ఎటో వెళ్లిపోయింది మనసు (2012)



చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్


కోటి కోటి తారల్లోన
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే

కోటి కోటి తారల్లోన
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం
తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే
గాలిలోన ఆరోప్రాణం
కలవకుండా ఉన్నన్నాళ్లు

గాలిలోన ఆరోప్రాణం
కలవకుండా ఉన్నన్నాళ్లు
నిన్ను నేనే ఆరాధిస్తా
నీ కోసమారాతీస్తా

కోటి కోటి తారల్లోన
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం
తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే

ఏడు వింతలున్నన్నాళ్లు
నీకు తోడునై ఉంటా
పాలపుంత ఉన్నన్నాళ్లు
నన్ను పంచి నేనుంటా
పాదమున్నన్నాళ్లు
నీ నడకలాగ నేనుంటా
కోరుకున్న చోటల్లా చేర్చుతా...
చేతులున్నన్నాళ్లు
నీ గీతలాగ నేనుంటా
జాతకాన్ని అందంగా మార్చుతా
అంకెలింక ఉన్నన్నాళ్లు
నీ వయస్సు సంఖ్యవనా
సంకెలల్లే బంధిస్తుంటా వంద ఏళ్లిలా

కోటి కోటి తారల్లోన
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం
తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే

భాషనేది ఉన్నన్నాళ్లు
నిన్ను పొగిడి నేనుంటా
ధ్యాసనేది ఉన్నన్నాళ్లు
నిన్ను తలచి నేనుంటా
వెలుగు ఉన్నన్నాళ్లు
నీ వెనుక నేను వేచుంటా
నువ్వేటేపు వెళుతున్నా సాగనా
మసక ఉన్నన్నాళ్లు
నీ ముందుకొచ్చి నుంచుంటా

నువ్వెలాగ ఉన్నావో చూడనా
నీకు దూరమున్నన్నాళ్లు
జ్ఞాపకంగా వెంటుంటా
మళ్లీ మళ్లీ గుర్తొస్తుంటా
ముందు జన్మలా

కోటి కోటి తారల్లోన
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం
తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే

గాలిలోన ఆరోప్రాణం

గాలిలోన ఆరోప్రాణం
కలవకుండా ఉన్నన్నాళ్లు
నిన్ను నేనే ఆరాధిస్తా
నీ కోసమారాతీస్తా

కోటి కోటి తారల్లోన
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం
తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే


*********    *********   *********


చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్

ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న
హేయ్ హెయ్
ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న
ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా
అంతంత నీ సొంతమైనా
నే నిన్ను ఎపుడై రమ్మంటాన నేనెపుడై రారమ్మంటాన
నే నా నుండి నిన్నే పోనిస్తాన
ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న
ఎంతెంత దూరం నన్ను…

పో పో మన్న పో పో మన్న

పొద్దున్నైతే సూర్యుడినై వస్తా
వెచ్చంగ నిద్దుర లేపి ఎన్నో చూపిస్తా
సందెల్లోన చంద్రున్నై వస్తా
చల్లంగా జోకొట్టేసి స్వప్నాలందిస్తా
మధ్యాహ్నం లోన  దాహన్నై మధ్య మధ్య మోహన్నై

వెంటే ఉండి వెంటాడుతా
రోజు రోజు ఇంతే ఏ రోజైనా ఇంతే
నీడై జాడై తోడై నీతో వస్తానంటే
నే నిన్ను ఎపుడై రారమ్మంటాన నేనెపుడై రారమ్మంటాన
నే నా నుండి నిన్నే పోనిస్తాన
ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న
ఎంతెంత
దూరం నన్ను…
పో పో మన్న పో పో మన్న

అద్దం లోన నేనే కనిపిస్తా అందాల చిందుల్లోన పూవై వినిపిస్తా
చుట్టూ ఉండి నేనే అనిపిస్తా ఆకాశం హద్దుల్లోన నువ్వున్నా అడ్డొస్తా
మబ్బుల్లో మాటేసి వెన్నెల్లో వాటేసి ప్రాణాన్ని ముద్దడుతా
ఏ జన్మైనా ఇంతే పైలోకాన ఇంతే
ఆది అంతం అన్ని నేనే అవుతా అంతే
నే నిన్ను ఎపుడై రారమ్మంటాన నేనెపుడై రారమ్మంటాన
నే నా నుండి నిన్నే పోనిస్తాన
ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న
ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా
అంతంత నీ సొంతమైనా
నే నిన్ను ఎపుడై రారమ్మంటాన నేనెపుడై రారమ్మంటాన
నే నా నుండి నిన్నే పోనిస్తాన

ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న


*********    *********   *********


చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ఇళయరాజా, బేల షేండే

లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేని మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నో పంచుకున్న వేళలో
మనదే సరదా సరదా

లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేని మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మ

ఇంతలో ఇలా ఎదిగిన ఆ తలపులో ఎవరికై ఈ పిలుపులో
వింత వింతగా తిరిగిన ఈ మలుపులో తన జతేను కలుపుకో
ఇదేంట చెప్పలేని ఈ భావనే పేరునుందో
తెలియదు దానికైనా ఈ వేళ
జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకేన్ని ఎన్నో
అవన్నీ బయటపడవు ఇవ్వాళ
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి

స్పర్శలాగా పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా
లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేని మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా

మాటిమాటికీ మొదలయే అలికిడి మరుక్షణం ఓ అలజడి
ఆకతాయిగా తడిమితే తడబడి తరగదే ఈ సందడి
చలాకి కంటిపూల తావీదు తాకిందిలాగ
గులాబీ లాంటి గుండె మోసేనా
ఇలాంటి గారడీల జోరింక చాలించదేల హో
ఎలాగా ఏమనాలి ఈ లీల
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శలాగా పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా
లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేని మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నో పంచుకున్న వేళలో
మనదే సరదా సరదా
లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేని మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మ



*********    *********   *********



చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: యువన్ శంకర్ రాజా

అర్ధమయ్యిందింతే ఇంతేనా  నేనంటే నీ ఇష్టం ఇంతేనా
అర్ధమయ్యిందింతే ఇంతేనా  నేనంటే నీ ఇష్టం ఇంతేనా

అర్ధమయ్యిందింతే ఇంతేనా  నేనంటే నీ ఇష్టం ఇంతేనా

నా పైన నీకున్న చూపింతేనా  నీలోన నాకున్న చోటింతేనా
నువ్వే సర్వం అంటున్నా నీకే శాంతం ఇస్తున్నా
అర్ధమయ్యిందింతేనా హో అర్ధంయ్యిందింతేనా హో హో
దారం నుంచి వేరవుతావా  పూల మాల హో హో హో
భారం పెంచి పొమ్మంటావా నాలో సగమా హో హో హో

అర్ధమయ్యిందింతే ఇంతేనా అర్ధమయ్యిందింతే ఇంతేనా

చిగురు లేక వలపు రెమ్మ శిశిరమైనదే

చెలియ లేక చెలిమి జన్మ కరుగుతున్నదే
అడుగిక సాగదే నువ్వు జత కానిదే
అలుపిక ఆగదే నీ దారి లేనిదే
పసితనాన నీ పరిచయం పలవరించటం మాననే
పాతికేళ్ళ గురుతులన్ని నన్నే ముంచి ప్రాణం తీస్తున్నా

అర్ధమయ్యిందింతే ఇంతేనా  నేనంటే నీ ఇష్టం ఇంతేనా

నా పైన నీకున్న చూపింతేనా  నీలోన నాకున్న చోటింతేనా
నువ్వే సర్వం అంటున్నా నీకే శాంతం ఇస్తున్నా
అర్ధమయ్యిందింతేనా  హో అర్ధంయ్యిందింతేనా హో హో

దారం నుంచి వేరవుతావా  పూల మాల హో హో హో
భారం పెంచి పొమ్మంటావా నాలో సగమా హో హో హో

అర్ధమయ్యిందింతే ఇంతేనా అర్ధమయ్యిందింతే ఇంతేనా



*********    *********   *********



చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సునిధి చౌహన్

అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా
నిను వలచే నా ప్రాణం
నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా
నిను పిలిచేనా నా గానం
ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే
ఒక వైపు మొండి సేగాలా కాల్చేటి కబురు నీదే
సెలవో శిలవో కధవో వ్యధవో తుదివో
నీవేనా నా పై సమీరం
నీవేనా నాలో సముద్రం సముద్రం సముద్రం

అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా
నిను వలచే నా ప్రాణం
నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా
నిను పిలిచేనా నా గానం

నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో
జీవితం నిరీక్షణగా తయారై నాతో ఉందో

నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో
జీవితమే నిరీక్షణగా తయారై నాతో ఉందో
నీదని నాదని నాకని ఏనాడూ నేననుకోనుగా
నీవని నీదని నేకని అనుకున్నాలే పొరపాటుగా
ఓ నిముషం తలపై గొడుగై మరి ఓ నిమిషం కుదిపే పిడుగై
నిశివో శశివో జతవో యతివో
నీవేనా నాలో సంగీతం
నీవేనా నాలో నిశబ్ధం నిశ్శబ్దం నిశ్శబ్దం

అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా
నిను వలచే నా ప్రాణం
నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా
నిను పిలిచేనా నా గానం
ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే
ఒక వైపు మొండి సేగాలా కాల్చేటి కబురు నీదే

సెలవో శిలవో కధవో వ్యధవో తుదివో
నీవేనా నా పై సమీరం
నీవేనా నాలో సముద్రం


*********    *********   *********


చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రమ్య NSK, షాన్

ఏది ఏది కుదురేది ఏది..
ఏది ఏది కుదురేది ఏది ఎదలో..
ఏది ఏది కుదురేది ఏది ఎదలో...
ఏది ఏది అదుపేది ఏది మదిలో..
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక..
పెదవే పేదై నీదై ఉంటే ..
ఏది ఏది కుదురేది ఏది ఎదలో ..
ఏది ఏది అదుపేది ఏది మదిలో...

నే ఓడే ఆట నీ వాదం అంటా ఎంతో ఇష్టంగా..
నే పాడే పాట నీ పెరేనంటా చాలా కాలంగా..
నాకంటూ ఉందా ఓ ఆశ నీ ఆశే నాకు శ్వాస..
ఊహ ఊసు నీతోనే నింపేసా...
నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే..
కలలే కళ్ళైచూస్తూ ఉంటే...
ఏది ఏది కుదురేది ఏది ఎదలో..
ఏది ఏది అదుపేది ఏది మదిలో...

నా కాలం నీదే నువ్వై గడిపేసెయ్ ఎన్నాళ్లౌతున్నా..
నీ పాఠం నేనే నన్నే చదివేసెయ్ అర్ధం కాకున్నా ..

నాలోకం నిండా నీ నవ్వే నాలోను నిండా నువ్వే..
తీరం దారి దూరం నువ్వయ్యవే..
నా మొత్తం నీదైతే నువ్వంతా నేనైతే..
మనలో నువ్వు నేను ఉంటే...
ఏది ఏది కుదురేది ఏది ఎదలో...
ఏది ఏది అదుపేది ఏది మదిలో...
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక..
పెదవే పేదై నీదై ఉంటే ..
ఏది ఏది కుదురేది ఏది ఎదలో ..
ఏది ఏది అదుపేది ఏది మదిలో...



*********    *********   *********


చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రమ్య NSK

ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆశలన్ని తీరుతున్న తీరిదేనా

ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆశలన్ని తీరుతున్న తీరిదేనా
చుట్టూ ఏమవుతున్నా అంతా నమ్మాల్సిందేనా
ఓహో ఇష్టం ఇంకెంతున్నా మొత్తం దాచాల్సిందేనా
ఈ వింతలింకేన్ని చూడాలో

ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆశలన్ని తీరుతున్న తీరిదేనా


నేర్చుకోనా మెల్లగా మరచిపోవటం
మార్చలేనుగా నేనిక మరల ఆ గతం
ఏడు రంగులు వెలిసినా నీ వాన విల్లునా
తీపి నింగిపై విడిచిన తేనె జల్లునా
సాగరానికి కౌగిలివ్వని జీవ నదిలాగ ఇంక ఇంకనా

ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆశలన్ని తీరుతున్న తీరిదేనా


ప్రాణ బంధం తెంచుకో మూడు ముళ్ళతో
వీడుకోలనే అందుకో మూగ సైగతో
ఒక్క రాతిరే మనకిలా మిగిలి ఉన్నది
తెల్లవారితే చీకటి వెలుగు చేరదు
చిన్ననాటికి నిన్న మొన్నకి సెలవని చేతులూపగల్గానా

ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆశలన్ని తీరుతున్న తీరిదేనా

చుట్టూ ఏమవుతున్నా అంతా నమ్మాల్సిందేనా
ఓహో ఇష్టం ఇంకెంతున్నా మొత్తం దాచాల్సిందేనా
ఈ వింతలింకేన్ని చూడాలో

ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆశలన్ని తీరుతున్న తీరిదేనా

శుభలగ్నం (1994)

పల్లవి:
ఆ... ఆ... ఆ... ఆ...
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక ||చిలక||

చరణం 1:
బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే ||2||
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతితెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే ||చిలక||

చరణం 2:
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో ||2||
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమవాసలో
తీరా నువు కనుతెరిచాక తీరం కనపడదే ఇంకా ||చిలక||

చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు

ఎగిరే పావురమా (1997)

చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం :  ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  సునీత


పల్లవి :

మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
మంచు మబ్బు కమ్ముకొస్తుందో.. మత్తు మత్తు ఎన్నియల్లో
ఎవరంటే ఎట్టమ్మా...  వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా.. ఆ.. ఆ

మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ

చరణం 1:

తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నావోడు
ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు

నా.. ఆ..ఆ కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు
లేతలేతగా సొంతమైనవి దోచాడే ఈనాడు
ఓయమ్మా... ఆ... ఆ... ఆ
హాయమ్మా వలపులే తొలిరేయమ్మా వాటేస్తే
చినవాడు నా సిగ్గు దాటేస్తే

మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా..  వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ

చరణం 2 :

తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిలగాడు
రాతి మనసున ప్రేమ అలజడి చిలికాడే చినవోడు

నా కంటి పాపకు కొంటె కలలను అలికాడే అతగాడు
వంటి బతుకున జంట సరిగమ పలికించేదేనాడో
ఓయమ్మా... ఆ... ఆ... ఆ...
ఒళ్ళంతా మనసులే ఈ తుళ్ళింత తెలుసులే
పెళ్ళాడే శుభలగ్నమేనాడో

మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ



********** ********** ************


చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం  :  ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  చిత్ర


పల్లవి :

ఆ... ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ
తాజా కూరలలో రాజా ఎవరండీ...
ఇంకా చెప్పాలా వంకాయేనండీ

ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ .. మోజే తీరనిదీ


చరణం 1 :

అల్లం పచ్చిమిర్చీ శుచిగా నూరుకునీ...ఈ...
ఆ......
దానికి కొత్తిమీరీ బాగా తగిలిస్తే
గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచుకదా
అది నా చేతుల్లో అమృతమే అవదా
ఒండుతూ ఉంటేనే రాదా.. ఘుమఘుమ ఘుమఘుమ ఘుమఘుమలు

ఆహా ఏమి రుచి ...అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ


చరణం 2 :

లేత వంకాయలతో వేపుడు చేసేదా...
మపద...దనిసరి రిగరిగగరిస...నిసగప...
మెట్టవంకాయలతో చట్నీ చేసేదా
టొమెటో కలిపి వండిపెడితే మీరు
అన్నమంత వదిలేసి ఒట్టి కూర తింటారు
ఒకటా రెండా మరి వంకాయ లీలలు తెలియగ తెలుపగ తరమా

ఆహా... ఏమి రుచి ...అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ... మోజే తీరనిదీ
తాజా కూరలలో... రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా... వంకాయేనండీ
ఆ.....


********** ********** ************


చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం :  ఎస్.వి.కృష్ణారెడ్డి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు




పల్లవి :

గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
చరణం 1 :

నేలనోదిలిన గాలి పరుగున.. ఊరంతా చుట్టాలి
వేళ తెలియక వేల పనులను.. వేగంగా చేయాలి
ఇంటి గడపకి మింటి మెరుపుల.. తోరణమే కట్టాలి
కొంటె కలలతో జంట చిలకకి.. స్వాగతమే చెప్పాలి
ఎన్నెన్నో... ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది
ఏ పని తోచక తికమక పెడుతుంది

గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ


చరణం 2 :

బావ మమతల భావ కవితలే... శుభ లేఖలు కావలి
బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు... సుముహుర్తం రావాలి
ఏడు అడుగుల జోడు నడకలు... ఊరంతా చూడాలి
వేలు విడువని తోడూ ఇమ్మని.. అక్షింతలు వేయాలి
ఇన్నాళ్ళు.. ఇన్నాళ్ళు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో
రాణిని తీసుకు వచ్చే కళకళ కనపడగ

గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ

ప్రేమ దేశం (1996)

చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, ఉన్నికృష్ణన్, డామ్నిక్
దర్శకత్వం: కధీర్
నిర్మాత: జె. రామచంద్ర రావు
విడుదల తేది: 23.08.1996

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
కడలి ఒడిలో నదులు ఒదిగి.. నిదురపోయే వేళా..
కనుల పైన కలలే వాలి.. సోలిపోయే వేళా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..

ఆశ ఎన్నడు విడువదా..
అడగరాదని తెలియదా..
నా ప్రాణం..చెలియా నీవేలే..
విరగబూసిన వెన్నెలా..
వదిలి వేయకే నన్నిలా..
రారాదా..ఎద నీదే కాదా..
నిదురనిచ్చే జాబిలీ..
నిదురలేక.. నీవే వాడినావా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..

మంచు తెరలో అలిసిపోయి..
మధన సంధ్య తూగెనే..
పుడమి ఒడిలో కలలుకంటూ..
పాపా నీవూ నిదురపో..
మల్లె అందం మగువకెరుక..
మనసు బాధ తెలియదా..
గుండె నిండా ఊసులే..
నీ ఎదుటనుంటే మౌనమే..
జోలపాటా పాడినా..
నే నిదురలేక వాడినా..

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..



**********   ************  ***********



చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఏ.ఆర్.రెహమాన్

Ooh yeah friendship
friendship is what we' re looking for
ముస్తఫా ముస్తఫా don' t worry ముస్తఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don' t worry mustaffa
కాలం నీ నేస్తం ముస్తఫా
day-by-day day-by-day
కాలం ఒడిలో day-by-day
పయనించే షిప్పే friendship రా

జూన్ పోయి జూలై పుడితే seniorki juniorki
college champus లోనే రాగింగ్ ఆరంభం
student మనసో నందనవనం మల్లెలుంటాయ్ ముల్లులుంటాయ్
స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం
వాడిపోనిది స్నేహమొకటే వీడిపోనిది నీడ ఒక్కటే
హద్దంటూ లేనే లేనిది friendship ఒక్కటే
కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే
కాలేజీ స్నేహం ఎపుడూ అంతం కానిదే
ఓ....ఓ..ఓ...

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు ఏడనుంచో గోరు వంకలు
కాలేజీ champus లోనే నాట్యం చేసెనే
కన్నెపిల్లల కొంటెనవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు
కాలేజీ compound అంటే కోడైకనాలే
కోర్సు ముగిసే రోజువరకు తుళ్ళిపడిన కుర్ర ఎదలో
కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి
స్నేహితుల్ని వీడిపోయే రోజు మాత్రం కంటి నిండా
కన్నీటి తోడేనంట farewell party



**********   ************  ***********



చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

ప్రేమా…. ప్రేమా…. ప్రేమా ప్రేమా…..
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా…
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…

ఆకాశదీపాన్నై నే వేచిఉన్నా నీ పిలుపుకోసం చిన్నారి
నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి
నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువు లేక లోకంలో జీవించలేనే
నీ ఊహతోనే బ్రతికున్నా….
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా…

నిముషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవా వయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చిపోవా ఓసారి
ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమా
ప్రేమించినానంటూ బ్రతికించలేవా
అది నాకు చాలే చెలీ…..
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…
నా నీడ నన్ను విడిపొయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా…
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి
రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతు ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా…



**********   ************  ***********



చిత్రం: ప్రేమదేశం (1996)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉన్ని కృష్ణన్

ఓ వెన్నెలా తెలిపేదెలా… ఓ నేస్తమా పిలిచేదెలా..
కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా (2)
ఓ వెన్నెలా తెలిపేదెలా…

జడివాన నింగిని తడిచేయునా గంధాలు పువ్వుని విడిపోవునా
నన్నడిగి ప్రేమ యద చేరెనా వలదన్న యదను విడిపోవునా
మరిచాను అన్నా మరిచేదెలా మరిచాక నేను బ్రతికేదెలా
ఓ వెన్నెలా తెలిపేదెలా…

వలపించు హృదయం ఒకటే కదా ఎడం అయితే బ్రతుకు బరువే కదా
నిలిపాను ప్రాణం నీకోసమే కలనైన కూడా నీ ధ్యానమే
మదిలోని ప్రేమ చనిపోదులే ఏనాటికైనా నిను చేరులే
ఓ వెన్నెలా తెలిపేదెలా… ఓ నేస్తమా పిలిచేదెలా..
కళ్ళు కళ్ళు కలిసాయంట వలపే పువ్వే పూసిందంట
నమ్మినవారే పువ్వుని కోస్తే నీ యదలో బాధ తీరేదెట్టా

అరుదైన చిత్రాలు


తల్లి రమణమ్మ, తండ్రి ఉమామహేశ్వరరావు, సోదరులు చిట్టిబాబు, సత్యనారాయణ మూర్తి, అనంత్ లతో హాస్య నట చక్రవర్తి రాజబాబు గారు.(పేపర్ కటింగ్)


14 ఏళ్ల వయస్సులో తన మిత్రులతో ఎన్టీఆర్ గారు(కుడి ప్రక్కన)



దర్శక దిగ్గజం K V రెడ్డి గారి ఫ్యామిలీ ఫోటో..


అక్కినేని గారు మరియు రామకృష్ణ గారు  



లలిత పద్మిని రాగిణి....నటి శోభన కి మేనత్తలు.



సుత్తివ్రేలు గారి కుటుంభం


1965లో జరిగిన ఇండో-పాక్ వార్ సమయంలో అప్పటి ప్రధాని శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి పిలుపు మేరకు విరాళాలు సేకరించి, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి M భక్తవత్సలమ్ తో ప్రధానిని కలసిన అప్పటి చిత్రసీమ ప్రముఖులు.




బాలకృష్ణ తొలి పరిచయం.... తాతమ్మకల చిత్రంలో...




ఒకరు తన హావభావాలతో మనలను కడుపుబ్బ నవ్విస్తే....
మరొకరు తన అద్భుతమైన కలంతో ఎన్నో మధురగీతాలు వ్రాసి మన మనసులను రంజింప చేశారు...వరసకు తోడల్లుళ్ళు రాజబాబు గారు...శ్రీరంగం శ్రీనివాసరావు గారు...





యుక్తవయస్సులో ఉన్నప్పటి మన తెలుగు వైతాళికులు...కవులు...తెలుగు సినీగేయ రచయితలు. వారి కలం నుండి పుట్టుకొచ్చిన ఎన్నో గీతాలు ఇప్పటికి విని తరిస్తున్నాం. చిరస్మరణీయులు అయిన వారికి సదా వందనాలు.


(ఎడమ నుండి కుడివైపు)

1) దాశరధి కృష్ణమాచార్యులు
2) భగవతుల సదాశివ శంకర శాస్త్రి (ఆరుద్ర)
3) సింగిరెడ్డి నారాయణ రెడ్డి
(C నారాయణ రెడ్డి)



ఎడ్లబండిలో ప్రయాణం చేస్తూ.....

మాతృదేవోభవ (1993)

చిత్రం: మాతృదేవోభవ (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర
నటీనటులు: నాజర్ , మాధవి
దర్శకత్వం: కె. అజయ్ కుమార్
నిర్మాత: కె.యస్. రామారావు
విడుదల తేది: 1993

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్ని మౌన గానం
వాంఛలన్ని వాయులీనం

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి

మాతృదేవోభవ (మాతృదేవో భవ)
పితృదేవోభవ (పితృదేవో భవ)
ఆచార్యదేవోభవ (ఆచార్యదేవో భవ)

ఏడు కొండలకైన బండ తానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
ఏడు కొండలకైన బండ తానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలత లో వెలుగునే కనక
నేను మేననుకుంటే ఎద చీకటే
హరీ... హరీ... హరీ...
రాయినై ఉన్నాను ఈ నాటికి
రామ పాదము రాక ఏ నాటికి

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి

నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు
హరీ... హరీ... హరీ...
రెప్పనై ఉన్నాను నీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోయాను గగనానికి
గాలినై పోయాను గగనానికి


*******   *******   *******


చిత్రం: మాతృదేవోభవ (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యమ్. యమ్. కీరవాణి

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెల్లవారని రేయమ్మా
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే

చెదిరింది నీ గూడు గాలిగా
చిలక గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా
మనసు మాంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా
తిరిగే భూమాతవు నీవై వేకువ లో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే


అనుబంధమంటేనే అప్పులే
కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే
పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే

నాని (2004)




చిత్రం: నాని (2004)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉన్ని కృష్ణన్ , సాధనా సర్గం


పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాట లోని సరిగమ పంచుతుంది ప్రేమమధురిమ
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాట లోని సరిగమ పంచుతుంది ప్రేమమధురిమ

చరణం: 1

మనలోని ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలిగుణమే అమ్మా
నడిపించే దీపం అమ్మా కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మా
నా ఆలి అమ్మగా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగా కమ్మగా
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాట లోని సరిగమ పంచుతుంది ప్రేమమధురిమ

చరణం: 2

పొత్తిల్లో ఎదిగే బాబు నాఒళ్ళో ఒదిగే బాబు
ఇరువురికీ నేను అమ్మవనా
నా కొంగు పట్టే వాడు నా కడుపున పుట్టే వాడు
ఇద్దరికి ప్రేమ అందించనా...
నా చిన్ని నాన్ననీ వాడి నాన్ననీ...
నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా
ఎదిగీ ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జొ లాలీ జో
పలికే పదమే వినక కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగీ ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జొ లాలీ జో
బజ్జొ లాలీజో బజ్జొ లాలీజో బజ్జొ లాలీజో బజ్జొ లాలీజో



********   ********    **********


చిత్రం: నాని (2004)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్ , హరిణి

వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా
వస్తా నీ వెనుక
ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా
ఏదైనా లేదనకా
వేలందించి వలపు నటించే వేడుక ఇది గనుకా హే వేడుక ఇది గనుకా
మైమరపించి మమతను పంచే వెచ్చని ముచ్చటగా
వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా

వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా
వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా
వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా

కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం
కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం
కన్నుల్లో నీ రూపం రూపం
ఇకపై నా ప్రాణం ఇకపై నా ప్రాణం
ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం
ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం
విడవకు ఈ నిముషం విడవకు ఏ నిముషం

వస్తా నీ వెనుక
ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా
ఏదైనా లేదనకా

నర నరం మీటే ప్రియ స్వరం వింటే
నర నరం మీటే ప్రియ స్వరం వింటే
నర నరం మీటే ప్రియ స్వరం వింటే
కాలం నిలబడదే కాలం నిలబడదే
కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగా
కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగా
ఒడిలో ఒకటైతే ఒడిలో ఒకటైతే

వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా
వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా
వేలందించి వలపు నటించే వేడుక ఇది గనుకా హే వేడుక ఇది గనుకా
మైమరపించి మమతను పంచే వెచ్చని ముచ్చటగా
వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా


********   ********    **********


చిత్రం: నాని (2004)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, సుజాత మోహన్

పల్లవి :
పుస్తకమంటు లేని తొలి చదువిది వెచ్చగ నేర్చుకుంటావా
ముద్దుగా నేర్పుతాను కద మరి నువ్వు వెచ్చగా నేర్చుకుంటావా
నిద్దుర మాని కష్టపడదామిక రావా

పుస్తకమంటు లేని తొలి చదువిది వెచ్చగ నేర్చుకుంటావా

ముద్దుగా నేర్పుతాను కద మరి నువ్వు వెచ్చగా నేర్చుకుంటావా

నిద్దుర మాని కష్టపడదామిక రావా

చరణం: 1

చక్కెర ఎక్కడ నక్కినా కనిపెట్టవ చీమలు ఠక్కున
చక్కెర ఎక్కడ నక్కినా కనిపెట్టవ చీమలు ఠక్కున
ఏం చెప్పినా ఏం చూపినా....ఏం చెప్పినా ఏం చూపినా....
నువ్వు చుట్టుముట్టవేమి గబుక్కున
చక్కెర ఎక్కడ నక్కినా కనిపెట్టవ చీమలు ఠక్కున

హెహెహెహే…
ఇంతకు ముందర నాకెవరు చెప్పలేదు ఈ సంగతులు
కొద్దిగ నేర్పితే చాలసలు చూపుతాను కద చకచక నా జోరు
వెచ్చగ నేర్చుకుంటావా
చక్కెర ఎక్కడ నక్కినా.....వెచ్చగ నేర్చుకుంటావా
కనిపెట్టవ చీమలు ఠక్కున ......వెచ్చగ నేర్చుకుంటావా
చక్కెర ఎక్కడ నక్కినా కనిపెట్టవ చీమలు ఠక్కున
ఏం చెప్పినా ఏం చూపినా.....ఏం చెప్పినా ఏం చూపినా.....
వచ్చి పట్టుకోమనకే చటుక్కున

చరణం: 2

గట్టు దిగను అంటుంటే ఈతంటూ వస్తుందా లోతెంతో నది చెబుతుందా
చెట్టు ఎక్కలేనంటే పండుకు జాలేస్తుందా నీ ఒళ్లో తను పడుతుందా
ఇక్కడ చల్లని నీళ్లుంటే ఏ నదిలొ నే దూకాలి
పళ్లెం నిండుగ పళ్లుంటే చెట్టెందుకు నే ఎక్కాలి
నీళ్లతో ఆర్పలేని నిప్పుందని వెచ్చగ నేర్చుకుంటావా
పళ్లతో తీర్చలేని ఆకలి కథ వెచ్చగ నేర్చుకుంటావా
నిద్దుర మాని కష్టపడదామిక రావా
చక్కెర ఎక్కడ నక్కినా కనిపెట్టవ చీమలు ఠక్కున..

చక్కెర ఎక్కడ నక్కినా కనిపెట్టవ చీమలు ఠక్కున..
ఏం చెప్పినా ఏం చూపినా.....ఏం చెప్పినా ఏం చూపినా.....
నువ్ చుట్టుముట్టవేమి గబుక్కున

చరణం: 3

హే హే హే హే.. ఓ ఓ ఓ ఓ …
ఆ ఆ ఆ …. లలల….
ఒకటి ఒకటి కలిపేస్తే ఒకటే అవుతుందంట
ఆ లెక్క అపుడే మొదలంట
పెదవి పెదవి కాటేస్తే పెదవులకేం కాదంట
ఎదలోనే పెరుగును మంట
ఇప్పటికిప్పుడు ఈ పొడుపు కథ విప్పాలనిపిస్తుందే
ఇక్కడికిక్కడ ఆ సరదా చూడాలనిపిస్తుందే
అందుకు మంచి దారి ఉన్నది కద......వెచ్చగ నేర్చుకుందాం రా
మన్మథ మంత్రమొకటి తెలియాలట.....వెచ్చగ నేర్చుకుందాం రా
కౌగిలిలోనే నేర్పగల చదువిది రావా

చక్కెర ఎక్కడ నక్కినా కనిపెట్టవ చీమలు ఠక్కున
చక్కెర ఎక్కడ నక్కినా కనిపెట్టవ చీమలు ఠక్కున
ఏం చెప్పినా ఏం చూపినా....ఏం చెప్పినా ఏం చూపినా....
నువ్వు చుట్టుముట్టవేమి గబుక్కున


********   ********    **********


చిత్రం: నాని (2004)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్ , పూర్ణిమ

నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే
నువ్వు నేను లోకమంటే మనమే అందామా
ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను
ఇంతకంటె ఎందుకనుకుందామా!

ఇస్తమొచ్చినట్టు ఉందాం మనకి తోచినట్టు చేద్దాం
ఇస్తమొచ్చినట్టు ఉందాం తోచినట్టు చేద్దాం
సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం
సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం
ఈ ఏకాంతం మనకే సొంతం
ఈ మైకం ఒడిలో ఏకం అవుదాం

నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే
నువ్వు నేను లోకమంటే మనమే అందామా
ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను
ఇంతకంటె ఎందుకనుకుందామా!

gotta get gotta get gotta get up
if you wanna be a lady and you can never be free
gotta get gotta get gotta get up
if you really wanna be strong take a look at me
get up get up we're never alone
get up get up we're standing alone
get up get up we're never alone
get up get up we're standing alone
calling all the ladies all the young ladies
calling all the girls to sing along
tell me can you hear me
can you see me clearly
while i make you sing this happy happy song

చంటిపాప లాంటి మనసున్నవాడు
కొంటె కృష్ణుడల్లె మహ తుంటరోడు
మన్మధుడికంటె గొప్ప అందగాడు
నా మదినే దోచేసాడు
ఎవరే అంతటి మొనగాడు
ఏడే ఎక్కడ ఉన్నాడు
వాడేనా నీ జతగాడు
వదిలేస్తావా నాతోడు
సరిసాటి లేని ఆ మగవాడు
ఒకడంటె ఒకడే ఉన్నాడు
ఇటు చూడిలాగ నా కంటి పాపలో నువ్వే ఆ ఒకడూ

నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే
నువ్వు నేను లోకమంటే మనమే అందామా
ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను
ఇంతకంటె ఎందుకనుకుందామా!

చందమామ సిగ్గుపడి తప్పుకోని సిగ్గులేని జంట ఇది అనుకోని
చుక్కనైన నిన్ను చూసి చుక్కలోనె ఆకాశం లో దాక్కోనీ
అందం ఉన్నది నీకోసం ఇందా అన్నది సావాసం
నీతోనే నా కైలసం నువ్వేగా నా సంతోషం
ఇంకొక్కసారిలా ఈ సత్యం ఒట్టేసి చెప్పనీ నీ స్నేహం
సుడిగాలి లాగ చెలరేగిపోద మరి నాలో ఉత్సాహం

నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే
నువ్వు నేను లోకమంటే మనమే అందామా
ఒక్క నువ్వు ఒక్క నేను ఎక్కువైతె ఒప్పుకోను
ఇంతకంటె ఎందుకనుకుందామా!

ఇస్తమొచ్చినట్టు ఉందాం మనకి తోచినట్టు చేద్దాం
ఇస్తమొచ్చినట్టు ఉందాం తోచినట్టు చేద్దాం
సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం
సమయాన్నే వెలేద్దాం సరసాన్నే పిలుద్దాం
ఈ ఏకాంతం మనకే సొంతం
ఈ మైకం ఒడిలో ఏకం అవుదాం



********   ********    **********




చిత్రం: నాని (2004)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి, బ్లెజ్
గానం: కార్తిక్ , విజయ్ ప్రకాష్, బ్లెజ్, సునీతా సారధి, తన్విషా

here i come and a, right on top and a
for the girls is red right down and a
who am i a brand new man and a
on my own and a
i can stand and a
what i want is everything
what i need is everything
what i love is everything
now now now now now....
i can sing
నాని - coming in the style of the world and a
నాని - shining like a diamond pearl and a
నాని - walking in a new kinda sound and a
in a town and everybody get down and a

నాని వయసె ఇరవయ్ యెనిమిది
నాని మనసె యెనిమిది యెనిమిది
నాని నవ నవ నవతర యువతల రాజకుమారుడు రాజకుమారుడు
నాని నారి నడుమ మురారి నాని
నాని పిడుగై అడిగెను నాని నాని
నాని మురళికి మురిసిన వనితల ప్రేమకు ఒక్కడులే
1-2-3 అరె యౌ ఫ్రీ
బుచ్క్ ఉప్ పద్మశ్రీ
1-2-3 త్రిగొనొమెత్ర్య్
సాగెనులె నీ గెఒమెత్ర్య్
పాటకి పల్లవి హాయి
నా తోటకి పూవులువేయ్యి
వెన్నెల అవని ప్రతి రెయ్యి
తేనె మనసులె మావి కద
మన తెలుగులో పాట లా

జోరుగ యద పావురాన్ని యెగరేసేయరా స్వేచ్చగ
ఘాటుగ నీ యవ్వనాన్ని ప్రెమించేయ్యర వెచ్చగ
పడుచాతకి పందెం వెయ్యి
పరిగెతర పాలెనీవి
పసి ఊహలు పండించెయ్యి
నేడు రేపు నాదె హా
నా ఊహలు యెదురవుతాయి
నా ఊర్వశి తెలుగమ్మై
నా ఊపిరి నీ సన్నయి
మనసు మాట ఒకటె ఒకటె
హెయ్ ప్రించె హెయ్ ప్రించె
మా ఊరికి మొనగాడంటె నువ్వేనంటా

కొత్తగా నేనుదయించ గ్రహణం లేని తారగ
ఓ మంచికే నే మనసిచ్చా స్నేహం కలిపె చెయ్యిగా
పదునెక్కిన చాకువు నువ్వు
మల్లెలకు రేకుల నవ్వు
నవ్వుల్లో సూదుల కెవ్వు
నువ్వేలే మా హెరొ
నిలువెత్తున యెదిగ నేను
నిజమన్నది చెబుతునాను
విలువన్నది వీడను నేను
వేడి వెలుగు నావె హాయో
మేం కన్నె మనసుల్లోన కాపురమె ఉంటా
పాటకి పల్లవి హాయి
నా తోటకి పూవులువేయ్యి
వెన్నెల అవని ప్రతి రెయ్యి
తేనె మనసులె మావి కద
మన తెలుగులో పాట లా
నేనే నొ.1 నీ చూడదు కన్ను
కురుక్షేత్రమె యెదురైతె
మోసగాల్లకు మోసగాడ్ని రా
ఇక నాది సిమ్హాసనం



********   ********    **********


చిత్రం: నాని (2004)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కునాల్ గంజ్ వాలా, పూర్ణిమ, శంకర్ మహదేవన్

స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్
స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్
సాలెగూడు అల్లావే గుండెల్లో తేనెపట్టు రేపావే నాలో
స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్
కళ్ళలోకి కొంటెగా కళ్ళు పెట్టి చూడగా
మాయదారి మైకం ఏదో యదలో కదిలెను కదా
స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్

ముల్లై తాకి రేపింది కల్లోలం నా చెంప నిమిరిన నీ వేలు
నేనే ఏదో చేశానని అన్యాయం నావైపే చూస్తాయేం కళ్ళు
మరి నేనే నిను పిలిచానా మది వాకిలి తెరిచుందని
రా రమ్మని అడిగానా చొరవగా చొరపడిపొమ్మని
హాయో మాయో నాకే తెలియంది ఏంతోచనియ్యదు ఏ మాత్రం
అయ్యో పాపం అసలేం జరిగుంటుందని కాసేపు కలిసేలోగా చెప్పమ్మా
అసలే మతిచెడి నేనుంటే అడుగడుగున వెంటాడకు
నీ వలనే ఈ గొడవ అది తెలియని పసివాడివా
స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్
స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్

స్నానం చెయ్యాలంటే వీలుందా నువ్వట్టా ఎగబడి చూస్తుంటే
చిత్రం కాదా నువ్వు చూసే నీ నీడ అచ్చంగా నాలా ఉందంటే
మరి ఎందుకిలా నా చేతులు మొహమాటం పడుతున్నయి
నా నడుమును తాకేందుకే తెగ సతమతమవుతుందని
నువ్వే చేరి నాలో ఏకాంతం దోచావో ఏమో తుంటరిగా
నువ్వు కోరి చోటిస్తే ఈ మాత్రం నిన్ను అల్లుకుపోనా అల్లరిగా
ప్రతి అణువణువు నులివెచ్చని గిలిగింతలు కలిగించి
యద చేరిన నిను వదలను చిలిపిగ నిను బంధించి
స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్
స్పైడర్మాన్ స్పైడర్మాన్ స్పైడర్మాన్