వెన్నెల్లో గోదారి పార్ట్ #6

 నేను అతడికి డబ్బేమీ ఇవ్వలేదు. నేను చెప్పింది కాదనే ధైర్యం ఈ కుర్రడాక్టర్ కి వుందని నేను అనుకోను. అయినా నేనడిగింది పెద్ద కోర్కేమీ కాదు. కడుపులు తియ్యమనీ, రేప్ కేసు మాఫీ చెయ్యమని అడగటంలేదు. నేను మామూలు పైత్యపు నొప్పిలాటిదాన్తో వచ్చిన ఆనంద్ కి గుండెజబ్బనీ బైపాస్ సర్జరీ చేయించుకోవాలనీ డాక్టరుగా సలహా ఇమ్మన్నాను. అదన్నా ఒక నెలరోజుల కోసం మాత్రమే ఈ అబద్దం అని చెప్పాను.
    
    ఇంత చిన్న సాయం చేయటానికి ఆ డాక్టర్ కి అభ్యంతరం ఏముంటుంది. సరే అన్నట్టు తలూపాడు. వెంటనే వాహనం తీసుకుని బయల్దేరాడు.
    
    ఆ తరువాత చూడాలి ఆనంద్ పరిస్థితి.
    మింగలేక కక్కలేక చచ్చాడు. ఆ ప్రమద్వర అనే అమ్మాయితో సుదీర్ఘమైన చర్చలు జరిపాడు. ప్రాణం అంటే ఎవరికైనా తీపేకదా, దాని ఖరీదు మాత్రం నా కూతుర్ని పెళ్ళిచేసుకోవటం-
    
    -అయితే నేను ఆనంద్ దగ్గిరకి వెంటనే వెళ్ళలేదు. ఇనుముని కొట్టాలంటే ముందు దాన్ని వేడెక్కించాలి. అందుకే కొంతకాలం వేచివుండి, ఆ తరువాత వెళ్ళి నా ప్రపోజల్ చెప్పాను. అతడు తెల్లబోవటం స్పష్టంగా కనిపించింది. అవును మరి "నా కూతుర్ని చేసుకో నీ గుండెజబ్బు నయం చేయిస్తాను" అని ఎవడూ అనడు. అందులోనూ డబ్బున్న మామగారు అందుకే అతడు నన్నో పిచ్చివాడిని చూసినట్టు చూశాడు. అతడికి మతిపోయి వుంటుంది. "మీరు నా గుండెజబ్బుకి ఆపరేషన్ చేయించిన తరువాత నేను మీ కూతుర్ని చేసుకోకపోతే?" అన్నాడు.
    
    ఫర్వాలేదు నాకున్న పొగరులో సగం ఈ కుర్రాడికి వునంట్టుంది. నాకు తగిన అల్లుడు అవుతాడు. ఆస్తికేం వుంది. కుక్కని కొడితే వస్తుంది.
    
    నవ్వేను. "నీ ఆపరేషన్ నా కూతురితో వివాహం జరిగాకే అవుతుంది" అన్నాడు. అతడి తల తిరిగిపోయింది. "నేను ఆపరేషన్ టేబుల్ మీద చచ్చిపోతే" అన్నాడు. నేను చెప్పిన సమాధానం విని- నా కూతుర్ని ఎలా పెంచాలో చిన్న ఉపన్యాసం ఇచ్చాడు. నాకు నవ్వు ఆగటంలేదు. ఈ కుర్రవాడి మీద నాకు కూడా ఇష్టం పెరుగుతూంది. మా అమ్మాయి ఎన్నిక తప్పుకాదు.
    
    ఇలాంటి యువకుల సంగతి నాకు బాగా తెలుసు. వీళ్ళు అసలు ఆత్మవంచన చేసుకోరు. నిజాయితీ అంటే ఇష్టపడతారు. కానీ జీవితం ఒక గదిలో పడిన తరువాత అతి త్వరగా డానికి అడ్జెస్ట్ అయిపోతారు. రేపు వివాహం జరిగాక అతడికి గుండె నొప్పి లేదని చెప్తే అతడు దానికి ఎలా ప్రతిస్పందిస్తాడో మీకు తెలుసా? ముందు ఎగిరిపడుతాడు. తనని మోసం చేసినందుకు నన్ను నిలదీస్తాడు. కానీ మనసులో మరో మూల ఆనందం కట్టలు తెంచుకుని ప్రవహిస్తూనే వుంటుంది. మృత్యువు కబళించివేస్తూంది అని భయపడుతూన్న వాడికి, అది అసలు తలుపు వరకూ కూడా రాలేదని చెప్తే వింత ఆనందం!
    
    ఇక సంసారం సంగతంటారా- దాని విషయం తరళ చూసుకుంటూంది. తంతే బూర్లె బుట్టలో పడ్డట్టు ఒకవైపు ఇంత ఆస్థివున్న కూతురు మరొకవైపు మరణం గురించిన శుభవార్త....ఇంతకన్నా మంచి బహుమతులు వివాహసందర్భంలో ఏ అల్లుడికి తన మామగారు ఇవ్వగలడు?
    
    అందుకే నా ప్లాన్ పట్ల నేనింత నమ్మకంగా వున్నాను. ఒక్కసారి వివాహం జరిగిపోతే అంతా సర్దుకుంటుంది. నా కూతురి కళ్ళల్లో ఆనందం నాకు ముఖ్యం.    
    
    అయినా ఆనంద్ నా ప్రపోజల్ కి వప్పుకోలేదు.
    
    దానికి నేను భయపడలేదు. ఈ రోజు కాకపోతే రేపయినా వప్పుకోక తప్పదు కదా! ఒకవేళ రేపు కూడా వప్పుకోకపోతే ఏం చెయ్యాలి?
    
    ఏం చెయ్యాలని నేను ఆలోచిస్తున్న సమయాన ప్రమద్వర నన్ను కలుసుకుంది.
    
    ....
    
    ఆ అమ్మాయి నా దగ్గిరికి రావటం చూసి నేను ఆశ్చర్యపోయాను.
    
    తరళకి ఆనంద్ కి మధ్య ఈ అమ్మాయి రాయబారం జరిపింది అని నాకు తెలుసు. అందుకే నిష్టూరంగా "చూశావా-ఇంతవరకూ వచ్చాక ఇప్పుడు నీ స్నేహితుడు పెళ్ళికి వప్పుకోవటం లేదు" అన్నాను.
    
    ఆమె తలూపి, "ఆ విషయం మాట్లాడటానికే వచ్చాను. ఆనంద్ ప్రాణాలు రక్షింపబడాలంటే దానికి ఒకటే మార్గం" అంది. నాకు నవ్వొచ్చింది. ఆనంద్ ప్రాణాపాయస్థితిలో వున్నాడన్న సమగతి అందరికీ నెమ్మదిగా తెలిస్తూందన్నమాట.
    
    "ఏమిటా మార్గం?" అని అడిగాను.
    
    "నాకు మీరు సాయం చేస్తానంటే తప్ప ఆనంద్ ఈ వివాహానికి వప్పుకోడు".
    
    నాకు ఆశ్చర్యమేసింది. "అదేమిటి?" అన్నాను.
    
    "అవును మీకు తెలియనిదేముంది? కొంతమంది యువకులు అంతే. తమ ప్రాణాలు పోయినా లెక్కచేయరు. కానీ అవతలివాళ్ళ కోసం దేనికైనా వప్పుకుంటారు. ఆనంద్ అలాటివాడు. ఈ వివాహంవల్ల తనకి ఆస్తి వస్తుందంటే వినడు. నాకు కూడా ఏదో లాభం వుంటుందంటే వప్పుకుంటాడు".
    
    "ఇప్పుడు నేనేం చెయ్యాలి?"
    
    ఆమె తలదించుకుని నెమ్మదిగా, "చెప్పాలంటే నాకూ అదోలా వుంది. కానీ ఈ వివాహం జరగాలంటే చెప్పక తప్పదు. నేను ఏ కులంలో పుట్టానో మీకు బాగా తెలుసు. నా భవిష్యత్తుని నాశనం చెయ్యాలని నా కన్నవాళ్ళే చూస్తున్నారు. మీరు నా భవిష్యత్తుకి ఏదో ఒక ఏర్పాటు చేస్తున్నానని ఆనంద్ కి చెప్పండి. దానికి ప్రతిగా యీ వివాహం జరగాలని కండిషను పెట్టండి. అతను వప్పుకుంటాడు" అంది.
    
    "నీ గురించి అంత చేస్తాడా?" అనుమానంగా అడిగాను.
    
    ఆమె ఇంకా తలవంచుకునే, "నేనూ తరళ ఆనంద్ లు ముగ్గురం స్నేహితులం. ఒకరి కొకరం ఏమైనా చేసుకుంటాం" అంది. "మరి నేను వెళ్ళి అడిగితే పెళ్ళికి ఎందుక్కాదన్నాడు?"
    
    "వాళ్ళిద్దరూ చిన్నపిల్లల్లా ఎప్పుడూ దెబ్బలాడుకుంటూవుంటారు. కానీ ఒకరంటే ఒకరికి ప్రేమే. ఏదో బెట్టు చేస్తున్నాడు తప్ప ఆనంద్ తప్పకుండా వప్పుకుంటాడు. అందులోనూ 'ణ అగురించి' అంటే ఇక మరీ బెట్టు చేయలేడు" అంది.
    
    "అంటే కొంపదీసి నీకు నిజంగా డబ్బు ఇవ్వాలా- ఈ సాయం చేసినందుకూ?"
    
    ఆమె మొహం వాడిపోయింది. "అవసరంలేదు" అంది.
    
    అలా అడిగినందుకు బాధపడి వెంటనే సర్దుకుని-
    
    "అయితే నేను చెప్పను. నువ్వే చెప్పు" అన్నాను. "నేను వెళ్ళి ఆనంద్ కి, నువ్వు నా కూతుర్ని చేసుకుంటే ప్రమద్వరకి సాయం చేస్తాను అని చెప్తే మరీ లంచగొండిలా వుంటాను. ఎంతయినా కాబోయే మామగార్ని కదా" అన్నాను.
    
    ఆమె అర్ధం చేసుకున్నట్లు తలూపి, లేచి నిలబడుతూ, "అయితే నేనే చెప్తాను. ఒకవేళ ఆనంద్ మిమ్మల్ని అడుగుతే మాత్రం నిజమేనని చెప్పండి అది చెప్పటానికే వచ్చాను!" అంది వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుతూ.
    
    "చివరగా ఒక్క ప్రశ్న" అన్నాను ఆగి ఏమిటన్నట్టు చూసింది.
    
    "ఇదంతా నువ్వు మా తరళ పెళ్ళి కోసం చేస్తున్నావా? ఆనంద్ ఆస్తిపరుడవటం కోసం చేస్తున్నావా?"
    
    ఆమె చప్పున తలెత్తింది.
    
    నేను నవ్వి, సర్దుకుంటున్నట్టు "అహ- ఇద్దరూ నీ స్నేహితులేకదా- ఎవరికోసం చేస్తున్నావా అని-" అన్నాను. "పెళ్ళి కోసమా- ఆస్తికోసమా?"
    
    ఆమె వెళ్ళిపోతూ అంది. "ఆనంద్ బ్రతుకు కోసం!"

నేను నిశ్చేష్టుడినై నిలబడిపోయాను.
    
    ఏదో అదృశ్య హస్తం సాచిపెట్టి కొట్టినట్టయింది నన్ను.
    
    కానీ అంతలో సంతోషం కూడా వేసింది.
    
    స్నేహం అంటే అలా వుండాలి.
    
    వాళ్ళు ముగ్గురూ అంత మంచి స్నేహితులని నాకు తెలీదు.
    
    నాకు సంతోషంగా వుంది. ఇదంతా నేను ఆడిన నాటకమనీ, ఆనంద్ కి ఏ గుండెజబ్బూ లేదని నేను వెల్లడి చేసిన క్షణం ఈ ముగ్గురు స్నేహితులూ ఎంత సంతోషిస్తారో తల్చుకుంటే నా మీద నాకే ముచ్చటేసింది.
    
                                       11
    
    మరో రెండు రోజులు గడిచాయి.
    
    నేనూ ప్రమద్వరా అనుకున్న ప్రకారం యీ పాటికి ఆ అమ్మాయి ఆనంద్ కి మేమనుకున్నది చెప్పి వుంటుంది. ఆ టైమ్ అయ్యాక నేను ఆనంద్ నా దగ్గిరకి వస్తాడని ఎదురు చూడసాగాను. నేను వూహించినట్టే ఆనంద్ నా దగ్గిర కొచ్చాడు.
    
    "తరళని పెళ్ళిచేసుకోవటం నా కిష్టమే. ముహూర్తాలు పెట్టించండి" క్లుప్తంగా అన్నాడు.
    
    "సంతోషంగా అంటున్నావా? తప్పదు కాబట్టి అంటున్నావా?" ఓరగా చూస్తూ అడిగాను. నాకు ఏనుగెక్కినంత సంబరంగా వుంది. ఒకసారి గెలుపు కనుచూపు మేరకు వచ్చాక కలిగే గర్వంతో కూడిన సంతోషం అది.
    
    "నేనెలా అంటేనేం? అది అప్రస్తుతం".
    
    నేను దెబ్బతిని, వెంటనే సర్దుకుని, "యీ విషయం నువ్వే స్వయంగా తరళతో చెప్పు సంతోషిస్తుంది" అన్నాను.
    
    "నేను చెప్పవలసింది చెప్పాను. మీరు మిగతాది మీ కూతురికి చెప్పుకోండి" అన్నాడు విసురుగా.
    
    నాకు నిజంగానే కోపం వచ్చింది. "చూడూ! అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అంటారు. కోరివచ్చి కూతుర్ని చేసుకోమన్నాను కదా అని నువ్వేదో గొప్పవాడినై పోయాయని చెట్టెక్కి కూర్చుంటే కుదర్దు. అలాటిదేమైనా వుంటే ముందే చెప్పు ఎలాగో ఒకలా నా కూతురికి నచ్చ చెప్పుకుంటాను. అంతేకాని, పెళ్ళయ్యాక కూడా ఇలాగే వేదాంతిలా వుంటే లాభంలేదు".    
    
    అతడి మొహం కొద్దిగా వాడిపోయింది. "చేసుకుంటానన్నానుగా" అన్నాడు. అని వెళ్ళబోతూ ఆగి, "ప్రమద్వర నాకు అంతా చెప్పింది" అన్నాడు. ఏం చెప్పిందో తెలుసుకోవాలని వున్నా నేనే బయటపడితే బావోదని వూరుకున్నాను.
    అతడు వెళ్ళిపోయాడు.
    
    నేను విజయం సాధించిన మాట నిజమేగానీ, అదెందుకో నా కంత సంతోషంగా అనిపించలేదు. తరళతో ముహూర్తం పెట్టించటం గురించి చెప్పాను. ఆ అమ్మాయి కళ్ళలో ఆనందం- నా టెన్షన్లన్నిటినీ పోగొట్టింది. చెప్పానుగా నా బలహీనతలు... ఒకటి నా ప్రతిష్ట రెండోది నా కూతురు.
    
    ఆ తరువాత ఇంకా మిగతా పన్లన్నీ తొందర తొందరగా జరిగిపోయాయి. శుభలేఖలు కూడా అచ్చు వేయించడం అయింది. ఆనంద్ తరఫున ఎవరూ లేరు. అందుకని అన్ని పనులూ నేనొక్కన్నే చూసుకోవలసి వచ్చింది. తరళ గోదాట్లో దూకిన సంగతి ఊరంటికీ తెలుసు. అందువల్ల ఈ వివాహం ఎవరికీ అంతగా ఆశ్చర్యం అనిపించలేదు. ఒకళ్ళిద్దరు మాత్రం నా సానుభూతి సంపాదించటానికి-"ఎంత ధైర్యమండి, మీ కూతురితో ఆడుకుంటాడా- వాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించమంటారా?" అని నా దగ్గిర అన్నారు గానీ, నేను ఈ వివాహానికి వ్యతిరేకిని కానని తెలిశాక, వెంటనే "ఆనంద్ కేమండీ? చాకులాంటికుర్రాడు" అని ప్లేటు మార్చారు. ఈ పల్లెటూళ్ళ సంగతి మీకు తెలియన్దేముంది?
    
    శుభలేఖలు పట్టుకుని ఆనంద్ దగ్గిరకి వెళ్ళాను.
    
    లోపల ప్రమద్వర కంఠం వినిపించింది. అందులో నా ప్రసక్తి రావటంతో గుమ్మం దగ్గిరే ఆగిపోయాను.
    
    "ఎందుకు మళ్ళీ నన్ను పిలిపించావు?" ప్రమద్వర అడుగుతోంది అతడిని. నాకా మాటలు ఆశ్చర్యంగా తోచాయి. వాళ్ళు ముగ్గురూ ఫ్రెండ్స్ కదా మళ్ళీ పిలిపించటం ఏమిటి?
    
    "రావుగారి దగ్గిర కెళ్ళి తరళని పెళ్ళి చేసుకుంటానని చెప్పాను" ఆనంద్ అంటున్నాడు.
    
    "మంచిది".
    
    "బహుశా నీకు ఆనందంగా వుండి వుంటుంది- ఇక నీ బాగోగులు అన్నీ ఆయనే చూస్తాడు. మీ మధ్య ఒప్పందం ప్రకారం..."
    
    ఆమె నుంచి సమాధానం లేదు.
    
    "చెప్పవేం?"
    
    "ఏం చెప్పను?"
    
    "నీకు సంతోషంగా లేదూ?"
    
    "ఎందుకు?"
    
    "భవిష్యత్తు గురించి".
    
    "ఎవరి భవిష్యత్తు? నీదా? నాదా?"
    
    ఆమెనుంచి తిరిగి సమాధానం లేదు. ఆనందే అన్నాడు- "చాలా గొప్పగా నాటకమాడావు గానీ, రావుగారు అంతా చెప్పేశారు".
    
    బయటనుంచి వింటున్న నేను ఉలిక్కిపడ్డాను. లోపల ప్రమద్వర పరిస్థితి కూడా అలాగే వుండి వుంటుంది.
    
    "ఏం చెప్పారు?" ప్రమద్వర అడుగుతోంది.
    
    "మీ ఇద్దరిమధ్యా జరిగిన సంభాషణ అంటే నువ్వు నాకు చెప్పింది కాదు. నిజంగా ఏం జరిగిందో అది ఎందుకు చేశావ్ ప్రమద్వారా ఇలా?" ఆమె చెప్పేలోపులో, నేను లోపలికి వెళ్ళకుండా అతికష్టంమీద నిరోధించుకోగలిగాను వెళ్ళాలా వద్దా అని నేను సందిగ్ధంలో వుండగానే ఆమె అనేసింది- "నీ కోసమే-"
    
    "నా కోసం ఇంత పెద్ద అబద్దమాడుతావా? రావుగారు నీ దగ్గిర కొచ్చి నన్ను వివాహనికి వప్పిస్తే నీ భవిష్యత్తు తను చూసుకుంటానన్నారా? రావుగారుగానీ అసలు విషయం చెప్పకపోయి వుంటే నా కెప్పటికీ నీ మీద అనుమానం పోయివుండేది కాదు కదా-"
    
    బయటనుంచి వింటున్న నాకు చెమటలు పట్టినాయ్. ఈ అమాయకురాలు మొత్తం నిజం చెప్పేసేట్టూ వుంది. అప్పుడిక నేను లోపలికి వెళ్ళటానికి కూడా లేదు.
    
    "నేనే చెప్పాను ఆనంద్..." అంది ప్రమద్వర. "కనీసం అలా చెప్పేసేట్టూ వుంది. అప్పుడిక నేను లోపలికి వెళ్ళటానికి కూడా లేదు.

    "నేనే చెప్పాను ఆనంద్..." అంది ప్రమద్వర. "కనీసం అలా చెప్తే అయినా నీవీ పెళ్ళికి వప్పుకుంటావని..."
    
    "ఏం? ఎందుకంత అవసరం వచ్చింది?"
    
    ఆమెనుంచి సమాధానం లేదు. ఆనందే అన్నాడు- "పదిరోజుల క్రితం నువ్వోమాట అన్నావు గుర్తుందా? ఆ గుండె నొప్పేగానీ గుళ్ళో మన వివాహం అయిపోయిన తరువాత వచ్చివుంటే ఏమై వుండేది? అని అలా అన్న నువ్వేనా ఇప్పుడిలా మాట్లాడుతూంది?"
    
    దానికి ఆమె ఏం సమాధానం చెపుతూందో నాకు సరిగ్గా వినిపించలేదు. చాలా చిన్న స్వరంతో చెపుతూ వుండవచ్చు. బహుశా కానీ అది వినే ఆలోచన కూడా నాకు లేదు.
    
    ఆనంద్ మాటల్తోనే నాకు మతిపోయింది నేను వూహించని, నాకుతెలియని కొత్త మలుపు...
గుళ్ళో పెళ్ళి....
    
    అంటే...?
    
    ఆనంద్, ప్రమద్వరా ప్రేమించుకున్నారా? పెళ్ళికూడా చేసుకోవాలనుకున్నారా?
    
    గుండెనెవరో మెలిపెట్టి తిట్టుతున్నట్టు అనిపించింది. ఆనంద్ ఈ వివాహానికి ఇంతకాలం ఎందుకింత విముఖతగా వున్నాడో కూడా అర్ధమైంది. నాచేతిలో శుభలేఖలు నవ్వుతున్నట్టు అనిపించాయి.
    
    లోపల ప్రమద్వర అంటూంది- "నీ భార్య నయ్యాక బీదతనం వల్ల నిన్ను కాపాడలేక విధవరాలినయినా, కేవలం నీ ఆలోచన్ల తృప్తితో జీవితాంతం హాయిగా బ్రతగ్గలను ఆనంద్! కానీ నీతో వివాహం మానుకుంటే వచ్చేడబ్బు నీ ప్రాణాల్ని రక్షిస్తుందని తెలిశాక కూడా ఇక ఈ వివాహం ఎలా చేసుకోను? నన్ను అర్ధం చేసుకో" అర్ధమైంది.
    
    నాకే కాదు. లోపలున్న ఆనంద్ కి కూడా అర్ధమయ్యేవుంటుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగుని చూసి మనిషి అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నట్టే, ఆమె చెప్పింది అర్ధమైనా మనసు మొద్దుబారిపోయింది. ఆ క్షణమే లోపలికి వెళ్ళి నేను చెప్పిన అబద్దం గురించి వాళ్ళకి చెబుదామనుకున్నాను.
    
    కానీ చేతిలో వున్న శుభలేఖలు నన్ను వారించాయి.
    
    మీకు నేను దుర్మార్గుడిగా కనిపిస్తూ వుండి వుండవచ్చు. కానీ చెప్పానుగా నేను జీవితంలో విలువనిచ్చేది రెంటికే.... ఒకటి నా కూతురు, రెండు నా పరువు మీరేమనుకున్నాసరే- దాన్ని మాత్రం బలి పెట్టలేను.
    
    ఇంత జరిగీ, వూళ్ళో అందరికీ శుభలేఖల విషయం కూడా తెలిశాక, ఇప్పుడిక ఈ వివాహం ఆగిపోతే నా పరువేంగానూ?

    వెనుదిరిగి వచ్చేశాను. కానీ ఇంటి కొస్తున్నంతసేపూ నా మనసులో ఏదో తెలియని బాధ నన్ను తొలుస్తూనే వుంది. కానీ నేను మాత్రం ఏం చెయ్యగలను? ఇది జరిగిన పదిరోజులకి ఆనంద్ తరళల వివాహం జరిగింది.
    
                                                                              * * *
    
    ప్రమద్వరే దగ్గరుండి పెళ్ళి పనులన్నీ చేయటం నన్ను మరింత ఇబ్బందిలో పెట్టింది. ఆ అమ్మాయి మొహంలో ఏ భావమూ నాకు కనపడలేదు. మా వూరి గోదారి కూడా ఇలాగే ఎత్తుపల్లాల్నీ, సుడిగుండాల్నీ కడుపులో దాచుకుని పైకి గంభీరంగా వుంటుంది.
    
    ఆ అమ్మాయి ప్రేమ సంగతి తెలిసిన ఒకే ఒక బయట వ్యక్తిని బహుశా నేనే నేమో! ప్రేమమీద నాకు గొప్ప అభిప్రాయం లేదు. కానీ నా అంచనాలన్నీ తఃరుమారు చేసిందీ అమ్మాయి. ప్రేమించిన వ్యక్తిని బ్రతికించుకోవటం కోసం తన భవిష్యత్తునే ఫణంగా పెట్టింది. నాకు తెలియని కొత్త ప్రపంచం ఇది. మా ప్రపంచంలో పల్లె రాజకీయాలూ, ద్వేషాలూ, గెలుపులూ, ఓటములే తప్ప ప్రేమలూ, త్యాగాలూ లేవు. నేనాడిన అబద్దం చాలా రాత్రులు నన్ను బాధ పెట్టింది. వెయ్యి అబద్దాలాడైనా ఒక పెళ్ళి చేయమన్నారు కదా అని సరిపెట్టుకునే వాడిని.    

    చివరికి, నా కూతురు వేస్తున్న జోకులు కూడా నా చెవిన పడక పోలేదు. ప్రమద్వర తనని పెళ్ళికూతురుగా అలంకరిస్తున్నప్పుడు "చూశావుటే, గోదార్లో నేను వదిలిన పడవే ముందెళ్ళింది. అందుకే నా పెళ్ళి నీకన్నా ముంధైపోతూంది" అన్నప్పుడు మాత్రం, వాళ్ళ ముందుకు వెళ్ళి అంతా చెప్పేద్దామనిపించింది. కానీ అప్పుడు కూడా పరువు గురించిన నా భయమే నన్ను అడ్డుపెట్టింది. అప్పటికి పెళ్ళి రెండు రోజులు మాత్రమే వుంది.
    
    ఆనంద్ తాలూకు గుండెజబ్బు గురించి తెలిసిన వాళ్ళం నలుగురమే వాళ్ళిద్దరూ, నేనూ, మా వూరి డాక్టరు.
    
    పెళ్ళయిన మరుసటిరోజే శోభనం ఏర్పాటు చేశారు. ఆ సాయంత్రం ప్రమద్వర నా దగ్గిరకి వచ్చింది.
    
    "ఆనంద్ ఆరోగ్యం యిలా వుండగా ఇప్పుడీ ఫంక్షన్ ఎందుకు బాబుగారూ ఆపరేషన్ అయ్యాక పెట్టుకుంటే బావుంటుంది కదా" అంది. అప్పుడొచ్చింది నాకు జ్ఞాపకం.
    
    పెళ్ళెలాగూ అయిపోయింది కదా ఇక డాక్టర్ తో అసలు విషయం చెప్పించాలి.
    
    "ఫర్వాలేదమ్మా నేను డాక్టర్ ని కన్సల్ట్ చేశానుకదా" అని ఆ అమ్మాయిని పంపించేసి, డాక్టర్ కి కబురుచేశాను. మరుసటిరోజు ప్రొద్దున్న అతనొచ్చాడు.
    
    గదిలోకి తీసుకెళ్ళి అతడేం చెప్పవలసిందీ చెప్పాను. మళ్ళీ ఆనంద్ ని పరీక్షచేసి, (వీలైతే పట్నం నుంచి పెద్ద డాక్టర్ ని కూడా ఇంకొకసారి పిలిపించి) బైపాస్ సర్జరీ అవసరం లేదనీ మందులు వాడితే సరిపోతుందనీ అతడు చెప్పాలి.     
    
    డాక్టర్ తలూపాడు.
    
    "ఆనంద్ కి ఏ మాత్రం అనుమానం రాకూడదు. మొదట్లో బైపాస్ కావాలనుకున్నారు. ఇప్పుడది సర్దుకుంది. అలా చెప్పాలి. అర్ధమైందా?"
    
    "నేను చూసుకుంటాను కద్సార్. అందరూ ఆనందించే శుభవార్త ఎలా చెపుతానో మీరే చూస్తారు కదా" అన్నాడా కుర్ర డాక్టరు.....ఫర్లేదు, పైకొస్తాడు.
    
    మేము మరో ఒకటి రెండు విషయాలు మాట్లాడుకుని గది లోంచి బయటకొచ్చాం. తలుపుతీసి హఠాత్తుగా పాముని చూసినట్టు అలాగే నిలబడి పోయాను.
    
    మేడమీద నుంచి ఎప్పుడు వచ్చాడో, ఎంతసేపట్నుంచి వింటున్నాడో తెలీదుకాని, ఆనంద్ అక్కడ నిలబడి వున్నాడు. అతడి మొహం ఎర్రగా కందిపోయి వుంది. మూసినా గుప్పెట్లు, వణికే చేతులు అతడి ఆవేశాన్ని చెబుతున్నాయి. మనిషి నిలువెల్లా ఊగిపోతున్నాడు.
    
      ఆనందరావు చెప్పిన కథ
    
    తిరిగి వెళ్ళి పోవటానికి సామాన్లేవీ సర్దుకోలేదు. పెళ్ళికోసం తీసుకువచ్చిన నా తాలూకు వస్తువుల్ని కూడా వెనక్కి తీసుకెళ్ళే ప్రయత్నమేమీ చేయలేదు.
    
    మామూలుగా నా గదికొచ్చేసాను. నేనిలా వెళ్ళిపోవటం, వాళ్ళింట్లో పెళ్ళికోసం వచ్చిన బంధువులకు తెలుసో లేదో నాకు తెలీదు. నాకు సంబంధించినంతవరకూ ఈ పెళ్ళి కాలేదంతే...చాలా కామ్ గా, కూల్ గా నా గదికి తిరిగి వచ్చేసేను.
    
    నాకే గుండె జబ్బూ లేదనీ, ఈ పెళ్ళికోసం పన్నిన వలలో ఇరుక్కుపోయాననీ గదిలో ఆయనకీ, దాక్తరుకీ మధ్య జరిగిన సంభాషణవల్ల తెలిసిన మరుక్షణం మాత్రం నేను రాక్షసుడ్నే అయ్యాను. ధడేలున తలుపు తోసుకుని లోపలికి ప్రవేశించిన నన్ను చూసి వాళ్ళు స్థాణువులయ్యారు. డాక్టర్ మోహంలో భయం స్పష్టంగా కనిపించింది. అతడేదో అనేలోపులో నా చెయ్యి విసురుగా వెళ్ళి అతడి గెడ్డాన్ని తాకింది. బహుశా పళ్ళు కదిలి పోయి వుంటాయి. అడ్డొచ్చిన రావుగారని కూడా అదే తాకిడితో ఎదుర్కోబోయాను గానీ ఆయన వయసు- పెద్దరికాన్ని నిలిపింది. ఆ గదిలోంచి విసురుగా బయటకొచ్చాను.
    
    నా ఆవేశానికి ఆనకట్ట పడలేదు. అదే వేగంతో పైకి వెళ్ళాను. తరళ ఇంకా నిద్రపోతూనే వుంది. నా కోపం ద్విగుణీకృతమైంది. మొదటి రాత్రి తెల్లవారేక కూడా ఇంతలా నిద్రపోతున్న ఆ కూతురి గారాబం... అనుకున్నది ఎలాగైనా సాధించగలిగే మొండితనం..... నన్నో వెధవని చేసిన ఫీలింగ్... అన్నీ కలిసిన దాని ఫలితం.... "ఏమైందండీ- అలా వున్నారు" అని అప్పుడే లేచి అంటూన్న తన మాటలు పూర్తికాకుండానే చెంప చెళ్ళుమంది. మల్లెపూలు గదంతా చెదిరాయి. రాక్షసీ...నీ మూలానే ఇదంతా- అన్న కసీ, ఆవేశం- అంతా గొంతులోనే కప్పబడిపోయింది.
  తరళ అలాగే నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. తను నా జీవితానికీ, ప్రమద్వర భవిష్యత్తుకీ ఎంత ద్రోహం చేసిందో, మేమిద్దరం కన్న కలల్ని ఎలా సమూలంగా నాశనం చేసిందో, చెపుదామని నోటి చివరివరకూ వచ్చింది. కానీ అంతలోనే "ఛీ-ఈవిడతో చెప్పేదేమిటి" అనిపించి అక్కన్నుంచి క్రిందికివచ్చేశాను. అదొక్కటే కాదు కారణం. వీళ్ళు ఎంతకయినా తెగించిన వాళ్ళు. నాకూ ప్రమద్వరకూ మధ్యనున్న ప్రేమ ఈవిడకి తెలుస్తే అది ప్రమద్వర ప్రాణానికి కూడా హాని కలిగించవచ్చు.
    
    ఆ క్షణం తరళ నా భార్య అన్న విషయం కూడా మర్చిపోయాను. నా శతృవులు, ఈమె... ఈమె తండ్రి... అంతే! అదొక్కటే భావం నా మనసంతా నిండిపోయింది.
    
    మనుష్యుల్ని కొనగలరు వీళ్ళు!
    
    ద్బబుతో-లేకపోతే బెదిరించి...అదీ కాకపోతే మరేదో (ఇప్పుడు వేసినట్టు) ప్లాన్ వేసి- అనుకున్నది సాధించగలరు.
    
    వాళ్ళ మొహం చూడటానికి అసహ్యం వేసింది. అందుకే నా గదికి వచ్చేశాను. అసలీ తప్పంతా ప్రమద్వరది!
    
    నా చేతులు కట్టేసి ఈ వివాహానికి వప్పించింది. త్యాగం పేరిట అనవసరంగా నన్నీ ఊబిలోకి దింపింది.
    
    .....
    
    నేను గదికి వచ్చేసిన ఐదు నిముషాలకి తరళ తండ్రి వచ్చాడు.
    
    చాలా గొప్ప నటుడు. వంద లంకణాలు చేసినట్టు మొహం పెట్టాడు. రాగానే చేతులు పట్టుకుని "అల్లుడూ, ఈ తప్పంతా నాది నన్ను క్షమించు" అన్నాడు.    
    
    నన్ను నేను నిగ్రహించుకోవటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. "చూడండి, అయిపోయిందేదో అయిపోయింది. మీ కూతురికీ నాకూ ఏ సంబంధమూ లేదు. మీరు పెద్ద భూస్వామి అనీ, ఈ వూళ్ళోకెల్లా గొప్ప ఇన్ ఫ్లుయెన్సున్న మనిషనీ నాకు తెలుసు కానీ మీరేం చెయ్యగలరో నేనూ చూస్తాను. మీరూ మీ కూతురూ కలిసి వేసిన ఈ అతి గొప్ప ప్లాన్ కి నేను మీ కూతురికి వేస్తున్న శిక్ష అదే! మొదటి రాత్రయ్యాక మొగుడు వదిలేసిన దానిలాగ ఇక జీవితాంతం గడపాలి. ఎందుకు వదిలేశాడు- అన్న దానికి కారణం- మీరేం చెప్పుకుంటారో మీ ఇష్టం. ఇక మీ రెళ్ళొచ్చు..."
    
    "నేనీ నాటకం ఆడినట్టు తరళకి తెలీదు".
    
    "ఏమిటి మీరంటున్నది"?
    
    "అవును ఆనంద్ తరళని ఇందులో కలపకు. ఇందులో ఏ తప్పున్నా అది కేవలం నాది మాత్రమే. తరళ అమాయకప్పిల్ల. అది నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తూంది. దాని గురించే నేను డాక్టర్ కి అలా చెప్పమని చెప్పాను". తరళకి ఈ ప్లాన్ లో భాగం లేదన్న విషయం నాలో సంచలనాన్ని రేపింది కానీ వెంటనే సర్దుకున్నాను. ఇప్పుడు సమస్య తరళకి ఇందులో భాగం వున్నదా లేదా అని కాదు. నాశనమయిపోయిన నా జీవితం గురించి.
    
    "నేను చెప్పానుగా మీరెంత చెప్పినా నేనిక మీ ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టను. మీ కూతురికి మీరేం చెప్పుకుంటారో మీ ఇష్టం. ఇందులో ఆమె తప్పు లేకపోవచ్చు. కానీ ఏం తప్పు లేకుండానే కొంతమంది శిక్ష అనుభవిస్తూ వుంటారు. అలాటి వాళ్ళల్లో నేను మొదటివాణ్ణి అయితే మీ కూతురు రెండోది. అనుకుని సంతృప్తి పడండి".
    
    "అంటే ఇందులో నీ తప్పేమీ లేదంటావా?" ఈ సారి తెల్లబోవటం నా వంతయింది. "నా తప్పా? నా తప్పేముంది?"
    
    "నువ్వూ ప్రమద్వరా ప్రేమించుకున్న విషయం నా కూతురికి చెప్పకపోవటం..."
    
    "ఇది మీకు ... మీకెలా తెలుసు?" తడబడుతూ అడిగాను.
    
    ఆయన దానికి సమాధానం చెప్పకుండా "మీ ఇద్దరిమధ్య ప్రేమ విషయం మీతో కలిసి తిరుగుతూ కూడా నా కూతురు గ్రహించలేకపోయింది. అంత అమాయకపుది అది. అటువంటి దానికి మీ సంగతి ఎందుకు చెప్పలేదు? పోనీ చెప్పవలసిన అవసరం మీకు లేదనుకుందాం? కనీసం తను నిన్ను చేసుకొంటాను అని అన్నప్పుడైనా నువ్వా విషయం చెప్పాలికదా? ఎందుకు చెప్పలేదు? అక్కడికొచ్చేసరికి నీ ప్రాణం ముఖ్యం అనిపించిందా?.....నేనిలా మాట్లాడుతున్నానని కోపం తెచ్చుకోకు. నా తరఫునుంచి ఆలోచించు. ఇలా నేనూ వాదించవచ్చు కదా! నీ గుండెజబ్బు- దాన్ని నయం చేయటం- అన్నది మనిద్దరిమధ్యా ఒప్పందం. నిజంగా ప్రమద్వరపట్ల నీ ప్రేమ నిజమయిందైన పక్షంలో నువ్వు తరళకి అన్ని సంగతులూ చెప్పి వుండేవాడివి ఎందుకు చెప్పలేదు?" ఆయన మాటలకి నా ఆవేశం పెరిగిపోతూ వుంది. ఆయన నా మాటలు పట్టించుకోకుండా అన్నాడు.
    
    "కాబట్టి - నీకేదైనా కోపం వుంటే నా మీద తీర్చుకో ఆనంద్! తరళ మీద కాదు- ఇక ప్రమద్వర విషయం అంటావా- అది-" ఆయన పూర్తిచేయబోతూంటే "చాలాపండి!" అని అరిచాను. "...మీకు తెలుసా? నేనీ పెళ్ళి చేసుకోవటానికి కారణం ప్రమద్వరే- నేను బ్రతుకుతే చాలనుకుంది.... నా కోసం తన భవిష్యత్తుని బలిపెట్టుకుంది. తరళని చేసుకోవాలని ఒట్టు వేయించుకుంది".
    
    "నాకు తెలుసు" అన్నాడాయన. "దానికి ప్రతిగా ప్రమద్వర భవిష్యత్తుని నువ్వు కలలో కూడా వూహించనంత గొప్పగా తీర్చిదిద్దుతాను. అది నాకు వదిలిపెట్టు".
    
    క్రమ క్రమంగా నేను వాదనలో ఓడిపోతున్నానన్న విషయం నాకు తెలుస్తోంది. కానీ నా వాదనలో లోపం ఎక్కడో తెలియటం లేదు. అయినా ఈయనతో వాదించవలసిన అవసరం నాకుఏముంది? ఆ మాటే చెప్పి ఆయనేదో అనబోతూంటే దాదాపు బయటకు గెంటి, తలుపు వేసుకున్నాను. తరువాత చెయ్యవలసిన దానిగురించి ఆలోచనలో పడ్డాను. ముందీ వూర్నించి వెళ్ళిపోవాలి.
    
    ప్రమద్వరతో సహా - అంతే!
    
    రావుగారికీ, ఆయన కూతురికీ బుద్దివచ్చేలా చేయాలంటే ఇక్కన్నుంచి వెళ్ళిపోవాలి! వెళ్లేముందు ఈ పల్లెలో అందరికీ ఆయన ఆడిన నాటకం గురించి తెలిసేలా చెయ్యాలి. పెళ్ళి అయిన మరుసటిరోజు కూతుర్ని వదిలేసి అల్లుడు వెళ్ళిపోయాడంటే అంతకన్నా అవమానం ఏం కావాలి? నాకు జరిగిన మోసానికి ఇదే సరియైన సమాధానం అయితే వెంటనే నేను ప్రమద్వర దగ్గిరకు వెళ్ళలేదు. అంతకన్నా ముందు చెయ్యవలసిన పని ఒకటి వుంది.
    
    రావుగారు సామాన్యులు కాదు. కూతురికి విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకుంటే నన్ను జైల్లో పెట్టించకుండా వూరుకోదు. విషయం అంతవరకూ వస్తే ఎంతవరకైనా తెగిస్తాడు.
    
    అసలాయన ఆర్గ్యుమెంటు చూస్తేనే నాకు మతిపోయింది. ఎంత సులువుగా తప్పంతా నా మీదకు తోసేసేడు!! నేను వెళ్ళి ఆయన కూతురికి మా ప్రేమ విషయం చెప్పి వుండవలసిందట. చెపితే ఏం చేసేది? మా ఇద్దరికీ పెళ్ళి చేసి, ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం రెండు లక్షలు ఇచ్చి వుండేదా? అసలు నాటకం ఆడిందంతా ఆయన. హాయిగా సుఖంగా వుండవలసిన మా జీవితాల్లో అతి నికృష్టమైన ప్లాన్ వేసి నిప్పులు పోసింది ఆయన. ఇంతకింతా చెయ్యకపోతే నేను నిద్రపోను.
ఈ మరుసటిరోజే పట్నం వెళ్ళి, అక్కడ రైలందుకుని బెంగుళూరు వెళ్ళాను. బెంగుళూరులో నా స్నేహితుడు వున్నాడు. అతడు పనిచేసేదీ ఎరువుల కంపెనీయే. అక్కడ ఉద్యోగం రావటం అంత కష్టం కాలేదు. నా వుద్దేశ్యం ఏమిటంటే- మేము వెళ్ళిపోయినా మూడు నాలుగు సంవత్సరాల వరకూ మేము ఎక్కడ వున్నదీ ఈ తండ్రీ కూతుళ్ళకు తెలియకూడదు. అయోమయంతో, అవమానంతో చావాలి!
    
    మీకు నేను దుర్మార్గుడిగానూ, రాక్షసుడిగానూ కనిపిస్తూ వుండి వుండవచ్చు. కానే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, నా తరపునుంచి ఆలోచించండి. ఇంత దారుణం మీకే జైర్గి, మీకు ధైర్యం వుండి వుంటే రావుగార్ని అక్కడికక్కడే పొడిచి పారేసి వుండేవారు. అది లేకే, కేవలం నా తరపునుంచి ఈ విధంగా గౌరవంగా, దూరం వెళ్ళిపోతున్నాను. గౌరవం వుండబట్టే ఇంత జరిగినా, ఆయన పేరు పక్కనుంచి 'గారు' తీసెయ్యలేకపోతున్నాను.
    
    బెంగుళూరు నుంచి మా పల్లెకి వచ్చేసేముందు నా రాజీనామా పత్రాన్ని చేస్తున్న ఉద్యోగంతో తెగతెంపులు చేసుకున్నాను. ఈ పన్లన్నీ చాలా కామ్ గా, ఏ ఉద్వేగమూ లేకుండా చేశాను. నాతో రావటానికి ప్రమద్వర వప్పుకోదని నాకు తెలుసు. ఇక్కడ రావుగారి తర్కమే నేనూ నమ్మదల్చుకున్నాను. కాలమే మనిషికి పరిస్థితులతో రాజీపడటం నేర్పుతుందనేది....
    
    ఎలాగో ఒకలా ప్రమద్వరని ఆ గ్రామంనుంచి బయటకు తీసుకురాగలిగితే తరువాత వివాహానికి వప్పించవచ్చు. నేనే వెళ్ళి అడిగితే స్నేహితురాలికి ద్రోహం చెయ్యలేనని నిశ్చయంగా అంటుంది.
    
    అందుకని చిన్న ఉత్తరం వ్రాశాను.
    
    "ప్రమద్వరా,
    
    అర్జెంటు పనిమీద పట్నం రావల్సి వచ్చింది. ఇక్కడ నా స్నేహితుడు కలిశాడు. అతడి ఆఫీసులో ఉద్యోగం వుందట. నేను చెప్పగానే నీకివ్వటానికి వప్పుకున్నాడు. వెంటనే వస్తే ఆ ఉద్యోగం దొరుకుతుంది. ఈ ఉత్తరం పట్టుకుని వచ్చినది నా మరో స్నేహితుడు. అతడితో కలిసి వస్తే ఉద్యోగంలో చేరిపోవచ్చు. ప్రమద్వరా! మన జేవితాలు ఎలాగూ ఒకటవలేదు. కనీసం ప్రేమించిన వ్యక్తిగా ఈ సహాయమన్నా చెయ్యనీ, నీజీవితం ఒడ్డుకు చేరితే తప్ప నా మనసు కుదుటపడదు. నీ కోసం చూస్తూ వుంటాను.
    
                                                                                                           -నీ ఆనంద్".
    
    మరొకసారి ఆ వుత్తరాన్ని చదువుకున్నాను. ఈ ఉత్తరం చదివితే ప్రమద్వర తప్పక వస్తుందనిపించింది. ఆ పల్లెనుంచీ, తన ఇంటినుంచీ ఆమె ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా బయట పడటానికి ఎదురు చూస్తూందని నాకు తెలుసు.
    
    'నిన్ను యీ ఉద్యోగంలో చేర్పించి, నేను పల్లెకు వెళ్ళిపోతాను. అందువల్ల యీ విషయం తరళకి గానీ, ఆమె తండ్రికి గానీ చెప్పనవసరం లేదు. మన పల్లె సంగతి నీకు తెలియన్దేముంది? నేను నీకు ఈ సాయం చేశానని తెలిస్తే ఒకటికి రెండు కల్పిస్తారు. తరువాత ఆ వూర్లో నా జీవితం నరకమవుతుంది-"
    
    ఈ నాలుగు వాక్యాలు చివర్లో చేర్చగానే మరింత సంతృప్తిగా అనిపించింది. దీంతో ప్రమద్వర తప్పక వస్తుంది.
    
    ఉత్తరాన్ని స్నేహితుడి కిచ్చి పంపాను. ప్రమద్వర అడ్రసు వివరంగా చెప్పాను.
    
    ఆ తఃరువతః ఒక రోజుపాటు విపరీతమైన టెన్షను! మనసు పరిపరివిధాలా ఆలోచించసాగింది. అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య- ప్రమద్వరని ఈ వివాహానికీ, నాతో కలిసి వుండటానికీ ఎలా వప్పించాలా అని! మిగతా అన్ని విషయాలు ఒకటిగా వున్నా, సామాజిక - నైతిక విలువల దగ్గిర కొచ్చేసరికి మావి భిన్నాభిప్రాయాలు. ఇప్పటి సంఘటనే తీసుకుంటే...
    
    వాళ్ళు నన్ను మోసం చేశారు. దానికి ప్రతిగా నేను చేతకాని వాడిలా చేతులు ముడుచుకుని కాపురం చెయ్యలేను. అయిపోయిందేదో అయిపోయింది అనుకోలేను. అంతకు అంతా ప్రతీకారం చెయ్యాలి. అన్నిటికన్నా ముఖ్యంగా- నా సుఖసంతోషాలకు ఆనకట్ట వేసే అధికారం వాళ్ళకు లేదని నిరూపిస్తాను. ఇదీ నా వాదన.    

    కానీ ప్రమద్వర ఈ వాదనకి వప్పుకోదని నాకు తెలుసు. "మీరెలాగైనా కొట్టుకు చావండి. కానీ మీమధ్య తరళకి అన్యాయం చేయకండి" అంటుంది. ఇతరుల సుఖంక్సోం తమ సుఖం వాదులుకోవటంలోనే సుఖం వుంటుందని నమ్మే అమాయక ఎక్స్ ప్లాయిటెడ్ జాతికి చెందినవారికి ప్రతీక ప్రమద్వర. ఆమెని నతహో పాటు కలిసి వుండటానికి వప్పించాటం అంటే మాటలుకాదు కానీ ఆరు మూడయినా మూడు ఆరయినా దీన్ని సాధించి తీరతాను.
    
    ఇలాంటి ఆలోచన్లతో ఒకరోజు గడిచింది.
    
    నాకు అర్ధం కాలేదు-
    
    పట్నంనుంచి లాంచీమీద నాలుగ్గంటల ప్రయాణం ఆ పల్లె.
    
    నా స్నేహితుడు ఎందుకు రాలేదు?
    
    మరో రోజు గడిచింది.
    
    నా స్నేహితుడు రాలేదు. నాకు ఆతృత ఎక్కువయింది. మరికొంచెం సేపు చూసి నేనే బయల్దేరాను.
        
    పల్లె చేరుకునేసైర్కి చీకటి పడింది. ఆ రోజు అమావాస్య నన్నెవరూ గుర్తించలేదు. లేకపోతే ర్వుగారి అల్లుడిగా వచ్చిన కొత్త హోదాకి ఈపాటికి నేను వచ్చిన వార్త అందరికీ తెలిసిపోయేది! ఏమో...రావుగారి తెలివితేటలు అఖండం. పెళ్ళయిన మరుసటిరోజే ఏదో పనిమీద అల్లుడు బయటవూరు వెళ్ళాడని అందరికీ చెప్పేడేమో ఆయన.
    
    ఆ ఆలోచన్లతోనే ప్రమద్వర ఇల్లు చేరుకున్నాను.
    
    మలుపు తిరగ్గానే దూరం నుంచి ఆ ఇల్లు కనపడింది.
    
    చప్పున నా కాళ్ళు ఆగిపోయాయి.
    
    ఆ ఇంటిముందు పందిరేసి వుంది.
    
    పెళ్ళి పందిరి.
    
                                                                        12
    
    నాకు ఏం చెయ్యాలో తోచలేదు. జ్ఞానేంద్రియాలు పనిచేయటం మానేశాయి. నేను ఊహించని సంగతి అది.
    
    నా మనసులో ఇంకా ఏదో అస్పష్టమైన ఆశ వుండిపోయింది. మరో రెండు అడుగులు వేశాను. నా మామగారైన రావుగారు పెళ్ళి పెద్దలా అక్కడ కూర్చుని వున్నారు. అప్పుడే లోపల్నుంచి ప్రమద్వర మామ పెళ్ళి బట్టల్లో బయటకు వచ్చాడు. నా మనసులో ఏ మూలో ఏ మాత్రమో కొద్దిగా ఆశ వుంటే అది క్రమంగా నశించసాగింది. ఒక కుర్రవాడు అట్నుంచి వెళ్తూంటే అడిగాను- "ఎవరి పెళ్ళి జరిగింది?" "అదిగో - ఆ ఇంట్లోనే".
    
    "అది తెలుసులే పెళ్ళికూతురు పేరేమిటి?"
    
    "ప్రమదక్క-" అని వాడు పరుగెత్తి వెళ్ళిపోయాడు. నేను అలాగే నిలబడి వున్నాను.
 మనం అప్పటివరకూ వూహిస్తూ వస్తున్నదే జరిగినా, 'అది జరిగింది' అని తెలిసేసరికి కలిగే బాధా, ఆందోళనా వేరు అయితే ఈ రెండింటికన్నా తీవ్రమైనది, ఆ పెళ్ళిపందిరి మధ్యలో కూర్చుని కబుర్లు చేపుతూన్న జి.పి.రావు. వింత నవ్వుతో నా గొంతు కోశాడు!! ఎంత తెలివిగా నా చుట్టూ వల బిగించి, అన్నిదార్లూ మూసేశాడు!! తల్చుకుంటేనే వళ్ళు కంపరంగా వుంది.
    
    ఆ క్షణమే పరుగెత్తుకు వెళ్ళి ఆ పెళ్ళిపందిరి పీకేసి, ప్రమద్వరని నాతో తెచ్చుకోవాలన్న కోరికని బలవంతం మీద ఆపుకున్నాను. అదికాదు మార్గం నేనిలా చేస్తానని తెలిసే క్షణాలమీద ప్రమద్వర వివాహం చేయించేశాడాయన. ఇప్పుడు నేనేం చేసినా నన్ను అది కటకటాల వెనక్కు తోసేస్తుంది. ముల్లుని ముల్లుతోనే తీయాలి. ఈ రకమైన మోసపు పద్దతుల ద్వారా నన్ను కట్టిపడెయ్యలేరని నిరూపించాలి. అలాటి పథకం ఆలోచించటానికి కొంత సమయం కావాలి.
    
    అన్నిటికన్నా ముందు ప్రమద్వరని కలుసుకోవాలి. అసలేం జరిగిందో తెలుసుకోవాలి. ఆమె మీద ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా వత్తిడి తీసుకువచ్చారో తెలుసుకోవాలి.
    
    అయితే ఆమె నెలా కలుసుకోవాలో నాకు అర్ధం కాలేదు. అంతలో నాతో మాట్లాడిన కుర్రవాడు తిరిగి అటుకేసి వచ్చాడు. వాడితో చిన్న చీటివ్రాసి పంపించాను. అయిదు నిముషాల్లో గోదారి వడ్డుకు వచ్చి కలుసుకొమ్మని! మామూలుగా వ్రాస్తే ఆమె రాదని అందుకని చివర్లో ఒక వాక్యం చేర్చాను. అయిదు నిముషాల్లో రాకపోతే గోదావరిలో నా శవం తేలుతుందని!!! ఈ చేర్చటం కేవలం ఆమెని బెదిరించటానికే కాదు. ఈ ముసలివాడు ఆడిన నాటకంలో ఒక పావుగామారి, కట్టబడిన మంగళసూత్రానికే ప్రమద్వర ఎక్కువ విలువ నిచ్చేట్టయితే నాకు జీవితంలో ఇక మిగిలినదంటూ ఏమీలేదు. నా మరణం ద్వారా అతఃది కూతుర్ని శాశ్వతంగా విధవరాల్ని చేసి ముసలివాడికి మరపురాని గుణపాఠం నేర్పవచ్చు. ఇంకే విధంగానూ చేతకాకపోతే ఇదే ఆఖరి దారి- అనుకున్నాను.
    
    కాగితం కుర్రాడికిచ్చి పంపి, గోదారి వడ్డుకు బయల్దేరాను.
    
                                 * * *
    
    ఉరుకులూ పరుగులూ తీస్తూ గోదారి పారుతూంది.
    
    దాన్ని చూస్తూంటే నాకు ఆ తండ్రీ కూతుళ్ళు గుర్తొచ్చారు. ఈ గోదారీ అంతే-దేన్నీ లెక్కచేయదు. అనుకున్నది సాధిస్తుంది. అడ్డొచ్చిన వాళ్ళని ముంచేస్తుంది. మామూలు సమయాల్లో మాత్రం పైకి నిర్మలంగా కనపడుతుంది.
    
    ఆ అయిదు నిముషాల కాలం నా నిర్ణయంలో మార్పేమీతీసుకురాలేదు. అయినా ఆ నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదికాదు.... వాళ్ళిద్దరూ నాకు కలిగించిన మనస్థాపానికి రెట్టింపు నేను  కలిగించాలి. అయినా నా మనసులో ఏమూలో కాస్త ఆశవున్నది-ప్రమద్వర వస్తుందని! వస్తే మాత్రం నాతోపాటూ తీసుకువెళ్ళిపోగలననే నమ్మకం వుంది. ఏ సామాజిక కట్టుబాట్లూ, ఏ నైతిక విలువలూ మమ్మల్ని ఆపలేవు. ప్రమద్వర రాలేదు. అయిదు- ఆరు - ఏడు నిమిషాలు గడిచాయి. మరో మూడు నాలుగు నిమిషాలు చూశాను. ఆమె జాడలేదు.
    
    నాకు ఆమెమీద కూడా కోపం వచ్చింది. మనిషికి సెంటిమెంట్లు వుండటంలో తప్పులేదు. వుండాలి కూడా. కాని అర్ధంలేని వాటిని పట్టుకుని వేలాడటంలో అర్ధంలేదు. నాకు మొత్తం మనుష్యులందరి మీదా ప్రేమకన్నా కసి ఎక్కువౌతూంది.
    
    రెల్లుగడ్డి అంచుల్ని తాకుతూ గోదారి ప్రవహిస్తూంది. మరో క్షణం ఆగితే నా శరీరం దానిలో పడి కొట్టుకుపోయేది!
    
    అప్పుడు చూశానా ఆకారాన్ని.
        
    వేగంగా నా వైపుకు వస్తోంది. ఆ నడకలో తొందరపాటు కనిపిస్తూంది.
    
    నా మనసులోని ఆశాదీపం ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసి, అంతలోనే ఆరిపోయింది. వస్తున్నది ప్రమద్వర కాదు. నా మామగారు. ఊహించని విధంగా ఆయన్ని అక్కడ చూసి బిత్తర పోయాను. కానీ అది లిప్తకాలం మాత్రమే.
    
    అప్పటి వరకూ నా మనసులో దాక్కొని వున్న కసి, ద్వేషం రెండింతలై ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఇతడే.... ఇతడే.... ఇ..త....డే...
    
    చుట్టూ ఎవ్వరూ లేరు. అలాగే గోదాట్లో తోసేస్తే సాక్ష్యం కూడా మిగలదు.
    
    "ఆనంద్! నీ కోసం రెండ్రోజుల్నుంచీ వెతికించని చోటు లేదు" అంటూ దగ్గిరకు వస్తున్న అతడిని ఏమీ చెయ్యకుండా, నన్ను నేను కంట్రోలు చేసుకోవటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. "అదృష్టం బావుండి ఆ కుర్రవాడితో పంపిన ఉత్తరం నా చేతిలో పడింది. ఇంకెవరికైనా దొరికితే కొంప మునిగేది-"
    
    ఆయనవైపు అసహ్యంగా చూస్తూ "ఏం జరిగేది? మీ అల్లుడు ఇలాంటివాడని పదిమందికీ తెలిసేది. అలాంటి అల్లుడి కోసం మీరు వేసిన చౌకబారు ఎత్తులు అందరికీ తెలిసేవి. అంతేగా" అన్నాను.
    
    "ఇక్కడొద్దు బాబూ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద".
    
    "మీ ఇంటికా? ఇక చచ్చినా ఆ గడపలో కాలు పెట్టను...."
    
    "అలా అనకు. ఏం తప్పు జరిగినా నాదే".
    
    "ఈ మాటే రెండ్రోజుల క్రితం మీరు అన్నారు. ఆ తరువాత ఈ రోజు మీ చేతుల్తోనే ఇంకో పెళ్ళిచేసి మరో ఘోరమైన తప్పు చేశారు".
    
    "ఏది? ప్రమద్వర పెళ్ళేనా? ఆ విషయమే మాట్లాడతాను. కొంచం సావధానంగా విను".
    
    "నేనేమీ వినదల్చుకోలేదు. నన్ను రెచ్చగొట్టకండి-" అరిచాను.
    
    -ఆ విధంగా మా ఇద్దరిమధ్యా వాదోపవాదాలు చాలాసేపు జరిగాయి. గోదారి పారుతూనే వుంది. మా మాటలు వింటూనే వుంది. లౌక్యుడైన మధ్యవర్తిలాగా ఎవరిది న్యాయమో ఎటూచెప్పకుండా వుండిపోయింది. మామూలుగా ఆయనతో మాట్లాడటానికే అందరూ భయపడతారు. కానీ నాకేం భయం?
    
    "చూడండి! నేను కాబట్టి ఇంకా మీకు గౌరవమిచ్చి మాట్లాడుతున్నాను. ఇంకొకరైతే చేసిన పన్లకి మొహంమీద ఉమ్మేసేవారే. మీ స్వార్ధంకోసం నాకు అన్యాయంచేస్తే చేశారు. కానీ పాపం ఆ ప్రమద్వర ఏం చేసింది? ఆ అమ్మాయిని ఒక రౌడీకి, ముసలోడికీ ఇచ్చి కట్టబెట్టాల్సిన అవసరం మీకేమొచ్చింది?"
    
    "అది చెపుదామనే..." ఆయన మాటలు వినిపించుకోకుండా అరిచాను- "ఏం చెపుతారండి మీరు? నాకు గుండెజబ్బు అని అబద్దం చెప్పిన డాక్టరుకి ఎంతిచ్చారో చెపుతారా? ప్రమద్వర పెళ్ళి బలవంతంగా చేయించటానికి రౌడీలకి ఎంతిచ్చారో చెపుతారా? మీ కూతురుతో కలిసి వుంటే నాకెంత ఆస్థి వస్తుందో ఆ వివరాలు చెపుతారా? ఇదేమీ అక్కర్లేదు. కానీ నేనొక సలహా చెపుతాను వినండి. మీ పరువు నిలిచేది!..... నేనెవరికీ కనపడకుండా వెళ్ళిపోతాను. మీ అల్లుడు గోదాట్లో పడి చనిపోయినట్టు ప్రకటన చేసి మీ కూతుర్ని విధవరాల్ని చేయండి. తరువాత పెద్ద మనసుతో పునర్వివాహం చేస్తున్నట్టు ప్రకటించండి. ఇక పెళ్ళికొడుకులంటారా? మీ అంత డబ్బున్నాయనకి అల్లుడవటానికి ఎవరిష్టపడరు? డబ్బుకోసం కక్కుర్తిపడి, నిండు ఆరోగ్యవంతుడికే గుండెజబ్బు అని చెప్పగలిగిన డాక్టరు మీ అల్లుడయితే మరీ మంచిది. మామా అల్లుళ్ళు కలిసి ఇంకెందర్నో నాశనం చెయ్యొచ్చు..."
    
    "నువ్వు నన్నెన్నైనా అను. కానీ తరళ భవిష్యత్తు బాగుండాలి. నేను చేసిన తప్పుకి దాన్ని శిక్షించకు. అయిందేదో అయిపోయింది. మీరిద్దరూ సుఖంగా వుండాలంటే నేనేం చెయ్యాలో చెప్పు."
    
    "ఏమైనా చేస్తారా?"
    
    "నా కూతురు సుఖంగా వుండటం కోసం ఏమైనా చేస్తాను".
  "అయితే చావండి-"
    
    ఆయన చప్పున తలెత్తాడు. హేళనగా నవ్వేను. "ఏం ఆత్మహత్య చేసుకుంటే పరువు పోతుందని భావిస్తున్నారా? కూతురి కోసం పరువు పోగొట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారా ఇప్పటివరకూ మీ అద్భుతమైన తెలివితేటల్తో మా జీవితాల్తో ఆడుకున్నారు. ఇక ఇప్పుడు నా వంతు... మీరు చేసిన దానికి ఇంతకు ఇంతా అనుభవించేలా చేస్తాను. జరిగినదంతా తరళకు చెప్పి..."
    
    "వద్దు వద్దు" చప్పున అన్నాడాయన.
    
    "చేసిందంతా నేను".
    
    "తను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళున్న అభిప్రాయంతో...గర్వంతో మిడిసిపడుతూ వుంటుంది మీ కూతురు. దానికి దెబ్బకొట్టకుండా వదలను".
    
    ఆయనేదో అనబోతూ మానుకుని, "సర్లే అల్లుడూ, ఇంత జరిగాక యీ సమస్యకి నాకు ఒకటే పరిష్కారం కనబడుతూ వుంది. నాకు ఒక నాలుగ్గంటలు టైమివ్వు నేను చెపుతాను" అని వెనుదిరిగాడు.
    
    "ఏం చెపుతారు మీరు?" వెనుకనుంచి గట్టిగా అరిచాను. సమాధానం ఇవ్వలేదు ఆయన. అలాగే నది ఒడ్డున నడుస్తూ రెల్లు పొదల్లో కలిసిపోయాడు. ఆయన నాలుగ్గంటల్లో మా ముగ్గురి జీవితాలకూ ఏం పరిష్కారం చెపుతాడో నాకు తెలియదు.
    
    తెలిశాక మాత్రం నిలువునా కదిలిపోయాను.
    
    నేను ఊళ్ళోకి వెళ్ళేసరికి ఆ వార్త గుప్పుమంది. రావుగారు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త అది.
    
                                        13
    
    అందరూ గుంపులు గుంపులుగా ఆ ఇంటివైపు పరుగెడ్తున్నారు. నేను మాత్రం భూమిలో కాళ్ళు పాతుకుపోయినవాడిలా అలా నిలబడిపోయి వున్నాను. నా మనసులో ఆలోచన్లు తుఫానులో ఆకుల్లా కదలసాగాయి. వాటికో నిర్దుష్టమైన రూపులేదు. నా మనసు అభావపర్చేటందుకు మాత్రమే అవి వున్నట్టు తోచాయి.
    
    "ఆత్మహత్య చేసుకుంటే పరువుపోతుందని భావిస్తున్నారా? మీకు జీవితంలో కావల్సినవి రెండే కదా మీ కూతురి ఆనందం- మీ పరువు మొదటి దానికోసం రెండోది వదిలిపెట్టండి".
    
    నా మాటలు ఆయన ఇంత దారుణానికి తలపడేలా చేస్తాయనుకోలేదు. నా కోరిక ఇంత పెద్ద బలిదానాన్ని కోరుతుందని నేను వూహించలేదు. నా ఆవేశం ఆయనమీద నాకున్న కోపం నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేలా చేసినాయంతే!
    
    "ఇదేమిటి యిక్కడ నిలబడిపోయావు! మీ మామగారు పోయార్టగదా! పదపద!" అన్న కరణంగారి మాటలకి తేరుకుని, అప్రయత్నంగా ఇంటివైపు నడిచాను.
    
    ఆయన శరీరం మీద పడి తరళ, ఆమె తల్లి గోలుగోలున రోదిస్తున్నారు. ప్రమద్వర వారిని ఓదారుస్తూంది. ఆమె ఇంకా పెళ్ళి బట్టల్లోనే వుంది. పెళ్ళయిన మొదటి రాత్రి నుంచీ నేను కనపడకుండా పోవటానికీ, ఈరోజు ఈయన మరణానికీ ఏదైనా లంకె వుందేమోనని కొందరు నావైపు అనుమానంగా చూస్తున్నారప్పుడే చిన్న పల్లెల్లో ఇలాంటి విషయాలు చాలా ఆసక్తి కలిగిస్తాయి.
    
    కరణంగారు దహనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
    
    నేను కూడా బయటికి వచ్చాను.
    
    అక్కడే నిలబడివున్న డాక్టరు నాకు ఒక ఉత్తరం అందించాడు. ఇలాంటి ఉత్తరమేదో వుండివుంటుందని వూహించాను కానీ- ఆ ఉత్తరంలో విషయాలు మాత్రం నేను వూహించని రీతిలో వుండి కదిలించివేశాయి. ఈ ఉత్తరం ఇలా వుంది.
    
    "బాబూ-
    
    నా మీద నీ కోపం చల్లారిందనుకుంటాను. లేదా నేను నీకు మూర్ఖునిలా కనిపిస్తూ వుండి వుండవచ్చు. కానీ ఒక విషయం అర్ధం చేసుకో నాకు నా కూతురంటే వల్లమాలిన ప్రేమ. దానికోసం ఏమైనా చేస్తాను. ఆ బలహీనతతోనే డాక్టరుతో నాటకమాడించాను. నాకు అప్పటికి మీ ప్రేమ సంగతి తెలీదు. కేవలం నా అహంభావానికి అడ్డుగా నువ్వీ వివాహానికి వప్పుకోవటంలేదని అనుకున్నాను. నా తెలివితేటలకి ఇదొక సవాలు అనుకున్నాను. నువ్వీ వివాహం చేసుకున్నాక- ఇంత ఆస్తికి వారసుడివయ్యాక నేనాడిన నాటకాన్ని నవ్వుతూ మర్చిపోతావనుకున్నానే కానీ డబ్బుని తృణప్రాయంగా భావిస్తావనీ, ప్రేమకి జీవితం కన్నా ఎక్కువ విలువనిస్తావనీ వూహించలేకపోయాను. అనుకున్నది నెరవేరేదాకా నిద్రపోలేని మనస్తత్వం నాది ఈ గ్రామంలో ఇప్పటివరకూ అదే జరిగింది. మొదటిసారి నన్ను ఎదుర్కొన్నది నువ్వే.
    
    నేనే విధంగా చెప్పినా నువ్వు వప్పుకోవు నమ్మవు. నా కూతుర్ని ఏలుకోవు నేను బ్రతికుండగా ఆలోచించి నేనీ నిర్ణయం తీసుకున్నాను. బాబూ, నేను నిన్ను కోరేది ఒక్కటే. తరళ అమాయకపు పిల్ల నా మూలంగా దాన్ని ద్వేషించకు బాధపెట్టకు. నేను లేని లోకంలో దాన్ని చూసుకోవలసింది నువ్వే. నేను నీకు చేసిన అన్యాయానికి నా ప్రాణం బదులుగా అనుకుని ఇక ఈ ద్వేషాన్ని వదిలిపెట్టు నా చివరి కోరిక తీరుస్తావు కదూ.
    
    చివరగా ఒక విషయం.
    
    నీ స్నేహితురాలు ప్రమద్వర వివాహం నేను స్వయంగా దగ్గిరుండి చేయించటంపట్ల కూడా నీకు నామీద దురభిప్రాయం మరింత ఎక్కువై వుండవచ్చు. కానీ జరిగిందేమిటో చదువు.
    
    మొదటిరాత్రి జరిగిన వెంటనే నువ్వు పట్నం వెళ్ళిపోయావు. అక్కన్నుంచి ప్రమద్వరకి వుత్తరం వ్రాశావు. గుర్తుందా? ప్రేమించి, ఒకటి కాలేకపోయినందుకు ప్రతిగా పట్నంలో ఉద్యోగం వేయిస్తానని, తనని వచ్చేయమని కోరుతూ ఒక ఉత్తరం వ్రాశావు. నువ్వు వ్రాసిన రెండో ఉత్తరం పెళ్ళిపందిరిలో నా చేతిన పడ్డట్టే, నువ్వు వ్రాసిన ఆ మొదటి ఉత్తరం ప్రమద్వర తల్లి చేతిలో పడింది ఆమె కంగారుపడి దాన్ని ఆమె తమ్ముడు భైరవమూర్తికి చూపించింది. ప్రమద్వరకి రహస్యంగా ఉత్తరం వ్రాయటం నువ్వు చేసిన పొరపాటు. చేతివరకూ వచ్చిన ఫలం జారిపోతూందే అని భైరవమూర్తి భయపడ్డాడు. నువ్వు రెండో కాపురం పెట్టటానికి  ఆ అమ్మాయిని పట్నం వచ్చెయ్యమని అడుగుతున్నావేమో అనుకున్నారు ఆ అక్కాతమ్ముళ్ళు. అంతేకాదు అప్పటివరకూ ఆ అమ్మాయిని మాటల్తోనే వాళ్ళు ఈ పనికి వప్పించటానికి ప్రయత్నించారు. మీ ప్రేమ సంగతి తెలిసేసరికి ఆమెపట్ల వున్న 'భయం' బహుశా భైరవమూర్తికి పోయివుంటుంది. దానికి తోడు అక్కకూడా సపోర్టు చేసేసరికి భైరవమూర్తి విజ్రుంభించాడు. ఈసారి మాటల్తోనే కాకుండా చేతల్తో ఆమెని వప్పించటానికి ప్రయత్నించారు. కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోకుండా, డబ్బు సంపాదించే ఒక శరీరం మెళ్ళో తడు పడకుండా వుండటానికి మొన్న రాత్రి-తమ ఇంట్లోనే కన్నెరికం ఏర్పాటు చేసిందా తల్లి. ఆమె తమ్ముడ్నే ఆ కార్యానికి వినియోగించింది. నేను వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి అది. నీ గురించి కనుక్కుందామని వెళ్ళిన నాకు- అక్కడ ప్రమద్వర జీవితం కుక్కలు చింపిన విస్తరి కాబోతూ కనిపించింది. అప్పటికే ఆమె జీవచ్చవంలా తయారైంది. అతడి పైశాచిక చర్యకి బలై, ఏ క్షణమైనా మరణాన్ని ఆహ్వానించటానికి సిద్దంగా వుంది. కావాలంటే అప్పుడే పోలీసులకి ఆ దుర్మార్గుడిని పట్టించగలను. కానీ దానివల్ల ప్రమద్వర జీవితం పూర్తిగా నాశనమవుతుంది. ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? భైరవమూర్తిని ఈ వివాహానికి వప్పించటం తప్ప...
 దానికి అతడు యాభైవేలు అడిగాడు.
    
    ప్రమద్వర తల్లికూడా ఆ రేటే ఫిక్సుచేసింది. కూతురు 'వ్యాపారం'లోకి దిగివుంటే అంత సంపాదించేదట. ఆనంద్! ఇదంతా వ్రాసి నీ మనసు పాడుచేయటం నాకిష్టం లేదు. కానీ జరిగింది అది! యాభైవేలు నేను ఇవ్వటానికి అంగీకరించాను. ఫలితంగా మరుసటిరోజే ఈ వివాహం జరిగింది.
    
    అయితే అంత సులభంగా ప్రమద్వర దీనిని వప్పుకోలేదు. ఆ భ్రష్టుడితో వివాహం కంటే ఆహ్మహత్య చేసుకోవటమే మంచిదని ఆమె భావించింది. కానీ ఆమె మరణిస్తే నువ్వు ఏమవుతావో నేను వూహించగలను. ఆ విషయమే ఆలోచించమన్నాను. ఆమె తెలివైంది. క్షణాల్లో దాన్ని అర్ధం చేసుకుంది. వివాహానికి వప్పుకుంది. యాభైవేలతో భైరవమూర్తి ఆమెను చేసుకున్నాడు.
    
    ఆనంద్ ఇదంతా నేన్నీకు చెప్పకూడదనుకున్నాను. నా డబ్బు గురించి చెప్పుకోవటం కూడా నా కిష్టంలేదు. కానీ హిమాలయాల కంటే ఉన్నతంగా ఎదిగిపోయిన నీ స్నేహితురాలి వ్యక్తిత్వం ముందు నా అల్పత్వం నన్ను హేళన చేస్తూంది. మరణ వాంగ్మూలంకంటే సత్యం మరొకటి ఉండదు. అందుకే ఈ నిజాన్ని నీనుంచి దాచలేదు. చెడిపోయిన నీ స్నేహితురాల్ని ఒక ఇంటిదాన్ని చేశాననే సంతృప్తి ఒకటే నాకు మిగిలింది. నా వల్ల అన్యాయమైపోయిన వారిలో ఆమెకూడా వుంది కదా.
    
    కొద్దిగా ఆస్తికూడా ఆమె పేరుమీద వ్రాస్తున్నాను. భైరవమూర్తి ఈ కారణంగానైనా ఆమెని జాగ్రత్తగా చూసుకుంటాడని ఆశ! నేను చేయగలిగినదంతా చేశాను. ఇక నువ్వు మిగతాది చెయ్యాలి. ఈ లోకంలో లేని నామీద మరింక నీకు కోపం వుండదని ఆశిస్తూ, ఒకవేళ వున్నా, దాన్ని నా కూతురిమీద చూపెట్టవన్న ఆశతో-
    
                                                                                                            -నీ మామయ్య"
    
                                      14
    
    ఉత్తరం ఎలా పూర్తిచేశానో గుర్తులేదు. మనసంతా ఒక రకమైన శూన్యత ఆవరించింది.
    
    ప్రమద్వర నాశనమైంది! నేను అపురూపంగా పెంచుకున్న మొక్కమరొకసారి కాళ్ళక్రింద పడి నలిగిపోయింది! దాన్ని నిలబెట్టటానికి రావుగారు ప్రయత్నించారు! అటు నన్ను సరిదిద్దడంకోసం ఆత్మార్పణం చేసుకున్నారు. "హిమాలయాలకంటే ఉన్నతంగా ఎదిగిపోయిన నీ స్నేహితురాలి వ్యక్తిత్వం ముందు...."అన్నారాయన. ఎదిగింది ప్రమద్వర కాదు, ఆయనే చేసిన చిన్నతప్పుకు ఇంత శిక్ష వేసుకుని పునీతుడయ్యాడు ఆయన!
    
    ఆయన ఉత్తరంలో వ్రాసిన మరో వాక్యం నన్ను కదిల్చివేసింది. "తను మరణిస్తే నువ్వేమవుతావో ఆలోచించి ఈ వివాహానికి బలవంతంగా వప్పుకుంది ప్రమద్వర".
    
    ఎంత పచ్చినిజం! నిజంగానే నేను పట్నంలో వుండగా, ఇక్కడ ఈ దారుణం జరిగిన తరువాత ప్రమద్వర ఆత్మహత్యా చేసుకుని మరణించి వుంటే నేనేమై వుండేవాడిని? ఎలా ఆలోచించి వుండేవాడిని? ఆమెని రావుగారే చంపించి వుంటారని వూహించేవాడిని కదూ....తన అడ్డు తొలగిపోతేనే మా దాంపత్యం....బాగుపడుతుందని భావించి రావుగారే ఈ పని చేయించారని అనుకుని, తరళకి శాశ్వతంగా దూరమయ్యేవాడిని కదూ!
    
    ఇంత ఆలోచించి ప్రమద్వర ఈ పెళ్ళికి వప్పుకున్నదన్నమాట! మనసులో ఎన్ని అగ్ని పర్వతాలు బ్రద్దలైనా బలవంతంగా తనని చెరిచిన వాడితోనే జీవితం పంచుకోవటానికి సిద్దపడిందన్నమాట. ఒకరు ఆత్మహత్య చేసుకుని నన్ను సరిదిద్దటానికి ప్రయత్నించారు. మరొకరు నాకు మనస్తాపం కలగకుండా వుండటంకోసం ఆత్మహత్యా చేసుకోకుండా నరకంలాంటి దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. ఇద్దరూ ఈ విధంగా నా మీద కక్షసాధించారు.
    
    నా మనసు ఆ ఇంటిలాగే శ్మశానవైరాగ్యంతో నిండింది. పనులన్నీ ఒక నిమిత్త మాతృడిలా నిర్వహించాను.
    
    ఒకసారి మనిషి మానసికంగా చచ్చిపోవటం ప్ర్రారంభిస్తే ఇక ఆ మరణం ఒక్కసారి జరగదు. ఆగదుకూడా!.... ఏ గాయపు బాధనైనా ఎదుర్కోవచ్చు. ఏ ఓటమినైనా ఎదుర్కోవచ్చు. కానీ ఆత్మ- అంతరాత్మల మధ్య సంఘర్షణని భరించటం మాత్రం అసాధ్యం. ఒకసారి అది మొదలైతె ఇక ఎంతటి వాడైనా కృంగికృశించి పోవాల్సిందే అది పతనానికి ప్రారంభం.
    
    నాకు చాలాసార్లు ఒకే కల మాటిమాటికీ వచ్చేది. ఆ కలలో రావుగారూ, తరళా వీళ్ళెవరూ లేరు... అప్పటికి నాకు పెళ్ళయిందో లేదో కూడా తెలీదు. రెండ్రోజులు పట్నంలో ఏదో పని మీద వెళ్ళొచ్చేసరికి ప్రమద్వరని ఆమె మావయ్య బలాత్కరించినట్టు తెలిసింది. కొడవలితో పరుగెత్తానట.... తలుపు తట్టేసరికి ఎదురుగా ప్రమద్వర.... మెళ్ళో మంగళసూత్రంతో - నాభర్తని చంపొద్దు అన్నట్టు చూస్తూ...
    
    నేను బిగ్గరగా నవ్వుతున్నాను. "నన్ను హంతకుడిని చేయటం ఇష్టంలేక నీ భర్తను నేనెలాగూ చంపనన్న ధీమాతో నీకై నీవు కట్టుకున్న తాళి అది. అంతే తప్ప నీ భర్త కట్టింది కాదు".
    
    ఆ అరుపులతో కల చెదిరిపోతుంది.
    
    ఇలా చాలాసార్లు వచ్చేది.
    
    ఈ కలకి అర్ధం నేనిలా చెప్పుకున్నాను- "నేను సుఖంగా వున్నాను- నువ్వూ సుఖంగా వుండు" అని నాకు చెప్పటం కోసమే ప్రమద్వర ఆ వివాహం చేసుకుంది తప్ప అసలది వివాహమే కాదు అని నా మనసులో ఎక్కడో బలంగా ముద్రపడి పోయింది. ఆ భావరూపమే తరచుగా వచ్చే ఈ కల!
    
    నేను ఈ జీవితంలో రాజీపడలేకపోయాను. ఒక రకంగా చెప్పాలంటే నా కంటే రావుగారే ధైర్యవంతుడేమో? పరిష్కారంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
    
    తరళలో పిచ్చి, పెంకితనంతోపాటు విపరీతమైన ప్రేమకూడా వుంది. అయితే దాన్ని ప్రదర్శించే విధానాలే బావుండేవికావు. "ప్రొద్దున్నెళ్ళి రాత్రొస్తారు. అంతసేపూ ఏం చెయ్యను?" అంది విసుగ్గా 'పేరు వ్రాసుకు చూసుకుని సంతృప్తిపడు' అన్నాను. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి గోడల్నిండా పేర్లు వ్రాసింది ఇదీ ఆమె ప్రేమ ప్రకటించే విధానం. ఇంకెవరైనా అయితే ఆమెతో సుఖపడేవారేమో కానీ, ఒకసారి సెలయేటికి అలవాటు పడినవారు జలపాతపు హోరును భరించలేరు. అయితే ఆమె ప్రేమ నన్ను అప్పుడప్పుడు కదిల్చివేసేది. కానీ ఆమె దగ్గరకు రాగానే నాకు ప్రమద్వర గుర్తొచ్చేది. దాంతో దూరం తొలగిపోయేవాడిని. ఆమెని తాకింది మొదటిరోజు మాత్రమే. అయితే విధి- ఆ అవకాశం చాలంది!
    
    తరళ గర్భవతి అని నాకు తెలిశాక మునుపటిలా ఆమెతో కఠినంగా వుండలేకపోయాను. కానీ మానసికంగా ఎప్పుడూ దగ్గిర కాలేనన్నది పచ్చి నిజం. నాకు ప్రేమగురించి పెద్దగా వివరించటం తెలీదు. ప్రేమికులు ఎలా ఒకరికొకరు నమ్మకంగా వుంటారు, ఒకరి ఆలోచనల్లో ఒకరు అనుక్షణం గడుపుతారు అన్నది చెప్పలేను. ప్రేమ అన్నది ఒక ఫీలింగు. హృదయంలో పుట్టుమచ్చ. దాన్ని అనుభవించాలే తప్ప మరొకరు వివరిస్తే వినాలనుకోవటం హాస్యాస్పదం. చాలా రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. అప్పటికి మేము ముగ్గురం స్నేహితులం మాత్రమే. నేను గోదారి ఒడ్డుకు వెళ్ళేసరికి తరళ ప్రమద్వర ఏదో మాట్లాడుకుంటున్నారు. తరళ అన్న దానికి ప్రమద్వర బిగ్గరగా నవ్వుతూంది. ఆ తరువాత ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను అడిగాను-

No comments:

Post a Comment