చిత్రం: కల్పన (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
వదలనురా నిను రఘురామా...
వదలనురా నిను రఘురామా..
నా జీవితమే.. నవపారిజాతము
నా జీవితమే.. నవపారిజాతము
ఏనాడో..ఓ... నీకే..ఏ..ఏ..ఏఏ..ఏఏ..ఏఏ
అంకితమూ..
వదలనురా నిను రఘురామా...
చరణం 1:
నా భావములో.. జీవము నీవే
నా గానములో.. మాధురి నీవే
నా భావములో.. జీవము నీవే
నా గానములో.. మాధురి నీవే
తోడు నీడా..ఆ..ఆ.. మనుగడ నీవే
తోడు నీడా..ఆ..ఆ.. మనుగడ నీవే
నను నడిపించే దైవము నీవే..
వదలను.. వదలను.. వదలనురా నిను రఘురామా
చరణం 2:
కోరను ఎపుడూ.. సిరిసంపదలు
అడగను నిన్నూ.. వేరే వరములు
కోరను ఎపుడూ.. సిరిసంపదలు
అడగను నిన్నూ.. వేరే వరములు
పావనమౌ నీ పదములే చాలు
పావనమౌ నీ పదములే చాలు
నను పాలించే సౌభాగ్యాలు..
వదలను... వదలను..
వదలను రా నిను రఘురామా..
నా జీవితమే నవపారిజాతము..
ఏనాడో అది నీకే... ఏ..ఏ..ఏ..ఏ
అంకితము......
********* ************ *************** ********
చిత్రం: కల్పన (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: సుశీల, జి.ఆనంద్
పల్లవి:
దిక్కులు చూడకు రామయ్యా.. పక్కనే ఉన్నది సీతమ్మా
దిక్కులు చూడకు రామయ్యా.. పక్కనే ఉన్నది సీతమ్మా..సీతమ్మా..
సిరిమల్లె నవ్వుల సీతమ్మా.. ముందుకు రావే ముద్దుల గుమ్మ
సిరిమల్లె నవ్వుల సీతమ్మా... ముందుకు రావే ముద్దుల గుమ్మ...ముద్దులగుమ్మా
దిక్కులు చూడకు రామయ్య
చరణం 1:
ఎదనే దాచుకుంటావో... నా ఎదనే దాగిఉంటావో..ఓ...
ఎదనే దాచుకుంటావో... నా ఎదనే దాగిఉంటావో..ఓ...
కదలికలన్నీ కథలుగ అల్లి కవితలే రాసుకుంటావో..రామయ్యా..
పొన్నలు పూచిన నవ్వు... సిరివెన్నెల దోచి నాకివ్వు.
పొన్నలు పూచిన నవ్వు... సిరివెన్నెల దోచి నాకివ్వు.
ఆ వెన్నెలలో... నీ కన్నులలో... ఆ వెన్నెలలో..నీ కన్నులలో..
సన్నజాజులే రువ్వు.. కను సన్నజాజులే రువ్వు.. సన్నజాజులే రువ్వు..
కను సన్నజాజులే రువ్వు.. సీతమ్మా..సీతమ్మా దిక్కులు చూడకు రామయ్య
చరణం 2:
కలలో మేలుకుంటావో.. నా కళలే ఏలుకుంటావో..
కలలో మేలుకుంటావో.. నా కళలే ఏలుకుంటావో..
కలలిక మాని కలయికలో..నా కనులలో చూసుకుంటావో.. రామయ్యా
వెల్లువలైనది సొగసు.. తొలివేకూవ నీ మనసు..
వెల్లువలైనది సొగసు.. తొలివేకూవ నీ మనసు..
ఆ వెల్లువలో... నా పల్లవిలో.. ఆ వెల్లువలో.. నా పల్లవిలో..
రాగమే పలికించు.. అనురాగమై పులకించు..రాగమే పలికించు..
అనురాగమై పులకించు..సీతమ్మా..సీతమ్మా.. దిక్కులు చూడకు రామయ్య
********* ************ *************** ********
చిత్రం: కల్పన (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు
పల్లవి:
ఇది నా కల్పన.. కవితాలాపన.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఒక ఉదయంలో... నా హృదయంలో
ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..
కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన
ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..
చరణం 1:
తార తారకి నడుమ ఆకాశం ఎందుకో
పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో..
తార తారకి నడుమ ఆకాశం ఎందుకో
పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో..
మనిషి మనిషికీ మద్య మనసనేది ఎందుకో
మనసే గుడిగా.. మనిషికి ముడిగా..
మమత ఎందుకో.. మమత ఎందుకో..
తెలియని ఆవేదనే ఆలాపన
తెలుసుకున్న వేదనే కల్పనా..
అది ఒక కల్పన.. అది నా కల్పన...
ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..
చరణం 2:
దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే
పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే
దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే
పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే
కవి మనస్సులో ఉషస్సు కారు చీకటౌతుంటే
మిగిలిన కథలో.. పగిలిన ఎదలో..
ఈ కవితలెందుకో.. కవితలెందుకో..
తెలియని ఆవేదనే ఆలాపన
తెలుసుకున్న వేదనే కల్పనా..
అది ఒక కల్పన.. అది నా కల్పన..
ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..
కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన

No comments:
Post a Comment