Showing posts with label Suriya. Show all posts
Showing posts with label Suriya. Show all posts

సూర్య s/o కృష్ణన్ (2008)

 



చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008)

సంగీతం: హారీస్ జయరాజ్
సాహిత్యం: వేటూరి
గానం: హారీస్ జయరాజ్, హరీష్ రాఘవేంద్ర, వి. వి. ప్రసన్న, దేవన్ ఏకాంబరం

నాలోనే పొంగెను నర్మదా
నీలల్లో మురిసిన తామర
అంతట్లో మారెను ఋతువులా
పిల్లా నీ వల్లా...

నీతో పొంగే వెల్లువా 
నీలల్లో ఈదిన తారకా
బంగారు పూవ్వుల కానుక
పేరేలే కాంచన...

ఓం శాంతి శాంతి ఓ శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే 
నా శ్వాసే నీవే దోచావే
చెలి నేనే నీవు అయ్యవే

నాలోనే పొంగెను నర్మదా
నీలల్లో మురిసిన తామర
అంతట్లో మారెను ఋతువులా
పిల్లా నీ వల్లా...

ఏదో ఒకటి నన్ను కలచి
ముక్కు చివర మర్మమొకటి
కల్లా కపటం కరిగిపోయి
ముసి నవ్వా బూగమెల్ల
నువ్వు నిలిచిన చోటేదో వెలయంతో పలికెను
నువ్వు నడిచే బాటంతా మంచల్లే అయ్యెనో
నాతోటి రా ఇంటివరకు
నా ఇల్లే చూసి నన్ను మెచ్చు
ఈమె ఎవరో ఎవరో తెలియకనే
హా వెనకే నీడై పోవద్దే
ఇది కలయో నిజమో ఏ మాయో
నా మనసే నీకు వశమాయె - వశమాయె

నాలోనే పొంగెను నర్మదా
నీలల్లో మురిసిన తామర
అంతట్లో మారెను ఋతువులా
పిల్లా నీ వల్లా...

నీతో పొంగే వెల్లువా 
నీలల్లో ఈదిన తారకా
బంగారు పూవ్వుల కానుక
పేరేలే కాంచన...

కంటి నిద్రే దోచుకెళ్లావు
ఆశలన్ని చల్లి వెళ్లావు
నిన్ను దాటి పోతూ ఉంటే
వీచే గాలి దిశలు మారు
ఆగంటు నీవంటే నా కాళ్ళే ఆగేనే
నీ తలలో పూలన్ని వశివాడవు ఏ నాడు
కౌగిలింతే కోరలేదు కోరితే కౌగిలి కాదు
నా జీవన సర్వం నీతోనే
నను తలచే నిమిషం ఇదియేనే
నువ్వు లేవు లేవు అనకుంటే
నా హృదయం తట్టు కోలేదే

నాలోనే పొంగెను నర్మదా
నీలల్లో మురిసిన తామర
అంతట్లో మారెను ఋతువులా
పిల్లా నీ వల్లా...

నీతో పొంగే వెల్లువా 
నీలల్లో ఈదిన తారకా
బంగారు పూవ్వుల కానుక
పేరేలే కాంచన...

ఓం శాంతి శాంతి ఓ శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే 
నా శ్వాసే నీవే దోచావే
చెలి నేనే నీవు అయ్యవే


చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008)
సంగీతం: హారీస్ జయరాజ్
సాహిత్యం: వేటూరి
గానం: సుధా రఘునాథన్

నిదరే కల అయినది కలయే నిజమైనది
బతుకే జత అయినది జతయే అతనన్నది
మనసేమొ ఆగదూ  క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా... 

నిదరే కల అయినది కలయే నిజమైనది
బతుకే జత అయినది జతయే అతనన్నది
మనసేమొ ఆగదూ  క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా... 

చరణం: 1
వయసంతా వసంత గాలి
మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారిదారి
చిగురులతో చిలకలతో
యమునకు కే సంగమమే
కడలినది కలవదులే
హృదయమిలా అంకితమై
నిలిచినది తనకొరకే
పడినముడి పడుచోడి
ఎదలో చిరుమువ్వల సవ్వడి 

నిదరే కల అయినది కలయే నిజమైనది
బతుకే జత అయినది జతయే అతనన్నది
మనసేమొ ఆగదూ  క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా... 

చరణం: 2
అభిమానం అనేది మౌనం
పెదవులపై పలకదులే
అనురాగం అనే స్వరాగం
స్వరములకే దొరకదులే
నిను కలిసిన ఈ క్షణమే
చిగురించే మధు మురళి
నిను తగిలిన ఈ తనువే
పులకరించే ఎద రగిలే
యెదుటపడి కుదుటపడే 
మమకారపు నివాళిలే ఇది

నిదరే కల అయినది కలయే నిజమైనది
బతుకే జత అయినది జతయే అతనన్నది
మనసేమొ ఆగదూ  క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా... 


చిత్రం: సూర్య s/o కృష్ణన్ (2008)
సంగీతం: హారీస్ జయరాజ్
సాహిత్యం: వేటూరి
గానం: నరేష్ అయ్యర్, ప్రశాంతిని

మొన్న కనిపించావు మయమరచి పోయాను 
అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే 
ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పొడలేక 
ఎందెందు వెతికాను కాలమే వృథా ఆయెనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన 

ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత

మొన్న కనిపించావు మయమరచి పోయాను 
అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే
ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పొడలేక
ఎందెందు వెతికాను కాలమే వృథా ఆయెనే

చరణం: 1
త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే 
తులాభారం తూగేది ప్రేయసికే
ముఖం చూసి పలికే వేళ 
భలే ప్రేమ చూసిన నేను 
హత్తుకోక పోతానా అందగాడా
ఓ... నీడవోలె వెంబడి ఉంటా తోడుగా చెలీ
పొగవోలె పరుగున వస్తా తాకనే చెలీ
వేడుకలు కలలు నూరు వింత ఓ చెలి

మొన్న కనిపించావు మయమరచి పోయాను 
అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే
ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పొడలేక
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే

చరణం: 2
కడలి నీళ్లు పొంగే అందం
అలలు వచ్చి తాకే తీరం
మనసు జిల్లుమంటోంది ఈ వేళలో 
తల వాల్చే ఎడమిచ్చావే 
వేళ్ళు వేళ్ళు కలిపేశావే 
పెదవికి పెదవీ దూరమెందుకే
పగటి కలలు కన్నా నిన్ను కునుకు లేకనే
హృదయమంత నిన్నే కన్నా దరికే రాకనే 
నువ్వ్వు లేక నాకూలేదు లోకమన్నది

మొన్న కనిపించావు మయమరచి పోయాను 
అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే
ఎన్నెన్ని నాల్లైన నీ జాడ పొడలేక
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన 

ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
ఈ పొద్దే నా తోడు వచ్చే ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత

వెన్నెలా... వెన్నెలా...  వెన్నెలా...

నువ్వు నేను ప్రేమ (2006)



చిత్రం: నువ్వు నేను ప్రేమ (2006)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచన: వేటూరి
గానం: శ్రేయాఘోషల్, నరేష్ అయ్యర్


ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే
నే నేనా అడిగా నన్ను నేనే...
నే నీవే హృదయం అన్నదే

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే

రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన
చల్లని పున్నమి వెన్నెల ముందు
పూవైనా పుస్తున్నా ని పరువంగానే పుడతా
మధు మాసపు మాలల మంటలు రగిలించే ఉసురై...
నీవే నా మదిలో అడ నేనే... నే నటనై రాగా
నా నాడుల నీ రక్తం నడకల్లో నీ శబ్దం ఉందే హో
తోడే దొరకని నాడు విలవిలలాడే ఒంటరి మీనం

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
నే నేనా అడిగా నన్ను నేనే...
నే నేనా అడిగా నన్ను నేనే
ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా

నెల నెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా
నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా
తుమ్మెద తేనెలు తేలే ని మదిలో చోటిస్తావా
నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించ తరమా
నీవు సంద్రం చేరి గల గల పారే నది తెలుసా

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే
నే నేనా అడిగా నన్ను నేనే...
నే నీవే హృదయం అన్నదే

ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే

రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన
చల్లని పున్నమి వెన్నెల ముందు
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన
చల్లని పున్నమి వెన్నెల ముందు

ఆరు ( 2005)



చిత్రం: ఆరు ( 2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు , సుమంగళి


చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళోద్దే
అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దే
ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే
చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళోద్దే

వద్దు వద్దంటు నేనున్నా వయసే గిల్లింది నువ్వేగా
పో పో పొమ్మంటు నేనున్నా పొగలా అల్లింది నువ్వేగా
నిదరోతున్న  హృదయాన్ని లాగింది నువ్వేగా
నలుపై ఉన్న రాతిరికి రంగులు నువ్వేగా
నాతో నడిచే నా నీడ నీతో నడిపావే
నాలో నిలిచే నా ప్రాణం నువ్వై నిలిచావే
చూడొద్దే నను చూడొద్దే చురకత్తిలాగ నను చూడొద్దే
వెళ్ళోద్దె వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళోద్దే

హా ... హా...

వద్దు వద్దంటు నువ్వున్నా వలపే పుట్టింది నీ పైనా
కాదు కాదంటు నువ్వున్నా కడలి పొంగింది నాలోన
కన్నీల్ల తీరంలో పడవల్లే నిలుచున్నా
సుడిగుండాల శృతిలయలో పిలుపే ఇస్తున్నా
మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగునులే
ఒంటిగా తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే

చూడొద్దు నను చూడొద్దు చురకత్తిలాగ నను చూడొద్దు
వెళ్ళోద్దు వదిలెళ్ళొద్దు మది గూడు దాటి వదిలెళ్ళొద్దు
అప్పుడు పంచిన నా మనసే అప్పని అనలేదే
గుప్పెడు గుండెల చెలిఊసే ఎప్పుడు నీదేలే



**********  **********  **********



చిత్రం: ఆరు ( 2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: శ్రీనివాస్, శ్రీలేఖ పార్థసారథి

హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే
వయసు అను గగనంలో మనసు అను మేఘంలో
చిరు ఆశల వర్షంలో నన్ను గుచ్చి గుచ్చి తడిపావే
నా అణువు అణువు నువ్వేలే నీ తనువు తనువు నాదేలే
ప్రతి క్షణము క్షణము మనదేలే ఓ చెలీ...

హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే

హా వెన్నెల వల విసిరి నీ కన్నుల వెలుగిస్తా
మెరుపుల మెడ వంచి నీ మెడలో గొలుసేస్తా
ఆహా చుక్కలు అన్ని చేపలు చేసి నీకే కమ్మని విందిస్తా
మబ్బుని దించి సబ్బుగ మార్చి నీకే స్నానం చేయిస్తా...

హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే


B O Y BOY,  Boy అంటే అబ్బాయి
G I R L GIRL, Girl అంటే అమ్మాయి
This girl is so hot that will make him crazy
And they r just gonna rock so take it easy
వీళ్లిద్దరి మద్యనా touching touching
అర్రె anytime anywhere kissing kissing

కాలికి రెక్కలు కట్టి నీ కౌగిట వాలిపోతా
పూలని అప్పడిగి పువ్వు రేకుని చీర కుడతా
హా ఆకాశాన్నే చాపే చుట్టి నీకే పరుపుగ పరిచేస్తా
సుర్యుడ్నే ఓ గుద్ధుతో చంపి పొద్దె పొడవని ముద్దిస్థా...

హృదయం అను లోకంలో ప్రేమ అను దేశంలో
స్వప్నం అను నగరంలో నా చెంత చేర వచ్చావే

B O Y BOY,  Boy అంటే అబ్బాయి
G I R L GIRL, Girl అంటే అమ్మాయి
This girl is so hot that will make him crazy
And they r just gonna rock so take it easy

గజిని (2005)



చిత్రం: గజిని (2005)
సంగీతం: హారీస్-జయరాజ్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ


హృదయం ఎక్కడున్నదీ... హృదయంఎక్కడున్నదీ...
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్ధం... ఆడుతున్న వయసే...
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా... చూపుల్లోన బతికా...
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా
తొలిసారీ... కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా
హృదయం ఎక్కడున్నదీ... హృదయంఎక్కడున్నదీ...
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్ధం... ఆడుతుున్న వయసే...
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా... చూపుల్లోన బతికా...
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా తొలిసారీ...
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా...

చరణం: 1
కుందనం మెరుపు కన్నా... బంధనం వయసుకున్నా...
చెలి అందం నేడే అందుకున్నా
గుండెలో కొసరుతున్నా... కోరికే తెలుపుకున్నా...
చూపే వేసీ బతికిస్తావనుకున్నా
కంటిపాపలా పూవులనే నీ కనులలో కన్నా...
నీ క ళ్ళే వాడిపోని పూవులమ్మా...
నీ క ళ్ళే వాడిపోని పూవులమ్మా...
హృదయం ఎక్కడున్నదీ... హృదయంఎక్కడున్నదీ...
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్ధం... ఆడుతుున్న వయసే...
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా... చూపుల్లోన బతికా...
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా తొలిసారీ...
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా...

చరణం: 2
మనసులో నిన్ను కన్నా... మనసుతో
పోల్చుకున్నా... తలపుల పిలుపులు విన్నా...
సెగలలో కాలుతున్నా... చలికినే
వణుకుతున్నా... నీడే లేని జాడే తెలుసుకున్నా
మంచు చల్లనా... ఎండ చల్లనా...
తాపంలోనా మంచు చల్లనా...
కన్నా నీ కోపంలోనా ఎండ చల్లనా...
కన్నా నీ కోపంలోనా ఎండ చల్లనా...
హృదయం ఎక్కడున్నదీ... హృదయంఎక్కడున్నదీ...
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్ధం... ఆడుతుున్న వయసే...
నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా... చూపుల్లోన బతికా...
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా తొలిసారీ...
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా తొలిసారీ...
కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా...



********   *********   ********



చిత్రం: గజిని (2005)
సంగీతం: హారీస్-జయరాజ్
సాహిత్యం: వేటూరి
గానం: కార్తిక్

ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం
ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే
తన అల్లే కథలే పొడుపు వెదజల్లే కలలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే
అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం
కనులు తెరిచిన కలువను చూశానే చూశానే చూశానే
ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే

చరణం: 1
పాత పదనిస దేనికద నస నడకలు బ్రతుకున మార్చినదే
సాయంకాల వేళ దొరుకు చిరుతిండి వాసనలు వాడుక చేసిందే
కుచ్చీ కూన చల్లగా... నీ... సా...
నను తాకె కొండమల్లికా... నీ... సా...
సరిజోడు నేనేగా అనుమానం ఇంకేలా
ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే

చరణం: 2
పేరు అడిగతె తేనె పలుకుల జల్లుల్లో ముద్దగా తడిశానే
పాలమడుగున మనసు అడుగున కలిసిన కనులను వలచానే
మంచున కడిగిన ముత్యమా నీ మెరిసే నగవే చందమా
హో... కనులారా చూడాలే తడి ఆరిపోవాలే
ల రలాల లర లల లాల... ఓ... ల రలాల లర లల లాల... ఓ...
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే
తన అల్లే కథలే పొడుపు వెదజల్లే కలలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే
అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం
కనులు తెరిచిన కలువను చూశానే చూశానే చూశానే

గ్యాంగ్ (2018)

చిత్రం: గ్యాంగ్ (2018)
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: రాహుల్ శిప్లిగంజ్


చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

అరె రండయ్య రండయ్య
లేటింక వద్దయ్య
ఎక్కడున్నారయ్యా ఎప్పుడొస్తారయ్య
చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

అరె రండయ్య రండయ్య
లేటింక వద్దయ్య
ఎక్కడున్నారయ్యా ఎప్పుడొస్తారయ్య
చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

ఎగిరి ఎగిరి పైకి ఎగర
తిరిగి తిరిగి మనము నవ్వగ
చిందాడి చిందాడి ఆడాలి నువ్వింక
కలిసి కలిసి దూకాలిరా ఇంక
తగ్గద్దు తగ్గద్దు మాట పదును
ఎగసె ఎగసె పైకి కదులు
ఎరుపు ఎరుపు కొపమవ్వర
ఎంత పడితె అంత లెగర

చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా

వెళ్ళొద్దు అంటూనె ఆపేటివాళ్ళె ఉంటే
తరిమి చూడరా
తలపొగరుతొ ఎగిరె వాడిని
తరిమి కొట్టరా
ఆకలి అన్న వాడి ముద్ద లాగుతుంటె
ఎదురు తిరగరా
నిన్ను తగలక భయపడేల
తెగువ చూపరా
కడుతు గొడవబడిన
తిరిగి తిరగపడరా
పలుగు ఎదురుపడితె
నలిపి గెలవరా
ఎవడు తగువు పడిన
ఎవడి మాట వినక
తరిమి తరిమి కొడితె
తలుపు విరగదా

అరె పోవయ్య పోవయ్య
ఏ చోట పోవయ్య
కంట పడ్డారంటే తంటాలు మీకయ్య
అకడ ఇకడ ఎకడొ పోవయ్య
ఇటు పక్కకి వచ్చారో ఇంజరీ అవునయ్య

చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు
నడి రోడ్డులోన
చిటికె మీద చిటికె వేసెరా

విరిచి విరిచి ఇరగ తోముతాం
ఇంక విరిచి విరిచి ఇరగ తోముతాం
అధికారం అణిచి దించేసి పొగరు
తొక్కిపెట్టి నరము లాగుతాం

ఎయ్ ఎత్తుకు పోవ్వలి పళ్ళు ఊడకొట్టాలి
వీధి వీధి తిప్పి చెప్పులతొ కొట్టాలి
కాదంటు అంటేనే ఎత్తెత్తి ఎత్తెత్తి తన్నాలి
బీద వాళ్ళ బాధ వాడింక చూడాలి
విరిచి విరిచి ఓ.. విరిచి
ఇంక విరిచి విరిచి ఇరగ తోముతా
అధికారం అణిచి దించేసి పొగరు
తొక్కిపెట్టి నరము లాగుతా
చిటికె మీద చిటికె వేసెరా..