Showing posts with label మా ఇద్దరి కథ (1977). Show all posts
Showing posts with label మా ఇద్దరి కథ (1977). Show all posts

మా ఇద్దరి కథ (1977)

చిత్రం : మా ఇద్దరి కథ (1977)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : కొసరాజు
నేపధ్య గానం : సుశీల 

పల్లవి :

చిలకపచ్చ చీర కట్టి... చేమంతి పూలు పెట్టి
సోకు చేసుకొచ్చాను రోయ్..ఓరయ్యో
చుక్కలాంటి చిన్నదాన్ని రోయ్... ఓరయ్యో
ఒక్కదాన్ని వచ్చానురోయ్  

చిలకపచ్చ చీర కట్టి... చేమంతి పూలు పెట్టి
సోకు చేసుకొచ్చాను రోయ్..ఓరయ్యో
చుక్కలాంటి చిన్నదాన్ని రోయ్... ఓరయ్యో
ఒక్కదాన్ని వచ్చానురోయ్  

చరణం 1 :

ఆ... ఎర్రా ఎర్రనివాడు... ఆ... ఎత్తు భుజాలవాడు
ఆ... ఎర్రా ఎర్రనివాడు... ఆ... ఎత్తు భుజాలవాడు
చూడా చక్కనివాడు... దారీ తప్పి వచ్చాడు
చూడా చక్కనివాడు... దారీ తప్పి వచ్చాడు

ఎర్రా ఎర్రనివాడు... ఎత్తు భుజాలవాడు
చూడా చక్కనివాడు... దారి తప్పి వచ్చాడు

ఎవరూ చూడలేదా... చూస్తే చెప్పరాదా..
ఎవరూ చూడలేదా... ఆ.. చూస్తే చెప్పరాదా..ఆ 
ఎవరూ చూడరా... చూస్తే చెప్పరా..
ఓఓఓఓఓఓ...  ఓఓఓఓఓఓఓఓఓఓఓ 

చిలకపచ్చ చీర కట్టి... చేమంతి పూలు పెట్టి
సోకు చేసుకొచ్చాను రోయ్..ఓరయ్యో
చుక్కలాంటి చిన్నదాన్ని రోయ్... ఓరయ్యో
ఒక్కదాన్ని వచ్చానురోయ్ 

చరణం 2 :

ఆ... గుంటూరు చిన్నవాడు... ఆ... కొంటే కోణంగివాడు
ఆ... గుంటూరు చిన్నవాడు... ఆ... కొంటే కోణంగివాడు
పక్కా పాపటివాడు... పచ్చీ పోకిరీవాడు
పక్కా పాపటివాడు... పచ్చీ పోకిరీవాడు

గుంటూరు చిన్నవాడు... కొంటే కోణంగి వాడు
పక్కా పాపటివాడు... పచ్చీ పోకిరివాడు

ఏడ దాగినాడో... జాడ తెలియ నీడూ..
ఏడ దాగినాడో... జాడ తెలియ నీడూ..
ఏడ దాగినాడో... జాడ తెలియ నీడూ 

ఏడ దాగినో... జాడ తెలియదు..
ఓఓఓఓఓఓ... ఓఓఓఓఓఓఓఓఓఓఓ 

చిలకపచ్చ చీర కట్టి... చేమంతి పూలు పెట్టి
సోకు చేసుకొచ్చాను రోయ్..ఓరయ్యో
చుక్కలాంటి చిన్నదాన్ని రోయ్... ఓరయ్యో
ఒక్కదాన్ని వచ్చానురోయ్  

************** ****************** ********************
చిత్రం : మా ఇద్దరి కథ (1977)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల, రామకృష్ణ 

పల్లవి :

చలిచలిగా ఉందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
గిలిగిలి పెడుతోందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా  

చలిచలిగా ఉందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
గిలిగిలి పెడుతోందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా

కట్టు తప్పిపోయింది నా మనసు
గట్టు దాటిపోయింది నా వయసు
వేడి వేడి కౌగిలింత కోరిందీ  

చలిచలిగా ఉందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
గిలిగిలి పెడుతోందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా 

పిచ్చివాణ్ణి చేస్తుంది నీ సొగసు
కొత్త రుచులు కోరింది నీ వయసు
ముందు వెనక లాగింది నా మనసూ 

చలిచలిగా ఉందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
గిలిగిలి పెడుతోందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా  

చరణం 1 :

వానజల్లు పడుతుంటే... ఒళ్ళు ఝల్లుమంటుంటే
ఎదురుగా నువ్వుంటే... నేను నిలువలేకుంటే
ఒంటరిగా ఈ రేయి... ఘడియైనా గడిపేది
ఎలా... ఎలా... ఎలా ఎలా ఎలా

గాలివాన వడి తెలుసు... కన్నెపిల్ల వేడి తెలుసు
ఇద్దరమూ ఒకటైతే... ఏమౌతుందో తెలుసు 
వెరపైనా లేకుండా... పడుచుదనం త్వరపడితే
ఎలా... అబ్భ.. ఎలా...  ఎలా ఎలా ఎలా ఎలా ఎలా

చలిచలిగా ఉందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
గిలిగిలి పెడుతోందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా  

చరణం 2 :

తనువు తడిసిపోతుంటే... తపన పెరిగిపోతుంటే
ఉరుములతో మెరుపులతో... ఉలికి ఉలికిపడుతుంటే
నేనేమో రమ్మంటే... నీవేమో రాకుంటే
ఎలా... ఎలా... ఎలా ఎలా ఎలా

పైట చెంగు పైకెగసి... పైన పైనపడుతున్నా
కురులలోన ముత్యాలు... మరి మరి ఊరిస్తున్నా
మాటలతో కవ్విస్తూ... చూపులతో వారిస్తే
ఎలా... ఎలా... అబ్భ.. ఎలా ఎలా ఎలా... 

చలిచలిగా ఉందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
గిలిగిలి పెడుతోందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా  

చలిచలిగా ఉందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా
గిలిగిలి పెడుతోందిరా... ఓయ్ రామా... ఓయ్ రామా

************** ****************** ********************
చిత్రం :  మా ఇద్దరి కథ (1977)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  సుశీల

పల్లవి:

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..
నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..
మురళిని కాలేను.. పింఛమైనా కాను..
మురళిని కాలేను.. పింఛమైనా కాను..
ఎవరని చెప్పాలీ.. నేనూ.. ఏమని చెప్పాలీ నేనూ..
ఆ..ఆ..ఆ..ఆ.. 

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..

చరణం 1:

వలచిన రాధమ్మనూ..ఊ..ఊ.... విరహాన దించావు..
పెంచినమ్మ యశోధనూ..ఊ..ఊ...ఊ... మోసాన ముంచావూ...

నీవు నేర్చినదొకటే.... నిను వలపించుకోవటం..
నాకు తెలియినదొకటే... నా మనసు దాచుకోవటం..
ఏమని చెప్పాలీ నేనూ..ఎవరని చెప్పాలీ..నేనూ..
ఆ..ఆ..ఆ..ఆ..

నల్లనయ్యా...ఆ..ఆ..ఆ.. ఎవరని అడిగావా నన్నూ..

చరణం 2:

వెన్నైనా మన్నయినా...ఆ..ఆ..ఆ..ఆ.. ఒక్కటే అన్నావూ
దొంగవయినా గానీ...ఈ..ఈ..ఈ... దొరవయీ నిలిచావూ..
ఎంతా మరవాలన్నా... మనసును వీడిపోననంటావు..
ఎంతా కలవరించిన.. కంటికి కానరాకున్నావు..
ఏమని చెప్పాలీ నేనూ... ఎవరనీ చెప్పాలీ నేనూ..
ఆ..ఆ..ఆ...ఆ.. 