| చిత్రం: దేవుళ్ళు (2000) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ గీతరచయిత: జొన్నవొత్తుల నేపధ్య గానం: సుజాత, స్వర్ణలత పల్లవి: సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ పారాయణతో సకల జనులకి.. భారాలను తొలగించే గాధ పారాయణతో సకల జనులకి.. భారాలను తొలగించే గాధ సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ చరణం 1: షిరిడీ గ్రామంలో.. ఒక బాలుని రూపంలో.. వేపచెట్టు క్రింద.. వేదాంతిగ కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలు రేయి ధ్యానం.. పరమాత్మునిలో లీనం పగలు రేయి ధ్యానం.. పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం.. చేదు చెట్టునీడయే.. గురుపీఠం ఎండకు వానకు కృంగకు.. ఈ చెట్టు క్రిందనే ఉండకు సాయీ..ఈ.. సాయి రా.. మశీదుకు.. అని మహల్సాపతి పిలుపుకు మసీదుకు మారెను సాయి అదే అయినది ద్వారకమాయి అక్కడ అందరు భాయీ భాయీ బాబా బోధల నిలయమదోయి సిరులునొసగి సుఖశాంతులు కూర్చును.. షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ.. సాయి ప్రేమ సుధ చరణం 2: ఖురాను.. బైబిలు.. గీత.. ఒకటని కులమత భేదము.. వద్దనే గాలి వాననొక క్షణమున ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే రాతి గుండెలను గుడులను చేసే నీటి దీపములను వెలిగించే పచ్చికుండలో నీటిని తెచ్చి.. పూలమొక్కలకు పోసి దిండీ వనమును పెంచి.. మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే కప్పకు పాముకు స్నేహం కలిపే.. తల్లి భాషకు అర్ధం తెలిపే ఆర్తుల రోగాలను హరియించే భక్తుల బాధలు తాను భరించే ప్రేమ సహనం రెండు వైపుల ఉన్న నాణమును దక్షిణ అడిగే మరణం జీవికి మార్పును తెలిపే మరణించి తను మరలా బ్రతికే సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం చరణం 3: నీదని నాదని అనుకోవద్దని ధునిలో ఊది విభూదిగనిచ్చే భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు... చావడి ఉత్సవమై సాగగా కక్కడ హారతులందుకొని.. కలిపాపాలను కడుగగా సకల దేవతా స్వరూపుడై.. వేదశాస్త్రములకతీతుడై సద్గురువై.. జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై.. భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలోన పగులగా పరిపూర్ణుడై.. గురుపూర్ణిమై భక్తుల మనసులో చిరంజీవియై.. శరీర సేవాలంగన చేసి దేహము విడిచెను.. సాయి సమాధి అయ్యెను.. సాయి సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం అఖిలాండకోటి బ్రహ్మండ నాయక.... శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ మహరాజ్ | |
| చిత్రం: దేవుళ్ళు (2000) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ గీతరచయిత: జొన్నవొత్తుల నేపధ్య గానం: చిత్ర, స్వర్ణలత పల్లవి: మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం గోరు ముద్దలెరుగని బాల కృష్ణులం బాధ పైకి చెప్పలేని బాల ఏసులం ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా.. ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం.. మీ ఒడిని ఆడే చందమామలం.. చరణం 1: కమ్మగా.. మా అమ్మ చేతితో.. ఏ పూట తింటామో ఏడాదిలో.. చక్కగా.. మా నాన్న పక్కగా.. సరదాగ తిరిగేది ఏ నాటికో పొద్దున్నే పరుగున వెళతారూ... రాతిరికి ఎపుడో వస్తారూ మరి మరి అడిగినా.. కథలు చెప్పరూ మేమేం చెప్పినా.. మనసు పెట్టరూ అమ్మ నాన్న తీరు మాకు అర్ధమవ్వదూ ఏం చెయ్యాలో మాకు దిక్కు తోచదూ.. ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా.. ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే చందమామలం చరణం 2: పిల్లలం.. మీ చేతి ప్రమిదలం మీ ప్రేమ చమురుతో.. వెలుగు దివ్వెలం పువ్వులం.. మీ ఇంటి నవ్వులం మీ గుండెపై ఆడు.. చిన్ని గువ్వలం కని పెంచే మీరే దేవుళ్లూ కనిపించే శివుడూ పార్వతులూ లోకం బూచికి మా గుండే వణికితే మాకు ధైర్యం ఇచ్చేది మీ లాలింపే అమ్మ.. నాన్నలిద్దరూ వేరు వేరయీ అనాధలను చెయ్యకండి పసి పిల్లలని ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం.. మీ ఒడిని ఆడే చందమామలం | |
చిత్రం: దేవుళ్ళు (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత: జొన్నవొత్తుల
నేపధ్య గానం: జానకి
పల్లవి:
మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి
మహాకనకదుర్గా విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
చరణం 1:
ఓంకార రావాల అలల కృష్ణాతీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృతయుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను
పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను
విజయుడైన అర్జునుని పేరిట.. విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియు జేజేలు పలుకగ.. కనకదుర్గకైనది స్ధిరనివాసము
మేలిమి బంగరు ముద్దపసుపు.. కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం.. కురిపించే దుర్గరూపం
ముక్కోటి దేవతలందరికి.. ఇదియే పుట్టిదీపం
మహాకనకదుర్గా.. విజయకనకదుర్గా
పరాశక్తి లలితా.. శివానంద చరిత
చరణం 2:
దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి
భవబందాలను బాపే.. బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే.. అన్నపూర్ణాదేవి
లోకశాంతినే సంరక్షించే సుమంత్రమూర్తి.. గాయత్రీ
అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణీ.. మహాలక్ష్మి
విద్యా కవన గాన మొసగు వేదమయి.. సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే.. మహాదుర్గ
శత్రు వినాసిని సత్యస్వరూపిని.. మహిషాసురమర్ధిని
విజయకారిణి అభయ రూపిణి.. శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా.. నీ దర్శనం
దుర్గమ్మా.. నీ దర్శనం

నేపధ్య గానం: బాలు
పల్లవి:
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురమేదేవ సర్వ కార్యేషు సర్వదా
ఆ...ఆ...ఆ....ఆ...ఆ.....ఆ....ఆ...
జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
ఆ...ఆ...ఆ...ఆ....ఆ...ఆ...ఆ..
చరణం 1:
భాహుగానది తీరములోన బావిలోన వెలసిన దేవ...
మహిలో జనులకు మహిమలు చాటి... ఇహ పరములనిడు మహానుభావా...
ఇష్టమైనదీ వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి...
కరుణను కురియుచు వరములనోసగుచు నిరతము పెరిగే మహాకృతి...
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రమాణం... ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం... విఘ్న నాశనం... కాణిపాకమున నీ దర్శనం
జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
చరణం 2:పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైనావు
మాత పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగ మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు ...గజముఖ గణపతి వైనావు
బ్రహ్మండమునే బొజ్జలో దాచి... లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తి కూర్పూగా... లక్ష్మి గణపతి వైనావు
వేద పురాణము లఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం...
జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
జయ జయ శుభకర వినాయక ...శ్రీ కాణిపాక వర సిద్దివినాయక
ఆ.ఆ......ఆ....ఆ....ఆ...

అయ్యప్ప దేవాయ నమః.. అభయ స్వరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః.. అభయ స్వరూపాయ నమః
హరిహర పుత్రాయ నమః.. కరుణా సముద్రాయ నమః
నిజ భీర గంభీర శభరీ గిరీశిఖర ఘన యోగ ముద్రాయనమః
పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండరూపాయనమః
అయ్యప్ప దేవాయ నమః... అభయ స్వరూపాయ నమః
చరణం 1:
పద్దేనిమిది పదిమట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి
ఇరుముడులు స్పృశియించి శుభమనుచు దీవించి జనకృందములచేరే జనమేలు స్వామి
తన భక్తులొనరించు తప్పులకు తడబడి ఒకపక్క ఒరిగెనా ఓంకార మూర్తి
స్వామియే... శరణం అయ్యప్ప
స్వాములందరు తనకు సాయంబు కాగా ధీమంతుడైలేచి ఆ కన్నేస్వామి
పట్టబంధము వీడి భక్తతటికై పరుగు పరుగునవచ్చె భువిపైకి నరుడై
అయ్యప్ప దేవాయ నమః... అభయ స్వరూపాయ నమః
చరణం 2:
ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణుఘోషలు విని బ్రోచు శబరీష
పాపాలు దోషాలు ప్రక్షాలనము చేయు పంపానదీ తీర ఎరుమేలి వాసా
నియమాల మాలతో సుగుణాల మట్లపై నడిపించి కనిపించు అయ్యప్పస్వామి
మకర సంక్రాంతి సజ్యోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠస్వామి
కర్మ బంధము బాపు ధర్మశాస్త్ర.. కలి భీతి తొలిగించు భూతాధినేత
అయ్యప్ప దేవాయ నమః... అభయ స్వరూపాయ నమః
చరణం 3:
ఆద్యంత రహితమౌ.. నీ విశ్వరూపము
అజ్ఞాన తిమిరమ్ము అణుచు.. శుభదీపం
ఈ నాల్గు దిక్కులు.. పదునాల్గు భువనాలు
పదిమెట్లుగా మారె... ఇదో అపురూపం
అరరులెల్లరు చెయు... అమృతాభిషేకం
నెరవేర్చుకో స్వామి... నీదు సంకల్పం
పదములకు మ్రొక్కగా ఒక్కొక్క లోకం
అందుకో నక్షత్ర పుస్పాభిషేకం...

రామా... ఆ.. ఆ..
అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య
అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య
చెయుతనిచ్చె వాడయ్య.. మా సీతా రామయ్య
చెయుతనిచ్చె వాడయ్య.. మా సీతా రామయ్య
కొర్కెలు తీర్చే వాడయ్య.. కొదండ రామయ్య
అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య
రామా... ఆ... రామా... ఆ... ఆ...
చరణం 1:
తెల్లవారితే చక్రవర్తై రాజ్యమునేలె రామయ్య
తండ్రిమాటకై పదవిని వదలి అడవులుకేగెనయా
మహిలో జనులను కావగవచ్చిన మహవిష్ణు అవతరమయ
ఆలిని రక్కసుడు అపహరించితె ఆక్రోశించెనయ
అసురను ద్రుంచి అమ్మను తెచ్చి అగ్నిపరిక్ష విధించెనయ
చాకలి నిందకు సత్యము చాటగ కులసతినేవిడనాడనయ
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా
ఆ... ఆ...
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేరయ్యా
సత్యం ధర్మం త్యాగంలో అతనుకి సరిలేరయ్య
కరుణ హృదయుడు.. శరణనువాడికి అభయమొసుగునయ్యా
అందరి బంధువయ్య.. భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్య.. ఆ అయొధ్య రామయ్య
చరణం 2:
భద్రాచలము పుణ్యక్షేత్రము.. అంతా రామ మయం
భక్తుడు భద్రుని కొండగ మార్చి.. కొలువై వున్న స్థలం
పరమ భక్తితో రామదసు ఈ అలయమును కట్టించెనయ
సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ
పంచవటిని ఆ జనకిరాముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములాడిన శేషతీర్ధమదిగో
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్య
ఆ... ఆ... ఆ...
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్య
శ్రీరామ పాదము నిత్యం కడిగే గోదారయ్య
ఈ క్షేత్రం తీర్దం దర్శించిన...
జన్మధన్యమయ్య...