Showing posts with label హర్ట్ ఎటాక్ (2014). Show all posts
Showing posts with label హర్ట్ ఎటాక్ (2014). Show all posts

హర్ట్ ఎటాక్ (2014)

చిత్రం - హర్ట్ ఎటాక్ (2014)
పాట - నువ్వంటె నాకు
సంగీతం - అనూప్ రూబెన్స్
సాహిత్యం - భాస్కరభట్ల
పాడినవారు - అనూప్ రూబెన్స్

నువ్వంటే నాకు చాలా చాలా చాలా ఇష్టమే...
అది మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగానే...
నువ్వంటే నాకు చాలా చాలా చాలా ఇష్టమే...
అది మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగానే...
నే నచ్చితే ఇవ్వోచ్చుగా.. లేదంటేనే మానొచ్చుగా...
అంతేగాని అందర్లోను చెంపమీద లాగి కొడతావా...
నువ్వంటే నాకు చాలా చాలా చాలా ఇష్టమే...
అది మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే... ముద్దడిగానే...

హెయ్.. చిరాగ్గా ఉంటున్నాదంటే...పరాగ్గా అనిపిస్తూదంటే...
సరిగ్గా తగలాల్సింది లిప్ టు లిప్ కిస్సే...
మనస్సే తడబడిపోతుంటే...వయస్సే వెలవెలబోతుంటే...
తెలుస్సా కావలసింది మసాలా కిస్సే...
సింగిల్ గుంటే ఎట్టుంటాదే...
ఎంగిల్ పడితే బాగుంటాదే...
అర్దం అయినా కానట్టుగా L K G ఫేస్ పెడతావా...
నువ్వంటే నాకు చాలా చాలా చాలా ఇష్టమే...
అది మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే... ముద్దడిగానే...

ఓ.. పెదాల్లో యత్రం ఉంటాదే...అదేదో ఆత్రం ఉంటాదే...
ఎన్నెన్నో ముద్దులనైనా అచ్చే వేస్తాదే...
ఇదేదో బానే ఉందంటూ... అమాంతం నీకూ అనిపిస్తే...
ఓసారి ప్రాక్టీస్ చెసెయ్ అలవాటయిపోద్దే...
సిమ్మేలేని సెల్లెందుకే... చుమ్మాలేని జన్మేందుకే...
నీ మంచికే చెబుతున్నానే.. చెప్పవే నీ టేష్టుని తొందరగా...
నువ్వంటే నాకు చాలా చాలా చాలా ఇష్టమే...
అది మాటల్లోన చెప్పలేక ముద్దడిగానే... ముద్దడిగానే... మ మ మ ముద్దడిగానే... ముద్దడిగానే...



                                ***********************************************************************************


చిత్రం - హర్ట్ ఎటాక్ (2014)
పాట - ఎందుకిలా నను
సంగీతం - అనూప్ రూబెన్స్
సాహిత్యం - భాస్కరభట్ల
పాడినవారు - కునాల్ గంజావాల

ఏందుకిలా నను వేధిస్తున్నావే... ఓ. ఓ..
ఏందుకనీ నను వెలివేస్తున్నావే...
నా హృదయం నీ తోడే కోరుకుందనా...
నా ప్రాణం నీ చుట్టూ తిరుగుతోందనా...
అన్యాయంగా తోస్తుంటె నట్టేటిలో ఇలా...
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి...
ఏ మనసుని తిట్టాలి.. ఈ క్షణం... హు.. హు...
ఏందుకిలా నను వేధిస్తున్నావే...
ఏందుకనీ నను వెలివేస్తున్నావే...

హొ.. నను నేను వదిలేసి నువ్వే కావాలంటున్నా...
నాదంటు మిగిలుంటే అది నువ్వే నువ్వే అంటున్నా...
నేన్నీకు వద్దనీ... నీతో నడవొద్దనీ...
నీ దారే నీదని గీసావా గీతని...
నీ గుండెల్లో నా గురుతుల్ని తీరాన్నె తాకిన అలలా తుడిచేస్తే...
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి...
ఏ మనసుని తిట్టాలి.. ఈ క్షణం... హో...

హొ.. వెలుగంతా తరిమేసి చీకటిలో నన్ను తోసావా...
గతమంతా చెరిపేసి శూన్యంలో నిలబెడతావా...
నాకన్నీ నువ్వనీ అనుకోడం పాపమా...
పూజించే చేతిని నరికేంత కోపమా...
నీ తలపుల్లో మైమరపుల్లో నా మనసుని తిప్పి రెక్కలు విరిచేస్తే...
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి...
ఏ మనసుని తిట్టాలి.. ఈ క్షణం... హు.. హు...
ఏందుకిలా నను వేధిస్తున్నావే...
ఏందుకనీ నను వెలివేస్తున్నావే... హే హే.. హే

                                ***********************************************************************************

చిత్రం - హర్ట్ ఎటాక్ (2014)
పాట - సెలవనుకో మరి
సంగీతం - అనూప్ రూబెన్స్
సాహిత్యం - భాస్కరభట్ల
పాడినవారు - చిత్ర

సెలవనుకో మరి ఏడవకే మనసా... ఓహో...
కలగనకే అది నిజమైపోదు కదా...
ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో...
ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో...
కన్నుల్లోని కన్నీటి కెరటాలలో ....
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి...
ఏ మనసుని తిట్టాలి.. ఈ క్షణం... హొ. హొ.
సెలవనుకో మరి ఏడవకే మనసా...
కలగనకే అది నిజమైపోదు కదా...

అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా...
నాలాగే నీక్కూడ నేనంటే ఇష్టం అనుకున్నా...
పిలిచానా రమ్మనీ... కసిరానా పొమ్మనీ...
చివరికి ఈ ఆటలో ఐపోయా బోమ్మనీ...
నువ్వు కాదంటే ఇక రానంటే మన ఇద్దరి మద్య ఇంకేం లేదంటే...
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి...
ఏ మనసుని తిట్టాలి.. ఈ క్షణం...
సెలవనుకో మరి ఏడవకే మనసా..
హొ.. నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకొన్నా...
ఇన్నాళ్ళి భ్రమలొనే ఆనందంగా బ్రతికానా...
నచ్చిందే తడవుగా వెళ్ళోద్దే అలుసనీ...
చెబుతున్నా మనసుకి వింటుందా మాటనీ...
నా ఊహల్ని నా ఆశల్ని నరికేస్తూ నవ్వుని చిదిమేస్తే...
నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి...
ఏ మనసుని తిట్టాలి.. ఈ క్షణం...
సెలవనుకో మరి ఏడవకే మనసా..

                                ***********************************************************************************

చిత్రం - హర్ట్ ఎటాక్ (2014)
పాట - నీ కోసమే నేనంటూ ఉన్నది
సంగీతం - అనూప్ రూబెన్స్
సాహిత్యం - భాస్కరభట్ల
పాడినవారు - అనూప్ రూబెన్స్, స్మిత బెల్లూరి

నీ కోసమే.. నేనంటూ ఉన్నదీ...
నీ కోసమే.. నా ప్రాణం ఉన్నదీ...
నీ కోసమే... నీ కోసమే...
ఈ క్షణం నువ్వే ఎదురైతె...
అదంతా నిజమే ఐపోతే...
నేను గుండాగిపోతానులే...
తూహిహై తూహిహై మేరె దిల్ మే తూహిహై...
తూహిహై తూహిహై మేరె దిల్ మే తూహిహై...
నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే...
నువ్వేలే నువ్వేలే నా మనసంతా నువ్వేలే...
నీ కోసమే నేనంటూ ఉన్నదీ... నీ కోసమే...

హో..తెలియని మైకంలా నువ్వే కమ్మేస్తున్నావే...
ఓ చెలియా సావరియా నను రక్షించవా..
ఎదురుగా ఎవరున్నా నువ్వే అనుకుంటున్నానే...
కనబడవా కనబడవా చెలి కరుణించవా...
తెలియలేదు ప్రేమంటే నువ్వే ఉండగా...
తీరా తెలుసుకున్నాకా నువ్వే లేవుగా...
ముంచేశావే నీ ప్రేమలో...
తూహిహై తూహిహై మేరె దిల్ మే తూహిహై...
తూహిహై తూహిహై మేరే దిల్ మే తూహిహై...
నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే...
నువ్వేలే నువ్వేలే నా మనసంతా నువ్వేలే...

హో... ఒకటే మనసుందీ ఎవరికి ఇవ్వోద్దనుకుంటూ...
దాచేసా దాచేసా చెలి ఇన్నాల్లుగా...
ప్రేమంటె ఏంటో అర్దం నేడె తెలిసిందీ...
అపుడెపుడొ తెలిసుంటే బాగుండేదిగా...
నువ్వు లేక క్షణమైనా ఏమితోచదే...
ఇదే ప్రేమ అంటారా ఏమో తెలియదే...
నువ్వు లేని మనసెందుకే...
తూహిహై తూహిహై మేరె దిల్ మే తూహిహై...
తూహిహై తూహిహై మేరె దిల్ మే తూహిహై...
నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే...
నువ్వేలే నువ్వేలే నా మనసంతా నువ్వేలే...

                                ***********************************************************************************