కొత్తబంగారులోకం (2008)




చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కృష్ణ చైతన్య , మిక్కీ జె. మేయర్


Confusion confusion teenege confusion..
మాటల్లొ చెతల్లొ total confusion..
Confusion confusion ఈ life ఏ confusion..
choiceఉల్లొ feelings లొ total confusion..

నిన్నె తెలిసింది మాకు హ్రుదయలున్నయి.. నెడె స్పందిస్తున్నయి..
యెన్నొ wonders ఏ make చుపిస్తున్నయి..ఇంక ముందుంది ఏదొ ఏవొ కావలన్నయి……

ఒక్కొ క్షణం కన్నుల్లలొ temptation..ఒక్కొ క్షణం గుండెల్లలొ sensation

నీకె షూ తొడిగాము.. poison scent పులిమాము
pepe jeans కొన్నము.. అవి మా స్కిన్ను కి చర్మాలె..
Pocket లొన cell phone బరువై. నిలిపింది పరువె
wallet లొన fifty బదులె .. Hundreds ఏ లె..

cinema hall లొ వెసె whistle ఏ.. పెంచింది level ఏ..
fashion channel చుసె కనులె leftఒ rightఒ చుడదన్నయె….

అందల్నే కలిగారు.. గాలుల్లొ వదిలారు..
శ్వాసల్లొ కలిపారు… మనసున ఊపిరి ఉప్పెన లే…
మెరిసె సొగసె మెరిపించెస్తె నరముల్లొ కుదిపె
నిలువద్దము లె magnets లాగ లాగెసాయె..
కలలొ మీరె బయట మీరె…కనిపిస్తున్నరె ..
తనతొ నిజమె fighting చెసె ..మీతొ friendship అయ్యె దాకె….


*****   *****   ******


చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్

నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..
ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..
వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..


ఈ వయస్సులో ఒక్కో క్షణం..ఒక్కో వసంతం..
నా మనస్సుకే ప్రతీ క్షణం..నువ్వే ప్రపంచం..
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం..
అడుగులలోనా అడుగులు వేస్తూ..నడిచిన దూరం ఎంతో వున్నా..
అలసట రాదు గడిచిన కాలం ఇంతని నమ్మను గా..
నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..


నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే..
నా గతాలనే కవ్వింతలే పిలుస్తూ ఉంటే..
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే..
పెదవికి చెంపా తగిలిన చోటా..
పరవశమేదో తోడవుతుంటే..పగలే అయినా గగనం లోనా..తారలు చేరెనుగా..

నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..
ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..
వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..

*****   *****   ******


చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

నీ ప్రశ్నలు నీవే..ఎవ్వరో బదులివ్వరుగా..
నీ చిక్కులు నీవే..ఎవ్వరూ విడిపించరుగా..
ఏ గాలో నిన్ను..తరుముతుంటే అల్లరిగా..
ఆగాలో లేదో..తెలియదంటే చెల్లదుగా..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా....ఓ..ఓ..ఓ..ఓ..

అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా..
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..
గతముందని గమనించని నడిరేయికి రేపుందా..
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా..
వలపేదో వల వేసింది..వయసేమో అటు తోస్తుంది..
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే రుజువేముంది..ఓ..ఓ..ఓ..ఓ..
సుడిలో పడు ప్రతి నావా..ఓ..ఓ..ఓ..ఓ..చెబుతున్నది వినలేవా..

పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా..
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా..
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా..
కడ తేరని పయనాలెన్ని..పడదోసిన ప్రణయాలెన్ని..
అని తిరగేశాయా చరిత పుటలు..వెనుజూడక ఉరికే వెతలు..
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు....ఓ..ఓ..ఓ..ఓ..

ఇది కాదే విధి రాత....ఓ..ఓ..ఓ..ఓ..అనుకోదేం ఎదురీత..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో..సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా ....ఓ..ఓ..ఓ..ఓ..


*****   *****   ******


చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: నరేష్ అయ్యర్, కళ్యాణి

ఓ కే అనేసా
దెఖో నా భరోసా
నీకే వదిలేశ
నాకెందుకులే రభసా

భారమంతా నేను మోస్తా అల్లుకో అశాలతా
చేర దీస్తా సేవ చేస్తా రాణి లా చూస్తా
అందుకే గా గుండెలో నీ పేరు రాశా
తెలివనుకో తెగువనుకో మగ జన్మ కదా
కధ మొదలనుకొ తుది వరకూ నిలబడగలదా

పరిగెడదాం పదవే చెలీ ఎన్దాక వెళ్ళాలొ
కనిపేడదాం తుది మజిలీ
ఎక్కడున్నా
ఎగిరెలదామ్ ఇల నొదిలీ నిన్నాగా మన్ననా
ఎగరగలమ్ గగనాన్ని
ఎవరాపినా
మరో సారి అను ఆ మాట
మహారాజునై పోతాగా
ప్రతి నిమిషం నీకోసం
ప్రాణం సైతం పందెం వెసెస్తా
పాత రూణమో కొత్త వరమొ
చెంగు ముడి వేసిండిరా
చిలిపి తనమూ చెలిమి గుణమూ
ఏమిటీ లీలా
స్వప్న లోకం ఏలూకుందాం రాగామాల
అదిగదిగో మది కెదురై కనబడలేదా
కధ మొదలనుకొ తుది వరకూ నిలబడగలదా


పిలిచినదా చిలిపి కలా వింటూనే వచ్చేశా
తరిమినదా చెలియ నిలా పరుగు తీసా
వదిలినదా బిడియామిలా
ప్రశ్నల్ని చెరిపేసా
ఎదురవగా చిక్కు వలా
ఎటో చూశా
భలే గున్దిలె నీ ధీమా
ఫలిస్థున్దిలీ ఈ ప్రేమా
ఆదరకుమా బెదరకుమా
త్వరగా విదిరా సరదా పదదామా
పక్కనుంటే ఫక్కుమన్తూ నవ్విరారా ప్రియతమా
చిక్కు నుండి బిక్కుమాంటూ
లెక్క చేస్తావా
చుక్కలన్నీ చిన్న బోవా
చక్కనామ్మ
మగతనుకో మగతనుకో మతి చెడిపోడా కధ మొదలనుకొ తుది వరకూ నిలబదగలదా


*****   *****   ******


చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: శ్రీకాంత్ అడ్డాల
గానం: కృష్ణ చైతన్య, ఆదిత్య, సిద్దార్ధ, క్రాంతి, శశి కిరణ్

కళశలలొ... కళశలలొ...

కలలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
కలలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
పుస్తకమన్నది తెరిచెవెలా
అక్షరమెనక దాక్కొని ఉంది
కళ్ళతొ వంతెన కడుతూ ఉంటె
దాటెటందుకు మతి పొతుంటె
కాద మనసొక ప్రయొగ శాల
కాద మనసొక ప్రయొగ శాల
సౌండ్ గురించి చదివాము
హార్ట్ బీట్ ఎంతొ తెలియలేదు
లైట్ గురించి చదివాము
నీ కళ్ళ రిజల్ట్ తెలియలెదు
మాగ్నెటిక్స్ చదివాము
ఆకర్షనెంటొ తెలియలెదు
విద్యుత్ గురించి చదివము
ఆవెశం ఎంటొ తెలియలెదు
ఫిజిక్స్ మొత్తం చదివిన అర్ధం కాని విషయాలన్ని
నీ ఫిజిక్ చూసిన వెంటనె అర్ధం ఐపొయాయె

లొలకం లాగ ఊగుతూ సాగె
మీ నదుములన్ని స్క్రూగేజ్ తొనె కొలిచెయ్యలెమా
గాలికె కందె మీ సుకుమార
లేత హ్రుదయాలు సింపుల్ బాలన్స్ తూచెయ్యలేెద
న్యూటన్ మూడొ నియమం చెరియ ప్రతిచెరియ
మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా
మా వైపు చూడకపొతె చాల తప్పెగా
క్లాసులోకి మన్సుల్లొకి యెందుల్లొకి వచ్చరె

పుస్తకమన్నది తెరిచెవెలా
అక్షరమెనక దాక్కొని ఉంది
కళ్ళతొ వంతెన కడుతూ ఉంటె
దాటెటందుకు మతి పొతుంటె
కాద మనసొక ప్రయొగ శాల
కాద మనసొక ప్రయొగ శాల


*****   *****   ******


చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: శ్రీకాంత్ అడ్డాల
గానం: శ్వేతా పండిట్

నేనని నీవని వేరుగా లేమని
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

మొదటి సారి మదిని చేరి
నిదర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ మాయేనా

పథము నాది పరుగు నీది
రథము వేయరా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నేనే చేరగా
ఎటూ చూడక వెనువెంటే రానా

దేవుళ్ళు (2000)

చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: సుజాత, స్వర్ణలత


పల్లవి:

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ
పారాయణతో సకల జనులకి.. భారాలను తొలగించే గాధ
పారాయణతో సకల జనులకి.. భారాలను తొలగించే గాధ

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ

చరణం 1:

షిరిడీ గ్రామంలో.. ఒక బాలుని రూపంలో..
వేపచెట్టు క్రింద.. వేదాంతిగ కనిపించాడు
తన వెలుగును ప్రసరించాడు

పగలు రేయి ధ్యానం.. పరమాత్మునిలో లీనం
పగలు రేయి ధ్యానం.. పరమాత్మునిలో లీనం
ఆనందమే ఆహారం.. చేదు చెట్టునీడయే.. గురుపీఠం

ఎండకు వానకు కృంగకు.. ఈ చెట్టు క్రిందనే ఉండకు
సాయీ..ఈ.. సాయి రా.. మశీదుకు..
అని మహల్సాపతి పిలుపుకు
మసీదుకు మారెను సాయి
అదే అయినది ద్వారకమాయి
అక్కడ అందరు భాయీ భాయీ
బాబా బోధల నిలయమదోయి

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ

చరణం 2:

ఖురాను.. బైబిలు.. గీత.. ఒకటని
కులమత భేదము.. వద్దనే
గాలి వాననొక క్షణమున ఆపే
ఉడికే అన్నము చేతితో కలిపే

రాతి గుండెలను గుడులను చేసే
నీటి దీపములను వెలిగించే
పచ్చికుండలో నీటిని తెచ్చి.. పూలమొక్కలకు పోసి
దిండీ వనమును పెంచి.. మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే
కప్పకు పాముకు స్నేహం కలిపే.. తల్లి భాషకు అర్ధం తెలిపే

ఆర్తుల రోగాలను హరియించే
భక్తుల బాధలు తాను భరించే
ప్రేమ సహనం రెండు వైపుల ఉన్న నాణమును దక్షిణ అడిగే
మరణం జీవికి మార్పును తెలిపే
మరణించి తను మరలా బ్రతికే
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

చరణం 3:

నీదని నాదని అనుకోవద్దని
ధునిలో ఊది విభూదిగనిచ్చే
భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు...
చావడి ఉత్సవమై సాగగా

కక్కడ హారతులందుకొని.. కలిపాపాలను కడుగగా
సకల దేవతా స్వరూపుడై.. వేదశాస్త్రములకతీతుడై
సద్గురువై.. జగద్గురువై
సత్యం చాటే దత్తాత్రేయుడై.. భక్తుని ప్రాణం రక్షించుటకై
జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలోన పగులగా
పరిపూర్ణుడై.. గురుపూర్ణిమై
భక్తుల మనసులో చిరంజీవియై.. శరీర సేవాలంగన చేసి
దేహము విడిచెను.. సాయి
సమాధి అయ్యెను.. సాయి

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
అఖిలాండకోటి బ్రహ్మండ నాయక....
శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ మహరాజ్‌

********* ********* ************

చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: చిత్ర, స్వర్ణలత

పల్లవి:

మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం

గోరు ముద్దలెరుగని బాల కృష్ణులం
బాధ పైకి చెప్పలేని బాల ఏసులం
ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా..
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా

మీ ప్రేమ కోరే చిన్నారులం..
మీ ఒడిని ఆడే చందమామలం..

చరణం 1:

కమ్మగా.. మా అమ్మ చేతితో..
ఏ పూట తింటామో ఏడాదిలో..
చక్కగా.. మా నాన్న పక్కగా..
సరదాగ తిరిగేది ఏ నాటికో

పొద్దున్నే పరుగున వెళతారూ...
రాతిరికి ఎపుడో వస్తారూ
మరి మరి అడిగినా.. కథలు చెప్పరూ
మేమేం చెప్పినా.. మనసు పెట్టరూ
అమ్మ నాన్న తీరు మాకు అర్ధమవ్వదూ
ఏం చెయ్యాలో మాకు దిక్కు తోచదూ..
ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా..
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా

మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం

చరణం 2:

పిల్లలం.. మీ చేతి ప్రమిదలం
మీ ప్రేమ చమురుతో.. వెలుగు దివ్వెలం
పువ్వులం.. మీ ఇంటి నవ్వులం
మీ గుండెపై ఆడు.. చిన్ని గువ్వలం

కని పెంచే మీరే దేవుళ్లూ
కనిపించే శివుడూ పార్వతులూ
లోకం బూచికి మా గుండే వణికితే
మాకు ధైర్యం ఇచ్చేది మీ లాలింపే
అమ్మ.. నాన్నలిద్దరూ వేరు వేరయీ
అనాధలను చెయ్యకండి పసి పిల్లలని
ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా

మీ ప్రేమ కోరే చిన్నారులం..
మీ ఒడిని ఆడే చందమామలం

********* ********* ************

చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: జానకి

పల్లవి:

మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి

మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

చరణం 1:

ఓంకార రావాల అలల కృష్ణాతీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృతయుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను
పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను

విజయుడైన అర్జునుని పేరిట.. విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియు జేజేలు పలుకగ.. కనకదుర్గకైనది స్ధిరనివాసము
మేలిమి బంగరు ముద్దపసుపు.. కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం.. కురిపించే దుర్గరూపం
ముక్కోటి దేవతలందరికి.. ఇదియే పుట్టిదీపం

మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా
పరాశక్తి లలితా.. శివానంద చరిత

చరణం 2:

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి

భవబందాలను బాపే.. బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే.. అన్నపూర్ణాదేవి
లోకశాంతినే సంరక్షించే సుమంత్రమూర్తి.. గాయత్రీ
అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణీ.. మహాలక్ష్మి
విద్యా కవన గాన మొసగు వేదమయి.. సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే.. మహాదుర్గ
శత్రు వినాసిని సత్యస్వరూపిని.. మహిషాసురమర్ధిని
విజయకారిణి అభయ రూపిణి.. శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా.. నీ దర్శనం
దుర్గమ్మా.. నీ దర్శనం

మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా
పరాశక్తి లలితా.. శివానంద చరిత
మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా
పరాశక్తి లలితా.. శివానంద చరిత

********* ********* ************

చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: బాలు

పల్లవి:

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురమేదేవ సర్వ కార్యేషు సర్వదా
ఆ...ఆ...ఆ....ఆ...ఆ.....ఆ....ఆ...

జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
ఆ...ఆ...ఆ...ఆ....ఆ...ఆ...ఆ..

చరణం 1:

భాహుగానది తీరములోన బావిలోన వెలసిన దేవ...
మహిలో జనులకు మహిమలు చాటి... ఇహ పరములనిడు మహానుభావా...
ఇష్టమైనదీ వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి...
కరుణను కురియుచు వరములనోసగుచు నిరతము పెరిగే మహాకృతి...

సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రమాణం... ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం... విఘ్న నాశనం... కాణిపాకమున నీ దర్శనం

జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక

చరణం 2:
పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైనావు
మాత పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగ మారావు

భక్తుల మొరలాలించి బ్రోచుటకు ...గజముఖ గణపతి వైనావు
బ్రహ్మండమునే బొజ్జలో దాచి... లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తి కూర్పూగా... లక్ష్మి గణపతి వైనావు

వేద పురాణము లఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం...

జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
ఆ.ఆ......ఆ....ఆ....ఆ...

********* ********* ************

చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: బాలు

పల్లవి:

అయ్యప్ప దేవాయ నమః.. అభయ స్వరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః.. అభయ స్వరూపాయ నమః
హరిహర పుత్రాయ నమః.. కరుణా సముద్రాయ నమః
నిజ భీర గంభీర శభరీ గిరీశిఖర ఘన యోగ ముద్రాయనమః
పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండరూపాయనమః
అయ్యప్ప దేవాయ నమః... అభయ స్వరూపాయ నమః

చరణం 1:

పద్దేనిమిది పదిమట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి
ఇరుముడులు స్పృశియించి శుభమనుచు దీవించి జనకృందములచేరే జనమేలు స్వామి
తన భక్తులొనరించు తప్పులకు తడబడి ఒకపక్క ఒరిగెనా ఓంకార మూర్తి
స్వామియే... శరణం అయ్యప్ప

స్వాములందరు తనకు సాయంబు కాగా ధీమంతుడైలేచి ఆ కన్నేస్వామి
పట్టబంధము వీడి భక్తతటికై పరుగు పరుగునవచ్చె భువిపైకి నరుడై
అయ్యప్ప దేవాయ నమః... అభయ స్వరూపాయ నమః

చరణం 2:

ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణుఘోషలు విని బ్రోచు శబరీష
పాపాలు దోషాలు ప్రక్షాలనము చేయు పంపానదీ తీర ఎరుమేలి వాసా
నియమాల మాలతో సుగుణాల మట్లపై నడిపించి కనిపించు అయ్యప్పస్వామి
మకర సంక్రాంతి సజ్యోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠస్వామి
కర్మ బంధము బాపు ధర్మశాస్త్ర.. కలి భీతి తొలిగించు భూతాధినేత
అయ్యప్ప దేవాయ నమః... అభయ స్వరూపాయ నమః

చరణం 3:

ఆద్యంత రహితమౌ.. నీ విశ్వరూపము
అజ్ఞాన తిమిరమ్ము అణుచు.. శుభదీపం
ఈ నాల్గు దిక్కులు.. పదునాల్గు భువనాలు
పదిమెట్లుగా మారె... ఇదో అపురూపం
అరరులెల్లరు చెయు... అమృతాభిషేకం
నెరవేర్చుకో స్వామి... నీదు సంకల్పం
పదములకు మ్రొక్కగా ఒక్కొక్క లోకం
అందుకో నక్షత్ర పుస్పాభిషేకం...

********* ********* ************

చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: బాలు


పల్లవి:

రామా... ఆ.. ఆ..
అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య
అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య
చెయుతనిచ్చె వాడయ్య.. మా సీతా రామయ్య
చెయుతనిచ్చె వాడయ్య.. మా సీతా రామయ్య
కొర్కెలు తీర్చే వాడయ్య.. కొదండ రామయ్య



అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య
రామా... ఆ... రామా... ఆ... ఆ...


చరణం 1:

తెల్లవారితే చక్రవర్తై రాజ్యమునేలె రామయ్య
తండ్రిమాటకై పదవిని వదలి అడవులుకేగెనయా
మహిలో జనులను కావగవచ్చిన మహవిష్ణు అవతరమయ
ఆలిని రక్కసుడు అపహరించితె ఆక్రోశించెనయ
అసురను ద్రుంచి అమ్మను తెచ్చి అగ్నిపరిక్ష విధించెనయ
చాకలి నిందకు సత్యము చాటగ కులసతినేవిడనాడనయ
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా
ఆ... ఆ...

నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా
సత్యం ధర్మం త్యాగంలో అతనుకి సరిలేరయ్య
కరుణ హృదయుడు.. శరణనువాడికి అభయమొసుగునయ్యా


అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య



చరణం 2:

భద్రాచలము పుణ్యక్షేత్రము.. అంతా రామ మయం
భక్తుడు భద్రుని కొండగ మార్చి.. కొలువై వున్న స్థలం
పరమ భక్తితో రామదసు ఈ అలయమును కట్టించెనయ
సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ
పంచవటిని ఆ జనకిరాముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములాడిన శేషతీర్ధమదిగో
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్య
ఆ... ఆ... ఆ...
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్య
శ్రీరామ పాదము నిత్యం కడిగే గోదారయ్య
ఈ క్షేత్రం తీర్దం దర్శించిన...
జన్మధన్యమయ్య...


అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య
చెయుతనిచ్చె వాడయ్య.. మా సీతా రామయ్య
కొర్కెలు తీర్చే వాడయ్య.. కొదండ రామయ్య


అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య

నువ్వు నాకు నచ్చావ్ (2001)

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
నటీనటులు: వెంకటేష్ , ఆర్తి అగర్వాల్, ఆశా షైనీ, పృథ్విరాజ్
కథ, మాటలు ( డైలాగ్స్ ): త్రివిక్రమ్ శ్రీనివాస్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విజయభాస్కర్
సినిమాటోగ్రఫీ: కె.రవీంద్ర బాబు
ఎడిటర్: ఎ.శ్రీకర్ ప్రసాద్
బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్
సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల: 06.09.2001


చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కుమార్ సాను, చిత్ర

ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ
వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి
ఓ... నిదుర పొయే మదిని గిల్లి ఎందుకా అల్లరి

చరణం: 1
చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని
చేయి చాచి పిలవద్దు అని చంటిపాపలకి చెబుతామా
లేని పోని కలలెందుకని మేలుకుంటే అవిరావు అని
జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకి చెబుతామా
కలలన్నవి గలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని
మది మీటుతున్న మధురానుభూతి
మననడిగి చేరుతుందా

ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని

చరణం: 2
అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరిజల్లులతో
చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా
అంతులేని తన అల్లరితో అలుపు లేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా
మనసుంటే మార్గం ఉంది కదా
అనుకుంటే అందనిదుంటుందా
అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా

ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ




***********    **********  *********



చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం…
శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా
ఓ ప్రియతమా ఇది నిజమా
ఈ పరిచయం ఒక వరమా
ఇది మనసు పడిన విరహ వేదనా…
తొలి ప్రేమలోని మధుర భావనా…

చరణం: 1
ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా
ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా
నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చివురించెనో
వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో
ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై
విచ్చాయో చెప్పేదెలా
ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ
ఆ గుట్టు విప్పేదెలా

ఓ ప్రితమా దయగనుమా...
నీ చూపే చాలు చంద్రకిరణమా
నా జన్మ ధన్యమవును ప్రాణమా…

చరణం: 2
చివురాకుల పొత్తిళ్ళలో వికసించిన సిరిమల్లెవో
చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో
నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు
నీ అందమేమందునే
పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ
ఒళ్ళంతా వయ్యారమే
నీ నామాన్నే శృంగార వేధంగ భావించి జపిస్తున్నానే చెలి…
నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి

ఓ ప్రియతమ ఔననుమా
కనలేవ ప్రియుని హృదయవేదనా
కరుణించు నాకు వలపు దీవెనా…
ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం …
శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా




********   **********  **********



చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరి సగమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా యిళ్ళ  లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు
ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో
తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల
కులుకుల కలువకు కానుకగా
ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు
సనసన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు
సందు చూసి చకచక ఆడే జూదశిఖామణులు
పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు
తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ
ఇదిగిదిగో అని చూపెడుతూ
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరి సగమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా యిళ్ళ  లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే




*********    *********   **********



చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: టిప్పు, హరిణి

ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగ సత్యభామా
నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు
ఏమి చెయ్యనయ్యో రామా
అన్నుకున్నా తప్పు కదా మోమాటం ముప్పుకదా
మనసైతే ఉంది కదా మనమాటేం వినదు కదా
పంతం మానుకో - భయం దేనికో

నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు
ఏమి చెయ్యనయ్యో రామా

వద్దనకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనకా
నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా
నన్నాశ పెట్టి ఈ సరదా నేర్పినదే నువ్ గనుకా
నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా
అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
అటు ఇటు ఎటు తేల్చవుగా మన కధను తొందరగా
ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా

నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు
ఏమి చెయ్యనయ్యో రామా
ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగ సత్యభామా

అమాయకంగ చూడకలా వేడుకలా చిలిపికలా
అయోమయంగ వేయ్యకలా హాయి వలా
నీమీదికొచ్చి ఉరితాడై వాలదుగా వాలుజడా
దానొంక చూసి ఎందుకట గుండెదడ
మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా
తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
మరేం చేయనే నీతో ఎలా వేగనే

నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు
ఏమి చెయ్యనయ్యో రామా
ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగ సత్యభామా
అన్నుకున్నా తప్పు కదా మోమాటం ముప్పుకదా
మనసైతే ఉంది కదా మనమాటేం వినదు కదా
పంతం మానుకో  -  భయం దేనికో

ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగ సత్యభామా
నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు
ఏమి చెయ్యనయ్యో రామా




**********   **********   **********




చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్

నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు
తాను పలికితె చాలు తేనె జలపాతాలు
ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు
వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు
మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా
తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు
వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు
మదిలో గుచ్చుకుంటుంది

గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల
కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో
గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా
మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో
అలా నడిచి వస్తూంటే పువ్వుల వనం
శిలైపోని మనిషుంటే మనిషే అనం

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు
వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు
మదిలో గుచ్చుకుంటుంది

గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం
ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను
గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసితనం
రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను
కలో కాదో నాకే నిజం తేలక
ఎలా చెప్పడం తాను నాకెవ్వరో
అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ
ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు
వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు
మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా
తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా

సీతాకోక చిలక (1981)

చిత్రం: సీతాకోక చిలక (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: కార్తిక్ ముత్తురామాన్ , అరుణ ముచెర్ల
దర్శకత్వం: పి.భారతీరాజ
నిర్మాణం: పూర్ణోదయ మూవీస్
విడుదల తేది: 14.08.1981

ఓం శతమానం భవతి శతాయుుః పురుష
శతేంద్రియః ఆయుషే వేంద్రియే ప్రతి తిస్టతి

మాటే మంత్రము మనసే బంధము
నీ మమతే నీ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ మాటే మంత్రము మనసే బంధము
నీ మమతే నీ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ మాటే మంత్రము మనసే బంధము

చరణం: 1
నీవే నాలో స్పందించినా ఈ ప్రియలయలో శృతికలిసే ప్రాణమిదే
నేనే నీవుగా ఊఁ హుఁ తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో
మాటే మంత్రము మనసే బంధము
నీ మమతే నీ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ మాటే మంత్రము మనసే బంధము

చరణం: 2
నేనే నీవై ప్రేమించినా ఈ అనురాగం పలికించే పల్లవినే
ఎదలా కోవెలా ఎదుటే దేవతా వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో
మాటే మంత్రము మనసే బంధము
నీ మమతే నీ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ లాలా లాలలా లాలా లాలలా
ఊహుఁ హుఁ హూ ఊహూ హుఁ హూ

చిత్రం: సీతాకోక చిలక (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి


*********  ********* ********


చిత్రం: సీతాకోక చిలక (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, వాణిజయరాం

ఆ హా హా హా, ఆ హా హా హా
ఆ హా హా హా, ఆ హా హా హా

మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా  పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా  పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దుపొడిచే
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా  పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

చరణం: 1
ఓ  చుక్కా నవ్వవే వేగుల చుక్కా నవ్వవే కంటి కోలాటాల జంట పేరంటాల
ఓ  చుక్కా నవ్వవే నావకు చుక్కానవ్వవే పొందు ఆరాటాల  పొంగు పోరాటాల
మొగ్గ తుంచుకుంటే మొగమాటాలా
బుగ్గ దాచుకుంటే బులపాఠాలా
దప్పికంటే తీర్చడానికెన్ని తంటాలా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా  పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా  పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

చరణం: 2
ఓ రామచిలకా చిక్కని ప్రేమమొలకా గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా
ఈడు కున్న గూడు నువ్వే గోరింకా తోడుగుండి పోవే కంటి నీరింకా
పువ్వునుంచి నవ్వును తుంచ లేరులే ఇంకా
మిన్నేటి సూరీడు  లాలలాల
మిన్నేటి సూరీడు  లాలలాల లాలలాల
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా  పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూల జల్లులై ముద్దుకే పొద్దుపొడిచే
మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా  పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా


********   *********  *********


చిత్రం: సీతాకోక చిలక (1981)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, వాణిజయరాం

సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే
కలలే అలలై ఎగసిన కడలికి
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో ఇలలో కలలో ఇలలో దొరకని కలయిక
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే

కన్యాకుమారి నీ పదములు నేనే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కన్యాకుమారి నీ పదములు నేనే
కడలి కెరటమై కడిగిన వేళ
సుమసుకుమారి నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళ
అలిగిన నా పొల అలకలు
నీలో పులకలు రేపి పువ్వులు విసిరిన
పున్నమి రాతిరి నవ్విన వేళ
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే

భారత భారతి పద సన్నిధిలో
కుల మత సాగర సంగమ శ్రుతిలో
నా రతి నీవని వలపుల హారతి
హృదయము ప్రమిదగ వెలిగిన వేళ
పరువపు ఉరవడి పరువిడి
నీ ఒడి కన్నుల నీరిడి
కలసిన మనసున సందెలు
కుంకుమ చిందిన వేళ
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే
సాగర సంగమమే

ఆనందం (2001)

చిత్రం: ఆనందం(2001)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ప్రతాప్, చిత్ర
నటీనటులు: ఆకాష్ , రేఖ, వెంకట్, తనూరాయ్
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 28.09.2001

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా
చలిచెర అసలెప్పుడు వదిలిందో
ఆణువణువూ మురిసేలా చిగురాశలు మెరిసేలా
తొలి శకునం ఎప్పుడు ఎదురైందో

చూస్తూనే ఎక్కడి నుంచో చైత్రం కదిలొస్తుంది
పొగమంచును పోపొమ్మంటూ తరిమేస్తుంది
నేలంతా రంగులు తొడిగి సరికొత్తగా తోస్తుంది
తన రూపం తానే చూసి పులకిస్తుంది
ఋతువెప్పుడు మారిందో
బ్రతుకెప్పుడు విరిసిందో
మనసెప్పుడు వలపుల వనమైందో

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా
చలిచెర అసలెప్పుడు వదిలిందో
ఆణువణువూ మురిసేలా చిగురాశలు మెరిసేలా
తోలి శకునం ఎప్పుడు ఎదురైందో

దిరనననన దిరదిరనా దిరనననన దిరనన దిరననా..
దిరనననన దిరదిరనా.. దిరనన దిరనా..
దిరనననన దిరదిరనా దిరనననన దిరనన దిరననా..
దిరనననన దిరదిరనా.. దిరనన దిరనా..
దిరనననన దిరనన దిరనన
దిరనననన దిరనన దిరదిరనా

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడిరాతిరి తొలివేకువ రేఖ నిదురించే రెప్పలపై
ఉదయాలను చిత్రించి ఒక చల్లని మది పంపిన లేఖ

గగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలా
ఈ వింతల వంతెన ఇంకా ఎక్కడిదాకా
చూసేందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్నా
అక్షరము అర్ధం కాని ఈ విధి రాత
కన్నులకే కనబడని ఈ మమతల మధురిమతో
హృదయాలను కలిపే శుభలేఖ

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడిరాతిరి తొలివేకువ రేఖ నిదురించే రెప్పలపై
ఉదయాలను చిత్రించి ఒక చల్లని మది పంపిన లేఖ




********  *******   ********



చిత్రం: ఆనందం (2001)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్, సుమంగళి

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మవేలా
ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా
ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళూ నేనున్నది నడిరేయి నిదురలోన
అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మవేలా

ఓ ఓ... ఓ ఓ... ఓ ఓ... (2)

చరణం: 1
పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలని పిస్తోంది
ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితే నేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది
దూరం మహ చెడ్డదని లోకం అనుకుంటుంది
కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది
నీలో నాప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలె నా ఊపిరైనవని

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా

చరణం: 2
ప్రతినిముషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోందీ
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టు నీలో కరిగించావో
ప్రేమా ఈ కొత్త స్వరం అనుమానం కలిగించి
నువ్వే నా సందేహానికి వెచ్చనైన ఋజువియ్యమంది మరి

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా
ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళూ నేనున్నది నడిరేయి నిదురలోన
అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా



********  *******   ********



చిత్రం: ఆనందం(2001)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ప్రతాప్

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా
చలిచెర అసలెప్పుడు వదిలిందో
ఆణువణువూ మురిసేలా చిగురాశలు మెరిసేలా
తొలి శకునం ఎప్పుడు ఎదురైందో

చూస్తూనే ఎక్కడి నుంచో చైత్రం కదిలొస్తుంది
పొగమంచును పోపొమ్మంటూ తరిమేస్తుంది
నేలంతా రంగులు తొడిగి సరికొత్తగా తోస్తుంది
తన రూపం తానే చూసి పులకిస్తుంది
ఋతువెప్పుడు మారిందో
బ్రతుకెప్పుడు విరిసిందో
మనసెప్పుడు వలపుల వనమైందో

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా
చలిచెర అసలెప్పుడు వదిలిందో
ఆణువణువూ మురిసేలా చిగురాశలు మెరిసేలా
తోలి శకునం ఎప్పుడు ఎదురైందో



********  *******   ********



చిత్రం: ఆనందం(2001)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవీ శ్రీ ప్రసాద్
గానం: దేవీ శ్రీ ప్రసాద్, మల్లికార్జున్, సుమంగళి

ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె ఎట్టాగ చెప్పేది మావ
ఏదేదొ అయ్యినట్టు ఏమైందొ తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా

ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె ఎట్టాగ చెప్పేది మావ
ఏదేదొ అయ్యినట్టు ఏమైందొ తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా

ఎడ్వాన్సు వార్నింగు ఇవ్వకుండానె
డేటు టైము మనకి చెప్పకుండానె
గుండెల్లొ చొటుందోలేదొ చూడకుండానె
ఎట్లీస్ట్ మన అనుమతైన అడక్కుండానె
పుట్టేస్తోంది రా ప్రేమా పుట్టేస్తోంది రా ప్రేమా హాయ్ హాయ్
పుట్టేస్తోంది రా ప్రేమా యా పుట్టేస్తోంది రా ప్రేమా హా హా

ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె ఎట్టాగ చెప్పేది మావ
ఏదేదొ అయ్యినట్టు ఏమైందొ తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా
ఓ యా

ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ
ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ
వి డోంట్ నో వెన్ వి ఫాల్ ఇన్ లవ్
వి డోంట్ నో వై వి ఫాల్ ఇన్ లవ్
వి డోంట్ నో హౌ వి ఫాల్ ఇన్ లవ్
బట్ ఇట్స్ జస్ట్ గ్రేట్ టు ఫాల్ ఇన్ లవ్

లక్ ఉంటె గాని లవ్వు దక్కదంట వలేసిన అది చిక్కదంట
వలేసిన అది చిక్కదంట
ప్రేమించడం గొప్ప ఆర్టు అంట ప్రేమించబడటం గిఫ్టు అంట
ప్రేమించబడటం గిఫ్టు అంట
లవ్ గెలిస్తె జన్మ ధన్యమంట ఎటు చూసిన గాని స్వర్గమంట
ఫేల్ ఐతె చాల కష్టమంట లైటేసిన లైఫ్ చీకటంట

ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె ఎట్టాగ చెప్పేది మావ
ఏదేదొ అయ్యినట్టు ఏమైందొ తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా
ఓ యా

ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ
ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ
వి డోంట్ నో వెన్ వి ఫాల్ ఇన్ లవ్
వి డోంట్ నో వై వి ఫాల్ ఇన్ లవ్
వి డోంట్ నో హౌ వి ఫాల్ ఇన్ లవ్
బట్ ఇట్స్ జస్ట్ గ్రేట్ టు ఫాల్ ఇన్ లవ్

మనసుతోటి మనసునె ముడేసె మంత్రమీ ప్రేమ
కళ్ళలోన కాంతులేవొ నింపె చైత్రమా
కొత్త కొత్త ఊసులేవొ నేర్పె భాష ఈ ప్రేమ
తీయనైన పాటలేవొ పాడె రాగమీ ప్రేమ
కరిగిపోని కలలతోటి గుండెను నింపెనీ ప్రేమ
లేనిపోని ఆశలేవొ రేపె మైకమీ ప్రేమ
ప్రేమె కద శాస్వతం ప్రేమించడమె జీవితం
ప్రేమకె మనసు అంకితం అంకితం
ప్రేమె కద శాస్వతం ప్రేమించడమె జీవితం
ప్రేమకె మనసు అంకితం అంకితం

ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె ఇట్టాగె చెప్పాలి మావ
చూసినట్టు చెబుతుంటె నమ్మకేమి చేస్తాము విని నేర్చుకుందాము ప్రేమా

ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ
ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ
వి డోంట్ నో వెన్ వి ఫాల్ ఇన్ లవ్
వి డోంట్ నో వై వి ఫాల్ ఇన్ లవ్
వి డోంట్ నో హౌ వి ఫాల్ ఇన్ లవ్
బట్ ఇట్స్ రియల్లి గ్రేట్ టు ఫాల్ ఇన్ లవ్ యార్




********  *******   ********



చిత్రం: ఆనందం(2001)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: పోతుల రవికిరణ్
గానం: సునీతారావ్

ధినన ధినన ధినన ధినన నాదిర్ధిన్న
ధినన ధినన ధినన ధినన దిర్దిర్ధిన్న
ధినన ధినన ధినన ధినన నాదిర్ధిన్న న

ధినన ధినన ధినన ధినన నాదిర్ధిన్న
ధినన ధినన ధినన ధినన దిర్దిర్ధిన్న
ధినన ధినన ధినన ధినన నాదిర్ధిన్న న

ధినన ధినన ధినన ధినన నాదిర్ధిన్న
ధినన ధినన ధినన ధినన దిర్దిర్ధిన్న
ధినన ధినన ధినన ధినన నాదిర్ధిన్న న

ఆ ధినన ధినన ధినన ధినన నాదిర్ధిన్న న

హ ఒక మెరుపు మెరిసె నయనములొ
చిరు చినుకు కురిసె హృదయములొ
మది పలుకుతున్న సమయములొ
శ్రుతి కలుపుతున్న పవనములొ
మనలో మనకే
మనలొ మనకే ఈ తెలియని అలజడి కలిగినదని

ఒక మెరుపు మెరిసె నయనములొ
చిరు చినుకు కురిసె హృదయములొ
మది పలుకుతున్న సమయములొ
శ్రుతి కలుపుతున్న పవనములొ

ధినన ధినన ధినన ధినన నాదిర్ధిన్న
ధినన ధినన ధినన ధినన దిర్దిర్ధిన్న
ధినన ధినన ధినన ధినన నాదిర్ధిన్న న

ధినన ధినన ధినన ధినన నాదిర్ధిన్న
ధినన ధినన ధినన ధినన దిర్దిర్ధిన్న
ధినన ధినన ధినన ధినన నాదిర్ధిన్న న

కనులు తెరిచి నిదుర మరిచి
పరుగులతొ జయిస్తు ప్రతి నిమిషం
కలలు విరిసి మనసు మురిసి
అరుపులతొ జపించు ప్రతి తరుణం
ఉరుములతొ మాకు గుసగుసలేమొ పెదవుల పిలుపులు పదనిసలె
రంగులతొ నింగి ఎదురై నిలచిన చిరుత చురుకు రగిలిన రగడలొ

ఒక మెరుపు మెరిసె నయనములొ
చిరు చినుకు కురిసె హృదయములొ
మది పలుకుతున్న సమయములొ
శ్రుతి కలుపుతున్న పవనములొ

కలికి చిలక అలక చిలికి
పొగరులతొ ఒకింత పందెములె
మెరుపు తునక తలుకుమనక
కులికెనులె ఒయ్యారి చందములె
మిసమిసలనె చూచి ఎగబడితె తొలి రుసరుసలు చూసి పరుగెడితె
ఈ సమరములొ మాది గెలుపైతె ఎద ఎగసి ఎగసి ఉరకలు ఉరికెను

ఒక మెరుపు మెరిసె నయనములొ
చిరు చినుకు కురిసె హృదయములొ
మది పలుకుతున్న సమయములొ
శ్రుతి కలుపుతున్న పవనములొ
మనలో మనకే
మనలొ మనకే ఈ తెలియని అలజడి కలిగినదని

ఒక మెరుపు మెరిసె నయనములొ
చిరు చినుకు కురిసె హృదయములొ
మది పలుకుతున్న సమయములొ
శ్రుతి కలుపుతున్న పవనములొ




********  *******   ********



చిత్రం: ఆనందం(2001)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: టిప్పు

చికు చికు చం చికు చం చం చం ప్రతి నిమిషం ఆనందం
చికు చికు చం చికు చం చం చం మనసంత ఆనందం
రంగుల లోకం అందించె ఆహ్వానం ఆనందం
ఆశల జెండ ఎగరేసె స్వాతంత్రం ఆనందం

చికు చికు చం చికు చం చం చం ప్రతి నిమిషం ఆనందం
చికు చికు చం చికు చం చం చం మనసంత ఆనందం

హొయ్యాహొరె హొయ్యాహొరె హొయ్యారె హొయ్యరారె హొయ్యాహురె
హొయ్యాహొరె హొయ్యాహొరె హొయ్యారె హొయ్యరారె హొయ్యాహురె
హొయ్యారె హొయ్యరారె హొయ్యాహురె
హొయ్యారె హొయ్యరారె హొయ్
హొయ్యారె హొయ్యరారె హొయ్యాహురె
హొయ్యారె హొయ్యరారె హొయ్

ఊరించె ఊహల్లొ ఊరేగడమె ఆనందం
కవ్వించె కల కోసం వేటాడటమె ఆనందం
అలలై ఎగసె ఆనందం అలుపె తెలియని ఆనందం
ఎదరేమున్న ఎవరేమన్న దూసుకుపోతూ ఉంటె ఆనందం
ఆనందం

చికు చికు చం చికు చం చం చం ప్రతి నిమిషం ఆనందం
చికు చికు చం చికు చం చం చం మనసంత ఆనందం

దం అదం అదం ఆనందం అదం అదం
దం అదం అదం ఆనందం అదం అదం
దం అదం అదం ఆనందం అదం అదం

ప్రతి అందం మనకోసం అనుకోవడమె ఆనందం
రుచి చూద్దాం అనుకుంటె చేదైన అది ఆనందం
ప్రేమించడమె ఆనందం ఫెయిలవ్వడమొక ఆనందం
కలలె కంటు నిజమనుకుంటు గడిపె కాలం ఎంతొ ఆనందం
ఆనందం

చికు చికు చం చికు చం చం చం ప్రతి నిమిషం ఆనందం
చికు చికు చం చికు చం చం చం మనసంత ఆనందం
రంగుల లోకం అందించె ఆహ్వానం ఆనందం
ఆశల జెండ ఎగరేసె స్వాతంత్రం ఆనందం

తననానన తనన తన్న తనెనానెనన్నన్న
తననానన తనన తన్న తనెనానెనన్నన్న

ఒకరికి ఒకరు (2003)

నువ్వే నా శ్వాసా మనసున నీకై ఆభిలాషా
బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే
వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ
ఓ ఫ్రియతమా ఓ ఫ్రియతమా
నువ్వే నా శ్వాసా మనసున నీకై ఆభిలాషా
చరణం :
పువ్వుల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు
తారల్లో మెరుపులన్ని దోసిలిలో నింపావు
మబ్బుల్లో చినుకులన్ని మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావు గా
నీ జ్ఞాపకాలన్ని ఏ జన్మలోనైనా నే మరువలేనని
నీతో చెప్పాలని చిన్ని ఆశ
ఓ ఫ్రియతమా ఓ ఫ్రియతమా
నువ్వే నా శ్వాసా మనసున నీకై ఆభిలాషా
చరణం :
సూర్యునితో పంపుతున్న ఆనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్న ఆరాధన రాగాన్ని
ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని
దారులతో పంపిస్తున్న అలుపెరగని హృదయలయలని
ఏ చోట నువ్వున్నా ,నీ కొరకు చూస్తున్న
నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ
ఓ ఫ్రియతమా ఓ ఫ్రియతమా





చిత్రం : ఒకరికి ఒకరు (2003)
సంగీతం : M.M.కీరవాణి
రచన : చంద్రబోస్
గానం : శ్రేయా ఘోషల్

ఆవారా (2010)



చిత్రం: ఆవారా (2010)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరి చరణ్ , తన్వి


చిరు చిరు చిరు చినుకై కురిశావే...
మరుక్షణమున మరుగై పోయవే...
నువ్వే ప్రేమబాణం.. నువ్వే ప్రేమ కోణం
పువ్వై నవ్వగానే గాలై ఎగిరేను ప్రాణం
చెయ్ చెయ్ చెలిమిని చెయ్
అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై
అంటూ పాదం కదిలినదే
ఎదనే నీతో ఎత్తుకేళ్ళావే

చిరు చిరు చిరు చినుకై కురిశావే
మరుక్షణమున మరుగై పోయవే

దేవతా తనే ఒక దేవత ముఖాముఖీ అందమే చూడగా ఆయువే  చాలునా
గాలిలో తనేకదా పరిమళం చెలి సఖి అనుమతే
అడగకా పూవ్వులే పుయునా
సిగలో కురులే మేఘల్లలే ఆడేవేళ గుండెల్లోన మేరుపెమేరిసే చూపే మైమరచే
చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమేయ్యాల..
చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మదిమురిసే
ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే

చెయ్ చెయ్ చెలిమిని చెయ్
అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే

తోడుగా ప్రతి క్షణం వీడక అనుక్షణం
ఆమెతో సాగనా ఆమే నా స్పందన...
నేలపై పడే ఒక నీడనే చక చక చేరనా
ఆపనా గుండెలో చేర్చనా
దారం బదులు ప్రాయంతోనే కట్టేసిందే
గాయంలాగా కోసేసిందే హాయిగా నవ్వేసిందే
నాలోనేను మౌనంగానే మాటడేస్తే మొత్తం తాను వింటూ ఉంటే తీయగా వేధిస్తుందే
ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే

చెయ్ చెయ్ చెలిమిని చెయ్
అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే

చిరు చిరు చిరు చినుకై కురిశావే...
మరుక్షణమున మరుగై పోయవే...
చిరు చిరు చిరు చినుకై కురిసావే...
మరుక్షణమున మరుగై పోయవే...



********   *********   ********


చిత్రం: ఆవారా (2010)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: రాహుల్ నంబియర్, సైంధవి

అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే పూల వాన
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే పూల వాన
మళ్ళీ మళ్ళీ వానోస్తే మనసు గొడుగు చెలి పడితే
గారం పెరిగింది దూరం తరిగింది
ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది
నెమలి కన్ను లాగ చెలి నాట్యమాడుతుంటే
ఎదే పాలపుంతై నా మనసునాడమంది
ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే పూల వాన

ఆటా పాటా ఓ పాడని పాట
వానే పాడింది అరుదైన పాట
నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు
నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు
మంత్రంలాగ ఉంది ఇది తంత్రం లాగ ఉంది
చిత్రంగానే మదిలో ఒక యుద్దం జరుగుతుంది

దేవత ఏది నా దేవత ఏది
తను సంతోషంగా ఆడుతూ ఉంది

నిన్ను మించి వేరెవరూ లేరే
నన్ను మించి నీకెవరూ లేరే
చిన్న చిన్న కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడంట
కళ్ళు రెండు మూసుకున్నా నీవున్నదే మాయమట
మల్లెపూల పొద్దు నాకు ఇచ్చి పోవే ముద్దు
ముద్దు చాటు సద్దు చెరిపేయమంది హద్దు
పులకించింది ఎద పులకించింది
చెలి అందాలనే చిలికించింది
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే అగ్గి వాన
అరెరె వాన జడి వాన
అందాల నవ్వులే అగ్గి వాన
మళ్ళీ మళ్ళీ వానోస్తే పగటి వేళ మెరుపొస్తే
నింగే వంగింది భూమే పొంగింది
నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది
గొడుగు పట్టీ ఎవరూ ఈ వాననాపవద్దు
అడ్డమొచ్చి ఎవరూ నా మనసునాపవద్దు
ఆడాలి ఆడాలి వానతో ఆడాలి


********   *********   ********


చిత్రం: ఆవారా (2010)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: సాగర్ దేశాయ్

నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చేటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే...హే
నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ద్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోనీ
అని అబద్దాలు చెప్పలేనులే
నీ జతలోన నీ జతలోన
ఈ ఎండకాలం నాకు వానాకాలం
నీ కలలోన నీ కలలోన
మది అలలాగ చేరు ప్రేమ తీరం
నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చేటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే...హే

చిరుగాలి తరగంటి నీమాటకే ఎద పొంగేను ఒక వెల్లువై
చిగురాకు రాగాల నీ పాటకే తనువూగేను తొలిపల్లవై
ప్రేమ పుట్టాక నాకళ్ళలో దొంగచూపేదో పురివిప్పెనే

కొంచెం నటనున్నది కొంచెం నిజమున్నది
ఈ సయ్యాట బాగున్నది
నువ్వల వేస్తే నువ్వల వేస్తే
నా ఎద మారే నా కథ మారే
అరె ఇది ఏదో ఒక కొత్త దాహం
అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం

ఒకసారి మౌనంగా నను చూడవే ఈ నిమిషమే యుగమౌనులే
నీ కళ్ళలో నన్ను బందించవే ఆ చెర నాకు సుఖమౌనులే
నిన్ను చూసేటి నా చూపులో కరిగే ఎన్నెన్ని మునిమాపులో
పసిపాపై ఇలా నా కనుపాపలే
నీ జాడల్లో దోగాడెనే
తొలి సందెలలో తొలి సందెలలో
ఎరుపే కాదా నీకు సింధూరం
మలి సందెలలో మలి సందెలలో
నీ పాపిటిలో ఎర్రమందారం
నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చేటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే...హే
నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ద్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోనీ
అని అబద్దాలు చెప్పలేనులే


********   *********   ********


చిత్రం: ఆవారా (2010)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: సునీతా సారధి


చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె స్వామి
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె స్వామి
రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే
పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే
ఎదలోన వింత మోహం మనసున ఏదో మాయ దాహం
తెలిసేనా ఎందుకాత్రం హృదయములోన పూల నాట్యం
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె స్వామి

చనువు చనువుగా మాటలాడితే మెరుపులే నువ్వు విసిరినా
రాణివంటూ నీ చెంత చేరితే దొంగలా ఎటు దాగినా
అందం చందం ఉన్న పసిడి మొలకవే
బ్రహ్మకైనా నిన్ను పొగడతరమటే
ముద్దు ముద్దు నడుమే అది తట్టి తట్టి వలలో పడితినే
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి

గాలిపటమల్లె మారెమల్లె స్వామి
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె స్వామి

హృదయం మంచులా కరిగిపోయెనే ప్రేయసి నా ప్రేయసి
ఒక్క నిమిషము నిన్ను విడవనే తామసి నా తామసి
ఇది వయసుకి వసంత కాలమా
వలపుల తడి తరిగి పోదామా
ఇప్పటి ఒక క్షణపు అనుబంధ గంధం హృదయం మరుచునా..హే
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె స్వామి
చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
గాలిపటమల్లె మారెమల్లె స్వామి
రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే
పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే
నీ అందం నన్ను కుదిపి చిట్టి చిట్టి కలల పానుపు వేసె
నీ గొలుసై పొంగిపోవా నక్షత్రాలే వచ్చి వాలిపోవా

చక్రం (2005)

చిత్రం: చక్రం (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీ చక్రవర్తి
నటీనటులు: ప్రభాస్, ఛార్మి కౌర్, ఆశీన్
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: వెంకటరాజు, శివరాజు
విడుదల తేది: 25.03.2005

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లని

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి



**********  **********   **********



చిత్రం: చక్రం (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కౌశల్య

కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అందించనీ అదిరే అధరాంజలి
బంధించనీ కాలాన్ని కౌగిలి
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలి
మంటల్లే నను మరిగించాలి
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా

తలుపేసుకుంటే నీ తలపాగుతుందా
మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా
నీ విషమే పాకింది నరనరమునా
ఇక నా వశము కాకుంది యమయాతన
లేనిపోని నిందలుగాని హాయిగానే ఉంది కాని
ఉన్నమాట నీతో చెప్పనీ
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా

అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ
లాగావు గుట్టు గుండెల్లోకి చూస్తూ
నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా
నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా
మనసు పొందే మన్మధలేఖ కెవ్వుమంది కమ్మని కేక
వయసు పొంగిపోయే వేడిగా
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా

అందించనీ అదిరే అధరాంజలి
బంధించనీ కాలాన్ని కౌగిలి
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలి
మంటల్లే నను మరిగించాలి
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా



**********  **********   **********


చిత్రం: చక్రం (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రీ చక్రవర్తి

పిల్లలు: అబ్బ అదిరింది !
అమ్మో భలే చేస్తున్నావే..హి హి హీ !

నా పేరు చక్రం.. భూచక్రం .. విష్ణుచక్రం ..
సుదర్శన చక్రం బస్సు చక్రం .. కారు చక్రం ..
సైకిల్ చక్రం .. కాల చక్రం !
జరిగింది.. జరుగుతున్నది..జరగబోయేది..
అన్నీ నాకు తెలుసు !

పిల్లలు: టూ మచ్ గా మాట్లాడకు..
అసలు నీకేం తెలుసోయ్ ?

నీ అస్సలు పేరు బన్నీ..నీ అస్సలు పేరు చిన్నీ
నీ పప్పీ పేరు స్నూపీ..నీ పాకెట్లో వన్ రూపీ

పిల్లలు: Wow..great !

నీ కిష్టం Tom & Jerry
నచ్చిన ఫ్రూటేమో చెర్రీ
నీ పళ్ళకుంది క్లిప్పూ
నువ్ పెట్టలేదు జిప్పూ

పిల్లలు: ఇంకేం తెలుసూ ?

చాలా తెలుసు !
నువ్ రాత్రి పూట పక్క మొత్తం తడిపేస్తుంటావు
నీ ఫ్రెండుగాడి పెన్సిళ్ళన్నీ మాయం చేస్తావు
నువ్వు సోఫా సెట్టు చెంచా తోటి కోసేస్తుంటావు
నువు కడుపులో నొప్పని స్కూలుకి డుమ్మా కొట్టేస్తుంటావు

పిల్లలు: ఇవన్నీ ఎట్టా చెప్పావూ..
ఇవన్నీ ఎట్టా చెప్పావూ?

ఇదంతా ఫేస్ రీడింగూ.. ఇదంతా ఫేస్ రీడింగూ

ముందుకు దువ్విన పండూ..హిందీలో మార్కులు రెండూ
వెనక్కి దువ్విన వేణూ..నిను తన్నినవాడు సీను..సీనూ

పిల్లలు : My God !

ఇదంతా క్రాఫ్ రీడింగూ.. ఇదంతా క్రాఫ్ రీడింగూ !

పిల్లలు : ఓ !

స్పైడర్ మాన్ విక్కీ..పడలేదా సైకిల్ ఎక్కీ
సూపర్ మాన్ బాలూ..నైటంతా నోట్లో వేలూ
ఇదంతా డ్రెస్సు రీడింగూ.. ఇదంతా డ్రెస్సు రీడింగూ
ఫేస్ రీడింగ్ ..క్రాఫ్ రీడింగ్ .. డ్రెస్ రీడింగ్ అయిపోయాయ్ !

పిల్లలు: హమ్మయ్య !

ఇప్పుడు ఫ్యూచర్ రీడింగ్ !
నువ్ భవిష్యత్తులో..హే..చిరంజీవిలా..
నువ్ భవిష్యత్తులో చిరంజీవిలా డాన్సులు చేస్తావూ..బోలెడు ఫాన్సులు పొందేవూ

పిల్లలు : Is it?

Sure !
నువ్ భారత్ జట్టులో సచిన్ ప్లేస్ ని భర్తీ చేస్తావూ..
బిలియన్ పరుగులు తీస్తావూ

పిల్లలు: We want sixer ! We want sixer !

నువ్వేమో air force..నువ్వేమో military force
నువ్వేమో చోటా టాటా .. నువ్వేమో బుల్లి గేట్స్
పద్మశ్రీలు..డాక్టరేట్లు..జ్ఞానపీఠలు..భారతరత్నలు.. మీరే !

పిల్లలు: సరే మేమేం చెయ్యాలీ.. సరే మేమేం చెయ్యాలీ ?

అల్లరి చెయ్యాలి..చిల్లర పనులే చెయ్యొద్దూ
నవ్వుతూ ఉండాలీ..నవ్వుల పాలే కావొద్దూ
కలలే చూడాలీ..నిజముగ మలచక వదలొద్దూ
ఎత్తుకు ఎదగాలీ..నిలిచిన నేలను మరవొద్దూ
భారతభూమిని మరవద్దూ.. భారతమాతను మరవద్దూ

పిల్లలు :
We like your idea..We love our India !
We like your idea..We love our India !!



**********  **********   **********



చిత్రం: చక్రం (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చక్రి

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ
నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ
నా ఓపిరే నువ్వనీ
నీకు చెప్పాలని

నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు
నమ్మనని నవ్వుకొని చాల్లె పొమ్మంటావు
నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని
నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ
నీ కంటి మైమరపులో నను పోల్చుకుంటాననీ
తల ఆన్చి నీ గుండెపై నా పేరు వింటాననీ
నీకు చెప్పాలని

నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ
నిను కలుసుకున్న ఆ క్షణం నను వదలిపోదనీ
ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ
నీకు చెప్పాలనీ




**********  **********   **********


చిత్రం: చక్రం (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్

రంగేళి హోళి హంగామా కేళి
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి
రవ్వల రించోలి సిరి దివ్వెల దీవాలి
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి
పంచాంగం చెబితేగాని పండుగ రానందా
సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా

తినేది చేదని తెలిసి అది ఉగాది విందని తలచి
ఇష్టపడే ఆ పూటే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది
గడపలు అన్నీ జరిపి ఆ గణపతి పండుగ జరిపి
నిమ్మజనంగా జనం జరిపే పయనం నిత్య భాద్రపదమౌతుంది
లోకుల చీకటి తొలగించే శుభసమయం కోసం వెతికే
చూపులు దీపాలుగ జేసే జాగరణే శివరాత్రి
ప్రత్యేకంగా బంధువులొచ్చే రోజొకటుండాలా
చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగా లేదా

తల్లుల జోలపదాలై గొల్లల జానపదాలై
నరుడికి గీత పథమై నడవడమంటే అర్ధం కృష్ణ జయంతి
అందరి ఎండకు మనమే పందిరయ్యే లక్షణమే
మనిషితనం అంటారని గుర్తించడమే శ్రీరామ నవమయింది
మనలో మనమే కలహించి మనలో మహిషిని తలపించి
విజయం సాధించే క్షణమే దసరా దశమి అవుతుంది
పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగి మంటయింది
మది ముంగిలిలో ముగ్గులు వేసే శాంతే సంక్రాంతి

ఒకటి రెండంటూ విడిగా లెక్కెడితే
తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడూ అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే
లెక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే
నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒకటై ఎవరి ముసుగులో వాళ్ళుంటామంతే
నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే
ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒక్కటే



**********  **********   **********



చిత్రం: చక్రం (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: కండికొండ
గానం: చక్రి, కౌశల్య

సోని సెల్‌ఫోన్ పీసా దిల్లోకివ్వవే వీసా
సోనిక్ ఫైట్లు స్పీడే నేను చూశా
నువ్వులవ్ వైరస్లాగా నాపై పోక్‌కాగా
అల్లుకుపోనా నేనై గోల్డెన్ తీగ
నవ్వుతు మనస్సే కోస్తా మోనాలిసా
హర్టే హైజాక్ చేస్తా ఓయాసిస్సా

మోనాలిసా ఒయాసిస్సా (2)

చరణం: 1
లేత వెన్నెల్లో ఫ్యారిస్‌లా నన్నుసోకగా వైరస్‌లా
కలలు ఆగవు పరిగెడుతూ క్వాలిస్‌లా
వయస్సు పొంగదా షాంపెన్‌లా మనస్సు మారెను
తుఫాన్‌లా నిన్ను రమ్మని మోగింది అనుసారంలా
రానా రాకెట్ లాగా
నేనే వీనాస్ ప్లానిట్ కానా
ప్రాణం ఉన్నా ప్లాటినం ముద్దిస్తావా
ముద్దులు ఇచ్చే ఏటీమ్ నేనూ వస్తాగా
ముద్దిస్తావా
నేనొస్తాగా

చరణం: 2
మేని మెరిసెను మేల్‌వోన్‌లా టోరె కోహినూర్ డైమెండ్‌లా
దాడి చేస్తిని సొగసులపై బిన్‌లాడెన్‌లా
చూపు తాకితే యాసిడేల్ తీపిగుంది ప్రూట్ సలాడ్‌లా
ప్రేమ ప్రేమతో చంపెయ్యరా సైనేడ్‌లా
నడుమే నైలాన్ ఉయ్యాల ఊగితే రేగెను నాలో జ్వాలా
మూసిన రెప్పల పైపైకి కలనై వస్తా
కలలే కన్నా ఊహలని నిజమే చేస్తా
కలనై వస్తా
నిజమే చేస్తా

ఎటో వెళ్లిపోయింది మనసు (2012)



చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్


కోటి కోటి తారల్లోన
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే

కోటి కోటి తారల్లోన
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం
తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే
గాలిలోన ఆరోప్రాణం
కలవకుండా ఉన్నన్నాళ్లు

గాలిలోన ఆరోప్రాణం
కలవకుండా ఉన్నన్నాళ్లు
నిన్ను నేనే ఆరాధిస్తా
నీ కోసమారాతీస్తా

కోటి కోటి తారల్లోన
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం
తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే

ఏడు వింతలున్నన్నాళ్లు
నీకు తోడునై ఉంటా
పాలపుంత ఉన్నన్నాళ్లు
నన్ను పంచి నేనుంటా
పాదమున్నన్నాళ్లు
నీ నడకలాగ నేనుంటా
కోరుకున్న చోటల్లా చేర్చుతా...
చేతులున్నన్నాళ్లు
నీ గీతలాగ నేనుంటా
జాతకాన్ని అందంగా మార్చుతా
అంకెలింక ఉన్నన్నాళ్లు
నీ వయస్సు సంఖ్యవనా
సంకెలల్లే బంధిస్తుంటా వంద ఏళ్లిలా

కోటి కోటి తారల్లోన
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం
తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే

భాషనేది ఉన్నన్నాళ్లు
నిన్ను పొగిడి నేనుంటా
ధ్యాసనేది ఉన్నన్నాళ్లు
నిన్ను తలచి నేనుంటా
వెలుగు ఉన్నన్నాళ్లు
నీ వెనుక నేను వేచుంటా
నువ్వేటేపు వెళుతున్నా సాగనా
మసక ఉన్నన్నాళ్లు
నీ ముందుకొచ్చి నుంచుంటా

నువ్వెలాగ ఉన్నావో చూడనా
నీకు దూరమున్నన్నాళ్లు
జ్ఞాపకంగా వెంటుంటా
మళ్లీ మళ్లీ గుర్తొస్తుంటా
ముందు జన్మలా

కోటి కోటి తారల్లోన
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం
తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే

గాలిలోన ఆరోప్రాణం

గాలిలోన ఆరోప్రాణం
కలవకుండా ఉన్నన్నాళ్లు
నిన్ను నేనే ఆరాధిస్తా
నీ కోసమారాతీస్తా

కోటి కోటి తారల్లోన
చందమామ ఉన్నన్నాళ్లు
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం
తేలకుండా ఉన్నన్నాళ్లు
నీ తపస్సు నే చేస్తుంటానే


*********    *********   *********


చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్

ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న
హేయ్ హెయ్
ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న
ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా
అంతంత నీ సొంతమైనా
నే నిన్ను ఎపుడై రమ్మంటాన నేనెపుడై రారమ్మంటాన
నే నా నుండి నిన్నే పోనిస్తాన
ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న
ఎంతెంత దూరం నన్ను…

పో పో మన్న పో పో మన్న

పొద్దున్నైతే సూర్యుడినై వస్తా
వెచ్చంగ నిద్దుర లేపి ఎన్నో చూపిస్తా
సందెల్లోన చంద్రున్నై వస్తా
చల్లంగా జోకొట్టేసి స్వప్నాలందిస్తా
మధ్యాహ్నం లోన  దాహన్నై మధ్య మధ్య మోహన్నై

వెంటే ఉండి వెంటాడుతా
రోజు రోజు ఇంతే ఏ రోజైనా ఇంతే
నీడై జాడై తోడై నీతో వస్తానంటే
నే నిన్ను ఎపుడై రారమ్మంటాన నేనెపుడై రారమ్మంటాన
నే నా నుండి నిన్నే పోనిస్తాన
ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న
ఎంతెంత
దూరం నన్ను…
పో పో మన్న పో పో మన్న

అద్దం లోన నేనే కనిపిస్తా అందాల చిందుల్లోన పూవై వినిపిస్తా
చుట్టూ ఉండి నేనే అనిపిస్తా ఆకాశం హద్దుల్లోన నువ్వున్నా అడ్డొస్తా
మబ్బుల్లో మాటేసి వెన్నెల్లో వాటేసి ప్రాణాన్ని ముద్దడుతా
ఏ జన్మైనా ఇంతే పైలోకాన ఇంతే
ఆది అంతం అన్ని నేనే అవుతా అంతే
నే నిన్ను ఎపుడై రారమ్మంటాన నేనెపుడై రారమ్మంటాన
నే నా నుండి నిన్నే పోనిస్తాన
ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న
ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా
అంతంత నీ సొంతమైనా
నే నిన్ను ఎపుడై రారమ్మంటాన నేనెపుడై రారమ్మంటాన
నే నా నుండి నిన్నే పోనిస్తాన

ఎంతెంత దూరం నన్ను పో పో మన్న
అంతంత చేరువై నీతో ఉన్న


*********    *********   *********


చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ఇళయరాజా, బేల షేండే

లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేని మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నో పంచుకున్న వేళలో
మనదే సరదా సరదా

లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేని మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మ

ఇంతలో ఇలా ఎదిగిన ఆ తలపులో ఎవరికై ఈ పిలుపులో
వింత వింతగా తిరిగిన ఈ మలుపులో తన జతేను కలుపుకో
ఇదేంట చెప్పలేని ఈ భావనే పేరునుందో
తెలియదు దానికైనా ఈ వేళ
జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకేన్ని ఎన్నో
అవన్నీ బయటపడవు ఇవ్వాళ
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి

స్పర్శలాగా పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా
లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేని మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా

మాటిమాటికీ మొదలయే అలికిడి మరుక్షణం ఓ అలజడి
ఆకతాయిగా తడిమితే తడబడి తరగదే ఈ సందడి
చలాకి కంటిపూల తావీదు తాకిందిలాగ
గులాబీ లాంటి గుండె మోసేనా
ఇలాంటి గారడీల జోరింక చాలించదేల హో
ఎలాగా ఏమనాలి ఈ లీల
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శలాగా పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా
లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేని మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నో పంచుకున్న వేళలో
మనదే సరదా సరదా
లాయి లాయి ఇలా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేని మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి ఇలా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మ



*********    *********   *********



చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: యువన్ శంకర్ రాజా

అర్ధమయ్యిందింతే ఇంతేనా  నేనంటే నీ ఇష్టం ఇంతేనా
అర్ధమయ్యిందింతే ఇంతేనా  నేనంటే నీ ఇష్టం ఇంతేనా

అర్ధమయ్యిందింతే ఇంతేనా  నేనంటే నీ ఇష్టం ఇంతేనా

నా పైన నీకున్న చూపింతేనా  నీలోన నాకున్న చోటింతేనా
నువ్వే సర్వం అంటున్నా నీకే శాంతం ఇస్తున్నా
అర్ధమయ్యిందింతేనా హో అర్ధంయ్యిందింతేనా హో హో
దారం నుంచి వేరవుతావా  పూల మాల హో హో హో
భారం పెంచి పొమ్మంటావా నాలో సగమా హో హో హో

అర్ధమయ్యిందింతే ఇంతేనా అర్ధమయ్యిందింతే ఇంతేనా

చిగురు లేక వలపు రెమ్మ శిశిరమైనదే

చెలియ లేక చెలిమి జన్మ కరుగుతున్నదే
అడుగిక సాగదే నువ్వు జత కానిదే
అలుపిక ఆగదే నీ దారి లేనిదే
పసితనాన నీ పరిచయం పలవరించటం మాననే
పాతికేళ్ళ గురుతులన్ని నన్నే ముంచి ప్రాణం తీస్తున్నా

అర్ధమయ్యిందింతే ఇంతేనా  నేనంటే నీ ఇష్టం ఇంతేనా

నా పైన నీకున్న చూపింతేనా  నీలోన నాకున్న చోటింతేనా
నువ్వే సర్వం అంటున్నా నీకే శాంతం ఇస్తున్నా
అర్ధమయ్యిందింతేనా  హో అర్ధంయ్యిందింతేనా హో హో

దారం నుంచి వేరవుతావా  పూల మాల హో హో హో
భారం పెంచి పొమ్మంటావా నాలో సగమా హో హో హో

అర్ధమయ్యిందింతే ఇంతేనా అర్ధమయ్యిందింతే ఇంతేనా



*********    *********   *********



చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సునిధి చౌహన్

అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా
నిను వలచే నా ప్రాణం
నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా
నిను పిలిచేనా నా గానం
ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే
ఒక వైపు మొండి సేగాలా కాల్చేటి కబురు నీదే
సెలవో శిలవో కధవో వ్యధవో తుదివో
నీవేనా నా పై సమీరం
నీవేనా నాలో సముద్రం సముద్రం సముద్రం

అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా
నిను వలచే నా ప్రాణం
నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా
నిను పిలిచేనా నా గానం

నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో
జీవితం నిరీక్షణగా తయారై నాతో ఉందో

నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో
జీవితమే నిరీక్షణగా తయారై నాతో ఉందో
నీదని నాదని నాకని ఏనాడూ నేననుకోనుగా
నీవని నీదని నేకని అనుకున్నాలే పొరపాటుగా
ఓ నిముషం తలపై గొడుగై మరి ఓ నిమిషం కుదిపే పిడుగై
నిశివో శశివో జతవో యతివో
నీవేనా నాలో సంగీతం
నీవేనా నాలో నిశబ్ధం నిశ్శబ్దం నిశ్శబ్దం

అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా
నిను వలచే నా ప్రాణం
నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా
నిను పిలిచేనా నా గానం
ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే
ఒక వైపు మొండి సేగాలా కాల్చేటి కబురు నీదే

సెలవో శిలవో కధవో వ్యధవో తుదివో
నీవేనా నా పై సమీరం
నీవేనా నాలో సముద్రం


*********    *********   *********


చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రమ్య NSK, షాన్

ఏది ఏది కుదురేది ఏది..
ఏది ఏది కుదురేది ఏది ఎదలో..
ఏది ఏది కుదురేది ఏది ఎదలో...
ఏది ఏది అదుపేది ఏది మదిలో..
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక..
పెదవే పేదై నీదై ఉంటే ..
ఏది ఏది కుదురేది ఏది ఎదలో ..
ఏది ఏది అదుపేది ఏది మదిలో...

నే ఓడే ఆట నీ వాదం అంటా ఎంతో ఇష్టంగా..
నే పాడే పాట నీ పెరేనంటా చాలా కాలంగా..
నాకంటూ ఉందా ఓ ఆశ నీ ఆశే నాకు శ్వాస..
ఊహ ఊసు నీతోనే నింపేసా...
నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే..
కలలే కళ్ళైచూస్తూ ఉంటే...
ఏది ఏది కుదురేది ఏది ఎదలో..
ఏది ఏది అదుపేది ఏది మదిలో...

నా కాలం నీదే నువ్వై గడిపేసెయ్ ఎన్నాళ్లౌతున్నా..
నీ పాఠం నేనే నన్నే చదివేసెయ్ అర్ధం కాకున్నా ..

నాలోకం నిండా నీ నవ్వే నాలోను నిండా నువ్వే..
తీరం దారి దూరం నువ్వయ్యవే..
నా మొత్తం నీదైతే నువ్వంతా నేనైతే..
మనలో నువ్వు నేను ఉంటే...
ఏది ఏది కుదురేది ఏది ఎదలో...
ఏది ఏది అదుపేది ఏది మదిలో...
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక..
పెదవే పేదై నీదై ఉంటే ..
ఏది ఏది కుదురేది ఏది ఎదలో ..
ఏది ఏది అదుపేది ఏది మదిలో...



*********    *********   *********


చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు (2012)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రమ్య NSK

ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆశలన్ని తీరుతున్న తీరిదేనా

ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆశలన్ని తీరుతున్న తీరిదేనా
చుట్టూ ఏమవుతున్నా అంతా నమ్మాల్సిందేనా
ఓహో ఇష్టం ఇంకెంతున్నా మొత్తం దాచాల్సిందేనా
ఈ వింతలింకేన్ని చూడాలో

ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆశలన్ని తీరుతున్న తీరిదేనా


నేర్చుకోనా మెల్లగా మరచిపోవటం
మార్చలేనుగా నేనిక మరల ఆ గతం
ఏడు రంగులు వెలిసినా నీ వాన విల్లునా
తీపి నింగిపై విడిచిన తేనె జల్లునా
సాగరానికి కౌగిలివ్వని జీవ నదిలాగ ఇంక ఇంకనా

ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆశలన్ని తీరుతున్న తీరిదేనా


ప్రాణ బంధం తెంచుకో మూడు ముళ్ళతో
వీడుకోలనే అందుకో మూగ సైగతో
ఒక్క రాతిరే మనకిలా మిగిలి ఉన్నది
తెల్లవారితే చీకటి వెలుగు చేరదు
చిన్ననాటికి నిన్న మొన్నకి సెలవని చేతులూపగల్గానా

ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆశలన్ని తీరుతున్న తీరిదేనా

చుట్టూ ఏమవుతున్నా అంతా నమ్మాల్సిందేనా
ఓహో ఇష్టం ఇంకెంతున్నా మొత్తం దాచాల్సిందేనా
ఈ వింతలింకేన్ని చూడాలో

ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆశలన్ని తీరుతున్న తీరిదేనా

శుభలగ్నం (1994)

పల్లవి:
ఆ... ఆ... ఆ... ఆ...
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక ||చిలక||

చరణం 1:
బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే ||2||
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతితెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే ||చిలక||

చరణం 2:
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో ||2||
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమవాసలో
తీరా నువు కనుతెరిచాక తీరం కనపడదే ఇంకా ||చిలక||

చిత్రం: శుభలగ్నం (1994)
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు

ఎగిరే పావురమా (1997)

చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం :  ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  సునీత


పల్లవి :

మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
మంచు మబ్బు కమ్ముకొస్తుందో.. మత్తు మత్తు ఎన్నియల్లో
ఎవరంటే ఎట్టమ్మా...  వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా.. ఆ.. ఆ

మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా... వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ

చరణం 1:

తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నావోడు
ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు

నా.. ఆ..ఆ కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు
లేతలేతగా సొంతమైనవి దోచాడే ఈనాడు
ఓయమ్మా... ఆ... ఆ... ఆ
హాయమ్మా వలపులే తొలిరేయమ్మా వాటేస్తే
చినవాడు నా సిగ్గు దాటేస్తే

మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా..  వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ

చరణం 2 :

తేనె మురళికి తీపి గుసగుస విసిరాడే పిలగాడు
రాతి మనసున ప్రేమ అలజడి చిలికాడే చినవోడు

నా కంటి పాపకు కొంటె కలలను అలికాడే అతగాడు
వంటి బతుకున జంట సరిగమ పలికించేదేనాడో
ఓయమ్మా... ఆ... ఆ... ఆ...
ఒళ్ళంతా మనసులే ఈ తుళ్ళింత తెలుసులే
పెళ్ళాడే శుభలగ్నమేనాడో

మాఘమాసం ఎప్పుడొస్తుందో... మౌనరాగాలెన్నినాళ్ళో
ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా
చికుబుకు చికు చిన్నోడోయమ్మా ఆ ఆ



********** ********** ************


చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం  :  ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  చిత్ర


పల్లవి :

ఆ... ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ
తాజా కూరలలో రాజా ఎవరండీ...
ఇంకా చెప్పాలా వంకాయేనండీ

ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ .. మోజే తీరనిదీ


చరణం 1 :

అల్లం పచ్చిమిర్చీ శుచిగా నూరుకునీ...ఈ...
ఆ......
దానికి కొత్తిమీరీ బాగా తగిలిస్తే
గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచుకదా
అది నా చేతుల్లో అమృతమే అవదా
ఒండుతూ ఉంటేనే రాదా.. ఘుమఘుమ ఘుమఘుమ ఘుమఘుమలు

ఆహా ఏమి రుచి ...అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ


చరణం 2 :

లేత వంకాయలతో వేపుడు చేసేదా...
మపద...దనిసరి రిగరిగగరిస...నిసగప...
మెట్టవంకాయలతో చట్నీ చేసేదా
టొమెటో కలిపి వండిపెడితే మీరు
అన్నమంత వదిలేసి ఒట్టి కూర తింటారు
ఒకటా రెండా మరి వంకాయ లీలలు తెలియగ తెలుపగ తరమా

ఆహా... ఏమి రుచి ...అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ... మోజే తీరనిదీ
తాజా కూరలలో... రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా... వంకాయేనండీ
ఆ.....


********** ********** ************


చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం :  ఎస్.వి.కృష్ణారెడ్డి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు




పల్లవి :

గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ
చరణం 1 :

నేలనోదిలిన గాలి పరుగున.. ఊరంతా చుట్టాలి
వేళ తెలియక వేల పనులను.. వేగంగా చేయాలి
ఇంటి గడపకి మింటి మెరుపుల.. తోరణమే కట్టాలి
కొంటె కలలతో జంట చిలకకి.. స్వాగతమే చెప్పాలి
ఎన్నెన్నో... ఎన్నెన్నో చేసినా ఇంతేనా అనిపిస్తుంది
ఏ పని తోచక తికమక పెడుతుంది

గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ


చరణం 2 :

బావ మమతల భావ కవితలే... శుభ లేఖలు కావలి
బ్రహ్మ కలిపినా జన్మ ముడులకు... సుముహుర్తం రావాలి
ఏడు అడుగుల జోడు నడకలు... ఊరంతా చూడాలి
వేలు విడువని తోడూ ఇమ్మని.. అక్షింతలు వేయాలి
ఇన్నాళ్ళు.. ఇన్నాళ్ళు ఎదురు చూసే నా ఆశల రాజ్యంలో
రాణిని తీసుకు వచ్చే కళకళ కనపడగ

గుండె గూటికి పండుగొచ్చింది.. పండు వెన్నెల పంచుతుందీ
మబ్బుల్లో జాబిల్లీ.. ముంగిట్లో దిగుతుందీ
నా ఇంట్లో దీపం పెడుతుందీ