Showing posts with label పెళ్ళినాటి ప్రమాణాలు (1959). Show all posts
Showing posts with label పెళ్ళినాటి ప్రమాణాలు (1959). Show all posts

పెళ్ళినాటి ప్రమాణాలు (1959)

వెన్నెలలోనే వేడి ఏలనో

చిత్రం  :  పెళ్ళినాటి ప్రమాణాలు (1959)
సంగీతం  :  ఘంటసాల
నేపధ్య గానం  :  ఘంటసాల, పి. లీల

పల్లవి:

వెన్నెలలోనే వేడి ఏలనో....వేడిమిలోనే చల్లనేలనో...
ఏమాయె ఏమో జాబిలి ...ఈ మాయ ఏమో జాబిలి

వెన్నెలలోనే విరహమేలనో... విరహములోనే హాయి ఏలనో...
ఏమాయె ఏమో జాబిలి... ఈ మాయ ఏమో జాబిలి

చరణం 1:

మొన్నటి కన్నా నిన్న వింతగ... నిన్నటి కన్నా నేడు వింతగ
ఓ..ఓహొ..ఓ..ఓహొ...
మొన్నటి కన్నా నిన్న వింతగ... నిన్నటి కన్నా నేడు వింతగ
నీ సొగసూ నీ వగలూ... హాయిహాయిగా వెలసేనే

వెన్నెలలోనే వేడి ఏలనో....వేడిమిలోనే చల్లనేలనో...
ఏమాయె ఏమో జాబిలి ...ఈ మాయ ఏమో జాబిలి

చరణం 2:

రూపము కన్నా చూపు చల్లగా... చూపుల కన్నా చెలిమి కొల్లగా...
ఓహొ..ఓ..ఓహొ..ఓ..
రూపము కన్నా చూపు చల్లగా... చూపుల కన్నా చెలిమి కొల్లగా..
నీ కళలూ.. నీ హొయలు... చల్లచల్లగా విరిసేనే

వెన్నెలలోనే హాయి ఏలనో...వెన్నెలలోనే విరహమేలనో..
ఏమాయె ఏమో జాబిలి... ఈ మాయ ఏమో జాబిలి