కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)



చిత్రం: కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: నరేంద్ర, గీతా మాధురి


ఏయ్... మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో
మిరాకిల్ జరుగుతోంది అయ్యాయో
మెకన్నాస్ గోల్డ్‌లాంటి పాపాయో
మేరే దిల్ ధీంతనకా డాన్సాయో
ఏయ్ నచ్చావబ్బాయ్ కౌబాయ్
లవ్‌బాయ్ మహా గడుగ్గాయ్
వచ్చానబ్బాయ్ బుజ్జాయ్ ఎంజాయ్
నేనే కడక్ ఛాయ్
ఏయ్ సిల్కుషిఫానా ఇష్క్ తుఫానా
దోచుకుపోతా సరేనా

రెడీ రెడీ వన్ టూ త్రీ ధూమ్ ధమాకా
లబో లబో లవ్‌లోనా ఎగిరిపడ్డాకా
రెడీ రెడీ వన్ టూ త్రీ రా ఇలాగా
పిల్లా పిల్లా పేల్చేస్తా పడుచుపటాకా

చరణం: 1
ఇలా లిప్పు లాకేశావ్
అలా నిప్పు రాజేశావ్ తరారూ...
నన్నే తోసుకొచ్చేశావ్
నీతో తీసుకొచ్చేశావ్ తరారూ...
కిస్సు క్లోరోఫామ్ ఇచ్చావే మోనోకినీ
పరేషానే చేశావులే పిలగాడినీ
ఫుల్లు ఫాలోయింగ్ నీదే కదా
చూసీ చూడంగ పడిపోయా
అయిపోయా ఫిదాఫిదా...

రెడీ రెడీ వన్ టూ త్రీ ధూమ్ ధమాకా
లబో లబో లవ్‌లోనా ఎగిరిపడ్డాకా
రెడీ రెడీ వన్ టూ త్రీ రా ఇలాగా
పిల్లా పిల్లా పేల్చేస్తా పడుచుపటాకా

చరణం: 2
నీలోవుంది హెరాయిన్
నువ్వే నాకు హీరోయిన్ తరారూ...
చూపుల్లోన బ్యారల్‌గన్
టిగ్గర్‌నొక్కి ధనాధన్ తరారూ...
నాలో నువ్వొచ్చీ మోగించావ్ షెహనాయినీ
ఎట్టా మోసేదీ అమ్మాడూ ఈ హాయినీ
యాడ చూస్తున్నా నీదే హవా
ఐయామ్ లక్కీరా దక్కావ్‌రా
అక్కీర కురస్సొవా

రెడీ రెడీ వన్ టూ త్రీ ధూమ్ ధమాకా
లబో లబో లవ్‌లోనా ఎగిరిపడ్డాకా
రెడీ రెడీ వన్ టూ త్రీ రా ఇలాగా
పిల్లా పిల్లా పేల్చేస్తా పడుచుపటాకా

ఏయ్... మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో
మిరాకిల్ జరుగుతోంది అయ్యాయో
మెకన్నాస్ గోల్డ్‌లాంటి పాపాయో
మేరే దిల్ ధీంతనకా డాన్సాయో



**********   *********    **********




చిత్రం: కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: హేమచంద్ర, కారుణ్య, శ్రీకృష్ణ, నరేంద్ర

తలదించుకు బతుకుతావా
తల ఎత్తుకు తిరగలేవా
తలరాతను మార్చుకోవా సిగ్గనేది లేదా
ఒకడిగ నువు పుట్టలేదా
ఒకడిగ నువు చచ్చిపోవా
ఒకడిగ పోరాడలేవా నిద్రలేచి రారా
నీ ఓటుని నీ వేటుకె వాడుతుంటే వింతగా
జుట్టుపట్టి రచ్చకీడ్చి నీలదీయవనేరుగా
ఉడుకెత్తిన నెత్తురె ఒక నిప్పుటేరులాగ
కదలిరా... కదలిరా... కదలిరా...
పనైపోద్ది పనైపొద్ది పనైపొద్ది... రారా

చరణం: 1
నీ ఇంటి చూరువిరిగి మీదపడక ముందే
నీ గుండెలచప్పుడు నిను ఛీ కొట్టకముందే
కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్...
దేహానికి హాని అంటే వైద్యమిచ్చుకోవా
దేశానికి జబ్బుచేస్తే నీళ్లునములుతావా
కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్...

చరణం: 2
తొలి మనిషెపుడొక్కడేగ
తొలి అడుగెపుడొంటరేగ
తుదిపోరుకు సిద్ధమైన తొలివాడిగ రారా
బిగబట్టిన పిడికిలయ్యి పోటెత్తిన సంద్రమయ్యి
నడినెత్తిన సూర్యుడయ్యి ఉద్యమించిలేరా
పోరాడని ప్రాణముంటే అది ప్రాణమే కాదటా
ఊపిరినే ఒలకబోసి ఎగరెయ్యర బావుటా
కణకణకణ ప్రతికణమున
జనగణమన గీతమయ్యి రా...
కదలిరా... కదలిరా... కదలిరా...
పనైపోద్ది పనైపొద్ది పనైపొద్ది... రారా




**********   *********    **********




చిత్రం: కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: మురళి, శ్రావణ భార్గవి


జరమొచ్చింది చెమటట్టింది
ధడపుట్టింది బెంగొచ్చింది హాయొచ్చి
సొయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి
మద్య రాత్రి మెలుకువొచ్చి యేడుపేమొ తన్నుకొచ్చి
ఏటేటో అయిపొతొందో రాంబాబు
యేతంతవ్ యేతంతవ్ రో
నాకేటో అయిపొతొందో రాంబాబు
యేతంతవ్ యేతంతవ్ రో
నన్నడిగితె నాకేం తెలుసే సిత్తరాంగి ఆరెంపి డాక్టర్నడుగే
నన్నడిగితె నాకేం తెలుసే సిత్తరాంగి ఆరెంపి డాక్టర్నడుగే

ఒల్లంత యేడెక్కి పొతాఉందే
కొంపలో కూలరే ఎట్టించుకో
పొద్దంత గొంతెండి పొతాఉందే
బారాన పుల్లైసు కొరికేసుకో
దిగులొచ్చింది దిగులొచ్చింది
ఒనుకొచ్చింది ఉడుకొచ్చింది
అట్నుంచి ఇట్నుంచి అబ్బినిన్నట్నుంచి
చీరకట్టు సలుపరించి పుట్టుమచ్చ పులకరించి
యెటేటొ అయిపొతొందో రాంబాబు

యేతంతవ్ యేతంతవ్ రో
లొనేదొ అయిపొతొందో రాంబాబు
యేతంతవ్ యేతంతవ్ రో

నన్నడిగితె నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లొనీ అక్కని అడుగే
నన్నడిగితె నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లొనీ అక్కని అడుగే

నొప్పి నొప్పిగుంటాంది తగ్గట్లేదు
ఎక్కడో నరం నలిగిపొయిందేమో
ఎం తిందాంఅనుకున్నా ఎక్కట్లేదు
అందుకే స్లిమ్ముగా ఉన్నావేమొ
గుబులొచ్చింది గొడవొచ్చింది
కసురొచ్చింది బెదురొచ్చింది
అదివొచ్చి ఇదివొచ్చి ఒంటిమేదకీడొచ్చి
చెప్పలేని సైడునుంచి సుర్రుమంటు సలుపొచ్చి
బొత్తాలె  తెగిపొతున్నైరో రాంబాబు
యేతంతవ్ యేతంతవ్ రో
సిగ్గిడిచి అడుగుతుంటిరో రాంబాబు
యేతంతవ్ యేతంతవ్ రో

నాకు నా ఫాన్సుకి నూ నచ్చదె నన్నొగై నన్నొగైయ్యె
నాకు నా ఫాన్సుకి నూ నచ్చదె నన్నొగై నన్నొగైయ్యె



**********   *********    **********


చిత్రం: కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: హేమచంద్ర

ఎక్‌స్ట్రార్డినరీ... ఎక్‌స్ట్రార్డినరీ
నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ

నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ
నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ

నీ నడుం పిడికెడూ ఎక్‌స్ట్రార్డినరీ
ఆ మూతివిరుపుడూ ఎక్‌స్ట్రార్డినరీ
నువు నవ్వుతుంటే ఆ బుగ్గసొట్టలో
గుంతులేసి నా గుండె జారితే..
అయ్ బాబోయ్..

నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ
నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ

చరణం: 1
జెన్నీఫరు లోపేజ్‌లా నీ ఊపుడే ఎక్‌స్ట్రార్డినరీ
నే తాకినా తడిమేసినా ఒప్పేసుకుంటే ఎక్‌స్ట్రార్డినరీ
వేటగాడు శ్రీదేవిలా నువు కొంగుపిండితే ఎక్‌స్ట్రార్డినరీ
సరిసరీ ఓ సొగసరీ నీ గరిబనాభి ఎక్‌స్ట్రార్డినరీ
నా రాజహంస నీ చిత్రహింసలో
రాదురాదు రాత్రుళ్లు నిద్దరే ఓరి దేవుడో

నీ నగుమోమే ఎగ‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ

తరికిట తోం ఆఆఆ
ఏ..తరికిట తోం ఆఆఆ (3)

చరణం: 2
నువు గిచ్చినా గేరేసినా కొరికేసినా ఎక్‌స్ట్రార్డినరీ
నువ్వరిచినా ఒళ్లిరిచినా ఏం చేసినా ఎక్‌స్ట్రార్డినరీ
సుప్పనాతి సూరమ్మలా తిప్పుకుంటుతిరిగితే ఎక్‌స్ట్రార్డినరీ
నంగనాచి నాంచారిలా ఆ వెర్రిచూపులే ఎక్‌స్ట్రార్డినరీ
నే పొగుడుతుంటే ఏమెరగనట్టు బిల్డప్పులిస్తు
డ్రామాలు ఆడితే..వామ్మో

నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ
నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ



**********   *********    **********



చిత్రం: కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: కారుణ్య, చైత్ర

ఏ పిల్లను జూత్తే బొమ్మిడాయ్ అందం జూత్తే డొట్టడాయ్
ఆపర బాబు నీ లడాయ్ నాకాడెందుకు నీ బడాయ్
ఏ పిల్లను జూత్తే బొమ్మిడాయ్ అందం జూత్తే డొట్టడాయ్
ఆపర బాబు నీ లడాయ్ నాకాడెందుకు నీ బడాయ్

ఏమున్నావులే పుల్లట్టు లాగా సరాసరి బుల్లెట్టు లాగా
గుండె ల్లో దూరావే...
దిగానురా టికెట్ లాగా పడ్డానురా వికెట్ లాగా
కల్లప్ప గిస్తావే
చమ్మక్ చమ్మక్ చల్లో నా పిప్పరుబెంటు పిల్లో
పిండేత్తున్నా పిల్లో పూలెట్టుకు రావే జల్లో
చమ్మక్ చమ్మక్ చల్లో పడిపోతా ఇట్టే ఒళ్ళో
చమటలు పట్టేదాక మనకుండదు ఇంటర్వెల్

ఏ పిల్లను జూత్తే బొమ్మిడాయ్ అందం జూత్తే డొట్టడాయ్
ఆపర బాబు నీ లడాయ్ నాకాడెందుకు నీ బడాయ్

యా పట్టు పట్టు పావడా అది ఒల్లెంపిట్టు కాగడా
ఇనుకోరా ఎనకేరా సరదాగా జరదా పిల్లడా
యహ చుట్టు కొలత దేవుడా ననుజల్లంచేసేయ్ జల్లెడ
మొనగాడ ఇటురార పరువాన్నేసే దంపడా
హే లవ్ లాంఖిణీ  బాగుందే  కసి కొంకిణి
నీ జవానీ  జెై భవానీ జం జమాఇస్తావా…

చమ్మక్ చమ్మక్ చల్లో నా పిప్పరుబెంటు పిల్లో
పిండేత్తున్నా పిల్లో పూలెట్టుకు రావే జల్లో
చమ్మక్ చమ్మక్ చల్లో పడిపోతా ఇట్టే ఒళ్ళో
చమటలు పట్టేదాక మనకుండదు ఇంటర్వెల్

ఏ పిల్లను జూత్తే బొమ్మిడాయ్ అందం జూత్తే డొట్టడాయ్
ఆపర బాబు నీ లడాయ్ నాకాడెందుకు నీ బడాయ్

హే అప్పడదప్పడ తాండరా ఆడేద్దాం ఆదర బాదరా

హయ్ బాబో య్ హయ్ బాబో య్ సంతోడు ఎంతో తత్తర
తూర్పు దక్షిణ ఉత్తర నా ముద్దులతోనే ముద్దర
ఇరగేసి తిరగేసి చేసేయి గత్తర గత్తర
ఏ హస్తిని నీకోసం నేనొస్తిని
నిను చూస్తిని కాజేస్తిని  నీయావదాస్తినీ...హో

చమ్మక్ చమ్మక్ చల్లో నా పిప్పరుబెంటు పిల్లో
పిండేత్తున్నా పిల్లో పూలెట్టుకు రావే జల్లో
చమ్మక్ చమ్మక్ చల్లో పడిపోతా ఇట్టే ఒళ్ళో
చమటలు పట్టేదాక మనకుండదు ఇంటర్వెల్

గోపాలా గోపాలా (2015)


చిత్రం: గోపాలా గోపాలా (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: వెంకటేష్ , పవన్ కళ్యాణ్, శ్రేయ చరణ్
దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్థసాని
నిర్మాతలు: దగ్గుబాటి సురేష్ బాబు, శరత్ మరార్
విడుదల తేది: 10.01.2015



చిత్రం: గోపాలా గోపాలా (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: హరిచరన్

అలారే అలా... ఆయ నందలాల
అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీల
అలారే అలా... ఆయ నందలాల
ఆడలా ఈలేశాడో... కోలాటాల గోల గోల

హో దూరంగా రంగా దొంగా దాకోకొయ్ ఇయ్యాలా
వచ్చి నువ్ మాతో సిందెయ్యాలా
మందిరం కట్టిందయ్యా భూమి నీకీవేళ
మంచి చెయ్యాలోయ్ చాలా చాలా
ఎవడో ఏలా... ఇది నీ నేల
నువు చేసే ప్రతి మంచి ఎదురై ఎగరేయదా హో...

భజే భాజే ఆ డోలు భజే  భాజే ఆ డోలు భజారే
భజే భాజే ఆ డోలు భజే  భాజే ఆ డోలు భజారే

హో దూరంగా రంగా దొంగా దాకోకొయ్ ఇయ్యాలా
వచ్చి నువ్ మాతో సిందెయ్యాలా

భామకే లొంగేటోడు బాదేం తీరుస్తాడు
కోరస్: ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు

అవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు
కోరస్: యుద్ధంలో రధంతోలి నీతిని గెలిపించాడు

నల్లని రంగున్నోడు - తెల్లని మనసున్నోడు
అల్లరి పేరున్నోడు - అందరికీ ఐనోడు

మీ పిచ్చి ఎన్నాళ్లో అన్నేళ్లూ అన్నేళ్లూ
మీలోనే ఒకడై ఉంటాడు

భజే భాజే ఆ డోలు భజే  భాజే ఆ డోలు భజారే
భజారే భజారే భజారే
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే
భజారే భజారే భజారే

టాటాటా టట టాటాటా టట
టాటాటా టట టాటాటా టట టా...

భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే
భజారే భజారే భజారే
భజే భాజే ఆ డోలు భజే  భాజే ఆ డోలు భజారే
భజారే భజారే భజారే
భజే భాజే ఆ డోలు భజే  భాజే ఆ డోలు భజారే
భజే భాజే ఆ డోలు భజే  భాజే ఆ డోలు భజారే

ఓ బేబీ (2019)





చిత్రం: ఓ బేబీ (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మోహన బోగరాజు



నాలో మైమరపు నాకే కనుసైగ చేస్తే ఇలా
ప్రాయం పరదాలు తీసి పరుగందుకుంటే ఎలా
నాలో నాకే ఏదో తడబాటే! హా...

పాతపూల గాలే పాడుతుంటే లాలే
కొత్త జన్మలాగా ఎంత చక్కగుందే

చందమామ జారి చెలిమిలాగ మారి
గోరుముద్ద నాకే పెట్టినట్టు ఉందే...

నన్ను గారం చేసే బాటసారై ఎవరివోయి?
నేను మారాం చేస్తే నవ్వుతావు ఎందుకోయి?
నా స్వరం నన్నే కొత్తగా ఓయ్ అని పిలిచే తరుణం
ఇలా ఈ క్షణం శిలై మారితే, లిఖించాలి ఈ జ్ఞాపకం!

నువ్వు నన్ను చూసే చూపు నచ్చుతోందే
నెమలిఫించమల్లే నన్ను తాకుతోందే

తేలికైన భారం, దగ్గరైన దూరం
సాగినంత కాలం సాగనీ ప్రయాణం...

దాచిపెట్టే నవ్వే కళ్ళలోనే తొంగి చూసే...
సిగ్గు మొగ్గైపోయే గుండెలోనే పూలు పూసే...

ప్రేమ కథా చిత్రం 2 (2019)



చిత్రం : ప్రేమ కథా చిత్రం 2 (2019)
సంగీతం : జె.బి.(జీవన్ బాబు)
సాహిత్యం : అనంత శ్రీరం
గానం : రాహుల్ శిప్లిగంజ్, రమ్య బెహరా



మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసుని తడిపెయ్ వా
ఉరుములా ఉరిమిన తొలి ఆశా
వరదలా ఉన్నది వరస
చిలిపి కౌగిలై చేరుకోనా
వలపు ఊపిరై ఉండిపోనా
పెదవి కొమ్మపై వాలిపోనా
మొదటి ప్రేమనై మళ్ళీ పూయనా
ఓఓఓఓఓఓఓ....ఓఓఓఓఓఓ...

మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసుని తడిపెయ్ వా

రేయిలా తొలి రేయిలా
గడుపుదాం జీవితం
మరపుకీ మైమరపుకీ
పలుకుదాం స్వాగతం
నేను నీలో అలా
నువ్వు నాలో ఇలా
ఇదేలా... ఓఓఓఓఓ..
ఓఓఓఓఓఓఓ..

మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసుని తడిపెయ్ వా

నేలకి చిరుగాలికీ
నడుమ నుండే క్షణం
వెలుగుకి మరి మసకకీ
ముడులు వేద్దాం మనం
నేను నువ్వవ్వగా
నువ్వు నేనవ్వగా..
ఇలాగా... ఓఓఓఓఓఓ..
ఓఓఓఓఓఓ...

మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసుని తడిపెయ్ వా

F2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) (2019)



చిత్రం: F2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: డేవిడ్ సైమన్



హే క్రికెట్ ఆడే బంతికి
రెస్టే దొరికినట్టు ఉందిరో
1947 ఆగస్ట్ 15 ని
నేడే చూసినట్టు ఉందిరో

దంచి దంచి ఉన్న రోలుకి
గేపే చిక్కినట్టు ఉందిరో
వదిలేసి వైఫ్ ని సరికొత్త లైఫ్ ని
చూసి ఎన్నాళ్ళయిందిరో

ఎప్పుడో ఎన్నడో ఎక్కడో తప్పినట్టి
ఫ్రీడమ్ చేతికందిందిరో
పుట్టెడు తట్టెడు కష్టమే తీరినట్టు
స్వర్గమే సొంతమయ్యిందిరో

రెచ్చిపోదాం బ్రదర్
పార్టీ లెక్క మస్తుగుంది వెదర్
రెచ్చిపోదాం బ్రదర్
భర్త లైఫ్ మళ్ళీ బాచిలర్ (2)

హల్లో అంటు గంట గంటకి
సెల్లె మోగు మాటి మాటికి
నువ్వు ఎక్కడున్నవంటు
నీ పక్కనెవ్వరంటు
చస్తాం వీళ్ళకొచ్చే డౌట్ కి

కాజ్ ఎ చెప్పాలి లేటుకి
కాళ్ళే పట్టాలి నైట్ కి
గుచ్చేటి చూపురో సెర్చింగ్ ఆప్ రో
పాస్వర్డ్ మార్చాలి ఫోన్ కి

లేసర్ స్కానర్ ఎక్స్-రే ఒక్కటయ్యి
అలి గా పుట్టింది చూడరో
చీటికి మాటికి సూటిగా అలుగుతారు
అంతకన్న ఆయుధాలు వాడరు

రెచ్చిపోదాం బ్రదర్
పార్టీ లెక్క మస్తుగుంది వెదర్
రెచ్చిపోదాం బ్రదర్
భర్త లైఫ్ మళ్ళీ బాచిలర్

బై బై ఇంట్లో వంటకి
టేస్టే చూపుదాం నోటికి
ఇల్లాలి తిట్లకి హీటైన బుర్రకి
థాయ్ మసాజ్ చెయ్యి బాడీ కి
ఆర్గ్యు చేసి ఉన్న గొంతుని
పెగ్గే వేసి చల్ల బడని
తేలేటి ఒల్లుని పేలేటి కళ్ళని
దేఖో కంటబడ్డ ఫిగర్ ని

క్లీనర్ డ్రైవర్ ఓనర్ నీకు నువ్వే
బండికి స్పీడునే పెంచరో
పెళ్ళమో గొళ్ళెమో లేని ఓ ధీవిలో
కాలు మీద కాలు వేసి బతకరో

రెచ్చిపోదాం బ్రదర్
పార్టీ లెక్క మస్తుగుంది వెదర్
రెచ్చిపోదాం బ్రదర్
భర్త లైఫ్ మళ్ళీ బాచిలర్ (2)



*****  *****  *****


చిత్రం : F2 (2018)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : దేవీశ్రీప్రసాద్


స్వర్గమే నేలపై వాలినట్టు
నింగిలోని తారలే చేతిలోకి జారినట్టు
గుండెలోన పూలవాన కురిసినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్

నెమలికే పాటలే నేర్పినట్టు
కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు
కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్
కాళిదాసు కావ్యము
త్యాగరాయ గేయము
కలిపి మనసు పాడినట్టుగా
అందమైన ఊహలు
అంతులేని ఆశలు
వాకిలంత వొంపినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్

కళ్ళు కళ్ళూ కలుపుకుంటూ
కలలు కలలూ పంచుకుంటూ
కాలమంతా సాగిపోనీ
మోహమంతా కరిగిపోతూ
విరహమంతా విరిగిపోతూ
దూరమంతా చెరిగిపోనీ
రాతిరంటె కమ్మనైన
కౌగిలింత పిలుపనీ
తెల్లవార్లు మేలుకోవడం
ఉదయమంటె తియ్యనైన
ముద్దు మేలుకొలుపనీ
దొంగలాగ నిద్రపోవడం

ఎంతో ఫన్ ఎంతో ఫన్

రోజుకొక్క బొట్టుబిళ్ళే
లెక్కపెడుతూ చిలిపి అద్దం
కొంటె నవ్వే నవ్వుతోందే
బైటికెళ్ళే వేళ నువ్వే
పిలిచి ఇచ్చే వలపు ముద్దే
ఆయువేదో పెంచుతోందే
ఇంటికెళ్ళె వేళ అంటు
మల్లెపూల పరిమళం
మత్తుజల్లి గుర్తుచేయడం
ఇంటి బయిట చిన్నదాని
ఎదురుచూపు కళ్ళలో
కొత్త ఉత్సవాన్ని నింపడం

ఎంతో ఫన్ ఎంతో ఫన్

జెర్సీ (2018)


చిత్రం: జెర్సీ (2018)
సంగీతం: అనిరుధ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: సంగీతం: అనిరుధ్



అదేంటొగాని ఉన్నపాటుగా
అమ్మాయి ముక్కుమీద నేరుగా
తరాల నటి కోపమంతా... ఎరుపేగా
నాకంటూ ఒక్కరైనా లేరుగా
నన్నంటుకున్న తారవే నువా
నాకున్న చిన్ని లోకమంత నీ... పిలులేగా

తేరిపారా చూడసాగె దూరమే
ఏది ఏది చేరె చోటనే
సాగె క్షణము లాగెనే వెనకె మనని చూసెనే
చెలిమి చేయమంటు కోరెనే
ఓ ఓ ఓ ఓ
వేగమడిగి చూసెనే
అలుపే మనకి లేదనే వెలుగులైనా వెలసిపోయెనే
ఓ ఓ ఓ ఓ

చరణం:
మా జోడు కాగా
వేడుకేగా వేకువెప్పుడో తెలీదుగా
ఆ ఆ ఆ చందమామ మబ్బులో దాగిపోడా
హే వేళ పాళ మీకు లేదా
అంటు వద్దనే అంటున్నదా
ఆ...సిగ్గులోని అర్థమే మారిపోదా


ఏరి కోరి చేరసాగే కౌగిలే
ఏది ఏది చేరె చోటనే
కౌగిలిరుకు ఆయనే
తగిలే పసిడి ప్రాయమే
కనులలోనే నవ్వు పూసెనే

లోకమిచట ఆగెనే
ముగ్గురో ప్రపంచమాయెనే
మెరుపు మరుపుతోనే కలిసెనే

అదేంటొగాని ఉన్నపాటుగా
కాలమెటుల మారెనే
దొరికే వరకు ఆగదే
ఒకరు ఒకరుగానే విడిచెనే

అదేంటొగాని ఉన్నపాటుగా
దూరమెటుల దూరెనే
మనకే తెలిసె లోపలే
సమయమే మారిపోయెనే