చిత్రం : గోపాలుడు భూపాలుడు (1967)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
ఊఁ... చూడకూ
చూడకు చూడకూ
చూడకు చూడకూ
చూడకు చూడకు... మరీ అంతగా చూడకు ....
మనసుతో చెరలాడకు... మనసుతో చెరలాడకు
చరణం 1 :
విరుల పానుపున పరచిన మల్లెలు... ఒదిగి ఒదిగి చూస్తున్నాయి
విరుల పానుపున పరచిన మల్లెలు... ఒదిగి ఒదిగి చూస్తున్నాయి
ఆకాశాన విరిసిన తారలు... అదే పనిగ చూస్తున్నాయి
ఆకాశాన విరిసిన తారలు... అదే పనిగ చూస్తున్నాయి
ఇన్ని చూడగా లేనిది... ఊఁ... నేను చూడనేమైనది
ఊఁ...... ఊఁ......
ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ......
హాయ్... ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.
చూడని చూడనీ... చూడనీ చూడనీ
చూసిన అందమె... తిరిగి తిరిగి నను చూడనీ
తేనె మనసు తెరతీయనీ... తేనె మనసు తెర తీయనీ
చరణం 2 :
అసలే ఏవో మిసిమి కోరికలు... కొసరి కొసరి నను కవ్వించె
అసలే ఏవో మిసిమి కోరికలు... కొసరి కొసరి నను కవ్వించె
ఆపై నాలో గడుసు వెన్నెలలు... హాయిహాయిగా రగిలించె
ఇంక నన్ను కదిలించకు... ఎదలో చూపులు దించకు
ఊఁ... ఊఁ......
ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ... ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.
చూడకూ చూడకు... చూడకూ చూడకు
చూడకు చూడకు... మరీ అంతగా చూడకు ....
మనసుతో చెరలాడకు... మనసుతో చెరలాడకు
చూడని చూడనీ...ఆఁ..... చూడనీ చూడనీ... ఆఁ.....
చూసిన అందమె తిరిగి తిరిగి నను చూడనీ
తేనె మనసు తెరతీయనీ... తేనె మనసు తెరతీయనీ... ఆఁ.....
*********** ************* ***********
చిత్రం: గోపాలుడు భూపాలుడు (1967)
సంగీతం: కోదండపాణి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
కోటలోని మొనగాడా.. కోటలోని మొనగాడా
వేటకు వచ్చావా.. వేటకు వచ్చావా
జింకపిల్ల కోసమో.. ఇంక దేనికోసమో
జింకపిల్ల కోసమో ..ఇంక దేనికోసమో
తోటలోని చినదానా.. తోటలోని చినదానా
వేటకు వచ్చానే ..వేటకు వచ్చానే
జింకపిల్ల కన్నులున్న.. చిన్నదాని కోసమే
జింకపిల్ల కన్నులున్న.. చిన్నదాని కోసమే
చరణం 1:
ఎలాటి పిల్ల అది.. ఏపాటి అందమది
ఎలాటి పిల్ల అది.. ఏపాటి అందమది
ఏ వూరు చిన్నది.. ఏ కోన వున్నది
ఏ వూరు చిన్నది.. ఏ కోన వున్నది
చారడు కన్నులది.. చామంతి వన్నెలది
చారడు కన్నులది.. చామంతి వన్నెలది
ఏ వూరు ఏమో.. నా ఎదురుగనే ఉన్నది ..
ఏ వూరు ఏమో....నా ఎదురుగనే ఉన్నది !
కోటలోని మొనగాడా.. కోటలోని మొనగాడా
వేటకు వచ్చావా.. వేటకు వచ్చావా
జింకపిల్ల కోసమో.. ఇంక దేనికోసమో
జింకపిల్ల కోసమో ..ఇంక దేనికోసమో
చరణం 2:
కత్తుల వీరునికి.. కన్నె మనసేందుకో
జిత్తుల సిపాయికి ..చెలి వలపెందుకో
కత్తుల వీరునికి.. కన్నె మనసేందుకో
జిత్తుల సిపాయికి ..చెలి వలపెందుకో
కత్తులు ఒకచేత.. గుత్తులు ఒకచేత
కత్తులు ఒకచేత.. గుత్తులు ఒకచేత
నిలిపే బంటునే ..నీకు తగిన జంటనే .. నీకు తగిన జంటనే !
కోటలోని మొనగాడా.. కోటలోని మొనగాడా
వేటకు వచ్చావా.. వేటకు వచ్చావా
జింకపిల్ల కోసమో.. ఇంక దేనికోసమో
జింకపిల్ల కోసమో ..ఇంక దేనికోసమో
తోటలోని చినదానా.. తోటలోని చినదానా
వేటకు వచ్చానే ..వేటకు వచ్చానే
జింకపిల్ల కన్నులున్న.. చిన్నదాని కోసమే
జింకపిల్ల కన్నులున్న.. చిన్నదాని కోసమే
*********** ************* ***********
చిత్రం: గోపాలుడు భూపాలుడు (1967)
సంగీతం: కోదండపాణి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, జానకి
పల్లవి:
ఒకసారి కలలోకి రావయ్యా
ఒకసారి కలలోకి రావయ్యా
నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఒకసారి రాగానే ఏమౌనులే ..
నీ హృదయాన శయనించి ఉంటానులే ..
ఏలుకుంటానులే …
ఒకసారి రాగానే ఏమౌనులే...
ఓ గొల్ల గోపయ్యా …
చరణం 1:
పగడాల నా మోవి చిగురించెరా ..
మోము చెమరించెరా .. మేను పులకించెరా
సొగసు వేణువు చేసి పలికించరా
సొగసు వేణువు చేసి పలికించరా
కెమ్మోవి పై తేనె ఒలికించనా …
కెమ్మోవి పై తేనె ఒలికించనా
తనివి కలిగించనా .. మనసు కరిగించనా
కేరింతలాడించి సోలించనా … కేరింతలాడించి సోలించనా...
ఒకసారి కలలోకి రావయ్యా.. ఆ.. ఆ..
చరణం 2:
ఒంపుసొంపుల మెరుపు మెరిపించవే
వగలు కురిపించవే.. మేను మరపించవే
మరపులో మధుకీల రగిలించవే..
మరపులో మధుకీల రగిలించవే
చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా.. ఆ..
చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా
మొగ్గ తొడిగిందిరా.. మురిసి విరిసిందిరా
పదును తేలిన వలపు పండించరా
పదును తేలిన వలపు పండించరా
ఒకసారి కలలోకి రావయ్యా
నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా.. ఓ గొల్ల గోపయ్యా
ఒకసారి రాగానే ఏమౌనులే..

No comments:
Post a Comment