కనివిని ఎరుగని ధనయోగం

కనివిని ఎరుగని ధనయోగం
జగములు ఎరుగని జపమంత్రం
కనివిని ఎరుగని ధనయోగం
జగములు ఎరుగని జపమంత్రం
ఇంద్రియములనే తలవంచి
ఇరుముడినే తనతలదాల్చి
ఇంద్రియములనే తలవంచి
ఇరుముడినే తనతలదాల్చి

స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం
స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
కనివిని ఎరుగని ధనయోగం
జగములు ఎరుగని జపమంత్రం

శీతల స్నానం తొలి నియమం
భూతల శయనం మలి నియమం
శీతల స్నానం తొలి నియమం
భూతల శయనం మలి నియమం
ఏకభుక్తమే ఉంటూ నీకు అర్పణం అంటూ
ఏకభుక్తం భవార్పణం
దైహిక భొగం విడిచేది
ఐహికభొగం మరిచేది
భక్తిప్రపత్తులు దాటేది
శరణుశరణమని చాటేది

స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
కనివిని ఎరుగని ధనయోగం
జగములు ఎరుగని జపమంత్రం

అసితాహర్యం ఒక నియమం
సంస్కృతి వర్జనమొక నియమం
అసితాహర్యం ఒక నియమం
సంస్కృతి వర్జనమొక నియమం
అంగదక్షిణే ఇస్తూ
ఆత్మ దర్శనం చేస్తూ శాస్తారం ప్రణమామ్యహం
మమకారములను విడిచేది
మదమశ్చమురలు త్రుంచేది
కర్మే ఫలముగ తలచేది
తత్వం అతి అని తెలిపేది

స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
కనివిని ఎరుగని ధనయోగం
జగములు ఎరుగని జపమంత్రం
ఇంద్రియములనే తలవంచి
ఇరుముడినే తనతలదాల్చి
స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
అయ్యప్పా శరణం

మాల ధారణం నియమాల తోరణం

మాల ధారణం నియమాల తోరణం
మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
మాల ధారణం నియమాల తోరణం
మాల ధారణం నియమాల తోరణం

ఉదయాస్తమ్ముల సంధ్యలలో
పురుషార్ధత్రయ సాధనలో
చతుర్వేదముల రక్షణలో
పంచభూతముల పంజర సుఖమై
ఆరు శత్రువుల ఆరడిలో పడి
ఏడు జన్మలకు వీడని తోడని
నిన్ను నమ్మిన నీ నిజభక్తుల

మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం


అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం

ఆ ఉ మా సంగమనాదంలో
ఓం ఓం ఓం హరిహరరూపా అద్వైతంలో
శరణం శరణం శరణం శరణం
ఆ ఉ మా సంగమనాదంలో
హరిహరరూపా ద్వైతంలో
నిష్టుర నిగ్రహయోగంలో
మండలపూజా మంత్ర ఘోషలో
కర్మ అన్న కర్పూరం కరిగే
కర్మ అన్న కర్పూరం కరిగే
ఆత్మహారతులు పట్టిన భక్తుల

మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం
శరణం అయ్యప్ప ,అయ్యప్ప శరణం ,అయ్యప్ప శరణం ,అయ్యప్ప శరణం
మాల ధారణం నియమాల తోరణం
జన్మ కారణం దుష్కర్మ వారణం
మాల ధారణం నియమాల తోరణం

ఒక్కడొచ్చాడు(2016)

కొంచెం సాయం కొంచెం కాలం 
కొంచెం సేపు తోడు రావే
కొంచెం దూరం అడుగులేస్తూ 
సాగిపోదాం నువ్వురావే
నింగి అంతూ నేల లోతూ 
తెలుసుకుందాం జంట కావే
కొంగుముడిలా కలిసిపోదాం 
చిటికెనేలు కలుపనీవే

నే కొంచెం నలుపులే నువ్వేమో తెలుపులే
చిట్టీ నీ హద్దే దాటి హగ్గులే ఇచ్చేయవే
నే కొంచెం నలుపులే చెయ్యేస్తే గెలుపులే
అట్టా ఓ ముద్దే పెట్టి ముగ్గుల్లో దించేయవే
రావే రావే రా సరేలేవే నిన్నేవే..

చరణం 
వీర ఫోజులొద్దు పలుకుమా 
సునో ప్యారుకి బదులు మరి మౌనమా
టెన్షన్ వదిలి దరి చేరుమా తిలోత్తమా
వినుకోమ్మ
తోడ గీతనే దాటుమా 
కోరి చేరువైతే చాలుమా
గాలమేసే అయస్కాంతమా కాంతమా
అనుమానమే రానీకుమా 
పందెం కోడిలాంటి కుర్రోణ్ణమ్మా.. యే

నే కొంచెం నలుపులే నువ్వేమో తెలుపులే
చిట్టీ నీ హద్దే దాటి హగ్గులే ఇచ్చేయవే
నే కొంచెం నలుపులే చెయ్యేస్తే గెలుపులే
అట్టా ఓ ముద్దే పెట్టి ముగ్గుల్లో దించేయవే
రావే రావే రా సరేలేవే నిన్నేవే.. 

కొంచెం సాయం కొంచెం సాయం 
కొంచెం కాలం కొంచెం కాలం 
కొంచెం సేపు తోడు రావే
కొంచెం దూరం కొంచెం దూరం
అడుగులేస్తూ అడుగులేస్తూ
సాగిపోదాం నువ్వురావే
నింగి అంతూ నింగి అంతూ 
నేల లోతూ నేల లోతూ
తెలుసుకుందాం తెలుసుకుందాం
జంట కావే జంట కావే 
కొంగుముడిలా కొంగుముడిలా 
కలిసిపోదాం కలిసిపోదాం
చిటికెనేలు చిటికెనేలు
కలుపనీవే కలుపనీవే

నే కొంచెం నలుపులే నువ్వేమో తెలుపులే
చిట్టీ నా హద్దే దాటి హగ్గులే ఇచ్చేయవే రావే
నే కొంచెం నలుపులే చెయ్యేస్తే గెలుపులే
రావే ఆహా ఓహో.. రావే.. ఆహా.. ఓహో..
కొంచెం సాయం కొంచెం కాలం

సినిమా : ఒక్కడొచ్చాడు(2016)
దర్శకుడు : సురాజ్
తారాగణం : విశాల్, తమన్నా
సంగీతం : హిప్ హాప్ తమిళ
లిరిక్స్ : డా. చల్లా భాగ్యలక్ష్మి
గాయకుడు : రంజిత్

ఎక్కడికి పోతావు చిన్నవాడా (2016)

తేరి మేరి మేరి తేరి మేరి
ప్రేమ్ కహానీ
హై మస్త్ మస్త్
నువ్వేలే నా జీవితం
సోగ కళ్ల సోయగం
తాగుతుంటే మనసు నిండ 
ఇష్క్ ఇష్క్ హోయ్..

చిరునామా తన చిరునామా
మరిచిపోయేనే 
చిరునవ్వే తన చిరునవ్వే
విడిచివెళ్లెనే

సీతాకోక చిలుకా అలకా
నీ రంగులన్ని దాచకే చాలికా
మెరుపులాగ మాయమే అవకా
ఆ మేలి ముసుగు తీసి కాస్త వెలుగు చూపు బాలికా

మబ్బుల చాటునున్న చందమామ బైటకే వచ్చేదెన్నడో.. 
గీతల్లోనికింకా రాని అందమైన బొమ్మనే చూసేదెప్పుడో..

ఖుదానే తుజే మేరేలియే 
పరిబనా కేదియా
ప్యారికి తేరి ధోన్‌మే 
మై ఖోగయా.. మిట్‌గయా ఉసుకే నషామే మౌలా..

కన్నె కశ్మీరం నువ్వో 
వన్నె వసంతం నువ్వో
ఏమో నా తీరం నువ్వో
తేలేదెలా..

హే రోజో బజారులోనా లేని సరికొత్త జోరే
సరదాలు పంచుతోంది 
నీవల్లేగా వెన్నెలా

ఎదురుపడిన ప్రతి పడుచు పరిమళం
నీదోకాదో తేలేదాక మనసు విస్మయం

కొంచెం బాధ.. కొంచెం చేదు
కొంచెం తీపి.. కొంచెం గాయం
అమ్మో ఈ ప్రేమలోన జారింది ప్రాయం 
                                                                                     ॥చిరునామా॥

ఊహంటే అర్థమంటే 
ఊహించలేని నేను.. నీ ఊహల్లోన 
మునిగిపోయానిలా

గాల్లోన తేలడాన్ని
ఇన్నాళ్లు తప్పు పట్టి 
ఈ వేళ నేలపైన వేలు కూడా లేదలా

నువ్వు లేని దారి ఊహకందకుందిలే
నువ్వు పీల్చే గాలి నాకు ఊపిరయ్యేలే
ఊహలాగ గాలిలాగ కానరాని నిన్ను నేను 
గాలి ఊహల్ల మారి గాలిస్తున్నాలే 
                                                                                                 ॥మబ్బుల చాటునున్న॥
చిరునామా తన చిరునామా

సినిమా : ఎక్కడికి పోతావు చిన్నవాడా
తారాగణం : నిఖిల్, హెభా పటేల్
దర్శకుడు : వి ఆనంద్
సంగీతం : శేఖర్ చంద్ర
లిరిక్స్ : శ్రీ మణి
గాయకుడు : యాజిన్ నిజర్, కరీముల్లా

********* **********  ********* ********* ********* ****** *************


నీతో ఉంటె చాలు గురుతు రావు నిముషాలు 
అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు
నీతో ఉంటె చాలు నిదురపోవు సరదాలు 
కథలు కధలు మొదలేగా కొత్త అనుభవాలు 
నువ్వే వైపు వెళ్తున్న నీతో ఉంటె చాలు

వచ్చే జన్మలు ఎన్నయినా నీతో ఉంటె చాలు
పీల్చే గాలి లేకున్నా నీతో ఉంటె చాలు
నేనే నాకు లేకున్నా నీతో ఉంటె చాలు

నీతో ఉంటె చాలు గురుతు రావు నిముషాలు
అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు

పడీ పడీ పడీ త్వరపడి రానా
నువ్వే మారుమూలన ఉన్న
విడి పడి నేను వదిలి వెళ్తానా నువ్వే పోమాన్న

ఓ క్షణం దూరమై ఉంటే తీరని యాతన
తక్షణం నీ జతై పోతే నాపంచ ప్రాణాలు ఆనంద సంకీర్తన

నీతో ఉంటె చాలు
నీతో ఉంటె చాలు గురుతు రావు నిముషాలు
అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు

గిర గిర తిరిగే లోకం ఏటో వైపు పోతే పోనీ
తల మునకలు పరవశమై నే నిన్నే చూడని
ఆకలి దాహమే ఏది ఇంతకీ చేరదే
రంగులే మరీనా తేది నీ ధ్యాసలో ఉన్న కన్ను గుర్తించదే

నీతో ఉంటె చాలు
నీతో ఉంటె చాలు గురుతు రావు నిముషాలు
అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు



సినిమా : ఎక్కడికి పోతావు చిన్నవాడా
సంగీతం : శేఖర్ చంద్ర
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి 
గాయకుడు :  రమ్య బెహర

జయమ్ము నిశ్చయమ్మురా(2016)

పల్లవి
ఓ రంగుల చిలకా చూడే నీ వెనకా
అలుపంటూ లేనీ ఈ పిల్లడి నడక
ఓ బంగరు తలుకా
చుట్టూ ఏం కనకా
ఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినకా

కోరస్
ఒకసారిటు చూడే, పాపం పసివాడే
నీ చూపుల కోసం వేచి ఉన్నాడే
అన్నీ వదిలేసి, నిన్నే వలిచాడే
నీ తలపులోనే నిదురే మరిచాడే 

చరణం 1
మొహమాటాల్ని పక్కన వదిలాడే 
మొండిగ నిను వీడక ముందుకు కదిలాడే 
ఎవరేమనుకున్నా తనేమనుకోడే 
అండగ నీ ప్రేమలో మైమరపయ్యాడే 

కోరస్
ఓసారిటు చూడే పాపం పసివాడే
నువ్వంటూ లేని ధ్యాసే లేనోడే
బిడియం కలవాడే హృదయం అలలీడే
అయినా నిను గెలిచే మనసే ఉన్నోడే

చరణం 2
నిన్నందరికంటే మిన్నగ చూస్తాడే 
నిన్నేవరేమన్నా యుద్ధం చేస్తాడే
నీతో నడిచే ఆ అడుగుల కోసం
వేవేలడుగులనైనా నడిచే ఘనుడే

కోరస్ 
ఓసారిటు చూడే, పాపం పసివాడే
నువ్ నడిచే దారిని వదలని ప్రేమికుడే 
గుండె తలుపుల్నే తెరిచి ఉంచాడే 
దేవత నువ్వంటూ భక్తుడు అయ్యాడే.

ఓ రంగుల చిలకా చూడే నీ వెనకా

సినిమా : జయమ్ము నిశ్చయమ్మురా
తారాగణం : శ్రీనివాస్‌రెడ్డి, పూర్ణ
దర్శకుడు : శివ రాజ్ కనుమూరి
సంగీతం : రవిచంద్ర
లిరిక్స్ : వి.వి. రామాంజనేయులు
గాయకుడు : స్పందన

రెమో (2016)

దోర దోర ఊర చూపుతోటి 
నన్ను కొల్లగొట్టే నన్ను కొల్లగొట్టే
చంటి పాపల నవ్వుతోటి 
నన్ను కొల్లగొట్టే నన్ను కొల్లగొట్టే

ఫస్టులుక్కులోన చూడగానే 
గుండె గంట కొట్టే గుండె గంటకొట్టే 
లవ్వు బుక్కు లోన ఫస్టు పేజీ 
అర్థమయ్యినట్టే

ప్రేమ బాణమేసి నన్ను కొల్లగొట్టే
నన్ను కొల్లగొట్టే పిల్ల కొల్లగొట్టే 
లవ్వు సింబలేసి నన్ను కొల్లగొట్టే 
పిల్ల కొల్లగొట్టే నన్ను ఫుల్లుగా 

నాకు నువ్వు ఈజీగా దొరకొద్దే
క్రేజీ క్రేజీగా ట్రై చేస్తాలే 
రోజు రోజు రంగులనీ పువ్వులనీ 
పట్టుకొచ్చి నిన్నే పటాయిస్తాలే

నాకు నీ జాతకమివ్వద్దే
అమ్మ నాన్న సమ్మతమే వద్దే
మన లవ్వు సినిమాల్లో స్టోరీల్లో చూపినట్టు సూపర్‌గా నడిపిస్తాలే

నిన్ను చూడాలిలే 
మాట్లాడిలే.. నీతో 
పక్క పక్క నున్న సెల్ఫీ దిగాలిలే
నిన్ను పొగడాలిలే నువ్వు తిట్టాలిలే 
నిన్ను ఏడిపించి ఊరడించుకోవాలిలే 
॥నిన్ను చూడాలిలే॥ 

కరెక్ట్ టైమ్‌లో
ప్రేమలోన పడేసి నన్నిలా 
ల ల ల ల లైఫ్ బండి లోన 
నింపిందిలా లవ్వు పెట్రోలు వెన్నెలా

ఆడపిల్ల అంటేనే తప్పుకుని పారిపోయేవాన్నిరా
ప ప ప పాపారపాను 
పాట పాడునట్టు 
నన్ను ఎంత మార్చెరా 

నాకోసం దిగొచ్చినా దేవతా 
నీకోసం నేనెంత వేచా
ఇరవై ఏళ్లుగా వెతికినా 
ఇవ్వాలే నే నిన్ను చూశా

బట్ అయినా సరే 
దోర దోర ఊర చూపుతోటి
॥ నాకు నువ్వు ఈజీగా ॥

సినిమా : రెమో (2016)
తారాగణం : శివకార్తీకేయన్, కీర్తి సురేష్
దర్శకుడు : భాగ్యరాజ్ కన్నన్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
లిరిక్స్ : శ్రీ మణి
గాయకురాలు : అనిరుధ్ రవిచందర్

ద్వారక (2016)

భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

మురళీ గాన లోల దూరమేల
దిగి రా కృష్ణా
కడలై పొంగుతున్న ప్రేమ
నీల కన రా కృష్ణా
అందుకో సంబరాల స్వాగతాల మాలిక
ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారక

॥భజరే నంద గోపాల హరే 4॥ 

మా ఎద మాటున దాగిన ఆశలు
వెన్నెల విందనుకో
మా కన్నుల కందని మాయలు
చూపుతూ మెల్లగా దోచుకుపో
గిరినే వేలిపైన నిలిపిన మా కన్నయ్య
తులసి దళానికే ఏల తూగినవయ్యా
కొండంత భారం గోరంత చూపినా లీలా కృష్ణయ్యా
మా చీరాలు దోచిన అల్లరి ఆటలు మాపైన ఈ మాయ

భజరే భజరే భజరే.. భజ.. భజ.. 
॥భజరే నంద గోపాల హరే 4॥ 

మాయది కావని మాధవుడా అను చేరిన ప్రణమిది
మా మాయని బాధని పిల్లన గ్రోవిలా రాగం చేయమని
ఎవరిని ఎవరితోటి ముడి పెడుతూ నీ ఆట
చివరికి ప్రతి ఒకరిని నడిపెదవు కదా నీ బాట

తీరని వేదన తియ్యని లాలన అన్నీ నువ్వయ్యా
నీ అందెల మువ్వల సవ్వడి గుండెలో మోగించ రావయ్యా 

॥భజరే నంద గోపాల హరే 4॥

భజరే నంద గోపాల హరే

సినిమా : ద్వారక (2016)
తారాగణం : విజయ్ దేవరకొండ, పూజ జవేరి
దర్శకుడు : శ్రీనివాస రవీంద్ర
సంగీతం : సాయి కార్తీక్
లిరిక్స్ : రహమాన్
గాయకురాలు : చిత్ర

************** *************


చిత్రం : ద్వారక
సంగీతం : సాయికార్తీక్
సాహిత్యం : రహేమాన్
గానం : సమీరా భరద్వాజ్ 

ఎంత చిత్రం కదా
ఒక చూపుకే ఒరిగిపోయా

 ఎంత ఘోరం కదా
ఒక నవ్వుకే ఓడిపోయా
తప్పు ఒప్పు ఆలోచించే వీలే లేదాయె
తప్పనిసరిగా తిప్పలు వచ్చే ప్రేమే వరదాయే
ఈ ముప్పును తప్పుకుపోయే వేరే దారే కనపడదాయే 

ఎంత చిత్రం కదా
ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా
ఒక నవ్వుకే ఓడిపోయా

కంటి వైపు రానంది కునుకు
కత్తి మీద సామయింది బతుకు
గుండెల్లోన పుట్టింది ఒణుకు
గొంతు దాడి రానంది పలుకు
ఓరి దేవుడో ఇంత కోపమా నాపైన నీకు
చెప్పాలంటే అంత సులభమా శక్యినివ్వు నాకు
ఒక ఒక్క పూటైన నేను ఓర్చుకోగలనా
ఏదేమైనా ఏదో ఒకటి చెప్పేస్తా తనకు

ఎంత చిత్రం కదా
ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా
ఒక నవ్వుకే ఓడిపోయా

నన్నే గుచ్చిపోయింది సొగసు
ఒళ్ళే మరచిపోయింది మనసు
ఉన్నట్టుండి లేచింది వయసు
ప్రేమొ పిచ్చొ నాకేమి తెలుసు
ఎంత ఆపిన ఆగనంది దూకే అడుగు
ఎంత దూరమొ తెలియకున్నది తుళ్ళే పరుగు
తన తీరమేదైన ఏ దారిలోనైనా
చేరే వరకు అలుపే లేదు పట్టేస్తా తుదకు

ఎంత చిత్రం కదా
ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా
ఒక నవ్వుకే ఒదిగిపోయా 
తప్పు ఒప్పు ఆలోచించే వీలే లేదాయె
తప్పనిసరిగా తిప్పలు వచ్చే ప్రేమే వరదాయే
ఈ ముప్పును తప్పుకుపోయే వేరే దారే కనపడదాయే 

ఎంత చిత్రం కదా
ఒక చూపుకే ఒరిగిపోయా
ఎంత ఘోరం కదా
ఒక నవ్వుకే ఒదిగిపోయా