ఠాగూర్ (2003)




చిత్రం: ఠాగూర్ (2003) 
సంగీతం: మణిశర్మ 
గీతరచయిత: భువనచంద్ర 
నేపధ్య గానం: ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్ 

పల్లవి

వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది 
వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది 
డం డం డిగా డిగా... ఎదలో ఏదో సెగ 
రానే వచ్చానుగా... చూసేయ్ ఎగాదిగా 

కస్సుమందోయ్ కనకాంబరం... ఘొల్లుమందోయ్ చీనాంబరం 
కస్సుమందోయ్ కనకాంబరం... ఘొల్లుమందోయ్ చీనాంబరం 

వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది 
వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది 
నువ్వు రెడి రెడి... నేను రెడి రెడి 
చెలియా పడి పడి... చేద్దాం హడావిడి 
కస్సుమంటే కనకాంబరం... కొల్లగొడతా చీనాబరం 
కస్సుమంటే కనకాంబరం... కొల్లగొడతా చీనాబరం 

చరణం 1: 

మెరుపొచ్చినా మైమరపొచ్చినా... దుప్పట్లో దూరమంటావే 
వానొచ్చినా నెరజాణొచ్చినా... అంతటితో ఆగదంటారే 
కౌగిళ్ళలో కసి కౌగిళ్ళలో... ముచ్చట్లు కూడదంటావే 
ఊరించినా తను ఉప్పొంగినా... కుంపట్లు ఆరవంటారే 

ముందుకొస్తే మురిపించనా... అందమంతా అర్పించనా 
ముందుకొస్తే మురిపించనా... అందమంతా అర్పించనా
వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది 

చరణం 2: 

శోధించనా పరిశోధించనా... ఒంపుల్ని హరిచందనా 
చేయించనా గురు చేయించనా... పరువాల పారాయణా 
సాగించనా కొనసాగించనా... మృదువైన మదనార్చనా 
చేసేయనా ప్రియా చేసేయనా... సందిట్లో ఆత్మార్పణ 

రావే రావే మొనాలిస... రెచ్చినాదే ఏదో నిషా 
రావే రావే మొనాలిస... రెచ్చినాదే ఏదో నిషా 

వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది 
వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది 
డం డం డిగా డిగా... ఎదలో ఏదో సెగ 
రానే వచ్చానుగా... చూసేయ్ ఎగాదిగా 

కస్సుమందోయ్ కనకాంబరం... ఘొల్లుమందోయ్ చీనాంబరం 
కస్సుమందోయ్ కనకాంబరం... ఘొల్లుమందోయ్ చీనాంబరం 






చిత్రం: ఠాగూర్ (2003) 
సంగీతం: మణిశర్మ 
గీతరచయిత: చంద్రబోస్ 
నేపధ్య గానం

పల్లవి

మన్మధా మన్మధా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా 
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా.. జన్మకీ గుమ్మతో జంట కట్టరా 
మన్మధా మన్మధా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా 
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా.. జన్మకీ గుమ్మతో జంట కట్టరా 

అబ్బనీ తీయనీ వలపంతా.. ఇచ్చుకో మనసారా 
.. జాంగిరీ పొంగులా జగదాంబా.. ఇచ్చుకో సొగసారా 

హే మన్మధా మన్మధా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా 
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా.. జన్మకీ గుమ్మతో జంట కట్టరా 

చరణం 1 : 

ఎంత దాహం మన్మధా ఎంగిలైనా తేనే కదా 
పూల వయసు తుమ్మెదా ఘాటు పడ్డా తీపే కదా 

వాలేదా.. ఇలా మీదా.. సఖీ రాధా.. 
రారాదా దా దా దా దయే రాదా.. ప్రియం కాదా నా మీదా 
ముక్కు పచ్చ ఈడు వీచే ముద్దులిచ్చేదా 
హే హే హే సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా 


హే మన్మధా మన్మధా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా 
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా.. జన్మకీ గుమ్మతో జంట కట్టరా 

చరణం 2 : 

ఆకలేసి సోకులన్నీ.. సొమ్మసిల్లే పొద్దే కదా 
సోకులన్నీ చిలకా చుట్టి.. నోటికిస్తే ముద్దే కదా 

రాగాల సరాగాల.. ఇదే గోలా వేళా 
ఊగాలా వయ్యారాలు.. వసంతాలే ఆడేలా 
చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా 
మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా 

హే మన్మధా మన్మధా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా 
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా.. జన్మకీ గుమ్మతో జంట కట్టరా 

అబ్బనీ తీయనీ వలపంతా.. ఇచ్చుకో మనసారా 
జాంగిరీ పొంగులా జగదాంబా..  ఇచ్చుకో సొగసారా


చిత్రం: ఠాగూర్ (2003) 
సంగీతం: మణిశర్మ 
గీతరచయిత: సుద్దాల అశోక్ తేజ 
నేపధ్య గానం: బాలు 

పల్లవి

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను 
నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారవోసాను 
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మొసానూ 

చరణం 1: 

అగ్నినేత్ర ఉగ్ర జ్వాళ దాచినా రుదృడా 
అగ్ని శిఖలను గుండెలోనా అణచినా సూర్యుడా 
పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశమా 
హింసనణచగ ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా 
మన్యం వీరుడు రామరాజు ధనుష్టం కారాసివా 
భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా 

చరణం 2: 

అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా 
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా 
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా 
చమురు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా 
సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా 
లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా


చిత్రం: ఠాగూర్ (2003) 
సంగీతం: మణిశర్మ 
గీతరచయిత: చంద్రబోస్ 
నేపధ్య గానం: హరిహరన్, చిత్ర 

పల్లవి

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 
నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా వోటు 

మెల్లగ మెల్లగ మెల్లగ 
మరు మల్లెలు మబ్బులు జల్లుగా 
ముని మాపులలో వేసేయ్ నీ వోటు 
మసి నవ్వులతో వేసేయ్ వోటు 

నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే 
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే 
నీ గుండెలకే వేస్తా నా వోటు 
గుడి హారతినై వేస్తా వోటు 

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 

నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా వోటు 

చరణం 1: 

అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి 
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి 

అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి 
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి 

యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి 
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి 

ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి 
రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి 

నా వలపు కిరీటం తలపైనే ధరించు 
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు 
నీ చినుకులకే వేస్తా నా వోటు 
నా చెమటలతో వేస్తా వోటు 

చరణం 2: 

నా సుకుమారం నీకో సింహాసనం గా 
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా 

నీ నయగారం నాకో ధనాగారం గా 
సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా 

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది 
స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది 

కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది 
బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది 

పాల పుంతని వలవేసీ వరించే 
పూల పుంతలో పులకింతలు పుట్టించే 
నీ రసికతకే వేస్తా నా వోటు 
నా అలసటతో వేస్తా వోటు




చిత్రం: ఠాగూర్ (2003)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: మనో, చిత్ర

పల్లవి:

గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదట సారి నిన్ను చూసినప్పుడూ
అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలు జారుడూ
ఎప్పుడెప్పుడూ...
గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు

చరణం 1:

నువ్వు కానరాకపోతే కోపమొచ్చుడు
నువ్వు కంటి ముందు కొచ్చెనంటె కోరికొచ్చుడు
కౌగిలే కోరితే చెంతకొచ్చుడు
కౌగిలించుకోకపోతే నాకు చింత హెచ్చుడు
వెనక ముందు లాగుతుంది మనసు ఎప్పుడూ
ఇంత అంత కాదు దీని వింత గింజుడు
మనసునే గిల్లిన చిత్రహింసుడు
అబ్బ అమ్మతోడు నువ్వే నాకు రాజహంసుడూ
ఎప్పుడెప్పుడూ...
గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు

చరణం 2:

ఇటుకపై ఇటుక వేస్తే ఇల్లు కట్టుడు
నే ముద్దు మీద ముద్దు పెడితే చిలక కొట్టుడు
పడకపై చల్లనీ పూల చల్లుడు
నీ పక్కలోన గుండెతోని గుండె అల్లుడు
కుంచెతోని రంగులద్దు చిత్రకారుడు
వీడు గోరుతోనే బొడ్డుపైన బొమ్మ గీస్తడు
నన్నిలా ముంచులా కరగదీసుడు
అమ్మో ఎన్ని కళలు ఉన్నవయ్య నీకు పిల్లడూ
ఎప్పుడెప్పుడూ...
గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదట సారి నిన్ను చూసినప్పుడూ
అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలు జారుడూ
ఎప్పుడెప్పుడూ...



చిత్రం: ఠాగూర్ (2003)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: శంకర్ మహదేవన్

పల్లవి:

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ
బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ
పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి
చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ
చిందే వెయ్యాలీ నటరాజు లాగ
నవ్వే చిందాలీ నెలరాజులా
మనసే ఉండాలీ మహరాజు లాగ
మరిచే పోవాలి రాజు పేదా తేడాలన్నీ

చరణం 1:

చెయ్యి ఉంది నీకు చెయ్ కలిపెటందుకే
చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే
మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే
మనసున్నది మాటని నెరవెర్చేటందుకే
ఆరాటం నీకుందీ పనైనా చెయ్యటానికే
అభిమానం తొడుంది ఎందాకైనా నడపటానికే
ప్రాణం, దేహం, జీవం ఉంది పరుల సేవకే
చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలీ
పొందే ఫలాన్ని పంచివ్వాలీ
అందరి సుఖాన్ని నువ్వే చూడాలీ
విధి రాతని చెమట తొనే చెరిపెయ్యాలి

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ
బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ
పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి
చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ

చరణం 2:

పెద్దవాళ్ళకెపుడూ నువు శిరసు వంచరా
చిన్నవాళ్ళనెపుడు ఆశీర్వదించరా
లేనివాళ్ళనెపుడు నువు ఆదరించరా
ప్రతిభ వున్నవాళ్ళనెపుడు నువు ప్రోత్సహించరా
శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా
సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచేయరా
ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా
దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు
రక్తం పంచిన బంధం మీరు
చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు
నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే...

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ
బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ
పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి
చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ


బండెనక బండి కట్టి

బండెనక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లో పోతావ్‌ కొడకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవురో
నైజాము సర్కారోడా      ||బండెనక||
పోలీసు మిల్టీ రెండు
పోలీసు మిల్టీ రెండు
బలవంతులా అనుకోని
బలవంతులా అనుకోని
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
మా పల్లెలు దోస్తివి కొడుకో
నైజాము సర్కారోడా        ||బండెనక||
స్త్రీపురుషులంతా కలిసీ
పిల్లలమంతా కలిసీ
స్త్రీపురుషులంతా కలిసీ

పిల్లలమంతా కలిసీ
వడిశెల్ల రాళ్ళు నింపీ
వడివడికొట్టితేను
వడిశెల్ల రాళ్ళు నింపీ

వడివడికొట్టితేను
కారాపు నీళ్ళు తెచ్చీ
కళ్ళల్లో చల్లితేను
కారాపు నీళ్ళు తెచ్చీ

కళ్ళల్లో చల్లితేను
నీ మిల్టి పారిపోయెరో..
నీ మిల్టి పారిపోయెరో..
నైజాము సర్కారోడా           ||బండెనక||
మా పొలం మింగినోడా
మా అడవి దోచినోడా
మా బతుకు బుగ్గు చేసి
సిరిసంపదంతా దోచీ
సంచుల్లకెత్తుకోనీ
బండ్లల్ల నింపుకోని
బయలెల్లినావు కొడకో
బయలెల్లినావు కొడకో
బయలెల్లినావు కొడకో
నైజాము సర్కరోడా
చుట్టుముట్టు సూర్యపేట
నట్ట నడమ నల్లగొండ
చుట్టుముట్టు సూర్యపేట

నట్ట నడమ నల్లగొండ
నువ్వెళ్ళేది హైద్రాబాదు
దానిపక్కన గోలకొండ
నువ్వెళ్ళేది హైద్రాబాదు

దానిపక్కన గోలకొండ
గోల్కొండ ఖిల్లా కిందా
గోల్కొండ ఖిల్లా కిందా
గోల్కొండ ఖిల్లా కిందా
నీ ఘోరీ కడతాం కొడకో
నైజాము సర్కారోడా 
నీ ఘోరీ కడతాం కొడకో

నైజాము సర్కారోడా
నీ ఘోరీ కడతాం కొడకో

నైజాము సర్కారోడా

డియర్ కామ్రేడ్ (2019)



చిత్రం : డియర్ కామ్రేడ్ (2019)
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్   
సాహిత్యం : రెహ్మాన్     
గానం : సత్యప్రకాష్, చిన్మయి 

ఓ కలలా కథలా
కలిసి దూరాలే తీరాలై
ఓ జతగా జగమై కదిలె
పాదాలే ప్రాణాలై

ఇది విదియే విదిగా
కలిపే ఊహించని మలుపై
ఇరుదిశలే ఒకటై నిలిచే
తొలి వేకువలో
ఈ క్షణమే మనకే దొరికే
సంతోషం మనదై కడవరకూ
మనతో నడిచె ఈ దారిలొ

రా రా
రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇల
రా రా
దిక్కులనె చుక్కలనె దాటి అలా
రా రా
కోరుకొనే కొత్త జగం చేరుకొనె
ఓ స్వేచ్చ కదా ఈ పయనం

గడిచిన కాలం గాయం ఏదో చేసిన
మనసుపై మందె పూసే 
మంత్రమున్నదె
నిరంతరం నీడ లాగ
ఉంటున్నది తానేగా
ఉషస్సులొ ఊపిరి పంచే
గాలి పాటలా
ఒక చినుకేదొ తాకి
చిగురేస్తుంటె చైత్రం
తడి కన్నుల్లొ విరిసె
చిరునవ్వె నీ సొంతం

విడిపోలేవు గంధాలు 
ఆ పూలకుండే
అవి కనరాని బంధాలులే..
దారిలొ దారిలొ దారిలొ.

రా రా
రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇల
రా రా
దిక్కులనె చుక్కలనె దాటి అలా
రా రా
కోరుకొనె కొత్త జగం చేరుకొనె
ఓ స్వేచ్చ కదా ఈ పయనం

మనసుకు నేడే మళ్ళీ ఇంకొ జన్మల
ఎడారిలొ పూలై పూసే
వాన జల్లులా…
వసంతమై ఈ ప్రవాహం
వర్ణాలతొ సావాసం
ప్రతిక్షణం పచ్చగ నవ్వె
కొత్త జీవితం

పడి లేచేటి పాదాలు
పారాడుతుంటే నడిపిస్తుంది
ఈ కాలమే…

రా రా
రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇలా
రా రా
దిక్కులనె చుక్కలనె దాటి అలా
రా రా
కోరుకొనె కొత్త జగం చేరుకొనె
ఓ స్వేచ్చ కదా ఈ పయనం

ఓ కలలా కథల
కలిసి దూరాలె తీరాలై
ఓ జతగ జగమై కదిలే
పాదాలే ప్రాణాలై

ఇది విదియె విదిగా
కలిపే ఊహించని మలుపై
ఇరుదిశలే ఒకటై నిలిచే
తొలి వేకువలొ
ఈ క్షణమే మనకె దొరికె
సంతోషం మనదై కడవరకు
మనతో నడిచె ఈ దారిలొ

రా రా
రెక్కలనె ఒక్కటిగ కలిపి ఇలా
రా రా
దిక్కులనె చుక్కలనె దాటి అలా
రా రా
కోరుకొనె కొత్త జగం చేరుకొనె
ఓ స్వేచ్చ కదా ఈ పయనం

****************** ****************
చిత్రం : డియర్ కామ్రేడ్ (2019)
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ 
సాహిత్యం : రెహ్మాన్ 
గానం : గౌతమ్ భరద్వాజ్, యామిని ఘంటసాల 

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగీ అరిగి పోయినా…
దినుసే నలగా లేదులే
హోయ్.. హోయ్ ..హోయ్ ..హోయ్

అలుపెరగక తన వెనకాలే
అలసీ సొలసి పోయినా
మనసే కరగా లేదులే
హోయ్.. హోయ్ ..హోయ్ ..హోయ్ 

చినదేమో తిరిగే చూడాదే.. 
ప్రేమంటే అసలే పడదే హోయ్

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగీ అరిగి పోయినా
దినుసే నలగా లేదులే
హోయ్.. హోయ్ ..హోయ్ ..హోయ్

అలుపెరగక తన వెనకాలే
అలసీ సొలసి పోయినా
మనసే కరగా లేదులే
హోయ్.. హోయ్.. హోయ్..
హోయ్.. హోయ్.. హోయ్..

అలలు అలసి చతికిలపడునా
కలలు నిలిచి కలవర పడునా
సహజ గుణము నిముషము విడునా
ఏమి జరిగినా...
మనసునెపుడు వదలని తపన 
వినదు అసలు ఎవరేమనినా 
గగనమొరిగి తనపై పడిన 
ఆశ కరుగునా...

వేసవిలోన పెనుతాపం 
ఓ ఆరాటంలా 
నింగిని తాకి దిగిరాద 
వర్షంలా

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగి అరిగి పోయినా 
దినుసే నలగా లేదులే

సన్నాయి డోలు పెళ్లి పాట పాడే 
అబ్బాయి ఓరకంట చుస్తున్నాడే 
బంగారు బొమ్మ తల ఎత్తి చూడే 
నీ ఈడు జోడే అందాల చందురూడే

ఎవరికెవరు తెలియదు మునుపు 
అడిగి అడిగి కలగదు వలపు
ఒకరికొకరు అని కలపనిదే 
మనని వదులునా

ఎదురుపడిన క్షణమొక మలుపు 
అడుగు కలిపి కదిలితే గెలుపు 
దిశలు రెండు వేరై ఉన్నా పయనమాగునా 
నేనంటే తానే తను నేనె ఒకటై ఉన్నానే 
పొమ్మన్నా పోనే పడతానే లేస్తానే

గిర గిర గిర తిరగలి లాగ
తిరిగీ అరిగి పోయినా
దినుసే నలగా లేదులే
హోయ్.. హోయ్ ..హోయ్ ..హోయ్

అలుపెరగక తన వెనకాలే
అలసి సొలసి పోయినా
మనసే కరగా లేదులే
హోయ్.. హోయ్ ..హోయ్ ..హోయ్

****************** ****************
చిత్రం : డియర్ కామ్రేడ్ (2019)
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్    
సాహిత్యం : రెహ్మాన్
గానం : సిధ్ శ్రీరామ్, ఐశ్వర్యా రవిచంద్రన్   

కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
ఒడిచేరి ఒకటై పోయే
ఒడిచేరి ఒకటై పోయే
తీరం కోరే ప్రాయం

విరహం పొంగెలే
హృదయం ఊగెలే
అధరం అంచులే
మధురం కోరెలే

అంతేలేని ఏదో తాపం ఏమిటిలా
నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా
చెంతచేరి సేదతీర ప్రాయమిలా
చెయ్యి చాచి కోరుతోంది సాయమిలా
కాలాలు మారినా మారినా
నీ ధ్యాస మారునా
నీ ధ్యాస మారునా
అడిగింది మోహమే
నీ తోడు ఇలా ఇలా

విరహం పొంగెలే
హృదయం ఊగెలే
అధరం అంచులే
మధురం కోరెలే

కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే

నిన్నే నిన్నే కన్నులలో
దాచానులే లోకముగా
నన్నే నన్నే మలిచానే
నీవుగా

బుగ్గమీద ముద్దెపెట్టే చిలిపితనం
ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగుణం
పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో
నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో

నీలోన చేరగా
నా నుంచి వేరుగా
కదిలింది ప్రాణమే
నీ వైపు ఇలా ఇలా