అగ్గి బరాట (1966)




చిత్రం : అగ్గి బరాట (1966)
సంగీతం : విజయా కృష్ణమూర్తి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల

పల్లవి :

ఉమ్మ్.. ఉమ్మ్.. ఉమ్మ్.. ఉమ్మ్మ్ ఉమ్మ్...
ఉమ్మ్.. ఉమ్మ్.. ఉమ్మ్.. ఉమ్మ్మ్ ఉమ్మ్... 

పలుకవే నా రామచిలుకా... ఆ.. ఆ..
పలుకవే నాలోన పన్నీరు తొణకగా  
 
పలుకవే నా రామచిలుకా... ఆ.. ఆ..
పలుకవే నాలోన పన్నీరు తొణకగా

చరణం 1 :

పంజరములో నీవు బంధీగ ఉన్నావు....
పంజరములో నీవు బంధీగ ఉన్నావు....
బంగారు మేడలో పవ్వలించితి నేను...
బంగారు మేడలో పవ్వలించితి నేను...

ఈ రేయి తీరెనా ఎగిసిపోయేములే
గగనాల నీడలో తరగిపోయేములే

పలుకవే నా రామచిలుకా... ఆ.. ఆ..
పలుకవే నాలోన పన్నీరు తొణకగా

చరణం 2 :

నా కంటి పాపలో నవ్వులొలికేదెవరో...
నా కంటి పాపలో నవ్వులొలికేదెవరో....
నా కలల దారిలో నడచిపోయేదెవరో...
నా కలల దారిలో నడచిపోయేదెవరో...

ఇంకెవరు కాదులే ఇలలోని నెలరాజే...
నమ్మవే ఓ చెలి... నాలోని వలరాజే

పలుకవే నా రామచిలుకా... ఆ.. ఆ..
పలుకవే నాలోన పన్నీరు తొణకగా

No comments:

Post a Comment