నేను కోపంగా, "తనమీద ఏమాత్రం ఇంటరెస్టూ లేకపోతే ఎందుకు ఇలా షికార్లు?" అన్నాను. "నీ కోసం" అన్నాడు. "నీకు లేని ధైర్యం తనకుంది. నీమీద లేని నమ్మకం మీ అమ్మకు తన మీద వుంది. అందుకే తనని కూడా మనతో కలుపుకున్నాను-"
ఆ మరుసటి రోజు నేను ధైర్యం చేసి తరళ దగ్గిర అనేశాను- "ఆనంద్ కి పెళ్ళి నిశ్చయమవుతూందట-"
తరళ చప్పున తలెత్తి "నీ వరకూ వచ్చిందా?" అంది.
ఈసారి తెల్లబోవటం నా వంతయింది, "-అంటే" అన్నాను అయోమయంగా.
"నిన్న సాయంత్రమే నాన్నగారికి చెప్పాను".
"ఏమన్నారు?" అన్నాను ఆత్రంగా.
నవ్వింది "ఏమంటారు? నే నెప్పుడు ఏమన్నా కాదనరు".
దాదాపు పరుగెత్తుకుంటూ ఆనంద్ దగ్గిరికి వెళ్ళాను.
ఇదంతా మీకు చిత్రంగానూ, అవాస్తవికంగానూ వుండవచ్చు. కానీ ఇందుకు భిన్నంగా ఎవరైనా ప్రవర్తించటం అనేది కాల్పనిక సాహిత్యంలో మాత్రమే సాధ్యపడుతుందని నేననుకుంటున్నాను.
నేను చెప్పినదంతా విని ఆనంద్ తేలిగ్గా, "సర్లే, నేను చూసుకుంటాన్లే" అన్నాడు, "-వాళ్ళ నాన్నగారితో నేను చెపుతాను చేసుకోనని-"
నాకెందుకో అంత సంతోషంగా అనిపించలేదు. అనవసరంగా గోటితో పోయేది ఇక్కడివరకూ తీసుకొచ్చామేమో అనిపించింది. ఆమె పరోక్షంలో ఆమెకు తెలియకుండా మేము ప్రేమించుకోవటం, ఆమె ప్రత్యక్షంలో ఏమీ తెలియనట్లు వుండటం- ఆమె అతడిని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నేను దానికి 'ఊ' కొట్టటం- ఇదంతా తప్పు నాదే అనిపించేలా చేస్తుంది.

"పోనీ ఆమెనే చేసుకో ఆనంద్" అన్నాను.
"ఇదేమీ హోటల్ కాదు, ఇడ్లీ లేకపోతే దోసె తీసుకురా అనటానికి" దగ్గిరగా వచ్చి అన్నాడు. "నువ్వు ఎవరి గురించీ భయపడనవసరంలేదు. మీ ఇంట్లో వాళ్ళు కాదన్నాసరే లెక్కచెయ్యనవసరం లేదు. అన్నిటికన్నా ముఖ్యవిషయం నేను కధానాయకుడి లక్షణాలు వున్న ధీరోదాత్తుడిని కాను. ఒకవేళ నువ్వు త్యాగం చేసినా నన్ను వదిలేసినా తరళని మాత్రం చేసుకోను, చేసుకోలేను. ప్రాక్టికల్ గా ఆలోచించే మనిషిని నేను. మీరీ త్యాగాలతో దయచేసి నన్ను బాధపెట్టకండి".
ఎందుకో తెలీదు నాకు బాగా దుఃఖం వచ్చింది. ఈ విషయమంతా తెలుస్తే తరళ ఏమనుకుంటుంది? కత్తెర మధ్య పోక చెక్కలా అయిపోయింది నా పరిస్థితి.
మా ఇంట్లో పరిస్థితి కూడా ఏమీ బావోలేదు.
అమ్మా, మావయ్యల వైపునుంచి వత్తిడి ఎక్కువైంది. మేమున్న వాతావరణం కూడా అలాంటిదే. తరళని ఎవరూ ఏమీ అనలేరు. కానీ నా సంగతి అలాకాదు. చెవులు కొరుక్కోవటం ఎక్కువైంది. ముందంటే తరళతో వెళ్ళటానికి వప్పుకుంది కానీ, తరువాత అలా చేసినందుకు అమ్మ బాధపడటం మొదలు పెట్టింది. ఆనంద్ తో నేను తిరుగుతున్నానన్న విషయం బయట ప్రపంచానికి తెలిస్తే నా మార్కెట్ (ఈ పదం వుపయోగించినందుకు క్షమించాలి) పడిపోతుందని అమ్మ భయం అసలిప్పటికే, డబ్బు తయారు చేసే మిషను ఖాళీగా వున్నందుకు మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బందిగా వుంది. ఆనంద్ పరిచయంతో అది ఎక్కువైంది. స్వంత తల్లికూడా అలా వుంటుందా అని మీరంటే మీకు లోకజ్ఞానం తక్కువన్నమాట. నేను ఆనంద్ ని వివాహం చేసుకోవటానికి నా తల్లి ససేమిరా వప్పుకోదని నాకు తెలుసు. ఈ విషయం ఆనంద్ కి చెప్తే "ఆవిడ వప్పుకొనేదేమిటి? నువ్వు మేజర్ వి కావాలంటే పోలీస్ స్టేషన్ లోనే నిన్ను చేసుకుంటాను" అనేవాడు.
మా పల్లెటూళ్ళల్లో చాలావరకు ప్రేమలు గడ్డివాముల వెనకే పుట్టి, అక్కడే సమాధి అయిపోతాయి. కానీ ఆనంద్ నన్ను ఒక్కసారి కూడా స్పృశించలేదు. అసలు ఆ ప్రయత్నమే చేయలేదు. అతడెప్పుడూ ప్రేమకన్నా ఎక్కువగా వివాహం గురించే మాట్లాడేవాడు. అందుకే అతడంటే రోజురోజుకీ నాకు ప్రేమతోపాటు గౌరవం కూడా పెరగసాగింది. ఎలాగో ఒకలాగా నేను నా తల్లిని ఎదురించగలను. కానీ నా స్నేహితురాలి విషయమే నాకు బాధగా వుంది. ఎంత తొందరగా ఈ విషయం బయటపడితే అంత బావుణ్ణు అనిపించింది.
చివరి కారోజు నేను తరళకి అంతా చెప్పెయ్యాలనుకున్నాను.
చాలా రిహార్సల్స్ వేసుకున్నాను.
తరళ నన్ను బాగా తిడుతుందని నాకు తెలుసు. కానీ మీరైనా నన్ను అర్ధం చేసుకుంటే చాలు. నేను అనిబిసెంటునీ, నైటింగే ల్ నీ కాదు. నేను పుట్టిన కులానికీ, నాకున్న అందానికీ నాకు వివాహమవటం కలలో మాట. అప్పుడే వూళ్ళో పెద్దలు 'లోపాయికారీ'గా కబుర్లు చేస్తూనే వున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఒక చెయ్యి నన్ను ఈ వూబిలోంచి పైకి లాగటానికి ప్రయత్నిస్తూంటే, దాన్ని అందుకోకపోవటం స్వార్ధరాహిత్యమా? మూర్ఖత్వమా? తరళ విషయం అలాకాదు. ఆమె అతడిని చేసుకోవాలంటే ఎన్నో మెట్లు దిగి రావాలి. ఆమెకు అంత అవసరం ఏముంది?

తరళ ఎంత మంచిదో నాకు తెలుసు.
మా ఇద్దరి విషయమూ తెలిస్తే బాగా తిట్టినా, తరువాత నవ్వేస్తుంది. అలాగే గానీ జరుగుతే, ఇన్నాళ్ళూ నేను అనుభవించిన టెన్షన్ అంతా అనవసరమైంది. ఒక్కసారే శుభలేఖ ఇస్తే తను చాలా హర్ట్ అవుతుంది. ముందు చెప్పటమే మంచిది. ఇన్ని రిహార్సల్స్ చేసుకుని నేను తన దగ్గిరకు వెళ్ళేసరికి తను నవ్వుతూ ఎదురొచ్చింది. "రా ... రా... నీకో గుడ్ న్యూస్" అంటూ.
"ఏమిటి?" అన్నాను.
"మా పెళ్ళికి ఆనంద్ వప్పుకున్నాడు".
నా కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టు అనిపించింది.
"ఏమిటీ?" మళ్ళీ అడిగాను.
"చెవుడుగానీ వచ్చిందా ఏమిటి? మా పెళ్ళికి ఆనంద్ వప్పుకున్నాడు-" అంది. నా మొహంలో మారుతున్న భావాలు తరళ కి కనిపించకుండా ఉండటానికి చాలా కష్టపడవలసి వచ్చింది.
"కంగ్రాచ్యులేషన్స్ అనవేం?"
"కంగ్రాచ్యులేషన్స్". ఎలాగో నోరు పెగల్చుకుని అన్నాను. నాకు అంతా అయోమయంగా వుంది. 'ఆనంద్ యీ వివాహానికి వప్పుకున్నాడు'. ఇవే మాటలు నా చెవుల్లో గింగిర్లు తిరుగుతున్నాయి. ఎలా జరిగింది ఇది?
నా మనసంతా పరస్పర విరుద్ద భావాల్తో కొట్టుమిట్టులాడింది. ఎక్కువసేపు అక్కడ వుండలేకపోయాను! అక్కడనుంచి ఎలాగో బయటపడి ఇంటికొచ్చేశాను. అసలే మా ఇల్లు నరకం ఇటువంటి స్థితిలో అది మరీ భరించలేనిదిగా తోచింది. ఆనంద్ ని కలుసుకుంటే తప్ప అది కుదుటపడేలా లేదు.
"ఎక్కడికి వెళ్తున్నావే?" మావయ్య అడిగాడు.
"గోదాట్లోకి" జవాబు చెప్పి బయల్దేరాను.
"చూశావుటే దీని పొగరు" అమ్మతో ఫిర్యాదు చేస్తున్నాడు. "తొందరగా అణిచెయ్యకపోతే మనమాట వినదు".
9
దాదాపు పరుగెడుతున్నట్టు ఆనంద్ దగ్గరికి వెళ్ళాను.
"అదేమిటి అలా వున్నావ్?" అడిగాడు ఆనంద్. నేను వెంటనే జవాబు చెప్పలేదు. ఏం మాట్లాడినా దుఃఖం ముంచుకొచ్చేలా వుంది. అతడివైపు చూశాను. అతడి మొహం నిర్భావంగా వుంది. "ఇప్పుడే తరళ దగ్గర్నుంచి వస్తున్నాను" అన్నాను ముక్తసరిగా దాన్ని అతడు అర్ధం చేసుకున్నాడో లేదో తెలీదుగానీ, "ఏమిటి విశేషాలు" అన్నాడు. అతడలా మామూలుగా అడగటం చూసి నాకేదో అనుమానం కలిగింది. ఇక విషయాలన్నీ దాచకుండా, తరళ నాకేమీ చెప్పిందీ అతడికి చెప్పేశాను.
అంతా విని అతడు నవ్వేడు. "పాపం కూతురు మనసు నొప్పించకుండా వుండటానికి కష్టపడుతున్నాడన్న మాట వాళ్ళ నాన్న-"
"అంటే-?"
"నిన్న నా దగ్గిర కొచ్చాడు- కూతుర్ని చేసుకొమ్మని అడగటానికి". నేను నిరత్తురురాలినై అతడిని చూశాను. తరళ తండ్రి ఆనంద్ దగ్గరికి వచ్చాడంటే నమ్మశక్యం కాలేదు. ఆ లక్షాధికారి ఆనంద్ కోసం....
ఆయనకి కూతురంటే ప్రేముంది అని తెలుసుకానీ, కూతురి కోసం ఇన్ని మెట్లు దిగివస్తాడని అనుకోలేదు.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్?"
నేను తలెత్తి అతడివైపు చూశాను. అతడు మళ్ళీ నవ్వేడు- "ఇంతకాలం 'చెప్పేస్తే మంచిది. చెప్పేస్తే మంచిది' అని భయపడ్డావుగా. నిన్నే ఆయనకి చెప్పేశాను".
"ఏమని?"
"మీ అమ్మాయి పొరపాటు పడుతూంది. తనమీద నాకు అటువంటి భావం ఏమీలేదు-" అని. ఆయన విస్తుబోయాడు మొదట... "పోనీ అలాంటి భావం ఇంతకుముందు లేకపోతే లేకపోయింది. ఇప్పుడు చేసుకోరాదా" అన్నాడు. తరళ కెంత పొగరుందో, ఆవిడ తండ్రికీ అంతకు రెట్టింపు వున్నట్టుంది. డబ్బుతో దేన్నైనా కొనవచ్చు అనే భ్రమలో వున్నాడు. నా అంతటి లక్షాధికారి నిన్నొచ్చి అడగటమే నీ అదృష్టం- అన్నట్టుగా మాట్లాడాడు. మరింత ఏడిపించాలనిపించింది కానీ, ముసలాడు కదా అని వదిలేశాను".

జరిగిందేమిటో నాకు అర్ధమైంది. తరళకి ఆయన ఈ విషయం చెప్పటానికి సంకోచించి వుంటాడు. తరళంటే ఆ ఇంటిల్లిపాదికీ వల్లమాలిన గారాబం చిన్నప్పటినుంచీ, ఏనుగుబొమ్మ నడుగుతే, నిజం ఏనుగుని తెచ్చి ఇచ్చేటంత గారాబంగా పెంచారు తనని మామూలుగా అయితే, ఆనంద్ లాటి ఏమీలేని యువకుడిని ప్రేమించినందుకు ఇంకొక తండ్రి ఆమెని తలవాచేటట్లు చివాట్లు పెట్టి వుండేవాడు. కానీ ఆయన ఒక్కమాట కూడా అనకుండా ఆనంద్ దగ్గిరకి వచ్చాడు. అంతటి లక్షాధికారీ చేతులు జోడించి అడిగాడు. ఆనంద్ కాదనేసరికి, ఆ విషయాన్ని కూడా కూతురికి చెప్పలేక, అతనొప్పుకున్నాడని అబద్దం చెప్పాడు.
కాళ్ళదగ్గిర కొచ్చిన అదృష్టాన్ని కాదన్న ఆనంద్ అంటే నాకు గౌరవం, అభిమానం మరింత పెరిగాయి. నేనెంత అదృష్టవంతురాల్నో అర్ధమైంది. చాలా కొద్దిమంది వుంటారు అలాటి మొగవాళ్ళు కేవలం డబ్బు విషయంలోనే కాదు. అతడి ఆలోచనా విధానం, నిర్ణయాలు, కొన్ని విషయాల్లో అతడి పంతం- అన్నీ అపురూపంగా తోచాయి. మీరు అనుకుంటూ వుండవచ్చు- ప్రేమలో పడ్డాక అవతలివారి గురించి ప్రతీవాళ్ళకీ ఇలాగే అనిపిస్తూ వుంటుందని దానికి సమాధానం నేనింతకుముందే చెప్పాను. మేము తలమునకలయ్యేటంత ప్రేమలో ఎప్పుడూలేము. ఇంత జరిగాక ఇక ఆలస్యం చేయటం మంచిదికాదని ఆనంద్ అన్నాడు. ముందొకసారి మా యింటికొచ్చి మా అమ్మని వివాహం విషయం అడుగుతాననీ, ఆమె ఎలాగూ వప్పుకోదు కాబట్టి గుళ్ళో చేసుకుందామనీ అన్నాడు. మావయ్య ఏదైనా గొడవచేస్తే అవసరం పడుతుందని పోలీసులకి కూడా చెప్పివుంచుతానన్నాడు. ఇద్దరం ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోలేదు. ఇద్దరం కలిసి ఒకే భవిష్యత్తువైపు ఆశతో చూస్తున్నాం మా వుద్దేశ్యం ప్రేమంటే ప్రపంచాన్ని మర్చిపోవటం కాదు. ప్రపంచంలో ఎలా బ్రతకాలా అని ఆలోచించటం. ఆ మరుసటిరోజే అతడు మా ఇంటికి వస్తానన్నాడు.
మా ప్రేమ విషయం ఎవరికీ తెలీదని నేను అనుకుంటూ వచ్చాను. కానీ, ఆ విషయం తెలిసిన మరో వ్యక్తి వున్నాడని ఆ రాత్రి నాకు తెలిసింది. ఆ వ్యక్తి నా మావయ్య నేను నిద్రపోతున్నాననుకుని పక్కగదిలో అమ్మతో మాట్లాడుతూవుంటే విన్నాను. ఏదైనా చేసైనా సరే, నన్ను ఆ వృత్తిలోకి దింపాలని వాళ్ళు చర్చించుకుంటున్నారు. తలదిండు కన్నీళ్ళతో తడిసి పోయింది. ఒక్క రెండు రోజులు తొందరగా గడిచిపోతే బావుణ్ణు అని భగవంతుని ప్రార్దించాను. మూడ్రోజుల తరువాత మా పెళ్ళి.
ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. ఏ మాత్రం అలికిడి అయినా మావయ్య లోపలికి వస్తున్నాడేమో అని భయం. ఈ స్థితి సత్రువులకి కూడా రాకూడదు. మా ఇంట్లోనే నాకు భద్రత లేదు.
రేపు ఆనంద్ వచ్చి విషయం చెప్పగానే ఇంట్లో రేగే తుఫాను గురించి తలుచుకుంటేనే భయంగా వుంది. ఈ పరిస్థితుల్లో నాకు మానసికంగా ఒక తోడు కావాలని అనిపించింది. అలాటి ధైర్యం నాకు ఎవరు ఇవ్వగలరు? తరళ!
అవును తరళ తప్ప ఇంకెవరూ లేరు. ఇరవైనాలుగు గంటలు తరళ నాతో వుంటే చాలు. ఆనంద్ గృహ ప్రాంగణంలోకి వెళ్ళిపోతాను. ఎంత చిత్రమైన స్థితి...తరళని నాకు సాయపడమని అడగటం!! ప్రేమకోసం త్యాగం చేసిన వ్యక్తుల్నే మీరు చూశారు. స్వార్ధంకోసం ప్రేమని బలిపెట్టమని అడిగే వ్యక్తిని ఇప్పుడు మీరు నాలో చూస్తున్నారు. నన్ను చూస్తూంటే మీకు అసహ్యం కలగవచ్చు. కానీ జీవితం కల్పన కాదు. వాస్తవం.
తరళని ఈ విషయంలో సహాయం అడగాలన్న ఆలోచనరాగానే నాకు కావలసినంత ధైర్యం వచ్చింది. ఆ రాత్రి ఇక ఆగలేకపోయాను. మొత్తం విషయమంతా ఆమెకు చెప్పేస్తేగానీ నా మనసు కుదుట పడేట్టు లేదు. అంతా విన్నాక కూడా ఆమె ఆనంద్ ని ఇంకా ప్రేమిస్తూనే వుంటే నేను చేసేది ఏమీలేదు. కానీ తరళ విషయం నాకు బాగా తెలుసు. జీవితాన్ని చాలా తేలిగ్గా తీఉస్కునే అమ్మాయి. ఆనంద్ ని తలవాచేటట్టు చీవాట్లు పెడుతుంది. తరువాత నవ్వేస్తుంది. ఆనంద్ కి కూడా ఆమాత్రం మందలింపు కావల్సిందే. ఆ అమ్మాయి తనని ప్రేమిస్తూంది అని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు వుండటం అన్యాయం. కేవలం ఆ అమ్మాయి తన ప్రేమని ప్రకటించలేదు. కాబట్టి నేనుకూడా ఏమీ చెప్పను అనటం కేవలం ఆ అమ్మాయిని ఏడిపించటం మాత్రమే. తరళ మంచి అమ్మాయి కాబట్టి తండ్రితో కబురు చేసింది. ఆయన మరీ మంచివాడు కాబట్టి తిరిగి వెళ్ళి కూతురితో అబద్దం చెప్పాడు.
అందరూ మంచివాళ్ళే ఎటొచ్చీ మధ్యలో నలిగిపోతుంది నేనే. రాత్రి పన్నెండు దాటింది.
ముందు గదిలో అమ్మ, పక్కగదిలో మావయ్య నిద్రపోతున్నారు. చప్పుడు చేయకుండా బయటకొచ్చాను. పల్లె చీకటిని ముసుగ్గా కప్పుకుంది. తరళా వాళ్ళిల్లు ఎక్కువ దూరంలో లేదు. తనది ముందుగదే కిటికీలోంచి పిలిస్తే లేస్తుంది.
వీధులు నిర్మానుష్యంగా వున్నాయి. ఆ సమయంలో నన్నెవరయినా చూస్తే మరుసటిరోజు పల్లెలో ఈ వార్త భగ్గుమంటుంది. అయినా ఏదో తెలియని మొండిధైర్యం నన్నావహించింది. అలాగే నడుచుకుంటూ వెళ్ళాను. తరళా వాళ్ళింటినిండా లైట్లు వెలుగుతూ కనిపించాయి. నా మనస్సెందుకో కీడు శంకించింది. నడక వేగం హెచ్చింది. లోపలికి ప్రవేశించాను. ముందు హాల్లో తరళ తండ్రి పచార్లు చేస్తున్నాడు. స్తంభం దగ్గిర పాలేరు బిక్కమొహంతో చేతులు కట్టుకు నిలబడి వున్నాడు.
గది మధ్యలో తరళ, నిండా తడిసిన బట్టల్తో...తలమీద నుంచి కారుతున్న నీటితో కనిపించింది.
ఆ సమయంలో నన్ను ఊహించని ఆ ఇంటిల్లిపాదీ ఆశ్చర్యపోయారు. ముందుగా తేరుకున్నది తరళా వాళ్ళ నాన్నగారు. పాలేరు దగ్గిరకు వెళ్ళి "ఈ విషయం మూడో కంటికి తెలిస్తే జాగ్రత్త, వేళ్ళు" అని హెచ్చరించాడు. వాడు భయంతో తలూపి బయటకు వెళ్ళిపోయాడు. తరళని వాళ్ళమ్మగారు లోపలికి తీసుకువెళ్ళారు.
మేమిద్దరమే గదిలో మిగిలేము. ఆయన నా దగ్గిరకి వచ్చి "ఇది ఎంత పనిచేసిందో తెలుసా?" అన్నారు. నాకింకా అక్కడేం జరిగిందీ అంతుబట్టలేదు. "అర్దరాత్రి వెళ్ళి గోదాట్లో దూకింది".
అర్దరాత్రి పిడుగుపడ్డట్లు అదిరిపడ్డాను. ఆయన ఏం చెబుతున్నాడో కొద్దిసేపు అర్ధంకాలేదు.
"ఆ ఆనంద్ ఏం చెప్పాడో తెలీదు. రాత్రంతా అదోలా వుంది. అర్దరాత్రి వెళ్ళి గోదారిలో దూకేసింది. అదృష్టం బావుంది మా పాలేరుకి మెలకువ వచ్చింది కాబట్టి సరిపోయింది" ఆయన మొహం కోపంతోనూ, ఉక్రోషంతోనూ ఎర్రబడింది. "... ఏమనుకుంటున్నాడు ఆ ఆనంద్ తన గురించి, కో అంటే కోటిమందిని వరుసగా నిలబెట్టగలను" అరిచాడు.
తలుపు సగం తెరిచి మొహం బయటకు పెట్టి "నాకు కోతి మంది అక్కర్లేదు. ఆనంద్ చాలు" అంది తరళ. నా వైపు చూసి కన్నుకొట్టి లోపలికి వెళ్ళిపోయింది. ఆయన గట్టిగా ఏదో అనబోయి తమాయించుకుని నావైపు చూశాడు. ఏం మాట్లాడాలో తోచనిదాన్లా నేను నిశ్శబ్దంగా వుండిపోయాను. ఆయన నా దగ్గిరకి వచ్చాడు. "ఈ విషయం నువ్వుకూడా ఎక్కడా చెప్పకు. రెండ్రోజుల్లో అంతా సర్దుకుంటుంది. అది నీ స్నేహితురాలు కాబట్టి ఎలాగో ఒక్కలాగా దాన్ని వప్పించు. రెండ్రోజులు ఓపిక పట్టమను. ఆ ఆనంద్ ని ఈ లోపుగా నేను దారికి తీసుకువస్తాను" అన్నాడు.

ఇటువంటి పరిస్థితి ఎవరికీ వచ్చి వుండదు. అడకత్తెరలో పోకచెక్కలా అయింది నా స్థితి. తరళ ఇంతపని చేస్తుందని కలలో కూడా వూహించలేదు. ఆనంద్ మీద బాగా కోపం వచ్చింది. నేను వెళ్ళిపోయాక తరళ తన దగ్గిరకు వెళ్ళివుంటుంది. వాళ్ళ నాన్నతో తనేమన్నాడో ఆమెకి ఆనంద్ చెప్పే వుంటాడు. ఈ షాకు భరించలేక గోదాట్లో దూకింది.
"ఈ రాత్రికి ఇక్కడ పడుకో మీ ఇంటికి నేను కబురు పంపిస్తాలే" అన్నాడాయన. "వెళ్ళగానే పలకరించి ధైర్యం చెప్పి, రెండ్రోజులు ఓపిక పట్టమను".
ఇంకొక తండ్రి అయితే నరికి పోగులు పెట్టి వుండేవాడే. కాని ఆయన గారాబు కూతురామె.
వచ్చిన పని మర్చిపోయి, తరళ గదిలోకి వెళ్ళాను. సాంబ్రాణి పొగతో తలారబెట్టుకుంటూన్న తరళ నన్ను చూసి నవ్వి, "నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. ఈ రాత్రంతా ఇక్కడే వుండబోతున్నావు. ఆత్మహత్య మహాపాతకమని నాకు ఉద్భోధించ బోతున్నావు. మా నాన్న కొట్టబోయే బోరుకి నువ్వు వకాల్తా తీసుకోబోతున్నావు. అవునా" అంది.
ఇంకేం మాట్లాడను?
వాళ్ళమ్మ కూతుర్ని తిడుతూంది. నేనో అరగంట కూర్చుని వచ్చేసేను. ఆ పరిస్థితుల్లో నేను చెప్పాలనుకున్నది ఎలా చెప్పను? అందుకే ఆ విషయం ప్రస్తావించకుండా ఇంటికొచ్చేశాను.
అలా కాకుండా ఆ రాత్రే తనకి అంతా చెప్పేసి వుంటే, ఈ కథ ఇంకో మలుపు తిరిగి వుండేదేమో-
* * *
ఆ రాత్రి నాకు శివరాత్రే అయింది.
మరుసటిరోజు నేను పక్కమీద నుంచి లేచేసరికి అమ్మ "ఒసేయ్, నీ కిది తెలిసిందా? రాత్రి తరళ గోదార్లో దూకిందట" అంది.
పల్లెపల్లెంతా ఈ వార్త గుప్పుమందని నా కప్పుడే తెలిసింది. ఈ విషయాన్ని దాచే ప్రయత్నమేమీ చెయ్యలేదు. తరళ పాలేర్నంటే కంట్రోలు చేయగలిగాడు. కూతుర్ని ఎలా ఆపగలడు?
చిత్రమేమిటంటే తరళ నెవరూ తప్పుపట్టలేదు. పైగా ప్రేమంటే అలా వుండాలని అనుకున్నాడు. ఇంతకాలం తిరిగి, ఇప్పుడు కాదంటాడా అని ఆనంద్ నే తిట్టారు. ఆ ఇద్దరితోపాటు నేనూ వున్నానన్న విషయం అందరూ మర్చిపోయారు. అదేపని నేను చేసివుంటే, భోగం వేషాలు వేసి అతన్ని వలలో వేసుకుందామని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఏ కడుపో వచ్చి గోదార్లో దూకింది అని వుండేవారు. సమాజంలో స్థాయి, పరపతి, మనుష్యుల ఆలోచనా విధానంమీద ఎలా ప్రభావం చూపిస్తాయో, నాకప్పుడే తెలిసింది. ఒక కోడిని పట్టుకోవటం కోసం నలుగురూ దాన్ని మూలమూలకి తోసి, ఎటూ వెళ్ళలేని ఇరకాటాన పడేస్తారు. అలా క్రమక్రమంగా ఇరుక్కిరుక్కి వెళ్ళిపోతున్నట్టుంది నాకు. ఒక్కొక్క ద్వారం మూసుకుపోతున్నట్టుంది.
ఈ తాకిడికి తట్టుకున్నవాడు ఆనంద్ ఒక్కడే నాకు చిన్న చీటీ పంపించాడు.
"ఇంక ఆలస్యాలూ, మొహూర్థం కోసం ఆగటాలూ అనవసరం సాయంత్రం గుడికిరా పురోహితుడ్నీ, మంగళసూత్రాన్నీ నేను తీసుకువస్తాను". మూడే వాక్యాలున్నాయి ఆ చీటీలో-
ఆ కాగితం ణ అచేతుల్లో అలాగే చాలాసేపు వుండిపోయింది. గుండెల్నిండా భయం- వణుకు! ఎటూ తేల్చుకోలేని స్థితి ఆనంద్ ఈ నిర్ణయం ఇంత తొందరగా అమలు జరుపుతాడనుకోలేదు.
నేను అదోలా వుండటం అమ్మ కనిపెట్టి అడిగింది. ఏదో చెప్పి తప్పించుకున్నాను.
సాయంత్రం అవుతున్న కొద్దీ నాలో ఉద్వేగం పెరగసాగింది. ఇంట్లోంచి బయటికొచ్చే ధైర్యం చేయలేకపోయాను. మావయ్యని తల్చుకుంటే భయం. తనేమీ చెయ్యలేడు. కానీ ఆ భయం అలా వుండిపోయింది.
చీకటి పడింది.
కాలుగాలిన పిల్లిలా ఒకగాదిలోంచి మరో గదిలోకి పచార్లు చేయసాగాను. ఇందులో తెలీదుగానీ ఏడుపొస్తోంది. నా మీద నాకే కోపం, విసుగు.
ఆరున్నరయింది-ఏడు-ఏడున్నర.
ఇక ఆగలేకపోయాను.
వాచీ కూడా విప్పేసి గదిలో టేబుల్ మీద వుంచి, మెట్లు దిగాను. "ఇంత రాత్రప్పుడు ఎక్కడికే" అంది అమ్మ.
"తరళా వాళ్ళింటికి" సమాధానం ఇచ్చాను.
ఆనంద్ కోసం తరళ గోదావరిలో దూకిందని తెలిసిన తరువాత అమ్మకి నా మీద బాగా నమ్మకం కలిగినట్టుంది. ఏమీ మాట్లాడలేదు. "తొందరగా వచ్చెయ్యి" అని మాత్రం అంది.
బయట చల్లగాలి వీస్తూంది.
దాదాపు పరుగెడుతున్నట్టు గుడిని చేరుకున్నాను.
ఇంట్లో వున్నంతసేపూ వెళ్ళాలా వద్దా అని వున్న ఆరాటం, ఇంట్లోంచి బయటపడగానే ఆతృతగా మారి నన్ను పరుగులు తీయించింది.
పదిహేను నిముషాల్లో గుడిని చేరుకున్నాను.
ఊరికి దూరంగా వున్న గుడి అది.
నిర్మానుష్యంగా వుంది.
ఒక్క పూజారి మాత్రమే వున్నాడు.
అంత దూరంనుంచి వచ్చిన నన్ను చూసి కలిగిన ఆశ్చర్యం అతడి మొహంలో ప్రస్ఫుటంగా కనిపించింది.
"ఏమ్మా ఇలా వచ్చావ్?" అని అడిగాడు.
ఆ ఒక్క ప్రశ్నలో నాకు సమస్తం అర్ధమైంది.
ఆనంద్ పెళ్ళి సరంజామాతో, మనుష్యుల్తో అక్కడికి వచ్చి వుంటే పూజారి ఆ ప్రశ్న అడిగి వుండేవాడు కాదు అంటే-
ఆనంద్ రాలేదు.
ఆనందరావు చెప్పిన కథ
తరళ వ్యవహారం నాకు తలనొప్పిగా పరిణమించింది.
ఆ అమ్మాయిది పొగరో, మూర్ఖత్వమో నాకు అర్ధంకాలేదు. తరళ గోదార్లో దూకినప్పటినుంచీ ఆ గ్రామంలో నా పరిస్థితి మీరు వూహించవలసిందేగానీ చెప్పనలవి కాదు.
నేను కాదన్నాననీ- అందువల్ల తరళ ఆత్మహత్య చేసుకోబోయిందనీ మాట్లాడుకుంటే ఆ రూమర్లు వ్యాప్తి చేయటంలో ప్రజలకు ఆనందం కాదు. అది అంతగా జీర్ణం కాని వాస్తవం.
అందువల్ల మా అమాయక లౌక్యులైన గ్రామప్రజలు అందరికీ కన్వీనియెంట్ గా అర్ధమై, చెప్పుకోవటానికి వీలుగా, ఆసక్తి కలగొలిపేలా వుండే వార్తని ప్రచారం చేయటంలో నిమగ్నులైవున్నారు. ఆ వార్త ప్రకారం, నాకూ తరళకీ మధ్య ఎన్నాళ్ళనుంచో గ్రంథం నడుస్తూ వుంది. ఆమెకిప్పుడు మూడోనెల. ఆమె తండ్రి లక్షాధికారి కాబట్టి సహజంగానే ఈ వివాహానికి వప్పుకోలేదు. అందువల్ల ఆ అమ్మాయి గోదార్లో దూకింది.

చాలా వేగంగా ప్రయాణం చేయగల శక్తి వంతమైన ఈ రూమరు సహజంగా చుట్టుప్రక్కల గ్రామాలకి కూడా త్వరత్వరగా వ్యాప్తిచెందింది. ఒకరిద్దరు నా వద్దకు వచ్చి తరళ తండ్రిని ఎదిరించైనా సరే, ఈ వివాహం చేసుకొమ్మని సలహా ఇచ్చారు. ఈ ఒకరిద్దరే తరళ తండ్రివద్దకు వెళ్ళి నా గురించి చెడుగా చెప్పి, వీలైతే నన్ను కొట్టించమని కూడా సలహా ఇచ్చి వుంటారని నేను వూహించగలను.
ప్రమద్వర చెప్పిన మాటలు వినకపోవటంలో గల తప్పు నాకిప్పుడే అర్ధమవుతోంది. తరళకి ఈ విషయం ముందే చెప్పేసి వుంటే ఈ గొడవ లేకపోవును. ఆమె అన్నట్టు- గోటితో పోయేదాన్ని గొడ్డలివరకూ అనవసరంగా తెచ్చుకున్నాము.
ఎంతయినా కానీ, నేను చేసినదాన్లో తప్పు లేదని నాకు తెలుసు. తరళ అడగందే "నేను నిన్ను ప్రేమించటంలేదు" అని ఎలా చెప్పటం? ఆ అమ్మాయి ఏ మాత్రం తెలివైనదయినా వెంటనే గ్రహించేలా వుంది. ఆ మాత్రం తెలివితేటలుంటే తరళ ఎందుకవుతుంది?
నేనింక ఈ విషయాలు ఏమీ పట్టించుకోదల్చుకోలేదు. ఆ అమ్మాయి గోదాట్లో దూకనీ, సముద్రంలో దూకనీ నా కనవసరం. ప్రమద్వరని వివాహం చేసుకుంటే మా రూమర్లన్నిటికీ ఆనకట్ట పడుతుంది.
తన ప్రేమకి ఫ్రేముకట్టి వూరంతా ప్రచారం చేసుకోవటం తరళ తప్పు నా దగ్గిర కనీసం ఒకమాట కూడా చెప్పకుండా ఈ హడావుడంతా ఎవరు చేయమన్నారామెని?
ఇవన్నీ ఆలోచించి చివరికి ఓ నిర్ణయానికొచ్చి ప్రమద్వరకి ఉత్తరం వ్రాశాను. సాయంత్రం గుడికి రమ్మనీ, అక్కడ పెళ్ళి చేసుకుందామనీ ఒక్కసారి ఈ తంతుకాస్తా జరిగిపోతే మిగతా విషయాలన్నీ వాటంతట అవే సర్దుకుంటాయని నాకు తెలుసు.
ఆ రోజు నా ఆరోగ్యం కూడా అంతగా బాగోలేదు. రెండ్రోజుల్నుంచి బాగా దగ్గు వస్తోంది. పెళ్ళయిన మరుక్షణం నుంచీ సిగరెట్స్ మానెయ్యాలి.
ప్రొద్దున్నే పొరుగూరికి వెళ్ళి అక్కడి పురోహితుడిని రమ్మని చెప్పాను. ఈ వూరివాడయితే కొన్ని ప్రమాదాలున్నాయని నాకు తెలుసు. మరుసటిరోజు నుంచీ శలవు పెట్టాను.
వివాహం అవగానే ఈ వూరినుంచి కొద్దికాలం బయట తిరిగి రావాలి. నాకు ఫర్వాలేదుగానీ, ఈ గ్రామ ప్రజల్ని ప్రమద్వర తట్టుకోలేదు.

సాయంత్రం అయిదయింది. ఇక గుడికి వెళ్దామని అనుకుంటూ వుండగా- అప్పుడొచ్చింది గుండెల్లో నొప్పి... సన్నగా.
ముందు దాన్ని అంతగా పట్టించుకోలేదు గానీ, సమయం గడిచేకొద్దీ అది ఎక్కువ అవసాగింది. ఇక భరించలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను.
ప్రమద్వర ఈ పాటికి గుడికి వెళ్ళి వుంటుందని అనుకున్నాను. డాక్టర్ దగ్గర్నుంచి త్వరగా బయటపడాలన్న నా కోర్కె సులభంగా తీరలేదు.
దాదాపు గంటసేపు పరీక్షలు జరిపాడు.
అప్పటికి ఆరున్నర అయింది.
డాక్టరు రిజల్టు మరుసటిరోజు చెప్తానన్నాడు. నేను దాని గురించి అంతగా పట్టించుకోలేదు. బాగా నీరసంగా వుంది. అయినా వురుకులూ పరుగులుమీద గుడికి వెళ్ళాను.
ప్రమద్వర లేదు. లోపల పూజారి ఒక్కడే ఉన్నాడు. అతఃదిని పలకరించాను. మాటల్లో ఎక్కడా ప్రమద్వర వచ్చి వెళ్ళిపోయినట్టు అతడు చెప్పలేదు. పేరు చెప్పకుండా విషయం రాబట్టటానికి ప్రయత్నించాను. ఆ గుడికి చివరి భక్తుడు వచ్చి వారం రోజులు అయిందనీ, జీవనం కష్టంగా ఉందని, సోదంతా చెప్పుకొచ్చాడు పూజారి.

ఏడున్నర అయింది. ప్రమద్వర రాలేదు.
బహుశా భయపడి వుంటుంది. ఆ అమ్మాయి భయాన్ని అర్ధం చేసుకోగలను. గుడినుంచి బయటకొచ్చి, అక్కడే వేచివున్న పురోహితుడ్ని వెళ్ళిపొమ్మని, ప్రమద్వర ఇంటికి బయల్దేరాను. నాకు తనమీద కోపం రాలేదు. ఎంతో ధైర్యం వుంటే తప్ప ఇంటినుంచి, ఒక ఆడపిల్ల ఒంటరిగా బయటపడటం అంత సులభం కాదు. అయినా ఇంత చాటుగా, ఏదో తప్పుచేసినట్టు పెళ్ళి చేసుకోవలసిన ఖర్మ నాకేం పట్టింది అనిపించింది.
రోడ్డుమీద నడుస్తూవుంటే ఎదురుగా మోపెడ్ మీద డాక్టర్ వస్తూ కనిపించాడు.
నన్ను చూడగానే మోపెడ్ ఆపి, "మీ గురించే అర్జెంటుగా వస్తున్నాను" అన్నాడు. 'విషయం ఏమిటి' అని అడిగాను అక్కడ చెప్పకుండా క్లినిక్ కి తీసుకెళ్ళాడు.
అక్కడ ఇంకో డాక్టర్ ఉన్నాడు. ఆయన్ని పరిచయంచేస్తూ "పట్నంలో ఈయన కార్దియాలజిస్టు- నా స్నేహితుడు లక్కీగా ఈ రోజు వచ్చాడు. మీ రిపోర్టులు చూస్తే నాకు అనుమానం వచ్చింది. ఈయనకి చూపించాను. మీరొకసారి పట్నం వెళ్ళి చూపించుకుంటే మంచిదని ఈయన అభిప్రాయపడుతున్నాడు" అన్నాడు.
"ఏమిటి మీ అనుమానం?" అని అడిగాను.
ఆ కార్డియాలజిస్టు ఇబ్బందిగా చూస్తూ "పరీక్షలైన తరువాత ఒక నిర్ణయానికి రావటం మంచిది" అన్నాడు. "విషయాన్ని నేను అర్ధం చేసుకోగలను- చెప్పండి" అన్నాను.
"గుండెకి చిన్న రంధ్రం ఏర్పడిందేమో అని అనుమానంగా ఉంది" అన్నాడు. తేలిక భాషలో నాకు అర్ధమయ్యేలా చెప్పటానికి ప్రయత్నిస్తూ ఈ పల్లెటూళ్ళల్లో అలా చెప్తేగానీ అర్ధంకాదని అనుకుని వుంటాడు ఆయన. కానీ నేనూ సైన్సు చదువుకున్నాను. కార్దియల్ డిజార్డర్ గురించి అర్ధంచేసుకోగలను.
నా కాళ్ళకింద భూమి కదులుతున్నట్టు అనిపించింది. ఆ గదిలో వస్తువులు గిర్రున తిరుగుతున్నట్టు కనిపించాయి.
"చిన్న ఆపరేషన్ తో తగ్గిపోతుంది. ఫర్వాలేదు" అంటున్నాడు డాక్టర్. రాదని నాకు తెలుసు.
10
ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. డాక్టర్లు పూర్తిగా చెప్పక పోయినా నాకు తెలుసు. మరణం అతి సమీపంలో వుంది. చేతులుసాచి పొంచివుంది.... నాకు భయం వెయ్యటంలేదు. ఎవరైనా ఆ మృత్యువు ఒడిలోకి చివరకు చేరుకోవలసిందే. నా ఆలోచన్లన్నీ ప్రమద్వర చుట్టూనే తిరుగుతున్నాయి. పాపం ఆ అమ్మాయి జీవితాన్ని నేనే నాశనం చేశాను. ఆశలు పెంచి చివర్లో తృంచివేశాను.
ఒకందుకు నాకు సంతోషంగా వుంది. ప్రేమ పేరిట మేము తొందరపడలేదు....ఆమె మలినం కాలేదు..... ఇప్పుడు నేను చేయవలసింది ఒకటే. జరిగిన వాస్తవం ఆమెకు జీర్ణమయ్యేలా నచ్చచెప్పటం. ఆమె నా నుంచి మరొకరితో వివాహానికి వప్పించటం. ఇది కష్టమయిన పనైనా అసాధ్యమైనది కాదు.

ప్రమద్వర ఇంటి పరిస్థితులు నాకు తెలుసు. ఆమె చుట్టూ రాబందులు కాచుకుని వున్నాయి. వాటినుంచి ఆమెని తప్పించి, ఒక ఇంటిదాన్ని చేస్తే మరణం ముందు నా జీవితానికి ఒక సార్ధకత లభిస్తుంది.
ఆ తరువాత కొంచెం సేపటికి ఆమెని కలుసుకున్నాను.
డాక్టర్లు చెప్పింది ఆమెకి వివరించాను.
రెండుచేతులూ వళ్ళో పెట్టుకుని, తలవంచుకుని కూర్చుని నేను చెప్పినదంతా మౌనంగా, నిశ్శబ్దంగా వింది. ఆమె మొహంలో మారే భావాల్ని ఆ మసకనీడల మధ్య నేను గమనించలేకపోయాను. అంతా విన్నాక కూడా ఆమె మౌనంగానే వుండిపోయింది. ఆ నిశ్శబ్ధాన్ని చీలుస్తూ అన్నాను. "ప్రమద్వరా- నేను కోరేది ఒకటే నువ్వు ఎవర్నైనా వివాహం చేసుకో".
ఆమె చిన్న స్వరంతో "చేసుకుంటాను ఎవర్నో కాదు, మిమ్మల్నే..." అంది. నాకు ఆమె చెపుతున్నది అర్ధంకాక "ఏమిటీ" అన్నాను ఆమె తిరిగి ఆ మాటల్నే చెప్పింది.
"నేను ఎన్నో దినాలు బ్రతకను ప్రమద్వరా-"

"నేనూ అంతే".
"నువ్వేం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా నీకు?"
ఆమె తలెత్తి అన్నది- "నా ప్రేమ లైలా పార్వతీలంత గొప్పది కాకపోవచ్చు. కానీ మీరు లేని లోకంలో నేనూ వుండను".
"చాలా చిన్న పిల్లలా, తెలిసీ తెలియని వయసులో సినిమాలు చూసి మాట్లాడే ఆడపిల్లలా మాట్లాడుతున్నావు నువు-"
"మీరేమయినా అనుకోండి. నా నిర్ణయం మారదు".

"కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు".
"ప్రాక్టికల్ గా ఆలోచించే చెపుతున్నాను, మీరేగానీ నా జీవితంలోకి రాకపోయివుంటే నా తల్లి, నా మావయ్య కలిసి నా బ్రతుకు ఏనాడో కుక్కలు చింపిన విస్తరి చేసి వుండేవారు. మీ స్నేహమే నన్ను వారి కెదురుగా ధైర్యంగా నిలబెట్టింది. ఇప్పుడు మీరు కాదంటే నన్ను వాళ్ళు కబళించి వేస్తారు-"
"అందుకని ఏం చేస్తావు ప్రమద్వరా?"
"మనం ఈ ఊరునుంచి వెళ్ళిపోదాం. నాకేదో ఒక చిన్న ఉద్యోగం దొరక్కపోదు. సాధ్యమయినంతలో మీకు వైద్య సహాయం జరిగేలా చూద్దాం".
నాకు నవ్వొచ్చింది. ఈ సర్జెరీకి "సాధ్యమైనంతలో" అన్న పదం లేదు. అది జరుగుతే బ్రతుకుతాను. జరక్కపోతే బ్రతకను అంతే! "నే నొకటి చెపుతాను వింటావా?"
ఏమిటన్నట్టు చూసింది ప్రమద్వర.
"నువ్వు మీ ఇంట్లోంచి బయటపడటం చాలా ముఖ్యం. నేను బ్రతికి వుండగానే అది జరగాలి. నీకు మంచి సంబంధం చూస్తాను".
ఈసారి ఆమె నవ్వింది. ఆమె వివాహం జరగటం నా సర్జెరీకి ధనం సమకూర్చగలగట మన్నంత కష్టసాధ్యమని, ఆమె నవ్వుకి అర్ధం కాబోలు. నాకు ప్రపంచంమీద కసిగా వుంది. మరణం గురించిన వార్త వల్ల వచ్చిన కసికాదు అది. ఒక మంచి అమ్మాయి, చదువుకున్నది-తన కులవృత్తిలోంచి బయటపడి గృహిణిగా మారడానికి ఇన్ని అడ్డంకులా, అన్న బాధవల్ల వచ్చిన కసి అది, ప్రతిదానికీ డబ్బు కావాలి. ఆమె వివాహానికీ, నా జబ్బు నయం కావటానికీ- అన్నింటికీ డబ్బే ప్రధానం.
ఆమె సమస్యని నేను తీర్చలేను.
నా సమస్య ఆమె తీర్చలేదు.
ప్రేమ ఎంతో గొప్పదనీ, ఎన్నో పరీక్షలకు అది నిలుస్తుందనీ చరిత్రకారులు నిరూపించారు. అది ఎంత అవాస్తవికమో ఇప్పుడు అర్ధమవుతూంది.
"నేనొక విషయం అడుగుతాను చెబుతారా?"
"ఏమిటి ప్రమద్వరా?"
"మనం అనుకున్నట్టుగానే సరీగ్గా సమయానికి ఆ గుళ్ళో కలుసుకున్నా మనుకోండి. మన వివాహం జరిగిపోయి వుండేది. ఆ తరువాత మనకి ఈ విషయం తెలిసి వుండేది. అవునా?"
"అవును అయితే?"
"ఇప్పుడదే జరిగిందనుకుందాం మనం పెళ్ళి చేసుకుందాం"
"మన వివాహం జరగటం దేముడికి ఇష్టంలేకే, నిన్ను గుడికి ఆలస్యంగా రప్పించాడేమో!"
ఆమె ఏదో అనబోతూ వుంటే ఆపుచేసి, "ఇంకా ఈ వాదనలన్నీ అనవసరం ప్రమద్వరా! జరిగిందేదో మన మంచికే జరిగిందనుకుందాం. ప్రేమించటం దైవత్వమైతే అవ్వొచ్చేమోగానీ, మరణించేముందు వివాహం ఆ ప్రేమకు పరాకాష్ట అనుకోవడం మూర్ఖత్వం నాకున్న ఈ కొద్ది జీవితకాలంలో నేను నీ జీవితానికి ఏం చేయగలనా అన్నది ఆలోచించుకోనీ" అన్నాను దృఢంతా.
ఆమె లేచి నిలబడి, అంతే స్థిరమైన కంఠంతో "నేను చెప్పేది మీరుకూడా వినండి, నా ప్రేమ మీద మీకు మొదటి నుంచీ అంత పెద్ద నమ్మకం లేనట్టుంది. మిమ్మల్ని తప్ప ఇంకెవర్నీ నేను చేసుకోను. ముల్లోకాలూ ఏకమైనా సరే-" అంది.
"అదే మూర్ఖత్వమంటే."
"మీరు దానికి ఏమైనా పెట్టుకోండి" అని అక్కన్నుంచి వెళ్ళిపోయింది.
నేనొక్కన్నే మిగిలాను చీకట్లో.
గది నిశ్శబ్దంగా వుంది.
ఎంతసేపలా కూర్చొని వున్నానో తెలీదు.
గుమ్మం దగ్గిర అలికిడైతె తలెత్తి చూశాను. తరళ తండ్రి!!!
"ఏమిటి అలా చీకట్లో కూర్చున్నావ్?" లైటువేస్తూ అడిగాడు. నేను సమాధానం చెప్పలేదు. ఆయన ఆ సమయంలో రావటం చాలా ఆశ్చర్యంగా వుంది.
ఆయన నా సమాధానం కోసం వేచి చూడకుండా, "తరళ గోదాట్లో దూకినప్పటి నుంచీ ఈ వూర్లో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. ఆ విషయం నీకు తెలిసే వుంటుంది" అన్నాడు ఉపోద్ఘాతంగా.
ఆయన ఈ ఊర్లో ఎలా తిరుగుతున్నాడో నేను చూడలేదు. కాబట్టి దానికి కూడా సమాధానం చెప్పలేదు.
"ఈ వివాహం ఎలా చెయ్యాలా అని నేను మధనపడుతూ వచ్చాను. నా కూతురు అడిగిన దానికి నేనెప్పుడూ కాదనలేదు ఇంతవరకూ".
"ఇదంతా మీరిదివర కొకసారి చెప్పారు నాకు".
"చెప్పాను కానీ అప్పుడు నా అవసరం కోసం చెప్పాను. ఇప్పుడు నీ కోసం చెపుతున్నాను".
"నా కోసమా? ఏమిటది?"
"ఇప్పుడే డాక్టర్ చెప్పాడు నీ గుండెజబ్బు సంగతి".

మైగాడ్- ఎంత వేగంగా పాకిపోతోంది ఈ సంగతి.
"చూసేరా ఎంత అదృష్టవంతులో మీరు. తొందరపడి ఈ వివాహం జరిపివుంటే పసుపు కుంకుమలకు దూరమైన కూతుర్ని నట్టింట్లో జీవితాంతం చూస్తూ గడపవలసి వచ్చేది" అన్నాను.

ఆయన నవ్వేడు.
ఆయన ఎందుకు నవ్వుతున్నాడో నాకు అర్ధంకాలేదు.
ఆయన అన్నాడు-"ఇప్పుడు నా పరిస్థితి అంతకన్నా గొప్పగా ఏమీలేదు ఆనంద్. తరళ నిన్ను తప్ప ఎవర్నీ చేసుకోనని పట్టుబడుతూంది". "నా సంగతి తెలిశాక కూడానా?" విస్మయంగా అడిగాను. "ఆ! తెలిశాక కూడా".
నా నోట మాట రాలేదు. తెల్లబోయి కన్నార్పకుండా చూస్తూ వుండిపోయాను. ఏం మాట్లాడాలో తోచలేదు.
గుండె సరిగ్గా పనిచెయ్యని ఈ మనిషితో గూడు పంచుకోవటానికి తరళ, ఆ విషయం తెలిశాక కూడా సిద్దపడుతుంది!! ఇది ప్రేమా? మూర్ఖత్వమా? చిన్న తనమా? మంకు పట్టా?
ఆ అమ్మాయికంటే బుద్దిలేదు. ఈయన విచక్షణాజ్ఞానం ఏమైంది?
నా ఉద్దేశ్యం గ్రహించినట్టుగా ఆయన అన్నాడు-
"మిగతా అమ్మాయిల్ని పెంచినట్టు తరళని పెంచలేదు నేను. తను అన్నమాట ఏదైనా సరే - దాన్ని కాదంటే ఆ అమ్మాయి బతకదు. చచ్చయినా సరే- సాధించి తీరుతుంది. అంతవరకూ ఎందుకూ? నా విషయమే తీసుకో, ఏ తండ్రయినా యిలా వస్తాడా? బ్రతుకుతాడో లేదో తెలియని మనిషిని అల్లుడివి కమ్మని ప్రాధేయ పడతాడా?"
"ఏం మాట్లాడుతున్నారు మీరు?"
"నా కూతుర్ని చేసుకొమ్మని అడుగుతున్నాను. నీ సర్జెరీ విషయం నా కొదిలిపెట్టు. అమెరికానుంచి డాక్టర్లని తెప్పిస్తాను".
"బైపాస్ సర్జెరీ అంటే టాన్సిల్స్ ఆపరేషన్ కాదు. డాక్టర్లు అమెరికానుంచి వచ్చినా ఆఫ్రికానుంచి వచ్చినా బ్రతికే ఛాన్సు సగం సగం మాత్రమే".
"ఆ విషయం నాకు తెలుసు".
"తెలిసి ఈ రాయబారానికి వచ్చారా? చూస్తూ చూస్తూ ఏ కన్నతండ్రీ తన కూతురు విధవరాలవ్వటానికి వప్పుకోడనుకుంటాను. ఆ ఛాన్సు సగం వున్నాసరే".
"ఇవన్నీ నేను ఆలోచించ లేదనుకున్నావా? దాని కెన్ని విధాలా చెప్పి చూశాను. వినటంలేదు".
"నేను మీ పొజిషన్ లో వుంటే గదిలో పడేసి నాలుగు రోజులు భోజనం పెట్టకుండా వుండేవాడిని. ఆ గారాబం కాస్తా తగ్గిపోయివుండేది".
"నేను నీ పొజిషన్ లో వుంటే ఏం చేసి వుండేవాడినో తెలుసా?" అన్నాడాయన.
"ఏం చేసి వుండేవారు?"
"మృత్యు ముఖంలో వున్నవాడని తెలిసి కూడా పెళ్ళికోసం పట్టుబట్టిన అమ్మాయిని చచ్చినా వదులుకుని వుండేవాడిని కాను. అంతగా ప్రేమించేవాళ్ళు దొరకటం అదృష్టం... అసాధ్యం".
నిజమే అయి వుండవచ్చు. నాకు మనసులో ఒక మూల ఆశ్చర్యంగా వుంది. ఆ అమ్మాయిది ఇన్ ఫాక్చుయేషన్ కాకుండా అది ప్రేమే అయి వుంటే దానికి జోహార్లు. అది నా కవసరం లేని అదృష్టమే అయినా ప్రేమించటం మాత్రం అపూర్వం.
"మీకు నాకన్నా పాతికేళ్ళ వయసు ఎక్కువ వుండి వుంటుంది. ఒక ప్రశ్నకి సమాధానం మీ అనుభవంతో చెప్పండి".
"అడుగు" అన్నారాయన.
"జీవించటం ముఖ్యమా? ఆనందంగా జీవించటం ముఖ్యమా?"
ఈ ప్రశ్న వూహించని ఆయన తెల్లబోయాడు. కానీ గొప్ప వ్యాపారవేత్త ఆయన! తన తడబాటు కనబడనివ్వకుండా వెంటనే తేరుకుని "జీవించటం అంటూ కొనసాగుతే, ఆనందంకోసం ఎలాగూ వెతుక్కుంటాడు మనిషి కాబట్టి జీవించటం ముఖ్యం" అన్నాడు.
"కాబట్టి నేను మీ దగ్గిర రెండు లక్షలు తీసుకుని, ఆపరేషన్ చేయించుకుని జీవించటం ప్రారంభించాలి. దానికి ప్రతిగా మీ కూతుర్ని వివాహమాడాలి. మీ థియరీ ప్రకారం జీవించటం మొదలు పెట్టాక, వివాహం జరిగాక, ఎలాగూ అందులో ఆనందం వెతుక్కోవటం తప్పదు కాబట్టి మేమిద్దరం సుఖంగా వుంటాం".
"అంతే అంతే" అన్నాడాయన.
"నేను మీ దగ్గిర రెండు లక్షలూ తీసుకుని, లేదా ఆపరేషన్ అయ్యాక మూటాముల్లె సర్దుకుని వెళ్ళిపోయాననుకోండి. మీ థియరీ అప్పుడూ కరెక్టే అవుతుంది కదా" అన్నాను.
"వెళ్ళిపోయాక తీరిగ్గా ఆనందం గురించి వెతుక్కుంటాను".
"కానీ నీ ఆపరేషన్ వివాహం జరిగాక కదా అయ్యేది" అన్నాడు. ఈసారి తెల్లబోవటం నా వంతయింది.
"ఒకవేళ ఆపరేషన్ టేబిల్ మీద నేను చచ్చిపోతే"? అని అడిగాను.
"నా కూతురు విధవరాలవుతుంది".
"మీరు మహామూర్ఖులైనా అయివుండాలి. లేదా పిచ్చి వాళ్ళయినా అయివుండాలి" అన్నాను. ఆ మాటలకు ఆయనలో నేనూహించిన మార్పు కనపడలేదు. వేదాంతిలా "అవును" అన్నాడు. "....తరళలాంటి కూతురున్న తండ్రికి ఈ రెండు అర్హతలూ కరెక్టుగా సరిపోతాయి".

నేనేదో అనబోతూంటే ఆయన అడ్డుపడి- తనే అన్నాడు. "లేకపోతే నాలాటి తండ్రిని ఎక్కడన్నా చూశావా? ... 'నా కూతుర్ని వదిలిపెట్టు- లక్షిస్తాను. రెండు లక్షలిస్తాను' అనే తండ్రుల్నే చరిత్ర పుస్తకాల్లోనూ, సినిమాల్లోనూ చూసివుంటావు తప్ప 'నా కూతుర్ని చేసుకో రెండు లక్షలు పెట్టి ఆపరేషన్ చేయిస్తాను' అని అడిగే తండ్రిని నన్నొక్కడినే చూసివుంటావు. ఇదంతా ప్రారబ్ధం".
ఆయన మాటల్లో నీలాటి బికారి దగ్గిర కొచ్చి నేను ప్రాధేయపడటం నా ప్రారబ్ధం కాక మరేమిటి-అన్న అర్ధం ధ్వనించి వుండవచ్చు. నేనది పట్టించుకోలేదు.
నా కింకో ఆలోచన కూడా వచ్చింది. డబ్బుతో దేన్నైనా కొనవచ్చుననే ఈ తండ్రీకూతుళ్ళ అహంభావానికి తగిన గుణపాఠం చెప్పాలంటే-వివాహం చేసుకుని, ఆపరేషన్ అయ్యాక చెప్పా పెట్టకుండా చెక్కెయ్యటమే! కానీ క్షణాల్లోనే నా ఆలోచకి నాకే సిగ్గేసింది. నేను లేచి నిలబడి, చేతులు జోడించి, "మీరు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు" అన్నాను.
"ఇంతకీ నేను చెప్పిందీ-"
"నా నిర్ణయంలో మార్పులేదు క్షమించండి-"
ఆయన వెళ్ళిపోలేదు, ఆగి, "మళ్ళీ మరొకసారి ఆలోచించు" అన్నాడు. "ఇంక ఆలోచించేదేమీ లేదు. తరళకి తండ్రిగా మీరుపడే కష్టం చూస్తూ, ఆవిడకి భర్తగా పదవి స్వీకరించలేను. దానికి బదులు ఈ గుండెజబ్బుతో మరణించటమే మంచిదనుకుంటున్నాను".
ఆయన మొహం ఎర్రబడింది. "నన్నేమైనా అను కానీ, నా కూతుర్ని మాత్రం ఏమీ అనకు. నేను భరించలేను".
"నేను మీకంటే చిన్న వాడిని అయినా మీకో సలహా చెప్పటానికి సాహసిస్తాను. వింటే వినండి. పిల్లల్ని పెంచే విధానం ఇదికాదు. ఈ రోజు కాకపోతే రేపన్నా మీరు చిక్కుల్లో పడతారు మీ కూతురువల్ల-"
ఆయన మొహం మరింత జేవురించింది. "కోరి వచ్చాను కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు" అన్నాడు.
"మీరు మరీ మగ వరూధునిలా మాట్లాడుతున్నారు".
ఆయన పెద్దగా అడుగుల శబ్దం చేసుకుంటూ కోపంగా వెళ్ళిపోయేడు అక్కన్నుంచి.

నేనూ, నాతోపాటు నావొంటరి తనము మిగిలాము.
గుండెల్లో నొప్పి తిరిగి సన్నగా మొదలైంది. దాంతో నా ఆలోచనలు నా జీవితంవైపుకి మర్లాయి. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాను. ఆ విషయం డాక్టర్లు చెప్పలేదు. బహుశా నాలుగైదు నెలలేమో ఈ కొద్ది సమయంలో ప్రమద్వర భవిష్యత్తు ఎలా ఒకదారిలో పెట్టగలను? దేనికైనా డబ్బుకావాలి.

ఏ సమస్యని ఎక్కడనుంచి తీసుకున్నా అది డబ్బు దగ్గరికి వచ్చి ఆగిపోవటం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చివరికి ప్రేమకూడా డబ్బుతోనే ముడిపడి పోయింది.
గుండెల్లో నొప్పి మరింత ఎక్కువైంది. మంచినీళ్ళు తాగుదామని లేస్తూ స్పృహ తప్పిపోయాను.
....
మళ్ళీ నాకు స్పృహ వచ్చేసరికి డాక్టర్ నన్ను పరీక్షిస్తున్నాడు. పక్కనే ప్రమద్వర వుంది. నేను కనులు విప్పటం చూసి, డాక్టర్ "ఎలా వుంది?" అని అడిగాడు.
"ఇప్పుడు ఫర్వాలేదు. అకస్మాత్తుగా నొప్పి వచ్చింది. తరువాత ఏం జరిగిందీ తెలియదు" అన్నాను.
"వ్రాయటానికి మందులు ఏమీలేవు. ఆపరేషన్ చేయాలి అంతే" అన్నాడు డాక్టరు.
"వచ్చి చూసినందుకు చాలా థాంక్స్" అన్నాను. డాక్టర్ వెళ్ళిపోయాడు. ఇద్దరు గణితశాస్త్ర నిపుణులు మాట్లాడుకున్నట్టు చాలా క్లుప్తంగా జరిగింది మా సంభాషణ.
"ఎంతసేపయింది నువ్వొచ్చి" అడిగాను- డాక్టరు వెళ్ళిపోయాక.
"అరగంట... నేనొచ్చేసరికి మీరు పడిపోయి వున్నారు ఇప్పుడెలా వుంది?"
"బాగానే వుంది. మళ్ళీ వెంటనే వచ్చావేం? ఏమిటి సంగతి?"
ఆమె వెంటనే సమాధానం చెప్పకుండా కొంచం ఆగి, నెమ్మదిగా అంది- "ఇప్పుడే తరళా వాళ్ళ నాన్నగారు నన్ను కలుసుకున్నారు".
నేను దిగ్భ్రమ చెందాను. ఆయన గొప్ప వ్యాపారవేత్త అని తెలుసు కానీ, మరీ ఇంత తొందరగా పావులని కదుపుతాడని తెలీదు. "ఏమిటట విషయం?" అన్నాను. "ఎలాగైనా తన కూతురికి ఈ సంబంధం కుదిరేలా చెయ్యమని నిన్ను వేడుకుని వుంటాడు. ణ అవూహ కరెక్టయితే ఇప్పుడు నువ్వా విషయం మాట్లాడటానికే వచ్చి వుంటావు. అవునా-"
"అవును" అంది ఆమె తలదించుకుని.

"ప్రేమ త్యాగాన్ని కోరుతుందనీ, ప్రేమకి అర్ధం విడిపోవటమే అనీ, స్వచ్చమైన ప్రేమకి వివాహం పరాకాష్ట కాదనీ, నన్ను మర్చిపొమ్మనీ, తరళని చేసుకొమ్మనీ అడగటానికి వచ్చావు. అస్తమిస్తున్న సూర్యుడివైపు వెళ్ళిపోవటానికి, ఆయన తరఫున వకాల్తా పుచ్చుకున్నావు. అంతేనా?"
ఆమె తల అడ్డంగా వూపుతూ, "కాదు" అంది.
ఆశ్చర్యంగా, "మరి" అన్నాను. "ఆయనొక మంచి బేరం పెట్టారు. నిన్ను తరళతో వివాహానికి ఒప్పిస్తే, నాకు పట్నంలో మంచి ఉద్యోగం వేయిస్తారట. అంతేకాదు, నా వివాహానికి ఏభైవేపు బ్యాంకులో కూడా వేస్తారట. పైగా మా ఇంటి వాళ్ళు నావైపు కన్నెత్తి చూడటానికి కూడా వీల్లేకుండా ఏర్పాట్లు చేయిస్తారట".
నేను బిగ్గరగా నవ్వి "అసాధ్యుడిలా ఉన్నాడే ఆ ముసలాడు. ఇంతకీ నువ్వేమన్నావ్?" అడిగాను.
"ఈ పద్దతి బాగానే వుంది ప్రయత్నిస్తానన్నాను".
నా మొహంలో నవ్వు మాయమైంది. "ఏమిటీ?" అన్నాను రెట్టిస్తూ. "కొన్ని విషయాలు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. భావాలూ... ఊహలూ....వాటికేం....అవెప్పుడూ బాగానే ఉంటాయి. సమస్యలు ఎలా తీరతాయా అన్నది ముఖ్యం. ఆయన ముందు చెప్పినప్పుడు నేనూ ఆవేశపడ్డాను. కానీ తీరిగ్గా ఆలోచిస్తే-ఇంతకన్నా మంచి పరిష్కారం ఏముంది అనిపించింది. ఈ విధంగా అయితే ముగ్గురి జీవితాలూ బాగుపడతాయి".
"చాలాపు" అని అరిచాను.
ఆమె ఏమీ తత్తరపడలేదు. లేచి నిలబడింది.
"ఆయన చెప్పినదాన్లో నాకేమీ తప్పు కనపడలేదు. నేను కళావంతుల కులానికి చెందినదాన్ని అవటంవల్ల బహుశా ఆ వ్యాపారగుణం నా రక్తంలో జీర్ణించుకుపోయి, ఆయన చెప్పిన దాన్లో 'వాస్తవాన్ని' తొందరగా గ్రహించేలా చేసిందేమో! మీరూ తీరిగ్గా ఆలోచించండి-" అని అక్కన్నుంచి వెళ్ళిపోయింది.
నేను కట్రాటలా నిలబడిపోయాను, చుట్టూ వున్న వస్తువులు గిర్రున తిరుగుతున్నట్టు అనిపించసాగాయి.
జి.పి. రావు చెప్పిన కథ
తరళ నా ఒక్కగానొక్క కూతురు.
నా కూతురు కావాలంటే కొండమీద కోతైనాసరే దిగిరావల్సిందే- ఎందుకురాదు. కొండచుట్టూ పదిమంది మనుష్యుల్ని పెట్టి, చేతికి వలలిచ్చి ఒక క్రమపద్దతిలో నెమ్మదిగా పైకి ఎక్కిస్తే కోతి దొరక్క ఎక్కడికి పోతుంది? మనిషికి పదిరూపాయలు కూలీ అనుకున్నా- మొత్తం వంద అవుతుంది? అంటే....మనం ఎంతో ఆశ్చర్యంగా, అద్భుతంగా చెప్పుకునే "కొండమీది కోతి" ఖరీదు అంతా చేస్తే వంద రూపాయలన్నమాట! ఆలోచించండి. నామాటలో నిజం మీకు బోధపడుతుంది. నా థియరీ ఏమిటో మీకు అర్ధమవుతుంది.
మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి!
నా కూతురంటే నాకు వల్లమాలిన గారాబం ఉంటే ఉండొచ్చు కానీ, తను అడిగిన ప్రతిదీ తెచ్చి ఇవ్వటం మాత్రం కేవలం ఆ ఒక్క గారాబంవల్ల మాత్రంకాదు. నా అహం వల్ల!
తనెంత కష్టమైనది అడుగుతే దాన్ని సంపాదించి తెచ్చి పెట్టడంలో నా కంత సంతృప్తి లభిస్తుంది. చిన్నప్పుడు ఏనుగు బొమ్మ అడిగింది. ఏనుగు పిల్లను తెప్పించాను. ఆ రోజుల్లో రెండు వేలయింది.

"సరిగ్గా వినలేదమ్మా, ఏనుగు బొమ్మ అడిగావా? ఏనుగు పిల్లలా వినపడింది. పోన్లే తిరిగి పంపించేస్తాను" అన్నాను. పంపటానికి మూడొందలు ఖర్చయింది. రెండువేలూ తిరిగోచ్చాయి. రాకపోయినా పెద్ద పట్టించుకునే వాణ్ణి కాదు!
గోదారి రెండుగా చీలినచోట మధ్యలో దీవి మాది. ఆ రోజుల్లోనే పదివేలకి పైగా జనాభా వుండేది. మూడొందలు ఖర్చు పెట్టటం ద్వారా పదివేలమంది ప్రజలు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుని "కూతురు ఏనుగు బొమ్మ అడిగితే ఏనుగు పిల్లని తెప్పించాడట్రా మన గోపాలరావుగారు" అనుకునేలా చేయటం అంత సామాన్య విషయం కాదు. చాలాకాలం వరకూ దీన్ని కథలుగా చెప్పుకున్నారు మా పరిసర ప్రాంతాల్లో.... మూడొందల ఖర్చుతో.
ఇప్పుడు చెప్పండి నేను తెలివైన వాన్నో కాదో...
ఈనాటికి కూడా నేను ఈ పల్లెకి మకుటంలేని మహారాజుని ఈ పల్లెలో అందరికీ నేనంటే భయమూ, భక్తీ... ణ ఏనుగు థియరీ ఎప్పుడూ తప్పదు. ఈ అమాయక ప్రజల దృష్టిలో ఆ స్థానం ఎలా నిలబెట్టుకోవాలో నాకు బాగా తెలుసు.
అలాంటి థియరీకి చిన్న దెబ్బ కొట్టింది. నా కూతురు-
ఆనందరావు అనే అనామకుణ్ణి ప్రేమించానని చెప్పి.

మొదట్లో అందరిలాగే ఈ ఆనందరావు అనేవాడిని ఎలా శంకరగిరి మాన్యాలు పట్టించాలా అని ఆలోచించాన్నేను. కాని నా కూతురు నాకన్నా రెండాకులు ఎక్కువ చదివింది. నేను ఆనందరావుని ఏదైనా చేసేలోపులో వెళ్ళి గోదాట్లో దూకి, నా కన్నా తన ప్రేమని ఊళ్ళో వాళ్ళందరికీ చాటింపేసింది. తెల్లారేసరికల్లా ఊరంతా ఈ విషయం భగ్గున తెలిసిపోయిందని నాకు తెలుసు. నా ముందు ఎవరూ మాట్లాడ్డానికి సాహసించలేక పోయినా-ఇప్పుడు ఆనందరావుకు ఎదిఅనా జరుగుతే అది నావల్లే అనుకుంటారు. ఇన్నాళ్ళు నేను కూడబెట్టిన ప్రిస్టేజంతా గోదాట్లో కలిసిపోతుంది.
అమ్మ తరళమ్మ తల్లీ! నా కూతురివి అనిపించావు కదే- అనుకున్నాను. పైకి తేల్లేదు. అయినా తప్పు తరళది కాదు.
వయసొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని మధ్యాహ్నంపూట అదెక్కడికి వెళ్తూందో తెలుసుకోకపోవటం దాని తల్లి తప్పు. పట్నంలో అయితే ప్రయివేటు ప్లేసులుంటాయి. మా వూళ్ళో గోదారొడ్డే వీళ్ళకి ప్రయివేటు ప్లేసయిందని నాకు తరువాత తెలిసింది. వీళ్ళిద్దరి పక్కనా ప్రమద్వర అని ఇంకో అమ్మాయుందట. ప్రేమ పానకంలో ఈ అమ్మాయిని నా కూతురు పుడకలా వాడుకున్నదన్న మాట.
ఈ ఆనందరావు అనే కుర్రాడిని చూడటానికి వెళ్ళాను. అందరు కుర్రాళ్ళల్లాగ "అవును మా ప్రేమ అచంచలమైంది. మేం లైలా మజ్నూలం" అని అనలేదు. మరికొంతమంది లాగా తలొంచుకుని "క్షమించండి, తప్పైపోయింది" అని వణికిపోలేదు. "మీ అమ్మాయి పొరపాటు పడుతూంది. తనమీద నాకు అటువంటి భావం ఏమీలేదు" అన్నాడు.
నాకు మతిపోయింది.
"నా కూతురూ నువ్వూ ప్రేమించుకోలేదా?" అన్నాను.
"లేదు మేము మామూలు స్నేహితుల్లా కలుసుకునేవాళ్ళం. తనెప్పుడూ నా దగ్గిర ఈ ప్రసక్తి తీసుకురాలేదు" అన్నాడు. అతడు అబద్దం చెప్పటంలేదని తెలుస్తూనే వుంది.
నాకు గర్వంగా అనిపించింది. నా కూతురు అందర్లాంటిది కాదు. తన ఇష్టాల సంగతి ఇంట్లో పెద్దలకే చెప్పాలన్న ఇంగితజ్ఞానం వున్నది. అప్పుడు చూశాను అతడిని పరిశీలనగా!
అందంగానే వున్నాడు. కళ్ళల్లో అదోలాటి పట్టుదల కనపడుతూంది. దాన్నేమనాలి? పొగరు అనాలా? నాకు సరదాగా అతడితో ఆడుకోవాలనిపించింది. టెంప్ట్ చెయ్యాలని పించింది. "మరి నా కూతురిమీద నీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాను.
అతడు తలవంచుకుని సనుగుతాడనుకున్నాను. కానీ అటువంటిదేమీ చేయక, "మంచి అమ్మాయే, కానీ పొగరెక్కువ" అన్నాడు. నాకు వళ్ళు మండిపోయింది. "అది పొగరుకాదు, ఆత్మస్థయిర్యం" అన్నాను.
"రెండిటికీ పెద్ద తేడాలేదు. తన మీద తనకి నమ్మకం అనేది వ్యక్తిత్వం వల్ల వస్తే దాన్ని ఆత్మస్థయిర్యం అంటారు. డబ్బువల్ల వస్తే దాన్ని 'పొగరు' అంటారు".
లాగి పెట్టి కొట్టినట్టయింది. ఈ కుర్ర వాడెవడో తెలుగు బాగా చదువుకున్నట్లున్నాడు. కోతిని పట్టే థియరీ నాది. నవ్వి "నేనిప్పుడు ఎందుకు వచ్చాననుకున్నావ్?" అన్నాను.
"డబ్బున్న ఆడపిల్ల తండ్రి ఎందుకొస్తాడు? నా కూతుర్ని మర్చిపో లేకపోతే కష్టాల్లో ఇరుక్కుంటావ్ అని హెచ్చరించటానికి వచ్చివుంటారు". కోతి కొండ ఎక్కుతోంది. ఎక్కేకొద్దీ పైర్పోయే ఛాన్సు తక్కువని పాపం దానికి తెలీదు. నాకు ముచ్చటేసింది. నవ్వుతూ అన్నాను-
"అదేంకాదు నా కూతురు అడిగిందెప్పుడూ కాదన్లేదు నేను ఇప్పుడు కూడా అది అడుగుదామనే వచ్చాను" అన్నాను ఓరగా అతడిని చూస్తూ. ..."చెప్పు, నా కూతుర్ని చేసుకుంటావా?"
ఎగిరిగంతేసే ప్రయత్నమేమీ చెయ్యలేదు అతడు. 'సారీ' అన్నాడు క్లుప్తంగా ఇంతటి అవమనం నేనెప్పుడూ పొందలేదు. ఇంకెవర్నయినా ఆ పరిస్థితిలో అయితే అంతకు అంతా ప్రతీకారం తీర్చుకునేవాడినే కానీ అతడిని నిర్మొహమాటత్వం (బహుశ అది నాకూతుర్ని రక్షిస్తూంది కాబట్టి) నాకు నచ్చింది. డబ్బుని వద్దనే వాళ్ళు, అరటిపండుని వద్దనే కోతులూ చాలా తక్కువ వుంటాయి. కోతిని కొండమీదనుంచి దింపే ప్రయత్నమేమీ చెయ్యకుండా వచ్చేశాను.
తరళ నా కోసం ఎదురుచూస్తూంది. ఆనందరావు అన్న మాటలు దానితో చెపితే గుండె ఆగిపోతుంది. అవతలి కుర్రాడు తనని ప్రేమిస్తున్నాడా లేదా అనికూడా తెలుసుకోకుండా తండ్రిని రాయబారానికి పంపించేటంత అమాయకురాలు నా కూతురు ఆనంద్ ఏమన్నాడో చెపితే భరించలేదు. ఈ టాపిక్ వాళ్ళమధ్య ఎలాగూ వస్తుందని నాకు తెలుసు. ఆనంద్ తనని ప్ర్రేమించటం లేదన్న సంగతి నేనెందుకు చెప్పటం? అతనే చెప్పనీ-
నేను వూహించినట్టే ఆనంద్ తరళకి ఆ విషయం చెప్పినట్టున్నాడు. అయితే ఆ తరువాత నేను వూహించని విషయం జరిగింది.
తరళ గోదాట్లో దూకింది. నా పరువు పోయింది.
చాలా చిన్న విషయం అనుకున్నది చూస్తూవుండగా పెద్దదయింది. ఇప్పుడు ఆనంద్ గానీ నా కూతుర్ని చేసుకోనంటే-సరదాగా తీసుకొచ్చిన ఏనుగు తోటంతా తొక్కినంత పని అవుతుంది.
ఆనంద్ నాకల్లుడవటం నాకేమీ అభ్యంతరంలేదు. తరళని చేసుకునే వాడెవడైనా నా ఆస్తి చూసే వస్తాడని నాకు తెలుసు. అటువంటిది డబ్బు అంటే అసలు లక్ష్యంలేని ఆనంద్ లాటివాడు అల్లుడైతె అభ్యంతరం ఏముంటుంది-ఇది మొదటి కారణం! నా కూతురు ప్రేమించింది- అది రెండో కారణం!! అన్నిటికన్నా ముఖ్యమైన మూడో కారణం ఇంకొకటుంది-
ఆనంద్ లాంటి బీదవాడికి కూతుర్నిచ్చి చేయటం-
ఈ వివాహం జరగ్గానే, పల్లెలో నా కీర్తి వాడవాడలా పెరిగి పోతుంది!!!
కీర్తికోసం నేనేమైనా చేస్తానని మీకు తెలుసు. అలాగే కూతురికోసం కూడా! అయితే వెంటనే నేను ఆనంద్ దగ్గిరకి మళ్ళీ వెళ్ళలేదు. ఈ కుర్రవాడి పొగరు విషయం మొదటే అనుభవముంది. ఇప్పుడే వెళ్తే చెట్టెక్కి కూర్చుంటాడు. అతడినే నా దగ్గిరకి రప్పించాలి.
వచ్చాక- కాబోయే మామగారు కూడా తనంత తెలివైనవాడే అన్న విషయం ఆ కుర్రవాడికి తెలియాలి ఎలా?
నేనీ విధంగా ఆలోచిస్తూ వుండగా-

అదే సమయానికి ఆనంద్ ఏదో రొమ్ముల్లో నొప్పితో ఆస్పత్రికొచ్చినట్టు తెలిసింది. అప్పుడే నాకో ఆల్కహన స్ఫురించింది.
చిన్న చిలిపి ఆలోచన-
డాక్టర్ మావాడే నేనేం చెప్పమంటే అది చెపుతాడు.
"ఆనంద్ ఆస్పత్రికి ఎందుకొచ్చాడు?"
"ఏదో నొప్పి అని వచ్చాడు" జవాబు ఇచ్చాడు డాక్టరు.
"ఏం చెప్పావ్?" తనేం చెప్పాడో డాక్టరు చెప్పాడు. తనేం చెప్పాలో నేను చెప్పింది విని తెల్లమొహం వేశాడు. తరువాత ఇబ్బందిగా నవ్వేడు. నవ్వకేం చేస్తాడు?

No comments:
Post a Comment