చిత్రం : అమాయకురాలు (1971) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : ఆరుద్ర నేపధ్య గానం : ఘంటసాల, సుశీల పల్లవి : సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు.. చిన్నారి పాపా నవ్వులు మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు.. బంగారు జోతుల దీవెనలు సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు... చిన్నారి పాపా నవ్వులు మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు... బంగారు జోతుల దీవెనలు చరణం 1 : పాపాయి గెంతులు... తువ్వాయి చెంగులు పాపాయి గెంతులు... తువ్వాయి చెంగులు తూరీగలాగ దొరకదు.. పరుగులు తీస్తే పండుగ.. ఉరకలు వేస్తె వేడుక మా జోతి చిందులే అందాల విందులు సన్నజాజి పువ్వులు.. చందమామ కాంతులు... చిన్నారి పాపా నవ్వులు చరణం 2 : తాతయ్య మీసాల ఉయ్యాలలూగేను.. అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను తాతయ్య మీసాల ఉయ్యాలలూగేను... అమ్మమ్మ కళ్ళతో దోబూచులాడేను ఆడిన ఆట.... పాడిన పాట... ఆడిన ఆట అల్లరి... పాడిన పాట పల్లవి.. మా జోతి మాటలే వరహాల మూటలు సన్నజాజి పువ్వులు.. చందమామ కాంతులు.. చిన్నారి పాపా నవ్వులు చరణం 3 : ఆ కొంటె చేష్టలు ఆ చిలిపి చూపులు ఆ కొంటె చేష్టలు ఆ చిలిపి చూపులు ఆనందమొసగే వరములు ఇరుగుపొరుగు మెచ్చగా ఇంటిల్లిపాదికి నచ్చగా.. చిరంజీవి పెరగాలి బంగారు తల్లిగా సన్నజాజి పువ్వులు చందమామ కాంతులు.. చిన్నారి పాపా నవ్వులు మా ఇంటి వెలుగు మా కంటి వెలుగు.. బంగారు జోతుల దీవెనలు **************** **************** *********** చిత్రం : అమాయకురాలు (1971) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : దాశరథి నేపధ్య గానం : ఘంటసాల, సుశీల పల్లవి : ఓహో.. ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఆహా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. కొంటె పిల్లా.... కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది వంట ఇంటి కుందేలై చేత చిక్కింది బ్రహ్మచారీ.... బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది చరణం 1 : కవ్వించి నవ్వించు గడుసైనదానా.. ఈ వింత సిగ్గేల నీ మోములోన నను చూసి నా రాజు కను సైగ చేసే నును సిగ్గు పరదాలు కనులందు వాలే నీ తీపి కలలన్ని నిజమైన వేళ.. నీ తీపి కలలన్ని నిజమైన వేళ.. సరదాగ నాతోటి సరితూగ రావా బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది... కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది చరణం 2 : చెలికాని అధరాల చిరునవ్వు నేనై.. నిండైన ప్రణయాలు పండించుకోనా చెలి నీలి కురులందు సిరిమల్లె నేనై.. పరువాల మురిపాలు విరబూయ రానా అందాల మన ప్రేమ బంధాలలోన... అందాల మన ప్రేమ బంధాలలోన.. హృదయాలు పెనవేసి విహరించుదామా కొంటె పిల్ల కోరుకున్న జంట దొరికింది.. వంట ఇంటి కుందేలై చేత చిక్కింది బ్రహ్మచారి వంట ఇంటి బాధ తప్పింది.. కళ్ళలోన పెళ్లి సొగసు గంతులేసింది **************** **************** *********** చిత్రం: అమాయకురాలు (1971) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: ఘంటసాల, సుశీల పల్లవి: హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు పైకెంతో చల్లని వారు.. తమరెంతో అల్లరివారు నా మనసు దోచినారు చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు లల్లలల్ల ఒహో ఒహో లలల్లల చరణం 1: రానిమ్ము రానిమ్ము ఏమైనకానీ.. నా ఇంపు నా సొంపు నీ సొమ్ము కాదా రానిమ్ము రానిమ్ము ఏమైనకానీ.. నా ఇంపు నా సొంపు నీ సొమ్ము కాదా నా తోడు నీవై.. నీ నీడ నేనై.. కలవాలి కరగాలి కావాలి ఒకటిగా.. ఆ..ఓ.. చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు చరణం 2: రావాలి రావాలి సరియైన అదను.. ఆనాడు ఇవ్వాలి నీ నిండు మనసు.. రావాలి రావాలి సరియైన అదను.. ఆనాడు ఇవ్వాలి నీ నిండు మనసు ఆలోగ నీవు ఆవేశ పడకు.. ఆకాశ సౌధాలు నిర్మించ రాదులే.. ఏ .. ఓ.. హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు చరణం 3: అనురాగ బంధాలు సడలించవద్దు.. పెనవేయు హృదయాలు విడదీయవద్దు అనురాగ బంధాలు సడలించవద్దు.. పెనవేయు హృదయాలు విడదీయవద్దు నీ లేత వలపు ఆమోదమైన.. బంగారు స్వప్నాలు పండేది ముందెపుడో.. ఓ.. ఓ.. హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు **************** **************** *********** చిత్రం: అమాయకురాలు (1971) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: సుశీల పల్లవి: ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ... పాడెద నీ నామమే గోపాలా పాడెద నీ నామమే గోపాలా హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా... పాడెద నీ నామమే గోపాలా చరణం 1: మమతలలోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా మమతలలోనే మాలికలల్లి నిలిచితి నీకోసమేరా ఆశలతోనే హారతి చేసి పదములు పూజింతు రారా పాడెద నీ నామమే గోపాలా చరణం 2: నీ మురళీ గానమే పిలిచెరా కన్నుల నీమోము కదలెనులేరా నీ మురళీగానమే పిలిచెరా పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునాతటిపై ఆ..... పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునాతటిపై నీ సన్నిధిలో జీవితమంతా ..కానుక చేసేను రారా పాడెద నీ నామమే గోపాలా హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా... పాడెద నీ నామమే గోపాలా... **************** **************** *********** చిత్రం: అమాయకురాలు (1971) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: సినారె నేపధ్య గానం: బాలు, సుశీల పల్లవి: నీ చూపులు గారడి చేసెను.. నీ నవ్వులు పూలై పూచెను ఆ నవ్వులలో.. ఆ చూపులలో.. నిను కవ్వించేవాడెవ్వడో.. నా చూపులు గారడి చేసినా.. నా నవ్వులు పూలై పూచినా.. ఏ ఒక్కరికో అవి దక్కునులే.. ఆ టక్కరి దొంగవు నీవేలే చరణం 1: నీ మోమే ఒక చంద్రబింబం.. దానికి ముచ్చటైన పుట్టుమచ్చ అందం.. నీ మోమే ఒక చంద్రబింబం.. ఆ అందం చూసి.. నీ ముందుకు దూకి.. ఆ అందం చూసి.. నీ ముందుకు దూకి.. ఎందరు యువకులు తొందరపడి నిన్నెత్తుకుపోతారో.. నేనేమైపోతానో... అహ..హ.... నా చూపులు గారడి చేసినా.. నా నవ్వులు పూలై పూచినా.. ఏ ఒక్కరికో అవి దక్కునులే.. ఆ టక్కరి దొంగవు నీవేలే చరణం 2: మగసిరిగల సొగసైన దొరవు.. అందుకు సరిపడు సిరులెన్నో కలవు... మగసిరిగల సొగసైన దొరవు.. నీ పక్కన మూగి.. తమ మక్కువ చూపి నీ పక్కన మూగి.. తమ మక్కువ చూపి చక్కని పడుచుల.. చెక్కెలి తళుకుల చిక్కుకుపోతావో.. నీ చెలినే మరచేవో.. ఊ..హ..హ.. నీ చూపులు గారడి చేసెను.. నీ నవ్వులు పూలై పూచెను ఆ నవ్వులలో ఆ చూపులలో.. నిను కవ్వించేవాడెవ్వడో... చరణం 3: చిగురించిన ఈ అనురాగం.. వికసించునులే కలకాలం చిగురించిన ఈ అనురాగం.. నీ వలపే నేనై.. నా వెలుగే నీవై కమ్మని మమతల బంగరు మేడల కలలే కందామా.. కలలే కందామా.. ఆహాహహా.. ఆహాహహా.. ఆహాహహా.. ఆహాహహా..
చిత్రం : సంబరాల రాంబాబు (1970) సంగీతం : వి. కుమార్ గీతరచయిత : రాజశ్రీ నేపధ్య గానం : సుశీల పల్లవి : మామా... చందమామా... వినరావా... నా కథ మామా... చందమామా... వినరావా... నా కథ వింటే మనసు ఉంటే... కలిపేవూ నా జత మామా... చందమామా... చరణం 1 : నీ చల్లని కిరణాలలో జగమంతా మురిసెనే నాలోన లోపమేమో నా మనసే కుమిలెనే అందరికీ ఆనందం అందించే జాబిలి నాపైన నీకేలా రాదాయే జాలి మామా... చందమామా... వినరావా... నా కథ వింటే మనసు ఉంటే.. కలిపేవూ నా జత మామా... చందమామా... చరణం 2 : మచ్చ నీకు ఉన్నా... లెక్క చెయ్యరే ముచ్చటైన నీ వెన్నెలనే మెచ్చుకుందురందరూ మచ్చలేని నన్ను... వెక్కిరింతురే పిచ్చిదానినంటూ నాపై లేని మచ్చ వేసేరు నిజము తెలిపినా వినరు.. మనసు తెలుసుకోలేరు నీవుకాక నా వెతలన్నీ వినేవారు ఎవ్వరు వినేవారు ఎవ్వరు... మామా... చందమామా... వినరావా... నా కథ వింటే మనసు ఉంటే.. కలిపేవూ నా జత మామా... చందమామా... ******** ********** * ************* ********* చిత్రం : సంబరాల రాంబాబు (1970) సంగీతం : వి. కుమార్ గీతరచయిత : రాజశ్రీ నేపధ్య గానం : బాలు, సుశీల పల్లవి : మామా... చందమామా... వినరావా...నా కథ మామా చందమామా... వినరావా నా కథ వింటే మనసు ఉంటే... కలిసేవూ నా జత మామా... చందమామా ... చరణం 1: నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు... నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు... నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు నువు లేక నువు రాక.. విడలేవు కలువలు... జాబిల్లి నీ హాయి పాపలకు జోలలు.... మామా చందమామా... వినరావా నా కథ వింటే మనసు ఉంటే... కలిసేవూ నా జత మామా... చందమామా ... చరణం 2 : మింటిపైన నీవు ఓంటిగాడివై.. అందరికీ వెన్నెల పంచ రేయంత తిరగాలి ఇంటిలోన నేను ఒంటిగాడినై.. అందరికీ సేవలు చేయ రేయి పవలు తిరగాలి లేరు మనకు బంధువులు... లేరు తల్లిదండ్రులులేరు మనకు బంధువులు... లేరు తల్లిదండ్రులుమనను చూసి అయ్యోపాపం... అనేవారు ఎవ్వరుఅనేవారు ఎవ్వరు... మామా చందమామా... వినరావా నా కథ వింటే మనసు ఉంటే... కలిసేవూ నా జత మామా... చందమామా ******** ********** * ************* ********* చిత్రం : సంబరాల రాంబాబు (1970) సంగీతం : వి. కుమార్ గీతరచయిత : రాజశ్రీ నేపధ్య గానం : పిఠాపురం, సుశీల పల్లవి : పొరుగింటి మీనాక్షమ్మను చూసారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా... మిమ్మల్నే... పొరుగింటి మీనాక్షమ్మను చూసారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా... పగలంతా ఇద్దరకూ తగవులు ఎన్నున్నా.. పగలంతా ఇద్దరకూ తగవులు ఎన్నున్నా.. చీకటి పడితే పక్కకి చేరి రాజీ కొస్తాడు కోరిన చీరలు ఇస్తాడు... పొరుగింటి మీనాక్షమ్మను చూసారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా... పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే... వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే... ఆండాళ్ళూ... పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే... వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే.. తప్పని సరిగా ప్రతి సినిమాకు వెళతావూ ముందే.. తప్పని సరిగా ప్రతి సినిమాకు వెళతావూ ముందే.. జీతం కాస్తా సినిమాకైతే మిగిలిదేముందే? చీరకు మిగిలేదేముందే... పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే... వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే... చరణం 1 : పెళ్ళై మూడు ఏళ్ళు గడిచినా పొందిందేమిటి ఆండాళ్ళు... పెళ్ళై మూడు ఏళ్ళు గడిచినా పొందిందేమిటి ఆండాళ్ళు... తల్లీ తండ్రీ ప్రేమ గుర్తు గా పుట్టెను బుల్లి నామాలు తల్లీ తండ్రీ ప్రేమ గుర్తు గా పుట్టెను బుల్లి నామాలు వగలను చూపిస్తారే గాని నగలెపుడైనా పెట్టారా వగలను చూపిస్తారే గాని నగలెపుడైనా పెట్టారా ఓ ముత్యాల బేసరి ఇచ్చి ముక్కుకి అందం తెచ్చారా.... నా ముక్కుకి అందం తెచ్చారా.... ఉద్యోగం ఒక మెట్టు దాటనీ కోరినదిస్తా నీకూ ఇష్టం లేదని చెప్ప కూడదా ఎందుకు లెండి సాకు.... పొరుగింటి మీనాక్షమ్మను చూసారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా... చరణం 2 : మాటలతోటీ రెచ్చ గొట్టకే నన్నూ.... బెదిరింపులకు లొంగే దాన్ని కానూ... కోపం వస్తే మనిషిని కాను నేనూ... ఏం చేస్తారు..? చెవులు మెలేస్తా..!! ఇంకేంచేస్తారు..? దుంప తెంపేస్తా..!! ఆ తరువాతా..!! తాట వొలుస్తా...!! హా హ హ హా....!!! పొరుగింటి మీనాక్షమ్మను చూసారా వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా... హా హ హ హా
చిత్రం : విజయం మనదే (1970) సంగీతం : ఘంటసాల గీతరచయిత : సినారె నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి : ఓ దేవి ఏమి కన్నులు నీవి ఓ దేవి ఏమి కన్నులు నీవి కల కల నవ్వే కలువలు అవి కాముని పున్నమి చలువలు ఓ దేవి ఏమి కన్నులు నీవి వాడిపోయే వీడిపోయే కొలనులోని కలువపూలు నా నయనాలా చాలు చాలు చాలూ... ఓ దేవి ఏమి కన్నులు నీవి చరణం 1 : ఏమని అందును ఎర్రని పెదవుల అందాలు అవి ఎంతో వింతగ మెరిసే నున్నని పగడాలు ఏమని అందును ఎర్రని పెదవుల అందాలు అవి ఎంతో వింతగ మెరిసే నున్నని పగడాలు రూపమే కాని రుచియే లేని పగడాలు రూపమే కాని రుచియే లేని పగడాలు తేనియలూరే తియ్యని పెదవికి సరి రావు సరిరావు చాలు చాలు చాలు... ఓ దేవి ఏమి కన్నులు నీవి చరణం 2 : కులుకుల నడకల కలహంసలు కదలాడెనా నల్లని జడలో నాగులు ఊగిసలాడెనా కులుకుల నడకల కలహంసలు కదలాడెనా నల నల్లని జడలో నాగులు ఊగిసలాడెనా దివికీ భువికి వంతెన వేసెను నీ సోగసు దివికీ భువికి వంతెన వేసెను నీ సోగసు అల్లరి పిల్లకు కళ్ళెం వేసెను నీ మనసు నీ మనసు చాలు చాలు చాలు... ఓ దేవి ఏమి కన్నులు నీవి ఓ రాజా రసికతారసి రాజా
చిత్రం : మా నాన్న నిర్దోషి (1970) సంగీతం : పెండ్యాల గీతరచయిత : సినారె నేపధ్య గానం : బాలు, సుశీల పల్లవి: movies అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా.. అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా.. ఆ...ఆ...ఆ..ఆ.. ఆ...ఆ...ఆ..ఆ.. ఆ...ఆ...ఆ..ఆ.. అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా.. ఆ.. ఆ.. ఆ అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా చరణం 1: కదలే పూలగాలి.. నా ఎదపై తేలి తేలి ఈ ఈ కదలే పూల గాలి .. నా ఎదపై తేలి తేలి ఏ కథలో తెలుపసాగే.. ఏ కలలో పలుకసాగే ఆ తీయ్యని గాధల రాధవు నీవే ప్రియా ఆ ఆ... నా తీరని వలపుల మాధురి నీవే ప్రియా ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా.. అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా.. చరణం 2: మదిలో రాగ మాలా.. నవమధువై పొంగు వేళా ఆ ఆ నా తనువే పల్లవించే.. అణువణువే పరవశించే ఆ గానములో నను లీనము కానీ ప్రియా ఆ ఆ ఆ నీ ప్రాణము లో ఒక ప్రాణము కానీ ప్రియా ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... అలకలు తీరిన కన్నులు ఏమనే ప్రియా ఆ ఆ అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ
చిత్రం : బాలరాజు కథ (1970) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : ఆరుద్ర నేపధ్య గానం : సుశీల పల్లవి : ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు అంతకు మించిన సంతానమైతే.. వద్దు.. వద్దు.. వద్దు వద్దు.. వద్దు... వద్దు ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు అంతకు మించిన సంతానమైతే.. వద్దు.. వద్దు.. వద్దు వద్దు... వద్దు... వద్దు ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు చరణం 1 : పైసా అంటే పలకని దేవుడు పిల్లలు కొల్లగ ఇస్తాడు పైసా అంటే పలకని దేవుడు పిల్లలు కొల్లగ ఇస్తాడు దరిద్రాన్ని జత చేస్తాడు సంతులేనిదే స్వర్గం లేదని ఏ మగవాడూ అనుకోడు సంతులేనిదే స్వర్గం లేదని ఏ మగవాడూ అనుకోడు ఇడుగో మొనగాడున్నాడు ఇడుగో మొనగాడున్నాడు ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు చరణం 2 : ఇలాగ జనాభా పెరుగుతు ఉంటే సాపాటు సంగతి ఏలాగు? ఇలాగ జనాభా పెరుగుతు ఉంటే సాపాటు సంగతి ఏలాగు? సంతానమంతా దిగజారు రెక్కల కష్టం.. చేసే వాళ్ళకు రెక్కల కష్టం చేసే వాళ్ళకు బతుకంతా హాయిగ జరుగు రెక్కల కష్టం చేసే వాళ్ళకు బతుకంతా హాయిగ జరుగు ఇంతమందైతే ఏలాగు? మరింత మందైతే ఏలాగు? వద్దు వద్దు వద్దు ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు చరణం 3 : సినిమాలకు పోవాలంటే సైన్యమంతా తయారు సినిమాలకు పోవాలంటే సైన్యమంతా తయారు ఒక్కరు వెనుకాడరు మీరుకూడ హాజరు ఒక్కరు వెనుకాడరు మీరుకూడ హాజరు కాఫీ హోటల్ బిల్లుకు నెల జీతం గయామారు కాఫీ హోటల్ బిల్లుకు నెల జీతం గయామారు ఆ దెబ్బతో తారుమారు.. ఆపవయ్యా నీ జోరు వద్దు... వద్దు... వద్దు ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు చరణం 4 : గంపెడు పిల్లలు కన్న కుచేలుడు కుయ్యో మొఱ్ఱో అన్నాడు గంపెడు పిల్లలు కన్న కుచేలుడు కుయ్యో మొఱ్ఱో అన్నాడు పస్తులెన్నో పడుకున్నాడు శ్రీకృష్ణుడు భగవానుడు వచ్చి అప్పుడు ఆదుకున్నాడు శ్రీకృష్ణుడు భగవానుడు వచ్చి అప్పుడు ఆదుకున్నాడు ఇప్పుడు మనకెవడున్నాడు? ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు అంతకు మించిన సంతానమైతే.. వద్దు.. వద్దు.. వద్దు వద్దు... వద్దు... వద్దు ************* **************** ******** చిత్రం: బాలరాజు కథ (1970) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: సుశీల పల్లవి: మహబలిపురం మహబలిపురం మహబలిపురం భారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు మహబలిపురం మహబలిపురం మహబలిపురం భారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు మహబలిపురం మహబలిపురం మహబలిపురం చరణం 1: కంచి రాజధానిగా పాలించాడు ఇది మంచిరేవు పట్నంగా కట్టించాడు కంచి రాజధానిగా పాలించాడు ఇది మంచిరేవు పట్నం గా కట్టించాడు తెలుగుసీమ శిల్పులుని రప్పించాడు తెలుగుసీమ శిల్పులుని రప్పించాడు పెద్ద శిలలన్ని శిల్పాలుగా మార్పించాడు మహబలిపురం మహబలిపురం మహబలిపురం చరణం 2: పాండవుల రథాలని పేరుపడ్డవి ఏకాండి శిలలనుండి మలచపడ్డవి పాండవుల రథాలని పేరు పడ్డవి ఏకాండి శిలలనుండి మలచపడ్డవి వీటిమీద బొమ్మలన్ని వాటమైనవి వీటిమీద బొమ్మలన్ని వాటమైనవి తాము సాటిలేని వాటిమంటు చాటుతున్నవి తాము సాటిలేని వాటిమంటు చాటుతున్నవి మహబలిపురం మహబలిపురం మహబలిపురం మహిషాసురమర్ధనం... గోవర్ధనమెత్తడం మహిషాసురమర్ధనం... గోవర్ధనమెత్తడం మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చటం మహావిష్ణు వరాహంగా అవతారం దాల్చటం పురాణాల ఘట్టాలు పొందుపర్చిరి పురాణాల ఘట్టాలు పొందుపర్చిరి ముచ్చటగా కన్నులకు విందునిచ్చిరి మహబలిపురం మహబలిపురం మహబలిపురం చరణం 3: పాశుపతం కోరెను పార్ధుని మనసు పరమశివుని కోసము చేసెను తపస్సు పాశుపతం కోరెను పార్ధుని మనసు పరమశివుని కోసము చేసెను తపస్సు సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను సృష్టంతా కదలి వచ్చి చూడసాగెను ప్రతి సృష్టి ఈ శిల్పమని పేరు వచ్చెను ప్రతి సృష్టి ఈ శిల్పమని పేరు వచ్చెను మహబలిపురం మహబలిపురం మహబలిపురం సంద్రంలో కలసినవి కలసిపోయేను ఒంటరిగా ఈ కోవెల మిగిలిపొయేను సంద్రంలో కలసినవి కలసిపోయేను ఒంటరిగా ఈ కోవెల మిగిలిపొయేను దేవుని పాదాలను కెరటాలు కడుగును నిత్యం పాదాలను కెరటాలు కడుగును నిత్యం మనుషుల పాపాలు ఇది చూడ తొలగను సత్యం సత్యం పాపాలు ఇది చూడ తొలగను సత్యం సత్యం మహబలిపురం మహబలిపురం మహబలిపురం భారతీయ కళాజగతికి ఇది గొప్ప గోపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు మహబలిపురం మహబలిపురం మహబలిపురం ************* **************** ******** చిత్రం : బాలరాజు కథ (1970) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : కొసరాజు నేపధ్య గానం : ఘంటసాల, సుశీల పల్లవి: అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం చరణం 1: ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు ఉంటారెందుకు ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు ఉంటారెందుకు అది వీధిలోన పడి ఉన్నందుకు .. అది వీధిలోన పడి ఉన్నందుకు.. ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకూ … అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం చరణం 2: మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట పెళ్ళేందుకు ఊరుమీద పడి చందాలెందుకు మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట పెళ్ళేందుకు ఊరుమీద పడి చందాలెందుకు లోకులు చూచి తరించుటకు … లోకులు చూచి తరించుటకు పలుగాకుల బొజ్జల పెంచుటకు… పలుగాకుల బొజ్జల పెంచుటకు అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం చరణం 3: మహమ్మదీయులు పిలిచే దేవుడు .. క్రైస్తవులంతా కొలిచే దేవుడు ఏడుకొండల వేంకటేశ్వరుడు... గోవిందా .. గోవిందా శ్రీశైలంలో మల్లికార్జునుడు .. వారూ వీరూ ఒకటేనా … వేరువేరుగా ఉన్నారా శ్రీశైలంలో మల్లికార్జునుడు .. వారూ వీరూ ఒకటేనా … వేరువేరుగా ఉన్నారా సర్వవ్యాపి నారాయణుడు ... సర్వవ్యాపి నారాయణుడు.. ఎక్కడ జూచిన ఉంటాడు ఆ స్వామి కొరకె నే శోధిస్తున్నా .. తీర్ధాలన్నీ తిరుగుతు ఉన్నా ఆఁ అట్టా రండి దారికి … అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు .. మీరొక్క దెబ్బతో తేల్చారు .. అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు ..మీరొక్క దెబ్బతో తేల్చారు ఎక్కడ బడితే అక్కడ ఉంటే ఇక్కడకెందుకు వచ్చారు ..ఏ రాతికి మొక్కను వచ్చారు అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం