ఉపసంహారం
గోపీచంద్ చెప్పిన కథ
ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి-
నేననుకున్న దానికన్నా కొన్ని పన్లు సులభంగా జరుగుతున్నాయి. ప్రబంధ్ కి తరళగారు వ్రాసిన ఉత్తరం నా సంతోషాన్ని ద్విగుణీకృతం చేసింది. వరంగల్ కి చాలా దూరంగా అడవిలో వున్నది మా ఫ్యాక్టరీ. అక్కడికి పోస్టల్ సర్వీసు లేదు. అందువల్ల మా వాళ్ళు కమలాపురం పోస్టాఫీసులోనే మా పోస్ట్ అంతా కలెక్ట్ చేసుకువెళ్తారు. అందులో దొరికింది తల్లి కొడుక్కి రాసిన ఉత్తరం.
"ప్రబంధ్-
ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేదు. కొన్ని కొన్ని విషయాలు తెలిసి నా మనసు పూర్తిగా పాడైపోయింది. ఏ తల్లీ కొడుక్కి తండ్రి గురించి చెప్పటానికి ఇష్టపడదు. కానీ ఈ పరిస్థితుల్లో నీకు తప్ప ఇంకెవరికి చెప్పుకోను?
మీ నాన్న గారికి విజయనగరంలో మరొక భార్య వుంది. ఏమిటి-ఆశ్చర్యపోతున్నావా? ఈ వార్త తెలిసినప్పుడు నేనూ నమ్మలేదు. కానీ స్వయంగా ఒక కుర్రవాడు, తన తండ్రికోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడూ-ఆ కుర్రవాడికి మీ నాన్నగారి పోలికలు అచ్చుగుద్దినట్టు ఉన్నప్పుడు ఆ సత్యాన్ని నేను కూడా జీర్ణించుకోక తప్పలేదు.
ఇదంతా అబద్దమనీ, నేనే ఏమేమో ఊహించుకుని భయపడుతున్నాననీ నువ్వు అనుకోవద్దు. ఈ తరళ జీవితంలో దేనికీ భయపడదని నీకు తెలుసు.
అలాగే నాకు తెలిసిన ఈ వార్తయొక్క సత్యాసత్యాల పట్ల కూడా నాకేమీ అపనమ్మకం లేదు. నేను పూర్తిగా దీని యొక్క వాస్తవాన్ని తెలుసుకున్న తరువాతే నీకు చెపుతున్నాను.
కొద్దిరోజుల్లో వివాహం చేసుకోబోతున్న నీకు ఈ విషయాలన్నీ తెలియబర్చి నీ మనసు పాడుచెయ్యటం ఇష్టంలేదు. కానీ అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మంచిది కదా. మేము విడిపోతున్న సంగతి నీకు ముందుగా తెలిస్తే మానసికంగా సిద్దపడి వుంటావు కేవలం నీ వివాహం గురించే నేను దాన్ని వాయిదా వేస్తున్నాను.
నీ తల్లి చేస్తున్న పని నీకు మూర్ఖంగా కనిపిస్తూ వుండి వుండవచ్చు. కానీ నాకు కొన్ని బలమైన అభిప్రాయాలున్నాయి. మొగవాడు చేసిన అన్యాయానికి ఏ విధంగానూ లొంగివుండటం నాకు ఇష్టంలేదు. అందులోనూ మీ తండ్రి గారి ఒక భార్య విదేశాల్నుంచి తిరిగివస్తూన్న సందర్భములో, మరొక భార్య విజయనగరంలో ఎదురుచూస్తున్న తరుణంలో ఇక ఈయనతో 'అన్నీ మర్చిపోయి' సంసారం చేయటం నా వల్లకాదు.
నేను నీ నుంచి ఆశించేదేమిటంటే, నువ్వెటువైపు వుంటావో తేల్చుకో నా వైపు ఉన్నట్టయితే నువ్వెలాగూ లా-స్టూడెంటువి కాబట్టి ఈ వ్యవహారాలన్నీ ఎలా సెటిల్ చెయ్యాలో నువ్వే బాధ్యత తీసుకోవాలి. ఈ విషయాలు తెలిసినప్పటినుంచీ ఆయనతో నేను మాట్లాడటం మానేశాను. ఒకవేళ నీవుగానీ నీ తండ్రినే సపోర్టు చేయాలని నిశ్చయించుకున్న పక్షంలో నీ చెల్లెళ్ళయిన నా కూతుళ్ళిద్దర్నీ తీసుకుని, వేరే లాయరు సాయంతో నేనీ వ్యవహారాలన్నీ తేల్చుకుంటాను. ఈ ఉత్తరం చూడగానే హడావుడిగా వచ్చి, నాకు నీతిపాఠాలు చెప్పే ప్రయత్నం ఏమీ చెయ్యకు. నీ తల్లిగురించి నీకు బాగా తెలుసు కదా-ఒక కాలు విరిచేసేసైనా సరే- పట్టుకున్న కుందేటికి మూడేకాళ్ళు అనే రకం.
నీ పెళ్ళి మూడు రోజులనగా వచ్చెయ్యి ఇక్కడ ఈ విషయాలేమీ బయటపడకు. ప్రపంచానికి తరువాతెలాగూ తెలియక తప్పదు. ఈ పెళ్ళి మాత్రం జరిగిపోనీ, ముఖ్యంగా నేన్నీకు చెప్పేదేమిటంటే, ఏదో ఘోరం జరిగిందనీ, తల్లికి అన్యాయమైందనీ కలత పడకు. తరతరాల్నుంచీ స్త్రీకి ఇలాంటి అన్యాయాలు ఎన్నో జరుగుతూనే వున్నాయి. ఈ విషయములో ప్రత్యేకత ఏమిటంటే స్త్రీ తనేమిటో భర్తకి చెప్పదల్చుకుంది. జీవితాంతం గుర్తుండేలా గుణపాఠం నేర్పాలనుకుంది. ఆనందరావు మైనస్ తరళ ఇండస్ట్రీస్ ఆయన్నెక్కడ నిలబెడుతుందో నీకూ తెలుసుకదా. ఆ జాలితో నువ్వు ఆయన్ని వెనకేసుకు రాదల్చుకుంటే నా కభ్యంతరంలేదు. నీ నిర్ణయాన్ని తిరుగుటపాలో వెయ్యి.
-నీ తల్లి తరళ".
ఉత్తరం పూర్తి చేసిన నా పెదాల మీద చిరునవ్వు కదలాడింది. నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలే వచ్చినాయ్. పాపం ఆనందరావు.
ఇక్కడితో ఇది ఆగదు.
ఇంకా..ఇంకా మానసిక వ్యధ అనుభవించాలి పాతిక సంవత్సరాల క్రితం నా తల్లికి చేసిన మోసానికి మిగతా జీవితం అంతా కుళ్ళి కుళ్ళి చావాలి.
ప్రబంధ్ పెళ్ళికి ముందురోజు ఈ నాటకానికి చివరి తెర దింపటానికి నిశ్చయించుకున్నాను.
ఈ ఉత్తరం నాకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని కాగ్రట్టగా వుంచాను.
మరో నాలుగు రోజులు గడిచాయి. నేను అనుకున్నట్టే పెళ్ళి నిమిత్తమై ప్రబంధ్ దగ్గిర్నుంచి వారంరోజులు శలవు కావాలని అప్లికేషన్ వచ్చింది. శాంక్షను చేశాను.
అతను శుభలేఖ ఇవ్వటానికి వచ్చాడు. కాంగ్రాచ్యులేషన్ చెప్పాను.
"మీరు తప్పకుండా రావాలిసార్" అన్నాడు.
"వస్తాను" అన్నాను. "రాకుండా ఎలా వుండగలను" అని మనసులో అనుకున్నాను మొత్తం వ్యవహారం అంతా సెటిల్ అయ్యేది అప్పుడే.
నేనూ ప్రబంధ్ మాట్లాడుతూ వుండగా మా ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వచ్చింది. అట్నుంచి మా మేనేజర్ మాట్లాడుతున్నాడు.
"రాత్రి మన ఫ్యాక్టరీ ఆఫీసులో దొంగతనం జరిగింది సార్. పాతికవేలు పోయింది" అన్నాడు.
"నిజమా?" అన్నాను కంఠంలో ఆతృత ధ్వనింపజేస్తూ "...రిపోర్ట్ ఇచ్చావా?"
"ఇచ్చాను సార్".

"ప్రబంధ్ ఇక్కడే వున్నాడు. తన దగ్గిర కూడా ఒక స్టేట్ మెంట్ తీసుకుంటాను" అని ఫోన్ పెట్టేశాను.
విషయమంతా విన్న ప్రబంధ్ మొహం వాడిపోయింది. "నేను శలవులో వస్తున్నప్పుడు తాళాలు మేనేజర్ కి ఇచ్చాను. అప్పుడు డబ్బు సరీగ్గానే వుంది" అన్నాడు.
"రాత్రి జరిగిన దొంగతనానికి నువ్వేం చేస్తావు? జరిగింది జైర్గినట్టు ఉత్తరం వ్రాసివ్వు, ఇన్ స్పెక్టర్ వస్తే ఇస్తాను. పెళ్ళి హడావుడిలో వున్న నీకు ఈ గొడవలన్నీ దేనికీ?" అని అతడి దగ్గిర స్టేట్ మెంట్ తీసుకున్నాను. ప్రబంధ్ మొహంలో కళ తప్పింది.
"నువ్వేం వర్రీ అవకు. పాతికవేలు మనకో లెక్కలోది కాదు" అని అతడిని సాగనంపాను.
అతడు వెళ్ళిపోయాక తిరిగి వరంగల్ ఫోన్ చేశాను.

"ప్రబంధ్ క్వార్టర్స్ తాలూకా తాళాలు డూప్లికేటు మన దగ్గిరే వున్నాయిగా?"
"ఉన్నాయండి".
"సరే నేను చెప్పినట్టే చేయండి" ఫోన్ పెట్టేశాను.
మేనేజర్ నమ్మకమైనవాడు. నా దగ్గిర పది సంవత్సరాల్నుంచీ పని చేస్తున్నాడు.
ఆ విధంగా ప్రబంధ్ పూర్తిగా వలలో ఇరుక్కుపోయాడు.
అతడిమీద నాకే విధమైన శతృత్వమూ లేదు. అతడిని పూర్తిగా ఇరికించాలని కూడా లేదు. నాక్కావల్సిందల్లా ఆనందరావ్ మీద ప్రతీకారం తీర్చుకోవటమే.
ప్రబంధ్ పెళ్ళికి ఇంకొక్క రోజువుంది.
అతడి తల్లి, తను వ్రాసిన ఉత్తరం గురించి అడిగి వుంటుంది. అందలేదని వుంటాడు. అందులోని విషయాల గురించి చెపుతుందా? పెళ్ళి గడావుడిలో ఎందుకు అని ఊరుకుని వుంటుందా? అక్కడ తల్లి-తండ్రి-కొడుకుల మధ్య ఏ విధమైన డ్రామా జరుగుతూ వుందో చూడాలన్న నా కోర్కెని బలవంతంగా ఆపుచేసుకున్నాను.
మరుసటిరోజు పెళ్ళి!
ఆ రాత్రి చాలా సేపటి వరకూ నిద్రపోలేదు.
రేపు నేను చేయబోయే వ్యవహారం బాంబులా పేలుస్తుందని నాకు తెలుసు. దాని గురించి కాదు నేను ఆలోచిస్తున్నది.
అమ్మ గురించి!
తనని మోసం చేసిన వారి గురించి నాకు పూర్తిగా తెలిసి పోయిందనీ, ఎవరి రక్తం పంచుకుని నేను పుట్టానో ఆ వ్యక్తిమీద పూర్తిగా కక్ష తీర్చుకున్నాననీ అమ్మకు చెప్పాలా?
ఇప్పుడే చెప్పకూడదు.
తరళ లాటిది కాదు అమ్మ, ఎంత తప్పు చేసిన వాడినైనా క్షమిస్తూంది. అందుకే ఈ విషయం పూర్తయ్యేవరకూ ఆమెకు తెలియనివ్వకూడదు.
ఇదంతా నాకేం తెలియదని ఆనందరావు బుకాయిస్తాడా? బహుశా అలాచెయ్యకపోవచ్చు. మా ఇద్దర్నీ పక్క పక్కన చూసిన వారెవరూ అతడి మాటలు నమ్మరు. అందరి దాకాఎందుకు? అతడి భార్య నా తరపున సాక్ష్యం పలుకుతుంది.
ఆమె మీదే నా నమ్మకం అంతా! ఈ నాటకానికి చరమగీతం ఆవిడే పాడబోతూంది. కొడుకు పెళ్ళికోసం ప్రాణాలు ఉగ్గబెట్టుకుని వుంది. ఇప్పుడు నిండు పందిరిలో నేను దాన్ని పాడుచెయ్యగానే మొత్తం ఆవిడ కోపమంతా ఆనందరావు మీదకు తిరుగుతుంది. నా ఉద్దేశ్యం ప్రకారం ఈ విషయాన్నీ అప్పుడే వెల్లడి చేస్తుంది.
అంతకన్నా నాకు కావల్సింది ఏముంది?
నిండు పందిరిలో, అందరి బంధువుల మధ్యా భార్యచేత నిలదీయబడటం..అందులోనూ యాభై సంవత్సరాలున్న మొగాడు... అంతకన్నా నరకం ఇంకేం కావాలి?
మరుసటిరోజు-ఇనూ రెండు గంటల్లో పెళ్ళి అనగా- ఫోన్ చేశాను. "హల్లో - ఎవరు మాట్లాడుతున్నాది?" అని అడిగాను.
"ఆనందరావు హియర్ మీరెవరు?"
సన్నగా నవ్వేను.. "నేనూ....ప్రమద్వర కొడుకుని" అన్నాను. చాలా స్ఫుటంగా....స్పష్టంగా అటు వ్యక్తి ముందుకు తూలాడా? రిసీవర్ వణికిందా? ఏమో... నాకు తెలీదు. ఆత్రంగా కంఠం మాత్రం వినిపించింది- "ఎవరూ?" అని.

"పాతిక సంవత్సరాల క్రితం.... ప్రమద్వర గుర్తుందా? ఆమె కొడుకుని-"
"గోపీచంద్?"
"అవును గోపీచంద్ నే".
"గోపీచంద్?"
"అవును గోపీచంద్ నే".
"ఎక్కడున్నావ్? ఎక్కడున్నావ్ గోపీచంద్ నువ్వు?"
నవ్వేను, "...ఎందుకంత ఆత్రం? ఇంకో గంటలో రాబోతున్నాను పోలీస్ ఇన్ స్పెక్టరుతో సహా".
"ఇన్ స్పెక్టరా?"
"అవును నీ కొడుకు ప్రబంధ్ పనిచేసే ఫ్యాక్టరీలో దొంగతనం జరిగింది. ఈరోజే అతడి క్వార్టర్స్ లో పోయిన డబ్బు కొంత దొరికింది. అరెస్టు వారెంటు తీసుకుని ఇన్ స్పెక్టరుతో సహా నేను రాబోతున్నాను-ఆనందరావ్!! పెళ్ళికొచ్చిన వాళ్ళతో కబుర్లు చెపుతావో, లేక ఈ గంటలోనూ బెయిల్ కోసం ప్రయత్నిస్తావో నీ ఇష్టం".
"గోపీచంద్ నేను నిన్ను వెంటనే కలుసుకోవాలి".
"వెంటనే కాదు. ఇంకొక గంటా ఆగాలి. పెళ్ళి పందిరిలో మరో క్లైమాక్సు జరగాబోతూంది. దానికి కూడా సిద్దంగా ఉండు. నన్ను చూడగానే మీ ఆవిడ ఉవ్వెత్తున ఎగిరిపడుతుంది. కొద్దిరోజుల క్రితం నేను ఆడిన నాటకం తాలూకు ప్రభావం ఆవిడ మనసులో అగ్నిపర్వ్తతంలా కుతకుతా ఉడుకుతోంది. నన్ను చూడగానే అది లావాలా పొంగి నిన్ను దహించివేస్తుంది. నీ సంసారం విచ్చిన్నం కాబోతూంది. నీ బంధుమిత్రుల సమక్షంలో- నిండు పందిట్లో-"
"కానీ"
"ఆగు! నన్ను చెప్పనీ నేను చెప్పవలసింది ఇంకా పూర్తికాలేదు ఇదంతా నేనెందుకు చేస్తున్నానో నీకు తెలిసే వుంటుంది. నీ చేతుల్లో మోసపోయిన నా తల్లి ఇంకో దగుల్భాజీకి భార్య అయి, నీ కొడుక్కు తల్లై జీవితాంతం నరకం అనుభవించింది. నా తల్లిని మోసం చేసిన నువ్వు మాత్రం హాయిగా భార్యాబిడ్డల్తో కులుకుతున్నావు. ఈ రోజునుంచీ నీకు నరకం ప్రారంభం కాబోతూంది. దాని కిది మొదటిమెట్టు మాత్రమే".
"గోపీచంద్ ప్లీజ్... నా మాట కాస్త విను".
"ఏం వినాలి? ఏం చెపుతావు నువ్వు? చెప్పటానికి ఏముంది నీ దగ్గర? నేను నీకు పుట్టిన కొడుకుని కాదంటావా? దానికి పరీక్షలు కూడా అవసరం లేదు. మనిద్దర్నీ పక్కపక్కన నిలబడితే చాలు. నీలాంటి వాళ్ళుంటారనీ, రక్తపరీక్షలకీ రకరకాల ఋజువులకీ వాళ్ళు లొంగరనీ తెలిసే దేముడు జెనిటిక్స్ అనేదాన్ని సృష్టించాడు. నువ్వు వెయ్యి గొంతుకల్తో కాదన్నా నేను నీ కొడుకునన్న సత్యాన్ని ఎవరూ కాదనలేరు".
"నువ్వు నా కొడుకువే గోపీచంద్. నేను కాదనటం లేదు" అట్నుంచి అర్ధింపుగా వినబడింది. అంత సులభంగా అతడు వప్పుకుంటాడని నేను అనుకోలేదు. మళ్ళీ ప్లేటు మార్చటానికి ఏదైనా ఎత్తువేస్తున్నాడేమో అనుకున్నాను. ఆ మాటే అన్నాను.
"సో... దారికొచ్చావన్నమాట ఇప్పుడింకేం చెపుతావు? నీ తప్పేంలేదనీ, విధివశాత్తు నా తల్లికి దూరమయి, ఆమెని మరచిపోవటానికి ఇంకో వివహం చేసుకొన్నాననీ, చెప్పబోతున్నావ్ కదూ సరే- అవన్నీ ఇంకొంచం సేపట్లో అందరిముందూ చెపుదూగాని నిజానికి ఇప్పుడు నేను నీకు ఫోన్ చెయ్యనవసరంలేదు. అయితే ఈ గంటసేపూ నువ్వు మధనపడి చావాలి. ఏం చెయ్యాలా అని తలబ్రద్దలు కొట్టుకోవాలి. ఇలాటి ఆటలంటే నాకు చాలా ఇష్టం. అందుకే శ్రీదేవి ఉరఫ్ దేవిక పేరు మీద నాటకం ఆడించి నీ భార్య మనసు వికలం చేశాను. ఇప్పుడు కొడుకు అరెస్ట్ తో ఆమెకోపం కట్టలు తెంచుకుంటుంది. అది వరదలా నిన్ను ముంచెత్తుతుంది. నలుగురి మధ్యా అలాంటి నాటకీయమైన మలుపు కోసమే నేను ఇంత కష్టపడవలసి వచ్చింది. అనవసరంగా నీ కొడుకైన ప్రబంధ్ ని తాత్కాలికంగా ఇందులో ఇరికించవలసి వచ్చింది".

"ప్రబంధ్ నా కొడుకు కాదు గోపీచంద్".
అట్నుంచి వచ్చిన ఈ నాలుగు మాటలు నన్ను ఒక్కసారిగా కుదించివేశాయి. అప్పటివరకూ శిఖరంమీద కూర్చుని మాట్లాడుతున్నవాడు అకస్మాత్తుగా శిఖరం కూలిపోవటాన్ని గమనించినట్టు అయింది. కానీ వెంటనే సర్దుకుని నవ్వేను.
"మళ్ళీ ఏదైనా కొత్త ఎత్తు వేస్తున్నావా?"
"లేదు గోపీచంద్ ఇది నిజం. కానీ బహుశా నేను దీన్ని నిరూపించలేకపోవచ్చు. దానికోసం నా దగ్గరున్న సాక్ష్యాధారాల్ని నువ్వు నమ్మకపోవచ్చు కూడా నేను చెప్పేదంతా నిజమని నిరూపించగలిగే ఒకే ఒక సాక్ష్యం ఇప్పుడీ లోకంలో లేదు. అందుకని నా చేతి వ్రాతని కూడా నువ్వు నమ్మవు".
"అప్పుడున్నదీ-ఇప్పుడు లేనిదీ-ఏమిటా సాక్ష్యాధారం?"
"ప్రమద్వర".

"వ్వాట్"
"అవును ప్రమద్వర ఒక్కతే నేను చెప్పేదాన్ని సమర్ధించగలిగేది".
నేను శ్రీదేవి చేత అతడికి చెప్పించింది గుర్తొచ్చింది. తన తల్లి మరణించినట్టూ, ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లోనూ, హోటల్ లోనూ ఇతడికి చెప్పింది. దాని ఆధారంగా ఇతడు మరో నాటకం ఆడుతున్నాడేమో అనిపించింది. అతడిమీద మరింత అసహ్యం పెరిగింది. ఇంకొంచెం ఆట పట్టించాలనిపించింది.
"కానీ నా తల్లి మరణించే ముందు నాకంతా చెప్పింది ఆనందరావ్".
"ఏం చెప్పింది?"
"నువ్వు చేసిన మోసం"
"అబద్దం ప్రమద్వర అలా ఎన్నటికీ చెప్పదు".
"వెళ్ళి అడుగుదామా?"
"ఎక్కడికి?"
"ఇక్కడికే... నా తల్లి బ్రతికే వుంది" కామ్ గా అన్నాను.
"ప్ర..మ...ద్వ...ర.... బ్రతికేవుందా?"
"ఏం? గుటక పడటం లేదా? కథ అడ్డం తిరిగిందని బాధపడుతున్నావా?"
"నేను ప్రమద్వరని వెంటనే చూడాలి".
"ఇంకో గంటలో జరగబోయే నాటకానికి ఆమెని తీసుకురాను. ప్రజల సానుభూతి ఆమెకి అవసరం లేదు".
"నేను ఆమెని వెంటనే చూడాలి". కంఠంలో ఆతృత, అభ్యర్ధన, కంగారు తొంగిచూస్తూ ఉండగా అతడు అన్నాడు.
"లాభంలేదు.." ఖచ్చితంగా అన్నాను. "ఏం మాయమాటలు చెప్పి ఆమెని మోసగించావో, అవే మాయమాటలు చెప్పి, ఇప్పుడు ఆమె దగ్గర ప్రాధేయపడతావు. కావలసివస్తే- ఇక ఎటూ దారిలేక నీ పరువు ప్రతిష్ట పోకుండా చూడమని ఆమె కాళ్ళు పట్టుకుంటావు. స్త్రీకి పుట్టుకతోనే జాలి గుణాన్ని ఇచ్చాడు దేముడు నీ స్థితికి జాలిపడి నా పుట్టుకకి కారణం నువ్వు కాదని చెప్పినా చెప్పగలదు నా తల్లి! నిన్ను అంత సులభంగా తప్పించుకు పోనివ్వను..."
"మూర్ఖుడా! అసలేం జరిగిందో నువ్వు నీ తల్లిని ఎప్పుడైనా అడిగావా?" అతడి స్వరంలో మొదటిసారి కోపం, చిరాకు కనపడ్డాయి. ఈసారి తగ్గటం నా వంతయింది.
"ఏం అడగాలి?"
"వెళ్ళు, ముందు ఆ మాట అడుగు అసలు విషయం తెలుసుకోకుండా నీ అంతట నువ్వే ఊహించుకుని ఒక పెళ్ళి నాశనం అవకుండా ఆపు".
"నా తల్లిని అడగవలసిన అవసరం నాకులేదు. నేను నీ కొడుకుని కాదని ఆమెకాదు గదా- బ్రహ్మరుద్రాదులు దిగివచ్చినా నేను నమ్మను".
"నువ్వు నా కొడుకువి కాదని నేను అనటం లేదు".
"మరి?"
"నువ్వు ప్రమద్వర కొడుకువి కాదంటున్నాను".
పిడుగుపడినట్టు అయింది. ఈ లోపులో-టెలిఫోన్ ఏదైనా అంతరాయం వచ్చిందో, లేక అతడేం చేశాడో తెలీదుకానీ- ఫోన్ కట్ అయింది.
తిరిగి డయిల్ చేసే ప్రయత్నమేమీ చెయ్యలేదు. అలాగే అచేతనంగా చాలాసేపు కూర్చుండిపోయాను.
నా మెదడులో గోదారి హోరుమంటున్నట్టుంది. అతడి మాటలే గింగుర్లు తిరగసాగాయి. అతడు చెప్పింది ఎంతవరకూ నిజమో నాకు తెలీదు. కానీ మాటల ప్రభావం మాత్రం నామీద ఎంతో కనిపించింది. యుద్దంలో సైనికుడు వీరవిహారం చేస్తూ ముందుకు పోతుంటే, వెనుక రాజు మరణించినట్టు తెలిసిన వార్త అతఃదిని ఎంత నిశ్చేష్టుడిని చేస్తుందో, నా పని అలా తయారైంది. అతడి మాటలు నిజమైతే ఇప్పటివరకూ పన్నిన వ్యూహమంతా ఎంత నిరర్ధకమో అర్ధమై నిస్సత్తువ ఆవరించింది. ఆనందరావు మీద పగకాదు యిప్పుడు నన్ను వేధిస్తున్నది ఇన్నాళ్ళూ నన్ను పెంచింది కన్నతల్లి కాదన్న వార్త నా మనసులోని ఏ మూలో రవంత ఆశ మిగిలి వుంది.
ఆనందరావు చెప్పింది తప్పుకావచ్చు.
అవును. అతడు ఎంతకయినా తెగించినవాడు. మరో కొత్త నాటకం ఆడుతూ వుండవచ్చు.
ఫోన్ వైపే చూస్తూండిపోయాను. తిరిగి అతడికి ఫోన్ చేయబుద్ది కాలేదు. భయమా? ఏమో..... అటువంటిదే అయివుండవచ్చు. అతని తరపునుంచి ఏ రుజువుని చూడాల్సి వస్తుందో, ఏ వార్త వినవలసి వస్తుందో....
నేనీ ఆలోచనలో వుండగా తలుపు చప్పుడయింది. ఆత్రంగా తోసుకు వచ్చిన మనిషి- ఆనందరావు.
వెనకే వచ్చిన సెక్రటరీ క్షమించమన్నట్టు చూశాడు. అనుమతి లేకుండా విజిటర్ లోపలికి తోసుకు వచ్చినందుకు.
అతడిని వెళ్ళిపొమ్మన్నట్టు సైగ చేశాను.
నేను ఎక్కడ వున్నదీ ఆనందరావుకి ఎలా తెలిసిందాని ఓ క్షణం ఆశ్చర్యపోయాను. బహుశా ప్రబంధ్ ని కనుక్కుని ఉంటాడు.
సెక్రటరీ బయటికి వెళ్ళిపోగానే అతడు నా చేతులు పట్టుకుని 'గోపీ' అన్నాడు. అతడి కంఠంలో నేను గుర్తించటం ఇష్టంలేని ఆప్యాయత, ఆతృత, అదోలాంటి సంచలనం తొంగిచూశాయి.
"నీకు "గోపీచంద్" అని పేరుపెట్టి ప్రమద్వర తన మాట నిలబెట్టుకున్న దన్నమాట".
"పెళ్ళి జరుగుతూ వుందా అక్కడ?" అతడి మాటలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా అన్నాను.
"జరుగుతూంది. మిమ్మల్ని తీసుకువెళ్దామనే వచ్చాను".
"ఎందుకు? గ్రూఫ్ ఫొటోకా?" వెటకారంగా అడిగాను.
"నీ మాటలన్నీ తరువాత వింటాను. ముందు ప్రమద్వర ఎక్కడుందో చెప్పు".
"సారీ చెప్పను ముందు నీ వైపునుంచి నువ్వు చెప్పవలసిందేమిటో చెప్పు. ఫోన్ లో నువ్వు అన్నది ఎంతవరకూ నిజం?"
"అక్షరాల నిజం గోపీ ఈ విషయాలన్నీ తరువాత మాట్లాడుకుందాం. ముందు ప్రమద్వరని అర్జెంటుగా ఈ పెళ్ళికి తీసుకు వెళ్ళాలి".
"తను రాకపోతే పెళ్ళి ఆగిపోదు-"

"వివరాలూ, వాదనలూ తరువాత గోపీ... ముందు అమ్మ ఎక్కడుందో చెప్పు నువ్వేమీ చెయ్యనవసరం లేదు. తనకి నేనొచ్చినట్టు చెప్పు చాలు...."
"దానికి సమాధానం నేను ఫోన్ లోనే చెప్పినట్టు గుర్తు. ఒక్కసారి అమ నీకు కనబడిందంటే నీ మాటల మాయాజలంతో మోసం చేస్తావు. పాతిక సంవత్సరాల క్రితం ఇదే మాటల్తో ఆమెని వంచించావు. ఇప్పుడు క్షమాపణ కోరతావు. సారీ".
"కానీ ప్రబంధ్ పెళ్ళి ఆమె చూడకుండా అడ్డుపడింది నువ్వేనని తెలుస్తే ఆమె ఇక జీవితంలో నిన్ను క్షమించదు".
"ఎందుకో-"
"ప్రబంధ్ ఆమె కొడుకు కాబట్టి".

కుర్చీ వెనక్కి విసురుగా తోసి లేస్తూ "ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది?" అని అరిచాను. అతడు లేవలేదు. ఈసారి అతడు డామినేట్ చేస్తున్నట్టు అనిపించింది. తాపీగా అన్నాడు-
"నేను చెపుతున్న వాటిలో ఏదీ అబద్దం కాదు గోపీచంద్".
"నువ్వు చెపుతున్న వాటికి సాక్ష్యముందా?"
"చెప్పానుగా ప్రమద్వరే సాక్షి! నువ్వు చెల్లెలుగా పంపిన అమ్మాయి తన తల్లి చచ్చిపోయిందని చెప్పిన రోజు నాకు నిద్రలేదు. ప్రమద్వర మరణించిందే అన్న బాధ ఒకవైపు, నా కొడుకు ఏమైపోయాడో అన్న దిగులు మరొకవైపు- అంత బాధ పరాయి వాడికి కూడా వద్దు. నామీద పగతో ఇదంతా నువ్వు తెరవెనుక వుండి చేస్తున్నావన్న సంగతి నాకు తెలీదు. తెలిసివుంటే ఆ రోజే అసలు జరిగిందేమిటో నీ తల్లి ద్వారా నిన్ను కనుక్కోమని వుండే వాణ్ణి". నేనొక నిర్ణయానికి వచ్చినట్టు "సరే- అసలు జరిగిందేమిటో నేను అమ్మ ద్వారానే కనుక్కుంటాను, నువ్వు వెళ్ళు" అన్నాను.
"కానీ అక్కడ పెళ్ళి-"
"జరగనీ.... మా కోసం అది ఆగనవసరంలేదు".
"కానీ ఆమె ఈ పెళ్ళి చూడనందుకు జీవితాంతం బాధపడుతుంది".
"దానికి నేనేం చెయ్యలేను. పైగా నువ్వు చెపుతున్నదంతా నిజమని నాకు నమ్మకం కలగటంలేదు కూడా అన్నిటికన్నా ముఖ్యంగా నా తల్లి ఈ వూళ్ళోలేదు. నేనే వెళ్ళి అడగాలి. నీవు చెప్పినదంతా నిజమైతే అప్పుడు తీసుకువస్తాలే..." తేలిగ్గా అన్నాను.
అతడు కుర్చీలోంచి లేచి, "పద వెళ్దాం" అన్నాడు.
"ఎక్కడికి-"
"మా ఇంటికి-"
"దేనికి-"
"నా దగ్గర ఒకే ఒక సాక్ష్యాధారం ఉంది. అది చూపిస్తాను. దాన్ని నువ్వు నమ్మితే ఆగమేఘాలమీద నీ తల్లిని ఈ పెళ్ళికి పిలిపిస్తావు లేదా, ఒక తల్లిని తన కొడుకు పెళ్ళి చూడనివ్వకుండా చేసిన పాపం నీకే దక్కుతుంది".
ఇందులో ఏదైనా మోసం ఉందేమోనని ఆలోచించాను. ఇతడు చెప్పినవన్నీ గానీ ఒకవేళ నిజమైతే-నేనూహించని మలుపులు ఎన్నో నా వెనుక జరిగాయన్నమాట. ఏమిటవి?
లేచి "పద" అన్నాను.
ఇద్దరం అతడి ఇంటికి వచ్చేం. ఇంటిముందు తోటలో పెద్ద పెద్ద గొడుగులు అమర్చి వున్నాయి. రిసెప్షను అక్కడే ఏర్పాటు చేశారనుకుంటా. జనంతో హడావుడిగా వుంది.
అతడు వెనుకవైపునుంచి నన్ను తీసుకువెళ్ళాడు. అతడి ఉద్దేశ్యం తన భార్య నన్ను చూడకూడదని కాబోలు.
ఇద్దరం మేడ ఎక్కి అతడి గదిలోకి వెళ్ళాం. క్రింద వున్న దానికి వ్యతిరేకంగా పైన దాదాపు నిర్మానుష్యంగా వుంది.
అతడు తలుపు గడియ వేశాడు.
బయటనుంచి మంగళవాద్యాలు వినిపిస్తున్నాయి.
అతడు బీరువా వద్దకు వెళ్ళి డాక్యుమెంట్లు దాచే అరలోంచి ఒక కాగితాన్ని తీశాడు. ఎన్నో సంవత్సరాల్నుంచీ అది ఆ చీకటి అరలో ఉన్నట్టు దాన్ని చూడగానే తోస్తూంది. అక్కడక్కడ చిరిగిపోయి, శిథిలావస్థలో వుంది. అతడు దాన్ని బహుశా లక్షసార్లు చదివి వుంటాడు.
దగ్గిరగా వచ్చి ఆ కాగితాన్ని నా కందించాడు.
ఏముందా కాగితంలో?
....చదవటం ప్రారంభించాను.
"...ప్రియమైన ఆనంద్..."
"ఏదో అనుమానం వచ్చి చప్పున చివరి సంతకం చూశాను. నా అనుమానం నిజమే! ఆ చేతివ్రాత నా తల్లిది.
ఉత్తరం కంటిన్యూ చేశాను.
ఆనందరావు దూరంగా నిలబడి, చేతులు వెనుకబల్లమీద ఆన్చి నావైపే కనార్పకుండా చూస్తున్నాడు. బహుశా నా మోహంలో మారే భావాల్ని గమనించటానికి కాబోలు.... ఆ గదిలో చీమచిటుక్కుమంటే వినపడేటంత నిశ్శబ్దం అలుముకుని వుంది. ఈ నిశ్శబ్దంలోంచి నా జీవితం తాలూకు ఒక ముఖ్యమైన రహస్యం నాకు బోధపడింది.
అంతర్లీనమైన ఉద్వేగం మనసు చెలియలికట్ట దాటగా తుఫానులో నవలా ఊగిపోయను. మనిషిని ప్రాకారాలతో ఆలింగనం చేసుకొనే సత్యం మనిషి హృదయంలో దేదీప్యమానంగా నిరంతరం ప్రజ్వలించే మంచితనం అనే వెలుగు నా కళ్ళని మిరుమిట్లు గొలిపేలా చేసింది. "అమ్మా-అమ్మా" అనుకున్నాను ఆవేశమూ-ఆవేదనా కలగాపులగామైన ఆవేశంతో అరుణాచలం కన్నా ఉన్నతంగా ఎదిగిపోయిన నా తల్లి వ్యక్తిత్వం నన్ను అభిషిక్తున్ని చేసింది తన ప్రేమా, ఆప్యాయతలతో.
గడ్డిపువ్వుకి కూడా తన వడిలో చోటిచ్చి తన దయాపూరిత కరుణని పంచిచ్చే పుడమితల్లి గుర్తొచ్చింది.
అతడు చెప్పటం ప్రారంభించాడు.
పాతిక సంవత్సరాల క్రితం తరళ అనే ఒక అమ్మాయి పట్టుదల వల్ల మరో అమ్మాయి తన ప్రేమని ఎలా వదిలేసుకోవలసి వచ్చిందో, తరళ తండ్రి చౌకబారు ఎత్తువల్ల ఆమె ఎలా ఒక దుర్మార్గుడికి భార్య అవ్వవలసి వచ్చిందో, ఆనందరావు అనే వ్యక్తి బలహీనత వల్ల అందర్నీ వదిలేసి ఎలా వెళ్ళిపోవలసి వచ్చిందో వివరంగా చెప్పాడు. నేను శిలాప్రతిమనై విన్నాను. అతడు ఒక్కొక్క వాస్తవం చెపుతూవుంటే నా మనసు మీద ఒక్కొక్క కొరడా దెబ్బ చెళ్ళుమన్నట్టు అనిపించింది. ఒక స్త్రీని ఇందరు అన్ని వైపుల చేరి బాధపెట్టారన్న వాస్తవం నన్ను బాధాతప్తున్ని చేసింది. భైరవమూర్తి చనిపోయాడు అన్నది ఈ కథకి క్లైమాక్స్ అతడి మరణం నా తల్లిని విధవరాలిని చేయదు, చేయలేదు. బ్రతికి ఉండగా ఏవిధంగా సుఖపెట్టని మొగవాడు, చనిపోతూ తన భార్య నుదుటి కుంకుమ తీసుకెళ్ళటానికి అనర్హుడు. అతడు చెప్పటం పూర్తవుతూండగా బయట్నుంచి తలుపు చప్పుడయింది.
ఇద్దరం ఉలిక్కిపడ్డాం.
"ఏం చేస్తున్నారండి లోపల?" అన్న పిలుపు వినిపించింది. అది తరళ కంఠం... "అక్కడ అందరూ మీ కోసం చూస్తున్నారు".

అతడు నన్ను దాచటానికి ప్రయత్నం చేశాడు. నేను అటువంటి ప్రయత్నానికి సహకరించక, స్వయంగా తలుపు తీశాను.
ఎదురుగా ఆమె నిలబడి వుంది.
ఇద్దరం ఒకర్నొకరు చూసుకున్నాం. ఆమె ఆ పరిస్థితుల్లో నన్ను అక్కడ చూసి భయంతోనో, కోపంతోనో అరుస్తుందనుకున్నాను. ఆమె అటువంటిదేమీ చేయలేదు. నిశ్చేష్టురాలై చూస్తూండిపోయింది. నేను నవ్వాను.
ఇన్ని సంవత్సరాల తరువాత కన్న తల్లిని చూడగా వచ్చిన ఆనందపు నవ్వు కాదది. విధి ఆడిన నాటకానికి ఎదురు నిల్చి నేను ఆడబోయే నాటకానికి తెరపడబోయేముందు ఆఖరి నవ్వు.
"మీరు నన్ను క్షమించాలి. కొన్ని రోజుల క్రితం ఒక అర్దరాత్రి మిమ్మల్ని అనవసరమైన అనుమానాల్తో భయపెట్టాను" అన్నాను. ఆమె ఇంకా అలాగే అయోమయంతో చూస్తోంది.

"మీ ఆయన నాకు అంకుల్ అవుతారు. అవే పోలికలు నా కొచ్చాయి. దాంతో చిన్న ప్రాక్టికల్ జోకు వేశాను. ఒక కుటుంబాన్ని మొత్తం అనుమానాల్తో ముంచెత్తవచ్చా లేదా అని నేనూ మాస్నేహితుడూ పందెం వేసుకున్నాం. మీరంతా దీనికి ఇంత టెన్షన్ అనుభవిస్తారని నేను అనుకోలేదు. మీ హజ్బెండ్ నాకు అంతా చెప్పారు. ఇన్నాళ్ళూ మిమ్మల్ని అనుమానంలో పెట్టినందుకు క్షమించండి" అన్నాను తొందర తొందరగా.
ఆమె తలెత్తి సూటిగా నా వైపు చూసింది.
నేను చెప్పిన ఈ కట్టుకథని ఆవిడ నమ్ముతుందా?
నేను తలతిప్పి నాతండ్రివైపు చూశాను. అప్పటికప్పుడు నేను కల్పించి చెప్పిన ఈ కథ అతడిని నిర్వీర్యున్ని చేసినట్టు ఆ ముఖ భంగిమే చెపుతూంది. అతడికీ నేను చెప్పిందేమీ బహుశా అర్ధమయి ఉండదు. అతడికి అర్ధం అవుతుందని కూడా నేను అనుకోలేదు. పరిస్థితుల్ని అలా అర్ధంచేసుకునే కెపాసిటీయేగానీ అతడికంటే నా తల్లి (క్షమించండి ప్రమద్వరని నా తల్లిగా సంబోధిస్తున్నందుకు)కి ఇన్ని కష్టాలు పడవలసిన అవసరం ఉండేది కాదు.
"అవన్నీ తరువాత మాట్లాడుకుందాం. ముందు క్రిందకి రండి, ముహూర్తం దగ్గిర పడుతూంది" అందామె. అంత తొందరగా ఆమె నా మాటల్ని యాక్సెప్ట్ చేయటం నాకు ఆశ్చర్యం అనిపించింది. మా ఇద్దర్నీ అలా ఆ సమయంలో చూసి చాలా గొడవ చేస్తూందనుకున్నాను. ముగ్గురం క్రిందికి వచ్చాం.
వధూవరులు పీటలమీద కూర్చుని ఉన్నారు.
వాళ్ళవైపు చూస్తూ ఆయన అన్నాడు- "మేము విడిపోయిన పాతిక సంవత్సరాల తరువాత ప్రమద్వర నన్ను కలుస్తానంది. అప్పుడే నిన్ను నాకు వప్పచెపుతానంది. అంతవరకూ ప్రబంధ్ కి పెళ్ళిచేసే హక్కు నాకు లేదు. కానీ ప్రబంధ్ ఈ లోపులోనే ప్రేమలో పడి- వివాహం చెయ్యకపోతే కష్టమయ్యే పరిస్థితి కల్గించాడు. నీకు అర్ధమైందనుకుంటాను".

తలూపాను.
"ఈ పెళ్ళి నిశ్చయమయ్యాక ప్రమద్వర కోసం చాలా వెతికించాను. కానీ తను కనపడలేదు. నేను ఈ వివాహాన్ని పోస్ట్ పోన్ చేయలేకపోయాను. నా నుంచి దూరమవుతూ తను కోరిన ఈ ఆఖరి కోరిక కూడా ఈ విధంగా తీర్చలేకపోయాను" బాధగా అన్నాడు.
నేను మాట్లాడలేదు నా ఆలోచనలు అసలు అక్కడ లేవు.
తరళని నేను తల్లిగా ఎంతవరకూ యాక్సెప్ట్ చేయగలనన్న చోటే ఆగిపోయాను. అంతలో అతను అన్నాడు- "నువ్వెందుకు అమ్మతో అలా చెప్పావు?" అమ్మ అంటే అతని ఉద్దేశ్యంలో తరళ.
నేను మాట్లాడలేదు.
నా మనసులో ఉవ్వెత్తున లేచిపడే తరంగాల్లాంటి ఆలోచన్లు.
నాదృష్టి దూరంగా పెళ్ళి వేదిక దగ్గర నిలబడివున్న ఆమెమీద పడింది. ఆమె వంగి, ప్రబంధ్ తో పురోహితుడు చెప్పిన పన్లు చేయిస్తోంది. అప్పుడప్పుడు మా ఇద్దరివైపూ చూస్తూంది. అయినా తల్లిని "ఆమె" అనే స్థాయినుంచి ఎదగటానికి నా మనస్సెందుకు వప్పుకోవటం లేదో నా కర్ధం కావటం లేదు. ఆయన ప్రక్కనుంచి అంటున్నాడు. "ఇదంతా నాకు నిన్నే తెలిసివుంటే, ఇద్దరం కలిసి ప్రమద్వరని తీసుకువచ్చేవాళ్ళం తన కొడుకు పెళ్ళి తను లేకుండా జరిపించినందుకు నన్ను క్షమించదు".
"ఇన్ని రకాలుగా, ఇన్ని సంవత్సరాలుగా క్షమిస్తూ వచ్చింది. ఈ ఆఖరి తప్పుని కూడా క్షమిస్తూందిలెండి" మనసులో అనుకున్నాను.
మంగళసూత్రధారణ జరుగుతోంది.
"మనం వెళ్దామా" ఆత్రంగా అడిగాడు ఆయన.
"ఎక్కడికి?" నిర్లిప్తంగా అడిగాను.
"ప్రమద్వరని తీసుకురావటానికి"
"ఎందుకు? పెళ్ళిపందిరి మైకులో అందరికీ ఈ కథంతా చెప్పటానికా?"
"గోపీ-"
"ఈ రహస్యం ఎంతమందికి తెలుసు?"
"నీతో కలసి, ఇప్పటికి మన ముగ్గురికీ-"
"ప్రబంధ్ కీ, తరళకీ- ఐమీన్ నా కన్నతల్లికి కూడా తెలుస్తే వాళ్ళెలా రియాక్ట్ అవుతారో మీకేమైనా ఆలోచన వుందా?"
"నువ్వేం మాట్లాడుతున్నావు?"
"ఉన్న వాస్తవాన్ని మాట్లాడుతున్నాను".
నేను చెపుతున్నదేమిటో అర్ధంకావటానికి అతడికి కొంచెం టైమ్ పట్టింది. నా వైపు అయోమయంగా చూశాడు.
"నేను ముందు మా వూరు వెళతాను. అమ్మకి జరిగినదంతా చెపుతాను. ఒక కోరిక కూడా కోరతాను.
"ఏమిటా కోరిక?" ఆయన మధ్యలో చప్పున అడిగాడు.
"చెప్పను" అన్నాను. "....ముందు అమ్మని అడుగుతాను. తను నా కోరిక వప్పుకుంటే-"
నేను ఆగటం భరించలేనట్టు "....వప్పుకుంటే?" అన్నాడు.
"బహుశా ఇక ముందెప్పుడూ తను మిమ్మల్ని కలుసుకోదు".
అతడు నా మాటలకి ఆశ్చర్యంతో చూశాడు. చాలాసేపు అలా చూస్తూనే వుండిపోయాడు. నేను చెప్పింది అతడికి విద్యుద్ఘాతంలా తగిలి వుంటుంది. కానీ ఆలోచిస్తున్నట్టు అతడి మౌనం సూచిస్తూంది. అన్యాపదేశంగా నేను మాటలద్వారా అందిస్తూన్న సూచనని అతడు గ్రహించినట్టున్నాడు. తనలో తనే గొణుగుతున్నట్టు "మరి... మరి... ప్రబంధ్ కి తన కన్న తల్లి దూరమై" అంటూ ఏదో చెప్పబోయాడు.
"మీ భార్యని కన్నతల్లిగా యాక్సెప్ట్ చేయటానికి నేను సిద్దంగాలేను ఆనందరావుగారూ" ఒక నిర్ణయానికి వచ్చినట్టు అన్నాను- నా నిర్ణయాన్ని వప్పుకోవటానికి చాలాసేపు మధనపడి, చివరికి అన్నాడు. ".... నీ ఇష్టం".
అందరూ లేచి నిలబడి వధూవరుల మీద అక్షింతలు జల్లుతున్నారు. కొందరు వెళ్ళిపోవటానికి ఉద్యుక్తులవుతున్నారు.
"వెళ్ళొస్తాను" అన్నాను.
"తిరిగి వస్తావుగా!"
"రాకూడదనే ఆశిస్తున్నాను".
అక్కన్నుంచి బయటకొచ్చాను. అమ్మ .వ్రాసిన ఉత్తరం నా జేబులో భద్రంగా వుంది.

మంగళ వాక్యం
సాయంకాలం తన నీడల్ని నదిమీద పొడుగ్గా వదులుతోంది. గోదావరి మీదనుంచి వచ్చే చల్లటిగాలి హాయిగా వున్నా నా మనసు మాత్రం విపరీతమైన టెన్షన్ తో నిండివుంది. నేను కోరబోయే కోరికకి అమ్మ ఏమంటుందో అన్న భయం, ఉద్వేగం నా మనసంతా నిండిపోయాయి.
కారు నెమ్మదిగా నడుపుతున్నాను. రోడ్డు ప్రక్కనుంచే గోదావరి పారుతూంది. మరోపక్క వరిచేలు- స్వాగతం చెపుతున్నట్టు నెమ్మదిగా తలలూపుతూ, గోదారి గాలికి వూగుతున్నాయి.
తల పక్కకి తిప్పాను.
అమ్మ తల వంచుకుని తన ఆలోచన్లలో తనుంది. వళ్ళో రెండు చేతులూ పెట్టుకుని వేళ్ళలో వేళ్ళు జొనిపి ఆ వేళ్ళకేసే తదేకంగా చూస్తూంది.
ఈ వూరు రావటానికి తఃను ముందు ససేమిరా వప్పుకోలేదు. ఎంతో బలవంతంమీద వప్పించాను. ఆఫీసు పని వుందనీ, అందువల్ల వెళ్తున్నాననీ చెప్పి బయల్దేర తీశాను. సగం ప్రయాణం చేశాక "ఇటెక్కడికిరా" అని అడిగింది. "ఇటువైపే పని" అని చెప్పాను.
ఊరు దగ్గిర పడుతూంటే అనుమానం పెరిగి "ఇంత చిన్న వూళ్ళో నీకు పనేమిటి?" అంది.
"ఊళ్ళో కాదమ్మా ఊరి బయటే" ఇంకేం ప్రశ్నించటానికి వీల్లేకుండా కారు వేగం పెంచాను.
నిజానికి అమ్మని ఇక్కడికి ఎందుకు తీసుకు రావాలనిపించిందో నాకు తెలీదు. ఈ విషయాన్ని ఈ పరిసరాల్లో చెప్పి, నా కోరిక ఇక్కడ బయట పెట్టటంలో ఔచిత్యం వుంటుందని నాకు తర్కరహితమైన ఆలోచన వచ్చిందంతే.
పాత జ్ఞాపకాలు ఉప్పెనలా లోపల్నుంచి తన్నుకువస్తుంటే మామూలుగా వుండటం కోసం తను శతవిధాల ప్రయత్నం చేస్తూందని, చూస్తూంటే తెలుస్తూంది. ఎవరమూ చాలాసేపటి వరకూ మాట్లాడుకోలేదు.
కారు పక్కకి తిప్పి ఆపుచేశాను. తలెత్తింది.
ఇక చెప్పవలసిన సమయం వచ్చేసింది.
అప్పటికి ఎన్నిసార్లు రిహార్సల్స్ వేసుకున్నా తీరా సమయం వచ్చేసరికి ఏదో తడబాటు.
అయినా చెప్పక తప్పదు. ఎలా ప్రారంభించాలా అని తటపటాయించాను. ఇరవై అయిదు సంవత్సరాలు అమ్మ దాచిన రహస్యం నాకు తెలిసిందని చెప్పటమే కష్టం. ఆ తరువాత నా కోరిక వెల్లడించటం అంత కష్టం కాదు.
"...ఆనందరావుగార్ని చూశానమ్మా".
అదీ నేను ప్రారంభించైనా మొదటి వాక్యం.
గోదారీ, పైరగాలీ .... ఏమీ మార్పులేదు. ఆమ్మ మాత్రం చివుక్కున తలెత్తింది. నేను చెప్పింది అంచెలంచెలుగా బహుశా తనకి అర్ధమైవుంటుంది. పూర్తిగా అర్ధమయ్యేసరికి కొన్ని క్షణాలు పట్టింది.
ఆ లోపులో నేను శక్తి కూడగట్టుకున్నాను.
ఏదీ దాచలేదు.
భైరవమూర్తి తాలూకు రౌడీ వచ్చి బ్లాక్ మెయిల్ చెయ్యటం నుంచీ, ప్రబంధ్ ఇంటర్వ్యూకి రావటం వరకూ, ఆ తరువాత ఆనందరావు కుటుంబాన్ని విచ్చిన్నం చేయటంకోసం నేను వేసిన ప్లాను, ఆ ప్రోసెస్ లో ఆయన్ని నేను కలుసుకోవటం, ఆయన చెప్పిన కథ- అంతా వివరంగా చెప్పాను.
ఒక భయానక చిత్రాన్ని చూస్తున్న ప్రేక్షకురాలిలా ఆమె నిశ్చేష్టమైన భంగిమహో నేను చెపుతూంటే విన్నది, కాని నా కథ ముగింపుకి వచ్చేసరికి ఆమెలో ఒక రకమైన ఆహ్లాద భావం కనిపించింది. బహుశా నేనూ ఆయనా మనసు విప్పి మాట్లాడుకోవటం ద్వారా పొరపొచ్చాలు తొలగిపోయాయన్న ఆలోచన, ఆ భావానికి పునాది కావచ్చు.
"నేను వెళ్ళే సరికే ప్రబంధ్ పెళ్ళి జరుగుతూ వుందమ్మా అక్కడ" అన్నాను ఆఖరి పుట విప్పుతున్నట్టు.
"ప్రబంధ్?" అంది.
"అవునమ్మా! నీ కొడుకు" ఆ మాట చాలా క్యాజువల్ గా ధ్వనించాలన్నట్టుగా అన్నాను. ఆమె నా వైపు చూస్తూంటే నేనేమో గోదారి తనలోకి లాక్కొంటున్న ఇసుక మేటవైపు చూస్తూ కొనసాగించాను. "-నువ్వు పెట్టిన గడువు వరకూ ఆయన వివాహాన్ని ఆపలేకపోయాడు. ప్రబంధ్ అప్పటికే తలమునకలయ్యేటంత ప్రేమలో వున్నాడట" నవ్వటానికి ప్రయత్నించాను.
ముందు కోరబోయే కోరిక గుర్తొచ్చి నవ్వురాలేదు. ఇక అడగాలి దాన్ని... అమ్మ నా వైపే చూస్తూంది.
"ఆయన ఎంతో బ్రతిమాలేరు, ఈ వివాహానికి నిన్ను తీసుకురమ్మనమని కానీ ప్రబంధ్ కి నువ్వు అమ్మవని నాకు నమ్మకమేమిటని అడిగాను. నువ్వు తనకి వ్రాసిన ఉత్తరం చూపించారు".
"ఉత్తరమా?"
"అవును ఈ వూర్నుంచి శాశ్వతంగా వెళ్ళిపోబోయే ముందు నువ్వు ఆయనకి వ్రాసిన ఉత్తరం..."
దూరంగా ఏదో పక్షిపిల్ల దారితప్పి తల్లికోసం అరుస్తోంది. పక్కనుంచి ఎడ్లబండి కారు దాటి వెళ్ళింది.
"అమ్మా! ఉత్తరంలో నువ్వు చెప్పిన గడువు అయిపోగానే నేను వాళ్ళింటికి వెళ్ళిపోవాలా? ఆయన్ని నాన్నగా, ఆవిడని అమ్మగా వప్పుకోవాలా?"
అడిగేశాను. ఈ విషయం తెలిసినప్పటినుంచీ ప్రారంభమైన నా మనసులో మధన - ఇప్పుడు తను చెప్పబోయే జవాబు మీద ఆధారపడి ఉద్వేగంగా మారింది.
"నువ్వు వాళ్ళ కొడుకువి గోపీచంద్" ఆమె మెల్లగా అంది. అలా అంటున్నప్పుడు ఆమె కంఠం వణికింది.
విసురుగా అన్నాను- "ఇంతకాలం నీ దగ్గర పెరిగి, ఇప్పుడు ఆ కుటుంబంలో ముఖ్యంగా ఆ తరళ దగ్గర ఇమడలేను".
"తప్పు, కన్న తల్లిని అలా అనకూడదు".
"పోనీ నేను వెళ్ళిపోతాననుకో....ఆ ప్రబంధ్ నీ దగ్గరికి వస్తాడని నమ్మకం ఏమిటి? తల్లి, తండ్రి. చెల్లెళ్ళు- అందరూవున్న కుటుంబంలోంచి నీ దగ్గరికి వస్తాడని గ్యారంటీ ఏమిటి?" అన్న తరువాత తెలిసింది, ఆ ఉక్రోషంలో నేనెంత తప్పుగా మాట్లాడానో.
కానీ నా మాటలు తనమీద ఏ ప్రభావాన్నీ చూపలేదు. అలాగే తలవంచుకుని అన్నది- "అతడికి కన్న తల్లితో వుండాలని లేకపోతే, పెంపుడు తల్లితోనే వుంటాడు గోపీ".

నే వేసిన బాణం సరీగ్గా అనుకున్నచోట తగిలింది. నవ్వేను, "మరి అతడికి అంత వరం ఇచ్చినదానివి- నేను పెంపుడు తల్లితో వుంటానంటే ఎందుకు వప్పుకోవు-?" తల్లిగోదారిలో కలుస్తున్న చిన్న కాలువవైపు చూస్తూ అన్నాను. నీళ్ళు ఆ పల్లంలోకి రెట్టించైనా ఉత్సాహంతో పరుగులు తీస్తున్నాయి. ఏదో చెప్పబోయి ఆగిపోయింది. ఆ చేతులు నా చేతుల్లోకి తీసుకుని మొహానికి ఆన్చుకుంటూ అభ్యర్ధించాను.
"అమ్మా, నువ్వు కన్నతల్లివి కాకపోవచ్చు కానీ ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచావు. ఇద్దరం కలిసి కష్టాల్ని పంచుకున్నాం. నువ్వు తినకుండా నాకు పెట్టావు. ఇంత ప్రేమకి ఎవరో ప్రబంధ్ అనేవాడు, వచ్చి ఈ రోజు హక్కుదారున్ని అంటే నేనొప్పుకోను. ఇది నా స్వార్ధమే అను, ఇంకేమైనా అను. నేను నీతోనే వుంటాను. ఆ ఇంటికి మాత్రం వెళ్ళమనకు. నీ కన్న కొడుకు మీద అంత ప్రేమ వుంటే, అతడినీ రమ్మంటాను, కానీ నన్ను మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపొమ్మనకమ్మా.. ప్లీజ్.. ప్లీజ్..." కొడుకు కంఠంలో ప్రపంచం గుర్తించలేని దుఃఖాన్ని కేవలం తల్లి మాత్రమే గుర్తించగలదనుకుంటాను. ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. నేను నా వయసు మర్చిపోయాను. ఎనిమిదేళ్ళ వయసులో నిద్రలో భయంతో కలవరిస్తే దగ్గరకు థేఉస్కున్న చేతులవి. బిజినెస్ మానేజిమెంట్ లో రాంక్ వచ్చినప్పుడు ఆ విజయం తన కృషి ఫలితమే అన్న ఆనందంతో దరిచేర్చుకున్న చేతులవి.
"ఈ విషయం మన ముగ్గురికీ తప్ప మరెవరికీ తెలీదమ్మా దీన్ని తన భార్యతో చెప్పేటంత ధైర్యం ఆనందరావుగారికి ఉందని నేను అనుకోను. ఇక తరళ సంగతంటావా? ప్రబంధ్ ని చూసుకుని తనెంత హాపీగా ఫీలవుతుందో పెళ్ళిలోనే గమనించాను. వాళ్ళందరూ హాయిగా సుఖంగా వున్నారమ్మా! మనమే అనవసరమైన సెంటిమెంట్లతో ఏదో తప్పు చేసినట్టు బాధపడుతున్నాం." ఎటూ నిర్ణయించుకోలేనట్టుగా "నన్ను కొంచెంసేపు ఆలోచించుకోనివ్వరా గోపీ" అంది రెండు నిముషాలు నిశ్శబ్దంగా గడిచాయి. తను కార్లోంచి దిగింది. డోర్ వేస్తూ నావైపు చూసింది. ఆ చూపులో "నీ లాంటి కొడుకుని తననుంచి దూరం చేసినందుకు తరళ నన్ను క్షమించదు" అన్న భావం వుందేమో.
దూరంగా నడిచి, గోదారివైపు తిరిగి, ఇసుకలో కూర్చుంది.
అటుచూస్తూ.... "నేను మాత్రం గోపీని వదిలేసుకుని ఎలా వుండగలుగుతాను?" అన్న చిన్న స్వార్ధాన్ని తనలో ప్రవేశపెట్టమని భగవంతుని ప్రార్దించాను. నాకా ఇల్లు, ఆ ఆస్తి - ఆ బంధువులు- వాళ్ళెవరూ వద్దు. ప్రబంధ్ కాదంటే- వృద్దాప్యంలో ఒంటరిగా మిగిలిపోయే ఈ తల్లి నాకు కావాలి.
చేతిలో ఉత్తరాన్ని విప్పాను. తను నా తండ్రికి వ్రాసిన ఉత్తరం. పాతాళంలోకి జారిపోతున్న ఒక మనిషిని కాళ్ళమీద నిలబెట్టటం కోసం ఒక స్త్రీ చేసిన త్యాగానికి పాతిక సంవత్సరాలపాటు చీకట్లో దాచి వుంచిన ఉత్తరం. చదవటం ప్రారంభించాను.
"ప్రియమైన ఆనంద్,
నీకు ఏం వ్రాయాలో ఎలా మొదలు పెట్టాలో అర్ధంకావటం లేదు. కానీ నేను చేస్తున్న పని నీకు తెలియబర్చటం నా ధర్మం ణ అనిర్ణయం సరియైనదో కాదో చెప్పవలసింది నువ్వే.
నువ్వు కొద్దిరోజుల క్రితం ఒక మాట అన్నావు గుర్తుందా? నేను వెళ్ళిపోతే నీ మీద ఒట్టే అని ఆ విషయం గురించే ఇక్కడ ప్రస్తావించదల్చుకున్నాను. నువ్వెంత పట్టుదల మనిషివో నాకు తెలుసు. అలాంటి అఘాయిత్యమేమీ తలపెట్టకుండా వుండటం కోసమే ఈ ఉత్తరం. ఆనంద్! ఆటుపోటుల కలయికే జీవితం అనుకుంటాను. నా గురించి వదిలిపెట్టు. నువ్వెందుకు రోజురోజుకీ ఇలా అయిపోతున్నావు? మనసు నెలా మత్తులో జోకొట్టాలా అని దారులు వెతక్కూడదు.
నా గురించే నీ బాధ అని నాకు తెలుసు. ఈ ఇంట్లో నేను పడే కష్టాలు నిన్ను నిద్రపోనివ్వవని, అసలే ఈ వివాహంవల్ల మనశ్శాంతి లోపించిన నీకు, నా సమస్య మరొకటి కొత్తగా వచ్చిపడిందనీ, నేను గ్రహించగలను. నన్నొక ఆయుధంగా వాడుకొని ఈ ఇంటివాళ్ళు నీ నుంచీ డబ్బు వసూలు చేస్తున్నారనీ, నా వంటిమీద పడిన ప్రతీ దెబ్బా నీ నుంచీ నెలల తరబడి నిద్రని దూరం చేస్తున్నాయనీ నాకు తెలుసు.
అందుకే ఈ ఇంటినుంచీ వెళ్ళిపోతున్నాను.
ఆగు, నీ బెదిరింపు మళ్ళీ గుర్తుచేయకు. నేను దూరమయితే నువ్వు ఈ లోకంలోనే వుండవని అన్నావు కదూ.
ఏం చెయ్యాలి ఆనంద్?
ఈ ఇంట్లో నీనుంచి డబ్బు వసూలు చేసే మిషన్ లాగా పనిచెయ్యాలా? ఏ క్షణం నా భర్త మొదటి విటుడిని తీసుకువస్తాడో అని భయపడుతూ ప్రతిక్షణం గడపాలా?
వెళ్ళిపోవతనైకే నిశ్చయించుకున్నాను ఆనంద్.... నా వీడ్కోలు నిన్ను మరింత ఒంటరితనంలో పడేస్తుందనీ, ఆ కసితో నీమీద నువ్వే కక్ష తీర్చుకుంటావనీ నాకు తెలుసు. ఆర్నెల్లక్రితం నిన్ను తాగుడు మానమని బ్రతిమాలేను. నువ్వు వినలేదు. కసితో మరింత తాగావు. ఎవరిమీద నీకింత కసి? తరళ మీదనా? తనేం చేసిందని? అమాయకత్వమూ, మొండితనమూ మనవ లక్షణాలేగానీ తప్పులేం కావే! రావుగారి మీదనా? పాపం ఆయన చేసిన చిన్న తప్పుకి ఆత్మార్పణం గావించుకుని అంత పెద్ద శిక్ష విధించుకున్నారే నువ్వేం సమాధానం చెపుతావో నాకు తెలుసు. "నా కెవరి మీదా కసిలేదు. నామీద నాకే కోపంగా వుంది. అందుకే ఇలా అయ్యాను" అంటావు కదూ. ఆనంద్ నీకు చెప్పేటంతదానిని కాదు కానీ ఈ విధి అన్నది వుంది చూశావు- మన్ని కాలం అన్న గదిలో పెట్టి బెదిరించటానికి చూస్తుంది. పిల్లికూడా తిరగబడుతుందే- అలా తిరగబడితే మనం చెప్పినట్టు వింటుంది, మన సమస్యల్ని ఎవరూ వచ్చి పరిష్కరించరు ఆనంద్ మనమే పరిష్కరించుకోవాలి. ఇదంతా శుష్క వేదాంతంలా కనపడుతూంది కదూ. అవును. నేనేం చెప్పినా వినవు. నేను స్వయంగా వచ్చి చెపుతేనే వినలేదు. ఇక ఇలా ఉత్తరం వ్రాస్తే ఏం వింటావు?
అందుకే నీ కొడుకుని నేను తీసుకు వెళుతున్నాను.
ఈ వార్త నీకు విద్యుద్ఘాతంలా తగుల్తుంది కదూ. నాకు మాత్రం ఎంతో సంతోషంగా వుంది. నీ కొడుకు నా దగ్గిర పెరగటం అన్న ఆలోచనే సంచలనాన్ని కలుగజేస్తుంది.
నీకు జ్ఞాపకం వుందా? నేనూ తరళా గోదావరిలో పడవల్ని వదిలి ఏ పడవ ముందు వెళుతుందా అని పందేలు వేసుకునేవాళ్ళం, ఇప్పుడు మరి నా దీపాన్ని తన దగ్గిర వదిలి వెళుతున్నాను. ఈ పందెంలో ఎవరు గెలుస్తారో చూడాలి. నీ కొడుకుని నేను నీకన్నా గొప్ప వాణ్ణి చేస్తాను. పందెమా? ఈసారి నీతోపందెం-సరేనా?
ఆనంద్.... ఇదంతా నేనెందుకు చేస్తున్నానో నీకు తెలుసుకదూ నేను వెళ్ళిపోయానన్న కసితో, వేదనతో నువ్వు నీ కుటుంబానికి మరింత దూరం అవుతావు, నీ వ్యాపారాన్ని, ఆస్తి వ్యవహారాల్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తావు.. కానీ ఇప్పుడు...? నా కొడుకుని కూడా ఒక బికారిని చెయ్యగలవా? నా కొడుకే నీకు జీవితం మీద ఆశ, భవిష్యత్తు కోసం ఒక పట్టుదలా కలిగిస్తాడని నాకు నమ్మకం వుంది. నా కోరిక ఏమిటంటే, నా కొడుకు చదువు, పెంపకం - అంతా నీ సంపాదన ద్వారానే జరగాలి. మీ మామగారి అస్తి అసలు ముట్టుకోకూడదు. ఇక మా సంగతంటావా? గోపీచంద్ (నీకు జ్ఞాపకం వుందా? మన వివాహం జరిగాక మొదట పుట్టేది అబ్బాయి అయితే ఆ రచయిత పేరు పెట్టాలని మనం అనుకున్నాం).... గోపీచంద్ గురించి నువ్వేం దిగులుపడకు. నా ప్రతి అణువులోని శక్తినీ ధారపోసి అతడిని గొప్పవాడిని చేస్తాను. ఒకవేళ చేయలేకపోతే నీ దగ్గిరకి పంపిచేస్తాలే. చేస్తే మాత్రం అతడిని పాతిక సంవత్సరాల తరువాత నీ కప్పగిస్తాను. అప్పటికి నాకు జీవితం అంటే ప్రేమే ఒకటే కాదనీ- పట్టుదల కూడా వుండాలనీ- ఒట్టేసి ఒక మనిషిని కట్టిపడెయ్యలేమనేటంతగా అభిప్రాయాలు మారిపోతాయని ఆశిస్తాను. ఇదంతా నీ కోసమనే సత్యాన్ని గ్రహించి నా మీద కోపం తెచ్చుకోవుకదూ. కనీళ్ళతో వీడ్కోలు చెప్పను. నా జ్ఞాపకాల్నీ, నారక్తం పంచుకు పుట్టిన బిడ్డనీ నీ దగ్గిర వదులుతున్నప్పుడు అది వీడ్కోలు ఎలా అవుతుంది. ఉంటాను మరి.

- నీ ప్రమద్వర"
చదవటం పూర్తిచేశాను. మనసంతా అదోరకమైన శూన్యత ఆవరించింది. కాగితం మడత పెట్టి జేబులో పెట్టుకున్నాను.
అమ్మ ఇంకా అలానే ఒడ్డున కూర్చుని వుంది.
అట్నుంచి గోదారీ, ఇట్నుంచి ఎండా-మధ్యలో శిలా ప్రతిమలా ఆమె....బహుశా గతం గురించి ఆలోచిస్తూ వుందేమో ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ ఈ పరిసరాల సామీప్యం.... ఈ ఇసుక తిన్నెల్లోనేగా ఆమె కలల గూళ్ళు కట్టుకుంది. ఇక్కడ రెల్లుగడ్డి నీడల్లోనేగా ఎన్నో ఆశల్ని పెంచుకుంది. పంటపొలాల మధ్య సన్నబాటలో-కాళ్ళ కడ్డుపడే పరికిణీ పక్కకి తీసుకుమ్తొఇఒ భవిష్యత్తువైపు పరుగెత్తింది. కన్న కలలు నిలువునా కరిగిపోతూంటే అచేతనమైన ప్రేక్షకురాలిలా మిగిలిపోయింది ఇక్కడేగా... ఏం సాధించింది?
..ఏం సాధించలేదు?
అవునుమరి ఎందరో చరిత్రకారులు వీరపత్నుల గురించి వ్రాశారు. ఎందరో సంస్కారవాదులు స్త్రీ స్వాతంత్ర్యం గురించి ఎలుగెత్తి ఉపన్యసించారు. ఎందరో రచయితలు దాస్యశృంఖలాలు తెగ్గొట్టుకోవటం గురించి లిఖించారు. కవిత్వం గానం చేశారు. కానీ ఇదిగో ఇక్కడుంది ఒక స్త్రీ ఆమె జీవితం ఏ చరిత్రకూ అందని పాఠ్యపుస్తకం. జీవితంకన్నా గొప్ప పాఠం ఏముంది? ఒక కళావంతుల ఇంట్లో పుట్టింది. సంసార స్త్రీ అవ్వాలనుకుంది. ప్రేమ విఫలమైంది. విధి కర్కశంగా ఆడుకున్న ఆటలో మరో దుర్మార్గుడికి భార్య అయింది. బాధలనుభవించింది. అయినా పట్టు వదలలేదు. విశాల ప్రపంచంలోకి ఒంటరిగా వెళ్తూ వెళ్తూ కూడా తను ప్రేమించినవైడ్ని సంస్కరించి మరీ వెళ్ళింది. అలా సంస్కరించడంలో.. ఏ తల్లీ చేయని త్యాగం చేసింది! మరో కొడుక్కి తల్లి అయి, చేతులనే రెక్కలుగా మార్చుకుని ఒక పిల్ల పక్షికి ఎగరటం నేర్పింది. ఆ పిల్లవాడు తన స్వంత కొడుక్కే యజమాని అయ్యేటంత గొప్పవాణ్ణి చేసింది. ఓటమికి తుది మలుపు నిరాశ కాదనీ, తిరగబడమనీ - ఏ విప్లవకారుడూ చెప్పనంత గొప్పగా తన జీవితం ద్వారా నిరూపించింది. అలాటి స్త్రీ తల్లిగా లభిస్తే ఎవరు వదులుకుంటారు? మీరే చెప్పండి.
.... ఆమె లేచింది.
బాగా చీకటి పడింది.
సంధ్య నదినుంచి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయింది.
చంద్రుడు నెమ్మదిగా పైకి వస్తున్నాడు.
ఆమె వెనుక గోదారిమీద వెన్నెల పరుస్తున్నాడు.
పిల్ల తిమ్మెరలాటి ఆలోచన నా మనసులో మలయ పవనంలా ప్రవేశించింది.
ఈ స్త్రీకీ గోదావరికీ కూడా తేడా ఏముంది?
అతి సాధారణమైన కుల కొండచరియల్లో పుట్టి, సన్నగా ప్రవహించి, విధి ఎత్తులున్నచోట మర్యాదగా పక్కకి తొలగి, బలం పుంజుకుని కొండల్ని ఢీకొని, అడ్డంకుల్ని తొలగించుకుని, జీవనదై పదిమందికీ అన్నం పెట్టే గోదారి....! సాగర సంగమానికి సంతోషంగా వెళ్ళబోతూంటే అడ్డుగా తన స్వార్ధంతో ఆనకట్ట వేసిన మనిషిని కూడా చిరునవ్వుతో క్షమించే స్త్రీ ఈ గోదారి! వినగలిగితే ఆ గలగలల్లోంచే జీవితానికి స్ఫూర్తినిచ్చే వేదఘోష వినపడుతుంది. ఆ నిశ్శబ్దస్వర నినాదాల శృతి నాస్వాదిస్తూండగా తను దగ్గిరగా వచ్చింది.
ఆత్రంగా తలెత్తి చూశాను.
నవ్వింది.
ఆ నవ్వులో నాక్కావాల్సిన సమాధానం దొరికింది.
నేనూ నవ్వేను.
వెన్నెల్లో గోదారి కూడా.
--౦౦౦--
కథకుడు
ఈ కథ ప్రారంభించినది నేను కాబట్టి స్వస్తివాక్యం పలుకవలసిన కర్తవ్యం కూడా నా మీదే వుంది.
ఆ తరువాత ఎప్పుడైనా ఆనందరావు ప్రమద్వరని కలుసుకోవటానికి ప్రయత్నించాడా- దానికి గోపీచంద్ సహకరించాడా అన్నది మనకి అప్రస్తుతం. ఈ రహస్యం తమ ముగ్గురితోనే అంతమవ్వాలని మాత్రమే వారు అనుకున్నారు. కానీ ఈ రహస్యం తెలిసిన ఇంకొకరున్నారు.
ఆ వ్యక్తి తరళ.
పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతూందని హడావుడిగా మేడమీదకు వెళ్ళిన ఆమె ఆ ఇద్దరిమధ్యా జరిగిన సంభాషణను ఆమూలాగ్రం విన్నది.
చిత్రంగా-
ఆమె స్పృహతప్పి పడిపోలేదు. కెవ్వున కేకవేసి రభస చేయలేదు. తన ప్రవృత్తికే వ్యతిరేకంగా - మొత్తం సంభాషణ పూర్తయ్యేవరకూ అలాగే నిలబడింది మొహమేకాదు. శరీరం కూడా వివర్ణమైంది.
తన మూర్ఖత్వం ఇద్దరి ప్రేమికుల్ని ఎలా విడదీసిందీ- తన మొండిపట్టు తన తండ్రి మరణానికి ఎలాదారితీసిందీ- అంతా విన్నది. ప్రేమ వుండటం ఒక్కటే ముఖ్యం కాదనీ, అవతలి వారిలో అది వుందో లేదో కూడా కనుక్కోవాలనీ, పాతిక సంవత్సరాలు ఆలస్యంగా తెలుసుకుంది.
వణికిపోయింది.
ఆ తరువాత ఆమె ఎన్ని ఒంటరి రాత్రులు ఏడుస్తూ గడిపిందో తెలీదు.
జీవితాంతం వరకూ మాత్రం ఆ రహస్యాన్ని తనలోనే దాచుకుని ఏమీ ఎరగనట్టు ప్రవర్తించింది. ప్రబంధ్ ని స్వంత కొడుకులాగే చూసుకుంది.
పనిమనిషి దొంగతనం కేసులో కూతుర్ని దండించి, తరువాత తప్పు తెలుసుకుని శరీరంమీద వాతలు పెట్టుకోవటం ద్వారా తనని తనెలా శిక్షించుకుందో- ఇప్పుడు చేసిన తప్పుకి తన స్వంత కొడుకైన గోపీచంద్ ని జీవితాంతం చూడకపోవటమే శిక్షగా భావించింది!
తరళ లాంటివాళ్ళు మీ కెక్కడైనా తారసపడితే వారిని అపార్ధం చేసుకోకండి. జాలిపడండి.
అయిపోయింది
----****----