జయమ్ము నిశ్చయమ్మురా(2016)

పల్లవి
ఓ రంగుల చిలకా చూడే నీ వెనకా
అలుపంటూ లేనీ ఈ పిల్లడి నడక
ఓ బంగరు తలుకా
చుట్టూ ఏం కనకా
ఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినకా

కోరస్
ఒకసారిటు చూడే, పాపం పసివాడే
నీ చూపుల కోసం వేచి ఉన్నాడే
అన్నీ వదిలేసి, నిన్నే వలిచాడే
నీ తలపులోనే నిదురే మరిచాడే 

చరణం 1
మొహమాటాల్ని పక్కన వదిలాడే 
మొండిగ నిను వీడక ముందుకు కదిలాడే 
ఎవరేమనుకున్నా తనేమనుకోడే 
అండగ నీ ప్రేమలో మైమరపయ్యాడే 

కోరస్
ఓసారిటు చూడే పాపం పసివాడే
నువ్వంటూ లేని ధ్యాసే లేనోడే
బిడియం కలవాడే హృదయం అలలీడే
అయినా నిను గెలిచే మనసే ఉన్నోడే

చరణం 2
నిన్నందరికంటే మిన్నగ చూస్తాడే 
నిన్నేవరేమన్నా యుద్ధం చేస్తాడే
నీతో నడిచే ఆ అడుగుల కోసం
వేవేలడుగులనైనా నడిచే ఘనుడే

కోరస్ 
ఓసారిటు చూడే, పాపం పసివాడే
నువ్ నడిచే దారిని వదలని ప్రేమికుడే 
గుండె తలుపుల్నే తెరిచి ఉంచాడే 
దేవత నువ్వంటూ భక్తుడు అయ్యాడే.

ఓ రంగుల చిలకా చూడే నీ వెనకా

సినిమా : జయమ్ము నిశ్చయమ్మురా
తారాగణం : శ్రీనివాస్‌రెడ్డి, పూర్ణ
దర్శకుడు : శివ రాజ్ కనుమూరి
సంగీతం : రవిచంద్ర
లిరిక్స్ : వి.వి. రామాంజనేయులు
గాయకుడు : స్పందన

No comments:

Post a Comment