చిత్రం : అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం : సి. రామచంద్ర
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : మొహమ్మద్ రఫి, సుశీల
పల్లవి :
తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను?
తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను?
నవ్వే ఆ నవ్వుతోనే మెలమెల్లగా పిడుగులే రువ్వుతుంటే ఏం చేయను?
చరణం 1 :
నేను అనుకొంటినా? మరి కలగంటినా? నాలో అనురాగమేదో మ్రోగేనని.. ఆ ఆ ఆ
నేను అనుకొంటినా? మరి కలగంటినా? నాలో అనురాగమేదో మ్రోగేనని
అందమే నన్ను చేరి కొనగోటితో...
అందమే నన్ను చేరి కొనగోటితో... గుండెలో మీటుతుంటే ఏం చేయను?
తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను?
చరణం 2 :
చేత మధు పాత్ర లేదు..
చేత మధు పాత్ర లేదు.. నాకిప్పుడు......ఐనా అంటారు నన్నే...తాగేనని
కన్నులే పొంగిపోయే మధుపాత్రలై...
కన్నులే పొంగిపోయే మధుపాత్రలై...కైపులో ముంచుతుంటే ఏం చేయను?
తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను?
చరణం 3 :
నేను ఫిరదౌసినా మరి కాళిదాసునా కాని అంటారు నన్నే కవిరాజనీ ... ఆ.. ఆ... ఆ
నేను ఫిరదౌసినా మరి కాళిదాసునా కాని అంటారు నన్నే కవిరాజనీ
ప్రేయసీ మధుర రూపం మహాకావ్యమై
ప్రేయసీ మధుర రూపం మహాకావ్యమై... ఊహలో పొంగుతుంటే ఏం చేయను?
తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను?
లలా... లలలాలలా.... లలా... లలలాలలా
చిత్రం: అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం: సి.రామచంద్ర
గీతరచయిత: సినారే
నేపధ్య గానం: మహమ్మద్ రఫీ, పి.సుశీల
పల్లవి:
సిపాయీ.. సిపాయీ..
సిపాయీ.. సిపాయీ..
నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో...
ఈ వాలుకనులనడుగు అడుగు చెపుతాయీ..
సిపాయీ.. ఓ..సిపాయీ..
హసీనా.. హసీనా..
నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా..
హసీనా.. ఓ.. హసీనా..
చరణం 1:
జడలోనా మల్లెలు జారితే... నీ ఒడిలో ఉన్నాననుకున్నా..
చిరుగాలిలో కురులూగితే.. చిరుగాలిలో కురులూగితే..
నీ చేయి సోకెనని అనుకున్నా..
ఆ.. మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే..
ఆ గాలిలో..చెలరేగినవి.. ఆ గాలిలో చెలరేగినవి..
నా నిట్టూరుపులే... హసీనా..
చరణం 2:
తడి ఇసుకను గీసిన గీతలు.. అల తాకితే మాసి పోతాయి..
ఎదలోన వ్రాసిన లేఖలు..ఎదలోన వ్రాసిన లేఖలు..
బ్రతుకంతా వుండి పోతాయి..
ఆ.. లేఖలలో ఉదయించినవి నా భాగ్యరేఖలే..
మన ఊపిరిలో పులకించినవి.. మన ఊపిరిలో పులకించినవి..
వలపు వాకలే.. సిపాయీ...

No comments:
Post a Comment