చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : కోసరాజు
నేపధ్య గానం : మాధవపెద్ది సత్యం, జిక్కి
పల్లవి :
చెక్కిలి మీద చెయ్యి వేసి... చిన్నదానా
నీవు చింతబోదువెందుకే... ఇంతలోనా
నీ చిక్కులన్ని తీరిపోయె... చిటికెలోనా
చేసిన మేలు మరువలేను... చిన్నవాడా
నీకు చేతులెత్తి మొక్కుతాను... వన్నెకాడా
నా జీవితమే మారిపోయే... నేటితోడా
చరణం 1 :
ఆడదాని బ్రతుకంటే... తీగవంటిది
బాగ నీరు పోసి పెంచకుంటె... సాగనంటదీ
ఆడదాని బ్రతుకంటే... తీగవంటిది
మగతోడు ఉంటేనే... జోరుగుంటదీ
అది మూడు పూలు... ఆరుకాయలవుతుంటది
చెక్కిలి మీద చెయ్యి వేసి... చిన్నదానా
నీవు చింతబోదువెందుకే... ఇంతలోనా
నీ చిక్కులన్ని తీరిపోయె... చిటికెలోనా
చదువు సంధ్యా లేని... చవటను గానోయ్
నీ చాతుర్యమంతా నేను... కనిబెడితినోయ్
చదువు సంధ్యాలేని... చవటను గానోయ్
మగవారి నాటకాలు.. వినియుంటినోయ్
వారి మోజులెంత బూటకాలొ... తెలుసుకొంటినోయ్
చేసిన మేలు మరువలేను... చిన్నవాడా
నీకు చేతులెత్తి మొక్కుతాను... వన్నెకాడా
నా జీవితమే మారిపోయే... నేటితోడా
చరణం 2 :
ఒంటిగానే బ్రతుకంతా... నడుపుకొందువా
అబ్బా జంట జోలి లేకుండా... జరుపుకొందువా
ఒంటిగానే బ్రతుకంతా... నడుపుకొందువా
లోకులంటే కాకులనీ... మర్చిపోదువా
ఈ లోకమంటే లెక్కలేక... ఎగిరిపోదువా
చెక్కిలి మీద చెయ్యివేసి... చిన్నదానా
నీవు చింతబోదువెందుకే... ఇంతలోనా
నీ చిక్కులన్ని తీరిపోయె... చిటికెలోనా
ఊకదంపు నీతులన్నీ... ఆలకిస్తినోయ్
నీ ఊహలోని కిటుకంతా... విప్పి చూస్తినోయ్
ఊకదంపు నీతులన్నీ... ఆలకిస్తినోయ్
సూటి పోటి మాటలన్నీ... కట్టిపెట్టవోయ్
ఇంక చాటుమాటు చూపులన్నీ... దాచిపెట్టవోయ్
చేసిన మేలు మరువలేను... చిన్నవాడా
నీకు చేతులెత్తి మొక్కుతాను... వన్నెకాడా
నా జీవితమే మారిపోయే... నేటితోడా
*** ******* ***** *********** *******
చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : సుశీల, సరోజిని
పల్లవి:
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
చరణం 1:
సతి ధర్మం పతి సేవేయని పతి భక్తిని చూపాలి
అనుదినము అత్త మామల పరిచర్యలనే చేయాలి
పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి
పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి
పదిమంది నీ సుగుణాలే పలుమార్లు పొగడాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
చరణం 2:
ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి
సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి
శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి
శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి
సుఖమైనా అసత్యమైనా సగపాలుగా మెలగాలి
హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
చరణం 3:
ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు
చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగద్దు
అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు
అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు
తరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు
హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
*** ******* ***** *********** *******
చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
వాడిన పూలే వికసించెనే
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ..
వాడిన పూలే వికసించెనే
తీయని కలలే ఫలియించెనే
తీయని కలలే ఫలియించెనే
యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ...
తీయని కలలే ఫలియించెనే
చరణం 1:
వేయిరేకులు విరిసింది జలజం
తీయ తేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక వుద్యానవనము...
లోటు లేదిక మనదే సుఖము ...
తీయని కలలే ఫలియించెనే
యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ...
తీయని కలలే ఫలియించెనే
చరణం 2:
పగలే జాబిలి ఉదయించెనేలా..
వగలే చాలును పరిహాసమేలా...
పగలే జాబిలి ఉదయించెనేలా...
వగలే చాలును పరిహాసమేలా...
తేట నీటను నీ నవ్వు మొగమే
తేలియాడెను నెలరేని వలెనే..
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ..
వాడిన పూలే వికసించెనే
చరణం 3:
జీవితాలకు నేడే వసంతం...
చేదిరిపోవని ప్రేమానుబంధం
ఆలపించిన ఆనంద గీతం...
ఆలకించగ మధురం మధురం ...
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ..
వాడిన పూలే వికసించెనే
*** ******* ***** *********** *******
చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ విధియే పగాయె
పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ.. విధియే పగాయె
చరణం 1:
చిననాటి పరిణయ గాథ ఎదిరించలేనైతినే
చిననాటి పరిణయ గాథ ఎదిరించలేనైతినే
ఈనాటి ప్రేమగాథ తలదాల్చలేనైతినే
కలలే నశించిపోయే మనసే కృశించిపోయే
విషమాయె మా ప్రేమ విధియే పగాయె
పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ విధియే పగాయె
చరణం 2:
మొగమైన చూపలేదే మనసింతలో మారెనా
మొగమైన చూపలేదే మనసింతలో మారెనా
నా ప్రాణ సతివని తెలిపే అవకాశమే పోయెనా
తొలినాటి కలతల వలన హృదయాలు బలి కావలెనా
విషమాయె మా ప్రేమ విధియే పగాయె
పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ.. విధియే పగాయె
*** ******* ***** *********** *******
చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : సుశీల
పల్లవి:
ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడేనా హృదయం
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
చరణం 1:
కలకలలాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము
తీయని ఊహల ఊయల లూగి
తేలే మానసము... ఏమో...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
చరణం 2:
రోజూ పూచే రోజా పూలు
ఒలికించినవి నవరాగాలు
ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..
పరిచయమైన కోయిల పాటే
కురిసే అనురాగం... ఏమో....
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
చరణం 3:
అరుణ కిరణముల గిలిగింతలలో
తరగిన తెలిమంచు తెరలే తరలి
ఎరుగని వింతలు ఎదుటే నిలిచి
వెలుగే వికసించే... ఏమో...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం...
*** ******* ***** *********** *******
చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
ఓ...ఓ...
ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే
ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే
ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే
చరణం 1:
జలతారు మేలిమబ్బు పరదాలు నేసి.. తెరచాటు చేసి
పలుమారు దాగి దాగి పంతాలుపోయి.. పందాలు వేసి
అందాల చందమామ దొంగాటలాడెనే.. దోబూచులాడెనే
ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే..
ఆ... ఓ.. ఆ... ఓ...
చరణం 2:
ఆ... ఓ.. ఆ... ఓ...
జడివాన హోరు గాలి సుడి రేగి రానీ.. జడిపించబోనీ
కలకాలం నీవే నేననీ పలు బాసలాడి.. చెలి చెంత చేరి...
అందాల చందమామ అనురాగం చాటెనే.. నయగారం చేసెనే
ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే..
ఆ... ఓ.. ఆ... ఓ...
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : కోసరాజు
నేపధ్య గానం : మాధవపెద్ది సత్యం, జిక్కి
పల్లవి :
చెక్కిలి మీద చెయ్యి వేసి... చిన్నదానా
నీవు చింతబోదువెందుకే... ఇంతలోనా
నీ చిక్కులన్ని తీరిపోయె... చిటికెలోనా
చేసిన మేలు మరువలేను... చిన్నవాడా
నీకు చేతులెత్తి మొక్కుతాను... వన్నెకాడా
నా జీవితమే మారిపోయే... నేటితోడా
చరణం 1 :
ఆడదాని బ్రతుకంటే... తీగవంటిది
బాగ నీరు పోసి పెంచకుంటె... సాగనంటదీ
ఆడదాని బ్రతుకంటే... తీగవంటిది
మగతోడు ఉంటేనే... జోరుగుంటదీ
అది మూడు పూలు... ఆరుకాయలవుతుంటది
చెక్కిలి మీద చెయ్యి వేసి... చిన్నదానా
నీవు చింతబోదువెందుకే... ఇంతలోనా
నీ చిక్కులన్ని తీరిపోయె... చిటికెలోనా
చదువు సంధ్యా లేని... చవటను గానోయ్
నీ చాతుర్యమంతా నేను... కనిబెడితినోయ్
చదువు సంధ్యాలేని... చవటను గానోయ్
మగవారి నాటకాలు.. వినియుంటినోయ్
వారి మోజులెంత బూటకాలొ... తెలుసుకొంటినోయ్
చేసిన మేలు మరువలేను... చిన్నవాడా
నీకు చేతులెత్తి మొక్కుతాను... వన్నెకాడా
నా జీవితమే మారిపోయే... నేటితోడా
చరణం 2 :
ఒంటిగానే బ్రతుకంతా... నడుపుకొందువా
అబ్బా జంట జోలి లేకుండా... జరుపుకొందువా
ఒంటిగానే బ్రతుకంతా... నడుపుకొందువా
లోకులంటే కాకులనీ... మర్చిపోదువా
ఈ లోకమంటే లెక్కలేక... ఎగిరిపోదువా
చెక్కిలి మీద చెయ్యివేసి... చిన్నదానా
నీవు చింతబోదువెందుకే... ఇంతలోనా
నీ చిక్కులన్ని తీరిపోయె... చిటికెలోనా
ఊకదంపు నీతులన్నీ... ఆలకిస్తినోయ్
నీ ఊహలోని కిటుకంతా... విప్పి చూస్తినోయ్
ఊకదంపు నీతులన్నీ... ఆలకిస్తినోయ్
సూటి పోటి మాటలన్నీ... కట్టిపెట్టవోయ్
ఇంక చాటుమాటు చూపులన్నీ... దాచిపెట్టవోయ్
చేసిన మేలు మరువలేను... చిన్నవాడా
నీకు చేతులెత్తి మొక్కుతాను... వన్నెకాడా
నా జీవితమే మారిపోయే... నేటితోడా
*** ******* ***** *********** *******
చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : సుశీల, సరోజిని
పల్లవి:
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
చరణం 1:
సతి ధర్మం పతి సేవేయని పతి భక్తిని చూపాలి
అనుదినము అత్త మామల పరిచర్యలనే చేయాలి
పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి
పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి
పదిమంది నీ సుగుణాలే పలుమార్లు పొగడాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
చరణం 2:
ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి
సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి
శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి
శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి
సుఖమైనా అసత్యమైనా సగపాలుగా మెలగాలి
హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
చరణం 3:
ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు
చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగద్దు
అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు
అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు
తరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు
హాయిగా.. చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
*** ******* ***** *********** *******
చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
వాడిన పూలే వికసించెనే
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ..
వాడిన పూలే వికసించెనే
తీయని కలలే ఫలియించెనే
తీయని కలలే ఫలియించెనే
యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ...
తీయని కలలే ఫలియించెనే
చరణం 1:
వేయిరేకులు విరిసింది జలజం
తీయ తేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక వుద్యానవనము...
లోటు లేదిక మనదే సుఖము ...
తీయని కలలే ఫలియించెనే
యెల కొయిల తన గొంతు సవరించెనే..ఏ..ఏ...
తీయని కలలే ఫలియించెనే
చరణం 2:
పగలే జాబిలి ఉదయించెనేలా..
వగలే చాలును పరిహాసమేలా...
పగలే జాబిలి ఉదయించెనేలా...
వగలే చాలును పరిహాసమేలా...
తేట నీటను నీ నవ్వు మొగమే
తేలియాడెను నెలరేని వలెనే..
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ..
వాడిన పూలే వికసించెనే
చరణం 3:
జీవితాలకు నేడే వసంతం...
చేదిరిపోవని ప్రేమానుబంధం
ఆలపించిన ఆనంద గీతం...
ఆలకించగ మధురం మధురం ...
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే..ఏ..ఏ..
వాడిన పూలే వికసించెనే
*** ******* ***** *********** *******
చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ విధియే పగాయె
పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ.. విధియే పగాయె
చరణం 1:
చిననాటి పరిణయ గాథ ఎదిరించలేనైతినే
చిననాటి పరిణయ గాథ ఎదిరించలేనైతినే
ఈనాటి ప్రేమగాథ తలదాల్చలేనైతినే
కలలే నశించిపోయే మనసే కృశించిపోయే
విషమాయె మా ప్రేమ విధియే పగాయె
పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ విధియే పగాయె
చరణం 2:
మొగమైన చూపలేదే మనసింతలో మారెనా
మొగమైన చూపలేదే మనసింతలో మారెనా
నా ప్రాణ సతివని తెలిపే అవకాశమే పోయెనా
తొలినాటి కలతల వలన హృదయాలు బలి కావలెనా
విషమాయె మా ప్రేమ విధియే పగాయె
పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ.. విధియే పగాయె
*** ******* ***** *********** *******
చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : సుశీల
పల్లవి:
ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడేనా హృదయం
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
చరణం 1:
కలకలలాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము
తీయని ఊహల ఊయల లూగి
తేలే మానసము... ఏమో...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
చరణం 2:
రోజూ పూచే రోజా పూలు
ఒలికించినవి నవరాగాలు
ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..
పరిచయమైన కోయిల పాటే
కురిసే అనురాగం... ఏమో....
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
చరణం 3:
అరుణ కిరణముల గిలిగింతలలో
తరగిన తెలిమంచు తెరలే తరలి
ఎరుగని వింతలు ఎదుటే నిలిచి
వెలుగే వికసించే... ఏమో...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం...
*** ******* ***** *********** *******
చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
ఓ...ఓ...
ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే
ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే
ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే
చరణం 1:
జలతారు మేలిమబ్బు పరదాలు నేసి.. తెరచాటు చేసి
పలుమారు దాగి దాగి పంతాలుపోయి.. పందాలు వేసి
అందాల చందమామ దొంగాటలాడెనే.. దోబూచులాడెనే
ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే..
ఆ... ఓ.. ఆ... ఓ...
చరణం 2:
ఆ... ఓ.. ఆ... ఓ...
జడివాన హోరు గాలి సుడి రేగి రానీ.. జడిపించబోనీ
కలకాలం నీవే నేననీ పలు బాసలాడి.. చెలి చెంత చేరి...
అందాల చందమామ అనురాగం చాటెనే.. నయగారం చేసెనే
ఆకాశవీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి
ఉయ్యలలూగెనే సయ్యాటలాడెనే..
ఆ... ఓ.. ఆ... ఓ...
No comments:
Post a Comment