గౌతమి పుత్ర శాతకర్ణి (2017)




"గౌతమి పుత్ర శాతకర్ణి"

తన కొడుకుని యుద్ధ రంగానికి భర్త తన వెంట కొనిపోతున్నాడనే విషయం ఒక నేపధ్య కధాగానం ద్వారా దేశపు మహారాణికి తెలియచెప్పటం దగ్గర నుండి దర్శకుడి ప్రతిభ ప్రతి సన్నివేశంలో కొట్టవచ్చినట్లు కనపడుతుంది ఈ చిత్రంలో. మాతృమూర్తినే కాకుండా స్త్రీలందరినీ గౌరవించాలనే విషయం చాలా బలంగా ఉన్న సంభాషణలు గుర్తు చేస్తాయి . "నేను అగ్ర తాంబూలం ఇస్తున్నది మా అమ్మకి కాదు - అమ్మకి" అనటం ద్వారా అమ్మ అందరి కన్నా చాలా గొప్పది అనే విషయం చాలా సహజంగా చెబితే - ఎన్నో రోజుల తరువాత అదీ యుద్ధరంగం నుండి వచ్చిన భర్తను ప్రేమతో దరి చేరినప్పుడు బిడ్డ ఏడుపుకి చలించి ఆత్రుతతో పాలు పడుతున్న భార్య తో చెప్పే "మాతృత్వానికి, మగతనానికి శరీరంతోనే ఆకలి తీరుస్తారు ఆడవాళ్ళు" అనే ఒక్క వాక్యం స్త్రీ మూర్తి యెక్క గొప్పతనాన్ని అంబరం మీద నిలిపింది.
సంభాషణలను రాయకలిగిన వారి దగ్గరి నుండి బాగా రాయుంచుకోవటం కాకుండా వాటిని ప్రదర్శించటానికి అనువైన సన్నివేశాలు కల్పించిన దర్శకుడి నేర్పు బాగా ఆకట్టుకుంటుంది. సాహో - అంజనాపుత్ర క్రిష్.

దూతగా వచ్చిన వాడు - "నేను నిన్ను బంధిస్తే" అనే శత్రురాజుతో "వారు వస్తారు - నేను కారాగారం లో ఎదురు చూస్తాను " అని సమాధానం ఇవ్వటమే కాకుండా "మరి వధిస్తే" అన్న ప్రశ్నకు "మీరు వస్తారు - కాటి దగ్గర ఎదురు చూస్తాను" అని చెప్పటం ద్వారా తన రాజు ఎంత శౌర్యవంతుడో అనే విషయాన్ని ఈ రెండు సంభాషణల తోనే చూపించకలిగారు. "కాలం చేసి అయినా కాలాన్ని కనడం " అనే వాక్యప్రయోగం మనలను రోమాంచితులను చేస్తుంది. సాహో - జయ లక్ష్మీ పుత్ర బుర్రా సాయి మాధవ్.

తండ్రి బ్రతికి ఉంటే ఆయన ప్రశంసలు పొందకలిగే రీతిలో నటించాడు బాలయ్య. శాతకర్ణి అంటే ఇలాగే ఉండే వాడు అనిపించటం అతనికి క్రిష్ ద్వారా దొరికిన నూరవ చిత్ర అదృష్టం.


*శాతకర్ణికి ఇతడే ఒకసైన్యం - సాయి మాధవ్ బుర్ర గారి Dialogues*

'అతడి మాటలు.. తూటాలు' అనుకుంటే పొరపాటు. ఎందుకంటే తూటాలకు లిమిట్ ఉంటుంది. కాని అతడి మాటల తూటాలు అన్ లిమిటెడ్. పేలుతూనే ఉంటాయి.
*అతడి ప్రతి అక్షరంలోనూ భావం పరిమళిస్తూనే ఉంటుంది. ఆ భావం ఆలోచనలను రేకెత్తించి కదిలిస్తూనే ఉంటుంది.*
మాట మనసును తాకటం ఒక ఎత్తయితే.. కళ్లనుండి అశ్రువులు రప్పించడం మాటల రచయిత 'సాయి మాధవ్ బుర్రా'కే చెల్లింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాతో ఈ రచయిత *నా అక్షరాలు ఉరకేలేసే సముద్రం* లాంటివని నిరూపించాడు. క్రిష్ , సాయి మాధవ్ లోని ప్రతిభని ‘అక్షరా’లా వందకి వందశాతం ఉపయోగించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ప్రవాహంలా సాగిన అతని మాటల తూటాలను చూద్దాం..


*శాతకర్ణిలో బుర్రా సాయి మాధవ్ గారు రాసిన పవర్ ఫుల్ డైలాగ్స్:*

"వెళ్లి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు.. ఈ దేశం ఉమ్మడి కుటుంబం. గది గదికీ మధ్య గోడలుంటాయి. ఈ ఇల్లు నాదంటే నాది అని కొట్టుకుంటాం.. కాని ఎవడో వచ్చి.. నా ఇల్లు అంటే ఎగరేసి నరుకుతాం. . సరిహద్దుల్లోనే మీకు స్మశానం నిర్మిస్తాం.. మీ మొండాల మీద మా జెండాలు ఎగరేస్తాం".
"యవనుడైనా.. వాడి జనకుడైనా... అడుగుపెట్టినచోటే ఆరడగులు దానిమిస్తా.. ఆయువు తీస్తా.."
"మారావు అనుకున్నా.. గెలిచిన రాజ్యాలు మార్చలేదు.. వలచిన ఇల్లాలు మార్చలేదు."
"మగనాలికి గాజులు అందం.. మగాడికి గాయాలు అందం."
"మాతృత్వానికి, మగతనానికి శరీరంతోనే ఆకలి తీరుస్తారు ఆడవాళ్ళు"
"ఆ తల వంచకు, అది నేను గెలిచిన తల."
"తెలుగువాడు అధముడు కాదు ప్రధాముడు."
"అదుపులో పెట్టడానికి అసువుపోసే స్త్రీ పసువు కాదు".
"తండ్రిని మించిన తనయుడు ఉంటాడు.. తల్లిని మించిన తనయుడు ఉంటాడా"?
"ఓడించా.. మారలేదు.. క్షమించా.. మారలేదు.. వధించా.. ఇక మారాల్సిన అవసరం లేదు".
"ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం.. ఇక ఉనికిని చాటుదాం."
"నా రాజ్యంలో పాలించడానికి కాదు. యాచించడానికి కూడా అనుమతించను."
"నేను అగ్ర తాంబూలం ఇస్తున్నది మా అమ్మకి కాదు - అమ్మకి"
"మమకారం అహంకారం రెండూ లేని వాడే నాయకుడు అవుతాడు."
"శరణం అంటే రక్ష... రణం అంటే మరణశిక్ష ఏది కావాలి".
"ఆడదాని కడుపులో నలిగినలిగి వెలుగు చూసిన రక్తపు ముద్దవి."
"కథలు మనం చెప్పుకోకూడదు నాన్నా... మన కథను ప్రజలు చెప్పుకోవాలి."
"సింహం, చీమ యుద్ధంలో వెనుదిరగవు, సింహం చచ్చేవరకూ పట్టి పట్టి చంపుతుంది, చీమ చచ్చేవరకూ కుట్టికుట్టి చంపుతుంది."
"నేను బొట్టు పెట్టింది నా భర్తకు కాదు, ఓ చరిత్రకి."
"మా జైత్ర యాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నా."
సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా? ఇది భావి భారత చక్రవర్తిగా.. ఈ దక్షణ పథాధిపతి ఆజ్ఞ.."

ఖైది నంబర్ : 150 (2017)

చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: దేవి శ్రీ ప్రసాద్, రెనైనా రెడ్డి
నటీనటులు: చిరంజీవి, కాజల్ అగర్వాల్
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: రామ్ చరణ్
విడుదల తేది: 11.01.2017

యో గయ్స్
దిస్ ఈస్ నాట్ మాస్ సాంగ్
దిస్ ఈజ్ ద బాస్ సాంగ్

హె ఎర్ర చొక్కానే నీకోసం ఏశాను
సర్రు మంటూ ఫారిన్ సెంటే కొట్టాను
గళ్ళ లుంగీనే ట్రెండీగా కట్టాను
కల్ల జోడెట్టి నీకోసం వచ్చాను
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను
నల్ల జాకెట్టు నైటంతా కుట్టాను
వాలు జళ్ళోనా మందారం పెట్టాను
కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను
పిల్లడు లెట్స్ డూ కుమ్ముడూ

హె ఇన్స్టాగ్రాం ప్రొఫైలు పిక్చర్ లాగా
భలే మస్తుందే నీ అందం మల్లె తీగ
హా డిస్కవరీ చానెల్ లో చేసింగ్ లాగా
అలా పై పైకి దూకెయ్ కు సింహం లాగా

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

చరణం: 1
మండే ఎండలొ ఐస్క్రీము బండిలా
కూల్ అండ్ క్యూటుగ ఉండే అందం
రెండే కళ్ళతో ధన్ ధన్ స్టెన్ గన్నులా
చూపుల గుళ్ళతో తీసావ్ ప్రాణం
హాట్ గా ఘాట్ గా ఉండే నీ హిప్పుని
నాటుగ చాటుగ పట్టేయనా
రఫ్ఫుగ టఫ్ఫుగ ఉండే నీ చేతితో
నువ్ తాకితే నేను ఫట్టైపోనా

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ
తమ్ముడూ లెట్స్ డూ కుమ్ముడూ

చరణం: 2
హె శారీ కట్టినా సల్వారే చుట్టినా
అల్లాడిస్తదే నీ ఔట్ లైనూ
హె లారీ గుద్దినా ల్యాండ్ మైనే పేలినా
నీతో పోలిస్తే నతింగ్ జానూ
స్టెప్పులే స్టెప్పులూ నీతో వెయ్యాలని
ఇప్పుడే కట్టినా కొత్త ట్యూనూ
నిప్పులా ఉన్న నీ వైల్డూ రొమాన్సుకు
లిప్పులో దాచినా రెడ్డూ వైనూ

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

యో గయ్స్
దిస్ ఈస్ నాట్ మాస్ సాంగ్
దిస్ ఈజ్ ద బాస్ సాంగ్

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ


********  ********   ********


చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: నకాష్ అజిజ్ , జాస్మిన్ సండ్లస్

బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు
నీ ఒంపు సోంపు అందం చందం అన్ని నా చుట్టాలూ
చెంగుమంటూ రావే  తిరగరాసేద్దాం చట్టాలు
నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు
మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు

బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ

నీ నవ్వులే రత్నాలు నీ మాటలే ముత్యాలు
పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు
నీ చేతులే మేగ్నెట్లు నీ వేళ్ళు వీణ మెట్లు
నువ్వు తాకుతుంటే రక్తమంతా  రాగాలు..
ఓ నువ్వు పక్కనుంటే కిక్కె వేరు వధ్ధులే జారాధాలు
ఆవురావురంటూ వున్నా తీర్చు నా సరదాలు
అందుకేగా వచ్చేసా రఫ్ఫాడిద్దాం రాత్రి పగలు
మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే ఘల్ ఘల్ మంటాయ్ నా చిట్టి పట్టీలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్ నా జళ్ళో ఏ పూలు

బాసూ..చూపీయ్ నీ గ్రేసు..

ఏ.. మై డియర్ బాస్.. నువ్వు మాస్ ప్లస్ క్లాసు
నీ స్టైల్ చూస్తే సింహమైన నీతో దిగదా సెల్ఫీలు హే..
మిస్ యూనివర్సు లాంటి నీ ఫీచర్స్
చూస్తూ ఉంటే రెచ్చిపోతాయ్ గుండెలోన గుర్రాలు
నీ వాక్ చూస్తే ఓరయ్యో ఐ లూస్ మై కంట్రోలు
నీ హీట్ ఉంటే చాలమ్మో ఇక ఎందుకు పెట్రోలు
నాకు నూవు నీకు నేను అప్పచెబుదాం పాఠాలు
మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు

హేయ్ రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు
రత్తాలు.......

బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ


********  ********   ********


చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: హరిచరన్, శ్రేయ ఘోషల్

మీ మీ మిమ్మీమీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ

సాయంకాలానా సాగర తీరానా
సంధ్య సూర్యుడిలా నువ్వూ నేను
వేసవి కాలానా వెన్నెల సమయానా
తార చంద్రుడిలా నువ్వూ నేను
నువ్వు రాగం అయితే నే పాటవుతాను
నువ్వు మేఘం అయితే
నీ జిలిబిలి వలపుల వర్షం నేను

మీ మీ మిమ్మీమీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
మీ మీ మిమ్మీమీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ

సాయంకాలానా సాగర తీరానా
సంధ్య సూర్యుడిలా నువ్వూ నేను
వేసవి కాలానా వెన్నెల సమయానా
తార చంద్రుడిలా నువ్వూ నేను

ముద్ద మందారం తెలుసు
మెరిసే బంగారం తెలుసు
రెండు కలిపేస్తే నువ్వేనా
మండే సూరీడు తెలుసు
వెండి జాబిల్లి తెలుసు
రెండు కలబోస్తే నువ్వేనా
రోజు అద్దంలో అందం నువ్వేనా
ఆ అందం నువ్వైతే నువ్వూ నేనా
రోజు కన్నుల్లో కలలే నువ్వేనా
కలలే నిజమైతే నువ్వూ నేనా

మీ మీ మిమ్మీమీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
మీ మీ మిమ్మీమీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ

కోపం సైనికుడి వరస
తాపం ప్రేమికుడి వరస
రెండూ ఒకటైతే నువ్వేనా
పల్లె పడుచుల్ని చూశా
పట్నం సొగసుల్ని చూశా
రెండూ ఒకటైతే నువ్వేనా
హో రంగుల విల్లంటే అచ్చం నువ్వేనా
బాణం నేనైతే నువ్వూ నేనా
పువ్వుల వరదంటే అచ్చం నువ్వేనా
నన్నే చుట్టేస్తే నువ్వూ నేనా

మీ మీ మిమ్మీమీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
మీ మీ మీ మీ మీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ


********  ********   ********


చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జస్ప్రీత్ జస్జ్

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి
సోకె కుక్కినాదిరో నాజూకు మెక్కినదిరో
దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంకు నుంచి
బ్లాంక్ చేక్కు ఇవ్వరో
కోకే కట్టినదిరో గుండె కేకే పెట్టినాదిరో
లైకే కొట్టినానురో
లవ్ బండి తీసి ట్రాక్ మీద పెట్టినానురో

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడూతి కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి


చాక్లెట్ చూపి పిల్లవాడిని క్యూట్ గ ఊరించినట్టుగా
మాగ్నెట్ లాంటి ఒంపు సోంపుని చూపి నన్ను చంపేరో
ఊపి ఊపిరిరాపేరో
ట్యూబ్ లైట్ వేసి డల్ నైట్ ని
ఫుల్ గ బ్రైట్ చేసినట్టుగా
మూన్ లైట్ లాంటి కంటి చూపుతో
నా హార్ట్ లైట్ వేసేరో మనసు వెయిట్ పెంచేరో
తీసేయ్ రొమాన్స్ గేట్ ని ఇక తోసెయ్ ఆ సిగ్గు సీట్ ని
రాసేయ్ నీ కాపీరైట్ ని నా పేరు మీద
ఫిక్స్ అని నువ్వు నేను మిక్స్ అని

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి

కీపర్ లేని టైం చూసి ఫుట్ బాల్ గోల్ కొట్టినట్టుగా
కంట్రోల్ లేని టైం చూసి హిప్ నాకు చూపేరో
హిప్నటైజ్ చేసేరో
రైఫిల్ని లోడ్ చేసి టార్గెట్ నే కాల్చినట్టుగా
లిప్స్టిక్ లో రెడ్ తీసి
లవ్ సింబల్ ఏసేరో బాణమేసి గుచ్చేరో
రావే నా లెఫ్ట్ సైడ్ కి నీకోసం తెరిచా గుండె కిటికీ
పోదాం ఈ నైట్ ఫ్లైయట్ కి ఓ హనీమూన్ స్పాట్ కి
ఊటీ లాంటి చోటుకి

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి


********  ********   ********


చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్

నీరు నీరు  నీరు  రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ...
గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు
ఆదరించు నాథుడెవ్వరూ...
అన్నదాత గోడు నింగినంటె నేడు...
ఆలకించు వారు ఎవ్వరూ...

నీరు నీరు  నీరు  రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ...

గొంతు ఎండిపోయే పేగు మండిపోయే...
గంగతల్లి జాడ లేదనీ...
నీటి పైన ఆశే నీరుగారి పోయే...
రాత మారు దారి లేదని...
దాహమారుతుందా...
పైరు పండుతుందా...
ధారలైన కంటి నీటితో...

నీరు నీరు  నీరు  రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ...
గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు
ఆదరించు నాథుడెవ్వరూ...

నేల తల్లి నేడు అంగీలారిపోయే...
మూగబోయే రైతు నాగలి...
ఆయువంత చూడు ఆర్తనాదమాయే...
గొంతు కోసుకుంది ఆకలి...

ముఠామేస్త్రి (1993)

చిత్రం: ముఠామేస్త్రి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, యస్. పి. బాలు
నటీనటులు: చిరంజీవి, మీనా, రోజా


అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
ఆహా - యాహా యయ యయ యయ యయ యాహా
ఆ అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
ఆహా - యాహా యయ యయ యయ యయ
అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా
ఆహా - యాహా యయ యయ యయ యయ
మెచ్చుకో పుచ్చుకో మేస్త్రీ మణి
స్పీడుతో దంచకే చింతామణి
చలాకీలో ఎలా వీలో అలా కానీ
రావే టొమోటకి సయ్యాటకి
అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
ఆహా - యాహా యయ యయ యయ యయ
నారి నాంచారామ్మో స్టోరి మారుధ్ధమ్మో బండి తోసే బజ్జిల పాప
మేస్త్రీ మారాజయ్యె నీ స్త్రీ నేనేనయ్యో బండినేలే మీసాల మామా
సరుకేమో అహా తెగ చీపు ఓహో తళుకేమో ఓహో యమ టాపు
పలుకేమో ఓహో పిడిబాకు అహా మనసేమో అహా నవ టాపు
పసివాడు కసివాడు నను పదే పదే కుమ్మేసెనే
అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా
ఆహా - యాహో
అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
ఆహా - యాహా - యయ యయ యయ యయ
కాపు నీకే ఇస్తా ఊపు నీకే తెస్తా పక్కనీతో పండించుకుంటా
బేరం నిన్నేచేస్తా లాభం లాగించేస్తా మంచమంతా వడ్డించు కుంటా
మడిసేమో ఒహో యముడంటా అహా మగడైతే అహా యమ జంటా
కదిలిస్తే అబ్బో తీగంటా అహా కదిలిందా అదే డొంకంటా
చలి రాణి అలివేని నను ఎడా పెడా కవ్వించకే
అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
హ ఆహా - యాహో
అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా
హ ఆహా - యాహో యయ యయ యయ యయ
మెచ్చుకో పుచ్చుకో మేస్త్రీ మణి
అరె స్పీడుతో దంచకే చింతామణి
చాలకీలో ఎలా వీలో అలా కానీ
రావే టొమోటకి సయ్యాటకి
అంజనీ పుత్రుడా వీరాది వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
ఆహా - యాహా - యయ యయ యయ యయ యాహా

******** ********* ********** ******** ********** **********
చిత్రం: ముఠామేస్త్రి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, యస్. పి. బాలు

ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌనగీతమా
వచ్చీరాని వయ్యారాలే వయసాయే
మళ్ళీ మళ్ళీ సాయంత్రాలే మనసాయే
నిజమా... - అమ్మమ్మా…
చిలిపి కనుల కబురు వింటే బిడియమో ఏమో సుడులు రేగింది
పెదవి తొనల మెరుపు కంటే ఉరుములా నాలో ఉడుకు రేగింది
గుబులో దిగులో వగలైపోయే వేళలో
తనువు తనువు తపనై తాకే వేడిలో
మల్లి జాజి జున్నులా చలి వెన్నెల ముసిరేనిలా
నిజమా... - అమ్మమ్మా…
ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌనగీతమా
చిగురు తొడిగే సొగసుకంటే పొగరుగా ప్రాయం రగిలిపోయింది
ఉలికి నడుము కదుపుతుంటే తొలకరింతల్లో తొడిమ రాలింది
కుడివైపదిరే శకునాలన్ని హాయిలే
ప్రియమో ఏమో నయగారాలే నీదిలే
గోరింటాకు పూపొద చలి ఆపదా ఇక ఆపదా
నిజమా... - అమ్మమ్మా…
ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌనగీతమా
******** ********** **********  ******** ********** **********

చిత్రం: ముఠామేస్త్రి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, యస్. పి. బాలు

జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
అరె జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
తిరకాసు పెట్టొద్దే తిరగలి బుల్లో
మరదలినై పోతున్నా మావా నీ ఒళ్ళో... హో
యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్
జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
జింగిలాల జింగిలాల జింగిలాల జింగిలాల లగో లగో లగో జింగిలాల
జింగిలాల జింగిలాల జింగిలాల జింగిలాల
చిలిపి చీరలో అగడం పగడం ఎవారికోసముంచావే
వివరించాలంటే నా సిగ్గే చిరునామా
అరె చెరుకు పొలములో చెలిమే మధురం ఇరుకు ఎక్కువవుతుంటే
గడియైనా మావా గడిపేద్దాం రారా
అరె నిన్నే చూస్తిని కన్నే వేస్తిని వన్నే కోస్తినే భామ
అరె గౌనే వేస్తిని కవ్వించేస్తిని లవ్వే చేయిమావా
దేవి లావాదేవి నీతోనే
పగలే పేచీ రాత్రే రాజీలే...
యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్
జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
హోయన హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయన హోయన హొయ్
హోయన హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయన హోయన హొయ్
అరె హొయన హొయన, అరె హొయన హొయన
మగడి పొగరులో మరువం జవదం ఎవరికిచ్చుకుంటావు
అని తల్లో మెచ్చా చెలి తల్లో గుచ్చా
పడుచు గోపురం నఖరం శిఖరం తగిలి కుంపటేస్తుంటే
తొలి ఈడే నవ్వే చలి తోడే నువ్వే
మరి నువ్వే నా చిరు నేనే మేజరు రోజు హాజరవుతాలే
ఓసి పిల్లా సుందరి మల్లే పందిరి అంతా తొందరేలే
ఆజా రోజా తీశా దర్వాజా
బాజా లేలి తాజా మ్యారేజా హొయ్ హొయ్ హొయ్ హొయ్
యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్
అరెరెరరరె జోరుగున్నాది గులాబి గుంటది చంటిది ఒంటరిగా
జోడుకడతావా అన్నాడే గుంటడు తుంటరిగా
ఆఁ తిరకాసు పెట్టొద్దే తిరగలి బుల్లో
మరదలినై పోతున్నా మావా నీ ఒళ్ళో... హో
యమ జోర్ జోర్ జోరుగుంది జోడి కట్టేసే
యద హోర్ హోర్ హోరుమంది బోణీ కొట్టేసేయ్

******** ********** ********** ******** ********** ********** ********** *********** **********
చిత్రం: ముఠామేస్త్రి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు


హు... హు...
హు అధిరబల హు హై లెస్సా (2)
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (2)
ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిట పెన్నిధి
ఈ పేటకు నేనే మేస్త్రీ నిరుపేదల పాలిట పెన్నిధి
కాయకష్టయం ఎరగని వాళ్ళకి ఖబర్దారు గస్తీ
నేనే - ముఠామేస్త్రి
హే నేనే - ముఠామేస్త్రి
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (2)
హే సూపర్ పాపకి సుకుమారి ని షేపులు కరగక తప్పుదులే
హో హో - ఆఁ, హో హో - ఆఁ, హో హో - ఆఁ దింతాక్ దింతాక్
కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం యమ రుచిలే
దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పైరేటు
తిష్ట జీవి సాపాటు కష్ట జీవికి గ్రహాపాటు
గుంటూరు గోంగూర పులుపంతా వలపేరా
నీ కత్తికి దురదైతే నా చేమకు సరదారా
నీ కందకు దురదైతే నా చేమకు సరదారా
హ కసిగా ఉసిగా బతికే వాళ్లకు ఖలేజాల జాస్తి
నేనే - ముఠామేస్త్రి
హా నేనే - ముఠామేస్త్రి
హహాహుఁ ... హహాహుఁ...
హోయ్ హోయ్ హోయ్
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (2)
హోయ్ సోమరిపోతుల రాజ్యాలు సొరకాయల కోతలు చెల్లవురా
హో హో - ఖబడ్ధార్
హో హో - అవునుబే
హో హో - షటాంక్ షటాంక్
కాలే కడుపుల కష్టాలే మన లేబరిజానికి చేతులురా
హో హో - ఆఁ, హో హో - ఆఁ, హో హో - ఆఁ, తద్దింక్ తద్దింక్
దంచు మిర్చి మసాలా పెంచు మంచి ఇవాళా
వంచు ఒళ్లు ఇలాగ వడ్డు చేరు మాజాగా
నీ గంప ఎత్తనిదే నీ కొంప గడవదులే
న బస్తా వెయ్యనిదే నీ బండి నడవదులే
కులికే చిలకా బరిలో పడితే కులశాలు గస్తీ
నేనే - ముఠామేస్త్రి
హా నేనే - ముఠామేస్త్రి
జింతాక్ జింతాక్
అరెరరె రరెరరె
హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ (2)

********** *********** ****************** ********** ****************** ********** **********
చిత్రం: ముఠామేస్త్రి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, చిత్ర

హో... ఓ... - ఓ... హో...
ఏ... హే... - ఏ... హే...
ఓ... ఓ... ఓ... - ఓ... హో... ఓ...
చికి చికి చాం చిచాంకు చాం (2)
చికి చికి చాం చిచాంకు చాం చికుచాం పిల్లా పందెం కట్టో
చికి చికి చాం చిచాంకు చాం చికుచాం ఒళ్ళో మేళం పెట్టు
నే కాదన్నానా సుందరి సుందరి సుందరి
చాపేయ్ మంటావా పోకిరి రా మరి దా మరి
కొత్తంగా కొంగొత్తగా వయ్యారం దండెత్తగా
మొత్తంగా గమ్మత్తుగా జోడించి ఈడొచ్చేగా


చికి చికి చాం చిచాంకు చాం చికుచాం (2)
చికి చికి చాం చిచాంకు చాం చికుచాం పిల్లా పందెం కట్టో
చికి చికి చాం చిచాంకు చాం చికుచాం ఒళ్ళో మేళం పెట్టు

వస్తా విడిదికొస్తా పెదవి దూస్తా పదును చూస్తా
వస్తే నిలువరిస్తా వడుపు చూసి ముడుపులిస్తా
అయితే సరే కొట్టించుకోన కావేరి
ఓకే ప్రియా షంషేరు గుంది రా రా రి
చిలకకొచ్చింది ఊపు చీరకివ్వాలి షాక్
నెత్తికెక్కింది కైపు ఆదరగొట్టాలి టాపు
అరయారో తలబడు హీరో


చికి చికి చాం చిచాంకు చాం చికుచాం (2)
చికి చికి చాం చిచాంకు చాం చికుచాం పిల్లా పందెం కట్టో
చికి చికి చాం చిచాంకు చాం చికుచాం ఒళ్ళో మేళం పెట్టు
కానీ కొదమసింహం పదునుపెట్టా కధన రంగం
ఏమీ పడుచు పొంకం తప్పదింకా గర్వభంగం
మమామియా నీ బాంచనింకా లాగించు
తస్సాదియా తర్ఫీదు ఇంకా చాలించు
వయసు పదహారు రయ్యో వడిసి పట్టెయ్ బాయ్యో
పరుచుకో పక్క పాప కేక పెట్టాలి కోక
అదిరేలా వలపుల కూజా


చికి చికి చాం చిచాంకు చాం చికుచాం (2)
చికి చికి చాం చిచాంకు చాం చికుచాం పిల్లా పందెం కట్టో
చికి చికి చాం చిచాంకు చాం చికుచాం ఒళ్ళో మేళం పెట్టు
నే కాదన్నానా సుందరి సుందరి సుందరి
చాపేయ్ మంటావా పోకిరి రా మరి దా మరి
కొత్తంగా కొంగొత్తగా వయ్యారం దండెత్తగా
మొత్తంగా గమ్మత్తుగా జోడించి ఈడొచ్చేగా


చికి చికి చాం చిచాంకు చాం చికుచాం (2)
చికి చికి చాం చిచాంకు చాం చికుచాం పిల్లా పందెం కట్టో
చికి చికి చాం చిచాంకు చాం చికుచాం ఒళ్ళో మేళం పెట్టు

ముద్దుల మొగుడు (1997)


చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: బాలకృష్ణ, మీనా

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో
చెంగు దాటగా చెమ్మ చెక్కలాట
జోరుగుండదా జోడు గువ్వలాట
పాల ఈడు తోడుపెట్టి పచ్చిమీగడెక్కడంటే గోపాలా

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో

కుర్రదాన కుశలమా కుతకొచ్చే పరువమా
గుట్టుదాటే ఘుమ ఘుమ కట్టుకోరా ప్రియతమా
ఈడే కోడై ఈలేసినా జాబిల్లోస్తుందా
జాబిళ్ళమ్మా కౌగిళ్ళలో జాగారిస్తుందా
గడప దాటని అందం కడప చేరినదా
మొదటిచూపుకు మొహం మొటిమ లేసినదా
పావడాల చెట్టుమీద పాలపిట్ట లాడుతుంటే పాపాలా

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో

దోచుకున్నా దొరకవు దాచుకున్నా మెరుపులు
కస్సుమన్నా కదలవు కమ్ముకున్న వలపులు
ముద్దింటమ్మ ఆకళ్లలో ముప్పూట జరిగే
చేరింతమ్మ కుచ్చిళ్ళలో సిగ్గంతా ఎగిరే
తలుపు మూసిన తాపం తణుకు చేరినదా
మధుర మన్మధ బాణం ఆధరమడిగినదా
పాలపుంతలన్ని తోడు పాయసాలు జుర్రుకున్న గోపాలా

ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మ మెక్కడుందొ చెప్పవమ్మా
ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో
చెంగు దాటగా చెమ్మ చెక్కలాట
జోరుగుండదా జోడు గువ్వలాట
పాల ఈడు తోడుపెట్టి పచ్చిమీగడెక్కడంటే గోపాలా

********** ********* ***********

చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

సాహో...
అరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో
అరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో
అబ్బ ఒంటిపూస తేలుకుంది చూపురో
దాని ఒంటినిండ ఓబరాల షేపురో
అబ్బ పెట్టుకున్న బంతికెంతో తిమ్మిరో
వాడ్ని తిట్టుకున్న నోటికెంతో తిమ్మిరో

మాఘమాసమొచ్చెనే మంట పుట్టుకొచ్చెనే
మంచు గాలి వీచెనే మంచమడ్డు కొచ్చెనే

సాహో...
అరెరెరరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో హోయ్

కంచె నువ్వు చేను నేను కందిచేనుకాడ చెంగు తీస్తలే
కన్ను నువ్వు రెప్ప నేను కన్నెదోసపండు దొంగిలిస్తలే హఁ
కంచె నువ్వు చేను నేను కందిచేనుకాడ చెంగు తీస్తలే
కన్ను నువ్వు రెప్ప నేను కన్నెదోసపండు దొంగిలిస్తలే
పొరపాటు చేశాక తిప్పలు మన చుట్టూ ఉంటాయి కప్పలు
అలవాటు ఐతేనే ఇప్పుడు అవుతుంది మేళాల చప్పుడు

యాహో...
అరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో హాయ్

వంగతోట దొంగమాట వచ్చివాలిపోవే పొద్దు గూకులు
అమ్మదొంగ నిమ్మలంగా ఎత్తుకెళ్లమాక గుత్తసోకులు
వంగతోట దొంగమాట వచ్చివాలిపోవే పొద్దు గూకులు
అమ్మదొంగ నిమ్మలంగా ఎత్తుకెళ్లమాక గుత్తసోకులు
ఆఁ చెలి తోడు కోరింది గుప్పెడు గిలిపెట్టే నా గుండె చప్పుడు
చలికాలం చంపెంగ నిప్పులు జరిగింది ఆ లగ్గమిప్పుడు

యమహో...
అరెరెరరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బబ్బబ్బబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో
అబ్బ ఒంటిపూస తేలుకుంది చూపురో
దాని ఒంటినిండ ఓబరాల షేపురో
అబ్బ పెట్టుకున్న బంతికెంతో తిమ్మిరో
వాడ్ని తిట్టుకున్న నోటికెంతో తిమ్మిరో

మాఘమాసమొచ్చెనే మంట పుట్టుకొచ్చెనే
మంచు గాలి వీచెనే మంచమడ్డు కొచ్చెనే

సాహో...

********** ********* ***********

చిత్రం: ముద్దుల మొగుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని
ప్రియ గోరువంక అడిగే ఎటురమ్మని ఏదిమ్మని
సగమై జరిగే సంసారం
జతగా గడిపే జాగారం
పరువపు పరిమళ మల్లుకున్నదిలే

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని

కానిమ్మంటే కాకా పట్టి మళ్ళొస్తాలే చి పాడంటూ సింగారాలు
చిక్కానంటే సిగ్గమ్మత్తా వెళ్ళొస్తాను చొక్కాకంటే సిందూరాలు
రావే తల్లి అంటే రాదు గోల లీవే లేనే లేదు చారుశీల
అట్టే యిట్టె వచ్చే అబ్బలాల పుట్టించొద్దు అగ్గి మూల మూల
పెదవే మధువై రుచులడిగే మదిలో గదిలో శృతి చెరిగే
మనసులు కలిసిన మాఘమాసంలో

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని

అందాలన్నీ కౌగిళ్ళల్లో కర్పూరాలై తంటాకొచ్చే తాంబూలాలు
నచ్చేవన్ని గిచ్చంగానే మందారాలు పైటల్లోనా తంబురాలు
బావా బావా నీతో బంతులాట ఒళ్ళో కొస్తానంటె వంగతోట
అమ్మా నాన్నా అట అడుకుంటా అమ్మా అబ్బా అంటే తగ్గనంటా
మనసే అడిగే మధుమసం సొగసే కడిగే హేమంతం
మిస మిస వయసున మీగడొస్తుంటే

చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని
ప్రియ గోరువంక అడిగే ఎటురమ్మని ఏదిమ్మని
సగమై జరిగే సంసారం
జతగా గడిపే జాగారం
పరువపు పరిమళ మల్లుకున్నదిలే

ప్రేమనగర్ (1971)

చిత్రం :  ప్రేమనగర్ (1971)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం  :  సుశీల


పల్లవి :


ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

చుట్టుపక్కల ఉన్నావంటే.. చూడకుండా ప్రాణ ముండదురా..ఆ 

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా  


చరణం 1 :


కూలికెళ్తే నాకే రారా.. చేను వున్నాది

కూడు తింటే నాతో తినరా.. తోడువుంటాది

కూలికెళ్తే నాకే రారా.. చేను ఉన్నాది

కూడు తింటే నాతో తినరా.. తోడువుంటాది

ఇంకేడకైనా ఎల్లావంటే..ఏ.. ఏ..ఇంకేడకైనా ఎల్లావంటే

నాది చుప్పనాతి మనసు.. అది నీకు తెలుసు

నాది చుప్పనాతి మనసు.. అది నీకు తెలుసు ఒప్పి వూరుకోనంటది

 

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా 

 

చరణం 2 :


ఊరినిండా వయసు పిల్లలు.. ఒంటిగున్నారు

వాటమైనవాడ్ని చూస్తే.. వదలనంటారు

ఊరినిండా వయసు పిల్లలు.. ఒంటిగున్నారు

వాటమైనవాడ్ని చూస్తే.. వదలనంటారు

నీ చపల బుద్ది సూపావంటే..ఏ... ఏ..

మనిషి నాకు దక్కవింక.. మంచిదాన్ని కాను ఆనక

 

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

 

చరణం 3 :


పగటిపూట పనిలో పడితే.. పలకనంటావు

రాతిరేళ రహస్యంగా.. రాను జడిసేవు

పగటిపూట పనిలో పడితే.. పలకనంటావు 

రాతిరేళ రహస్యంగా.. రాను జడిసేవు

నే తెల్లవార్లు మేలుకుంటే.. నే తెల్లవార్లు మేలుకుంటే 

ఎఱ్ఱబడ్డ కళ్ళు చూసి.. ఏమేమో అనుకొని

ఎఱ్ఱబడ్డ కళ్ళు చూసి.. ఏమేమో అనుకొని

ఈది ఈది.. కుళ్ళుకుంటాది       

 

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

చుట్టుపక్కల ఉన్నావంటే.. చూడకుండా ప్రాణ ముండదురా..ఆ 

ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా


***** ******** *************


చిత్రం :  ప్రేమనగర్ (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


తాగితే మరచిపోగలను... తాగనివ్వదు

మర్చిపోతే తాగగలను... మరువనివ్వదు


మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే

మనసున్న మనిషికీ సుఖము లేదంతే

మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే

మనసున్న మనిషికీ సుఖము లేదంతే

మనసు గతి ఇంతే ...


చరణం 1:


ఒకరికిస్తే మరలి రాదూ ..ఓడిపోతే మరిచిపోదూ

ఒకరికిస్తే మరలి రాదూ ..ఓదిడిపోతే మరిచిపోదూ

గాయమైతే మాసిపోదూ ... పగిలిపోతే అతుకుపడదూ


మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే..మనసు గతి ఇంతే 


చరణం 2:


అంతా మట్టేనని తెలుసూ... అదీ ఒక మాయేనని తెలుసూ

అంతా మట్టేనని తెలుసూ ... అదీ ఒక మాయేనని తెలుసూ

తెలిసీ వలచీ విలపించుటలో ... తీయదనం ఎవరికి తెలుసూ 

మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే...మనసు గతి ఇంతే


చరణం 3:


మరుజన్మ ఉన్నదో లేదో ...ఈ మమతలప్పుడేమౌతాయో

మరుజన్మ ఉన్నదో లేదో ... ఈ మమతలప్పుడేమౌతాయో

మనిషికి మనసే తీరని శిక్షా... దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా


మనసు గతి ఇంతే ..మనిషి బ్రతుకింతే..

మనసున్న మనిషికీ సుఖము లేదంతే

మనసు గతి ఇంతే




***** ******** *************


చిత్రం  :  ప్రేమనగర్ (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది.. డోంట్ కేర్.. 



నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది.. డోంట్ కేర్.. 


చరణం 1:


నేను తాగితే కొందరి కళ్లు గిరగిర తిరిగాయి

నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి

నేను తాగితే కొందరి కళ్లు గిరగిర తిరిగాయి

నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి



నేను ఆడితే అందరి కాళ్లు నాతో కలిశాయి 

నేను ఆడితే అందరి కాళ్లు నాతో కలిశాయి

తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి..

హ హ హ హ హ... డోంట్ కేర్...


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది.. 


చరణం 2:


మనసులు దాచేటందుకు పైపై నవ్వులు ఉన్నాయి

మనిషికి లేని అందం కోసం రంగులు ఉన్నాయి

ఎరగక నమ్మినవాళ్ల నెత్తికి చేతులు వస్తాయి

ఎరగక నమ్మినవాళ్ల నెత్తికి చేతులు వస్తాయి

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి..

డోంట్ కేర్.... 


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది..  


చరణం 3:


మనిషిని మనిషిని కలిపేటందుకే పెదవులు ఉన్నాయి

పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి

బాధలన్ని బాటిల్లో నేడే దింపేసేయ్

బాధలన్ని బాటిల్లో నేడే దింపేసేయ్

అగ్గిపుల్ల గీసేసెయ్ నీలో సైతాన్ తరిమేసేయ్..

డ్రైవ్ ది డెవిల్ అవుట్..హ హ హ హ హ హ... 


నేను పుట్టాను... లోకం మెచ్చింది

నేను ఏడ్చాను... లోకం నవ్వింది

నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది..  డోంట్ కేర్....




***** ******** *************



చిత్రం : ప్రేమనగర్ (1971)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల



పల్లవి:


తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా

తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా

కదలి వచ్చింది.. కన్నె అప్సరా

వచ్చి నిలిచింది.. కనుల ముందరా..


తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా

తేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా

కదలి వచ్చింది.. కన్నె అప్సరా

వచ్చి నిలిచింది.. కనుల ముందరా..


చరణం 1:


తెలుగువారి ఆడపడుచు ఎంకిలా


ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా

తెలుగువారి ఆడపడుచు ఎంకిలా

ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా


గోదారి కెరటాల గీతాల వలే నాలో

పలికినది..... పలికినది.... పలికినది

చల్లగా చిరుజల్లుగా... జల జల గల గలా

కడలి వచ్చింది కన్నె అప్సరా

వచ్చి నిలిచింది కనుల ముందరా


తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...



చరణం 2:


రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి

ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి

రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి

ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి


లోలోన.. నాలోన.. ఎన్నెన్నో రూపాలు

వెలసినవి..... వెలసినవి... వెలసినవి...

వీణలా.. నెరజాణలా... కల కల.. గల గలా

కదలి వచ్చింది కన్నె అప్సరా

ఎదుట నిలిచింది కనుల ముందరా


తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా...


***** ******** *************




చిత్రం : ప్రేమనగర్ (1971)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


కడవెత్తుకొచ్చిందీ... ఈ ఈ ఈ... కన్నెపిల్ల.. ఆ ఆ..

అది కనపడితే చాలు నా గుండె గుల్ల

కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల

అది కనపడితే చాలు నా గుండె గుల్ల


కాడెత్తుకొచ్చాడూ...ఊ ఊ ఊ... గడుసుపిల్లడు.. ఊ ఊ..

వాడు కనపడితే చాలు నాకొళ్ళు తెలవదు

కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు

వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు


చరణం 1:


పిక్కలపై దాక.. చుక్కల చీర కట్టి

పిక్కల పై దాక.. చుక్కల చీర కట్టి

పిడికలంత నడుము చుట్టు పైట కొంగు బిగగట్టి

వెళుతుంటే...చూడాలి..

వెళుతుంటే చూడాలి దాని నడక

అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని ఎనక


కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల

అది కనపడితే చాలు నా గుండె గుల్ల


చరణం 2:


చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగారాలు

చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు

బిరుసైన..కండరాలు..

బిరుసైనా కండరాలు.. మెరిసేటి కళ్ళడాలు

వస్తుంటే.. చూడాలి

వస్తుంటే చూడాలి వాడి సోకు

వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు


కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు

వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు


చరణం 3:


తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి

అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు

తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి

అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు


దున్నుతుంటే ...చూడాలి

దున్నుతుంటే చూడాలి వాడి జోరు

వాడు తోడుంటే తీరుతుంది వయసుపోరు


కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు

వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు



చరణం 4:


నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు

వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది

నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు

వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది


చూస్తుంటే చాలు దాని సోకు మాడ

పడి చస్తాను వస్తనంటే కాళ్ళకాడ


కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల

అది కనపడితే చాలు నా గుండె గుల్ల

కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు

వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు



***** ******** *************



చిత్రం : ప్రేమనగర్ (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల


పల్లవి:


ఆ... ఆ... ఆ... ఆ...


ఎవరో రావాలి..

నీ హృదయం.. కదిలించాలి

నీ తీగలు.. సవరించాలి

నీలో రాగం.. పలికించాలి


ఎవరో రావాలి....

నీ హృదయం.. కదిలించాలి

నీ తీగలు.. సవరించాలి

నీలో రాగం.. పలికించాలి..

ఎవరో రావాలి....


చరణం 1:


మూల దాగి ధూళి మూగి... మూగవోయిన మధుర వీణ..

మూల దాగి ధూళి మూగి... మూగవోయిన మధుర వీణ..

మరిచి పోయిన మమత లాగ...

మరిచి పోయిన మమత లాగ... మమతలుడిగిన మనసు లాగ

మాసిపో.. తగునా...

ఎవరో రావాలి....


చరణం 2:


ఎన్ని పదములు నేర్చినావో... ఎన్ని కళలను దాచినావో..

ఎన్ని పదములు నేర్చినావో... ఎన్ని కళలను దాచినావో..

కొనగోట మీటిన చాలు...

కొనగోట మీటిన చాలు... నీలో కోటి స్వరములు పలుకును..


ఎవరో రావాలి.....



చరణం 3:



రాచనగరున వెలసినావు... రస పిపాసకు నోచినావు

రాచనగరున వెలసినావు... రస పిపాసకు నోచినావు

శక్తి మరచి.. రక్తి విడచి...

శక్తి మరచి.. రక్తి విడచి... మత్తు ఏదో మరగినావు

మరిచిపో... తగునా...


ఎవరో రావాలి....

నీ హృదయం.. కదిలించాలి

నీ తీగలు.. సవరించాలి

నీలో రాగం.. పలికించాలి..

ఎవరో రావాలి.... 




***** ******** *************



చిత్రం :  ప్రేమనగర్ (1971)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం  :  ఘంటసాల


పల్లవి:


ఎవరికోసం ..ఎవరికోసం

ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం

ఈ భగ్న హృదయం ..ఈ అగ్ని గుండం

ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం 


చరణం 1:


ప్రేమభిక్ష నువ్వే పెట్టీ

ఈ పేద హృదయం పగులగొట్టీ

పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు

నువ్వివనిదీ తాకలేనూ ..ఇంకెవరినీ అడుగలేనూ

బ్రతుకు నీకు ఇచ్చాను.. చితిని నాకు పేర్చావు


ఎవరికోసం ..ఎవరికోసం

ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం

ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం ??


చరణం 2:


ఓర్వలేని ఈ ప్రకృతి ప్రయళంగా మారనీ

నా దేవి లేని ఈ కోవెల తునాతునకలై పోనీ

కూలిపోయి ధూళిలో కలసిపోనీ ...కాలిపోయి బూడిదే మిగలనీ


ఎవరికోసం ..ఎవరికోసం

ఈ ప్రేమ మందిరం ..ఈ శూన్యనందనం

ఎవరికోసం ..ఎవరికోసం.. ఎవరికోసం.. ఎవరికోసం 


చరణం 3:


మమత నింపమన్నానూ .. మనసు చంపుకొన్నావూ

మధువు తాగనన్నాను .. విషం తాగమన్నావూ

నీకు ప్రేమంటే నిజం కాదూ ...నాకు చావంటే భయంలేదూ

నీ విరహంలో బ్రతికానూ ...ఈ విషంతో మరణిస్తానూ ...మరణిస్తానూ..