గుడిగంటలు (1965)

చిత్రం : గుడిగంటలు (1965)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : నార్ల చిరంజీవి
నేపధ్య గానం : జానకి 

పల్లవి :

నీ కనుదోయిని నిద్దురనై...
నీ కనుదోయిని నిద్దురనై... మనసున పూచే శాంతినై
నీ కనుదోయిని నిద్దురనై... మనసున పూచే శాంతినై

యడబాయని నీడగా తోడవుతా... నీ కలలకు నేనే జోడవుతా ...
నీ కనుదోయిని నిద్దురనై... మనసున పూచే శాంతినై

చరణం 1 :

నీ కలలన్నీ నావోయి...  నా యవ్వన రాగం నీదోయి
వలపుల గుడిలో గంటలు మ్రోగే
జంటగరమ్మని పిలిచాయి... ఇరువునీ పిలిచాయి

నీ కనుదోయిని నిద్దురనై... మనసున పూచే శాంతినై

చరణం 2 :

కాటుక కళ్లే కానుకగా...  నా బుగ్గలసిగ్గే హారతిగా
హృదయము నీకె అంకితమోసగే
నీ బిగికౌగిలి చేరెదను... ఒరిగెదను... కరిగెదను...

నీ కనుదోయిని నిధ్ధురనై...  మనసున పూచే శాంతినై
యెడబాయని నీడగ తోడవుతా...  నీ కలలకు నేనే జోడవుతా
ఆహాహాహాహ ఆహాహ హాహాహహ ఆ ఆహాహహా .... 

************* *********************** ***************** ******************** ************************************
చిత్రం : గుడిగంటలు (1965)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల

పల్లవి :

దూరాన నీలిమేఘాలు... నాలోన కొత్త భావాలు
పూచేను కోటి మురిపాలు... తొంగి చూసేను కన్నె సరదాలు

దూరాన నీలిమేఘాలు... నాలోన కొత్త భావాలు
పూచేను కోటి మురిపాలు... తొంగి చూసేను కన్నె సరదాలు
ఒహొహొ హొయ్...  ఒహొహొ హొయ్... ఓఓ...ఓ...ఓ...ఓ

చరణం 1 :

నల్లని జడలో సింగారించగ నవ్వుల పువ్వులు కోసితిని
నల్లని జడలో సింగారించగ నవ్వుల పువ్వులు కోసితిని
నచ్చిన ఊహల నాదస్వరానికి నా జడ నాట్యము చేసినది

దూరాన నీలిమేఘాలు... నాలోన కొత్త భావాలు
పూచేను కోటి మురిపాలు... తొంగి చూసేను కన్నె సరదాలు
ఒహొహొ హొయ్... ఒహొహొ హొయ్... ఓఓ... ఓ...ఓ...ఓ

చరణం 2 :

తేనెలు తాగుతు గాలుల తేలుతు... తుమ్మెద ఝుమ్మని ఆడినది
తేనెలు తాగుతు గాలుల తేలుతు...  తుమ్మెద ఝుమ్మని ఆడినది
తుమ్మెద తీరున కమ్మని నా మది తుళ్ళుతు గెంతులు వేసినది

దూరాన నీలిమేఘాలు... నాలోన కొత్త భావాలు
పూచేను కోటి మురిపాలు... తొంగి చూసేను కన్నె సరదాలు
ఒహొహొ హొయ్...  ఒహొహొ హొయ్... ఓఓ...ఓ...ఓ...ఓ 

************* *********************** ***************** ******************** ************************************
చిత్రం: గుడిగంటలు (1965)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: శ్రీశ్రీ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

నీలోన నన్నే నిలిపేవు నేడే...
ఏ శిల్పి కల్పనవో...ఓ..ఏ కవి భావనవో
నీలోన నన్నే నిలిపేవు నేడే...
ఏ శిల్పి కల్పనవో...ఓ..ఏ కవి భావనవో..ఓ..
ఆహ...ఆ..ఒహొ..ఒహొహా....అహా..హా...

చరణం 1:

ఎల్లోర గుహలో పిల్ల ఉంది నీలో..నండూరివారి ఎంకి ఉంది నీలో...
ఆహ...ఆ..ఒహొ..ఒహొహా...
ఎల్లోర గుహలో పిల్ల ఉంది నీలో..నండూరివారి ఎంకి ఉంది నీలో...
అల విశ్వనాథ చెలి కిన్నెరుంది...మా బాపిరాజు శశికళ ఉంది...

నీలోన నన్నే నిలిపేవు నేడే.....
ఏ శిల్పి కల్పనవో...ఓ.. ఏ కవి భావనవో..ఓ..
ఆహ...ఆ..ఒహొ..ఒహొహా....అహా..హా...

చరణం 2:

ఖయ్యాము కోలిచే సాకివి నీవే..కవి కాళిదాసు శకుంతల నీవే
ఆహ...ఆ..ఒహొ..ఒహొహా...
ఖయ్యాము కోలిచే సాకివి నీవే..కవి కాళిదాసు శకుంతల నీవే
తొలి ప్రేమదీపం వెలిగించినావే..తొలి పూలబాణం వేసింది నీవే...

నీలోన నన్నే నిలిపేవు నేడే...
ఏ శిల్పి కల్పనవో...ఓ.. ఏ కవి భావనవో....

************* *********************** ***************** ******************** ************************************
చిత్రం: గుడిగంటలు (1965)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

అ....ఆ..ఆ..ఆ..ఓ..ఓ..
నీలికన్నుల నీడలలోనా...దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే... అందుకో...నన్నందుకో
అందుకో నన్నందుకో

నీలికన్నుల నీడలలోనా... దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమేదో... ఉందిలే... ముందుందిలే
ఉందిలే ముందుందిలే...

చరణం 1:

మబ్బుల పందిరి మనపై నిలిచే...ఎందుకు నిలిచే
పచ్చిక పానుపు వెచ్చగ పిలిచే...ఏమని పిలిచే
వీడని జంటగ రమ్మనీ ...వసి వాడని పూలై పొమ్మనీ

నీలికన్నుల నీడలలోనా... దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమేదో... ఉందిలే... ముందుందిలే
ఉందిలే ముందుందిలే...

చరణం 2:

తెలియరానిది ఈ గిలిగింత...ఏ గిలిగింత..
పలుకలేనిది ఈ పులకింత...ఏ పులకింత ...
కనుపించనిదా వింతా...అది కదలాడును మనసంతా

నీలికన్నుల నీడలలోనా...దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే... అందుకో...నన్నందుకో
అందుకో నన్నందుకో

చరణం 3:

చల్లగ తాకే జ్వాలలు ఏవో ...ఏమో ఏవో...
అవేడిగ సోకే వెన్నెలలు ఏవో ...ఏమో ఏవో...
చిన్నది విరిసే చూపులు ...చెలి చిలికిన ముసి ముసి నవ్వులు

నీలికన్నుల నీడలలోనా...దోరవలపుల దారులలోనా
కరగిపోయే తరుణమాయే... అందుకో...నన్నందుకో
అందుకో నన్నందుకో

************* *********************** ***************** ******************** ************************************
చిత్రం: గుడిగంటలు (1965)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: అనిశెట్టి
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

జన్మమెత్తితిరా అనుభవించితిరా..
జన్మమెత్తితిరా అనుభవించితిరా..
బ్రతుకు సమరములో పండిపోయితిరా
బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా

మంచి తెలిసి మానవుడుగ మారినానురా ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
జన్మమెత్తితిరా అనుభవించితిరా..
బ్రతుకు సమరములో పండిపోయితిరా..
బ్రతుకు సమరంలో..ఓ..పండిపోయితిరా..

చరణం 1:

స్వార్థమనే పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా

స్వార్థమనే పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా

దైవశక్తి మృగత్వమనే సంహరించెరా
దైవశక్తి మృగత్వమనే సంహరించెరా
సమరభూమి నా హృదయం శాంతి పొందెరా

జన్మమెత్తితిరా అనుభవించితిరా..
బ్రతుకు సమరములో పండిపోయితిరా
బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా

చరణం 2:

క్రోథ లోభమోహములే పడగలెత్తెరా
బుసలు కొట్టి గుండెలోన విషముగక్కెరా

క్రోథలోభమోహములే పడగలెత్తెరా
బుసలు కొట్టి గుండెలోన విషముగక్కెరా
ధర్మజ్యోతి తల్లివోలే ఆదరించెరా
ధర్మజ్యోతి తల్లివోలే ఆదరించెరా
నా మనసే దివ్యమంధిరముగ మారిపోయెరా

జన్మమెత్తితిరా అనుభవించితిరా..
బ్రతుకు సమరములో పండిపోయితిరా
బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా

చరణం 3:

మట్టియందే మాణిక్యం దాగియుందురా..
మనిషియందే మహాత్ముని కాంచగలవురా

మట్టియందే మాణిక్యం దాగియుందురా..
మనిషియందే మహాత్ముని కాంచగలవురా
ప్రతి గుండెలో గుడిగంటలు ప్రతిధ్వనించురా..ఆ.ఆ
ప్రతి గుండెలో గుడిగంటలు ప్రతిధ్వనించురా
ఆ దివ్యస్వరం న్యాయపధం చూపగలుగురా

జన్మమెత్తితిరా అనుభవించితిరా..
బ్రతుకు సమరములో పండిపోయితిరా
బ్రతుకు సమరములో..ఓ..ఓ.. పండిపోయితిరా

************* *********************** ***************** ******************** ************************************
చిత్రం: గుడిగంటలు (1965)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

ఎవరికి వారౌ స్వార్ధంలో
హృదయాలరుదౌ లోకంలో
ఎవరికి వారౌ స్వార్ధంలో
హృదయాలరుదౌ లోకంలో
నాకై వచ్చిన నెచ్చెలివి
అమృతం తెచ్చిన జాబిలివి
నాకమృతం తెచ్చిన జాబిలివి

చరణం 1:

ధనం కోరి మనసిచ్చే ధరణి
మనిషిని కోరి వచ్చావే
నా అనువారే లేరని నేను
కన్నీరొలికే కాలంలో
ఉన్నానని నా కన్నతల్లివలే
ఒడిని చేర్చి నను ఓదార్చావే

నాకై వచ్చిన నెచ్చెలివి
అమృతం తెచ్చిన జాబిలివి
నాకమృతం తెచ్చిన జాబిలివి

చరణం 2:

ప్రేమ కొరకు ప్రేమించేవారే
కాన రాక గాలించాను
గుండెను తెరచి ఉంచాను
గుడిలో దేవుని అడిగాను

గంటలు గణ గణ మ్రోగాయి
నా కంటి పాప నువ్వన్నాయి

నాకై వచ్చిన నెచ్చెలివి
అమృతం తెచ్చిన జాబిలివి
నాకమృతం తెచ్చిన జాబిలివి

చరణం 3:

ఈ అనురాగం ఈ ఆనందం
ఎవ్వరెరుగని ఈ అనుబంధం
ఈ అనురాగం ఈ ఆనందం
ఎవ్వరెరుగని ఈ అనుబంధం

కొండలు పాకి నీడలు పరచి
ఉండాలి వెయ్యేళ్ళు
చల్లగ ఉండాలి వెయ్యేళ్ళు
తియ్యగ పండాలి మన కలలు

ఎవరికి వారౌ స్వార్ధంలో
హృదయాలరుదౌ లోకంలో
నాకై వచ్చిన నెచ్చెలివి
అమృతం తెచ్చిన జాబిలివి
నా కమృతం తెచ్చిన జాబిలివి

No comments:

Post a Comment