వినయ విధేయ రామ (2019)

చిత్రం: వినయ విధేయ రామ (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: MLR కార్తికేయన్



తందానే తందానే తందానే తందానే
చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగానే

ఏ తియ్యదనం మనసుపై రాసిందో
ఎంతో అందంగా ఈ తల రాతలనే
ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో
తనకే రూపంగా ఈ బొమ్మలనే

తందానే తందానే తందానే తందానే
చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగానే

ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే
ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే
ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో
ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా
ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో
ఒక వాకిట ఒకటై ఉన్నారుగా

తందానే తందానే తందానే తందానే
చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని
తందానే తందానే తందానే తందానే
కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగానే

ఈ ఇంట్లిలోన ఇరుకుండదే
ప్రతి మనసులోన చోటుందిలే
ఈ నడకకెపుడు అలుపుండదే
గెలిపించు అడుగే తోడుందిలే

విడి విడిగా వీళ్ళు పదాలే
ఒకటయ్యిన వాక్యమల్లే
ఒక తియ్యటి అర్థం చెప్పారుగా

విడివిడిగా వీళ్ళు స్వరాలే
కలగలిపిన రాగమల్లే
ఒక కమ్మని పాటై నిలిచారుగా

తందానే తందానే తందానే తందానే
చూశారా ఏ చోటైనా ఇంతానందాన్ని
తందానే తందానే తందానే తందానే
బంధాల గ్రంధాలయమే ఉందీ ఇంట్లోనే

ఒకటే కలగంటాయంట వీళ్ళందరి కళ్ళు
అద్దాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు
గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు
వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు


******  ******  ******


చిత్రం: వినయ విధేయ రామ (2019)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జస్ప్రీత్ జాజ్, ఎమ్. ఎమ్. మానసి


సున్ మేరే మాహియా వే మాహియా వే  హో మాహియా వే
తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే

ఓ య్యా..ఓ య్యా..ఓ య్యా

రోమీయో జూలియెట్ మళ్లీ పుట్టినట్టు
ఉంటాదంటా మన జట్టు
వాళ్ల కథలో క్లైమ్యాక్స్ పాసిటివ్ గా రాసినట్టు
మన లవ్ స్టోరీ హిట్టు
షా జహాన్ ముంతాజ్ రీబార్న్ అయ్యినట్టు
ఉంటామంతా మనం ఒట్టు
రీ-ప్లాన్ చేసి నువ్వు ఈ సారైనా
తాజ్ మహల్ ముందే కట్టు

యూ ఆర్ మై గర్ల్ యూ ఆర్ మై గర్ల్!
మోనాలిసా నవ్వు సన్నజాజి పువ్వు ఒకటైతే నువ్వు

యూ ఆర్ మై వర్ల్డ్! యూ ఆర్ మై వర్ల్డ్!
వేడి వేడి లావా స్వీట్ పాల కోవ ఒకటైతే నువ్వు

తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా

సున్ మేరే మాహియా వే మాహియా వే  హో మాహియా వే
తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే

డోనట్ లాంటి కళ్ళు తిప్పి
చాక్లేట్ లిప్స్ రెండు విప్పి
ఐస్ ఫ్రూట్ మాటలేవో చెప్పి
నను పిచ్చెకించినావే

రెడ్ బుల్ లాంటి నవ్వు తొట్టి
డమ్‌బెల్ లాంటి కండ చూపి
లవ్ సింబల్ లా గుండె లోకి
నువు ఎంట్రీ ఇచ్చినావే

క్రీమ్ ఏ నువ్వు స్టోనెయ్ నేను
ఒకటై పోదాం క్రీమ్ స్టోన్ లా
బ్రెడ్ ఏ నువ్వు జాం ఏ నేను
మిక్స్ అయ్యీ పోదాం బ్రెడ్ జాం లా

తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా

చందమామ మీద కాలు పెట్టి
ఆర్మ్‌స్ట్రాంగ్ పొంగిపోయినట్టు
నీ బుగ్గ మీద ఒక్క ముద్దు పెట్టి
నేను కూడా పొంగిపోనా

న్యూటన్ మైండ్ నే లాగి
ఆ ఆపిల్ మురిసిపోయినట్టు
నా హగ్గు లోకి నిన్నే లాగి
నేను కూడా మురిసిపోనా

వైరల్ అయిన వీడియో లా వెలిగిపోదా
నువ్వుంటే నా చిట్టి జిందగీ
ట్రెండ్ సెట్ చేసిన టీజర్ అంటూ పేరు రాదా
మన వందేళ్ళ ఇష్క్ బొమ్మ కి

తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా
తస్సాదియ్యా లెట్స్ డూ ద మామ మియ్యా

సున్ మేరే మాహియా వే మాహియా వే  హో మాహియా వే
తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే
సున్ మేరే మాహియా వే మాహియా వే  హో మాహియా వే
తేరే సాంగ్ రెహ్నా వే జీనా వే హో జానియా వే

గాజుల కృష్ణయ్య (1975)

చిత్రం: గాజుల కృష్ణయ్య (1975)
సంగీతం: కె. వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: కృష్ణ , జరీనా
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాతలు: ఆదుర్తి భాస్కర్ , యమ్.యస్.ప్రసాద్
విడుదల తేది: 09.10.1975

రేపు వస్తానన్నావు ఈ మాపు ఎక్కడ ఉంటావు
నీ కళ్ళలోనే తెల్లవార్లు కాపురముంటాను రేపటికొస్తాను
రేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నదీ
రేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నదీ
రేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీ

నిన్న ఆశలు నేడు తొడిగిన మొగ్గలౌతాయి
నేటి మొగ్గలు రేపు విరిసిన పువ్వులౌతాయి
నిన్న ఆశలు నేడు తొడిగిన మొగ్గలౌతాయి
నేటి మొగ్గలు రేపు విరిసిన పువ్వులౌతాయి
కొత్త కొత్త సోయగాలు కునుకు తీస్తూ ఉంటాయి
మెత్త మెత్తగ కౌగిలిస్తే మేలుకొంటాయి
హాయ్ మిడిసిపడతాయి హ ఓ హ ఓ

రేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నదీ
రేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీ

ముసుగు తీయని తామరల్లే నీవు ఉంటావు
ముసురు వీడిన సూర్యుడల్లే నీవు వస్తావు
ముసుగు తీయని తామరల్లే నీవు ఉంటావు
ముసురు వీడిన సూర్యుడల్లే నీవు వస్తావు

రేకు రేకు గడియ తీసి లేత వయసు తలుపు తెరిచి
రేపు వడిలో రకరకాల రుచులు చూస్తాము
తెలుసుకుందాము హ ఓ హ ఓ

రేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీ
మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నదీ
రేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీ


*******   ********   *******


చిత్రం: గాజుల కృష్ణయ్య (1975)
సంగీతం: కె. వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల

రారయ్యా పోయినవాళ్ళు ఎవరయ్యా ఉండే వాళ్ళు
నవ్వు మరచి నన్ను మరచి ఎందుకు కన్నీళ్ళు
ఇలా ఎన్నాళ్ళూ
రారయ్యా పోయినవాళ్ళు ఎవరయ్యా ఉండే వాళ్ళు
నవ్వు మరచి నన్ను మరచి ఎందుకు కన్నీళ్ళు
ఇలా ఎన్నాళ్ళూ రారయ్యా పోయినవాళ్ళు

తొలిసారి చూశాను నీ కళ్లను అవి చిలికాయి నవ్వుల వెన్నెలను
తొలిసారి చూశాను నీ కళ్లను అవి చిలికాయి నవ్వుల వెన్నెలను
నిలువునా పులకించాను కలువనై విరబూచాను
మసకేసిన చందమామను ఏమని చూస్తాను నేనేమైపోతాను
రారయ్యా పోయినవాళ్ళు

నీ కళ్లకే కాదు కన్నీళ్లకూ నే తోడు ఉంటాను ఏ వేళకూ
నీ మమతలే కాదు నీ కలతనూ నే పంచుకుంటాను ప్రతి జన్మకూ
నీ మమతలే కాదు నీ కలతనూ నే పంచుకుంటాను ప్రతి జన్మకూ
రారయ్యా పోయినవాళ్ళు

నిదురల్లె వస్తాను నీ కంటికి చిరునవ్వు తెస్తాను నీ పెదవికి
నిదురల్లె వస్తాను నీ కంటికి చిరునవ్వు తెస్తాను నీ పెదవికి
అమ్మల్లె లాలించి అనురాగం పలికించి
మళ్ళీ నిను మనిషిని చేస్తా అన్నీ మరపించి
నిన్నే నవ్వించి రారయ్యా పోయినవాళ్ళు


*******   ********   *******


చిత్రం: గాజుల కృష్ణయ్య (1975)
సంగీతం: కె. వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా
ఉన్న నాలుగు నాళ్ళూ నీలా
ఉండి పోతే చాలమ్మా |నవ్వులు రువ్వే|

ఆకుల పయ్యెద లో
నీ ఆడతనాన్ని దాచావు
రేకుల కెంపులలో
నీ రేపటి ఆశలు నింపావు
ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన
మొగ్గ సొగసే ఉందమ్మా |నవ్వులు రువ్వే|

ఈ తోట మొత్తము కమ్మినవి
నీ దోర వయసు అందాలు
ఈ గాలి మత్తులో ఉన్నవి
నీ కన్నె మనసులో కైపులు
నువ్వొలకబోసే ఒంపుసొంపులకు
ఒడిని పడతానుండమ్మా |నవ్వులు రువ్వే|

ఏ కొమ్మకు పూచావో
ఏ కమ్మని తేనెలు తెచ్చావో
ఏ పాటకు మురిసేవో
ఏ తేటికి విందులు చేసేవో
ఆ పాట గానో తేటి గానో
పది నాళ్ళున్నా చాలమ్మా |నవ్వులు రువ్వే|


*******   ********   *******


చిత్రం: గాజుల కృష్ణయ్య (1975)
సంగీతం: కె. వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

పల్లవి:
నవ్వులు రువ్వే పువ్వమ్మా - నీ
నవ్వులు నాకు ఇవ్వమ్మా
ఉన్న నాలుగునాళ్లూ నీలా
ఉండిపోతే చాలమ్మా

చరణం: 1
ఆకుల పయ్యెదలో నీ ఆడతనాన్ని దాచావు
రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు
ఆ ముసుగుతీసిన ముద్దుముఖాన
మొగ్గ సొగసే వుందమ్మా

చరణం: 2
ఈ తోటమొత్తము కమ్మినవి - నీ
దోరవయసు అందాలు - ఈ
గాలి మత్తులో వున్నవి - నీ
కన్నె మనసులో కైపులు
నువ్వొలకబోసే ఒంపు సొంపులకు
ఒడిని పడతానుండమ్మా

చరణం: 3
ఏ కొమ్మకు పూచావో
ఏ కమ్మని తేనెలు తెచ్చావో
ఏ పాటకు మురిసేవో
ఏ తేటికి విందులు చేసేవో
పాటగానో తేటిగానో
పదినాళ్లున్నా చాలమ్మా


*******   ********   *******


చిత్రం:  గాజుల కిష్టయ్య (1975)
సంగీతం:  కె. వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  యస్.పి.బాలు

పల్లవి:
వేసుకో ఈ గాజులు.. చూసుకో నీ సొగసులు
వేసుకో ఈ గాజులు.. చూసుకో నీ సొగసులు
ఏ వయసుకాగాజులు.. ఏడు వారాలకు గాజులు
ఏ వయసుకాగాజులు.. ఏడు వారాలకు గాజులు
గాజులు గాజులు గాజులు గాజులు.. గాజులు గాజులు గాజులు గాజులు
వేసుకో ఈ గాజులు చూసుకో నీ సొగసులు

చరణం: 1
ఎరుపు పసుపు ఆకుపచ్చ నీలి గాజులు
రబ్బరు గాజులు.. లక్క గాజులు.. మట్టి గాజులు.. గట్టి గాజులు

చెయ్యి చూసి సైజు చూసి నైసుగ వేస్తాము
అమ్మా.. అబ్బా.. నొప్పి.. గిప్పీ.. అనకుండా వేస్తాము
చెయ్యి చూసి సైజు చూసి నైసుగ వేస్తాము
అమ్మా.. అబ్బా.. నొప్పి.. గిప్పీ.. అనకుండా వేస్తాము

వేసినట్టె తెలియదు.. తీసుకోను బాధలేదు
వేసినట్టె తెలియదు.. తీసుకోను బాధలేదు
మనం గాజులేస్తే చాలు.. సినిమా స్టారులౌతారు  
అమ్మా.. తల్లీ.. చెల్లీ.. బుల్లీ

వేసుకో ఈ గాజులు..  చూసుకో నీ సొగసులు

చరణం: 2
కన్నె పిల్లలేసుకుంటే కళ్యాణమవుతుంది.. అవును తప్పకుండా అవుతుంది
కట్టుకున్న మొగుడికి మోజే పెరుగుతుంది.. ఆ పెరిగి తీరుతుంది

మోజు మోజుగా ఉంటూ ముచ్చటగా ప్రతి ఏడూ
క్యారు క్యారు  క్యారు మంటూ పెరుగుతుంది కాపురం
అమ్మా.. తల్లి.. బుల్లీ.. చెల్లీ..  

వేసుకో ఈ గాజులు చూసుకో నీ సొగసులు
ఏ వయసుకాగాజులు ఏడు వారాలకు గాజులు

గాజులు గాజులు గాజులు గాజులు గాజులు గాజులు గాజులు గాజులు
వేసుకో ఈ గాజులు చూసుకో నీ సొగసులు గాజులోయ్ గాజులూ


*******   ********   *******


చిత్రం:  గాజుల కిష్టయ్య (1975)
సంగీతం:  కె. వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  యస్.పి.బాలు,  సుశీల

పల్లవి:
ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు?
ఇంత కాలమింత మనసు ఏమి చేసుకున్నావు?
ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు?
ఇంత కాలమింత మనసు ఏమి చేసుకున్నావు?

ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు?

చరణం: 1
మనసు నాకు ఉన్నదని నీ మనసే వచ్చి తెలిపినది
మూసివున్న ఆ తలుపులు నువ్వే మొదటిసారిగ తెరిచినది
మనసు నాకు ఉన్నదని నీ మనసే వచ్చి తెలిపినది
మూసివున్న ఆ తలుపులు నువ్వే మొదటిసారిగ తెరిచినది
సూర్యుని వెలుగు సోకినప్పుడే తామర అందం తెలిసేది
సూర్యుని వెలుగు సోకినప్పుడే తామర అందం తెలిసేది
నీ చూపులు నాఫై పడినప్పుడే సొగసులు నాలో విరిసేది

ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు?

చరణం: 2
అందలాన అందీ అందని అందమల్లే నువ్వున్నావు
అందుకోను చేయి జాపే ఆశల్లే నేనున్నాను
అందలాన్ని దిగివచ్చాను.. అందుకొమ్మని చేయిచ్చాను
ఆకు చాటు మల్లెను నేను.. అంతకన్నా ఏం చేస్తాను
ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు?
ఇంత కాలమింత మనసు ఏమి చేసుకున్నావు?

చరణం: 3
కాటు వేసే కరినాగే నీ కౌగిలిలో నను చేర్చినది
కాటు వేసే కరినాగే నీ కౌగిలిలో నను చేర్చినది
ఓర్వలేని ఈ విషలోకం విడదీస్తే ఏం చేసేది
మనసిస్తే చాలును నాకు.. నువు మాటిస్తే చాలును నాకు  
మనసులేని మనుషుల మాటే వద్దు ఇంక నీకు నాకూ   

ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు?
ఇంత కాలమింత మనసు ఏమి చేసుకున్నావు?

యస్వీఆర్‌...

యస్వీఆర్‌...
వెండితెరపై వేయి వెలుగుల నక్షత్రం!
తెలుగు... తమిళం...
భాష ఏదైనా... అభినయ స్వర సమ్మోహనాస్త్రం!!
పౌరాణికం... జానపదం... చారిత్రకం... సాంఘికం...
జానర్‌ ఏదైనా... జగమెరిగిన మహా స్టార్‌!!
'పాతాళభైరవి'లో ఒక నేపాళ మాంత్రికుడు
'మాయాబజార్‌'లో ఒక ఘటోత్కచుడు
'పాండవ వనవాసం'లో ఒక దుర్యోధనుడు
'సంపూర్ణ రామాయణం'లో ఒక రావణాసురుడు
'బొబ్బిలి యుద్ధం'లో ఒక తాండ్ర పాపారాయుడు
'పండంటి కాపురం'లో ఒక ఇంటి పెద్దన్నయ్య
'లక్ష్మీనివాసం'లో ఒక షావుకారు రంగయ్య
ఒక్క సూర్యుడు... తెరపై తానొక్కక్కటై తోచు!
అన్నీ ఆయనే! తెరపై కనిపిస్తే... అంతా ఆయనే!!
అందుకే... ఆయన జనం మెచ్చిన విశ్వనట చక్రవర్తి!!
'పద్మశ్రీ'లు లేవు... ప్రత్యేక గుర్తింపులూ లేవు...
అయితేనేం... నూరేళ్ళయినా జనం గుండెల్లో ఉన్నాడు!
మరో వెయ్యేళ్ళయినా...
సినిమా ఉన్నంతవరకు ఇలానే ఉంటాడు!!
యస్వీఆర్‌... చిర యశస్వీఆర్‌!!
శతజయంతి వేళ...
ఇది... ఆ అభినయ చక్రవర్తి జ్ఞాపక సుగంధ మాలిక!
సాహో యస్వీఆర్‌! వారెవ్వా... చిర యశస్వీయార్‌!!

పాతాళ భైరవి (1951)

చిత్రం:పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: రేలంగి


వినవే బాల నా ప్రేమగోల
వినవే బాల నా ప్రేమగోల
నీకే నువ్వేల నిలువగజాల
వినవే బాల నా ప్రేమగోల

గుబుల్ గుబుల్గా గుండెలదరగా
దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా
గుబుల్ గుబుల్గా గుండెలదరగా
దిగుల్ దిగుల్గా ఇది ఇదిగా
వినవే బాల నా ప్రేమగోల

చిరునవ్వుచాలే చిత్తైపోతానే
చిరునవ్వుచాలే చిత్తైపోతానే
మురిపించేస్తాలే మూర్చైపోతానే
వినవే బాల నా ప్రేమగోల
వినవే బాల నా ప్రేమగోల

జూడుగుడి తోడిరాగం పాడుకుంటు
జూడుగుడి తోడిరాగం పాడుకుంటు
మేడమీద పైడబంగార్ తూగుటుయ్యాల్ వేడుకల్గా ఊగరావా ఊగరావా ఊగరావా ఊగరావా

చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
చెట్టాపట్టిల్ జడకోలాటం
చెట్టాపట్టిల్ జడకోలాటం తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
ఉప్ ఉప్ తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
తొక్కుడుబిళ్ళ ఆడేనాతో తొక్కుడుబిళ్ళ ఆడేనాతో
ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో ఆడేనాతో


*******   *******   ********






చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: పి.లీల

తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్

చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా
చివురులదాగే తీవెలనుండి పూవులు ఘుమఘుమ నవ్వగా
వని అంతా పరిమళించెనే మనసంతో పరవశించెనే
వని అంతా పరిమళించెనే మనసంతో పరవశించెనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్

గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా
గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా
వని అంతా జలదరించెనే తనువెంతో పులకరించెనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్

ఓ ఓ ఓ ఓ
కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా
కొత్తరాగమున కుహుకుహుమని మచ్చెలి కోయిల కూయగా
వని అంతా రవళించేనే నన్నెంతో మురిపీంచేనే
తీయని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి
వసంత నాట్యమే హాయ్ హాయ్



*******   *******   ********



చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల

ప్రణయజీవులకు దేవివరాలే
కానుకలివియే ప్రియురాల
హాయిగా మనకింక స్వేచ్చగా
హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా

చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా
చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా
కలసిమెలసి పోదమోయ్ వలపుబాటన
హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా

నీ వలపు నా వలపు పూలమాలగా ఆ ఆ ఆ
నీ వలపు నా వలపు పూలమాలగా ఆ ఆ ఆ
నీవు నేను విడివడని ప్రేమమాలగా
హాయిగా మనకింక స్వేచ్చగా హాయిగా

కలలు నిజముకాగా కలకాలమొకటిగా
కలలు నిజముకాగా కలకాలమొకటిగా
తెలియరాని సుఖములలో తేలిపోవగా
హాయిగా మనకింక స్వేచ్చగా
హాయిగా మనకింక స్వేచ్చగా
హాయిగా - స్వేచ్చగా - హాయిగా




*******   *******   ********



చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల

ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో
ఎంత ఘాటు ప్రేమయో
కన్ను కాంచుచున్నదిగా కళలు విరిసెనే
నా మనసు మురిసెనే నా మనసు మురిసెనే
ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో

ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ
ఎంత లేత వలపులో
కన్నులలో కనిననంతనే తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే నా మనసు నిలిచెనే
ఎంత లేత వలపులో

ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మళయానిలము
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మళయానిలము
విరహములో వివరాలను విప్పిచెప్పెనే
ఎంత ఘాటు ప్రేమయో

ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మళయానిలమా
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మళయానిలమా
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుచేయరే

ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ
ఎంత లేత వలపులో




*******   *******   ********




చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల

కనుగొనగలనో లేనో
కనుగొనగలనో లేనో
ప్రాణముతో సఖిని
కనుగొనగలనో లేనో

పెండ్లి పీట పై ప్రియనెడబాయ
గాలి మేడలు గారడి కాగా
పెండ్లి పీట పై ప్రియనెడబాయ
గాలి మేడలు గారడి కాగా
కల కాలమును కర్మను దూరుచు
కలగ బ్రతకడ మేనో

కనుగొనగలనో లేనో

వెదకి వెదకి ఏ జాడ తెలియక
హృదయమంత చీకటిగా
వెదకి వెదకి ఏ జాడ తెలియక
హృదయమంత చీకటిగా
ఎంత పిలిచినా పిలుపే అందక
చింతిని తిరగడమేనోయ్

కనుగొనగలనో లేనో

పులివాతను బడు బాల హరిణియై
చెలి ఎచ్చటనో చెరబడగా
పులివాతను బడు బాల హరిణియై
చెలి ఎచ్చటనో చెరబడగా
జాలిలేని ఆ మాయదారికే
బలిగా చేయడమేనో...

కనుగొనగలనో లేనో
ప్రాణముతో సఖిని
కనుగొనగలనో లేనో
కనుగొనగలనో లేనో




*******   *******   ********




చిత్రం: పాతాళ భైరవి (1951)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి.లీల

కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన గారడి ఆయే మనసే పూల మంటపమాయే
కలవర మాయే మదిలో నా మదిలో

నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే
కలవరమాయే మదిలో నా మదిలో

నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది
మోహాలేవో మోజులు రేపి ఊహాగానము చేసే
కలవరమాయే మదిలో నా మదిలో

కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో