Showing posts with label KK. Show all posts
Showing posts with label KK. Show all posts

ప్రతిరోజు పండగే (2019)


చిత్రం : ప్రతిరోజు పండగే (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : కె.కె.
గానం : శ్రీకృష్ణ

మెరిసాడే మెరిసాడే
పసివాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే
సరదాలో మునిగాడే
తనవారే వస్తుంటే
అలుపింక మరిచాడే
మనసంతా వెలుగేనా
ఇక చీకటెళ్ళింది
తెల్లారి నీ నవ్వుతోనే

పదిమంది ఉండగా
ప్రతిరోజు పండగే
పడి నవ్వుతుండగా
ప్రతి రోజు పండగే

మెరిసాడే మెరిసాడే
పసివాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే
సరదాలో మునిగాడే

గలగల మాటల సడిలో
బరువిక తేలిక పడెలే
ఇరుకుగ మారితె గదులే
చురుకుగ ప్రాణమే కదిలే
మనమంతా కలిసుంటే
కలతున్నా మరిచేనే
మనమంతా వెనకుంటే
మరణాన్నే గెలిచేనే

మిము కలవగా తెగ కలవరం
అసలిది కదా ఒక సంబరం
ఒక వరసలా కదిలిన క్షణం
ఇక తెలియదే ఒంటరితనం

ఎన్నాళ్ళకో రారు కన్నోళ్ళిలా
వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా
ఇల్లంతా మారింది సందళ్ళుగా
మీరంతా ఉండాలి వందేళ్ళిలా

మనవారే వెనకుంటే
మరణాన్నే మరిచేలే
మనసంతా వెలుగేనా
ఇక చీకటెళ్ళింది
తెల్లారి నీ నవ్వుతోనే

పదిమంది ఉండగా
ప్రతిరోజు పండగే
పడి నవ్వుతుండగా
ప్రతిరోజు పండగే


*********** ************* *************
చిత్రం : ప్రతిరోజు పండగే (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్  
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : విజయ్ ఏసుదాస్ 

చిన్నతనమే చేరరమ్మంటే
ప్రాణం నిన్నవైపే దారితీస్తోందే
అడుగులైతే ఎదరకైనా
నడకమాత్రం వెనకకే
గడిచిపోయిన జ్ఞాపకాలతో
గతము ఎదురౌతున్నదే

చెరిగిపోనేలేదే మరపురానేరాదే
చివరి మలుపున నిలచి పిలిచిన
స్మృతుల చిటికెన వేలు
వదలని చెలిమిగా
ఊహలే ఉప్పొంగుతున్నవిలా
ముగియని కథలతో
మది మేలుకున్నదిలా

తాతగా తలపండినా
తండ్రి తనమే ఎండున
ఒడిని దిగి కొడుకెదిగినా
నాన్న మురిపెము తీరునా 
 వయసు వాలిన సందె వాలున
చేతికందిన ప్రియవరం
మనవడై తన పసితనమ్మును
వెంట తెచ్చిన సంబరం
కొత్త ఊపిరి కాగా
మనసు ఊయలలూగా
తర తరమ్ముల పాటు ఇంకని
వంశ ధారగ మారి కడలిని కలియని
జీవనదిగా పారుతుంది కదా
కంచికి చేరు కథగా ముగిసిపోదు కదా 

*********** ************* *************
చిత్రం : ప్రతిరోజు పండగే (2019)
సంగీతం : ఎస్.ఎస్. థమన్ 
సాహిత్యం : కె.కె.
గానం : సత్య యామిని, మోహన భోగరాజు, హరితేజ

లవ్ యూ అంటూ వెంట పడలేదు
డేటింగ్ అన్న మాటసలే రాదు
హీ ఈస్ సో కూల్..
హీ ఈస్ సో క్యూట్..

ఫేక్ అనిపించే టైపసలే కాదూ
బ్రేకప్ చెప్పే వీలసలు లేదు
హీ ఈస్ సో హాట్
హీ ఈస్ సో క్యూట్

ఏమి తక్కువంట సూడు
టిప్పు టాపుగున్నాడు
టిక్కు టాకులోన చూసి ఫ్లాటయ్యాడు
వన్నా సీ యూ అంటూ 
సెవెన్ సీస్ దాటివచ్చాడు

ల్యాండు అయ్యిఅవ్వగానే 
బ్యాండు ఎంట తెచ్చినాడు
నీ హ్యాండు ఇవ్వమంటు
నీస్ బెండు చెసి
విల్ యూ మ్యారీ మీ అన్నాడు
డు..డు..డు..డు..డు..

ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా
ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా సింధూరం నువ్ పెడతావా

మచో మ్యాన్ మా బావా
పేచీలే మానేవా
కటౌటే చూస్తూనే
కట్టింగే ఇస్తావా

హ్యాండ్సమ్మే మా బావా
నీ సొమ్మే అడిగాడా
తానే చేతులు చాపొస్తే
తెగ చీపైపోయాడా

ఓ బావా…. ఓ బావా…

లవ్ యూ అంటూ వెంట పడలేదు
డేటింగ్ అన్న మాటసలే రాదు
హీ ఈస్ సో కూల్
హీ ఈస్ సో క్యూట్

నిదరే పోడు ఏమీ తినడు
నువ్వే కావాలంటాడు
నిన్నే చూసి ప్రతీ రోజుని
శుభముగ ప్రారంభిస్తాడు
తినె పప్పులోన బీరు కలుపుతాడు
తన పప్పి లోన నిన్ను వెతుకుతాడు
నీ పేరే పలికే.. నిన్నే తలిచెనే..
అక్కా నమ్మే.. అతనే జెమ్మే..

మచో మ్యాన్ మా బావా
పేచీలే మానేవా
కటౌటే చూస్తూనే
కట్టింగే ఇస్తావా

హ్యాండ్సమ్మే మా బావా
నీ సొమ్మే అడిగాడా
తానే చేతులు చాపొస్తే
తెగ చీపైపోయాడా

ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా ఈ సుక్కని పెళ్ళాడేస్తావా
ఓ బావా మా అక్కని సక్కగ సుస్తావా
ఓ బావా సింధూరం నువ్ పెడతావా

దిల్ (2003)

చిత్రం: దిల్ (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్. పి. పట్నాయక్


ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...
ఎందుకో ఏమిటో నిదురింక రాదేమిటో
కనుపాపాలో కల కాదుగా ఈ మాయా...
ఎపుడు లేనిది నాలో అలజడి
ఎవరు చెప్పలేదే ప్రేమని

ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...

ప్రేమనే మాటకి అర్ధమే నాకు రాదే
ఎవ్వరో చెప్పగా ఇప్పుడే తెలిసెనే
నీ జతే చేరగా నా కధే మారిపోయే
లోకమే బొత్తిగా గుర్తుకే రాదులే
చినుకై చేరిన వరదై పోయెనే
ఎవరూ అపలేరే ప్రేమని

ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...

గాలిలో వేలితో ఆశలే రాసుకోన
నీవనే ప్రేమని శ్వాసగా పీల్చనా
నీటిలో నీడలో నిన్నిలా చూసుకోన
ఊహలో తేలుతూ ఊసులే ఆడనా
లోకం ఎంతగా మారిందే ఇలా
పగలే జాలువారే వెన్నెలా

ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళా...


*********  *********  ********


చిత్రం: దిల్ (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె. కె

CM PM అవ్వాలన్నా అశే లేదు
UK US వెళ్లాలన్నా షోకే లేదు
హోటల్లోన ఉండాలన్నా రూలేంలేదు
కోటల్లోనే మునగాలన్న కోరికలేదు
హ్యాపీగా లైఫంతా గడపడానికి
కొంచం నేముంటే చాలు కొంచం ఫేముంటే చాలు
కొంచం డబ్బుంటే చాలు కొంచం దిల్లుంటే చాలు

CM PM అవ్వాలన్నా అశే లేదు
UK US వెళ్లాలన్నా షోకే లేదు

డైలీ నేను తిరగడానికి ఛార్టర్డ్ ఫ్లైటే వద్దు
సింపుల్ బైకొకంటే చాలు
బీటే నేను వెయ్యడానికి మిస్ యూనివర్సే వద్దు
లోకల్ బ్యూటీ అయితే చాలు
అలసట వస్తే తాగడానికి అమృతమేమి వద్దు
చల్లని బీరొకటుంటే చాలు
ఆపదలో  కాపాడటానికి పైవాడేమి వద్దు
నలుగురు ఫ్రెండ్సే ఉంటే చాలు
హ్యాపీగా లైఫ్ అంతా గడపడానికి
కొంచం నేముంటే చాలు కొంచం ఫేముంటే చాలు
కొంచం డబ్బుంటే చాలు కొంచం దిల్ ఉంటే చాలు

CM PM అవ్వాలన్నా అశే లేదు
UK US వెళ్లాలన్నా షోకే లేదు

కావాల్సింది చూడటానికి కంప్యూటర్ తెరవద్దు
కమ్మని కలలే కంటే చాలు
బ్రతకాల్సింది బ్రతకడానికి ఏడు జన్మలే వద్దు
ఉన్న ఒక్క జన్మమే చాలు
పుణ్యం కాస్తా దక్కడానికి పూజలు గీజలు వద్దు
పరులకు సాయం చేస్తే చాలు
చెయ్యాల్సింది చెయ్యటానికి పంచాంగాం విప్పొద్దు
పంజా విప్పావంటే చాలు
హ్యాపీగా లైఫ్ అంతా గడపడానికి
కొంచం నేముంటే చాలు కొంచం ఫేముంటే చాలు
కొంచం డబ్బుంటే చాలు కొంచం దిల్లు ఉంటే చాలు

అశే లేదు ... షోకే లేదు
రూలేం లేదు...కోరిక లేదు

సైనికుడు (2006)




చిత్రం: సైనికుడు (2006)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె.కె.


సైనికుడు....సైనికుడు
గొ గొగొగొ గొ గొగొగొ
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ
కాలం ఇదిగొ కాలం అదిగొ
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ
కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి
లోకమనే మదిలో ఒదిగె నిదురని తట్టి
ఓహో .. శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై
ఓహో.. సాగిపొ నేడే సైనికుడు నువ్వై
గొ గొగొగొ గొ గొగొగొ
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ......గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ

గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ......గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ

M B A చదివిన MCA లె చదివిన ఈ జగతిని సైతం చదవరా
వేదాలె చదివిన వేమన నీతులు చదివిన అవినీతుల లోతులు చదవర ఆ ఆ

వికాసం మాటున విషాదం వుందిరా విరామం వద్దురా విదానం మార్చరా
ఒంటి సైనికుడల్లె కవాతులె చెయ్యరా కొటి సూర్యులమల్లె ప్రకాశమే పంచరా ప్రకాశమే పంచరా
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ

గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ
సైనికుడు .. సైనికుడు

ఓహ్ మై లవ్ మాటతొ అమ్మాయి మనసే గెలిచిన ఆ గెలుపే ఇద్దరి మద్యన
ఓహ్ మై ఫ్రెండ్ మాటతొ అందరి మనసులు గెలవరా ఆ గెలుపొక మలుపును చూపురా
ప్రయత్నం నీదిరా ప్రభుత్వం నువ్వురా ప్రభావం నీదిరా ప్రభంజనమవ్వరా
సాటి స్నేహితుడల్లె జనాలతొ నడవరా మేటి నాయకుడల్లె జగాలనే నడపరా
గొ గొ గొ అదిగొ అదిగొ లొకం అదిగొ
గొ గొ గొ ఇదిగొ ఇదిగొ కాలం ఇదిగొ
కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి లోకమనే మదిలో ఒదిగె నిదురని తట్టి
ఓహో .. శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై ఓహో.. సాగిపొ నేడే సైనికుడు నువ్వై
సైనికుడు .. సైనికుడు



********   *********   ********



చిత్రం: సైనికుడు (2006)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సునీత సారథి, లెస్లే లెవీస్, అనుష్క


బైలా బైలామో సరికొత్త సంగీతంలో
డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో
బైలా బైలామో సరికొత్త సంగీతంలో
డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో

ఓ జనగణమే నిలిచింది నీతో
జన పదమే నడిచింది నీతో
నవ జగమే యువ రాగం వెంట రావాలంట నేడే
మాతరం మా తరం ఆపడం ఆపడం పారం పం పం ఎవరి తరం

బైలా బైలామో సరికొత్త సంగీతంలో
డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో

ఓ జనగణమే నిలిచింది నీతో
జన పదమే నడిచింది నీతో
నవ జగమే యువ రాగం వెంట రావాలంట నేడే

మెరుపే బంగారాలు మెరవకపోతే రాళ్ళు
అనుకుంటూ ఉన్నాగా ఇన్నాళ్ళు
తెరిపించావోయ్ కళ్ళు విడిపించావోయ్ ముళ్ళు
ముళ్ళైనా నీతో ఉంటే వూలు
కవ్వించాలి ప్రవహించాలి మనసుల్లోనా మమతల సెలయేరు

ప్రేమించాలి నడిపించాలి నలుగురు మెచ్చే నూతన సర్కారు

బైలా బైలామో సరికొత్త సంగీతంలో
డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో

ఓ జనగణమే నిలిచింది నీతో
జన పదమే నడిచింది నీతో
నవ జగమే యువ రాగం వెంట రావాలంట నేడే


చూపుల్లోని చురుకు ఊహల్లో ఉడుకు దీపాలై అందించాలి వెలుగు
చేయి చేయి కలుపు పాదం పాదం కలుపు ఏరాలి మొక్కల్లోని కలుపు
మెలి తియ్యాలి కలిపెయ్యాలి కాలుష్యాల చీకటి కోణాలు
పండించాలి పాలించాలి సస్యశ్యామల ప్రేమల రాజ్యాలు

బైలా బైలామో సరికొత్త సంగీతంలో
డైలా డైలమో పయనిద్దాం ఈ వేగంలో

ఓ జనగణమే నిలిచింది నీతో
జన పదమే నడిచింది నీతో
నవ జగమే యువ రాగం వెంట రావాలంట నేడే
మాతరం మా తరం ఆపడం ఆపడం పారం పం పం ఎవరి తరం

మాతరం మా తరం ఆపడం ఆపడం పారం పం పం ఎవరి తరం



*********   *********   *********



చిత్రం: సైనికుడు (2006)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్, చిత్ర


హొయ్ ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా
అగ్గిపుల్లా ఆడపిల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా
వసారా చూరంట వాలే పొద్దూ చల్ చటుక్కున చటుక్కున నాతో వద్దూ
దుబారా వద్దంట ఇచ్చేయ్ ముద్దూ జత కలిసిన ముడేసిన నాడే ఇద్దూ
కాస్కో కుస్కో కాటా ఏస్తే నీ వాస్తంత చూసాకే వాటాకొస్తా
ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా హేయ్

అలకలు వస్తే తళుకులు చూస్తా చతికిల పడకుండా జతయి కలుస్తా
ఇరుకున పెడితే దొరకనిదిస్తా చిలికిన ఎన్నెల్లో వొడే పరుస్తా

నిప్పంటుకున్నాక తప్పేందమ్మీ... నిప్పంటుకున్నాక తప్పేందమ్మీ
వడి సొంతమే ఉందిగా హాయీ హామీ
అగ్గిపుల్లా ఆడపిల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా
ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా

గడపలకొస్తే గడియలు తీస్తా కుడిఎడమవుతుంటే కుదేలు చేస్తా
సొగసులు కోస్తే రవికలు తెస్తా విరవిరజాజుల్తో నిన్నే గెలుస్తా
సిగ్గంటుకున్నాక ముద్దెందుకూ .. సిగ్గంటుకున్నాక ముద్దెందుకూ
నడి సందెలో అందెలే సిందెయ్యగా
హేయ్ ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా
వసారా చూరంట వాలే పొద్దూ చల్ చటుక్కున చటుక్కున నాతో వద్దూ
దుబారా వద్దంట ఇచ్చేయ్ ముద్దూ జత కలిసిన ముడేసిన నాడే ఇద్దూ
కాస్కో కుస్కో కాటా ఏస్తే నీ వాస్తంత చూసాకే వాటాకొస్తా



********   ********   ********


చిత్రం: సైనికుడు (2006)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: కులశేఖర్
గానం: శ్రేయా గోషల్


సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లొ ఉయ్యాలలూగె ప్రేమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ
సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ
నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా
హా.. సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా

ఓ చల్లగాలీ ఆ నింగీ దాటి ఈ పిల్లగాలి వైపు రావా
ఊహల్లో తేలీ నీ వళ్ళో వాలీ నాప్రేమ ఊసులాడనీవా
పాలనురుగులపైన పరుగులు తీసి పాలు పంచుకోవా
పూల మధురిమ కన్న మధురము కాదా ప్రేమగాధ వినవా

సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా

డోలారే డోలా డోలారే డోలా మోగింది చూడూ గట్టిమేళా
బుగ్గే కందేలా సిగ్గే పడేలా నాకొచ్చెనమ్మా పెళ్ళి కళా
మబ్బు పరుపుల మాటు మెరుపుల మేన పంపెనమ్మ వానా
నన్ను వలచినవాడు వరుడై రాగా ఆదమరచిపోనా
సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లొ ఉయ్యాలలూగె ప్రేమా హో
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ
సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ
నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా


********   ********   ********


చిత్రం: సైనికుడు (2006)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఉన్ని కృష్ణన్, యస్. పి. బాలు, కవితాకృష్ణమూర్తి


ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ
నీవైపు మళ్ళిందంటే మాయేగా
మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా ఊరించే ఊహాలోకం లేరా
మాయేరా మాయేరా రంగురంగులూ చూపేదేరా రంగంటూ లేనేలేదు లేరా

ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ
నీవైపు మళ్ళిందంటే మాయేగా

ఊహల్లో ఊసుల్లో ఆమాటే ఓసోసి గొప్ప ఏముంది గనకా
తానంటూ నీవెంటే ఉందంటే ఆ ఎండ కూడా వెండివెన్నెలవదా
అవునా అదంత నిజమా ఏదేది ఓ సారి కనపడదా

ఇలలో ఎందెందు చూసినా అందందునే ఉంటుందిలే బహుశా
మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదూ లేరా నీ చెంతే ఉండే దూరం లేరా
హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే

ప్రేమిస్తే ఎంతైనా వింతేలే నువ్వు ఎంత చెప్పు గుండెల్లో గుబులే
ఈడొస్తే ఈగైనా ఇంతేనా ఇంతోటి తీపి ఏమున్నదైనా
శిలవా నా మాట వినవా ఏనాడు నువ్వు ప్రేమలో పడవా
నిజమా ఈ ప్రేమ వరమా కల్లోనైన ఊహించని మహిమా
మాయేరా మాయేరా ప్రేమ అన్నదీ మాయేలేరా ఇద్దరిలోనా ఇంద్రజాలం లేరా
హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే
ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా



********   ********   ********


చిత్రం: సైనికుడు (2006)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: కులశేఖర్
గానం: శ్రేయగోషల్

సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటె ప్రేమ
మనసునాప తరమా
రమ్మంటు నన్ను లాగుతుంటె ప్రేమ
నా కళ్ళల్లొ వాకిళ్ళల్లో ఉయ్యాలలూగె ప్రేమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సిందులేసి సూడవమ్మ
వయసునాప తరమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మ నాలొ నేను లేనోయమ్మ
ప్రేమ వింత వరమా

సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటె ప్రేమ
మనసునాప తరమా
రమ్మంటు నన్ను లాగుతుంటె ప్రేమ

ఓ చల్ల గాలి ఆ నింగి దాటి
ఈ పిల్ల గాలి వైపు రావా
ఊహల్లొ తేలి నీ ఒళ్ళొ వాలి
నా ప్రేమ ఊసులాడనీవా
పాల నురుగుల పైన పరుగులు తీసి పాలు పంచుకోవా
పూల మధురిమ కన్న మధురము కాద ప్రేమ గాధ వినవా

సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటె ప్రేమ
మనసునాప తరమా
రమ్మంటు నన్ను లాగుతుంటె ప్రేమ

డోలారె డోల డోలారె డోల
మోగింది చూడు గట్టి మేళ
బుగ్గె కందేలా సిగ్గె పడేలా
నాకొచ్చెనమ్మ పెళ్ళి కల
మబ్బు పరుపుల మాటు మెరుపుల మేన పంపెనమ్మ వాన
నన్ను వలచిన వాడు వరుడై రాగా ఆద మరచి పోనా

సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటె ప్రేమ
మనసునాప తరమా
రమ్మంటు నన్ను లాగుతుంటె ప్రేమ
నా కళ్ళల్లొ వాకిళ్ళల్లో ఉయ్యాలలూగె ప్రేమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సిందులేసి సూడవమ్మ
వయసునాప తరమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మ నాలొ నేను లేనోయమ్మ
ప్రేమ వింత వరమా

ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా

ఎవడు (2013)




చిత్రం: ఎవడు (2013)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రేయాఘోషల్, కార్తీక్


నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నేనడవాలి
నీ నిజమై నేనిలవాలి
నీ ఊపిరి నేనే కావాలీ

నాకే తెలియని నను చూపించి
నీకై పుట్టాననిపించి
నీదాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి
నా పేరుకి అర్ధం మార్చీ
నేనంటే నువ్వనిపించావే

నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నేనడవాలి
నీ నిజమై నేనిలవాలి
నీ ఊపిరి నేనే కావాలీ

కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా
రాలేదే ?  జాడైనా లేదే ?
రెప్పల బైటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా
పడుకోవే ? పైగా తిడతావే ?
లోకంలో లేనట్టె మైకంలో నేనుంటే వదిలేస్తావ నన్నిలా
నీ లోకం నాకంటె యింకేదో ఉందంటే నమ్మే మాటలా

నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి

తెలిసీ తెలియక వాలింది
నీ నడుమొంపుల్లో నలిగింది
నా చూపూ ఏం చేస్తాం చెప్పూ
తోచని తొందర పుడుతోంది
తెగ తుంటరిగా నను నెడుతోంది
నీ వైపూ  నీదే ఆ తప్పూ
నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ
విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా

నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నేనడవాలి
నీ నిజమై నేనిలవాలి
నీ ఊపిరి నేనే కావాలీ




**********   *********   **********


చిత్రం: ఎవడు (2013)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాగర్ , రనైనా రెడ్డి

ఆహ ఒహొ వాటే కుర్రొడే
అందరి మనసులు దోచేస్తున్నాడే
కన్నే గీటి కన్నె గుండెల్ని ఎండల్లో
వానల్లో మంచుల్లో ముంచేస్తున్నాడే

హెయ్ నిన్ను చూడకుంటె చాలు చంపల్లొన పింపిల్
నీ చూపె తాకిందంటె బుగ్గల్లోన డింపిల్
నువ్వు లేని లైఫంటేనే సైకిల్ లేని హ్యండిల్
నా తోడై నువ్వే ఉంటే థౌజండ్ వాట్స్ కాండిల్ల్
హెయ్ ముట్టుకుంటె నువ్వు సిగ్గులన్ని పంక్చర్
ముట్టడించి వెసెయ్ ముద్దుల్తోనే టింక్చర్
అప్పగించినావె సోకులున్న లాకర్
మంటపెట్టినావె గుండెల్లొనె క్రాకర్
కమాన్ కమాన్ యు ఆరె మై బ్యుటి పాకెట్టు
కమాన్ కమాన్ యు ఆరె మై రోజా లాకెట్టు

ఆహ ఒహొ వాటే కుర్రొడే
అందరి మనసులు దోచేస్తున్నాడే
కన్నే గీటి కన్నె గుండెల్ని ఎండల్లో
వానల్లో మంచుల్లో ముంచేస్తున్నాడే

నీ వల్లేరా ఒల్లంత ఫీవర్ తగిలిస్తావ నీ చేతి కూలర్
చలి గ గిలి గ చేస్తాలే ఫేవర్ ఫ్రీజైపోతె థర్మొమీటర్
రెపర్ లో ఉన్న ఆపిల్ ఫొనల్లే
ఒపెన్ చెయ్ నన్ను సూపర్ మేనల్లే
రెయిన్బో లో లేని ఇంకో రంగల్లె నీలో పొంగే చూశాలే

కమాన్ కమాన్ యు ఆరె మై బేబీ బుల్లెట్టు
కమాన్ కమాన్ యు ఆరె మై రుబీ లాకెట్టు

నిదరె మాని నీకొసం వెయిటింగ్ నువ్వె రాక గోల్లన్ని బైటింగ్
పక్కన పెడతా ఇన్నాల ఫాస్టింగ్
ఇప్పుడే నీతొ ముద్దుల మీటింగ్
అల్మర నిండా అందం దాచాలే
అమాంతం నీకు వెల్కమ్ చెప్పాలే
అబ్బొ ఫుల్ల్మూన్ ల ఉన్న పాపడ్ నువ్వెలే
రైట్ నవ్ టేస్టే చుస్తాలే

కమ కమ కమ కమాన్ కమాన్ యు ఆరె మై పిల్ల పుల్లట్టు
కమాన్ కమాన్ యు ఆరె మై కారమ్ కట్లెట్టు



**********   *********   **********



చిత్రం: ఎవడు (2013)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: దేవీ శ్రీ ప్రసాద్, సుచిత్ సురేషన్

ఫ్రీడమ్... ఫ్రీడమ్...
పొగరు పోటి మాదే వయసు వేడి మాదే
ఎదిగే హక్కు మాదే వేధం వేగం మాదే
పోరు పంతం మాదే ఉడికె రక్తం మాదే
గెలిచే నైజం మాదే ఈ సిద్దాంతం మాదే
ఎవడెంత ఐన భయమే ఎరుగని
యవ్వన మంత్రం మాదే మాదే మాదేలే

ఫ్రీడమ్... ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్... ఇది యువతకు మంత్రం
ఫ్రీడమ్... ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్... టచ్ చేస్తే చేస్తాం అంతం

తెల్లని కాగితం రాసుకో  జీవితం
ఏదిర శాశ్వతం కీర్తిరా నిరంతరం
నీ తెగువే చూపైన నీ గాధను చాటెయ్ నా
తెలుగు వీర లేవరా
నీ ధాటికి ఎవరైన నీకెదురే నిలిచేన
నిన్నె నువ్వు నమ్మావంటే లోకం నీదేరా

ఫ్రీడమ్... ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్... ఇది యువతకు మంత్రం
ఫ్రీడమ్... ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్... టచ్ చేస్తె చేస్తాం అంతం

ఎందరో ఆశకి కొందరే ఊపిరి
అందులో ఒకడివై వెలగర వెయ్యేలకి
ఏలేసే రాతుంటె ఏ ఊర్లో నువ్వున్న
వెతుకుతారు చూడరా
నీ చూపుకి మాటుంటె ఆ మాటకు ఊపుంటే
ఎవడో ఎపుడో చరితకు పునాదే నువ్వేరా

ఫ్రీడమ్... ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్... ఇది యువతకు మంత్రం
ఫ్రీడమ్... ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్... టచ్ చేస్తె చేస్తాం అంతం




**********   *********   **********



చిత్రం: ఎవడు (2013)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్, మమతా శర్మ

హే గాజువాక సెంటరు కాడా
గాజుల కొట్టు గంగారావు
గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు
సైజె చూస్తా రమ్మంటు నా చేతులు గిల్లాడో

అయ్యో పాపం అయ్యో పాపం

హెయ్ జువ్వలపాలెం జంక్షన్ కాడా
ఆ టైలరు షాపు టైగర్ బాబు
అర్రెయ్...జువ్వలపాలెం జంక్షన్ కాడా
టైలరు షాపు టైగర్ బాబు
చూపులతోనె సుట్టుముట్టి కొలతలు తీశాడే

అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం

ఖద్దరు షేక్ ఖాజవలి అత్తరు లెక్కన మత్తే జల్లి
ఆడ ఈడ తేడ తేడ చేశాడే అయ్యొ పాపం
మిర్చి హొటలు మున్నాగాడు
పౌల్ట్రి ఫారం  పండుగాడు
బూటీ పార్లర్ బంటి గాడు
చీకటైతె చాలు పిట్టగోడ దూకుడే

హెయ్ అయ్యో పాపం
హే అయ్యో అయ్యో పాపం
అర్రె అయ్యో పాపం
హే అయ్యయ్యయ్యో పాపం

ఆ తింగరి మల్లిగాడు మా దగ్గర చుట్టం వాడు
వెళ్దాం పద ఐమక్స్ అంటు టికెట్టు తీశాడు
తీర క్లైమక్స్ అయ్యెలోనే  నన్ను యక్స్-రెయ్ తీశాడు
ఏ చాల్లె టక్కుటమారి చెప్పమాకెయ్ కాకమ్మ స్టోరి
ఇంటర్వెల్ కు నీకు ఇంకొ పార్టి సెట్టైపొయాడు
పాపం టికెట్టు తీసిన మల్లిగాడు బుక్కైపోయాడు
ఒయ్ అమాయకంగా ఉండేదాన్ని
అమ్మాయిల్లో  కొత్తరకాన్ని
హయ్యొరామ నాపై ఇన్ని నింధలు ఎందుకని
హెయ్ జంతరు మంతరు కంత్రి రాని
ఎక్కువలన్ని తక్కువ కాని
నీ ఫ్రంట్ బ్యాకు హిస్టరి మొత్తం తెలిసిన కుర్రాడ్ని
మా అమ్మతోడు నానమ్మతోడు
ఊరికి వచ్చిన మైసమ్మతోడు
ఏ పాడుమచ్చ ఎరగదు ఈడు
అయిన గాని నన్నీ పోరగాడు నమ్మడే

హెయ్ అయ్యో పాపం
హే అయ్యయ్యయ్యో  పాపం

హే స్టూడెంట్ కుర్రగాడు మా పక్కింట్లో ఉండేవాడు
ఇంగ్లీష్ నాకు నేర్పిస్తానంటూ ట్యూషన్ పెట్టాడు
తీరా ఇంటికి పోతే ఇంగ్లీష్ ముద్దుల టెన్షన్ పెట్టాడు
ఏలెడు పిల్లోడె వాడు LKG చదివే వాడు
నీలాంటి పోరి పక్కింట్లో ఉంటే పాడైపోతాడు
పచ్చి పిందంటి వాడు నీ చూపు సోకి పండిపోతాడు
అంతో ఇంతో అందంగా ఉంటా
ఆయస్కాంతాన్నే మింగేసి ఉంటా
అందరి కళ్ళు నా మీద పడితే అరిగి పోతుందే
అక్కడ ఇక్కడ ఎవ్వరికంట ఎక్కువే నువ్వు చప్పవే గుంట
నీకంత సీన్ సినిమా లేదు తెలుసుకోమన్నా
ఒలమ్మోలమ్మో వీడెక్కడోడే నా నెత్తికెక్కి తైతక్కలాడే
ఏ మాట అన్నా వేడెక్కుతాడే వీడి జోలికెళితే
వీపు మోత మోగుడే

హెయ్ అయ్యో పాపం
హే అయ్యో అయ్యో పాపం
అర్రె అయ్యో పాపం
హే అయ్యయ్యయ్యో పాపం



**********   *********   **********


చిత్రం: ఎవడు (2013)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె. కె.

మండే సూరిడల్లే నిండే నిప్పులల్లే
భగ భగమన్నది నీ హృదయం
పొంగే ఉప్పెనల్లే మింగె మృత్యువల్లే
పగ పగ అన్నది నా హృదయం
ఇలా ఇలా జ్వలించుతోంది నా ఎద
ఎడారిలా జలించే నా పగా

చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే ఈ దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో
నిండే ఉందే నీ ప్రాణం

పువ్వేదో నన్ను తాకితే నవ్వేదో నన్ను చేరితే
నువ్వేదో అన్న తీపి ఙ్ఞాపకం
వెన్నెల్లు వెన్ను మీటితే కన్నీల్లు కన్ను దాటితే
నన్నల్లుకున్న చూపు ఙ్ఞాపకం
ప్రతీ దినం ప్రతీ క్షణం
నీ ప్రేమలో ప్రదక్షణం
తెగించమంది నన్నే తక్షణం

ఓ చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే ఈ దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో
నిండె ఉందే నీ ప్రాణం

ప్రయానమాయె జీవితం
ప్రమాదమాయె నా పధం
శరీరమాయె మారణాయుధం
నరాల రక్త సాగరం
కణాల అగ్ని పర్వతం
కలేసి రాసే మృత్యు శాసనం
ఒకే వ్రతం వినాశనం
ఒకే విధం విధ్వంసనం
నా వేటకింక లేదే విరమనం

ఓ చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే ఈ దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో
నిండె ఉందే నీ ప్రాణం


**********   *********   **********


చిత్రం: ఎవడు (2013)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: డేవిడ్ సైమోన్, ఆండ్రియా

ఓయె ఒయె నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయె ఒయె మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయే
ఓయె ఒయె నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయె ఒయె లిప్ లోనే కాస్త రెడ్ ఎక్కువైపోయే
చలో చలో ఓ వీర నే చలాకి జానని రా
హే హలో హలో సుకుమార ఇక రారా రారా రా
న న న న న న don’t follow me ఓ హసీనా
న న న న న న స్పేసే లేదు నా గుండెలోనా

ఓయె ఒయె నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయె ఒయె మనసుకేమో రెండు రెక్కలొచ్చినాయే

ఐ ఫోన్  నేను నన్ను టచ్ చెయ్ సుందరాంగుడా
Love wi-fi ని నన్ను connect చేస్కో జరా
నీ network కి నా చుట్టు పక్క సిగ్నలుండదే
ఎంత ట్రై చెయి నా లైను నీకు అసలు అందదే
ఎంత కాలమోయి సోలోగ నీ soul-mate నేనుండంగా
నీకంత సీను లేదే పిల్లా నన్ను గుచ్చి గుచ్చి చంపమాకిలా
న న న న న న don’t follow me ఓ హసీనా
న న న న న న స్పేసే లేదు నా గుండెలోనా

నాతో డేట్ కి వస్తే నీ సొమ్మేం పోదు కదా
Cup coffee ఇస్తే పెద్ద తప్పేం జరిగిపోదు గా
ఒక డేట్ తోటి నీ ఫేటేమీ మారిపోదే
ఇష్టమంటు లేని రొమాన్స్  లో టేస్ట్ ఉండదే
నీ హార్ట్ బుక్ ఓపెన్  చేస్తా నీ ఇష్టమేంటో కనిపెట్టేస్తా
అది అంత సులువు కాదే బేలా
నువు పగటి కలలు కనకులే ఇలా
న న న న న న don’t follow me ఓ హసీనా
న న న న న న స్పేసే లేదు నా గుండెలోనా