అమ్మ బ్రహ్మ దేవుడో

నేడు  అందాల నటి శ్రీదేవి గారి జయంతి సందర్భంగా గోవిందా గోవిందా చిత్రం  నుండి  ఒక చక్కటి పాట మీకోసం 💐💐💐






పల్లవి: 

హుయ్ ఢముకెయ్ డుం డుం డిగా డిగా సందడి సెయ్ తమాసగా 
అంగ రంగ వైభవంగా సంబరం వీధుల్లో సేరి సివమెత్తంగా 

హుయ్.. దరువేయ్ తధినకా అడుగేయరా అదిలెక్కా 
సామిరంగా సిందాడంగా సీనయ్య యేడుకొండలు దిగికిందికిరాగా 

అమ్మ బ్రహ్మ దేవుడో.. కొంప ముంచినావురో 
ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో 
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు 
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో 
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా 
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా 

చరణం 1: 

కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా 
కనుకిప్పుడు ఎదరున్నది కల్లై పోదుగా 
ఒహొహొ... ఒహొ ఒహో ఒహో. ఒహొహొ.. ఒహొహొ 
కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా 
కనుకిప్పుడు ఎదరున్నది కల్లై పోదుగా 

ఒకటై సిన్నా పెద్దా అంతా చుట్టూ చేరండి… 
తకథై ఆటాడించే చోద్యం చూడండి 

చంద్రుళ్లో కుందేలు సందెల్లో అందాలు 
మన ముంగిట్లో కథాకళి ఆడేనా 

అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా 
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా 
అమ్మ బ్రహ్మ దేవుడో.. అరే కొంప ముంచినావురో 
ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో 

చరణం 2: 

మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి 
తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి 
ఒహొహొ... ఒహొ ఒహో ఒహో. ఒహొహొ.. ఒహొహొ 
మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి 
తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి 

అప్పన్న తనామనా కధం తొక్కే పదానా 
తప్పన్న తనా మనా తేడా లేదోయ్ నా 

తందానా తాళానా కిందైనా మీదైనా 
తలవంచేనా తెల్లారులూ తిల్లానా 

హోయ్.. హోయ్.. హోయ్... 
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా 
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా 
అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో 
ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో 
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు 
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో 
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా 

హుయ్ ఢముకెయ్ డుం డుం డిగా డిగా సందడి సెయ్ తమాసగా 
అంగ రంగ వైభవంగా సంబరం వీధుల్లో సేరి సివమెత్తంగా 

హుయ్.. హుయ్.. హుయ్.. 
దరువేయ్ తధినకా అడుగేయరా అదిలెక్కా 
సామిరంగా సిందాడంగా సీనయ్య యేడుకొండలు దిగికిందికిరాగా



చిత్రం: గోవిందా గోవిందా (1993) 
సంగీతం: రాజ్-కోటి 
గీతరచయిత: సిరివెన్నెల 
నేపధ్య గానం: బాలు, చిత్ర, మాల్గాడి శుభ 

జయ కృష్ణా ముకుందా


ఈరోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఆ శ్రీ కృష్ణుడిని తలుచుకుంటూ శ్రీ పాండురంగ మహత్యం నుండి ఒక చక్కటి పాట మీ కోసం,వీడియో సాంగ్ ని చూడాలంటే ఇక్కడ చూడవచ్చు.






పల్లవి:

హే... కృష్ణా.... ముకుందా.... మురారీ....
జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ...

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి

దేవకి పంట... వసుదేవువెంట....
దేవకి పంట... వసుదేవువెంటా...
యమునను నడిరేయి దాటితివంటా.. ఆ..ఆ
వెలసితివంటా... నందుని ఇంటా
వెలసితివంటా... నందుని ఇంటా
వ్రేపల్లె ఇల్లాయేనంటా...ఆ..

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ... ఈ..
కృష్ణా... ముకుందా... మురారి

చరణం 1:

నీ పలుగాకి పనులకు గోపెమ్మ...
నీ పలుగాకి పనులకు గోపెమ్మ... కోపించి నిను రోట బంధించెనంటా..ఆ..ఆ..
ఊపునబోయీ మాకులకూలిచి....
ఊపునబోయీ మాకులకూలిచి... శాపాలు బాపితివంటా....ఆ...

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి

అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ... చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నా.. అని చెవి నులిమి యశోద.. ఏదన్నా నీ నోరు చూపుమనగా...ఆ...
చూపితివట నీ నోటను... బాపురే పదునాల్గు భువనభాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు... తాపము నశియించి.. జన్మ ధన్యత గాంచెన్..

జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ... ఈ...
కృష్ణా... ముకుందా... మురారి

చరణం 2:

కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ...
కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ... కేళీ ఘటించిన గోపకిశోరా..ఆ..ఆ
కంసాదిదానవ గర్వాపహారా...
కంసాదిదానవ గర్వాపహారా... హింసా విదూరా.. పాపవిదారా...

కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందావిహారీ... ఈ..
కృష్ణా... ముకుందా... మురారి

కస్తూరి తిలకం... లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం... నాసాగ్రే నవమౌక్తికమ్
కరతలే వేణుమ్... కరే కంకణమ్
సర్వాంగే హరిచందనంచ కలయమ్
కంఠేచ ముక్తావళీమ్.. గోపస్త్రీ పరివేష్టితో...
విజయతే... గోపాల చూడామణీ...
విజయతే... గోపాల చూడామణీ...

చరణం 3:

లలిత లలిత మురళీ స్వరాళీ...
లలిత లలిత మురళీ స్వరాళీ... పులకిత వనపాళి... గోపాళీ..
పులకిత వనపాళి...ఈ...
విరళీకృత నవ రాసకేళి...
విరళీకృత నవ రాసకేళి... వనమాలీ శిఖిపింఛమౌళీ
వనమాలీ శిఖిపింఛమౌళీ....

కృష్ణా... ముకుందా... మురారి... జయ గోవింద.. బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి... జయ గోవింద.. బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి..
జయ కృష్ణా... ముకుందా... మురారి..
హే... కృష్ణా.... ముకుందా.... మురారీ.... ఈ.. ఈ..





చిత్రం: శ్రీ పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల

నువ్వా నేనా (2012)

చిత్రం: నువ్వా నేనా (2012)
సంగీతం: భీమస్ సెసిరోలె
సాహిత్యం: భీమస్ సెసిరోలె
గానం: కైలాష్ ఖేర్


సర్ర... సర్ర...
సర్ర... సర్ర...
హే...

వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే
వారెవ్వా హల్లె బెర్రీ ఫోజ్ లే
వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే
వారెవ్వా హల్లె బెర్రీ ఫోజ్ లే
థోడ థోడ చేసింది నన్ను తుఖ్డా తుఖ్డా తుఖ్డా
ఆడ ఈడ యాడ ఇన్నాళ్లు తెల్వలేదు దీని జాడ

సర్ర... ఓ మేరీ దిల్ లుట గయి (4)
లుట గయ ఓ మేరీ దిల్ లుట గయ

ఓ జాబిల్లి పైన నీటి జాడ తెలిసెలె
ఈ పిల్ల మనసులో మాట తెల్వలే
జో లాలి పాట లోన మాయ ఉందిలే
ఈ పిల్ల గాలిలోన మర్మములోతు నాకు చెప్పలే
పీక లోతు ముంచెలే
అంతు పంతులే దీని తంతు వేరులే
కక్కలేక  మింగలేక
పీక్కోలేక ఏమి బాధలే


సర్ర... ఓ మేరీ దిల్ లుట గయి (4)

వయ్యారి బ్లాక్బెర్రీ ఫోన్ లే
వారెవ్వా హల్లె బెర్రీ ఫోజ్ లే

సర్ర...  సర్ర...

ఓ కన్నుల్లో కన్నె ప్రాణి కర్మాగారాలే
నవ్విస్తే కల పాని కారాగారాలె
ఓ నవ్వుల్తో నేరం చేసే నైజం ఉందిలే
పువ్వుల్తో ప్రాణం పోసే నేర్పు ఉందిలే
కొంత అందం ఉందిలే కొంత క్షరం ఉందిలే
కొంత ప్లస్ ఉందిలే కొంత మైనస్ ఉందిలే
సైన్స్ లిన మాథ్స్ లోన చెప్పలేని సత్యం ఉందిలే

సర్ర... ఓ మేరీ దిల్ లుట గయి (8)

పిచ్చి పుల్లయ్య



ఎన్టీఆర్‌ ప్రయోగం...‘పిచ్చి పుల్లయ్య’


 చదువు, సంపద, సంఘ గౌరవంలాంటివి మాత్రమే జీవితానికి ముఖ్యం కావు. సహృదయంతో సాటివారికి సాయపడడం మానవునికి ఉండాల్సి ఉత్తమ గుణం అనే అభ్యుదయ సూక్తి నేపథ్యంగా తీసుకొని ఎన్‌.టి.రామారావు నటించిన చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’. తన సొంత సంస్థ ‘ఎన్‌.ఎ.టి’ ద్వారా సమర్పించిన తొలి చిత్రమిదే. ఈ సూక్తిని పాటించేవాళ్లు మనలో ఎందరో ఉన్నారు. వారు ఎవరికైనా కష్టం వస్తే, తమ ప్రాణం ధారపోసైనా ఆపదలో వున్న వారిని ఆదుకుంటారు. కొంతమంది వీరిని అజ్ఞానులుగా వర్గీకరించి ‘పిచ్చి పుల్లయ్య’ అంటూ హేళన చేయడం కద్దు. ఎన్‌.ఎ.టి. చిత్ర నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ చిత్రం  17−07−1953న విడుదలై నేటికీ 67 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఎన్‌.టి.ఆర్‌ విద్యార్థి దశలోనే
ఎన్‌.ఎ.టి సంస్థకి శ్రీకారం చుట్టారు. ఎన్నో నాటకాలు ఆ సంస్థ ద్వారా ప్రదర్శించారు. 1951లో ఎన్‌.టి.ఆర్‌ చిత్రసీమ ప్రవేశం జరిగింది. తన బంధువు, బాల్య స్నేహితుడైన పుండరీకాక్షయ్య సహకారంతో 1952లో ఎన్‌.టి.ఆర్‌ ఆంధ్రప్రాంతమంతా పర్యటించి ‘బుచ్చిబాబు’, ‘ఆత్మవంచన’, ‘కరువు రోజులు’ నాటకాలను ఎన్‌.ఎ.టి పతాకంపై ప్రదర్శించి దాదాపు లక్షన్నర రూపాయలు రాయలసీమ కరువు నివారణ కోసం ముఖ్యమంత్రి నిధికి విరాళమిచ్చారు. ఎన్‌.ఎ.టి. నాటక సంస్థ పేరిట సినిమా నిర్మాణం చేద్దామని, ఆ చిత్ర నిర్మాణ ప్రొడక్షన్‌ బాధ్యత పుండరీకాక్షయ్యను స్వీకరించవలసిందిగా ఎన్‌.టి.ఆర్‌ ప్రతిపాదించడంతో చిత్ర నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఎన్టీఆర్‌ సొదరుడు త్రివిక్రమరావు నిర్మాతగా మొదటి ప్రయత్నంగా ‘పిచ్చిపుల్లయ్య’ చిత్రం నిర్మితమైంది. పుండరీకాక్షయ్యకు నటన మీద ఆసక్తి ఉండడం చేత ఈ చిత్రంలో ఆయన ఎన్‌.టి.ఆర్‌ స్నేహితునిగా నటించడమే కాకుండా ‘బస్తీకి పోయేటి ఓ పల్లెటూరి వాడా’ అనే నేపథ్య గీతాన్ని కూడా పాడారు. ఈ చిత్రానికి తాతినేని ప్రకాశరావు కథ, స్క్రీప్లే సమకూర్చి దర్శకత్వం వహించారు. ఎం.ఎ.రెహమాన్‌ ఛాయాగ్రహణం నిర్వహించారు. ఈ చిత్రంలో పది పాటలున్నాయి. అన్ని పాటల్నీ, మాటల్ని అనిశెట్టి సుబ్బారావు సమకూర్చారు. తొలిరోజుల్లో ఎన్‌.టి.ఆర్‌ రూమ్‌మేట్‌గా, ప్రాణ స్నేహితునిగా మెలగిన టి.వి.రాజు సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.

కథేంటి?

కథగా కొత్తదేం కాదు. పుల్లయ్య (ఎన్‌.టి.ఆర్‌) పల్లెటూరి యువకుడు. బస్తీలో జమిందారిణి మనోరమాదేవి (ఛాయాదేవి) ఇంట్లో పనికి కుదురుతాడు. జమిందారిణి సవతి కొడుకు చినబాబు (అమరనాథ్‌), భార్య వసంత (జానకి), ఇంటి దాసి కాంతం (కృష్ణకుమారి) ఆ బంగళాలో ఉంటారు. ఎస్టేట్‌ వ్యవహారాలు నిర్వహించే భూపాలరావు (గుమ్మడి) జమిందారిణితో అక్రమ సంబంధం సాగిస్తూ అకృత్యాలకు అలవాటుపడి ఉంటాడు. ఆ ఇంట్లో పుల్లయ్యని అందరూ అభిమానిస్తూ ఉంటారు.. ఒక్క భూపాలరావు తప్ప. వసంత అంటే గిట్టని భూపాలరావు పుల్లయ్యకు, వసంతకు అక్రమ సంబంధం అంటగట్టి సవతి తల్లి ప్రోద్భలంతో చినబాబు చేతుల మీదుగా ఇంట్లోంచి వెళ్లగొట్టిస్తాడు. గర్భిణిగా ఉన్న వసంతను పుల్లయ్య తన ఊరు తీసుకెళ్లి ఆశ్రయమిస్తాడు. వసంత అక్కడే పురుడు పోసుకుంటుంది. భూపాలరావు అకృత్యాలు తెలుసుకొని అతనికి ఎదురుతిరుగుతుంది జమిందారిణి. అది సహించలేని భూపాలరావు ఆమెపై విషప్రయోగం చేస్తాడు. పని మనిషి కాంతం ఉపాయంతో జమిందారిణిని అపాయం నుంచి బయటపడుతుంది. తను చేసిన నేరాలన్నీ పుల్లయ్య మీదికి నెట్టాలని చూస్తాడు భూపాలరావు. అప్పటికి చినబాబుకి నిజాలన్నీ తెలుస్తాయి. భూపాలరావు నేరాలు రుజువై శిక్ష ఖరారవుతుంది. చినబాబు, వసంతలు తిరిగి కలుసుకుంటారు. పుల్లయ్యకి కాంతంతో పెళ్లవుతుంది. స్థూలంగా ఇదీ కథ.

అమాయకంగా ఎన్టీఆర్‌..

సాధారణంగా హుందాగా ఉండే పాత్రలు ధరించే ఎన్‌.టి.ఆర్‌ అమాయకపు పాత్ర వైపు మొగ్గు చూపడంతో ఈ చిత్రానికి కొత్తదనం వచ్చింది. ‘ఆలపించినా అనురాగముతో’ (ఘంటసాల), ‘ఎల్లవేళలందు నీ చక్కని చిరనవ్వులకై’ (ఘంటసాల, బాలసరస్వతి) పాటలు రేడియోలో ప్రసారమైనట్టు చిత్రీకరించారు. ‘అవమానాలకు బలియౌతున్నా’, ‘శోకపు తుపాను చెలరేగిందా’ (ఎం.ఎస్‌.రామారావు) పాటలు నేపథ్యంలో వస్తాయి. అవి హృదయాన్ని హత్తుకొంటాయి. మాధవపెద్ది చేత రెండు తత్వాలు (‘శాంతిని గనుమన్నా’ ఏలానోయీ ఈ విషాదమూ’) పాడించారు టి.వి.రాజు. పాటలన్నీ మధుర దరహాస చంద్రికల్లా సున్నితంగా, శ్రావ్యంగా ఉంటాయి. ఎన్‌.టి.ఆర్‌ వెంట ఒక పొట్టేలు (గొర్రెపోతు) ఉంటుంది. దాన్ని ఎంతో అభిమానించే పుల్లయ్యపై కసితో భూపాలరావు ఆ జీవాన్ని విందు పేరిట నరికిస్తాడు. అప్పుడు ఎన్‌.టి.ఆర్‌ ఆవేదన చెందే దృశ్యం చాలా హృద్యంగమంగా ఉంటుంది. నోరులేని అమాయక జీవిని చంపడం పాపమని ఈ చిత్రంలో చాటే ప్రయత్నం చేశారు ఎన్‌.టి.ఆర్‌. ఆ పొట్టేలు (గొర్రెపోతు), పుల్లయ్య ఇద్దరూ అమాయకత్వానికి, పదిమందికి సాయపడే గుణానికి ప్రతీకలుగా చిత్రంలో చూపారు. ఎవరైనా, అమాయకులు కనిపిస్తే ‘వీడు పిచ్చి పుల్లయ్యలా అమాయకుడురా’ అని చెప్పుకోవడం ఈ సినిమా ద్వారానే ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. ఎన్‌.టి.ఆర్‌ ఆ తర్వాతి కాలంలో చేసిన ‘తోడుదొంగలు’ (1954), ‘జయసింహ’ (1955), ‘పాండురంగ మహాత్మ్యం’ (1957), ‘సీతారామకల్యాణం’ (1961), ‘గులేబకావళి కథ’ (1962) చిత్రాలన్నీ ఎన్‌.ఎ.టి. సంస్థ నిర్మించినవే.

− ఆచారం షణ్ముఖాచారి

ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య(2020)


చిత్రం : ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య(2020)
సంగీతం :  బిజిబాల్
సాహిత్యం : విశ్వ
గానం :విజయ్ ఏసుదాస్



నింగి చుట్టే మేఘం ఎరుగదా..
ఈ లోకం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి… 
చూసింది
ఓసారి సగటుల కనికట్టు…

నింగి చుట్టే.. చిన్ని.. మేఘం యెరుగదా..
ఈ లోకం గుట్టు
మునిలా.. మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…



తమదేదో తమదంటూ.. మితిమీర తగదంటూ..
తమదైన తృణమైన చాలను వరస…
ఉచితాన సలహాలు.. పగలేని కలహాలు..
ఎనలేని కధనాలు.. చోటిది బహుశా…
ఆరాటం తెలియని జంజాటం.. తమదిగా చీకు చింత..
తెలియదుగా…
సాగింది ఈ తీరు.. కథ సగటుల చుట్టూ..

నింగి చుట్టే.. మేఘం ఎరుగదా..ఈ లోకం గుట్టు..
మునిలా, మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో.. జోడి కట్టు..


సిసలైన సరదాలు.. పడిలేచే పయనాలు..
తరిమేసి తిమిరాలు.. నడిచేలే మనస…
విసుగేది దరిరాని.. విధిరాత కదిలేని..
శతకోటి సహనాల.. నడవడి తెలుసా…
చిత్రంగ, కలివిడి సూత్రంగ..
కనపడే ప్రేమ పంతం తమ సిరిగా,
సాగింది ఈ తీరు.. సగతుల కనికట్టు…

నింగి చుట్టే.. చుట్టే..
మేఘం ఎరుగదా.. ఎరుగదా ఈ లోకం గుట్టు
మునిలా.. మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…

సవారి (2020)




చిత్రం : సవారి (2020)
సంగీతం :  శేఖర్ చంద్ర 
సాహిత్యం : కాసర్ల శ్యాం 
గానం :స్పూర్తి


నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా

ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా
నువ్వే నాకు సొంతమై నా ఏకాంతమంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా

నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా

ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా

నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను
కన్ను కన్ను కలిసే వేళా మూగై పోతాను

మధురముగా ప్రతి క్షణమే
జరగనిదే నేను మరువడమే

ఓ ఐ యాం ఫీలింగ్ హై నీ ప్రేమల్లోనే
ఓ ఐ యాం ఫ్లాయింగ్ నవ్ నీ వలెనే

ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా
నువ్వే నాకు సొంతమై నా ఏకాంతమంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా

నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా

ఎంతో ఆలోచిస్తూ ఉన్న ఏమి అర్ధం కాదు
అంత నీవే అయిపోయాక నాకే నే లేను
చిలిపితనం తరిమినదే జత కలిసే చిరు తరుణమిదే

ఓ ఐ వాన్నా సే నా పాటల్లోనే
ఓ ఐ వాన్నా స్టే నీతోనే

ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా
నువ్వే నాకు సొంతమై నా ఏకాంతమంత్రమై
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా

నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపావా


********* *********** ******************

చిత్రం : సవారి (2020)
సంగీతం :  శేఖర్ చంద్ర 
సాహిత్యం : కాసర్ల శ్యాం 
గానం :రాహుల్ సిప్లిగంజ్


నీ కన్నులు నా.. దిల్లులో నా..టుకున్నయే
పిల్లో
నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నయే
ఒసేయ్
ఓ పయ్యల గిరిగిరా చుట్టురా తిరుగుతున్నాయే

అరెరే సిన్నదాన యమ కిర్రాక్ ఉన్నావే
ఎనకే నేను రానా నా గిరాకి నువ్వే
నీ సెకలు తై తక్కలు కిక్కే ఎక్కిందే
పిల్ల నా అఖలు దెబ్బకు సుక్కల పక్కన నక్కిందే



చార్మినారు మీదనే వాలిన పావురమై
ఏయ్
తీనుమారు చేస్తున్న బోనల్లో పోత్రజై
చోడ్ దియా ఖాన పీన తేరే ఖయాల్ మెయిన్
జీనా య మర్న తేరే బిన
నా వల్ల అవ్వదులే
నా అంగికి ఓ అత్తరు కొట్టినట్టుందే
అరె నా లున్గికి చమతుల్ అత్కవెట్టినట్టుందే

పిల్లో

నా గుర్రన్కి మేకప్ ఏసీ తెస్తనే భారాత్కే
ఓల్డ్ సిటీ గల్లిలో తెస్తానే చాందిని రాతే
దోస్తులందరికి దావతిస్తా
మన షాది లోన
ముక్క సుక్క అన్ని వెడత
డిన్నర్ల డిజే వెడత
నీ పక్కన నే…నున్నటు తలుసుకుంటుంటే
అరె కలకత్తా మీనాక్షి పాను నోట్ల వెట్టినట్టుందే

నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నయే
ఒసేయ్
ఓ పయ్యల గిరిగిరా చుట్టురా తిరుగుతున్నాయే



అరెరే సిన్నదాన యమ కిర్రాక్ ఉన్నావే
ఎనకే నేను రానా నా గిరాకి నువ్వే
నీ సెకలు తై తక్కలు కిక్కే ఎక్కిందే
పిల్ల నా అఖలు దెబ్బకు సుక్కల పక్కన నక్కిందే

వి (V)(2020)



చిత్రం : వి (V) 
సంగీతం :తమన్ ఎస్
సాహిత్యం :  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం :అమిత్ త్రివేది, శష తిరుపతి

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా…
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా…
అంతగా కవ్వింస్తావేం గిల్లి..
అందుకే బందించేయ్ నన్నల్లి..
కిలాడీ కోమలీ… గులేబకావళీ…
సుఖాల జావళీ.. వినాలి కౌగిలీ…
మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా…
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా…

ఓ అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా..
హ.. బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా..
పూలనావ.. గాలితోవ.. హైలో హైలెస్సో…
ఓ.. చేరనీవా చేయనీవా.. సేవలేవేవో….
ఓ… మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా…
ఓ.. వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా…


మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇదీ..
మనువుతో మొదలయే మరో జన్మాన్నై పుట్టే వరమిదీ..
నీలో ఉంచా నాప్రాణాన్ని.. చూసి పోల్చుకో..
ఓ.. నాలో పెంచా నీ కలలన్నీ.. ఊగనీ ఊయల్లో…

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా…
ఓ.. వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా…
అంతగా కవ్వింస్తావేం గిల్లి..
అందుకే బందించేయ్ నన్నల్లి..
కిలాడీ కోమలీ… గులేబకావళీ…
సుఖాల జావళీ.. వినాలి కౌగిలీ…


************** ***************** ***********


చిత్రం : వి (V) 
సంగీతం :తమన్ ఎస్
సాహిత్యం :  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం :శ్రేయ ఘోషల్

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
ఏం చేస్తున్న నా ధ్యాసంతా నీ మీదే తెలుసా

నిను చూడనిదే
ఆగనని ఊహల ఉబలాటం
ఉసి కొడుతుంటే

వస్తున్న వచ్చేస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనబడకున్నా
ఉవ్వెత్తున ఉరికొస్తున్న

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా



చెలియా చెలియా నీ తలపే తరిమిందే
అడుగే అలలయ్యే ఆరాటమే పెంచనా

గడియో క్షణమో ఈ దూరం కలగాలే
ప్రాణం బాణంలా విరహాన్ని వేటాడగా

మురిపించే ముస్తాబై ఉన్నా
దరికొస్తే అందిస్తాగా ఆనందంగా

ఇప్పటి ఈ ఒప్పందాలే
ఇబ్బందులు తప్పించాలే
చీకటితో చెప్పించాలే
ఏకాంతం ఇప్పించాలే


వస్తున్న వచ్చేస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనబడకున్నా
ఉవ్వెత్తున ఉరికొస్తున్న

చూస్తున్న చూస్తూనే ఉన్న కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న మనసుకు వినిపించదు తెలుసా


ఎస్‌.వి.రంగారావు




రాక్షస స్త్రీల నడుమ చిక్కిన జానకి.....పులుల నడుమ చిక్కిన లేడి వలె ఎంతయో దు:ఖించెను. మానవుడు కూడా ఒక జంతువే! ఇతర జంతువులకును....మానవునకు గల బేధము జ్ఞానము.... రామాయణ పురాణం చదవడంలో ఉన్న సూర్యకాంతమ్మ గారు...ఎస్.వి.రంగారావు రావడం గమనించలేదు. నాయాల్ది....అదేగా లేనిది?....అన్నాడు రంగారావు. ఆ...వచ్చారా? ఆ...ఏవిటి ఆ దసరా మామూళ్ళ వాళ్ళకి ఎంతిచ్చారు?...సూర్యకాంతమ్మ. నేనా....నాదగ్గరేముందే ఇవ్వడానికి?..... ఏమీ ఇవ్వకపోతే....వాళ్ళంతా అలా జేజేలు కొట్టుకుంటూ ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే...నేన్నీకెలాఉన్నా....ఊళ్ళో వాళ్ళందరికీ ప్రెసిడెంటునే...ఎవడైనా కొట్తాడు జేజేలు....నువ్వు తప్ప. ఆ...ఈ గొప్పలకేం గానీ...అసలేమిచ్చారో చెప్పండి, 5 రూపాయలిచ్చారా? 5 రూపాయలా?.....ఛ.... పొనీ...పదిచ్చారా?..... ఆ...ఇచ్చే ఉంటారు ప్రెసిడెంటు గారు. నిజం చెప్పండి. ఆ...ఇచ్చాను.....ఇస్తే?.... ఇస్తే ఏముంది?...పస్తే!....ఆ పది రూపాయలు చెల్లుబడి అయ్యే దాకా...చిలగడ దుంపలు తిని...నీళ్ళు తాగి పడుండాల్సిందే!...అంతే! ఒసే...ఈ రోజు పండగే! ఊళ్ళో వాళ్ళకు పండగ...అయ్యగారికి ఎండగ! ఏం చేస్తాం?.... అది కాదే ..రోజూ పెట్టే ఆ పచ్చడి మెతుకులన్నా?..... ఎందుకూ! ఆ జేజేలతో కడుపు నిండి పోలా? మీకు బయట పొగడటమేగా కావాల్సింది! ఇంట్లో ఎలా ఉంటేనేం? ఏం తింటేనేం?... బయట పల్లకీల మోత....ఇంట్లో ఈగల మోత! నాయాల్ది....ఏనాడు జేసుకున్న ఖర్మో!...కానీవే...అట్టాక్కానీ.....
ఇద్దరు మహా నటులు....ఎస్.వి.రంగారావు గారు &, సూర్య కాతం గారు నటించిన దసరా బుల్లోడు లోని ఈ సీన్లో ఇద్దరూ అలవాటుగానే జీవించారు. **************** ఒరేయ్ బాబూ...ఏమిరా ఇలా చేశావ్...నీ చిన్ని చేతుల్తో నానోట్లో ఇంత అన్నం పెట్టే వాడివి కదరా! తిరిగి నాచేత్తో...నీనోట్లో ఇంత మట్టేస్తున్నారా...బాబూ...... ఈ డైలాగ్....ఆయన యాక్షన్ చూస్తూ... అంతవరకూ ఆయన మీద కారాలు మిరియాలు నూరిన వారంతా....మ్రాన్పడిపోయారు!* అసలా షాట్ కోసం అంతా సిధ్ధం చేసుకున్నాక....అసలు ఉండవలసిన పాత్రధారి ఆయన ఎంతకీ రాలేదు! కృష్ణ, గుమ్మడి, నిర్మాత ప్రభాకర్ రెడ్డి....అందరూ అసహనంగా వెయిట్ చేసి చేసి.... ఎవరో లీడ్ ఇస్తే...చివరకు...పాండీ బజార్లో హమీబియా హోటల్ లో ఓ చిన్న రూం లో మందు కొట్తూంటే ఒప్పించి తీసుకొచ్చారు! అందరికీ...కోపంగానే ఉంది. కానీ షాట్లో ఆయన నటనకు ముగ్ధులైపోయి.... మాటలు మరచిపోయారు! ****************** డాడీ.....డాడీ.....మీరింక తాగనని ఒట్టేయండి డాడీ..... అని కన్నీళ్ళతో అడుగుతున్న....జమున కేసి....చూస్తూ.... షాట్ అయిపోయిందిరా....ఇంకా యాక్ట్ చేస్తున్నావా...బాగా చేశావురా...బంగారు..... అంటూ చేతులు విడిపించుకుని ప్రక్కనే కుర్చీలో కూలబడ్డాడాయన. మీకు తెలుసు....నాకూ తెలుసు...ఇది యాక్షన్ కాదని....దయచేసి మీరు త్రాగడం మానేయండి డాడీ..... జమున ఏడుస్తూ అడుగుతుంటే...... నాకేం కాదురా...నా బాడీ ఉక్కు...చూస్తున్నావు గా ఎంత హెల్దీగా ఉన్నానో పద బంగారూ....వెళ్ళు.కాసేపు...ఇలా నిద్ర పోవాలి... అంటూ జమునను షూటింగ్ స్పాట్ నుండి పంపేశారాయన! చదరంగం.....మూవీ... ఆయనే నిర్మాత - దర్శకుడూనూ! ******************* 50 ఏళ్ళ జీవితంలో.... నూజివీడు లో స్కూలింగ్.... మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందూ కాలేజీలో బి.ఎస్.సి. డిగ్రీ చదవడం.... షేక్స్ పియర్ డ్రామాలో షైలాక్ రోల్ కాలేజ్ లో వేసి మెప్పించడం.... నటన....డ్రామాలు ఓ పాషన్ గా మారడం.... డిగ్రీ అయ్యాక ....ఫైర్ స్టేషన్ లో ఉద్యోగం.... అది చేస్తూనే...నాటకాలు ఆడుతూ ఉండడం.... అది తెలిసే....బంధువైన బి.వి.రామానందం గారు....1946లో సేలం పిలిపించిడం.... ఉద్యోగానికి బై చెప్పి....వరూధిని...మూవీలో నటించడం..... మొదట కెమెరా ఫేస్ చేసినప్పుడు....బాగా భయపడ్డా.... అది కనిపించకుండా...ఏదో వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోవడం..... ఆ సినిమా ఫ్లాప్ కావడం....ముఖం చూపించలేక.... మళ్ళీ జెమ్షెడ్ పూర్ లో టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ గా చేరడం....

1947..డిసెంబర్ 27న....లీలావతితో పెళ్ళి...... ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి ఆయనకు. వాలుకుర్చీలో కూర్చుని సింహావలోకనం చేసుకుంటుంటే. అసలు తనేం....తాగుడుకు అంత బానిసేం కాదు! ఏదో అప్పుడప్పుడు. అసలు బాటిల్ ముట్టకుండా కొన్ని నెలలున్న సందర్భాలూ ఉన్నాయి! కాకపోతే....పులివేట, పేకాట....ఇవి నా హాబీలు. అంతే... అయినా మనిషన్నాక ఏబలహీనతలూ లేకుండా ఎలా ఉంటారు! నేనేం బుధ్ధుడ్ని కాదే! ఆ తరువాత...మళ్ళీ మద్రాస్ లో కాలుపెట్టా 1948లో.... సినిమా పాత్రల మీద మోజు పోలేదు మరి. ఫ్రెండ్స్ అంతా ప్రౌత్సహించారు.నిర్మాతలు కాదు! వరూధిని హీరోవా బాబూ....నువ్వేనా నాయినా?...అబ్బే!....అని చప్పరించేవారు. ఎక్కే గుమ్మం...దిగే గుమ్మం.ఎవ్వరూ చాన్స్ ఇవ్వలేదు. చివరికి మనదేశం(1949)లో ఓ చిన్న వేషం, పల్లెటూరిపిల్ల(1950)లో మరో వేషం....దొరికాయి. ఆ తరువాత షావుకారు(1950)లో సున్నం రంగడి పాత్ర తో బ్రతుకు మలుపు తిరిగింది. **************** నేను నిన్న ఓ రిక్షా వాడిని చూశాను. వాడి మాట, నడిచే తీరు, బీడీ త్రాగే స్టైలు....అవీ చూసి నేనో స్టైల్ అనుకున్నా. మామూలు రౌఢీలా అరుపులు, కేకలూ కాకుండా...అని ఎల్.వి.ప్రసాద్....చక్రపాణులకు చెప్పి....చేసి చూపించా. బాగుంది రంగారావ్....ఇలాగే చెయ్...వెరైటీగా ఉంది...అని ప్రోత్సహించారు. ఆ మూవీతో రామారావు తో బాటు సున్నం రంగడిగా నాకూ పేరొచ్చింది. ఇక పాతాళభైరవి లో నేపాళ మాంత్రికుడి రోల్. చాలా టఫ్ కాంపిటీషన్ తో నాకొచ్చింది. షైలాక్ లా చేసి చూపించా. ఓ పిల్లి గడ్డం తో...ఆ నడక....పింగళి గారి స్పెషల్ డైలాగ్స్....నా ఆహార్యం.... ఆ పాత్ర తో ఇక వెనుకకు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఓవర్ నైట్ రామారావు తో బాటు నాకూ స్టార్ హోదా వచ్చేసింది. ఇక పెళ్ళి చేసిచూడులో ధూపాటి వియ్యన్న... ఎటో చూస్తూ మాట్లాడటం......చీటికి మాటికీ కళ్ళు చికిలిస్తూ.. మధ్య మధ్య లో ముక్కడం...నెత్తిన చేతులు పెట్టుకోవడం.... ఇలాంటి మేనరిజం లతో మహా బాగా పండిందాపాత్ర. ఇలా కూడా చెయ్యొచ్చన్న మాట నటన.... అని అందరూ ఆశ్చర్యపోయారు! ఇక వరుసగా....ఎన్ని పాత్రలు... **************** బంగారు పాపలో కోటయ్య పాత్ర, అక్బర్ పాదుషా, దక్షుడు,భోజుడు, ఘటోత్కచుడు,బాణాసురుడు, మహోదరుడు, భస్మాసురుడు, హరిశ్చంద్రుడు,మయాసురుడు, కీచకుడు,రావణుడు, నరకాసురుడు,,యముడు, దుర్యోధనుడు,ఉగ్రసేనుడు, కంసుడు,తాండ్ర పాపారాయుడు, హిరణ్య కశిపుడు.... ఇలా ముఖ్యంగా రాక్షస రాజుల పాత్రలకు వేమూరి గగ్గయ్య తరువాత....
అంతటి పేరు నాకే వచ్చింది! ఇక తండ్రి, మామ, పెద్దనాన్న, అన్న పాత్రలూ సరేసరి. మద్రాస్ లో చదువుకోవడం వల్ల వంట బట్టిన తమిళం.... ఉభయభాషా ప్రవీణుడ్ని చేసి....తమిళం లో కూడా ఎన్నో అద్భుతమైన పాత్రల్ని పోషించగలిగాను.... తమిళుడే....ఇతను అనిపించేలా! నాకొచ్చిన అవార్డులు కూడా తమిళంలోనే ఎక్కువ! బళ్ళారి రాఘవ గారి నటన....వేమూరి గగ్గయ్య గారి నటన నచ్చేది నా చిన్నప్పుడు. ఈ రంగారావ్ స్టార్ కావడానికి వెనుక ఎంత మథన, కృషి ఉన్నాయో....అందరికీ ఎలా తెలుస్తుంది!? స్టార్ అయ్యాక...ఎన్నెన్నో పాత్రలు వచ్చాయి. వచ్చినవన్నీ రంగారావు ఒప్పుకోలేదు. ఒప్పుకుని...తప్పుకున్నవీ ఉన్నాయి! రంగారావుని భరించలేం అన్నవాళ్ళు... ఆ పాత్రకు రంగారావే తగినవాడని అనిపించినా, వేరే నటుల్ని పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి! ట్రబుల్ సం ఆర్టిస్ట్ అన్న ముద్ర కూడా పడింది! మూడ్ బాగుండాలి అంతే. మూడ్ బాగుండక పోతే...చిన్నపిల్లాడు స్కూల్ ఎగ్గొట్టినట్టు....షూటింగ్ ఎగ్గొట్టేవాడ్ని! ఒక్కోసారి షూటింగ్ మధ్యలో మూడ్ బాలేక పోతే విగ్గు మీసం విసిరేసి వెళ్ళిపోయేవాడ్ని కూడా! ఏం చేసినా...నా నటనతో కొట్టుకొచ్చేశాను. కళ్ళతోనే నటించడం...కంఠంలోని మాడ్యులేషన్స్ చూసుకోవడం....అంతే! నటన...అతి సహజమే నాకు! ************** ఎందుకు త్రాగుతున్నానంటే....ఎన్నో కారణాలు...ఏవో అందరికీ ఉన్నట్లే...ఏవో సాకులు.... భార్య లీలావతి తో విబేధాలు...కోపాలు, తాపాలు... కుటుంబమన్నాక...ఎన్నో ఉంటాయిగా. ముగ్గురు పిల్లలతో మురిపాలూ ఉంటాయి. పండగ పబ్బాలతో బాటు....ఫ్రెండ్స్ తో పార్టీలు ఉంటాయి..... మనస్సులో ఎక్కడో వెలితీ ఉంటుంది! నా మధుసేవ కూడా చిత్రంగా ఉండేది! పడితే విరామం లేకుండా...ఒకటే పట్టు. ఆగిపోతే అంతే! మళ్ళీ ఎప్పుడో! ఆ పట్టులో ఉన్నప్పుడే కాల్షీట్లు గల్లంతయ్యేవి! నన్న భరించడం కష్టం....అన్నది అలాంటప్పుడే వస్తుంది. అయినా సెట్టు మీద కొచ్చాక....నన్ననే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఓపులి లా...సింహం లా కనిపించేవాడ్నేమో మరి! అయినా నా శరీరం ఉక్కు....నాకేం కాదు.... ****************** బాపు అందరి ఆర్టిస్టులతో బాటు... నా కేరికేచర్ వేస్తే...రమణ కేప్షన్ వ్రాశాడు. నాకే నవ్వొచ్చింది. క్లిష్టపాత్రల్లో...చతురంగారావు, దుష్ట పాత్రల్లో...క్రూరంగా రావు, హడలగొట్టే...భయంకరంగారావు, హాయిగొలిపే...టింగురంగారావు, అలరించే....విలాసంగారావు, రొమాన్సు లో(చేయిస్తే)..పూలరంగారావు, మనిషి...మధు మధురంగారావు, మాటల్లో...మహ చమత్కారంగారావు, కథ నిర్బలమైతే...హావభావాలు పాత్రపరంగారావు, కళ్ళక్కట్టినట్టు కనపడేది...ఉత్తి యశ్వీరంగారావు, ఆయన శైలీ ఠీవీ....అన్యులకు సులభంగారావు, ఒకొక్కసారి డైలాగుల్లో మాత్రం...యమ కంగారంగారావు! ఇలా సాగుతూనే నిర్మాతగా కూడా మారి 4 మూవీస్ తీశాను. నాదీ ఆడజన్మే, సుఖదు:ఖాలు, చదరంగం & బాంధవ్యాలు. ఆ చివరి రెండు మూవీస్ నేనే డైరెక్ట్ చేశాను. రెండూ నంది అవార్డుల్ని కూడా సంపాదించాయి.... ఇక ఇంతకంటే కావలసిందేముంది! **************** ఒక వ్యక్తి గురించి వ్రాస్తున్నప్పుడు....మహోన్నత నటుడే కావచ్చు...ఉన్న విషయం ఉన్నట్లు వ్రాయడం....ఉత్తమం. చిత్రసీమలో అందరికీ తెలిసిన బంధమే....ఎస్.వి.రంగారావు - ఛాయాదేవిల సంబంధం. ఆమె ఆయనకు టింగు అయితే....ఆయన ఆమెకు రంగడు. టింగు రంగడు అని ఓ నిక్ నేం కూడా ఉండేది మన విశ్వ నట చక్రవర్తికి. మొదటినుండి తోడు ఉన్నాయనను కాదని....రంగారావు గారి సాన్నిహిత్యం కోరుకుంది ఛాయాదేవి. తను చేస్తున్న ఫైనాన్స్ బిజినెస్ కు....ఎస్.వి.ఆర్. పెద్ద అండ. అప్పు తీసుకున్న వారెవరైనా....ఎస్.వి.ఆర్. కు భయపడి....వడ్డీలు...అసలు ...చెల్లింపులు బాగా సాగేవి. ఎస్.వి.ఆర్. మరణానంతరం....ఛాయాదేవి ఒంటరి తనం తో నెగ్గుకు రాలేక పోయింది. తన సొంత బంగ్లా లోనే...ఓ రూం లో అద్దె కుండే పరిస్థితి తెచ్చుకుంది. త్వరలోనే ఆమె చరిత్ర కూడా ముగిసింది! అరే...ఎక్కడ ఎస్.వి.ఆర్?....ఎక్కడ ఛాయాదేవి?.... ఇద్దరూ ఇక్కడే. మేకప్ తీసేసి.....పేకప్ చెప్తే.......నటీ నటులందరూ....మామూలు మనుషులే! ప్రతి మనిషికి...ఉండే బలహీనతలు...వాళ్ళకూ ఉంటాయి. జీవన్నాటకం లో...ఎవరికేం.....వెలితి ఉన్నా....దానికి ఆసరా ఇచ్చే వారికోసం మనస్సులు...వెతుకుతుంటాయి. అది దొరికినట్లనిపిస్తే...అదో బంధమౌతుంది. అంతే! ఒకరి ఆసరా ఇంకొకరికి కావాలి. ఇందులో ఎవ్వరినీ తప్పు పట్టలేం. వారి పరిస్థితులు వారికే తెలుస్తాయి గానీ ఇతరులకు కాదుగా. *************** విశ్వనట చక్రవర్తి గా బిరుదు పొందిన కీ.శే. సామర్ల వెంకట రంగారావు (ఎస్.వి.రంగారావు)...... మళ్ళీ మరో రంగారావు లాంటి నటుడు ఇక పుట్టడు! ఒకవేళ అంతకు మించిన నటుడు ఎవరు పుట్టినా... ఎంతటి వాడు పుట్టినా రంగారావు రంగారావే! ఆయన స్థానం ఆయనదే!
ప్రపంచం గుర్తించిన తెలుగు నటుల్లో రంగారావు ఒకరు. 1963 లో జకార్తా లో నర్తనశాల లోని కీచక పాత్రతో... ఆఫ్రో- ఏషియన్...బెస్ట్ యాక్టర్ అవార్డ్ కైవశం చేసుకుని విదేశీయుల మన్నన లను పొందినా... 4- రాష్ట్రపతి అవార్డులు కూడా....తమిళ మూవీలే అందించాయి! 2- నందులు- చదరంగం(1967)& బాందవ్యాలు(1968).. విశ్వనట చక్రవర్తి.... నటసార్వభౌమ.... నటశేఖర.... నట సింహ..... ఇలా ఎన్నో బిరుదులున్నా..... ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులేమీ రాలేదు అనితరసాధ్యమైన నటనాగ్రేసరుడికి! ఆయన పేరుతో ఓ స్టాంప్ రిలీజ్ చేసింది. అంతే. గుండెపోటు....56 ఏళ్ళకే తన జీవన నాటకానికి తెర దించేస్తుందని... రంగారావు గారు అసలు ఊహించిఉండరు. వారసులు..నటులయ్యారా అంటే....ఎస్.వి.ఆర్. మనవడు...అంజలీదేవి మనవరాలితో ఓ మూవీ అనుకున్నారప్పట్లో. ఎందుకనో మరి అది ఆగిపోయింది! *************** నటుడిగానే కాక... కథా రచయితగా కూడా రాణించాడు. ఆయన కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి వంటి పత్రికలలో 1960-64 మధ్యకాలంలో ప్రచురింపబడ్డాయి. వేట, ఆగష్టు 8, పసుపు కుంకుమ, ప్రాయశ్చిత్తం, విడుదల, సంక్రాంతికి & సులోచన అనే ఏడు కథలు మాత్రం లభ్యమౌతున్నాయి.ఈ కథలతో ఎస్.వి.రంగారావు కథలు అనే పుస్తకం వెలువడింది.1974 ఫిబ్రవరిలో హైదరాబాదులో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చాడు. వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు.
నటుడిగా ఆయన చివరి చిత్రాలు చక్రవాకం (1974), యశోద కృష్ణ (1975). యశోద కృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ ఈ లోపే 1974 జూలై 18వ తేదీన మద్రాసులో మళ్ళీ గుండెపోటు రావడంతో...చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశారు. ************** రంగారావు గారి శతజయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధ్యక్షతన... 2018 జూలై 3లో హైదరాబాదులో జరిగాయి. ఈ ఉత్సవాలను 2018 జూలై 3 నుంచి జూలై 8 వరకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, సారథి స్టూడియోస్ కలిపి సంయుక్తంగా నిర్వహించాయి. 2018 జూలై 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. జీవించింది 56 ఏళ్ళే అయినా(3-7- 1918 ------18-7-1974) నటించింది అన్నిభాషల్లో కలిపి.... 260 చిత్రాలే అయినా....ప్రజల గుండెల్లో....నటుడిగా సుస్థిర స్థానం కీ.శే. సామర్ల వెంకట రంగారావు గారిది. ఈ సంవత్సరం జూలై 3వ తేదీకి... 102 వసంతాలు నిండాయి. కీ.శే. ఎస్.వి.రంగారావు గారికి....స్మృత్యంజలి ఘనంగా సమర్పిస్తూ...వారి నటనా వైభవాన్ని కాస్త రుచిచూద్దాం. 🌹🌿🌹🌿🌹🌿🌹
విశ్వనట చక్రవర్తి ...ఎస్.వి.ఆర్.... నూరు వసంతాల సందర్భంగా వీడియో.......
భలేదొరలకు దొరకని సొగసు......షావుకారు.
పాతాళభైరవి.......తాళలేనే...నే తాళలేనే...భామలారా..ఓయమ్మలారా.
వగలోయ్ వగలు...తళుకు బెళుకు వగలు.....
పెళ్ళిచేసి చూడు.......ధూపాటి వియ్యన్న పాత్ర.
తాధిమి తకధిమి తోలుబొమ్మ......బంగారు పాప.
ధిమికిట ధిమికిట వాద్య మృదంగ........సంఘం.
సంఘం.............ఎస్.వి.ఆర్. అద్భుత నటనం.
వివాహభోజనంబు.....మాయాబజార్.
చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ....మాయాబజార్.
భవానీ శంకరం(ఎస్.వి.ఆర్.), బిల్వ మంగళుడు(ఎన్.టి.ఆర్.) &చింతామణి(భానుమతి)......చింతామణి.
హరిశ్చంద్ర............కాటి పద్యాలు
పోవుచున్నాడే...నా విభుని జీవములను గొని......సతీ సావిత్రి.
అనార్కలి.
రాజశేఖరా...నీపై మోజు తీరలేదురా
సిపాయి బిరాన రావోయి....
మంచిమనసులు..........ఎస్.వి.ఆర్. నట విశ్వరూపం.
ఎవరో ఏఊరో ఎవరు కన్నారో........ఆత్మబంధువు.
కాలమంతా మనది కాదు...ఎదురు తిరుగునురా.......గాలిమేడలు.
భక్త ప్రహ్లాద......హిరణ్యకశిపుడి గా అనితర సాధ్యమైన నటన.
నర్తనశాల.
సఖియా వివరించవే......
దరికి రాబోకు రాబోకు రాజా.....
సలలిత రాగ సుధారస సారం.....
నా రాణి కనులలోనే ఆనాటి.......చిలక - గోరింక.
ఆనతి సేయవయా...స్వామీ.......సతీ సక్కుబాయి.
విన్నారా విన్నారా ఈ వింతను విన్నారా......సంబరాల రాంబాబు.
దానం ధర్మమే...వేదాల నీతి సారం........సతీ సుమతి.
మచ్చరమున మరియంబుధిలో.......సతీ సుమతి.
రసికరాజ మణిరాజిత సభలో.........మహాకవి కాళిదాసు.
ఎవ్వడు నిను మించువాడు.......సంపూర్ణ రామాయణం.
మంచితనానికి ఫలితం వంచన..........బాంధవ్యాలు.
ధనమేరా అన్నిటికీ మూలం.......లక్ష్మీ నివాసం.
జయ జయ జయ శారద.......మహాకవి కాళిదాసు.
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం......తాత- మనవడు.
ఇదుగో దేవుడు చేసిన బొమ్మ....పండంటి కాపురం.
ఏమిటో ఈ లోకమంతా........తాత - మనవడు.
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ.......పండంటి కాపురం.
విన్నారా అలనాటి వేణుగానం........దేవుడు చేసిన మనుషులు.
ఓ బాబు..మా బాబు..నీకన్న మాకు పెన్నిధి......పాపం పసివాడు.
బాబూ వినరా....అన్నాదమ్ముల కథ ఒకటి...పండంటి కాపురం.
వచ్చామే నీకోసం.......మొనగాళ్ళకు మొనగాడు.
విజయమిదిగో లభించేను.......మోహినీ భస్మాసుర.
చంటిబాబు...ఓ బుజ్జిబాబు......అందరూ దొంగలే.
ఎత్తుకుంటావా........కత్తులరత్తయ్య.
వీణలోనా తీగలోనా......చక్రవాకం.
- కె.వి.ఎస్. ప్రసాద్.