దొంగ మొగుడు (1987)

చిత్రం :  దొంగ మొగుడు (1987)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి


పల్లవి :


ఓయ్.. నీ కోకకింత కులుకెందుకు.. రప్పపపరప్పప... రప్పపపప
నీ రైకకింత బిగువెందుకు.. రప్పపపరప్పప... రప్పపపప
అందాలన్నీ చుట్టుకున్నందుకా
సింగారాన్ని దాచుకున్నందుకా
చిన్నారి నీ మేను ముద్దాడుతున్నందుకా.. హా..


నీ చూపుకింత చురుకెందుకు.. రప్పపపరప్పప... రప్పపపరప్పప
నీ చేతికింత చొరవెందుకు.. రప్పపపరప్పప... రప్పపపరప్పప
అందాలన్నీ కొల్లగొట్టేందుకా..
ఆరాటాలు చెల్లబెట్టేందుకా..
మెత్తంగ మొత్తంగ దోచేసిపోయేందుకా.. ఆహ... 

నీ కోకకింత కులుకెందుకు.. నీ చేతికింత చొరవెందుకు




చరణం 1 :


అరెరే.. నీ ఒంటి మెరుపంత తాగి.. నా కళ్ళు ఎరుపెక్కి తూగే
రమ్మంది నీ కళ్ళ జీర.. బరువైంది నా గళ్ళ చీర
కుబుసం విడిచిన నాగులా.. బుస కొట్టే నాజూకులు..
చిలిపిగ తాకిన చూపులో.. చలిపెంచే వడగాడ్పులు..
ఈ కొత్త ఆవిర్లు.. ఈ తీపి తిమ్మెర్లు.. 
అయ్యయ్యయ్యయ్యో మెలిపెట్టిలాగాయి నీ ముందుకు..




నీ కోకకింత కులుకెందుకు.. నీ చేతికింత చొరవెందుకు 






చరణం 2 : 




అహా.. అహా.. ఒణికింది తొలి ఈడు తీగ.. ఓ కొంటె గిలిగింత రేగ
కౌగిల్లే పందిళ్లు చేసి.. పాకింది కళలెన్నో పూసి..
కవ్వించే ఈ హాయిలో.. చెఖుముఖి రాపిడి చూడు
కైపెక్కే సైయ్యాటలో... తికమక తకధిమి చూడు    
ఈ మంచు మంటల్లో.. మరిగేటి మోజుల్లో.. 
అమ్మమ్మమ్మమ్మమ్మో.. ఈ ఉడుకు తగ్గేది ఏ మందుకు..


నీ కోకకింత కులుకెందుకు.. రప్పపపరప్పప... రప్పపపప
నీ చేతికింత చొరవెందుకు.. రప్పపపరప్పప... రప్పపపప
అందాలన్నీ చుట్టుకున్నందుకా... ఆరాటాలు చెల్లబెట్టేందుకా
చిన్నారి నీ మేను ముద్దాడుతున్నందుకా.. ఓ..ఓయ్..ఓయ్.. 


నీ చూపుకింత చురుకెందుకు.. నీ రైకకింత బిగువెందుకు






కోకమ్మ చెప్పమ్మ
చిత్రం :  దొంగ మొగుడు (1987)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి


పల్లవి :
ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ..
కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో
వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో

నీ పొంగు చూసి మెచ్చి వచ్చానే
ఇచ్చే రోజే వస్తే అన్నీ ఇస్తాలే
ఊరించుతూ నన్ను వేధించడం న్యాయమా.. ఆ.. ఆ.. ఆ.. 


కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో
వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో




చరణం 1 :


కన్నెకుసుమం కన్ను గీటి నన్ను పిలిచిన వేళ
తేనె వానల తాన మాడగ తేటినై నే రానా... లలలలలా
కాటు వేసిన మోటు సరసం హాయి గురుతై పోగాఘుమ్ముఘుమ్ముగ కమ్ముకున్న మత్తు వరదై రాదా 


ఓ.. ఓహో.. ఓ.. ఓ.. మారం చేసే ఆరలన్నీ తీరాలి ఈ వేళలో..
ఓ.. ఓహో.. ఓ.. ఓ.. పందెం వేసే అందాలన్నీ ఊగాలి ఉయ్యాలలో...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో
వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో






చరణం 2 : 




వలపు వానా కురిసినాక వలపు వరదై పోదా
కోరికలతో ఏరువాక సాగు తరుణం రాదా.. లలలలలా


కన్న కలలు కోతకొస్తే పుష్యమాసం రాదా
శోభనాల సంకురాతిరి సంబరాలే కాదా...


అహ..హ..హా..అహా..హ..హా
తూనిగల్లే ఆనందాలే తేలాలి ఈ గాలిలో
ఓ..ఓ..ఓ..ఓ.. తేనేగల్లే మకరందాలే తూలాలి ఈ పూలలో...




కోకమ్మ చెప్పమ్మ చెలి సోకు ఏపాటిదో
వద్దమ్మ తప్పమ్మ తెలిసాక విలువేమిటో
నీ పొంగు చూసి మెచ్చి వచ్చానే
ఇచ్చే రోజే వస్తే అన్నీ ఇస్తాలే
ఊరించుతూ నన్ను వేధించడం న్యాయమా.. ఆ.. ఆ.. ఆ.. 













నల్ల౦చు తెల్లచీర


చిత్రం: దొంగ మొగుడు (1987)
సంగీతం: చక్రవర్తి
 గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


నల్ల౦చు తెల్లచీర
 ఓ..ఓ.. తల్లోన మల్లెమాలా
 ఓ..ఓ..ఈడెక్కి కవ్వి౦చితే భామా.. 
వేడెక్కి నేరేగనా..
ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే హొయ్

బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... చూడొద్దు తేరిపారా 
ఒహొకోరేవు మోమాటము రాజా... రేపేవు ఆరాటమూ
విరి తూపుల జడిలో పడి వసివాడేను సొగసే... హొయ్


చరణం 1:


సాగే వన్నెవాగే నన్ను... కమ్మేసి౦దిరో
ఊగే కన్నెలాగే నన్ను ...లాగేసి౦దిరో
మూగే మూగ సైగే నన్ను ...ముద్దాడి౦ద రో
ఊగే తీగలాగే మేను... అల్లాడి౦దిరో

గాజుల బాజాలతో ...జాజులు ఊరేగెనే
మోజుల రోజాలతో ...రోజులు ఎదురేగెనే
తనివే తీరని... తనిమే ఊరనీ
జతలో గతులే... జతులై...


బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... చూడొద్దు తేరిపారా
 ఒహొనల్ల౦చు తెల్లచీర ఓ..ఓ.. తల్లోన మల్లెమాలా ఓ..


చరణం 2:


కాగే ఈడు కోరే వేడి ఉ౦దీ లోయలో
రేగే చల్లగాలే ము౦చుతు౦ది మాయలో
రాలే మ౦చుపూలే పె౦చె నాలో దాహము
జాలేలేని చలిలో ది౦చుతు౦ది మోహము

కౌగిలి చెరసాలలో ...ఈ చెలి చిక్కాలిలే
పెదవుల సరసాలలో... కోరిక కరగాలిలే
మరిగే మరులనే... నదులై పారనీవిరులే జడిసే ఒడిలో....ఏహ్..


నల్ల౦చు తెల్లచీర ఓ..ఓ.. తల్లోన మల్లెమాలా
 ఓ..ఓ..ఈడెక్కి కవ్వి౦చితే భామా.. వేడెక్కి నేరేగనా
ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే హొయ్..

బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... చూడొద్దు తేరిపారా ఒహొ
కోరేవు మోమాటము రాజా... రేపేవు ఆరాటమూ
విరి తూపుల జడిలో పడి వసివాడేను సొగసే... హొయ్




ఈ చెంపకు శలవీయకు
చిత్రం: దొంగ మొగుడు (1987) 

సంగీతం: చక్రవర్తి 

నేపధ్య గానం: బాలు, సుశీల 



పల్లవి: 



ఈ చెంపకు శలవీయకు ఈ పెదవిని వదిలేయకు 

చాలని అనకు రాతిరి మనకు 

మోహాలు సంకెళ్ళు విడిపోనీకు... హోయ్ 



ఈ చెంపకు శలవీయకు ఈ పెదవిని వదిలేయకు 



చరణం 1: 



నీ వేళ్ళు చేసే అల్లరి కుచ్చెళ్ళు పాడే పల్లవి 

తుఫాను రేగే ముందర ముస్తాబు దేనికి దండగ 

కంటి చూపు చీర కట్టాలి ఒంటిని 

కంచి పట్టు చీర జారాలి నేలనీ 

ఈ వేడీలో వాడనీ ...ఈ గాలినీ పూలనీ... 

గండి పడ్దది నింగి చెరువుకి వెండి వెన్నెల పొంగుతున్నదీ 

గోరింత తుళ్ళింత వెల్లువయ్యేలా.... హోయ్ 



ఈ చెంపకు శలవీయకు ఈ పెదవిని వదిలేయకు 

చాలని అనకు రాతిరి మనకు 

మోహాలు సంకెళ్ళు విడిపోనీకు... హోయ్ 



చరణం 2: 



పై పైకి రాకు సూర్యుడా పొద్దంటే మాకు చేదురా 

తెల్లారుతున్నా తీరక అల్లాడుతోందీ కోరికా 

కక్ష గట్టి వచ్చి మా తలుపు తట్టకు 

వెలుగు వలలు తెచ్చి మా తలలు పట్టకు 

ఈ రేయిని ఆగనీ... ఈ హాయినీ సాగనీ... 

పాలపుంతలో పూల వేడుక కౌగిలింతలో ఇలకు జారక 

తాపాల దాహాలు తీరిపోయేలా... 


ఈ చెంపకు శలవీయకు ఈ పెదవిని వదిలేయకు 

చాలని అనకు రాతిరి మనకు 

మోహాలు సంకెళ్ళు విడిపోనీకు... హోయ్ 





చిత్రం: దొంగ మొగుడు (1987)
సంగీతం: చక్రవర్తి 

నేపధ్య గానం: బాలు, సుశీల 

పల్లవి:

ఇడ్లీ పాపా ఇడ్లీ పాపా సాంబారు కావాలా
చిట్టిగారెతో చట్నీ కలిపీ నోట్లో పెట్టాలా
చూపులతోనే కాఫీ కాసి నేనే నీకూ ఇవ్వాలా
వద్దని నువ్వూ పంతం పడితే నిన్నే బజ్జో పెట్టాలా

హొయ్ ముద్దుల రాజా ముద్దుల రాజా ముచ్చట కావాలీ
హొయ్ పంచదారతో పాలవయసును పాకం పట్టాలీ
మీగడలాంటి ఆగడమంతా నీలో చూడాలి
హొయ్ అందం చందం హంగూ పొంగూ నీకే సొంతం కావాలీ

చరణం 1:

అబ్బా ఏమిటండి మీరు మరీను
ఏమ్మా అక్కర్లేదా?
కాదు.. హా మరేంటి?.. ఊఁ

అరె వేసుకో.. పెనవేసుకో.. బుస కొట్టే నాగల్లే
చేసుకో.. సడి చేసుకో.. చెలరేగే వాగల్లే
కట్టుకో.. ఆకట్టుకో.. ఎద చాటున మాటేసీ..
చూసుకో.. గురి చూసుకో.. నీ చూపుల వలవేసీ..
పాలబుగ్గలో కొత్తపొంగులూ నన్నే ఊరించే
కొంటె సైగలో కొండగాలులూ నన్నే ఊగించే
నీ ముద్దును నేనైతే.. నా ముద్దర నీవైతే
ఆహ నీ ముద్దును నేనైతే.. నా ముద్దర నీవైతే
నిండింది నా మనసు నీ మాటతో
పండింది నా పంట ఈనాటితో

హొయ్ ఇడ్లీ పాపా ఇడ్లీ పాపా సాంబారు కావాలా
చిట్టిగారెతో చట్నీ కలిపీ నోట్లో పెట్టాలా
హొయ్ ముద్దుల రాజా ముద్దుల రాజా ముచ్చట కావాలీ
హొయ్ పంచదారతో పాలవయసును పాకం పట్టాలీ

చరణం 2:

హొయ్ రెచ్చిపో..ముడుపిచ్చిపో.. నువ్వు దాచిన ఈడంతా
పంచిపో..కరిగించిపో..కైపెక్కిన మనసంతా
చేరుకో.. ఇక చేదుకో.. నా సిగ్గుల పేరంటం
పుచ్చుకో.. సరిపుచ్చుకో.. నా చూపుల తాంబూలం
అరె తట్టితాకితే తాళమియ్యని ఎర్రని చెక్కిళ్ళు
చిటికె వేసితే చిందులాడనీ నీలో సందళ్ళు
అహ ఊరెను ఉవ్విళ్ళు.. ఎద కోరెను కౌగిళ్ళూ
అహ ఊరెను ఉవ్విళ్ళు.. ఎద కోరెను కౌగిళ్ళూ
నా చూపే నిలవాలి నీ ముందరా
తెల్లార్లూ సాగాలీ ఈ జాతరా

అహ ఇడ్లీ పాపా ఇడ్లీ పాపా సాంబారు కావాలా ఆఁ
చిట్టిగారెతో చట్నీ కలిపీ నోట్లో పెట్టాలా ఆఁ
చూపులతోనే కాఫీ కాసి నేనే నీకూ ఇవ్వాలా
వద్దని నువ్వూ పంతం పడితే నిన్నే బజ్జో పెట్టాలా

హొయ్ ముద్దుల రాజా ముద్దుల రాజా ముచ్చట కావాలీ ఆహా
హొయ్ పంచదారతో పాలవయసును పాకం పట్టాలీ ఆహా
మీగడలాంటి ఆగడమంతా నీలో చూడాలి
అరెరెరె అందం చందం హంగూ పొంగూ నీకే సొంతం కావాలీ

No comments:

Post a Comment