
ఇచ్చుకో ఇచ్చుకో

నువ్వు మెచ్చుకున్న మెచ్చుకున్న
సోకులిచ్చి
నీ గుండెకొచ్చి గుచ్చుకోన
గుచ్చుకో గుచ్చుకో

కన్నె చున్నికి మల్లె
నిన్ను ఉతికి పిండి
రంగు దండనికెసి ఏండకారెసి
తీసి వంక నదుముకు నదుముకు చుట్టుకోద చుట్టుకోద
సొట్ట బుగ్గ చిట్టి జాబిల్లి

ఎక్కిలకు ఏల పాల తెలియదు
సన్నిల్లతొ ఒంటి మంట తరగదు
సందెల్లకు సక్కనోడు ఎక్కడంది
పెరిగే ముద్దు

తలెత్తిన తహ తహ నిలవదు
అదెంతని కొలతకు దొరకదు
దిమక్కిదీ దిండుమీద పండుకొదు
నిదురేపొదు

చిన్న టీసారు చూస్తునే
నువ్వు తబ్బిబ్బయ్యవా
ఇక ట్రైలరు చూపించానొ
అబ్బ అనుకోవా
వాయిదా వేసె వయసే కాదు
వద్దకొస్తావా..అ ఆ అ ఆ అ ఆ అ ఆ

ఏహ్ పుచ్చకాయ పుచ్చకాయ
పెదవితీపి
నాకు ఇచ్చుకోవె ఇచ్చుకోవే

నే మెచ్చుకున్న మెచ్చుకున్న
సోకులిచ్చి
నా గుండెకొచ్చి గుచ్చుకోవె

కన్నె చున్నికి మల్లె
నిన్ను ఉతికి పిండి
రంగు దండనికెసి ఏండకారెసి
తీసి వంక నడుముకు నడుముకు చుట్టుకోద చుట్టుకోద
సొట్త బుగ్గ చిట్టి జబిల్లి

హాలి హాలి ఏయ్ హాలి హాలి హాలిబి
హాలి హాలి ఏయ్ హాలి హాలి హాలిబి

ఏయ్ హాలి
ఏయ్ హాలి హాలి హాలి హాలీబీ

హాలి హాలి హాలి హాలి హాలి హాలి
ఏయ్ హాలి హాలి హాలిబి