కూతురు కోడలు (1971)

చిత్రం :  కూతురు కోడలు (1971)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  బాలు, వసంత 

పల్లవి :

గాజులు ఘల్లనగానే జాజులు ఘుమ్  ఘుమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే

తుమ్మెద ఝుమ్ ఝుమ్మనగానే తెమ్మెర రా రమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే 

చరణం 1 :

నీ కాటుక కన్నుల సొగసు...  నీ చెంగున దూకే వయసు
నన్నెంతో తొందరచేసే... నీ కౌగిట బందీ చేసే

వెచ్చని వెన్నెలలోన...  విచ్చిన కలువను చూసీ 
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే

చరణం 2  :

నీ కదిలే పెదవులు చూసి...  నా మెరిసే చెక్కిలి మురిసి
నీ వెచ్చని ఒడిలో చేరి...  నా వయసే పొంగెను నేడే

కోయిల కోయనగానే కొమ్మలు ఓయనగానే   
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే

చరణం 3 :

నలనల్లని ఆకాశంలో...  తెలతెల్లని మేఘంలాగా
నల్లని ఆకాశంలో తెలతెల్లని మేఘంలాగా
నీ నీలికురులలో విరిసే మరుమల్లెలు నావే నావే

నీ హృదయపు పందిరిమీద పెనవేసిన మమతల తీగ
హృదయపు పందిరిమీద...  పెనవేసిన మమతల తీగ
విరబూసిన వలపుల పూలే ఏ నాటికి నావే నావే 

గాజులు ఘల్లనగానే...  జాజులు ఘుమ్మనగానే
నీవే అనుకున్నాలే...  అది నీవే అనుకున్నాలే

తుమ్మెద ఝుమ్మనగానే...   తెమ్మెర రమ్మనగానే
నీవే అనుకున్నాలే... అది నీవే అనుకున్నాలే

లలలాలాలాలాలల.... లలలాలాలాలాలలలలా

No comments:

Post a Comment