శ్రీమంతుడు (2015)





చిత్రం: శ్రీమంతుడు (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాగర్, సుచిత్ర



జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే
జత కలిసే జత కలిసే అడుగులు రెండు జతకలిసే
జనమోక తీరు వీళ్ళకొక తీరు ఇద్దరొకలాంటి వారు
అచ్చు గుద్దినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరూ
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరూ

నలుపు జాడ నలుసైనా అంటుకోని హృదయాలు
తలపు లోతున ఆడమగలని గుర్తులేని పసివాళ్ళు
మాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలు
ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాయాలు
పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరీ ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా
బహుశా బ్రహ్మ పొరపాటుఏమో ఒక్కరే ఇద్దరు అయ్యారు

ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరూ

ఉన్నచోటు వదిలేసి ఎగిరిపోయెనీలోకం
ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వటం కోసం
నీలి రంగు తెర తీసి తొంగి చూసే ఆకాశం
చూడకుండా ఈ అద్బుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం
నిన్నదాక ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా
ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడో కలిసిన వారయ్యారు

ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరూ



**********     **********   *********


చిత్రం: శ్రీమంతుడు (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి , దేవి శ్రీ ప్రసాద్
గానం: యాజిన్ నజీర్, దేవి శ్రీ ప్రసాద్


Oh my beautiful girl, Do you really wanna get on the floor, Oh my glittering pearl, Let's get on and rock n roll

Oh my beautiful girl, Do you really wanna get on the floor, Oh my glittering pearl, Let's get on and rock n roll

Oh my beautiful girl, Do you really wanna get on the floor, Oh my glittering pearl, Let's get on and rock n roll

ఓ చారుశీలా.! స్వప్నబాలా.! యవ్వనాలా.! ప్రేమ పాఠశాలా.!
మల్లెపూలా.! మాఫియాలా.! రేపినావే.!గుండెలోన గోల.!
హే... హాట్ హాట్ హాట్ హాట్ మెక్సికన్ టకీలా చిక్కినావే చిన్ననాటి ఫాంటసీలా
ఓ పార్టు పార్టు పిచ్చ క్యూటు ఇండియన్ మసాలా
నీ స్మైలే లవ్ సింబలా...

ఓ చారుశీలా.! స్వప్నబాలా.! యవ్వనాలా.! ప్రేమ పాఠశాలా.!
మల్లెపూలా.! మాఫియాలా.! రేపినావే.!గుండెలోన గోల.!

Oh my beautiful girl, Do you really wanna get on the floor, Oh my glittering pearl, Let's get on and rock n roll

కోనియాకులా కొత్తగుంది కిక్కు కిక్కు కిక్కు కిక్కు
చేతికందెనే సోకు బ్యాంకు చెక్కు చెక్కు చెక్కు చెక్కు
మెర్య్కురి మబ్బుని పూలతో చెక్కితే శిల్పమై మారిన సుందరి
కాముడు రాసిన గ్లామర్ డిక్ట్స్నరి నీ నడుం వొంపున సీనరీ

ఓ చారుశీలా.! స్వప్నబాలా.! యవ్వనాలా.! ప్రేమ పాఠశాలా.!
మల్లెపూలా.! మాఫియాలా.! రేపినావే.! నాలోన గోల.!

లవ్ మిస్సైలులా దూకుతున్న హంసా హంసా హంసా హంసా
వైల్డు ఫైరుపై వెన్నపూస వయసా  వయసా వయసా వయసా
నా మునివేళ్లకు కన్నులు మొలిచెనె నీ సిరి సొగసులు తాకితే...
నా కనురెప్పలు కత్తులు దూసెనె నువ్విలా జింకలా దొరికితే

ఓ చారుశీలా.! స్వప్నబాలా.! యవ్వనాలా.! ప్రేమ పాఠశాలా.!
మల్లెపూలా.! మాఫియాలా.! రేపినావే.!గుండెలోన గోల.!



**********     **********   *********



చిత్రం: శ్రీమంతుడు (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సూరజ్ సంతోష్ , రానినా రెడ్డి


హే సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమీచంద్రుడు
మారాజైనా మామూలోడు మనలాంటోడు
మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు...
వాడే శ్రీరాముడు...

హేయ్ రాములోడు వచ్చినాడురో దాని తస్సదియ్య శివధనస్సు ఎత్తినాడురో
కోరస్: దాని తస్సదియ్య శివధనస్సు ఎత్తినాడురో

నారి పట్టి లాగినాడురో దాని తస్సదియ్య నింగికెక్కు పెట్టినాడురో
కోరస్: దాని తస్సదియ్య నింగికెక్కు పెట్టినాడురో

ఫెళ ఫెళ ఫెళ ఫెళ్లుమంటు ఆకశాలు కూలినట్టు
భళ భళ భళ భళ్లుమంటు దిక్కులన్ని వేలినట్టు
విల విలమను విల్లువిరిచి జనకరాజు అల్లుడాయెరో

మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా
మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా
మరామ రామ రామ రామ రామ రామ రామ
మరామ రామ రామ రామ రామ రామ రామ

హే రాజ్యమంటె లెక్కలేదురో దాని తస్సదియ్య అడవిబాట పట్టినాడురో
కోరస్: దాని తస్సదియ్య అడవిబాట పట్టినాడురో

హే పువ్వులాంటి సక్కనోడురో దాని తస్సదియ్య సౌక్యమంత పక్కనెట్టెరో
కోరస్: దాని తస్సదియ్య సౌక్యమంత పక్కనెట్టెరో

హేయ్ బలె బలె బలె మంచిగున్న బతుకునంత పణంపెట్టి
పలు మలుపులు గతుకులున్న ముళ్ల రాళ్ల దారిపట్టి
తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో...

మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా
మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా

హే రామసక్కనోడు మా రామచంద్రుడంట ఆడకళ్ల చూపుతాకి కందిపోతడంట
అందగాళ్లకే గొప్ప అందగాడట నింగి నీలమై ఎవరికీ చేతికందడంటా

హేయ్ జీవుడల్లే పుట్టినాడురో దాని తస్సదియ్య దేవుడల్లె ఎదిగినాడురో
కోరస్: దాని తస్సదియ్య దేవుడల్లె ఎదిగినాడురో

హేయ్ నేలబారు నడిచినాడురో దాని తస్సదియ్య పూల పూజలందినాడురో
కోరస్: దాని తస్సదియ్య పూల పూజలందినాడురో

హేయ్ పద పదమని వంతెనేసి పెనుకడలిని దాటినాడు
పది పది తలలున్న వాణ్ని పట్టి తాటదీసినాడు
చెడు తలుపుకు చావుదెబ్బ తప్పదంటు చెప్పినాడురో
మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా
మరామ రామ రామ రామ రామ రామ రామ రామదండులాగ అందరొక్కటౌదామా



**********     **********   *********


చిత్రం: శ్రీమంతుడు (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సింహా, గీతా మాధురి


ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండు బ్లాంకైపొద్దో ఆడే నా మొగుడు...
హే, దుబాయెళ్లి సెంటే తెచ్చా జపానెళ్లి పౌడరు తెచ్చా
మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా
చైనా సిల్కు పంచే తెచ్చా సింగాపూరు వాచీ తెచ్చా
రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా
పెట్టుకో ఉంగరాలే తెచ్చా ఎత్తి పట్టుకో నీకు చెయ్యందించా
ముస్తాబు కొత్తగున్నదే గమ్మత్తుగున్నదే ఓలమ్మొలమ్మో నిన్నే చూస్తే

దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే దుమ్ముదుమ్ముగా దిమ్మతిరిగే
హే దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే కమ్మకమ్మగా దిమ్మతిరిగే

హే, దుబాయెళ్లి సెంటే తెచ్చా... హే, జపానెళ్లి పౌడరు తెచ్చా
మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా
చైనా సిల్కు పంచే తెచ్చా హే సింగాపూరు వాచీ తెచ్చా హే
రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా
సిలకా సింగారి ఓ సిలకా సింగారి జున్ను తునకా
రంగేళి రస గుళికా గుళికా అదిరే సరుకా
స్నానాల వేళ సబ్బు బిళ్ళనవుతా తడికనై నీకు కన్ను కొడతా
తువ్వాలులాగ నేను మారిపోతా తీర్చుకుంటా ముచ్చట
నీ గుండె మీద పులిగోరవుతా ... నీ నోటి కాడ చేప కూరవుతా
నీ పేరు రాసి గాలికెగరేస్తా పైట చెంగు బావుటా
నువ్వేగాని కలకండైతే నేనో చిన్ని చీమై పుడతా
తేనీగల్లే నువ్వెగబడితే పూటకొక్క పువ్వులాగ నీకు జత కడతా

దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే దుమ్ముదుమ్ముగా దిమ్మతిరిగే
హే దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే కమ్మకమ్మగా దిమ్మతిరిగే

నీ వంక చూసి మంచినీళ్ళు తాగినా నే తాటి కల్లు తాగినట్టు తూలనా
తెల్లాని నీ ఒంటి రంగులోన ఏదో నల్లమందు ఉన్నదే
నీ పక్కనుండి పచ్చిగాలి పీల్చినా ఎదోలా ఉంది తిక్కతిక్క లెక్కనా
వెచ్చాని నీ చూపులొతున బంగారు బంగు దాస్తివే
మిరమిరా మిరియం సొగసే పంటికింద నలిగేదెపుడే
కరకరా వడియంలాగ నీ కౌగిలింతలోన నన్ను నంజుకోరా ఇప్పుడే

దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే దుమ్ముదుమ్ముగా దిమ్మతిరిగే
హే దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే సమ్మసమ్మగా దిమ్మతిరిగే
హే, దుబాయెళ్లి సెంటే తెచ్చా జపానెళ్లి పౌడరు తెచ్చా
మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా
చైనా సిల్కు పంచే తెచ్చా సింగాపూరు వాచీ తెచ్చా
రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా

నా ఆటోగ్రాఫ్ (2004)



చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: విజయ్ యేసుదాసు


నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా కన్నులకి కలలు లేవు నీరు తప్పా
నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా కన్నులకి కలలు లేవు నీరు తప్పా

మనసూ వుంది మమతా వుంది పంచుకొనే నువు తప్పా
ఊపిరి వుంది ఆయువు వుందీ ఉండాలనే ఆశ తప్పా
ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా
ఎవరిని అడగాలి నన్ను తప్పా చివరికి ఏమవాలి మన్ను తప్పా

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకనీ...

వెంటొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు
జంటై ఒకరి పంటై వెళ్లావు
కరునిస్తానన్నావు వరమిస్తానన్నావు
బరువై మెడకు ఉరివై పోయావు
దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు
దీపంకూడా దహియిస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్పా ఎవరిని నిందించాలి నిన్ను తప్పా

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమనీ నీ తోడే లేకుంటే బ్రతికేది ఎందుకనీ
ఎవరికి చెప్పుకోను నాకు తప్పా కన్నులకి కలలు లేవు నీరు తప్పా





*******    *******   *********





చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది
తెలుసుకుంటే సత్యమిది
తలచుకుంటే సాధ్యమిది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది

చెమటనీరు చిందగా నుదిటి రాత మార్చుకో
మార్చలేనిదేది లేదనీ గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కథలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా...
నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్దమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది





*******   ********   ********




చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో... ఏ మూలనో...
నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో... ఏ మమతలో...
మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

మొదట చూసిన టూరింగ్ సినిమా
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పళ్ళకై పట్టిన కుస్తీ
రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలో బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు...
దొంగచాటుగా కాల్చిన బీడీ
సుబ్బుగాడిపై చెప్పిన చాడీ
మోట బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం...

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

మొదట సారిగా గీసిన మీసం
మొదట వేసిన ద్రౌపది వేషం
నెల పరీక్షలో వచ్చిన సున్నా
గోడ కుర్చీ వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పరమెంటు
పీరు సాయిబు పూసిన సెంటు...
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియని తనము
మొదటి ప్రేమలో తియ్యందనము...

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో... ఏ మూలనో...
నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి





*******    *******   *********




చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి

దువ్విన తలనే దువ్వటం
అద్దిన పౌడర్ అద్దడం
దువ్విన తలనే దువ్వటం
అద్దిన పౌడర్ అద్దడం
అద్దం వదలక పోవడం
అందానికి మెరుగులు దిద్దడం
నడిచి నడిచి ఆగడం
ఆగి ఆగి నవ్వడం
ఉండి ఉండి అరవడం
తెగ అరచి చుట్టూ చూడడం
ఇన్ని మార్పులకు కారణం
ఎమై ఉంటుందోయి

ఇది కాదా LOVE  (15)

ముఖమున మొటిమే రావడం
మనస్సుకు చెమటే పట్టడం
మతి మరుపెంతో కలగడం
మతి స్థిమితం పూర్తిగా తప్పడం
త్వరగా స్నానం చెయ్యడం
త్వరత్వరగా భోం చేస్తుండడం
త్వరగా కలలో కెళ్ళడం
ఆలస్యంగా నిదురోవడం
ఇన్నర్థాలకు ఒకే పదం
ఏమై ఉంటుందోయి

ఇది కాదా LOVE  (15)





*******    *******   *********




చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, శ్రీవర్ధిని, గోపిక పూర్ణిమ

గామా గామా హంగామా మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప

గామా గామా హంగామా మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప

చరణం: 1
నీ రాకతో రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది
నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది
చేయూతతో శిల్పం కాస్తా నడకలు నేర్చి కోవెల చేరింది
నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలోన కోరిక కలిగింది
ఆ కోరికేమిటో చెప్పని నను వీడి నువ్వు వెళ్లొద్దని
మళ్లీ రాయిని చెయ్యొద్దని...

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప

గామా గామా హంగామా మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా

చరణం: 2
నీ మాటతో నాపై నాకే ఏదో తెలియని నమ్మకమొచ్చింది
నీ స్ఫూర్తితో ఎంతో ఎంతో సాధించాలని తపనే పెరిగింది
నీ చెలిమితో ఊహల్లోన ఊరిస్తున్న గెలుపే అందింది
ఆ గెలుపుతో నిస్పృహలోన నిదురిస్తున్న మనసే మురిసింది
ఆ మనసు అలసి పోరాదని ఈ చెలిమి నిలిచిపోవాలని
ఇలా బ్రతుకును గెలవాలని...

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప

గామా గామా హంగామా మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
గామా గామా హంగామా కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప

రప రప్పప్పారప్ప పారర రప రప్పప్పారప్ప
రప రప్పప్పారర రప్పప్పారర పార పార పరప




*******    *******   *********


చిత్రం: నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: సందీప్ భౌమిక్, గంగ , యమ్.యమ్.కీరవాణి

మన్మదుడే బ్రహ్మను పూని సుృష్టించాడేమో గానీ
యాబై కేజిల మందారాన్ని ఐదున్నర అడుగుల బంగారాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని

మన్మదుడే బ్రహ్మను పూని సుృష్టించాడేమో గానీ
యాబై కేజిల మందారాన్ని ఐదున్నర అడుగుల బంగారాన్ని

దీన్ని తెలుగులో కారం అంటారు మరి మలయాళంలో?
ఇరివో
ఓహో ఇది తీపి! మీ భాషలో?
మధురం
మరి చేదు చేదు చేదు చేదు?
కైకు

ఆరే రుచులని అనుకున్నానే నిన్నటివరకు
ఏడొ రుచినే కనుగొన్నానే నీ ప్రేమతో
రుజిగల్లారిని న్యంకండు ఇన్నలె వరయెళ్ ఇన్నలె వరయెళ్
ఏయాం రుచియుం ఉండెన్వరిన్యుం నీ ప్రేమతో
నిన్నటి దాక నాలుగు దిక్కులు ఈ లోకంలో
ఇన్నుమురాల్ నువ్వె దిక్కు ఎన్లొ దత్తిళ్...
హే వన్స్ లవ్ యు
నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళమెయ్యనీ
మాధవుడే బ్రహ్మను పూని సుృష్టించాడెమో గానీ
అరవై కేజిల చిలిపితనాన్ని
అలుపన్నది ఏరుగని రవితేజాన్ని
పెదాల్ని ఏమంటారు?
చుండు
నడుం ని?
ఇడుప్పు
నా పెదాలతో నీ నడుం మీద ఇలా చేస్తె ఏమంటారు
ఆశ దోస అమ్మమంట మీస
ఏయ్ చెప్పమంటుంటె
చెప్పనా...
రెండో మూడో కావాలమ్మ బూతద్దాలు
వుందో లేదో చూడాలంటే నీ నడుముని
వందలకొద్ది కావాలంట జలపాతాలు
పెరిగె కొద్ది తీర్చాలంటే నీ వేడిని
లెక్కకుమించి జరగాలమ్మ మొదటి రాత్రులు
మక్కువ తీరగ చెయ్యాలంటే మదురయాత్రలు
విన్నాను నీ హృదయవాణి
వెన్నెల్లలో నిన్ను చేరనీ

మన్మదుడే బ్రహ్మను పూని స్రుష్టించాడేమొ గాని
అరవై కేజిల దుడుకుతనాన్ని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మనీ

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)

చిత్రం: అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: పెద్దాడ మూర్తి
గానం: చక్రి
నటీనటులు: రవితేజ, అశీన్
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: పూరీ జగన్నాథ్
విడుదల తేది: 19.04.2003

నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ
వెలలేని సంతోషాలే నీ సొంతం

నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ
వెలలేని సంతోషాలే నీ సొంతం

నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా

నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
కనిపించకపోతే బెంగై వెతికేవే
కన్నీరే వస్తే కొంగై తుడిచేవే

నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా

నే గెలిచిన విజయం నీదే
నే ఓడిన క్షణమూ నాదే
నా అలసట తీరే తావే నీవేగా
అడుగడుగున నడిపిన దీపమ
ఇరువురికే తెలిసిన స్నేహమ
మది మురిసే ఆనందాలే నీవేగా
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే
ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే

నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ
వెలలేని సంతోషాలే నీ సొంతం

నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా

వరమల్లే అందిందేమో ఈ బంధం ఓ ఓ
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా

కొత్తబంగారులోకం (2008)




చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కృష్ణ చైతన్య , మిక్కీ జె. మేయర్


Confusion confusion teenege confusion..
మాటల్లొ చెతల్లొ total confusion..
Confusion confusion ఈ life ఏ confusion..
choiceఉల్లొ feelings లొ total confusion..

నిన్నె తెలిసింది మాకు హ్రుదయలున్నయి.. నెడె స్పందిస్తున్నయి..
యెన్నొ wonders ఏ make చుపిస్తున్నయి..ఇంక ముందుంది ఏదొ ఏవొ కావలన్నయి……

ఒక్కొ క్షణం కన్నుల్లలొ temptation..ఒక్కొ క్షణం గుండెల్లలొ sensation

నీకె షూ తొడిగాము.. poison scent పులిమాము
pepe jeans కొన్నము.. అవి మా స్కిన్ను కి చర్మాలె..
Pocket లొన cell phone బరువై. నిలిపింది పరువె
wallet లొన fifty బదులె .. Hundreds ఏ లె..

cinema hall లొ వెసె whistle ఏ.. పెంచింది level ఏ..
fashion channel చుసె కనులె leftఒ rightఒ చుడదన్నయె….

అందల్నే కలిగారు.. గాలుల్లొ వదిలారు..
శ్వాసల్లొ కలిపారు… మనసున ఊపిరి ఉప్పెన లే…
మెరిసె సొగసె మెరిపించెస్తె నరముల్లొ కుదిపె
నిలువద్దము లె magnets లాగ లాగెసాయె..
కలలొ మీరె బయట మీరె…కనిపిస్తున్నరె ..
తనతొ నిజమె fighting చెసె ..మీతొ friendship అయ్యె దాకె….


*****   *****   ******


చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్

నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..
ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..
వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..


ఈ వయస్సులో ఒక్కో క్షణం..ఒక్కో వసంతం..
నా మనస్సుకే ప్రతీ క్షణం..నువ్వే ప్రపంచం..
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం..
అడుగులలోనా అడుగులు వేస్తూ..నడిచిన దూరం ఎంతో వున్నా..
అలసట రాదు గడిచిన కాలం ఇంతని నమ్మను గా..
నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..


నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే..
నా గతాలనే కవ్వింతలే పిలుస్తూ ఉంటే..
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే..
పెదవికి చెంపా తగిలిన చోటా..
పరవశమేదో తోడవుతుంటే..పగలే అయినా గగనం లోనా..తారలు చేరెనుగా..

నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..
ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..
వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..

*****   *****   ******


చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

నీ ప్రశ్నలు నీవే..ఎవ్వరో బదులివ్వరుగా..
నీ చిక్కులు నీవే..ఎవ్వరూ విడిపించరుగా..
ఏ గాలో నిన్ను..తరుముతుంటే అల్లరిగా..
ఆగాలో లేదో..తెలియదంటే చెల్లదుగా..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా....ఓ..ఓ..ఓ..ఓ..

అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా..
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..
గతముందని గమనించని నడిరేయికి రేపుందా..
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా..
వలపేదో వల వేసింది..వయసేమో అటు తోస్తుంది..
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే రుజువేముంది..ఓ..ఓ..ఓ..ఓ..
సుడిలో పడు ప్రతి నావా..ఓ..ఓ..ఓ..ఓ..చెబుతున్నది వినలేవా..

పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా..
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా..
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా..
కడ తేరని పయనాలెన్ని..పడదోసిన ప్రణయాలెన్ని..
అని తిరగేశాయా చరిత పుటలు..వెనుజూడక ఉరికే వెతలు..
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు....ఓ..ఓ..ఓ..ఓ..

ఇది కాదే విధి రాత....ఓ..ఓ..ఓ..ఓ..అనుకోదేం ఎదురీత..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో..సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా ....ఓ..ఓ..ఓ..ఓ..


*****   *****   ******


చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: నరేష్ అయ్యర్, కళ్యాణి

ఓ కే అనేసా
దెఖో నా భరోసా
నీకే వదిలేశ
నాకెందుకులే రభసా

భారమంతా నేను మోస్తా అల్లుకో అశాలతా
చేర దీస్తా సేవ చేస్తా రాణి లా చూస్తా
అందుకే గా గుండెలో నీ పేరు రాశా
తెలివనుకో తెగువనుకో మగ జన్మ కదా
కధ మొదలనుకొ తుది వరకూ నిలబడగలదా

పరిగెడదాం పదవే చెలీ ఎన్దాక వెళ్ళాలొ
కనిపేడదాం తుది మజిలీ
ఎక్కడున్నా
ఎగిరెలదామ్ ఇల నొదిలీ నిన్నాగా మన్ననా
ఎగరగలమ్ గగనాన్ని
ఎవరాపినా
మరో సారి అను ఆ మాట
మహారాజునై పోతాగా
ప్రతి నిమిషం నీకోసం
ప్రాణం సైతం పందెం వెసెస్తా
పాత రూణమో కొత్త వరమొ
చెంగు ముడి వేసిండిరా
చిలిపి తనమూ చెలిమి గుణమూ
ఏమిటీ లీలా
స్వప్న లోకం ఏలూకుందాం రాగామాల
అదిగదిగో మది కెదురై కనబడలేదా
కధ మొదలనుకొ తుది వరకూ నిలబడగలదా


పిలిచినదా చిలిపి కలా వింటూనే వచ్చేశా
తరిమినదా చెలియ నిలా పరుగు తీసా
వదిలినదా బిడియామిలా
ప్రశ్నల్ని చెరిపేసా
ఎదురవగా చిక్కు వలా
ఎటో చూశా
భలే గున్దిలె నీ ధీమా
ఫలిస్థున్దిలీ ఈ ప్రేమా
ఆదరకుమా బెదరకుమా
త్వరగా విదిరా సరదా పదదామా
పక్కనుంటే ఫక్కుమన్తూ నవ్విరారా ప్రియతమా
చిక్కు నుండి బిక్కుమాంటూ
లెక్క చేస్తావా
చుక్కలన్నీ చిన్న బోవా
చక్కనామ్మ
మగతనుకో మగతనుకో మతి చెడిపోడా కధ మొదలనుకొ తుది వరకూ నిలబదగలదా


*****   *****   ******


చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: శ్రీకాంత్ అడ్డాల
గానం: కృష్ణ చైతన్య, ఆదిత్య, సిద్దార్ధ, క్రాంతి, శశి కిరణ్

కళశలలొ... కళశలలొ...

కలలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
కలలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
పుస్తకమన్నది తెరిచెవెలా
అక్షరమెనక దాక్కొని ఉంది
కళ్ళతొ వంతెన కడుతూ ఉంటె
దాటెటందుకు మతి పొతుంటె
కాద మనసొక ప్రయొగ శాల
కాద మనసొక ప్రయొగ శాల
సౌండ్ గురించి చదివాము
హార్ట్ బీట్ ఎంతొ తెలియలేదు
లైట్ గురించి చదివాము
నీ కళ్ళ రిజల్ట్ తెలియలెదు
మాగ్నెటిక్స్ చదివాము
ఆకర్షనెంటొ తెలియలెదు
విద్యుత్ గురించి చదివము
ఆవెశం ఎంటొ తెలియలెదు
ఫిజిక్స్ మొత్తం చదివిన అర్ధం కాని విషయాలన్ని
నీ ఫిజిక్ చూసిన వెంటనె అర్ధం ఐపొయాయె

లొలకం లాగ ఊగుతూ సాగె
మీ నదుములన్ని స్క్రూగేజ్ తొనె కొలిచెయ్యలెమా
గాలికె కందె మీ సుకుమార
లేత హ్రుదయాలు సింపుల్ బాలన్స్ తూచెయ్యలేెద
న్యూటన్ మూడొ నియమం చెరియ ప్రతిచెరియ
మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా
మా వైపు చూడకపొతె చాల తప్పెగా
క్లాసులోకి మన్సుల్లొకి యెందుల్లొకి వచ్చరె

పుస్తకమన్నది తెరిచెవెలా
అక్షరమెనక దాక్కొని ఉంది
కళ్ళతొ వంతెన కడుతూ ఉంటె
దాటెటందుకు మతి పొతుంటె
కాద మనసొక ప్రయొగ శాల
కాద మనసొక ప్రయొగ శాల


*****   *****   ******


చిత్రం: కొత్తబంగారు లోకం (2008)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం: శ్రీకాంత్ అడ్డాల
గానం: శ్వేతా పండిట్

నేనని నీవని వేరుగా లేమని
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే

మొదటి సారి మదిని చేరి
నిదర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ మాయేనా

పథము నాది పరుగు నీది
రథము వేయరా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నేనే చేరగా
ఎటూ చూడక వెనువెంటే రానా

దేవుళ్ళు (2000)

చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: సుజాత, స్వర్ణలత


పల్లవి:

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ
పారాయణతో సకల జనులకి.. భారాలను తొలగించే గాధ
పారాయణతో సకల జనులకి.. భారాలను తొలగించే గాధ

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ

చరణం 1:

షిరిడీ గ్రామంలో.. ఒక బాలుని రూపంలో..
వేపచెట్టు క్రింద.. వేదాంతిగ కనిపించాడు
తన వెలుగును ప్రసరించాడు

పగలు రేయి ధ్యానం.. పరమాత్మునిలో లీనం
పగలు రేయి ధ్యానం.. పరమాత్మునిలో లీనం
ఆనందమే ఆహారం.. చేదు చెట్టునీడయే.. గురుపీఠం

ఎండకు వానకు కృంగకు.. ఈ చెట్టు క్రిందనే ఉండకు
సాయీ..ఈ.. సాయి రా.. మశీదుకు..
అని మహల్సాపతి పిలుపుకు
మసీదుకు మారెను సాయి
అదే అయినది ద్వారకమాయి
అక్కడ అందరు భాయీ భాయీ
బాబా బోధల నిలయమదోయి

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ

చరణం 2:

ఖురాను.. బైబిలు.. గీత.. ఒకటని
కులమత భేదము.. వద్దనే
గాలి వాననొక క్షణమున ఆపే
ఉడికే అన్నము చేతితో కలిపే

రాతి గుండెలను గుడులను చేసే
నీటి దీపములను వెలిగించే
పచ్చికుండలో నీటిని తెచ్చి.. పూలమొక్కలకు పోసి
దిండీ వనమును పెంచి.. మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే
కప్పకు పాముకు స్నేహం కలిపే.. తల్లి భాషకు అర్ధం తెలిపే

ఆర్తుల రోగాలను హరియించే
భక్తుల బాధలు తాను భరించే
ప్రేమ సహనం రెండు వైపుల ఉన్న నాణమును దక్షిణ అడిగే
మరణం జీవికి మార్పును తెలిపే
మరణించి తను మరలా బ్రతికే
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

చరణం 3:

నీదని నాదని అనుకోవద్దని
ధునిలో ఊది విభూదిగనిచ్చే
భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు...
చావడి ఉత్సవమై సాగగా

కక్కడ హారతులందుకొని.. కలిపాపాలను కడుగగా
సకల దేవతా స్వరూపుడై.. వేదశాస్త్రములకతీతుడై
సద్గురువై.. జగద్గురువై
సత్యం చాటే దత్తాత్రేయుడై.. భక్తుని ప్రాణం రక్షించుటకై
జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలోన పగులగా
పరిపూర్ణుడై.. గురుపూర్ణిమై
భక్తుల మనసులో చిరంజీవియై.. శరీర సేవాలంగన చేసి
దేహము విడిచెను.. సాయి
సమాధి అయ్యెను.. సాయి

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
అఖిలాండకోటి బ్రహ్మండ నాయక....
శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ మహరాజ్‌

********* ********* ************

చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: చిత్ర, స్వర్ణలత

పల్లవి:

మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం

గోరు ముద్దలెరుగని బాల కృష్ణులం
బాధ పైకి చెప్పలేని బాల ఏసులం
ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా..
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా

మీ ప్రేమ కోరే చిన్నారులం..
మీ ఒడిని ఆడే చందమామలం..

చరణం 1:

కమ్మగా.. మా అమ్మ చేతితో..
ఏ పూట తింటామో ఏడాదిలో..
చక్కగా.. మా నాన్న పక్కగా..
సరదాగ తిరిగేది ఏ నాటికో

పొద్దున్నే పరుగున వెళతారూ...
రాతిరికి ఎపుడో వస్తారూ
మరి మరి అడిగినా.. కథలు చెప్పరూ
మేమేం చెప్పినా.. మనసు పెట్టరూ
అమ్మ నాన్న తీరు మాకు అర్ధమవ్వదూ
ఏం చెయ్యాలో మాకు దిక్కు తోచదూ..
ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా..
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా

మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం

చరణం 2:

పిల్లలం.. మీ చేతి ప్రమిదలం
మీ ప్రేమ చమురుతో.. వెలుగు దివ్వెలం
పువ్వులం.. మీ ఇంటి నవ్వులం
మీ గుండెపై ఆడు.. చిన్ని గువ్వలం

కని పెంచే మీరే దేవుళ్లూ
కనిపించే శివుడూ పార్వతులూ
లోకం బూచికి మా గుండే వణికితే
మాకు ధైర్యం ఇచ్చేది మీ లాలింపే
అమ్మ.. నాన్నలిద్దరూ వేరు వేరయీ
అనాధలను చెయ్యకండి పసి పిల్లలని
ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా

మీ ప్రేమ కోరే చిన్నారులం..
మీ ఒడిని ఆడే చందమామలం

********* ********* ************

చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: జానకి

పల్లవి:

మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి

మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

చరణం 1:

ఓంకార రావాల అలల కృష్ణాతీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృతయుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను
పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను

విజయుడైన అర్జునుని పేరిట.. విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియు జేజేలు పలుకగ.. కనకదుర్గకైనది స్ధిరనివాసము
మేలిమి బంగరు ముద్దపసుపు.. కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం.. కురిపించే దుర్గరూపం
ముక్కోటి దేవతలందరికి.. ఇదియే పుట్టిదీపం

మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా
పరాశక్తి లలితా.. శివానంద చరిత

చరణం 2:

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి

భవబందాలను బాపే.. బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే.. అన్నపూర్ణాదేవి
లోకశాంతినే సంరక్షించే సుమంత్రమూర్తి.. గాయత్రీ
అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణీ.. మహాలక్ష్మి
విద్యా కవన గాన మొసగు వేదమయి.. సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే.. మహాదుర్గ
శత్రు వినాసిని సత్యస్వరూపిని.. మహిషాసురమర్ధిని
విజయకారిణి అభయ రూపిణి.. శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా.. నీ దర్శనం
దుర్గమ్మా.. నీ దర్శనం

మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా
పరాశక్తి లలితా.. శివానంద చరిత
మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా
పరాశక్తి లలితా.. శివానంద చరిత

********* ********* ************

చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: బాలు

పల్లవి:

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురమేదేవ సర్వ కార్యేషు సర్వదా
ఆ...ఆ...ఆ....ఆ...ఆ.....ఆ....ఆ...

జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
ఆ...ఆ...ఆ...ఆ....ఆ...ఆ...ఆ..

చరణం 1:

భాహుగానది తీరములోన బావిలోన వెలసిన దేవ...
మహిలో జనులకు మహిమలు చాటి... ఇహ పరములనిడు మహానుభావా...
ఇష్టమైనదీ వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి...
కరుణను కురియుచు వరములనోసగుచు నిరతము పెరిగే మహాకృతి...

సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రమాణం... ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం... విఘ్న నాశనం... కాణిపాకమున నీ దర్శనం

జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక

చరణం 2:
పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైనావు
మాత పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగ మారావు

భక్తుల మొరలాలించి బ్రోచుటకు ...గజముఖ గణపతి వైనావు
బ్రహ్మండమునే బొజ్జలో దాచి... లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తి కూర్పూగా... లక్ష్మి గణపతి వైనావు

వేద పురాణము లఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం...

జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
ఆ.ఆ......ఆ....ఆ....ఆ...

********* ********* ************

చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: బాలు

పల్లవి:

అయ్యప్ప దేవాయ నమః.. అభయ స్వరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః.. అభయ స్వరూపాయ నమః
హరిహర పుత్రాయ నమః.. కరుణా సముద్రాయ నమః
నిజ భీర గంభీర శభరీ గిరీశిఖర ఘన యోగ ముద్రాయనమః
పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండరూపాయనమః
అయ్యప్ప దేవాయ నమః... అభయ స్వరూపాయ నమః

చరణం 1:

పద్దేనిమిది పదిమట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి
ఇరుముడులు స్పృశియించి శుభమనుచు దీవించి జనకృందములచేరే జనమేలు స్వామి
తన భక్తులొనరించు తప్పులకు తడబడి ఒకపక్క ఒరిగెనా ఓంకార మూర్తి
స్వామియే... శరణం అయ్యప్ప

స్వాములందరు తనకు సాయంబు కాగా ధీమంతుడైలేచి ఆ కన్నేస్వామి
పట్టబంధము వీడి భక్తతటికై పరుగు పరుగునవచ్చె భువిపైకి నరుడై
అయ్యప్ప దేవాయ నమః... అభయ స్వరూపాయ నమః

చరణం 2:

ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణుఘోషలు విని బ్రోచు శబరీష
పాపాలు దోషాలు ప్రక్షాలనము చేయు పంపానదీ తీర ఎరుమేలి వాసా
నియమాల మాలతో సుగుణాల మట్లపై నడిపించి కనిపించు అయ్యప్పస్వామి
మకర సంక్రాంతి సజ్యోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠస్వామి
కర్మ బంధము బాపు ధర్మశాస్త్ర.. కలి భీతి తొలిగించు భూతాధినేత
అయ్యప్ప దేవాయ నమః... అభయ స్వరూపాయ నమః

చరణం 3:

ఆద్యంత రహితమౌ.. నీ విశ్వరూపము
అజ్ఞాన తిమిరమ్ము అణుచు.. శుభదీపం
ఈ నాల్గు దిక్కులు.. పదునాల్గు భువనాలు
పదిమెట్లుగా మారె... ఇదో అపురూపం
అరరులెల్లరు చెయు... అమృతాభిషేకం
నెరవేర్చుకో స్వామి... నీదు సంకల్పం
పదములకు మ్రొక్కగా ఒక్కొక్క లోకం
అందుకో నక్షత్ర పుస్పాభిషేకం...

********* ********* ************

చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: బాలు


పల్లవి:

రామా... ఆ.. ఆ..
అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య
అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య
చెయుతనిచ్చె వాడయ్య.. మా సీతా రామయ్య
చెయుతనిచ్చె వాడయ్య.. మా సీతా రామయ్య
కొర్కెలు తీర్చే వాడయ్య.. కొదండ రామయ్య



అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య
రామా... ఆ... రామా... ఆ... ఆ...


చరణం 1:

తెల్లవారితే చక్రవర్తై రాజ్యమునేలె రామయ్య
తండ్రిమాటకై పదవిని వదలి అడవులుకేగెనయా
మహిలో జనులను కావగవచ్చిన మహవిష్ణు అవతరమయ
ఆలిని రక్కసుడు అపహరించితె ఆక్రోశించెనయ
అసురను ద్రుంచి అమ్మను తెచ్చి అగ్నిపరిక్ష విధించెనయ
చాకలి నిందకు సత్యము చాటగ కులసతినేవిడనాడనయ
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా
ఆ... ఆ...

నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా
సత్యం ధర్మం త్యాగంలో అతనుకి సరిలేరయ్య
కరుణ హృదయుడు.. శరణనువాడికి అభయమొసుగునయ్యా


అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య



చరణం 2:

భద్రాచలము పుణ్యక్షేత్రము.. అంతా రామ మయం
భక్తుడు భద్రుని కొండగ మార్చి.. కొలువై వున్న స్థలం
పరమ భక్తితో రామదసు ఈ అలయమును కట్టించెనయ
సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ
పంచవటిని ఆ జనకిరాముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములాడిన శేషతీర్ధమదిగో
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్య
ఆ... ఆ... ఆ...
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్య
శ్రీరామ పాదము నిత్యం కడిగే గోదారయ్య
ఈ క్షేత్రం తీర్దం దర్శించిన...
జన్మధన్యమయ్య...


అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య
చెయుతనిచ్చె వాడయ్య.. మా సీతా రామయ్య
కొర్కెలు తీర్చే వాడయ్య.. కొదండ రామయ్య


అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య

నువ్వు నాకు నచ్చావ్ (2001)

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
నటీనటులు: వెంకటేష్ , ఆర్తి అగర్వాల్, ఆశా షైనీ, పృథ్విరాజ్
కథ, మాటలు ( డైలాగ్స్ ): త్రివిక్రమ్ శ్రీనివాస్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విజయభాస్కర్
సినిమాటోగ్రఫీ: కె.రవీంద్ర బాబు
ఎడిటర్: ఎ.శ్రీకర్ ప్రసాద్
బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్
సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల: 06.09.2001


చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కుమార్ సాను, చిత్ర

ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ
వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి
ఓ... నిదుర పొయే మదిని గిల్లి ఎందుకా అల్లరి

చరణం: 1
చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని
చేయి చాచి పిలవద్దు అని చంటిపాపలకి చెబుతామా
లేని పోని కలలెందుకని మేలుకుంటే అవిరావు అని
జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకి చెబుతామా
కలలన్నవి గలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని
మది మీటుతున్న మధురానుభూతి
మననడిగి చేరుతుందా

ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని

చరణం: 2
అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరిజల్లులతో
చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా
అంతులేని తన అల్లరితో అలుపు లేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా
మనసుంటే మార్గం ఉంది కదా
అనుకుంటే అందనిదుంటుందా
అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా

ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ




***********    **********  *********



చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం…
శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా
ఓ ప్రియతమా ఇది నిజమా
ఈ పరిచయం ఒక వరమా
ఇది మనసు పడిన విరహ వేదనా…
తొలి ప్రేమలోని మధుర భావనా…

చరణం: 1
ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా
ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా
నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చివురించెనో
వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో
ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై
విచ్చాయో చెప్పేదెలా
ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ
ఆ గుట్టు విప్పేదెలా

ఓ ప్రితమా దయగనుమా...
నీ చూపే చాలు చంద్రకిరణమా
నా జన్మ ధన్యమవును ప్రాణమా…

చరణం: 2
చివురాకుల పొత్తిళ్ళలో వికసించిన సిరిమల్లెవో
చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో
నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు
నీ అందమేమందునే
పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ
ఒళ్ళంతా వయ్యారమే
నీ నామాన్నే శృంగార వేధంగ భావించి జపిస్తున్నానే చెలి…
నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి

ఓ ప్రియతమ ఔననుమా
కనలేవ ప్రియుని హృదయవేదనా
కరుణించు నాకు వలపు దీవెనా…
ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం …
శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా




********   **********  **********



చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరి సగమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా యిళ్ళ  లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు
ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో
తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల
కులుకుల కలువకు కానుకగా
ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు
సనసన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు
సందు చూసి చకచక ఆడే జూదశిఖామణులు
పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు
తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ
ఇదిగిదిగో అని చూపెడుతూ
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరి సగమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా యిళ్ళ  లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే




*********    *********   **********



చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: టిప్పు, హరిణి

ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగ సత్యభామా
నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు
ఏమి చెయ్యనయ్యో రామా
అన్నుకున్నా తప్పు కదా మోమాటం ముప్పుకదా
మనసైతే ఉంది కదా మనమాటేం వినదు కదా
పంతం మానుకో - భయం దేనికో

నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు
ఏమి చెయ్యనయ్యో రామా

వద్దనకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనకా
నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా
నన్నాశ పెట్టి ఈ సరదా నేర్పినదే నువ్ గనుకా
నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా
అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
అటు ఇటు ఎటు తేల్చవుగా మన కధను తొందరగా
ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా

నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు
ఏమి చెయ్యనయ్యో రామా
ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగ సత్యభామా

అమాయకంగ చూడకలా వేడుకలా చిలిపికలా
అయోమయంగ వేయ్యకలా హాయి వలా
నీమీదికొచ్చి ఉరితాడై వాలదుగా వాలుజడా
దానొంక చూసి ఎందుకట గుండెదడ
మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా
తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
మరేం చేయనే నీతో ఎలా వేగనే

నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు
ఏమి చెయ్యనయ్యో రామా
ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగ సత్యభామా
అన్నుకున్నా తప్పు కదా మోమాటం ముప్పుకదా
మనసైతే ఉంది కదా మనమాటేం వినదు కదా
పంతం మానుకో  -  భయం దేనికో

ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగ సత్యభామా
నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు
ఏమి చెయ్యనయ్యో రామా




**********   **********   **********




చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్

నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు
తాను పలికితె చాలు తేనె జలపాతాలు
ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు
వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు
మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా
తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు
వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు
మదిలో గుచ్చుకుంటుంది

గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల
కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో
గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా
మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో
అలా నడిచి వస్తూంటే పువ్వుల వనం
శిలైపోని మనిషుంటే మనిషే అనం

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు
వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు
మదిలో గుచ్చుకుంటుంది

గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం
ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను
గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసితనం
రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను
కలో కాదో నాకే నిజం తేలక
ఎలా చెప్పడం తాను నాకెవ్వరో
అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ
ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు
వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు
మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా
తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా