Labels
చూడాలనివుంది (1998)
చిత్రం : చూడాలనివుంది (1998)
సంగీతం : మణిశర్మ
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : ఉదిత్ నారాయణ్, స్వర్ణలత
పల్లవి :
రామా చిలకమ్మా.. ప్రేమా మొలకమ్మా
రామా చిలకమ్మా.. ప్రేమా మొలకమ్మా.. రాధమ్మా
పాలే తెలుపన్నా.. నీళ్ళే నలుపన్నా.. గోపెమ్మా
ముక్కు మీద తీపి కోపాలా.. మూగకళ్ళ తేనె దీపాలా
గంగూలి సందులో గజ్జెల గోల.. బెంగాలి చిందులో మిర్చిమసాలా
అరె వేడేక్కి ఉన్నది వెన్నెల బాల.. మేడెక్కి దిగుదురా మేఘమాల
రామా చిలకమ్మా.. ప్రేమా మొలకమ్మా
రామా చిలకమ్మా.. ప్రేమా మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్నా.. నీళ్ళే నలుపన్నా గోపెమ్మా
చరణం 1:
గోపెమ్మో.. గువ్వాలేని గూడు కాకమ్మో
కృష్ణయ్యో.. పూవ్వే నాదే పూచే నీదయ్యో
దొంగలించుకున్న సొత్తు గోవిందా
ఆవలించకుంటె నిద్దరౌతుందా
ఉట్టికొట్టే వేళ రైకమ్మో.. చట్టీ దాచిపెట్టూ కోకమ్మో
కృష్ణమురారీ వాయిస్తావో చలి కోలాటమేదో ఆడిస్తావో
రామా చిలకమ్మా.. ప్రేమా మొలకమ్మా
రామా చిలకమ్మా.. ప్రేమా మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్నా.. నీళ్ళే నలుపన్నా గోపెమ్మా
చరణం 2 :
ఓలమ్మో .. చోళిలోన షోకు గోలమ్మో
ఓయమ్మో.. ఖాళీ లేక వేసే ఈలమ్మో
వేణువంటే వెర్రిగాలి పాటేలే
అది వెన్నదోచుకున్న వెన్ను చాటేలే
జట్టేకడితే జంట రావమ్మో.. పట్టువిడుపు ఉంటే మేలమ్మో
ప్రేమాడే కృష్ణుడు కన్నుకొట్టాల.. పెళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాల
రామా చిలకమ్మా.. ప్రేమా మొలకమ్మా
రామా చిలకమ్మా.. ప్రేమా మొలకమ్మా.. రాధమ్మా
పాలే తెలుపన్నా.. నీళ్ళే నలుపన్నా గోపెమ్మా
ముక్కు మీద తీపి కోపాలా.. మూగకళ్ళ తేనె దీపాలా
గంగూలి సందులో గజ్జెల గోల.. బెంగాలి చిందులో మిర్చిమసాలా
అరె వేడేక్కి ఉన్నది వెన్నెల బాల.. మేడెక్కి దిగదురా మేఘమాల
చిత్రం: చూడాలనివుంది (1998)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: హరిహరన్
పల్లవి:
సరిమామగారి సనసనిదపసా
సరిమామగారి సనసనిదపసా
రిమదానిదాప సాసనిదప మదపమరి
యమహానగరి కలకత్తా పురి
యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
యమహానగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చరణం 1:
నేతాజీ పుట్టినచోట గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకుతో వేయి పందెం
కడకు చేరాలి గమ్యం కదలిపోరా
ఒకరికితో ఒకరికి ముఖపరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో
యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చరణం 2:
బెంగాలీ కోకిల బాల తెలుగింటి కోడలుపిల్ల
మానినీ సరోజిని
రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజనీగంధ సాగనీ
పదుగురు ప్రేమలే లేని లోకం
దేవతా... మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట కళలకు కొలువట
తిధులకు సెలవట అతిధుల గొడవట
కటకట నగరపు కిటకిటలో
యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చరణం 3:
వందేమాతరమే అన్నా వంగ భూతలమే మిన్న
జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ చోరంగి రంగుల దునియా నీదిరా
విను గురు సత్యజిత్రే సితారా
యస్.డి. బర్మన్ కీ ధారా
థెరీసాకీ కుమారా కదలిరారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన
ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో
యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
యమహానగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధీ ఈఈఈ
చిత్రం: చూడాలనివుంది (1998)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుజాత
పల్లవి:
అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు
అబ్బబ్బా.. ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు
చలిపులి పంజా విసిరితే... సల సల కాగే వయసులో
గిల గిలలాడే సొగసుకే జో లాలి....
అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు
చరణం 1:
వాటేసుకో వదలకు..... వలపుల వల విసిరి
వాయించు నీ మురళిని వయసు గాలిపోసి
దోచెయ్యనా దొరికితే..... దొరకని కోకసిరి
రాసెయ్యనా పాటలే పైట చాటు చూసి
ఎవరికి తెలియవు....... ఎద రసనసలు
పరువాలాటకు...... పానుపు పిలిచాకా.......
తనువు తాకినా తనివి తీరని వేళా...ఆ..
అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు
చరణం 2:
జాబిల్లితో జతకలు.... జగడపు రగడలతో
పొంకాలతో నిలు నిలు పొగడమాల వేసి
ఆకాశమే కొలు కొలు..... తొడిమెడు నడుమిదిగో
సూరీడునే పిలు పిలు చుక్క మంచుతోటి
అలకల చిలకలు..... చెలి రుసరుసలు
ఇక జాగెందుకు.... ఇరుకున పడిపోకా....
మనసు తీరినా వయసు జారనీ వేళా....ఆ
అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు
చలిపులి పంజా విసిరితే... సల సల కాగే వయసులో
గిల గిలలాడే సొగసుకే జో లాలి....
అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ము..
Subscribe to:
Posts (Atom)