రౌడీఅల్లుడు (1991)


చిత్రం: రౌడీఅల్లుడు (1991)
సంగీతం: బప్పీలహరి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి.బాలు, చిత్ర


పల్లవి:
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
తెలుపుమా... ఆ... ఆ... ఆ... ఆ...
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
పలుకుమా... ఆ... ఆ... ఆ... ఆ...

చరణం: 1
నడిచే నాట్యమా నడుము నిదానమా
పరువపు పత్యమా ప్రాయం పదిలమా
నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా
తడిమే నేత్రమా నిద్దుర భద్రమా
ప్రియతమా... ఆ... ఆ... ఆ... ఆ...

చిలుకా క్షేమమా కులుకా కుశలమా
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
తెలుపుమా... ఆ... ఆ... ఆ... ఆ...

చరణం: 2
పిలిచా పాదుషా పరిచా మిసమిస
పెదవుల లాలస పలికే గుసగుస
తిరిగా నీ దశ అవ్వనా బానిసా
తాగా నీ నిషా నువు నా తొలి ఉషా
ప్రియతమా... ఆ... ఆ... ఆ... ఆ...

సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
చిలుకా క్షేమమా కులుకా కుశలమా
పలుకుమా... ఆ... ఆ... ఆ... ఆ...


*********   **********   **********


చిత్రం: రౌడీ అల్లుడు (1991)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
లవ్ మీ మై హీరో...  మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో
ఓకే మై లేడి అలాగే కానీ అమ్మాడి
చలో చూసేస్తా నీ వేడి
తనువే బహుమానం...  ముదిరే చలికాలం

లవ్ మీ మై హీరో...  మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో...
అరె ఓకే మై లేడి...  అలాగే కానీ అమ్మాడి
చలో చూసేస్తా నీ వేడీ...

చరణం: 1
హో...ఒకటో ముద్దు వయస్సుకిచ్చేశా
రెండో ముద్దు రౌండ్ అప్ చేసేసా
మూడో ముద్దు మరింత లాగించేయ్
నాలుగో ముద్దు నిషాను చూపించెయ్
పనిలో పని పదవే మరి
ప్రాక్టీసు మొదలెడదాం

లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో...

చరణం: 2
ఐదో ముద్దు ఇక్కడ పెట్టాలి
ఆరో ముద్దు అక్కడ తీర్చాలి
ఏడో ముద్దు ఏదో ఇమ్మంటే
ఎనిమిదో ముద్దు ఇచ్చేదిస్తుంటే
లెక్కెందుకు పద ముందుకు
ముద్దుల్లో ముంచేందుకు

ఓకే మై లేడి...  అలాగే కానీ అమ్మాడి
చలో చూసేస్తా నీ వేడి
లవ్ మీ మై హీరో...  మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో
ముదిరే చలికాలం...  తనువే బహుమానం


*********   **********   **********


చిత్రం: రౌడీ అల్లుడు (1991)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బా
బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బా బుమ్బాయే బుమ్బా

బోలో బోలో బోలో రాణి క్యా చాహియే
అరె ప్యార్ చాహియే యా పైసా చాహియే
నీ బాసా నాకు తెల్డం లేదు తెలుగు తెలిసితే సెప్పు
ఏ ఊరు మంది? అనకాపిల్లి నీ ఊరు ఏటి?
అమలాపురం ఇక చూసుకో

అనకాపల్లి బుల్లెమ్మా నీకేటి కావాలా
స్వీట్ కావాలా పచ్చ నోటు కావాలా
పైట పడితే సైట్ కొడితే పండు వెన్నెల్లో
ఆట సాగాలా బాక్స్ మోత మోగాలా

అమలాపురం బుల్లోడా నీ బొంబాయి చూడాలా
బాక్స్ లేవో మోత లేవో నాకు తెల్దంట
కొత్తగొచ్చానోయ్ ఊరు చుట్టి చూడాలా

చరణం: 1
చల్ రే రాణి చేయవే బోణి స్టార్ట్ చేద్దాం విహారం
తొంగి చూసే పొంగులన్నీ లొంగ దీసే యవ్వారం
పల్లె దాటి ఫస్ట్ టైము బయటకి ఒచ్చావువయ్యో
తల్లి చాట్టు పిల్లదాని లోకమే తెలవదయ్యో
చెప్పిన మాట చప్పున వింటే చీర కొనిపెడతా
బండి ఎక్కిస్తా చర్చి గేటు చూపిస్తా
గేటు చూపి నీట ముంచే మాటలు ఎందుకురో

అనకాపల్లి బుల్లెమ్మా ఇంకేమిటి కావాలా
అమలాపురం బుల్లోడా నీ బొంబాయి చూడాలా

చరణం: 2
అరె జానీ కోయి లడ్కి కో ఆతే హువా దేఖా
నహి యహా తో కోయి నహి ఆయా

ఓ కిలాడీ మాయలేడి ప్లేట్ మారిస్తే బెస్టు
నంగనాచి పోజులిస్తే టైట్ చేస్తా నీ నట్టు
ఎర్ర ఖాకి చూస్తే చాలు ఎందుకో సిగ్గు ఒట్టు
అందుకే నే పారిపోయా ఆపు నీ జుట్టు పట్టు
చూసాలే నీ చిన్నలన్ని రౌడీ రంగమ్మో
అరె అరె నిన్ను తలదన్నే A1కేడి నేనమ్మో
నీది నాది ఒకటే భాష చూడు బావయ్యో

అనకాపల్లి బుల్లెమ్మా ఇంకేమి విననమ్మో
అమలాపురం బుల్లోడా ఉహుం ఉహుం


*********   **********   **********


చిత్రం: రౌడీ అల్లుడు (1991)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కుకు కు కూ... కుకు కు కూ...

ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
ఏం పట్టు బాపురే ఔనంటే కిరికిరే
కొల్లగొట్టి పోకు ఖజానా
కుకు కు కూ... కుకు కు కూ...

చరణం: 1
వహ్‌వా బేబి వెదరు బాగుందే
ఏదో మూడు ముదిరిపోయిందే
అయ్యో రయ్యో వరస మారిందే
అబ్బాయి గారి పొగరు హెచ్చిందే
అరెరెరె నాటో నీటో ఎంచుకుందామా
ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందామా
ఇహ ఓపలేను వదులు బుల్లోడా
I love you... you love me
I kiss you... you kiss me

ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కుకు కు కూ...

చరణం: 2
అంతో ఇంతో దూరముండాల
అమ్మా నాన్నా సిగ్నల్ ఇవ్వాల
ఎంతో కొంత లాభముండాలే
కొద్దో గొప్పో చిత్తగించాలే
అరెరే డేటు టైము ఫిక్స్ చేయమంట -ఓకే
అపుడు మనకే రిస్కు లేదంట
అరె బాత్ నహీ సాత్ చలో నా..చలో చలో
I love you...  you love me... OK baby
I kiss you... you kiss me

ప్రేమా గీమా తస్సాదియ్య పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కుకురు కు కూ...

హే ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
ఏం పట్టు బాపురే ఔనంటే కిరికిరే
కొల్లగొట్టి పోకు ఖజానా

న న న నా...
కుకు కు కూ... కుకురు కు కూ...
కుకురు కు కూ... కుకురు కు కూ...


*********   **********   **********


చిత్రం: రౌడీ అల్లుడు (1991)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక
దబాయించేసిందే దుంపదెగా జబ్బలరైకా
నిబాయించేదెట్టా నిప్పుసెగా నివ్వెరపోగా
తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక

చరణం: 1
కోకా కో అన్నాకా కాదంటుందా కైపెక్కే కదలికా
కునుకే కొండెక్కాక కూచోనిస్తుందా కుదురంటూ కుదరకా హోయ్
కేకా కవ్వించాక కంగారేగా కౌగిల్లో కరగగా
కసిగా కబురంపాక కంచె తెంచేయదా కొరికేసె కోరికా
చలువతో.. కలవగా.. కలబడదా.. కొంటెగా.....

తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక
దబాయించేసిందే దుంపదెగా జబ్బలరైకా
నిబాయించేదెట్టా నిప్పుసెగా నివ్వెరపోగా
తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక

చరణం: 2
చక్క చెంప చిక్క చూపొచ్చిందే సొంపంతా చిదమగా
సోకే సొక్కి పోగా నొక్కిపోతుందే నాజుగ్గా నిమరకా
చుక్కా నువ్వించక్కా చూపించాక కౌగించే కబళికా
ఇంకా నిలవలేకా రాడా నెలవంకా ఇలవంకా చక చకా
చొరవగా.. కొరివిగా.. జతపడగా.. జోరుగా......

తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక
దబాయించేసిందే దుంపదెగా జబ్బలరైకా
నిబాయించేదెట్టా నిప్పుసెగా నివ్వెరపోగా
తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక


*********   **********   **********


చిత్రం: రౌడీ అల్లుడు (1991)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో

తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో

చరణం: 1
ప ని స గ స ని సా
స గ మ ప మ గ మా

కాగుతున్న కోరికంత కాగడాగ మారని
కంటపడని కైపుకథల సంగతేదొ చూడని
కౌగిలిలో నలిపి నలిపి చుక్కలనోడించని
రాలుతున్న మల్లెలు గా పక్కపైన దించని
గాజుల గలగలలు...  విరజాజుల విలవిలలు
కందిపోయి కాలమాగనీ...

కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో...
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో

చరణం: 2
ప ని ప ని సా ప ని ప ని సా
స గ స గ మా స గ స గ మా

కునుకేదీ కనపడదేం ఏమైందో ఏమో
లోకాలను జోకొట్టే పనిలో ఉందేమో
కొంగు విడిచిపెట్టని నా సిగ్గెటుపొయిందో
జతపురుషుని చేరేందుకు సిగ్గుపడిందేమో
ఊపిరి ఉప్పెనలో తొలిమత్తుల నిప్పులలో
చందమామ నిదర చెదరని..హా...

కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో

నిర్ణయం (1991)




చిత్రం: నిర్ణయం (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:  సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.జానకి


ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం
పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం 
వెయ్యేళ్ళ దియ్యాలతో
పద పద పదమని పిలిచిన విరి పొద పోదాం పదమ్మో
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం
సిగ్గూ సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో
అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం

తియ్యందించీ తీర్చనా ఋణం చెయ్యందించే తీరమా
బంధించేద్దాం యవ్వనం మనం పండించేద్దాం జీవనం
నవ నవమని పరువం ఫలించే పరిణయ శుభతరుణం
కువ కువమని కవనం లిఖించే కులుకుల కలికితనం
నా ఉదయమై వెలిగే ప్రియ వరం

అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం
పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం 
వెయ్యేళ్ళ దియ్యాలతో
అహా...పద పద పదమని పిలిచిన విరి పొద పోదాం పదమ్మో
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
వడ్డించమ్మా సోయగం సగం ఒడ్డెక్కించే సాయమా
సై అంటున్నా తీయగా నిజం స్వర్గం దించే స్నేహమా
పెదవుల ముడి పెడదాం ఎదల్లో మదనుడి గుడి కడదాం
వదలని జత కడదాం జతుల్లో సుడిపడి సుఖపడుదాం
రా వెతుకుదాం రగిలే రసజగం

అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం
సిగ్గూ సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో

అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
అహా...పద పద పదమని పిలిచిన విరి పొద పోదాం పదమ్మో
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో




*******  ********  ********



చిత్రం: నిర్ణయం (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:  గణేష్ పాత్రో
గానం: యస్.పి.బాలు

హలో గురూ ప్రేమ కోసమేరోయ్  జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని
హలో గురూ ప్రేమ కోసమేరోయ్  జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం

ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని
చదువు సంధ్య గల్గినోడ్ని చౌక భేరమా
గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
నా కన్నా నీకున్నా తాకీదులేంటమ్మా
నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా ఆహా
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా
ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్

హలో గురూ ప్రేమ కోసమేరోయ్  జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని యా యా
హలో గురూ ప్రేమ కోసమేరోయ్  జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం


కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే
అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా
నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లు
నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు
ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా
అచ్చా మైనే ప్యార్ కియా లుచ్చా కామ్ నహీ కియా
అమి తుమి తేలకుంటే నిను లేవదిస్కుపోతా ఆర్ యు రెడీ

హలో గురూ ప్రేమ కోసమేరోయ్  జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని హా హా హా
హలో గురూ ప్రేమ కోసమేరోయ్  జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం



*******  ********  ********


చిత్రం: నిర్ణయం (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: మనో, యస్. జానకి

మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా
మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా

వెచ్చనైన గుండె గిన్నెలో
వెన్నలింత దాచి ఉంచకు
పొన్న చెట్టు లేని తోటలో
కన్నె వేణువాలపించకు
ప్రేమ అన్నదే ఓ పల్లవైనదీ
పెదవి తాకితే ఓ పాటలే అదీ
ఆమని ప్రేమని పాడే కోయిలా

మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా

మౌనమైన మాధవీ లత
మావి కొమ్మనల్లుకున్నది
ఎల్లువైన రాగమిప్పుడే
ఏకతాళమందుకున్నది
తోచదాయనే ఓ తోడు లేనిదే
కౌగిలింతలే ఓ కావ్యమాయలే
ఎన్నడు లేనిది ఎందుకో ఇలా

మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా

పెళ్లిపుస్తకం (1991)


చిత్రం: పెళ్లిపుస్తకం (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్. పి. బాలు, సుశీల


శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ

తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా
తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా
తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా
తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్దం

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో
అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో
ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని
ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని
మసకేయని పున్నమిలా మణికి నింపుకో

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ
శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ


*********  ********  ********


చిత్రం: పెళ్లిపుస్తకం (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్. పి. బాలు, సుశీల

అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్

ఓ అసలే విరహం అయ్యో దూరం ఎల్లాగున్నావు
హా చారెడు పిడికెడు బారెడు పిల్లా ఎల్లాగున్నావు
ఎందా...?
చెంపకు కన్నులు చారెడు
సన్నని నడుము పిడికెడు
దువ్వి దువ్వక పువ్వులు ముడిచిన
నల్లని నీ జడ బారెడు
మనసిలాయో...

అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్

హా అయ్యో పావం ఆషాంద్ర కార్యం ఎందాయి
అదేవిటి
ఓ గుటకల చిటికెలు కిటుకులు అబ్బో చాలా గడుసు
మ్మ్ గుటకలు చిటికెలు కిటుకులు ఏమిటి సంగతి
ఆ కులుకు చూస్తే గుటకలు
సరసకు రమ్మని చిటికెలు
చక్కని చిన్నది అందం చందం
చేజిక్కాలని కిటుకులు
మనసిలాయో...

కిట్ట మూర్తి కిట్ట మూర్తి మనసిలాయో
మనసిలాయో మనసిలాయో అమ్ము కుట్టి

గుండెల్లోన గుబ గుబలాడే ఊహల ఊరెను ఉవ్విళ్ళు
పరవశమైన మా శ్రీవారికి పగ్గాల్లేని పరవళ్ళు
చుట్టూ చూస్తే అందాలు
లొట్టలు వేస్తూ మా వారు
చుట్టూ చూస్తే అందాలు
లొట్టలు వేస్తూ మా వారు
అక్కడ తమకు ఇక్కడ మనకు
విరహంలోన వెక్కిళ్ళు
మనసిలాయో హొ హొ

అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
అమ్ము కుట్టి అమ్ము కుట అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్


*********  ********  ********


చిత్రం: పెళ్లిపుస్తకం (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్. పి. శైలజ, పి. సుశీల

హాయి హాయి శ్రీరంగ సాయి
హాయి హాయి శ్రీరంగ సాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
హాయి హాయి శ్రీరంగ సాయి

ఏదీ కాని వేళ ఎడద ఉయ్యాల (2)
కోరి జో కొట్టింది కుసుమ సిరి బాల

హాయి హాయి శ్రీరంగ సాయి
హాయి హాయి శ్రీరంగ సాయి

అజ్ఞాత వాసాన అతివ పాంచాలి
ఆరళ్ళు భీమన్న దూరమ్ము సేయు
ఆవేశ పడరాదు అలసి పోరాదు
అభిమానమే చాలు అనుచుకోన మేలు

హాయి హాయి శ్రీరంగ సాయి
హాయి హాయి శ్రీరంగ సాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
హాయి హాయి శ్రీరంగ సాయి

నిద్రా కన్యకలొచ్చి నిలచి దీవిస్తే
భద్ర కన్యకలేమో పలుకు తధాస్తు
నిద్రా కన్యకలొచ్చి నిలచి దీవిస్తే
భద్ర కన్యకలేమో పలుకు తధాస్తు
మాగన్నులొనైన మరచిపో కక్ష
సిరి కనుల నిద్దురకు శ్రీరామ రక్షా


*********  ********  ********


చిత్రం: పెళ్లిపుస్తకం (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్. పి. శైలజ, రాజేశ్వరి

కృష్ణం కలయ సఖి సుందరం
బాల కృష్ణం కలయ సఖి సుందరం
కృష్ణం కథవిశయ తృష్ణం
కృష్ణం కథవిశయ తృష్ణం
జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా
బాల కృష్ణం కలయ సఖి సుందరం

శృంగార రసభర సంగీత సాహిత్య
శృంగార రసభర సంగీత సాహిత్య
గంగాల హరికేల సంగం సదా
బాల కృష్ణం కలయ సఖి సుందరం
బాల కృష్ణం కలయ సఖి సుందరం

రాధారుణాధర సుతాపం సచ్చిదానంద
రాధారుణాధర సుతాపం సచ్చిదానంద
రూపం జగత్రయ భూపం సదా
బాల కృష్ణం కలయ సఖి సుందరం
బాల కృష్ణం కలయ సఖి సుందరం

అర్థం శీథిలీకృతానర్తనం శ్రీ నారాయణ
అర్థం శీథిలీకృతానర్తనం శ్రీ నారాయణ
తీర్థం పురుషార్థం సదా
బాల కృష్ణం కలయ సఖి సుందరం
బాల కృష్ణం కలయ సఖి సుందరం


*********  ********  ********


చిత్రం: పెళ్లిపుస్తకం (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్. పి. బాలు

ప ప ప ప ప పప్పు దప్పళం
ప ప ప ప ప పప్పు దప్పళం
అన్నం నెయ్యి వేడి అన్నం కాచిన్నెయ్యి
వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నెయ్యి
వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నెయ్యి పప్పు దప్పళం కలిపి కొట్టడం
భొజనం వనభోజనం
వనభోజనం జనరంజనం
తల్లి తోడు పిల్ల మేక ల ల...
తల్లి తోడు పిల్ల మేక ఆలు మగలు
అత్తా కోడలు బాసు బంటు
ఒకటేనంటు కలవడం
భొజనం వనభోజనం
భొజనం వనభోజనం

మన వయసుకు నచ్చినట్టి ఆటలు
మన మనసుకు వచ్చినట్టి పాటలు - ఆ...
మన వయసుకు నచ్చినట్టి ఆటలు
మన మనసుకు వచ్చినట్టి పాటలు
పసనిస పనిదని మదపదమప
సగమమ దమమగరి పాడితే
రంజనం జనరంజనం
రా రా ర రంజనం జనరంజనం

మీరు స - స స
మీరు రి - రి రి
తమరు గ - గ గ
మేము ప ప ప ప ప
వేరిగుడ్  మేము ద ద ద ద ద - శభాష్
ని ని ని ని ని - మరల సా

వేరిగుడ్  బావుంది బావుంది బావుంది
ఆ ఇప్పుడు నేను ఎవర్ని చూపిస్తె
వాళ్ళ స్వరం పాడాలి ఏ ఊం రెడియా

సరిగ సారిగ మ మ - మ మ
రిగమ రీగమా ప ప - ప ప
తక్కిట తకధిమి తరికిటతక తరికిటతక
మసాలా గారెలో - మామా
జిలేబి బాదుషా - పాపా
సమోసా తీసుకో - దాదా
పొటాటో చిప్సుతోనా - నీనీ
మిఠాయి కావురే యేడం
పకోడి తిందువ - పా ప
మలాయి పెరుగిది మ మ
టొమాటో ఛట్నితొ - ద ద
పసందు పూర్ణమూ - భూరి
నంజుకో కారప్పూసా

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్మార్కు మిరపకాయల బజ్జి కొరికి చూడు...
గోంగూర పచ్చడి గొడ్డు కారపు ముద్ద
మినపట్టు ముక్కతో మింగి చూడూ
ఉల్లిపాయల మధ్య అల్లమ్ము చల్లిన
పెసరట్టు ఉప్మతో మెసవి చూడూ
గసగసాల్ మిరియాలు కారా లవంగాలు
నాణ్యమౌ యాలకులు నమిలి చూడూ
తెలుగుతనమున్న తిండిని తిన్నవాడు
తనకు తెలియక హాయిగా తనువు ఊగ
పాట పాడును తప్పక ఆటలాడు
డాన్సు రానట్టి వారైన డాన్సు సేయూ
ఆ ఆ ఆ ఆ...

శ్రీమన్ మహాదోమ నీ కుట్టడం మండ
ఘీ పెట్టడం ఎండ నీ గోల ఉద్వేల కోలహలాభీల
హాలాహలజ్వాల గీరాకరాళాగ్ని
విఘ్నం హుఘ్నం కావాలి
నా రెండు కర్ణాల నీ మొండి గానాల
నాలించగా నేను
ఆ నీవేమి ట్రాన్సిస్టరా లేక దాన్ సిస్టరా
నీదు అంగికౄతంగాని సంగీతమున్నీవు
డామిట్టు డామిట్టు స్టాపిట్టు స్విచ్చాఫు
నాపాలి భూతంబ ఆపాలి ఘాతంబు
శాకిని ఢాకిని గాలి దెయ్యంబా
చి చి ఓసే పాతకి ఘాతకీ ఇదే చూడవే
ఘాత నీ రాత నా చేత పట్టిచ్చెనే
నిన్ను తోల్తొన్న పేల్తావు వెంటడి వెంటాడి
గీపెట్టి చంపేయుచున్నావూ
ఈ చేత నిన్ బట్టి ఆ చేతితొ కొట్టి
కిందెట్టి మీదెట్టి రెట్టించి దట్టించి నవ్వేతునే
పాడు దోమ హరామ గులామ
అయ్యో రామ రామా...
సమాప్తం సమాప్తం సమాప్తం సమాప్తం

జింతన తన తన జిం జింతన తన తన
అరిశెలు భూరెలు వడలు
ఆవడ బోండలు కజ్జికాయలు
కరకరలాడు జంతికలు
కమ్మని ఘుమ్మని నేతి చిప్సులు
సరిగమ పదమప గమగరి సరి సససససా

ఆ అరిశెలు భూరెలు వడలు
ఆవడ బోండలు కజ్జికాయలు
కరకరలాడు జంతికలు
కమ్మని ఘుమ్మని నేతి చిప్సులు
కరమగు నోరు ఊరగల
కక్కలు ముక్కలు ఫిష్ కబాబులు ష్
అమ్మమ్మామ్మమ్మా
కరమగు నోరు ఊరగల
కారపు పచ్చడి తీపి జాంగిరి
త్వరత్వర సర్వు చేయవలె
తైతకలాడగ పిక్కునిక్కులు
త్వరత్వర సర్వు చేయవలె
తైతకలాడగ పిక్కునిక్కులు
తైతక తైతక తైతక తై తై తై

తకధిన్నధిన్న తకధిన్నధిన్న
తాంగిటతక తిరికిటతక ధిగి ధిగి ధిగి
తకతకిట తకతకిట తకతకిట
తదిగిణతోం తదిగిణతోం తదిగిణతోం
ఆ...ఆ...ఉఁ...
తాంగిటతక తరికిటతకధిమి
తాంగిటతక తరికిటతకధిమి
తాంగిటతక తరికిటతకధిమి  త త త త
ధిం తనకధిన ధిం తనకధిన
ధిధిం తనకధిన ధిం తనకధిన
తకధిమి తకధిమి
తకధిమి తకధిమి తకధిమి
అహా  ఓహో అహా తరికిట తరికిట తరికిట తరికిట
ధిధిధిధి నకధిన ధిధిధిధి నకధిన ధిధిధిధి నకధిన
ధిధిధిధి నకధిన ధిధిధిధి నకధిన ధిధిధిధి నకధిన
తరికిట తరికిట తరికిట తరికిట
తరికిట తరికిట తరికిట తరికిట
ధిత్తాంగి తరికిట థా


*********  ********  ********


చిత్రం: పెళ్లిపుస్తకం (1991)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్. పి. బాలు

సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమత బడుగు పేద
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నోకలల  కల నేత
నా వన్నెల రాశికి సిరి జోత
నా వన్నెల రాశికి సిరి జోత

ముచ్చట గొలిపే మొగలి పొద్దుకు
ముళ్ళు వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు
అలక కులుకు ఒక అందం
ఈ అందాలన్నీ కలబోశా
నీ కొంగుకు చెంగున ముడి వేస్తా
ఈ అందాలన్నీ కలబోశా
నీ కొంగుకు చెంగున ముడి వేస్తా

ఇది ఎన్నోకలల  కల నేత
నా వన్నెల రాశికి సిరి జోత
నా వన్నెల రాశికి సిరి జోత

చుర చుర చూపులు ఒక మారు
నీ చిరు చిరు నవ్వులు ఒక మారు
మూతి విరుపులు ఒక మారు
నువు ముద్దుకు సిద్దం ఒక మారు
నువు ఏ కలనున్నా మా బాగే
ఈ చీర విశేషం అల్లాగే
నువు ఏ కలనున్నా మా బాగే
ఈ చీర విశేషం అల్లాగే

సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమత బడుగు పేద
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నోకలల  కల నేత
నా వన్నెల రాశికి సిరి జోత
నా వన్నెల రాశికి సిరి జోత

అమ్మ రాజీనామా(1991)



చిత్రం: అమ్మ రాజీనామా (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర


పల్లవి:
ఎవరు రాయగలరు...
అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు...
అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం

అమ్మేగా... అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి

ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం

చరణం: 1
అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అవతారమూర్థైనా అణువంతే పుడతాడు
అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు

అమ్మేగా... అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని

ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం

చరణం: 2
శ్రీరామరక్ష అంటూ... నీళ్ళుపోసి పెంచింది
ధీర్గాయురస్తు అంటూ... నిత్యం దీవించింది
శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది
ధీర్గాయురస్తు అంటూ నిత్యం దీవించింది

నూరేళ్ళు... నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మచేతి వేళ్ళతో

ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం



********    *********    *********



చిత్రం: అమ్మా రాజీనామా (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె. జే. ఏసుదాసు

పల్లవి:
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో
ఈ సృష్టినే స్థంభింప చేసే తంత్రాలు ఎన్నో

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ

చరణం: 1
బొట్టుపెట్టి పూజచేసి గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత
బొట్టుపెట్టి పూజచేసి గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత
విత్తునాటి చెట్టు పెంచితే...
చెట్టు పెరిగి పళ్ళు పంచితే...
తిన్న తీపి మరచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే
లోకమా... ఇది న్యాయమా?
లోకమా... ఇది న్యాయమా?

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ

చరణం: 2
ఆకుచాటు పిందె ముద్దు తల్లిచాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు
ఆకుచాటు పిందె ముద్దు తల్లిచాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు
ఉగ్గుపోసి ఊసు నేర్పితే...
చేయిబట్టి నడక నేర్పితే...
పరుగు తీసి పారిపోతే చేయిమార్చి చిందులేస్తే
లోకమా... ఇది న్యాయమా?
లోకమా... ఇది న్యాయమా?

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో...
ఈ సృష్టినే స్థంభింప చేసే తంత్రాలు ఎన్నో

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ



*********    *********    *********



చిత్రం: అమ్మ రాజీనామా (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు

చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది
ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది
చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది
ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది
రొమ్మేగా... రొమ్మేగా అందించెను జీవితాన్ని నోటికి
అమ్మేగా తన నెత్తురు నింపెను నీ ఒంటికి
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగంలా తియ్యని రాగం

ఆలైన బిడ్డలైన ఒకరు పొతే ఇంకొకరు
అమ్మా పదవి ఖాలీ అయినా అమ్మా అవరు ఇంకెవరు
ఆలైన బిడ్డలైన ఒకరు పొతే ఇంకొకరు
అమ్మా పదవి ఖాలీ అయినా అమ్మా అవరు ఇంకెవరు

అమ్మంటే...అమ్మంటే విరమించని వట్టి వెట్టి చాకిరీ
అమ్మంటే రాజీనామా ఎరగనీ ఈ నౌకరి
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగంలా తియ్యని రాగం



*********   *********    **********



చిత్రం: అమ్మ రాజీనామా (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు

ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు
దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో
వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని

ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు

పసిబిడ్డగా పుట్టి కూతురై పెరిగి కోడలై భర్తకు బార్యయై
బిడ్డకు తల్లియై ఇల్లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా
నవ్వులు ఏడుపులు కలిపి దిగమింగి ఇంటినే గుడిచేసిన దేవతా
శలవిమ్మని అడిగితే...
ఇక శలవిమ్మని అడిగితే...
ఇది కనని వినని సంఘటన... అపూర్వ సంఘటన

ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు

భూమిపై పుట్టి బానిసై పెరిగి దాసియై సేవకు నిలయమై ఆగని యంత్రమై
నిజములో నిద్రలో ఇల్లే కళ్ళుగా వయసును సుఖమును చితిగా వెలిగించి
బ్రతుకే హారతి ఇచ్చిన దేవతా
శలవిమ్మని అడిగితే...
ఇక శలవిమ్మని అడిగితే...
ఇది కనని వినని సంఘటన... అపూర్వ సంఘటన

ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు
దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో
వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని
ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు

అగ్ని సమాధి (1978)


చిత్రం : అగ్ని సమాధి (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, జానకి  


పల్లవి : 

ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా

ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా 

ప్రణయ పిపాసి హృదయ నివాసి


చరణం 1 :

సెలయేటి రాగాల ఎలదేటి గానాల విన్నాను నీ పాటలెన్నో
హరివిల్లు ఎదలోనా విరిజల్లు జడిలోనా కన్నాను నీ వన్నెలెన్నో

స్వప్నాలెన్నో స్వర్గాలెన్నో... భావలెన్నో భోగాలెన్నో
కలుపుకున్న కనులలోనా నిలిపి చూడగా  


ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా 

ప్రణయ పిపాసి హృదయ నివాసి


చరణం 2 :

అనురాగ గిరిలోనా ఆనందశిఖరాన శివతాండవం నీవు కాగా
సగమైన దేహాన సరితూగు వేగాన సతి లాస్యమే నీవు కాగా
జాబిలి వంగీ  సిగలో పువ్వై... ఎదలో ఎరుపే పెదవుల ఎరుపై..
మెరిసిపోయి మురిసిపోయి ముద్దులాడగా

ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా 

ప్రణయ పిపాసి హృదయ నివాసి

*********** ************* ************


చిత్రం : అగ్ని సమాధి (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, జానకి  


పల్లవి: 


ప్రియతమా... నీ ఊపిరే నాకు ప్రాణం
నీ చూపులే నాకు దీపం
నీవే లేని నాడు...  నేనే శూన్యము
నీతో ఉన్న నేడు...  బ్రతుకే స్వర్గము..
ప్రియతమా... నీ ఊపిరే నాకు ప్రాణం



చరణం 1 :

తోడు నీడై.. అడుగుల జాడై.. నడిచే నడకలు నీవే
తేనియ వలపై.. తీయని పిలుపై.. పలికే పలుకులు నీవే 

ఈ అనురాగమే జీవితమూ.. ఈ అనుబంధమే శాశ్వతమూ
నాలో నీవై.. నీలో నేనై.. ఒకటై పోదాం నేడే ..
ప్రియతమా.... నీ ఊపిరే నాకు ప్రాణం 


చరణం 2 :


ఎన్ని తరాల.. ఎన్ని యుగాల...  మారని మనసు నీవు
ఎన్నడు లేని.. ఎవరికి లేని.. మాయని మమతవు నీవు

ఎదలో ఉన్నది ఆలయము...  అది నా దేవత మందిరము
మన ఈ జంటే.. గుడి జేగంటై.. మోగాలి కలకాలం..

ప్రియతమా....  నీ ఊపిరే నాకు ప్రాణం
నీ చూపులే నాకు దీపం
నీవే లేని నాడు...  నేనే శూన్యము
నీతో ఉన్న నేడు...  బ్రతుకే స్వర్గము..

ప్రియతమా.... నీ ఊపిరే నాకు ప్రాణం...

షాక్ (2006)




మధురం మధురం మధురం మధురం
మధురం మధురం మధురం మధురం
ప్రణయం మధురం కలహం మధురం
క్షణము సగము విరహం మధురం
సరసం మధురం విరసం మధురం
చికురం మధురం చుబుకం మధురం
సరసం మధురం విరసం మధురం
చికురం మధురం చుబుకం మధురం

అందం అందం అని ఊరించే
అందాలన్ని అసలే మధురం

శ్రవణం మధురం నయనం మధురం
కులుకే మధురం కురులే మధురం
గమనం మధురం జగనం మధురం
లయలో సాగే పయనం మధురం

గమనం మధురం జగనం మధురం
లయలో సాగే పయనం మధురం
ఎదరే ఉంటే ప్రతిది మధురం
చెదిరే జుట్టు చమటే మధురం

సర్వం మధురం సకలం మధురం
సంసారంలో సాగరమధనం
సర్వం మధురం సకలం మధురం
సంసారంలో సాగరమధనం

అన్నీ మధురం అఖిలం మధురం
ఆమే మధురం ప్రేమే మధురం
అన్నీ మధురం అఖిలం మధురం
ఆమే మధురం ప్రేమే మధురం

కనులే మధురం కలలే మధురం
కొంచం పెరిగే కొలతే మధురం
కనులే మధురం కలలే మధురం
కొంచం పెరిగే కొలతే మధురం
మనసే మధురం సొగసే మధురం
విరిసే పెదవుల వరసే మధురం

ఉదయం దాచే మధురిమ గాని
ఉదరం మధురం హృదయం మధురం

తాపం మధురం శోకం మధురం
అలకే చిలికే కోపం మధురం
అలుపే మధురం సొలుపే మధురం
అతిగా మరిగే పులుపే మధురం

అలుపే మధురం సొలుపే మధురం
అతిగా మరిగే పులుపే మధురం
అధరం మధురం వ్యధనం మధురం
వెలుగే చిలికే తిలకం మధురం

బాలా మధురం డోలా మధురం
లీలా మధురం హేలా మధురం
బాలా మధురం డోలా మధురం
లీలా మధురం హేలా మధురం
జోజో మధురం మధురం 
జోలా మధురం మధురం
మనువాటకిదే ఫలితం మధురం

మధురం మధురం ప్రణయం మధురం
మధురం మధురం విరహం మధురం
సరసం మధురం విరసం మధురం
నయనం మధురం వదనం మధురం
సరసం మధురం విరసం మధురం
నయనం మధురం వదనం మధురం
అన్ని మధురం అఖిలం మధురం
మనమే మధురం ప్రేమే మధురం

 చిత్రం : షాక్ (2006)
సంగీతం : అజయ్-అతుల్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

ఒసేయ్ రాములమ్మ (1997)






చిత్రం: ఒసేయ్ రాములమ్మ (1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిహ్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: వందేమాతరం శ్రీనివాస్

ఓ ముత్యాల రెమ్మా ఓ మురిపాల కొమ్మ
ఓ పున్నామి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ
ఓ రాములమ్మా  రాములమ్మా

ఏం చూపులోయమ్మ ఏగు చుక్కనేనమ్మ
సిరి నవ్వులోయమ్మ చంద్ర వంకనేనమ్మ
ఓ రాములమ్మా  రాములమ్మా
నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మ
ఓ రాములమ్మా  రాములమ్మా
ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను గిలిపెనమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా

నువ్వు సిందు మీద సిందేసి సెంగుమంటే నమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా (2)

పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే
నురగ తీరుగా ఉన్నావే
ఓ రాములమ్మ
విచ్చుకోని మొగ్గవోలె పచ్చిపాల నిగ్గువోలె
ముచ్చటేసి పోతున్నవే
ఓ రాములమ్మ
వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో
వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో
నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే
భూమి తల్లి సాక్షిగ నువ్వు క్షేమంగుండాలే
సూరిడే నీ వంక తేరి చూసేనమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
అడుగేస్తే నేలంతా అద్దమాయెనమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
పసిడి వన్నె ఒంటి మీద పాడు చూపు పడకుండా
పసుపు పూసినారే అమ్మలు
ఓ రాములమ్మ

చిట్టి వయసు పారిపోయే సిగురు వయసు చేరెనని
చీర కట్టినారే గుమ్మలు
ఓ రాములమ్మ
దొర గారి దొరసాని దీవెనలా కోసమని
ఆ దొర గారి దొరసాని నిండు దీవెనల కోసమని
కాళ్ళు మొక్తా బాంచనని వంగినావమ్మా
మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా
దొరగారి పై ఊగే పంకా వైనావమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
దొరసాని కాల్లొత్తే దూది వైనావమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
దేవిటినే వెలిగించే దివ్వే వైనావమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
నలుగురికి తల్లోని నాల్క వైనావమ్మా

ఓ ఓ ఒసేయ్ రాములమ్మా (2)

చికటింట బిక్కుమంటు కలత పడ్డ కళ్ళల్లోన
బాకులాంటి ఎలుగు మెరిసెనా
ఓ రాములమ్మ
మూగ బడ్డ వెదురులోన ముచ్చటైన రాగాలూదే
ముద్దులయ్య చెయ్యి దొరికేనా
ఓ రాములమ్మ
కష్టాలు కన్నీళ్లు ఉంటాయా చానాళ్ళు
కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా చానాళ్ళు
ఇంకా పొదలు మాటు పువ్వుల్లాగ ఒదగాలోయమ్మ
గుబులు లేని గువ్వల్లగా ఎగరాలోయమ్మ
పచ్చని అడవితల్లి పందిరవుతుందమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
నీరెండే నీ కాలి పారాణవుతుందమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
పూసేటి పూలన్ని పోసే తలంబ్రాలమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
కోయిలల సందడ్లే సన్నాయి మేళాలమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా

********** ************ ************* ***********


చిత్రం: ఒసేయ్ రాములమ్మ (1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిహ్యం: గందవరపు సుబ్బారావు
గానం: వందేమాతరం శ్రీనివాస్

అ చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డీ గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు

చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డీ గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు ఆ...

డొనేషన్ల యుగములోన
డబ్బు లేని దళితుల్లో
వందకొకడు చదువుతుంటే
ఓర్చుకోని గుణమెందుకు
ఓర్చుకోని గుణమెందుకు
అరె లంచగొండి దేశంలో ఎనకబడ్డ జాతుల్లో
వెయ్యికోకడు నౌకరైతే ఎడ్చుకొనే పుట్టేందుకు
ఎడ్చుకొనే పుట్టేందుకు
పాయసాల జీడిపప్పు తినేవాళ్లకి సామీ
పాయసాల జీడిపప్పు తినేవాళ్లకి
మా గంజిలోన ఉప్పుజూసి గొణుగుడెందుకూ

చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డీ గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు

పల్లెటూళ్ల సర్పంచుల పట్టణాల చైర్మన్ల
సగం నీకే ఇస్తమని సంకలెగర వెయ్యమన్రు
సంకలెగర వెయ్యమన్రు
శాసనసభ సభ్యుల్లో పార్లమెంటు మెంబర్లో
అర కోర సీటులిచ్చి ఐసుజేసి పోతన్రు
ఐసుజేసి పోతున్రు
పవరు లేని పదవికుండె రిజర్వేషను
పవరు లేని పదవికుండె రిజర్వేషను
ఆ ప్రధానమంత్రి పదవికి ఎందుకుండదు
గా ముఖ్యమంత్రి పదవికైన ఎందుకుండదు సామీ

చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డీ గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు

పండుతున్న భూముల్లో ఎనభై శాతం మీవే
మిల్లుల్లో మిషనుల్లో మూడొంతులు మీ కిందే
మూడొంతులు మీ కిందే
అరె రూపాయ కట్టలన్ని మీ ఇనప పెట్టెలందే
బంగారం వెండంత మీ మెడకే మీ కాళ్లకే
మీ మెడకే మీ కాళ్లకే
ఎనభై శాతం మంది ఎండుకొని చస్తుంటే
ఇరవై శాతం మీరు దండుకొని బతుకుతున్రు
దండుకొని బతుకుతున్రు
మా చదువులు మా కొలువులు మీకు ఇస్తము
మా చదువులు మా కొలువులు మీకు ఇస్తము
మీ సంపదలో రిజర్వేషన్ మాకు ఇస్తరా

చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డీ గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు

మీ అబ్బ పేరేమో సుబ్బారావు గారైతే
మా అయ్యా పేరేమో సుబ్బిగాడు ఐపోయే
సుబ్బిగాడు ఐపోయే
మీ అన్న గారేమో విమానాల్లో ఎక్కుతుంటే
మా తమ్ముడు గాడేమో రిక్షాలు తొక్కుతుండె
రిక్షాలు తొక్కుతుండె
మీ అమ్మకు జలుబొస్తే అపొలోలో  జేరుతుంటే
మా తల్లికి కేన్సరైతే ఆకు పసరు మింగుతుండే
ఆకు పసరు మింగుతుండే

మా బాధలు మా గాధలు దేవుళ్ళకి చెబుదమంటే
మా బాధలు మా గాధలు దేవుళ్ళకి చెబుదమంటే
దేవుళ్లలో ఒకడైన దళితుడే లేకపాయే

చౌదరి గారు ఓ నాయుడు గారు
ఆ రెడ్డీ గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు

చౌదరి గారు ఓ నాయుడు గారు
రెడ్డీ గారు ఓ రాజు గారు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు
మీ పేరు చివరలో ఆ తోకలెందుకు
ఈ ఊరు చివరనే మా పాకలెందుకు ఆ...




********** ************ ************* ***********


చిత్రం: ఒసేయ్ రాములమ్మ (1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిహ్యం: గుడా అంజయ్య
గానం: వందేమాతరం శ్రీనివాస్

లచ్చులో లచ్చన్నా...
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
ఎయ్...

అరెరరె లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా ఏయ్...

అ ఏకనోడు పీకనోడు జనం మొఖం దేఖనోడు
జనం మొఖం దేఖనోడు
ఎలక్షన్ల జీబులొచ్చి లెక్చరు మీద లెక్చరిచ్చి
లెక్చరు మీద లెక్చరిచ్చి
కాలవి గట్టిచ్చినమని కానూను బలుకుతున్రు
కానూను బలుకుతున్రు
కోళ్లగూడు కొంపగట్టి కోట్లు మింగి కూర్చున్రు
కోట్లు మింగి కూర్చున్రు
దసరా పండగొచ్చిందని రాక రాక అల్లుడొస్తే
రాక రాక అల్లుడొస్తే
ఆలుమగలు ఇద్దరింట మసలరాదు మెసలరాదు
మసలరాదు మెసలరాదు
ఉచ్చబొయ్యబోదమంటే...
ఉచ్చబొయ్యబోదమంటే పంచ పొంటిదాగుండదు


లచ్చులో... లచ్చులో...
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా

ప్రజలవద్ద పాలనని ఊరూరుకి తిరుగుతున్రు
ఊరూరుకి తిరుగుతున్రు
ఎన్నడు రానాఫీసరు గుడిసె ముందుకొచ్చిన్రు
గుడిసె ముందుకొచ్చిన్రు
కడుపులో సల్ల కదలకుండ కారు మీద వచ్చిన్రు
కారు మీద వచ్చిన్రు
శ్రమదానం పేరుతోటి పలుగు పార పట్టిన్రు
పలుగు పార పట్టిన్రు
అంగిస్తరి చడకుండా తట్ట నెత్తికెత్తుతున్రు
తట్ట నెత్తికెక్కుతున్రు
పేపర్లో ఫొటోలకీ...
పేపర్లో ఫొటోలకి ఫోజులిచ్చి దిగుతున్రు

లచ్చులో... లచ్చులో...
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా

అరెరరెరరె...

అరె చచ్చినోడి లగ్గానికి వచ్చిందే కట్నమని
వచ్చిందే కట్నమని
సందట్లో సడేమియా సందులోకి జారుతున్రు
సందులోకి జారుతున్రు
హర్షాదు బోఫార్స్ హవాలా దొంగలు
హవాలా దొంగలు
సూటు బూటులేసుకున్న సూటికేసు దొంగలు
సూటికేసు దొంగలు
సంచి కూడ చూపించని యూరియా దొంగలు
యూరియా దొంగలు
అందరు శకాహారులే...
అందరు శకాహారులే రొయ్యల ముల్లేడబాయే


లచ్చులో... లచ్చులో...
హే లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా

ఏయ్...

తప్పతాగి నా మొగుడు తన్నుడు గుద్దుడువెడితే
తన్నుడు గుద్దుడువెడితే
సంసారం ఈదలేక రోజు చచ్చి పుడుతుంటే
రోజు చచ్చి పుడుతుంటే
అమ్మలక్క లంత గలిసి వాడ వాడ లొల్లి జేసి
వాడ వాడ లొల్లి జేసి
సర్కారుల గళ్ళవట్టి సార బందు పెట్టిస్తే
ఖజానాలు ఖాలీ అని జీతమివ్వలేమని
జీతమివ్వలేమని
శ్వేతపత్రమట్టుకోని
శ్వేతపత్రమట్టుకోని గల్లి గల్లి తిరిగుతన్రు

లచ్చులో... లచ్చులో...
హే లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే

లచ్చులో...
ఒరేయ్ లచ్చులో
అన్నో లచ్చులో లచ్చన్నా
లచ్చులో లచ్చన్నా
లచ్చులో లచ్చన్నా
లచ్చులో లచ్చన్నా




********** ************ ************* ***********

చిత్రం: ఒసేయ్ రాములమ్మ (1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిహ్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: వందేమాతరం శ్రీనివాస్, చిత్ర

ఆ... ఆ... ఆ...
ఇంతి ఏ ఇంటి జాణవే
ఇంతి ఏ ఇంటి జాణవే
ముద్దులా పూబంతి ఏ వీధి రాణివే
ఇంతి ఏ ఇంటి జాణవే
ముద్దులా పూబంతి ఏ వీధి రాణివే
తీరు చామంతి పువ్వుల పేరు
నీ సాటి కన్నెలే లేరు
దివికాంతలైన సరిరారు
నిను చూడ కోరికల పోరు
చలరేగే గుండె దడ హోరు
సోభాంగి తెలుపు నీ పేరు
నిను కన్నోళ్లకు జోహారు
పలుకవేలనే పల్లె రంభని
ఒళ్ళు చూసిన కళ్ళు తిరుగునే

ఇంతి ఏ ఇంటి జాణవే
ముద్దులా పూబంతి ఏ వీధి రాణివే

దారికెదురుగ నిలువబోకు
నాతోటి నువ్వు కారుకూతలు ఒదురబోకు
దారికెదురుగ నిలువబోకు
నాతోటి నువ్వు కారుకూతలు ఒదురబోకు
నీరి జంతువతీరుగ ఇటు తూరి
చెడు నుడుగులతో నను చేరి
ఆపదలను పొందకు కోరి
తలచకురా నను సుకుమారి
కనిపించును నాలో మారి
చూపింతును నరకపు దారి
మరియాదగ వెళ్లుము రోరి
చాలు చాలు నీ పలువ కూతలిక
జూలి వదులుకొని ఇల్లు చేరుకో

దారికెదురుగ నిలువబోకు
నాతోటి నువ్వు కారుకూతలు ఒదురబోకు

కళ్ళు రస పిపాసులకు సంకెళ్లు
రతి సదనానికి వాకిళ్లు
ఆ స్వర్గమునే నాకిల్లు
చేయింతు విప్పు నీ ముడ్లు
పోదాం పదవే పొదరిల్లు
నేను ఒక వేశ్య కాంతను కాను
ఉచ్చాస్థి వాంఛలో లేను
మీరున్న ఇంట పుట్టాను
తల వొంచేదానిని కాను
నీ దొరతనముడిగిస్తాను
అని ప్రతినెపుడో చేశాను
తిమ్మిరిమొత్తం చిమ్ముకోకు
నిను అమ్మలక్కలతో దుమ్మొదిలిస్తా

దారికెదురుగ నిలువబోకు
నాతోటి నువ్వు కారుకూతలు ఒదురబోకు

వల్ల నను ఊరించే రసగుల్ల
నీ ప్రతినను తీరుట కల్ల
నీ సంఘమంటే ఒక డొల్ల
ఎహె తెల్లవారేసరి కల్లా
మటుమాయం చేతునే మళ్ల
తొందర పడకుర నీవింత
కను తెరుస్తుంది జనమంత
నీకేదుంచరు పిసరంత
నిను పూడ్చి పెట్టేది వింత
అనుకోక తెలుసుకో కొంత

చాలు చాలు నీ పలువ కూతలిక
జూలి వదులుకొని ఇల్లు చేరుకో

అ దొరనే ఎదిరించినావులే
నీ కున్న పొగరు పొరనే తొలిగించు తానులే
కాలం మారింది ఓ దొరో
ఈ రాతిరి నీకు కాలం తీరింది చూడరా
ఓసి పరువాల పొంగులా రాశి
ఇక లొంగిపోవే నా దాసి ఉఁ హ హా
ఓరి నేనింక కాదు నీ దాసి
ఈ పూట నేను రాకాసి రేయ్...
టెక్జులింక ఆపేసి
మంచాన్ని ఎక్కు వాటేసి
పోతాను నిన్ను కాటేసి
పూజించుకోర సన్యాసి
రతి పూజలు నీకే చేసి
పోతానులేవే ఆ కాశీ హహా హహహా
రతిని కాదు పార్వతిగ మారి
నిను ఖతం చేసి దుర్గటిని బాపెదను

కాలం మారింది ఓ దొరో
ఈ రాతిరి నీకు కాలం తీరింది చూడరా
కాలం మారింది ఓ దొరో
ఈ రాతిరి నీకు కాలం తీరింది చూడరా



********** ************ ************* ***********

చిత్రం: ఒసేయ్ రాములమ్మ (1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిహ్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: వందేమాతరం శ్రీనివాస్, ఎస్.జానకి

హేయ్ పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా

పుల్లలమంటివి గదరా

ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
పుల్లలమంటివి గదరా

ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా

ఎల్లకాలము నీదే
చెల్లుతుందనుకొని
కల్లాకపటములేని
పల్లె జనులకు నువ్వు
ముల్లువోలె నిలిచినావురా
దినదినము మమ్ముర
నల్లులోలే నలిపినావురా
మా ఆడ పడుచుల
ఘొల్లుమనగా చెరచినావురా
ఒరి దొరల కొడుకా
తుళ్ళి తుళ్ళి నవ్వినవ్ గదరా
అరె దొంగ కొడుకా
అరె కళ్లులో కామమ్ముతో

ప్రతి పిల్ల పిల్లకు కన్నువేసిన
కళ్ళు రెండు పెరికి ముప్పై
పళ్ళు చెప్పుతో రాలగొడతాం హా

అరె పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర

బట్వారి కొడుకా
పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా

ఎక్కడివి నీ పొలములు
పటేల్లు కొడుకా
ఎక్కడివి నీ చెలుకలు
భూస్వామి కొడుకా
ఒక్క రోజు కూడా ఒక్క నిమిషము సేపు
దుక్కి దున్నలేని దున్నపోతువు నీకు
దిక్కు తెలియని భూములెక్కడివి
మా వెట్టియేగా
చెక్కుచెదరని మేడలెక్కడివి
మా కండ కల్వగ
లెక్కలేని గరిసెలెక్కడివి
మా నెత్తురోడగ
చక్కని పన్నీరు లెక్కడివి

మా చెమట రాలగ
అరె చిక్కినవ్ ఇప్పటికి నువ్వు
ఇక్కడ ఇయ్యల నిన్ను
తొక్కిపట్టి తోలు పెట్టి
ఠక్కున తల పగలగొడతం హా

అరె పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా

వెట్టి పశులా మంటివిరో
మా అన్న లాలో
ఎట్టి బాధలు బెడితివిరో
మా అక్కలాలో
వెట్టిచాకిరి చెయ్యలేక
పుట్టినట్టి ఊరు విడిచి
పట్టణాలకు పారిపోతే
పిట్టలోలే పట్టుకొచ్చి
కట్టినావు కాల్లు చేతులురా
కారాలు జెల్లి
కొట్టితే కొరడాలు తెగినయి రా
మా గెంజి పోతే
కట్టి ఉచ్చ తాపినవ్ గదరా

నిను కొట్టడానికి
కట్టెలు ఎన్నైన చాలవురా
నిను చంపడానికి
అరె నిట్టనిలువున నరికి నేడు
చుట్టుబట్టు ఊళ్లలో
నీ పొట్ట పేగులు బలిని జెల్లే
చిట్ట పులులం వచ్చినాముర హా

అరె పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా
పుల్లలమంటివి గదరా
ఇదిగో పులి పిల్లాలై వచ్చినాముర
బట్వారి కొడుకా

అడవిలో అన్న (1997)





చిత్రం: అడవిలో అన్న (1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: జయరాజ్
గానం: కె.జె. ఏసుదాస్, ఎస్.జానకి


వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా
వందనాలమ్మా నీకు వందనాలమ్మా
వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా
వందనాలమ్మా నీకు వందనాలమ్మా

సల్లంగ బ్రతుకు కొడుకా నూరేళ్లు
సల్లంగ బ్రతుకు కొడుకా నూరేళ్లు
సుక్కోలే బ్రతుకు సూర్యునిల వెలుగూ

వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా
వందనాలమ్మా నీకు వందనాలమ్మా

రామున్ని కొలిచినావమ్మా
నిత్యం పూజలే చేసినావమ్మా
రామున్ని కొలిచినావమ్మా
నిత్యం పూజలే చేసినావమ్మా
గూడు చెదిరిపోయే గుండెలవిసి పోయే
గూడు చెదిరిపోయే గుండెలవిసి పోయే
కొలిచినా రామయ్య కొండదిగి రాడాయే

వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా
వందనాలమ్మా నీకు వందనాలమ్మా

నీతికై రామయ్య రా చిన్న
వనవాసమేగాడురా కన్నా
భూమికై నీ అయ్యరా చిన్నా
రక్తాన్ని చిందాడు రా కన్నా
నీతికై రామయ్య రా చిన్న
వనవాసమేగాడురా కన్నా
భూమికై నీ అయ్యరా చిన్నా
రక్తాన్ని చిందాడు రా కన్నా

తలవంచి నిలవద్దు ఎదిరించి నడవాలి
తలవంచి నిలవద్దు ఎదిరించి నడవాలి
తండ్రినే మించిన తనాయుడవ్వాలిరా
అందుకోవయ్య ఆ జండానొదలబోకయ్యా
అందుకోవయ్య ఆ జండానొదలబోకయ్యా

వీర తిలకం దిద్దినావు
పోరుదారిలో నడవమన్నావు
వీర తిలకం దిద్దినావు
పోరుదారిలో నడవమన్నావు
చావైన బ్రతుకైన వెనుదిరగనోయమ్మ
చావైన బ్రతుకైన వెనుదిరగనోయమ్మ
కనతల్లి మాటను జవదాటనోయమ్మ
వీడబోనమ్మా నీ మాట మరువలేనమ్మా
వీడబోనమ్మా నీ మాట మరువలేనమ్మా

రావణుడు కూలాలి రా చిన్నా
రాజ్యమే మారాలి రా కన్నా
రావణుడు కూలాలి రా చిన్నా
రాజ్యమే మారాలి రా కన్నా
అణచబడ్డోళ్ళంతా  చరచబడ్డోళ్ళంత
అణచబడ్డోళ్ళంతా  చరచబడ్డోళ్ళంత
కామంతో కరగాలి కంఠాన్ని నరకాలి
కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా
కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా
నీ మీదే నా ఆశ నీ మీదే నా ద్యేస
నీ మీదే నా ఆశ నీ మీదే నా ద్యేస
నీతోటే నా బ్రతుకు తూరుపున పొడవాలి

కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా
కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా
పోరులో గెలవాలి కన్నా
పోరులో గెలవాలి కన్నా
పోరులో గెలవాలి కన్నా

చీమలదండు (1995)





తెలంగాణ గట్టుమీద సందమామయ్యో ఓలా సందమామయ్యా
తల్లీ మల్లీ సెట్టుకేమొ సందమామయ్యో ఓలా సందమామయ్యా
ఎర్రా మల్లెలు పూసెనంట సందమామయ్యో ఓలా సందమామయ్యా
ఎర్రా మల్లెల పరిమళాలు సందమామయ్యో ఓలా సందమామయ్యా
వెదజల్లే పల్లె పల్లె సందమామయ్యో ఓలా సందమామయ్యా
తెలంగాణ గట్టుమీద తల్లీ మల్లీ సెట్టుకేమొ ఎర్రా మల్లెలు పూసేనంట 
ఎర్రా మల్లెల పరిమళాలు వెదజల్లే పల్లె పల్లె 
ఎర్రా మల్లెల పరిమళాలు సందమామయ్యో ఓలా సందమామయ్యా
వెదజల్లే పల్లె పల్లె సందమామయ్యో ఓలా సందమామయ్యా

కొయ్యాలమ్మ కొయ్యాలమ్మ కోయ్యాలో 
మామిడి ఆకుల్ని కొయ్యాల
ఆ పచ్చానీ తోరణాలే కట్టాల 
ఆ తన్నారి నారె నన్ని నన్నానా
హోలియ హోలియ హోలో హోలియ హోలియ హోలా
హోలియ హోలియ హోలో హోలియ హోలియ హోలా

తెలంగాణ గట్టుమీద సందమామయ్యో ఓలా సందమామయ్యా
ఎర్రా మల్లెలు పూసెనంట సందమామయ్యో ఓలా సందమామయ్యా
పల్లెల పందిరి మీద సందమామయ్యో ఓలా సందమామయ్యా
అల్లుకున్న మల్లెతీగ సందమామయ్యో ఓలా సందమామయ్యా
తుది మొదలు తెలవకుండ సందమామయ్యో ఓలా సందమామయ్యా
పల్లెల పందిరి మీద అల్లుకున్న మల్లేతీగ తుది మొదలు తెలవకుండ 
చిదిమె కొద్ది ఎదిగెనంట కోసె కొద్ది పూసెనంట
చిదిమె కొద్ది ఎదిగెనంట సందమామయ్యో ఓలా సందమామయ్యా
కోసె కొద్ది పూసెనంట సందమామయ్యో ఓలా సందమామయ్యా

ఎయ్యాలమ్మ ఎయ్యాలమ్మ ఎయ్యాలో సుక్కల పెళ్ళీ పందిరి ఎయ్యాలా
ఆ చక్కంగ పెళ్లిని జరిపించాల
ఆ తన్నారి నారె నన్ని నన్నానా
హోలియ హోలియ హోలో హోలియ హోలియ హోలా
హోలియ హోలియ హోలో హోలియ హోలియ హోలా
తెలంగాణ గట్టుమీద సందమామయ్యో ఓలా సందమామయ్యా
ఎర్రా మల్లెలు పూసెనంట సందమామయ్యో ఓలా సందమామయ్యా
పల్లెలంటే మల్లెలుగాదు సందమామయ్యో ఓలా సందమామయ్యా
విప్లవాల వీరులమ్మ సందమామయ్యో ఓలా సందమామయ్యా
మండే అగ్గిపుల్లలమ్మ సందమామయ్యో ఓలా సందమామయ్యా
మల్లేలంటే మల్లెలుకాదు విప్లవాల వీరులమ్మ మండే అగ్గిపుల్లలమ్మ
చావంటే భయం లేదు త్యాగాలా బిడ్డలమ్మ
చావంటే భయం లేదు సందమామయ్యో ఓలా సందమామయ్యా
త్యాగాలా బిడ్డలమ్మ సందమామయ్యో ఓలా సందమామయ్యా
చెయ్యాలమ్మ చెయ్యాలమ్మ చెయ్యాలో చిలక గోరింకల పెళ్ళీ చెయ్యాలా
ఆ పెళ్ళింట్లొ పప్పన్నాలే తినాలా 
ఆ తన్నారి నారె నన్ని నన్నానా
హోలియ హోలియ హోలో హోలియ హోలియ హోలా
హోలియ హోలియ హోలో హోలియ హోలియ హోలా

తెలంగాణ గట్టుమీద సందమామయ్యో ఓలా సందమామయ్యా
ఎర్రా మల్లెలు పూసెనంట సందమామయ్యో ఓలా సందమామయ్యా
భూమి కొరకు భుక్తి కొరకు సందమామయ్యో ఓలా సందమామయ్యా
సాగే పోరాటానికి సందమామయ్యో ఓలా సందమామయ్యా
సారధులు వారధులై సందమామయ్యో ఓలా సందమామయ్యా
భూమి కొరకు భుక్తి కొరకు సాగే పోరాటానికి సారధులు వారధులై
ఎగిరే జండాలోలే సందమామయ్యో ఓలా సందమామయ్యా
ఎరుపెక్కి ఉన్నారమ్మ సందమామయ్యో ఓలా సందమామయ్యా
తెలంగాణ గట్టుమీద సందమామయ్యో ఓలా సందమామయ్యా
ఎర్రా మల్లెలు పూసెనంట సందమామయ్యో ఓలా సందమామయ్యా


చిత్రం :  చీమలదండు  (01.01.1995)
గానం,సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
తారాగణం : ఆర్ నారయణమూర్తి


************* ******************* **************

శ్రమజీవుల హక్కులకై అశువులు బాసిన అమరులారా...
అందుకోండి అరుణారుణ వందనాలు...
నీ త్యాగఫలం నీ కర్మఫలం వృధాకానీయం... ఎర్రజెండా...సాక్షీగా....

ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో .. ఎర్రెర్రని దీ జెండెన్నియల్లో 
ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో ..ఎర్రెర్రని దీ జెండెన్నియల్లో

పేదల పాలిటి ఎన్నియల్లో మరి పెన్నిధి ఈ జెండెన్నియల్లో
పేదల పాలిటి ఎన్నియల్లో మరి పెన్నిధి ఈ జెండెన్నియల్లో
ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ
ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో .. ఎర్రెర్రని దీ జెండెన్నియల్లో 
ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో .. ఎర్రెర్రని దీ జెండెన్నియల్లో 

అన్నలు అన్నాలెన్నియల్లో మరి వెన్నెలకోనా లెన్నియల్లో 
అన్నలు అన్నాలెన్నియల్లో మరి వెన్నెలకోనా లెన్నియల్లో 
వెన్నెలకోనా లెన్నియల్లో మరి వెలుగు రవ్వ లెన్నియల్లో
వెన్నెలకోనా లెన్నియల్లో మరి వెలుగు రవ్వ లెన్నియల్లో
తూరుపుదిక్కులెన్నియల్లో మరి సూరిడుపొడిచిండెన్నియల్లో
తూరుపుదిక్కులెన్నియల్లో మరి సూరిడుపొడిచిండెన్నియల్లో
ప్రజలకొరకు ఎన్నియల్లో.. మన అన్నలు నిలిచారెన్నియల్లో 
ప్రజలకొరకు ఎన్నియల్లో.. మన అన్నలు నిలిచారెన్నియల్లో
ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ
ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో .. ఎర్రెర్రని దీ జెండెన్నియల్లో 
ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో .. ఎర్రెర్రని దీ జెండెన్నియల్లో 

పడమటి దిక్కున ఎన్నియల్లో మరిసూరీడు కుంగిండెన్నియల్లో 
పడమటి దిక్కున ఎన్నియల్లో మరిసూరీడు కుంగిండెన్నియల్లో 
ప్రజలమధ్య నెన్నియల్లో మన అన్నలు ఒరిగారు ఎన్నియల్లో
ప్రజలమధ్య నెన్నియల్లో మన అన్నలు ఒరిగారు ఎన్నియల్లో
ఒరిగిన అన్నలకెన్నియల్లో మన ఎర్రని దండా లెన్నియల్లో 
ఒరిగిన అన్నలకెన్నియల్లో మన ఎర్రని దండా లెన్నియల్లో
ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ
ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో .. ఎర్రెర్రని దీ జెండెన్నియల్లో 
ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో .. ఎర్రెర్రని దీ జెండెన్నియల్లో 

సీకటికొండ లెన్నియల్లో మరి సివరీమూలా లెన్నియల్లో
సీకటికొండ లెన్నియల్లో మరి సివరామూలా లెన్నియల్లో
సికాకులం నుండెన్నియల్లో మరి నాలుగుదక్కులెన్నియల్లో
సికాకులం నుండెన్నియల్లో మరి నాలుగుదక్కులెన్నియల్లో
పోరు సాగంగెన్నియల్లో మరి పోరుమార్గం ఎన్నియల్లో 
పోరు సాగంగెన్నియల్లో మరి పోరుమార్గం ఎన్నియల్లో 
ఒరిగిన అన్నలకెన్నియల్లో మన ఎర్రని దండా లెన్నియల్లో 
ఒరిగిన అన్నలకెన్నియల్లో మన ఎర్రని దండా లెన్నియల్లో 
ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ
ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో .. ఎర్రెర్రని దీ జెండెన్నియల్లో 
ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో .. ఎర్రెర్రని దీ జెండెన్నియల్లో 

ఆగదు ఆగదు ఎన్నియల్లో.. పోరాటమాగదు ఎన్నియల్లో
ఆగదు ఆగదు ఎన్నియల్లో.. పోరాటమాగదు ఎన్నియల్లో
పోరుమార్గమెన్నియల్లో  మరి నువ్వునేను ఎన్నియల్లో
పోరుమార్గమెన్నియల్లో  మరి నువ్వునేను ఎన్నియల్లో
నువ్వునేను ఎన్నియల్లో మరి కలిసేపోదాం ఎన్నియల్లో
నువ్వునేను ఎన్నియల్లో మరి కలిసేపోదాం ఎన్నియల్లో
కలిసేపోదాం ఎన్నియల్లో మరి నడిచే పోదాం ఎన్నియల్లో 
కలిసేపోదాం ఎన్నియల్లో మరి నడిచే పోదాం ఎన్నియల్లో 
ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ
ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో .. ఎర్రెర్రని దీ జెండెన్నియల్లో 
ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో .. ఎర్రెర్రని దీ జెండెన్నియల్లో 

పేదల పాలిటి ఎన్నియల్లో మరి పెన్నిధి ఈ జెండెన్నియల్లో
పేదల పాలిటి ఎన్నియల్లో మరి పెన్నిధి ఈ జెండెన్నియల్లో
ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ ఎర్రజెండ
ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో .. ఎర్రెర్రని దీ జెండెన్నియల్లో 
ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో .. ఎర్రెర్రని దీ జెండెన్నియల్లో 

సినిమా :చీమలదండు (1995)
తారాగణం : ఆర్ నారాయణ మూర్తి
సంగీతం, గానం :వందేమాతరం శ్రీనివాస్